దీపక్ నగర్ 16వ వార్డులో కుప్పలు కుప్పలుగా చెత్త..

దీపక్ నగర్ 16వ వార్డులో కుప్పలు కుప్పలుగా చెత్త

ఖాళీ స్థలంలో చెత్త కుప్ప పిచ్చి మొక్కలు పాములు, పందులు, దోమలతో అపాయం.

చెత్త కుప్ప నుండి నివాసాలలోకి వస్తున్న పాములు, దోమలు.

మందమర్రి నేటి ధాత్రి

మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ దీపక్ నగర్ 16వ వార్డులో ఖాళీ స్థలం ప్రాంగణం లో అడ్డగోలుగా చెత్త పిచ్చి మొక్కలు ఉండడం వలన చేత ప్రక్కన నివాసం కలిగి ఉన్న ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు. దీనివలన పాములు, పందులు, దోమలు వలన చుట్టుపక్కల ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తున్నాయి. వర్షాకాలం అయితే మరి దుర్బలమైన పరిస్థితులు ఈ ప్రాంతంలో ఈ కాళీ స్థలం చెత్త కుప్పగా మారడంతో. ప్రక్కన ఉన్న డ్రైనేజీ కాలువలో చెత్త మురికి నీరు పేరుకపోయి.కాలువ ఇరు ప్రక్కల పిచ్చి మొక్కలు పెరిగి ఉన్న పట్టించుకోని అధికారులు. ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి. స్ట్రీట్ లైట్ వెలగకపోవడంతో. అంధకారంగా మారిన ప్రాంతం దీనితో ఈ చెత్త కుప్ప పక్కన ఉన్న నివాసాలలోకి చాలాసార్లు విషపూరితమైన సర్పాలు చొరబడ్డ సందర్భాలు ఉన్నాయి. దీనివలన అక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇప్పటికైనా తక్షణమే అధికారులు స్పందించి వెంటనే చొరవ తీసుకోవాలని అక్కడి ప్రజలు బహిరంగంగా చర్చించుకుంటున్నారు.

ఇసుక డంపుల ఇసుక కుప్పల సీజ్.

ఇసుక డంపుల ఇసుక కుప్పల సీజ్,,,,,,

ప్రజావాణిలో ఫిర్యాదు మేరకు సీజ్ చేశామన్న మైనింగ్ అధికారులు,,,,,

అక్రమ ఇసుక డంపు చేస్తే కఠిన చర్యలు తప్పవు మైనింగ్ అధికారి మధు కుమార్,,,,,

ఇసుక కుప్పలను పంచనామ చేసిన మండల ఆర్ ఐ గౌస్ మొయినుద్దీన్,,,,,

రామాయంపేట మార్చి 24 నేటి ధాత్రి (మెదక్)

 

రామాయంపేట పట్టణ పరిధిలో ఇసుకను డంపు చేసి అమ్ముతున్న ఇసుక డంప్యాడ్లపై మంగళవారం మెదక్ జిల్లా మైనింగ్ అధికారులు దాడి చేసి అక్రమ ఇసుక కుప్పలను సీజ్ చేసినట్లు జిల్లా మైనింగ్ అధికారి ఏదీ అసిస్టెంట్ మైనింగ్ అధికారి జువాలజిస్ట్.మధు కుమార్ తెలిపారు ఆయన విలేకరులతో మాట్లాడుతూ రామాయంపేటలో విచ్చలవిడిగా ఇసుక అక్రమ అమ్మకాలు జరుగుతున్నాయని ప్రజావాణిలో తమకు వచ్చిన ఫిర్యాదు మేరకు ఇసుక డంపులపై దాడి చేయగా నాలుగు డప్పుల్లో మూడు డప్పుల వద్ద అక్రమ ఇసుక లభించింది అన్నారు నాలుగో డబ్బు వద్ద ఎలాంటి ఇసుక గొప్పలు లేవని ఆయన తెలిపారు ఈ ఇసుక డంపులను రామాయంపేట మండల ఆర్ ఐ గౌస్ మైనది పంచనామ చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా మైనింగ్ అధికారి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version