జిల్లా అధ్యక్షుడు భూక్య నవీన్ అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో జిల్లా కార్యదర్శి శ్రీకాంత్ మాట్లాడుతూ డివైఎఫ్ఐ జిల్లా మహాసభలు కొన్ని అనివార్య కారణాలవల్ల మే 25 26 కు వాయిదా వేయడం జరిగిందని దీనిని మేధావులు పెద్దలు మిత్రులు గమనించాలని ఈ మధ్యకాలంలో డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మద్యం బెల్టు షాపులపై గంజాయి నిర్మూలన పై నూతన కార్యచరణకు ఈ జిల్లా కమిటీ శ్రీకారం చుట్టిందని ఇకనుంచి దశలవారీగా జిల్లాలో యావత్ యువకులను బానిసలను చేస్తూ వారి ప్రాణాలను కోల్పోయే విధంగా మనుషుల విలువలను దెబ్బతీసే విధంగా రోజు రోజుకు జిల్లాలో ఏరులై పారుతున్న మద్యం షాపులపై దఫళవారీగా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించిందని ఎన్నోసార్లు అధికారులకు వినతులు స్వయంగా పట్టించిన కూడా జిల్లాలు అధికారులేనట్టుగా నిమ్మకు నీరెత్తినట్లుగా జిల్లా యంత్రాంగం వ్యవహరిస్తుందని, దీనిపైన డివైఎఫ్ఐ అధికారులు సిండికేట్ యాజమాన్యాలు బెల్టు షాపులు కుమ్మక్కయ్యే యువకులను నాశనం చేసేందుకు ధనార్జినేయంగా వాళ్ళ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా ఈ దంధాలు నడిపిస్తున్నారని స్పష్టమైన అవగాహనకు వచ్చిందని అందుకోసమే ఈ జిల్లాలో యువకులు మద్యం తాగుతూ తద్వారా గంజాయి డ్రగ్స్ కూడా బానిసలు అవుతున్నారని దీనిపై అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తూనే పోరాటాలు నిర్వహిస్తామని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి అంతవరకు డివైఎఫ్ఐ పోరాటాలు ఉంటాయని యువకులకు ఈ జిల్లాలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సిమెంట్ కర్మాగారం గాని, కోల్ శుద్ధి కర్మాగారం, గాని ఉక్కు పరిశ్రమ, గాని ఏర్పాటు చేస్తే ప్రజల్లో ఆర్థిక ఇబ్బందులు ఉండమని యువకులు కూడా గంజాయి డ్రగ్స్ మద్యం నుంచి బయటపడతారని వీలైనంత త్వరగా ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే దీని మీద దృష్టి సారించి జిల్లాలో ఉన్న యువకులందరికి ఉద్యోగ ఉపాది అవకాశాలు కల్పిస్తూనే రోజురోజుకు పెరుగుతున్న మద్యం బెల్ట్ షాపులపై తక్షణ చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయే విధంగా స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా కలుస్తామని. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రజలు పడుతున్న సమస్యలపై త్వరలోనే సందర్శనలు చేసి సమగ్రమైన సమాచారంతో పోరాటాలు నిర్వహించబోతున్నామని ప్రభుత్వాసుపత్రుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి తెలియజేసేందుకు దశల వారి పోరాటాలు కూడా డివైఎఫ్ఐగా నిర్వహించబోతా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు గడ్డం కవిత, గుడి కందుల దేవేందర్, బందు సుజాత, జిల్లా కమిటీ సభ్యులు, జ్ఞానేశ్వరి బుర్ర స్వాతి, అజ్మీర సరిత, ఎర్ర సుజాత, భాస్కర్లతోపాటు తదితరులు పాల్గొన్నారు.
“రోడ్డు నిబంధనలు పాటించని వారిపై చర్యలు” – ఎస్సై సంగమేశ్వర్
జహీరాబాద్. నేటి ధాత్రి:
వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు రోడ్డు నిబంధనలు కచ్చితంగా పాటించాలని లేనిపక్షంలో నిబంధనలు పాటించని వారిపై చట్టరీత్య చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఝరాసంగం ఎస్సై సంగమేశ్వర్ తెలిపారు. జహీరాబాద్ నుండి రాయికోడ్ కు వయా ఝరాసంగం వెళ్లే ప్రధాన రోడ్డు పై మల్లన్న గట్టు కు వెళ్లే కూడలి రామయ్య జంక్షన్ వద్ద సోమవారం సాయంకాల సమయంలో పోలీస్ సిబ్బంది తో కలిసి వాహనాలు తనిఖీ చేశారు.
Ramaiah Junction
ఈ సందర్బంగా ఆయన వాహనదారులకు పలు సూచనలు సలహాలు చేసి, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో పట్టుబడ్డ వారికి చలాన్లు వేశారు. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు రోడ్డు నిబంధనలు కచ్చితంగా పాటించి డ్రైవింగ్ లైసెన్సు, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, పొల్యూషన్, సంబందిత పత్రాలు కల్గి ఉండి మంచి కండిషన్ గల వాహనల్ని నడపాలని, వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని, మానవ ప్రాణం అత్యంత విలువైనదాని, అతి వేగంతో వాహనాల్ని నడపారాదని, రహదారులు పచ్చని చెట్ల నీడతో కప్పబడాలి తప్ప మనిషి రక్తంతో తడవకూడదని వాహనాలు ఢీకొనడం గాని రోడ్డు ప్రమాదాలు జరగడం వల్ల అంగ వికలాంగులు కావడం కుటుంబ సభ్యులకు దూరమావడం తన పై ఆధారపడ్డ వారికి దుఃఖం ను మిగిల్చకూడదని వారి జీవితం అగమ్య గోచరంగా మారుతుందని అందుకు ప్రతి ఒక్కరు బరువుగా కాకుండా బాధ్యత గా హెల్మెట్ ధరించాలని సూచించారు. చిన్నపిల్లలకు బైకులు ఇవ్వరాదని మద్యం సేవించి వాహనాలు నడపరాదని, ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించి ప్రమాదాల నివారణకు సహకరించాలని ఆయన సూచించారు.
ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్రం నుంచి ఆగిన నిధులు
రెండున్నరేండ్లుగా స్టేట్ ఫైనాన్స్ నిధులూ వస్తలేవు
మెయింటెనెన్స్ పనుల కోసం సొంతంగా ఖర్చుపెడుతున్న కార్యదర్శులు
ఒక్కో సెక్రటరీపై రూ.3 లక్షల నుంచి 10 లక్షల దాకా అప్పు
జహీరాబాద్. నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపో వడంతో కేంద్రం నుంచి పల్లెలకు రావాల్సిన నిధులు ఆగిపో యాయి. నిరుడు జనవరి నుంచి ఇదే పరిస్థితి, ఇటు రెండున్న రేండ్లుగా రాష్ట్రం నుంచి స్టేట్ ఫైనాన్స్ నిధులు కూడా రావడం లేదు. మరోవైపు ఆస్తిపన్నులు వసూలు కావట్లేదు. దీంతో పం చాయతీల నిర్వహణ భారం కార్యదర్శులపై పడింది. నిధుల్లేక పల్లెల్లో అభివృద్ధి పనులు చేసే పరిస్థితి లేదు. పారిశుధ్య పనులు, తాగునీటి సరఫరా, ట్రాక్టర్ మెయింటనెన్స్, డీజిల్, ట్యాంకులు క్లోరినేషన్, బ్లీచింగ్, మోటార్ల రిపేర్ లాంటి పనులకు సెక్రటరీలు తమ జేబుల్లోంచి ఖర్చు చేయాల్సి వస్తున్నది. రెండేండ్లుగా ఇదే పరిస్థితి ఉండడంతో ఒక్కొక్కరు రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల దాకా అప్పులు చేశామని కార్యదర్శులు వాపోతున్నారు. అప్పులు తెచ్చిపనులు చేస్తున్నాకొందరు ఉన్నతాధికారులు ఫీల్డ్ విజిట్ పేరుతో ఎక్కడో ఓ లోపం పట్టుకొని తమపై చర్యలు తీసు కుంటున్నారని, ఇది ఎంత వరకు సమంజసమని సెక్రటరీలు ప్రశ్నిస్తున్నారు.
Panchayat
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇచ్చిన హామీ మేరకు కనీసం స్టేట్ ఫైనాన్స్ నిధులైనా విడుదల చేసి అప్పుల బాధ నుంచి తమకు విముక్తి కల్పిం చాలని కోరుతున్నారు.
పంచాయతీలకు రూ.6,500 కోట్లు పెండింగ్
పంచాయతీలకు గతేడాది ఫిబ్రవరిలో పాల కవర్గాల గడువు ముగిసింది. ఏడాది దాటినా ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్ర ఆర్థిక సంఘం నుంచి నిధులు ఆగిపోయాయి. అలాగే, కేంద్ర ప్రభుత్వం నుంచి మొత్తం రూ.1,514 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. పాలకవర్గాలు కొ లువుదీరితే తప్ప ఈ నిధులు వచ్చే పరిస్థితి లేదు. రెండున్నరేండ్లుగా దాదాపు రూ.5 వేల కోట్ల స్టేట్ ఫైనాన్స్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం లేదు. గత బీఆర్ఎస్ హయాం నుంచే ఈ పరిస్థితి ఉంది. అప్పటి సర్పంచులు అప్పు చేసి పల్లెలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టగా, దానికి సంబంధించిన బిల్లులు నేటికీ చెల్లించకపోవడం తో వారు ఇబ్బందులు పడుతున్నారు. 15 నెలల కింద కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పంచాయతీలు గాడిన పడ్తాయని అందరూ భావించారు. గతంలో కేంద్రం నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులైనా వచ్చేవి. కానీ, ఎన్నికలు జరగ కపోవడంతో ఆ నిధులు కూడా రాకపోవడంతో పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడినట్లు అయింది.
నిర్వహణ భారమంతా కార్యదర్శులదే
సర్పంచుల పదవీకాలం ముగియడంతో పల్లెల్లో ప్రత్యేక అధికారుల పాలన నడుస్తున్నది. ఒక్కో అధికారికి నాలుగైదు గ్రామాల బాధ్యతలు ఉండడంతో ఇప్పుడు పంచాయతీల నిర్వహణ భారమంతా పంచాయతీ కార్యదర్శలపై పడింది. కేంద్రం, రాష్ట్రాల నుంచి ఫండ్స్ రాకపోవడం. టార్గెట్ మేరకు ఆస్తిపన్నులు వసూలు కాకపోవ డంతో కార్యదర్శులే అప్పులు చేసి పంచాయతీల ను నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఇంటింటా చెత్త సేకరణకు ట్రాక్టర్ను గ్రామంలోకి పంపాలంటే అందులో డీజిల్ పోయించాల్సి ఉంటుంది. నెలనెలా డీజిల్ కు రూ.10 వేల నుంచి 20 వేలకు పైగా ఖర్చుచేయాల్సి వస్తోంది. చాలా గ్రామాల కు మిషన్ భగీరథ నీళ్లు అందడం లేదు. దీంతో లోకల్ బోర్లు, మోటార్లు, పైపుల రిపేర్లు చేయించక తప్పట్లేదు. రహదారులపై మొరం పోయించడం, గుంతలు పూడ్చడం, మొక్కలకు నీళ్లు పట్టడం, స్ట్రీట్ లైట్ల నిర్వహణలాంటి పనులు సరేసరి. ప్రత్యేక అధికారుల పాలనలో ఏ చిన్న మీటింగ్ జరిగినా తమ జేబు నుంచే పెట్టుకో వాల్సి వస్తోందని కార్యదర్శులు వాపోతున్నారు. ఇలా ఒక్కో నెలకు రూ.50 నుంచి రూ.80 వేల వరకు, పెద్ద పంచాయతీలకు రూ.లక్ష నుంచి రూ. ఐదు లక్షల వరకు మెయింటెనెన్స్ ఖర్చవు తున్నదని చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఒక్కొక్కరు రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల దాకా అప్పు చేశామని వాపోతున్నారు.
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గత కెసిఆర్ ప్రభుత్వాన్ని ఎండగట్టిన చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం
గంగాధర నేటిధాత్రి :
KG to PG విద్యను ప్రారంభిస్తా, కార్పొరేట్ కళాశాల కాళ్లు విరుస్తాం అని చెప్పి అధికారంలోకి వచ్చిన కెసిఆర్, గత దశాబ్ద కాలంలో విద్యా విధ్వంసానికి పాల్పడ్డాడు. కెసిఆర్ తీర్పుతో విద్యా వ్యవస్థ రెండు దశాబ్దాలు వెనక్కి వెళ్ళి. ది అన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్-2024 ప్రకారం 2వ తరగతి నుండి 5వ తరగతి చదువుతున్న 82% విద్యార్థులకు 2వ తరగతి బుక్స్ చదవడం రావడం లేదు, 8వ తరగతి చదువుతున్న 65% మంచి విద్యార్థులకు బేసిక్ మ్యాథమెటిక్స్ పైన అవగాహన లేదు, బీహార్ జార్ఖండ్,ఛత్తీస్గడ్ వంటి రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రం విద్యావ్యవస్థలో అధమ స్థానంలో ఉంది. నేషనల్ అచీవ్మెంట్ సర్వేలో 3వ, 5వ, 8వ,10వ తరగతి విద్యార్థుల సామర్ధ్యాన్ని రాష్ట్రాల వారిగా నిర్వహించే పరీక్షలో టాప్-5 వరస్ట్ పర్ఫామెన్స్ రాష్ట్రాల్లో తెలంగాణను ఉంచిన ఘనత కేసిఆర్ కు దక్కుతుంది. ప్రభుత్వం ఆధ్వర్యంలో 2017-18 నుండి పర్ఫామెన్స్ ఆఫ్ గ్రేడింగ్ ఇండెక్స్ సూచిక ద్వారా రాష్ట్రాల విద్య వ్యవస్థ పనితీరుకు ర్యాంకులు కేటాయించడం జరుగుతుంది, ఈ ఇండెక్స్ ద్వారా తెలంగాణ రాష్ట్రం జాతీయలోనే అధమ స్థానంలో నిలిచింది. 2022 సూచిక ప్రకారం సెకండరీ విద్య తర్వాత డ్రాప్ అవుట్ లలో తెలంగాణ రాష్ట్ర మొదటి స్థానంలో ఉంది, జాతీయస్థాయిలో ఈ సగటు 13.2% గా ఉంటే,తెలంగాణ రాష్ట్రంలో 22.2% గా ఉంది. గత కేసీఆర్ ప్రభుత్వంలో ఆనాటి ప్రభుత్వ పెద్దలు నారాయణ,శ్రీ చైతన్య వంటి కార్పొరేట్ పాఠశాలలను ప్రోత్సహించి, ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేశారు.
కెసిఆర్ హయంలో విధ్వంసానికి గురైన విద్యా వ్యవస్థను గాడిలో పెట్టడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యకు అధిక నిధులు కేటాయిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బడ్జెట్లో విద్యాభివృద్ధికి రూ.23,108 కోట్ల రూపాయలను ప్రభుత్వం కే ప్రతిపాదించింది. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ లను ప్రారంభించాలని సంకల్పించి సీఎం రేవంత్ రెడ్డి చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో విద్యార్థుల డైట్ చార్జీలను 200 శాతం పెంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది. గత ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో 8 వేల పై చిలుకు టీచర్ ఉద్యోగాలనే భర్తీ చేయగా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 11 వేలకు పైగా ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేసింది. దశాబ్ద కాలంగా ఉపాధ్యాయ బదిలీలు, మోషన్లు చేపట్టలేదు, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధ్యాయులను బదిలీ చేయడంతో పాటు ప్రమోషన్లను కల్పించింది. విద్యా వ్యవస్థను పర్యవేక్షణ చేయడానికి గత ప్రభుత్వం హాయంలో డీఈవోలు, డిప్యూటీ డీఈవోలు, ఎంఈఓ లను నియమించలేదు. కేజీ టు పీజీ విద్య నేపంతో ప్రారంభించిన సంక్షేమ పాఠశాలల్లో వసతి సౌకర్యాలు సరిగా లేక విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. ఆనాటి బిఆర్ఎస్ నాయకుల జేబులు నింపడానికి వారి కోళ్ల ఫారాలు, అభ్యభవనాల్లో పాఠశాలలను ఏర్పాటు చేసి విద్యార్థుల జీవితాలను పణంగా పెట్టింది ఆనాటి బిఆర్ఎస్ ప్రభుత్వం. గత దసరా సమయంలో టిఆర్ఎస్ నాయకుల కనుసన్నల్లో ఉన్న భవనాలకు అద్దె చెల్లించలేదని ధర్నాలు చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ గ్రీన్ ఛానల్ ద్వారా భవనాలకు మధ్య చెల్లిస్తామని, పాఠశాలలు నడవకుండా చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించడంతో తిరిగి ప్రారంభించారు. శాస్త్రీయ ప్రమాణాలు పాటించకుండా ప్రారంభించిన ఈ పాఠశాలలతో రాష్ట్రంలో ఉన్న జిల్లా పరిషత్, మండల పరిషత్ ప్రభుత్వ పాఠశాలలు చాలావరకు మూతపడ్డాయి, ఉన్న పాఠశాలల్లో సరైన విద్యార్థులు లేకుండా పోయింది.
కెసిఆర్ హయంలో నిర్వీర్యమైన విద్యావ్యవస్థను తిరిగే గాడిలో పెట్టడానికి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం కృషి చేస్తోంది. కులం,మతం,ఆర్థిక సంబంధం లేకుండా ప్రతి విద్యార్థికి విధమైన విద్యను అందజేయడానికి ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను ప్రారంభించాలని నిర్ణయించడం చారిత్రక నిర్ణయం. విద్య ద్వారానే జీవితానికి సార్థకత ఏర్పడుతుందన్న అంబేద్కర్ ఆలోచన విధానం మేరకు డబ్బులు ఉన్న పిల్లలకే ఐఐటీ,నీట్ అనే విధానం పోవాలనే గొప్ప ఆలోచనతో ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను ప్రారంభిస్తుంది. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సంబంధించిన మధ్యాహ్న భోజనం బిల్లులను ప్రభుత్వం సకాలంలో చెల్లించకపోవడంతో నీళ్ల చారు అన్నం తినవలసి వచ్చింది. విద్యార్థులకు పౌష్టికరమైన ఆహారం అందించడానికి డైట్ చార్జీలను 200 శాతం పెంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది.
రోడ్ల వెంట కొనుగోలు ఆపాలి…? మార్కెట్ గేట్ తాళాలు తెరవాలి…?
ఉపాధి కోల్పోతున్న మార్కెట్ హమాలి కూలీలు దడువాయిలు
ఈ నామ్ చేయకుండా… రైతుల సొమ్ము కాజేస్తున్న వ్యాపారులు
మార్కెట్లో చారాన కొలుగోళ్ళు…! రోడ్ల వెంట బారాన కొనుగోళ్లు..!
చోద్యం చూస్తున్న మార్కెట్ అధికారులు
కేసముద్రం/ మహబూబాబాద్: నేటి ధాత్రి
కేసముద్రం వ్యవసాయ మార్కెట్ ఆసియా ఖండంలో భారత దేశంలోనే ఎక్సలెన్స్ అవార్డు పొంది గుర్తింపు తెచ్చుకొని పేరుగాంచింది, అంటే అప్పుడున్న మార్కెట్ అధికారుల చిత్తశుద్ధి కట్టుదిట్టమైన పాలన, వ్యాపారులు మార్కెట్ యార్డులోనే కొనుగోలు చేసేలా నియమ నిబంధనలు అమలుపరి, మార్కెట్ పరిసర ప్రాంతాలలో బహిరంగంగా రోడ్ల వెంట ఎవరు కొనుగోలు చేయరాదని పటిష్టమైన కట్టుదిట్టమైన చర్యలతో మార్కెట్ను సజావుగా నడిపించేవారు.
ట్రేడింగ్ లైసెన్స్ ఉన్న వారు ఎవరైనా రోడ్ల వెంట దుకాణాల ముందు కొనుగోలు చేసి వ్యవసాయ మార్కెట్ ను అప్రతిష్ట పాలు చేసే వారిపట్ల గతంలో కఠినంగా వ్యవహరించి నోటీసులు జారీ చేసిన సందర్భాలు ఉన్నాయని పలువురు భావిస్తున్నారు.
వ్యవసాయ మార్కెట్ అధికారులు నియవ నిబంధనలు చేపట్టి రైతుల ధాన్యాన్ని మార్కెట్లోనే విక్రయించుకునేలా రైతులకు ఎలాంటి మోసాలు జరగకుండా అలాగే మార్కెట్ ఆదాయానికి గండి పడకుండా మార్కెట్ యార్డులో పనిచేసేటువంటి హమాలి కూలీ కార్మికులకు మరియు దడువాయిలకు మంచి ఉపాధి లభించేదని పలువురు హమాలి కూలి దడువాయిలు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు.
కొంతమంది వ్యాపారులు సిండికేట్ గా మారి ఇష్టం వచ్చిన కాడికి రైతులను మోసం చేస్తూ దండుకుంటున్నారని పలువురు రైతులు విమర్శిస్తున్నారు.
మార్కెట్ పరిసర ప్రాంతాలలో కొనుగోలు చేయరాదని నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని తుంగలో తొక్కి కొంతమంది వ్యాపారులు వే బ్రిడ్జి కాంటాలు నిర్వహిస్తూ వే బ్రిడ్జ్ కంటాలలో తేడాలు ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్న అవేవి పట్టించుకోకుండా ఇష్టానుసారంగా కొనుగోలు చేస్తూ వే బ్రిడ్జి కాంటా నిర్వహించిన తర్వాత రైతుల ధాన్యం నుండి 30 నుంచి 40 కిలోల వరకు తరుగు పేరుతో కోత విధిస్తూ ఇష్టం వచ్చిన రేట్లు పెడుతూ రైతులను నిండా ఉంచుతున్నారని ఈ నామ్ చేయకుండా మార్కెట్ ఆదాయాన్ని గండి పెడుతున్నారని పలువురు రైతులు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు.
ఇటు రైతులనే కాకుండా హమాలి కూలీలను మరియు దడువాయిలకు రావాల్సిన సొమ్ము ఇవ్వకుండా మోసం చేస్తున్నారని, హమాలీ కూలి రేట్లు చెబుతూ రైతుకు ఇచ్చే లెక్కల్లో చూపుతూ రైతుకు కోత విధిస్తూ ఆ సొమ్మని వ్యాపారి జేబులోనే వేసుకుంటున్నాడని ఇది చాలా దారుణమని పలువురు భావిస్తున్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఇలా రోడ్ల వెంట వ్యాపారులు కొనుగోలు చేస్తుంటే మార్కెట్ అధికారులు పట్టించుకోకపోవడం వెనక ఏదో మతాలాబ్ ఉందని గుసగుసలాడుకుంటున్నారు.
ఈ మొక్కజొన్న సీజన్లో మార్కెట్ యార్డ్ మొత్తం కాలు పెట్టే సందు లేకుండా మొక్కజొన్న రాశులతో కలకలాడుతూ కనిపిస్తూ ఉండేది, నేడు మార్కెట్ యార్డు మొత్తం ఎటు చూసినా మొక్కజొన్న రాశులు లేవు వ్యవసాయ మార్కెట్ యాడ్ మొత్తం ఖాళీగా కనిపిస్తుందంటే దీనికి అధికారులే కారణమని రైతులు దుయ్యబడుతున్నారు.
మార్కెట్ గేట్లకు తాళాలు వేసే సమయపాలన లేదా రైతులకు మార్కెట్లో అమ్ముకునే హక్కు లేనట్టు ఇలా గేట్లకు తాళాలు వేయడం ఏంటని పలువురు విమర్శిస్తున్నారు.
ఇదే అదునుగా భావించిన వ్యాపారస్తులు మా తప్పేం లేనట్టు కొంతమంది ట్రాక్టర్ డ్రైవర్లతో సహా ట్రాలీల వరకు డబ్బు ఆశ చూపి ట్రేడింగ్ దుకాణాల ముందుకు రైతుల ధాన్యాన్ని రప్పించుకునేలా వ్యూహాలు మొదలు పెడుతున్నారని పలువురు రైతులు అంటున్నారు.
ఇటు మార్కెట్ ఆదాయానికి గండి పెడుతూ మార్కెట్ హమాలీ కూలీల దడువాయిలకు ఉపాధి లేకుండా చేస్తున్న మార్కెట్ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం వెనక విమర్శలు వెళ్లవెత్తుతున్నాయని ప్రజలు చెప్పుకుంటున్నారు.
రైతులు ధాన్యాన్ని మార్కెట్లో పోసుకోకుండా చుట్టూ ఉన్న గేట్లకు తాళాలు వేసి ఉండడంతో రైతులు అయోమయానికి గురై దిక్కులేని స్థితిలో ఇలా రోడ్ల వెంట అమ్ముకొని నష్టాలను భరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని రైతులు మండిపడుతున్నారు.
వ్యాపారులు మార్కెట్ యార్డులో 25% కొనుగోలు చేసి బహిరంగంగా వారి ఇష్టం వచ్చిన రేటు విధిస్తూ తరుగు పేరుతో 30 నుంచి 50 కేజీల వరకు ధాన్యంలో కోత విధిస్తూ బజారులో 75% కొనుగోలు చేస్తూ రైతులను మోసాలకు గురి చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి, కానీ మార్కెట్ అధికారులు మాత్రం వ్యాపారుల నుండి మార్కెట్ ఫీజు చెల్లిస్తున్నారు అని చెప్తున్నారు తప్ప మరి రైతుల పక్షాన మార్కెట్ అధికారులు చర్యలు చేపట్టడం లేదని రైతులు మోసాలకు గురికాకుండా చూడాల్సిన అధికారులే మాకు ఏమీ ఎరగనట్టు చోద్యం చూస్తుంటే ఇక మార్కెట్ ఎందుకు అని ప్రజలు విమర్శిస్తున్నారు.
ఇలా ఎవరికి వారు రైతును దోచుకోవాలని చూసేవాళ్ళు ఉన్నంతకాలం రైతు రాజు కాలేడని దీనికి కేసముద్రం వ్యవసాయ మార్కెట్ అధికారులే నిదర్శనమని పలువురు భావిస్తున్నారు.
ఇదే సందర్భంగా పలు హమాలి కూలి కార్మికుల సంఘాల నాయకులు మార్కెట్ కార్యాలయం ముందు వ్యాపారులు దుకాణాల ముందు రోడ్ల వెంట కొనుగోలు చేయరాదని అనే నినాదంతో కార్మికులతో ఆందోళన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ మార్కెట్ అధికారులలో ఏమాత్రం వ్యవసాయ మార్కెట్ పట్ల చిత్తశుద్ధి లేదని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు.
ఇప్పటికైనా వ్యవసాయ మార్కెట్ అధికారులు మార్కెట్ సమయపాలన పాటిస్తూ మార్కెట్ గేట్లు తెరిచి ఉంచాలని అప్పుడే రైతుల యొక్క దాన్యం సరుకులకు గిట్టుబాటు ధర లభించి తూకాలలో మోసాలు జరగకుండా రైతుకు న్యాయం జరుగుతుందని ఇకనైనా మార్కెట్ అధికారులు రైతుల పక్షాన అలాగే మార్కెట్ ని నమ్ముకుని బ్రతుకుతున్న వేలాదిమంది కార్మికుల ఉపాధి కోల్పోకుండా నిలబడి రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు చేపట్టాలని పలువురు హమాలి, కూలి దడువాయి కార్మికుల సంఘం నాయకులు రైతులు రైతు సంఘం నాయకులు మార్కెట్ అధికారులను మార్కెట్ పాలకమండలిని కోరుకుంటున్నారు.
చేర్యాల పట్టణంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 100 వసంతాల వార్షికోత్సవాల సందర్భంగా భారీ ర్యాలీ. నిర్వహించారు అనంతరం అంగడి బజార్ లోని షాదీఖాన ఫంక్షన్ హాల్ లో జరిగిన సభకు ముఖ్యఅతిథిగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి మరియు సిపిఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శి మంద పవన్ మరియు సిపిఐ జనగామ జిల్లా కార్యదర్శి మాజీ శాసనసభ్యులు సిహెచ్ రాజిరెడ్డి పాల్గొన్నారు.
CPI National
ఈ కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్ అధ్యక్షత వహించారు అట్టడుగు వర్గాల అభ్యున్నతికి పేద ప్రజల కార్మిక కర్షక సంక్షేమం కొరకు సిపిఐ పోరాటాలు చేసిందని కొనియాడారు ఈ కార్యక్రమంలో రామగళ్ళ నరేష్ ఇర్రి భూమయ్య ఎండి అజీమ్ బండారి సిద్దయ్య తదితరులు పాల్గొన్నారు
ఎంపీడీవో కల్పనకు వినతి పత్రం అందజేసిన బిజెపి నాయకులు
పరకాల,దామెర నేటిధాత్రి
పరకాల నియోజకవర్గంలోని దామెర మండల అధ్యక్షులు వేల్పుల రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఎంపీడీవో కల్పన కి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా మండలంలోని అన్ని గ్రామాల అర్హులైన లబ్ధిదారులందరికీ పక్క ఇండ్లు పంపిణీ చేసి లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలని భారతీయ జనతా పార్టీ దామెర మండల శాఖ తరపున వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మరియు దామెర మాజీ సర్పంచ్ గురిజాల శ్రీరామ్ రెడ్డి,నియోజకవర్గ కో కన్వీనర్ పిఎసిఎస్ డైరెక్టర్ మాదారపు రతన్ కుమార్,ఓబీసీ మోర్చా మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి, బీజేవైఎం జిల్లా కోశాధికారి సూర చంద్రర్,వన్ నేషన్ వన్ ఎలక్షన్ కన్వీనర్ కొట్టే రమేష్, కో కన్వీనర్ గండు ముఖేష్, సీనియర్ నాయకులు గువ్వ సాంబయ్య,ఆలేటి పోషాలు, దామెర పృథ్వీరాజ్,శక్తి కేంద్ర ఇన్చార్జ్ లు ఎక్కలదేవి రమేష్, గోగుల సమ్మిరెడ్డి,గండు పరుశురాం,బూత్ అధ్యక్షులు బి.రమేష్,చెల్పూరి రాజు, గూడూరు శ్రీనివాస్,మనోజ్, తదితరులు పాల్గొన్నారు.
యువ జ్యోతి ఆధ్వర్యంలో టీబి వరల్డ్ డే కార్యక్రమం,,,,
టిబి వ్యాధి రాకుండా నివారణ కు వివరించిన హెల్త్ ఆఫీసర్ భరత్ కుమార్,,,,
సిద్దిపేట ఎన్వైకే సహకారంతో విజయవంతంగా కార్యక్రమం,,,,
రామాయంపేట మార్చి 24 నేటి ధాత్రి (మెదక్)
ప్రపంచంలో టీ బి వ్యాధితో అనేకమంది గతం లో మరణించడం జరిగిందన్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా ప్రత్యేకమైన వ్యాక్సిన్ తయారుచేసి మందులతో టీబీ వ్యాధిని చాలా వరకు నివారించడం జరిగిందని రామాయంపేట మండల పి హెచ్ ఎస్ హెల్త్ ఆఫీసర్ భరత్ అన్నారు అయినా కానీ జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు కరోనా లాంటి వ్యాధులు రావడానికి టీబిలాంటి వ్యాధులు ఉండడం కూడా ప్రాణాంతక వ్యాధులకు గురవుతారని అన్నారు ముఖ్యంగా తంబాకు పొగాకు సిగరెట్టు గుట్కా పాన్ మసాలా లాంటి వాటితోనే కాకుండా దుమ్ముదులి వాతావరణ కాలుష్యంలో జాగ్రత్తగా ఉండకపోవడం వల్ల ఈ వ్యాధి ఒకరు నుండి మరొకరికి సోగుతుందని అందుకే
TB disease
ఈ వ్యాధిని పూర్తిగా నివారించిన తగు జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు విద్యార్థులు కూడా తమ తల్లిదండ్రులకు ధూమపానం పాన్ మసాలా గుట్కా లాంటి వాడుకున్న నివారించుకోవాలని ఇతవు ఈ పలికారు ఈ కార్యక్రమంలో యువజ్యోతి స్పోర్ట్స్ అండ్ యూత్ కోఆర్డినేటర్ సత్యనారాయణ హాస్టల్ మరియు పాఠశాల విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సిద్దిపేట వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సత్యనారాయణ తెలిపారు
మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టడం మానుకోవాలి బీజేపీ మత చాందసవాద రాజకీయాలను మానుకోవాలి…ఏఏం సి చైర్మన్ నరుకుడు వెంకటయ్య `మతం అంటే నమ్మకం విశ్వాసం… మతం అంటే రాజకీయం కాదు బీజేపీ నాయకులు గుర్తేరుగాలి `బతుకమ్మ పట్టుకున్నాడు బోనాల పండుగలలో బోనమెత్తిన నాయకుడు మా ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు `అన్ని మతాచారాలను, మత విశ్వాసాలు గౌరవించే నాయకుడు ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు `మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెడుతూ మత విద్వేషాలను రెచ్చగొట్టే కుటిల బుద్ది బీజేపీ నాయకులు మానుకోవాలి `జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనేది కాంగ్రెస్ పార్టీ నిధానం `లౌకిక వాదం, బావసారుప్యత కాంగ్రెస్ పార్టీ విధానం : కాంగ్రెస్ నాయకులు
వర్ధన్నపేట,నేటిధాత్రి:
నియోజక వర్గ కేంద్రములో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏద్దు సత్యం,వర్ధన్నపేట ,వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, మాజీ జెడ్పీటీసీ , కోతపెల్లి గ్రామ మాజీ సర్పంచ్ కమ్మాగొని ప్రభాకర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పోషాల వెంకన్న గౌడ్ లు విలేఖర్లతో మాట్లాడుతూ.గతములో వర్ధన్నపేట శాసన సభ్యులు కేఆర్ నాగరాజు గుళ్ళు కడితే బిచ్చా గాల్లు అవుతారు, బడులు కడితే విద్యావంతులు అవుతారని మాట్లాడిన మాటలను బీజేపీ నాయకులు వక్రీకరించి రాజకీయ రంగును పులుముతున్నారు మన శాసన సభ్యులు కేఆర్ నాగరాజు డా: బీ అర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించే విధంగా అంబేద్కర్ హైడాలోజిలో మాట్లాడడం జరగింది.కేఆర్ నాగరాజు మాట్లాడిన మాటలు డా: అంబేద్కర్ చెప్పినవే . ఓ. ఏస్.నేడు ఈ దేశములో ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీలు స్వేచ్చా గా జీవిస్తూ ఐఏఎస్,ఐపీఎస్,డాక్టర్లు,లాయర్లు,ఇంజనీర్లు, పొలిటీషియన్లు అయ్యారు అవుతున్నారాంటె, డా:బీ.అర్ అంబేద్కర్ చలవే. మి లాగా నిత్యం మతం ,బజనలు చేసుకుంటూ పోతే మా వర్గాలు ఈ దేశములో జీవించే స్థానమే లేదు. ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ ని జవహర్ లాల్ నెహ్రూ క్యాబినెట్లో న్యాయ శాఖ మంత్రి నీ చేసి గౌర వించింది . మి లాగా (బీజేపీ) గుళ్ళు, గోపురాలు, బజనలు,కీర్తనలు నమ్ముకుంటు,చేసుకుంటూ పోతే ఎస్సీ, ఎస్టీ లు వంద సంవత్సరాల క్రితం ఎలా ఉన్నా మో,నేటి వరకు అలానే ఉండే వాళ్ళము. నేడు ఈ దేశములో బీజేపీ పార్టీ మతం పేరుతో రాజకీయం చేయకుండా ,లౌకిక ప్రజాస్వామ్య లోకి రాండి.135 సంవత్సరాల నుండి మొదులుకొని నేటి వరకు ఈ దేశంలోని ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీ,నిమ్న ,అణగారిన వర్గాల ప్రజల సంక్షేమం కోసమే కాంగ్రెస్ పార్టీ పని చేస్తూ వస్తుంది.నేడు కూడా కాంగ్రెస్ పార్టీ జై బాపు,జై బిమ్,జై సంవిధాన్ నినాదంతో బ్రహ్మ నడంగ ముందుకు వెళుతున్నా ము.భవిష్యత్ ఎన్నికలలో ప్రజలు ఎవరిని ఆదరిస్తారో తెలుస్తోంది. గురువింద గింజ లాగా మాటలు మాట్లాడి మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టడం మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం.
రామాయంపేట మండల వ్యాప్తంగా వెలుగు సిఏ లను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా వెలుగు ప్రాజెక్ట్ లో విధులు నిర్వహిస్తున్న సిఏలు మంగళవారం చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. నేపథ్యంలో తెల్లవారుజామునుండే సీఏలను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. సీఏలకు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు బాలమని సంఘీభావం తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా సమస్యల కోసం పోరాటం చేస్తున్న వారిని అక్రమ అరెస్టులు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని ఆమె అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు సీఏలకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు
రామాయంపేట మండల వ్యాప్తంగా వెలుగు సిఏ లను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా వెలుగు ప్రాజెక్ట్ లో విధులు నిర్వహిస్తున్న సిఏలు మంగళవారం చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. నేపథ్యంలో తెల్లవారుజామునుండే సీఏలను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. సీఏలకు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు బాలమని సంఘీభావం తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా సమస్యల కోసం పోరాటం చేస్తున్న వారిని అక్రమ అరెస్టులు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని ఆమె అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు సీఏలకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు
వేలం పాటలో అంగడిని దక్కించుకున్న మాజీ సర్పంచ్ బట్టు శ్రీను
కేసముద్రం/ మహబూబాబాద్: నేటి ధాత్రి
మంగళవారం కేసముద్రం మున్సిపాలిటీ నందు అంగడి( సంత) బహిరంగ వేలం పాట పురపాలక సంఘ కార్యాలయం నందు కేసముద్రం మున్సిపల్ కమిషనర్ కె, ప్రసన్న రాణి ఆదేశాల మేరకు ఆర్ ఓ, ఎల్. కుమార్ అధ్యక్షతన మున్సిపల్ కార్యాలయం నందు వేలం పాట నిర్వహించడం జరిగింది.ఇట్టి వేలం పాటలో 6గురు పాటదారులు పాల్గొనగా వేలం పాటలో అత్యధిక రేటు పాడిన కేసముద్రం మాజీ సర్పంచ్ బట్టు శ్రీనివాస్, రూ :21,15,000/-లకు దక్కించుకున్నారు.ఈ కార్యక్రమంలో ఆర్ ఐ సింగని. ప్రభాకర్, బిల్ కలెక్టర్లు రాము, సంతోష్ సిబ్బంది పాలుగోన్నారు.
ముప్పిరెడ్డిపల్లి లో విజయవంతమైన ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం…
300 మందికి పైగా రోగులకు పరీక్షలు….
రామయంపేట మార్చి 25 నేటి ధాత్రి (మెదక్)
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మెదక్ శాఖ, వి ఎస్ టి ఇండస్ట్రీస్ తూప్రాన్ వారి సహకారంతో… మనోహరాబాద్ మండలంలోని ముప్పిరెడ్డిపల్లి గ్రామంలోనీ గ్రామ పంచాయతీ భవనంలో మంగళవారం నాడు ఏర్పాటు చేసిన మల్టీ స్పెషాలిటీ ఉచిత ఆరోగ్య శిబిరానికి అపూర్వ స్పందన లభించింది.. తూప్రాన్ వి ఎస్ టి సీనియర్ మేనేజర్ కిషోర్ కుమార్, కంపెనీ అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ గోపికృష్ణ ఇండియన్ రెడ్ క్రాస్ ప్రతినిధులతో కలిసి ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించారు. ప్రతి సంవత్సరం తాము రెడ్ క్రాస్ సంస్థతో కలిసి కంపెనీ పరంగా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామనీ వారు తెలియజేశారు..
Medical health camp
గ్రామంలో నిర్వహించిన ఉచిత వైద్య ఆరోగ్య శిబిరానికి అపూర్వ స్పందన లభించింది.. రెడ్ క్రాస్ సంస్థ రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఆరోగ్య శిబిరంలను నిర్వహిస్తూ పేదలకు సేవలు అందించడం పట్ల పలువురు వర్షం వ్యక్తం చేశారు. ప్రైవేటు ఆసుపత్రులకు చెందిన ప్రత్యేక వైద్య బృందం గ్రామానికి చేరుకొని ఉచిత వైద్య పరీక్షలను నిర్వహించింది.. అంతేకాకుండా రోగులకు ఉచితంగా మందులను పంపిణీ చేశారు. వైద్య బృందంలో ఐశ్వర్యా రెడ్డి, రోనిత్ రెడ్డి, డాక్టర్ తేజస్వారి, కే అమూల్య రెడ్డి, శ్రేయ సింగ్,రమాదేవి, షాదిన్ మహాదీన్, లిఖిత, సుమానియాతో పాటు పనులు డాక్టర్లు ఉన్నారు. ఈ వైద్య పరీక్షల్లో సుమారు 300 వందల మందికి పైగా రోగులు వివిధ రకాల వైద్య పరీక్షలు చేయించుకున్నారు. దంత పరీక్షలు, నరాలకు సంబంధించిన కీళ్ల నొప్పులు, దగ్గు ,దమ్ము రోగులను డాక్టర్ల బృందం పరిశీలించిoది.. ఈ కార్యక్రమం లో మనోహరాబాద్ ఎంపీడీవో కృష్ణమూర్తి,మెదక్ జిల్లా చైర్మన్ లయన్ డాక్టర్ ఏలేటి రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర సభ్యులు సింగం శ్రీనివాసరావు, కార్యదర్శి టి.సుభాష్ చంద్రబోస్, ఉపాధ్యక్షుడు లక్ష్మణ్ యాదవ్, కోశాధికారి డి.జి.శ్రీనివాస శర్మ, మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు పి.దామోదర్ రావు,దేమేయాదగిరి, మద్దెల సత్యనారాయణ, మద్దెల రమేష్, వంగరి కైలాసం,సభ్యులు తోట శ్రీనివాస్ గుప్తా,వి. సతీష్ రావు తో పాటు గ్రామానికి చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు.
ప్రమాదంలో గాయపడిన ఎస్టిపిపి కాంట్రాక్టు కార్మికుడికి చేయూత
ఈడి శ్రీనివాసులు ఆధ్వర్యంలో 66 వేల చెక్కు అందజేత
జైపూర్,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ ఎస్టిపిపి అధికారులు, ఉద్యోగులు గత జనవరి నెల 31 న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఎస్టిపిపి కాంట్రాక్టు కార్మికుడు మరియు క్రికెట్ ఆటగాడు అయిన గడ్డం శివ సాయి కి వైద్య ఖర్చుల నిమిత్తం 66 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది.
శివ సాయి ఒక కాంట్రాక్టు కార్మికుడుగా మాత్రమే కాదు మంచి క్రికెట్ ఆటగాడిగా ఎస్టిపిపిలో గుర్తింపు గల వ్యక్తి అతడికి ఈ విధంగా ప్రమాదం జరిగిందని తెలియగానే క్రికెట్ చీఫ్ కోఆర్డినేటర్ పంతులా(డిజిఎం) కోఆర్డినేటర్లు పి. వి. బ్రహ్మం (డిజిఎం)మరియు పులి సురేష్ (సేఫ్టీ ఆఫీసర్ )చొరవ తీసుకోని క్రీడాకారులు మరియు ఉద్యోగులు నుండి ఈ మొత్తాన్ని సేకరించడం జరిగింది.
ఎస్టిపిపి లోని పరిపాలనా భవనంలో జరిగిన కార్యక్రమంలో ఎస్టీపిపి ఇన్చార్జ్ ఈడి కే.శ్రీనివాసులు చేతుల మీదుగా 66,000/- వేల రూపాయల చెక్కుని కాంట్రాక్ట్ కార్మికుడు శివ సాయి కి అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఈడి కే.శ్రీనివాసులు మాట్లాడుతూ ఏ వ్యక్తి జీవితంలోనైనా ప్రమాదం అనేది ఆ వ్యక్తికి మరియు ఆ కుటుంబానికి చాలా బాధాకలిగించే విషయమని అన్నారు.
మనం తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తల వల్ల రాబోయే ప్రమాదాన్ని అరికట్టవచ్చని తెలిపారు.ప్రతి ఒక్క ఉద్యోగి తప్పనిసరిగా భద్రతా నియమాలు పాటించాలని సూచించారు.
అలాగే ద్విచక్ర వాహనంపై ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని మరియు కారు నడిపెటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు.
ఉద్యోగులు సహాయం చేయడంలో ఎస్టిపిపి ఉద్యోగులు ముందుంటారని, విరాళాల ద్వారా తగు ఆర్థిక సహాయం అందించి బాధితులకి మనోధైర్యాన్ని కల్పిస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో చీఫ్ కోఆర్డినేటర్ డి. పంతులా(డిజిఎం), ఏ ఐ టి యు సి పిట్ సెక్రటరీ సత్యనారాయణ, ఏజిఎం (సివిల్)కె.ఎస్.ఎన్. ప్రసాద్, ఏజిఎం (ఫైనాన్స్)మురళీధర్,డీజీఎం(పర్సనల్)అజ్మీరా తుకారాం, డీజీఎం పి. వి. బ్రహ్మం,పులి సురేష్ (సేఫ్టీ ఆఫీసర్ )ఇతర అధికారులు మరియు ఉద్యోగులు పాల్గొన్నారు.
ప్రజా పంపిణి వ్యవస్థ ద్వారా పేదలకు సన్నబియ్యం పంపిణి
ఎస్సీ సేల్ మండల అధ్యక్షులు ఓనపాకాల ప్రసాద్
నేటి ధాత్రి మొగుళ్ళపల్లి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సన్నబియ్యం పంపిణీకి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోందని. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సేల్ మండల అధ్యక్షులు ఓనపాకాల ప్రసాద్ అన్నారు. ఆయన మాట్లాడుతూ. నిరుపేదలకు చెందాల్సిన రేషన్ షాపులోని దొడ్డు బియ్యం అక్రమార్కులు రాష్ట్రాలు దాటించి సొమ్ము చేసుకున్నారని పేదల నోటికి చెందాల్సిన అన్నం దొంగల పాలవుతుందని భావించి. ఎలాగైనా నిరుపేదలకు న్యాయం చేయాలని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ముఖ్యమంత్రితో పాటు పౌర సరఫరాల మంత్రి దృష్టికి తీసుకువెళ్లి సన్న బియ్యం పంపిణి చేస్తేనే బియ్యం దొంగలకు అడ్డుకట్ట వేయచ్చని చర్చించి సన్న బియ్యం. ప్రజలకు పంపిణి చేసేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుకు నిరుపేదల తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అందుకు అనుగుణంగా రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీకి ప్రజా ప్రభుత్వం సన్నా హాలు చేస్తోందని. ఇందులో భాగంగా పౌర సరఫరాల శా ఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,సొంత నియోజకవర్గ మైన హుజూర్ నగర్‌లో ఈ పథకాన్ని ఉగాది పండుగ పర్వదిననా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,పౌర సమాచార శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించడం మా నిరుపేదలకు ఆనందంగా ఉన్నదనీ సన్న బియ్యం పంపిణి చేసి నిజమైన పెదలపార్టీ కాంగ్రెస్ పార్టీ అని నిరూపించిందని రాష్ట్రంలో పేదలకు సన్న బియ్యం పంపిణీ చేసేందుకు ఏడాదిలో. రెండు సీజన్లలో సేకరించే సన్నధాన్యాన్ని బియ్యంగా మార్చి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు పంపిణీ చేసేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించడం. ప్రభుత్వ కృషికి నిదర్శనమని. రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులకు, నియోజకవర్గ ఎమ్మెల్యే కు ఓనపాకాల ప్రసాద్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.
ప్రజావాణిలో ఫిర్యాదు మేరకు సీజ్ చేశామన్న మైనింగ్ అధికారులు,,,,,
అక్రమ ఇసుక డంపు చేస్తే కఠిన చర్యలు తప్పవు మైనింగ్ అధికారి మధు కుమార్,,,,,
ఇసుక కుప్పలను పంచనామ చేసిన మండల ఆర్ ఐ గౌస్ మొయినుద్దీన్,,,,,
రామాయంపేట మార్చి 24 నేటి ధాత్రి (మెదక్)
రామాయంపేట పట్టణ పరిధిలో ఇసుకను డంపు చేసి అమ్ముతున్న ఇసుక డంప్యాడ్లపై మంగళవారం మెదక్ జిల్లా మైనింగ్ అధికారులు దాడి చేసి అక్రమ ఇసుక కుప్పలను సీజ్ చేసినట్లు జిల్లా మైనింగ్ అధికారి ఏదీ అసిస్టెంట్ మైనింగ్ అధికారి జువాలజిస్ట్.మధు కుమార్ తెలిపారు ఆయన విలేకరులతో మాట్లాడుతూ రామాయంపేటలో విచ్చలవిడిగా ఇసుక అక్రమ అమ్మకాలు జరుగుతున్నాయని ప్రజావాణిలో తమకు వచ్చిన ఫిర్యాదు మేరకు ఇసుక డంపులపై దాడి చేయగా నాలుగు డప్పుల్లో మూడు డప్పుల వద్ద అక్రమ ఇసుక లభించింది అన్నారు నాలుగో డబ్బు వద్ద ఎలాంటి ఇసుక గొప్పలు లేవని ఆయన తెలిపారు ఈ ఇసుక డంపులను రామాయంపేట మండల ఆర్ ఐ గౌస్ మైనది పంచనామ చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా మైనింగ్ అధికారి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు
హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణం
మంచిర్యాల,నేటి ధాత్రి:
హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమాన్ని మంగళవారం రోజున నిర్వహించడం జరిగింది.అలాగే ఆలయంలో భక్తులు మరియు హనుమాన్ మాలాధారణ స్వాములు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి హిందూ ఉత్సవ సమితి తరపున ధన్యవాదాలు తెలియజేశారు.
భాషా సాంస్కృతిక శాఖ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో మరియు మానేరు రచయిత సంఘం ఆధ్వర్యంలో రెండు రోజుల జాతీయ సదస్సు.
సిరిసిల్ల టౌన్:( నేటి ధాత్రి )
సిరిసిల్ల జిల్లాలోని భాషా సాంస్కృతిక శాఖ తెలంగాణ ప్రభుత్వం సౌజన్యంతో మరియు మానేరు రచయితల సంఘం సంయుక్త నిర్వహణలో సిరిసిల్ల సిరివెలుగులు డా, నలిమెల భాస్కర్ మరియు జూకంటి జగన్నాథం సమాలోచన రెండు రోజుల జాతీయ సాహిత్య సదస్సు..
ప్రభుత్వ డిగ్రీ కళాశాల అగ్రహారంలో ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా శాతవాహన విశ్వవిద్యాలయం రిజిస్టర్ ఆచార్య రవికుమార్ జాస్తి,అగ్రహారం డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ టి.శంకర్, డాక్టర్ నలిమెల భాస్కర్, జూకంటి జగన్నాథం, మరియు ఎస్.ఆర్.ఆర్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య కలవకుంట రామకృష్ణ, టి.టి.సి.జి.టి.ఏ ప్రధాన కార్యదర్శి డాక్టర్, కాడూరు సురేందర్ రెడ్డి, దక్షిణ ప్రాంత ఆఫీసర్ ఇంచార్జ్ ఎన్బిటి డాక్టర్ పత్తిపాక మోహన్, సదస్సు కన్వీనర్ కటుకం శారద, రచయిత అన్నవరం దేవేందర్ , మరియు మానేరు రచయితల సంఘం అధ్యక్షులు టీవీ నారాయణ, కార్యనిర్వాహ అధ్యక్షులు ఎలుగొండ రవి, మానేరు రచయితల సంఘం సభ్యులు బూర దేవానందం,ఆడెపు లక్ష్మణ్, చిటికెన కిరణ్ కుమార్, జి.శ్రీమతి,అనిత మాడూరి, దూడం గణేష్, రొండి అర్జున్, మల్యాల దీపిక, ఈడపు సౌమ్య, అంకారపు రవి కవులు, రచయితలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది.
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం లోని ఐకెపి వివోఏ రమేష్,లింగన్న,పద్మ,వినోద, కొమురయ్య,గట్టయ్య లను ముందస్తుగా అరెస్టు చేసి మంగళవారం జైపూర్ పోలీస్ స్టేషన్ కి తరలించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 20,000 వేల రూపాయల జీతంతో పాటు ఇన్సూరెన్స్,ఉద్యోగం భద్రత, డ్రెస్ కోడ్ వంటి అనేక డిమాండ్లను కచ్చితంగా తీర్చుతామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది.కానీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి ఇన్ని రోజులు అవుతున్న ఎన్నికల మేనిఫెస్టోలో ఏర్పర్చిన ఏ ఒక్క హామిని కూడా తీర్చలేదని తమ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఐకెపి వివోఏ ఉద్యోగుల సంఘం సిఐటియు ఆధ్వర్యంలో హైదరాబాదులోని సెర్ఫ్ కార్యాలయంలో మంగళవారం నిరసన చేపట్టే కార్యక్రమాన్ని అడ్డుకోవడం తమకు తగదని అన్నారు.
బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఒకేదేశం ఒకే ఎన్నిక అవగాహన కార్యక్రమం
పరకాల నేటిధాత్రి
ఒకేదేశం ఒకేఎన్నిక పై అవగాహన కార్యక్రమం బిజెపి భారతీయ జనతా పార్టీ పరకాల పట్టణ అధ్యక్షులు గాజుల నిరంజన్ ఆధ్వర్యంలో బిజెపి కార్యాలయంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్.సిరంగి సంతోష్ కుమార్ హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ ఒకే దేశం ఒకే ఎన్నిక విధానంతో దేశానికి చాలా మేలు జరుగుతుందని పలుమార్లు ఎన్నికలు నిర్వహించడంతో దేశంపై ఆర్థిక భాగం పడడంతో పాటు సమయం వృధా అవుతుందని అన్నారు వాటిని తగ్గించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒకే దేశం ఒకే ఎన్నిక విధానం తేవడానికి కృషి చేస్తున్నారని తెలిపారు.తరచూ ఎన్నికలు రావడం వలన ఎన్నికల కోడ్ ఉండడంతో ఆయా రాష్ట్రాల అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతుంది గతంలో జమిలి ఎన్నికలు అనేవి 1952 నుంచే ఎన్నికలు జరిగినవి ఇందిరాగాంధీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వాలను మార్చి రాష్ట్రపతి పాలన పెట్టడం తద్వారా దేశంలో ప్రతి సంవత్సరం ఏదో ఒక రాష్ట్రంలో ఎలక్షన్స్ జరుగుతున్నాయన్నారు.ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒకే దేశం ఒకే ఎన్నిక ఉంటే దేశం అభివృద్ధి చెందుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ పి జయంతి లాల్,బిజెపి నాయకులు మార్త రాజభద్రయ్య,చందుపట్ల రాజేందర్ రెడ్డి,బెజ్జంకి పూర్ణ చారి,కుక్కల విజయకుమార్, మార్త బిక్షపతి,సంగా పురుషోత్తం,దంచనాల సత్యనారాయణ,మారేడుగొండ భాస్కరాచారి,ఆకుల రాంబాబు,బూత్ అధ్యక్షులు మరాఠి నరసింగరావు,ముత్యాల దేవేందర్,సంఘ నరేష్, ఉడుత చిరంజీవి,బీరం రాజిరెడ్డి,గాజుల రంజిత్ బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.