టి పి టి ఎఫ్ నేతకు ఘనంగా పదవి విరమణ అభినందన సన్మానం

టి పి టి ఎఫ్ నేతకు ఘనంగా పదవి విరమణ అభినందన సన్మానం

కేసముద్రం/ నేటి ధాత్రి

సోమవారం జిల్లా పరిషత్ పరిషత్ ఉన్నత పాఠశాల కేసముద్రం విలేజ్ లో బయాలజీ స్కూల్ అసిస్టెంట్ గా పని చేస్తున్న చీకటి వెంకట్రాం నర్సయ్య పదవీ విరమణ అభినందన, సన్మాన సమావేశం పాఠశాల యాజమాన్యం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం, ప్రధానోపాధ్యాయులు, తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ మహబూబాబాద్ జిల్లా మరియు కేసముద్రం మండల శాఖలు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా టిపిటిఎఫ్ జిల్లా శాఖ అధ్యక్షులు బాలాష్టి రమేష్ మాట్లాడుతూ సుమారు 40 సంవత్సరాలపాటు విద్యార్థులకు అంకితభావంతో సేవలందించిన ఉపాధ్యాయులు చీకటి వెంకట్రాం నర్సయ్య అని, క్రమశిక్షణ, నిబద్ధత గల వ్యక్తి అని కొనియాడారు. ఉపాధ్యాయ వృత్తిలో మాత్రమే కాకుండా, ఉపాధ్యాయ సంఘమైన టి పి టి ఎఫ్ (తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్) లో కూడా క్రియాశీల కార్యకర్తగా పని చేశారని, సంఘ నిర్మాణంలో చురుకుగా పాల్గొంటూ, పలుమార్లు మండల అధ్యక్షునిగా, జిల్లా శాఖ ఉపాధ్యక్షునిగా సేవలందించి, ఉపాధ్యాయుల హక్కుల సాధనకు తన వంతు కృషి చేశారన్నారు. ఈ సందర్భంగా
రిటైర్మెంట్ రోజునే రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించే విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. అదేవిధంగా ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రాజశేఖర్, ఉపాధ్యాయులు నాగమణి, శ్రీనివాస్ రమేష్, సుధాకర్, శిరీష, పద్మ, లతో పాటు తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి కార్యదర్శి మైస శ్రీనివాసులు కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ ప్రధాన కార్యదర్శి నరసింహ రాజు, , జిల్లా కార్యదర్శులు రాచకొండ ఉపేందర్, చీకటి ఉపేందర్, మండల శాఖ ఉపాధ్యక్షులు అంజన్న కార్యదర్శులు వీసం నర్సయ్య, ఊటుకూరి ప్రణయ్ కుమార్, మోహన కృష్ణ, కోడెం శ్రీనివాస్, మండల శాఖ ,అప్పాల నాగరాజులు పాల్గొన్నారు.

తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం కరపత్రాలను ఆవిష్కరించిన..

తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం కరపత్రాలను ఆవిష్కరించిన

మరిపెడ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు

మాజీ కౌన్సిలర్
విసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి

పట్టణ అధ్యక్షులు షేక్ తాజుద్దీన్

ఎస్సీ సెల్ అధ్యక్షులు బాషిపాంగు రవికాంత్

మరిపెడ నేటిధాత్రి.

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని తొమ్మిదవ వార్డులో మరిపెడ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ కౌన్సిలర్ విసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి, తన నివాసంలో, రాష్ట్ర రెండవ మహాసభ తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం కరపత్రాలను ఆవిష్కరించారు అనంతరం మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని ,ఆర్ & బి గెస్ట్ హౌస్ ,లో మరిపెడ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ తాజుద్దీన్ , మరిపెడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు బాషిపాంగు రవికాంత్, మరిపెడ మండల యుత్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు జాటోత్ సురేష్ నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, దేవరశెట్టి లక్ష్మీనారాయణ, తెలంగాణ మాదిగ జర్నలిస్టు ఫోరం,రాష్ట్ర రెండవ మహాసభ కరపత్రాలను, ఆవిష్కరించారు
ఈ కార్యక్రమంలో తెలంగాణ మాదిగ జర్నలిస్టు ఫోరం మరిపెడ మండల అధ్యక్షులు చింత వెంకన్న, కార్యవర్గ సభ్యులు, తప్పెట్ల సైదులు ,చింత దిలీప్, తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version