ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ జర్నలిస్టులు రాస్తారోకో
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు జర్నలిస్టులపై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలను నిరసిస్తూ కాకతీయ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కాకతీయ ప్రెస్ క్లబ్ నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. సెంటర్ లో ప్లకార్డ్ తో రోడ్డుపై బైఠాయిచి రాస్తారోకో చేశరు. నేడు జిల్లాలో కొనసాగుతున్న ముగ్గురు మంత్రుల పర్యటనను బహిష్కరించి నిరసన తెలిపారు.
జర్నలిస్టుల పై ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాకతీయ ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు పాల్గొన్నారు.