ఆసుపత్రి ని సందర్శించిన ఎమ్మెల్యే మాణిక్ రావు.

జహీరాబాద్ ఏరియా ఆసుపత్రి ని సందర్శించిన ఎమ్మెల్యే మాణిక్ రావు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ శాసనసభ్యులు కోనింటి మాణిక్ రావు ఏరియా ఆసుపత్రి ని సందర్శించి* ఆసుపత్రిలో ప్రతి విభాగాన్ని తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ప్రతి విభాగంలో రోగులతో మాట్లాడుతూ వారి సమస్యలను మరియు అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.

MLA Manik Rao

 

 

అనంతరం సూపరెండింట్ డాక్టర్ శ్రీధర్ ,డాక్టర్ గిరి, ఇతర వైద్యులు & స్టాఫ్ తో మాట్లాడుతూ హాస్పిటల్ కు వచ్చే రోగులకు ప్రతి విభాగంలో స్టాప్ అంకితభావంతో సేవలందించాలని వచ్చే నెలలో తిరిగి ప్రతి విభాగంతో సమావేశం అవుతా అని అన్నారు.ఎమ్మెల్యే గారి తో పాటుగా సీనియర్ నాయకులు నామ రవికిరణ్ ,మాజి పట్టణ అధ్యక్షులు మొహియుద్దీన్ ,బండి మోహన్, తదితరులు ఉన్నారు .

ప్రసవానికి వస్తే ప్రాణాలు కోల్పోయింది.

ప్రసవానికి వస్తే.. ప్రాణాలు కోల్పోయింది.

కల్వకుర్తి / నేటిదాత్రి :

 

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణం కేంద్రంలో వెల్దండ మండలం కొట్ర గ్రామానికి చెందిన రేణుక (27) కల్వకుర్తి లోని శ్రీ సాయి ప్రైవేట్ హాస్పిటల్ లో స్కానింగ్ చేయించుకొని వాటి రిపోర్ట్స్ డాక్టర్ కు చూపించగా.. రక్తం తక్కువగా ఉన్నదని.. ఆపరేషన్ చేయాలని బాధితులకు చెప్పగా.. వెంటనే ఆపరేషన్ చేశారు. పాప బానే ఉంది. ఆమెకు బ్లడ్ తక్కువగా ఉన్నది కావున నాగర్ కర్నూలు వెళ్లి బ్లడ్ తీసుకురమ్మని చెప్పాగా.. ఆదివారం సాయంత్రం బాధితులు నాగర్ కర్నూల్ కి వెళ్లి బ్లడ్ తీసుకొని రాగా.. ఇంతకు చాలా రక్తస్రావము కావున రక్తం ఎక్కించాలన్నారు.

Sri Sai Private Hospital

మూత్రం బందవడంతో ఐసి లో ఉంచి వాళ్లను చూడనివ్వకుండా వాళ్లు కొద్దిసేపటి తర్వాత వచ్చి హాస్పిటల్ యజమాని తీసుకొని వచ్చి మలక్పేట లోని యశోద హాస్పిటల్ చేరిపించి రెండు లక్షలు నగదు అడగగా టెస్టులు చేసి మొత్తం లక్ష రూపాయలు కడతమని చెప్పారు ఒక లక్ష రేపు కడతామని చెప్పారు 80000 శ్రీ సాయి హాస్పిటల్ డాక్టర్ కట్టడం జరిగిందని అప్పుడు వారు హాస్పిటల్ లో జాయిన్ చేసుకొని ఇబ్బందికరంగా ఉంది సీరియస్ గా ఉంది మేము ఏమి చెప్పలేమని 48 గంటలు గడిస్తే గాని ఏమీ చెప్పలేమని చెప్పారు అప్పటికే కళ్ళకు టేపులు వేయడం జరిగిందన్నారు. శ్రీ సాయి హాస్పిటల్ యజమాన్యం అంబులెన్స్ మాట్లాడే వెంబడి రావడమే కాక.. తన సొంత సొమ్ముతో వైద్యానికి ఇచ్చాడన్నారు. ఇది ఇక్కడే జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు. లేకపోతే తను రిఫర్ చేయలే కానీ.. అక్కడి వరకు వెంబడి వచ్చి అంబులెన్స్ మాట్లాడి డబ్బుల సహాయం చేసి ఎవరూ చేయరు ఇలాంటి హాస్పిటల్ కు అనుమతి ఇచ్చిన యజమాన్యం పట్టించుకోని వీటిని సీజ్ చేయాలని బాధితులు కోరారు.

ఆస్పత్రి సూపరింటెండెంట్ దంపతుల పూజలు.

కోటగుళ్లలో జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ దంపతుల పూజలు

గోశాల నిర్వహణకు రూ. 56వేల వితరణ

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండల కేంద్రంలో కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ లో ఆదివారం సుబ్రహ్మణ్య షష్టి పర్వదినాన్ని పురస్కరించుకొని భూపాలపల్లి జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కోడూరు నవీన్ కుమార్ సుమతి దంపతులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు వారిని సాదరంగా ఆహ్వానించి గణపతి, నందీశ్వరుడు, గణపేశ్వరునికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం గోశాల నిర్వహణలో భాగంగా పనిచేస్తున్న పానిగంటి గణేష్ కు వేతనం కింద రూ 56 వేలను అందజేశారు. ఈ సందర్భంగా గోశాల గోమాతలకు నవీన్ కుమార్ సుమతి దంపతులు పండ్లను
అందజేశారు. అనంతరం డాక్టర్ దంపతులను శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించారు. గోశాల నిర్వహణకు వేతనాన్ని అందజేసిన నవీన్ కుమార్ సుమతి దంపతులకు కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.

ఉచితంగా వైద్య శిబిరం.

ఉచితంగా వైద్య శిబిరం

నిజాంపేట ,నేటి ధాత్రి

 

 

నిరుపేదలకు ఉచితంగా వైద్యం చేయాలని ఉద్దేశంతో జీవీకే ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ ఉమెన్స్ చైల్డ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిజాంపేట మండలం నస్కల్ లో ఏర్పాటు చేశారు. నిజాంపేట, రామాయంపేట ఉమ్మడి మండల కు సంబంధించి ఆర్ఎంపి పి.ఎం.పి యూనియన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వైద్య శిబిరాన్ని గ్రామస్తులు అధిక సంఖ్యలో వినియోగించుకున్నారు. బిపి, షుగర్, రక్త పరీక్షలు నిర్వహించి అలాగే ఉచిత మందులను అందించి ఆర్.ఎం.పి డాక్టర్లకు సిపిఆర్ గురించి వివరించారు.

బసవ దళ్ వారి ఉచిత హెల్త్ క్యాంపు.

బసవ దళ్ వారి ఉచిత హెల్త్ క్యాంపు ,రక్త దాన శిబిర కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

రాష్ట్రీయ బసవ దళ్ వారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శంకర్ పటేల్ గారి ఆహ్వానం మేరకు పట్టణం లోని బసవ మంటప్ లో జరిగిన ఉచిత హెల్త్ క్యాంపు ,రక్త దాన శిబిర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన శాసనసభ్యులు కోనింటి మాణిక్ రావు ఈ సంధర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అందరికీ ముందుగా బసవ జయంతి శుభాకాంక్షలు తెలిపారు, రక్త దానం చేయడం ఒక పుణ్య కార్యం అని ,బసవ జయంతి పురస్కరించుకొని రాష్ట్రీయ బసవ దళ్ వారు ప్రతి సంవత్సరం రక్త దాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయం అని అన్నారు,
అనంతరం రక్త దానం చేసిన వారికి సర్టిఫికెట్ ఇచ్చి అభినందించారు.ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ,ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం ,మాజి మున్సిపల్ వైస్ చైర్మన్ అశోక్ శేరి , సీనియర్ నాయకులు నామ రవికిరణ్,మాజి పట్టణ అధ్యక్షులు మొహియుద్దీన్,ఎస్సీ సెల్ నియోజవర్గ అధ్యక్షులు బండి మోహన్,మహిళ నాయకురాలు పద్మజ,తులసి దాస్ ,సందీప్ రాజ్ , నగేష్ ,రాష్ట్రీయ బసవ దళ్ తెలంగాణ అధ్యక్షులు శంకర్ పటేల్ ,రాష్ట్రీయ బసవ దళ్ డాక్టర్ శర్నప్ప ,వైద్యులు డాక్టర్ రాజ్ కుమార్,డాక్టర్ సచిన్ ,కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..

మూగజీవాల రోదన.. పట్టింపు ఎవరిది..

మూగజీవాల రోదన.. పట్టింపు ఎవరిది..

శిథిలావస్థలో రామాయంపేట పశు వైద్యశాల..

… బిక్కుబిక్కుమంటు కార్యాలయంలో కూర్చుంటున్న డాక్టర్లు..

రామాయంపేట ఏప్రిల్ 29 నేటి ధాత్రి(మెదక్)

 

మనుషులకు సమస్య వస్తే చెప్పుకోవడానికి మాటల ద్వారా చెప్పొచ్చు. కానీ మూగజీవాల రోదన ఎవరికి పట్టింపు అనే చందంగా మారింది రామాయంపేట పశు వైద్యశాల. ఉమ్మడి రామయంపేట మండలంలో ఎన్నో ఏళ్లుగా పశు వైద్యశాల ఉన్నది. చుట్టుపక్కల గ్రామాల గ్రామాల పశువులతో పాటు, గొర్రెల కాపరులు పశువులకు ఏవైనా వ్యాధులు సోకితే రామయంపేటకు వచ్చి వైద్యం చేయించుకొని వెళ్లేవారు. పశువైద్య డాక్టర్లు సైతం గ్రామాల్లో గాలికుంట, నట్టల నివారణ టీకాలు గ్రామాలకు వెళ్లి అందించేవారు. కానీ నేడు పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. ఒకవైపు శిథిలావస్థకు చేరి చెత్తాచెదారం నిండిపోయి రెండు మూడు గదులు నిరుపయోగంగా ఉంచారు.

 

Hospital

ఉన్న ఒక గదిలో పైసలు కందించి టీకాలతో పాటు మందులు ఉంచి పక్కనే ఒక కుర్చీ వేసుకొని కూర్చునే పరిస్థితి నెలకొంది. ఈ మధ్యకాలంలో కనీసం పశు వైద్యశాల ఉందనే విషయాన్ని సైతం మర్చిపోయే విధంగా తయారయింది. పశు వైద్య చికిత్సల కోసం వచ్చినవారు గంటల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఏ ఏ మందులు అందుబాటులో ఉన్నాయో లేవు అర్థం కాని పరిస్థితి దాపురించింది. ఇదిలా ఉండగా గతంలో గ్రామ గ్రామాన పశు వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి వ్యాధుల బారిన పడ్డ గొర్రెలు, మేకలు, పశువులకు వైద్యం చేసేవారు. కానీ ఇప్పుడు అలాంటి శిబిరాలు ఎక్కడ కూడా జరగడం లేదు. పశు జాతి తో పాటు గొర్రెలు మేకలు పెంపుడు కుక్కలు కనుమరుగవుతున్న తరుణంలో ఉన్న వాటిని ఏ వ్యాధులు సోఖకుండా కాపాడుకోవడానికి రైతులు తమ వంతు కృషి చేస్తున్న ఫలితం లేకుండా పోతుంది.

Hospital

 

పశువైద్యాధికారులు అందుబాటులో ఉండి వ్యాధులకు అవసరం ఉన్న మందులు సిద్ధంగా ఉంచితేనే ఏ వ్యాధులు వచ్చిన వాటిని నివారించుకొని వాటిని కాపాడుకోవడానికి ఉపయోగపడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు ప్రజలు కోరుతున్నారు. అలాగే వన్యప్రాణులు గాయపడ్డ, అస్వస్థతకు గురి అయిన సమయానికి వైద్యం అందడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఇటీవల తోనిగండ్ల గ్రామ శివారులో కృష్ణ జింకను ఊర కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులకు తెలుపగా వెటర్నరీ డాక్టర్ను తీసుకొని ఘటన స్థలానికి చేరుకునేలాగా ఆ కృష్ణ జింక్ అభివృద్ధి చెందింది. ఇదొకటే కాకుండా వన్య ప్లాన్లు గాయపడ్డ అశ్వసగురైన సకాలంలో చికిత్సలు అందిస్తే బాగుంటుందని ప్రజలు అంటున్నారు.

 

Hospital

 

అందుబాటులో ఉంటున్నాం.. కానీ భయం గుప్పెట్లో వెటర్ని ఏడి తిరుపతి..

మేము ఎల్లప్పుడూ ఆసుపత్రిలో అందుబాటులో ఉంటున్నాం. కానీ భవనం శిథిలావస్థకు చేరడంతో పక్కనే ఉన్న గోడౌన్ లో విధులు నిర్వహించడం జరుగుతుంది. శిథిలవస్తులు ఉన్న భవనం గురించి పై అధికారులకు తెలపడం జరిగింది. అలాగే పశువులతో పాటు అస్వస్థతలకు గురైన వన్యప్రాణులకు సరైన సమయంలో వైద్యం అందించడం జరుగుతుంది.

దాహార్తిని తీర్చడానికి చలివేద్రాలు అవసరం.

దాహార్తిని తీర్చడానికి చలివేద్రాలు అవసరం.

దుర్గా ఫర్టిలైజర్స్ ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

వేసవి కాలంలో ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రజలు,బాటసారుల దాహార్తిని తీర్చడానికి చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని గ్రామ పంచాయితీ కార్యదర్శి శ్రావణకుమారి అన్నారు.నర్సంపేట మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామంలో మంగళవారం దుర్గా ఫర్టిలైజర్స్ యజమాని వరంగంటి ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని గ్రామ పంచాయితీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేయగా పంచాయితీ కార్యదర్శి శ్రావణకుమారి దాత ప్రవీణ్ రెడ్డితో కలిసి ప్రారంభం చేశారు.

quench thirst.

ఈ సందర్భంగా కార్యదర్శి మాట్లాడుతూ అవసరానికి అనుగుణంగా నీటిని వృదా చేయకుండా వాడుకోవాలని సూచించారు.ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటుకు దుర్గా ఫర్టిలైజర్స్ యజమాని సహకరించడం అభినందనీయం అని పేర్కొన్నారు.గ్రామంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను ప్రజలు,బాటసారులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల సభ్యులు,మాజీ వార్డు సభ్యులు ఉప్పుల రాజు,గ్రామస్తులు భాసబోయిన రాజు,బయ్య నవీన్,రాజు,సయ్యద్ అజార్,ఉప్పుల రవి,శ్రీనివాస్, తిరుపతి రెడ్డి గ్రామ పంచాయితీ సిబ్బంది సుధాకర్,సురేందర్,ఎల్లయ్య,మహిళలు పాల్గొన్నారు.

పోషణ లోపం లేని సమాజాన్ని నిర్మిద్దాం.!

పోషణ లోపం లేని సమాజాన్ని నిర్మిద్దాం- 7 వ రాష్ట్రీయ పోషణ పక్షం

 

నడికూడ,నేటిధాత్రి:

స్వాతి సిడిపిఓ అధ్యక్షతన పరకాల ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో నడికూడ మండలంలోని నర్సక్కపల్లి గ్రామంలో జాతీయ పోషణ పక్షం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి
ముఖ్యఅతిథిగా జిల్లా సంక్షేమ అధికారి జెట్టి జయంతి హాజరై మాట్లాడుతూ అంగన్వాడి సెంటర్లో ముఖ్యంగా నిర్వహించే కార్యక్రమాలు మొదటిది ఆరోగ్య లక్ష్మి, రెండవది ప్రీస్కూల్,మూడోది లోపోషణతో బాధ పడే పిల్లల పోషణస్థితిని మెరుగుపరిచే విధంగా అంగన్వాడి టీచర్స్ పని చేయాలని సూచించారు. పోషణ పక్షంలో భాగంగా ఏప్రిల్ 8 నుండి 22 వరకు ప్రతి గ్రామంలో పోషణ కార్యక్రమాలు నిర్వహించి పోషణ లోపం లేని సమాజం నిర్మించేలా కృషి చేయాలన్నారు.గర్భిణీలు, బాలింతలు అంగన్వాడి కేంద్రాల ద్వారా అందించే ఒక్కపూట భోజనం సద్వినియోగం చేసుకోవాలి, పౌష్టిక ఆహారం తీసుకుంటేనే పుట్టే పిల్లలు ఆరోగ్యవంతంగా పుడతారన్నారు.ఈ కార్యక్రమంలో గర్భిణీ స్త్రీల కు శ్రీమంతాలు,6 నెలలు నిండిన పిల్లలకి అన్నప్రాసనలు,అంగన్వాడి పూర్వ ప్రాథమిక విద్యను పూర్తి చేసుకున్న
చిన్నారులకు గ్రాడ్యుయేషన్
డే,చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పరకాల తహసిల్దార్ టి. విజయలక్ష్మి,నడికూడ తహసిల్దార్ నాగరాజు, నడి కూడ మండల వైద్యాధికారి కే దివ్య,ఎంపీడీవో నడికూడ విమల,సఖి అడ్మిన్ హైమావతి,పోషణ అభియాన్ డిస్టిక్ కోఆర్డినేటర్ సుమల డిహెచ్ఈడబ్ల్యు కోఆర్డినేటర్ కళ్యాణి,ఐసిడిఎస్ సూపర్వైజర్లు శ్రీదేవి, హేమలత,పుణ్యవతి,రోజా రాణి,మంజుల,సునీత,రాణి, నజీమ,పర్వీన్,ఉమాదేవి, పోషణ అభియాన్ బ్లాక్ కోఆర్డినేటర్ బిక్షపతి,జిల్లా బాలల పరిరక్షణ విభాగం విజయకుమార్,అంగన్వాడీ టీచర్స్,ఆశ వర్కర్స్,గర్భిణీ స్త్రీలు,పిల్లలు మొదలగు వారు పాల్గొన్నారు.

వేసవి ఆరోగ్యానికి మేలు చేసే తాటి ముంజలు.

వేసవి ఆరోగ్యానికి మేలు చేసే తాటి ముంజలు

ఉపాధి కోసం తాటి ముంజల వ్యాపారం

ప్రయోజనాలతో పాటు రుచిని ఆస్వాదించండి

అంతర్గాం గీతా కార్మికులు

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

 

కాలానుగుణంగా వేసవిలో దొరికే తాటి ముంజలను చిన్న పెద్ద తేడా లేకుండా ఎంతో ఇష్టంగా తింటూ వాటి రుచిని ఆస్వాదిస్తారు.సోమవారం అంతర్గాం మండలం బ్రాహ్మణపల్లి గ్రామం నుండి గౌడ సామాజిక వర్గానికి చెందిన కైలాసం,సది అనే ఇరువురు తాటి ముంజలు వ్యాపారం చేస్తూ జిల్లా కేంద్రంలో నేటి ధాత్రి కెమెరాకి కనిపించారు.ఈ సందర్భంగా వారు ఇరువురు మాట్లాడుతూ ఆరోగ్యానికి మేలు చేసే తాటి ముంజలు వేసవిలో లభిస్తాయన్నారు.తాటి ముంజలు ఎంతో ప్రత్యేకమైనవి వీటిని పిల్లలు,పెద్దలు వయసుతో సంబంధం లేకుండా అందరూ ఎంతో ఇష్టంగా తింటారని పేర్కొన్నారు.గీతా కార్మికులైన వారు ఇరువురు పల్లెటూరు నుండి పట్టణ ప్రజల అందుబాటులోకి ముంజలను తీసుకువచ్చి అమ్ముతూ
ఉపాధి పొందుతున్నామన్నారు.తాటి ముంజల యొక్క ప్రయోజనాలను వారి మాటల్లో వివరించారు.తాటి ముంజలలో వేసవి వేడిలో శరీరానికి కావలసిన ఏ,బి,సి విటమిన్లు, ఐరన్,జింక్,ఫాస్ఫరస్, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా దొరుకుతాయని నిపుణులు చెబుతుంటారని చెప్పారు.తాటి ముంజలు మన శరీర బరువు తగ్గడానికి ఎంతగానో దోహదం చేస్తాయని,కాలేయ సంబంధిత సమస్యలను తగ్గిస్తాయని, అధిక మొత్తంలో ఉండే పొటాషియం మన శరీరంలో ఉండే విష పదార్థాలను తొలగిస్తాయని వైద్యులు చెబుతుంటే విన్నామని తెలిపారు.

నీళ్ల కోసం రోడ్డెక్కిన కార్మికుల కుటుంబాలు.

నీళ్ల కోసం రోడ్డెక్కిన కార్మికుల కుటుంబాలు

రోడ్డు దిగ్బంధం,రోడ్డుపై బైఠాయించి ధర్నా

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

మంచిర్యాల జిల్లా తాండూరు మండలం మాదారం టౌన్షిప్ లో గత కొన్ని రోజుల నుండి నీటి సమస్యతో కార్మిక కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.నీటి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన సమస్యను పట్టించుకోకపోవడం వల్ల బుధవారం గోలేటి నాలుగు స్తంభాల చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు.మూడు రోజులలో నీటి సమస్య పరిష్కారం చేయకపోతే జిఎం కార్యాలయం ముందు వంటావార్పు కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. కార్మిక కుటుంబాలు ధర్నా చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న ఎస్ఓటు జిఎం రాయమల్లు,సివిల్ డివై జిఎం భాష సింగరేణి అధికారులు రెండు రోజులలో నీటి సమస్య పరిష్కరిస్తామని కార్మిక కుటుంబాలకు హామీ ఇచ్చారు.

ప్రజాసేవయే నా జీవిత ఆశయం…

ప్రజాసేవయే నా జీవిత ఆశయం…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండలం మండపల్లి గ్రామానికి చెందిన డాక్టర్ బి.ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకుల నక్క రవిపై.ప్రత్యేక కథనం. ఈ సందర్భంగా వారి మాటల్లోనే తాను చిన్నతనంలో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో ఒక ప్రముఖ వైద్యులు దగ్గర వైద్యం నేర్చుకొని ఎలాగైనా పల్లెటూరు ప్రజలకు వైద్య సేవలు అందించాలని నిశ్చయంతో ఊరిలో ప్రాక్టీసు ప్రారంభించానని తద్వారా ఏ రాత్రి అయిన గ్రామ ప్రజలకు గాని చుట్టుపక్కల ప్రజలకు గాని అత్యవసరమైన సమయంలో వైద్య సేవలు అందించడం నా పూర్వజన్మ సుకృత ముగ భావిస్తునని ఇలా ప్రజలకు ప్రథమ చికిత్స చేసి అత్యవసర సమయంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ప్రక్రియ చేసి మెరుగైన వైద్యం కొరకు ప్రజలకు ముందుగాసేవ చేసే అదృష్టం ఆ దేవుడు నాకు కల్పించడానికి అదృష్టంగా భావిస్తున్నాను తెలియజేస్తూ అలాగే నాపై ఉన్న అభిమానంతో నేను గ్రామీణ ప్రజలకుచేస్తున్న సేవలను గుర్తించి ప్రజలు నాపై నమ్మకంతో రాజకీయాలకు రావాలని ఆహ్వానించడం మాజీ మంత్రి కేటీ రామారావు ప్రత్యేక ఆహ్వానంతో రాజకీయాలకు వచ్చి ప్రజలకు ప్రతి సమయంలో ఏ సమస్య వచ్చినా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి రాజకీయ నాయకులతో సంప్రదింపులు జరిపి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానని ఇటువంటి అదృష్టం ఈ జన్మ కి.దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను తెలియజేస్తూ ఇట్టి మంచి అవకాశాన్ని దేవుడు నాకు ప్రజలకు సేవ చేసే అదృష్టాన్ని ప్రతి ప్రాదించడాన్ని నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని ఇంతకంటే అదృష్టం దేవుడు ఇవ్వడం అలాగే గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఇకముందు కూడా ప్రజలకు రాజకీయం గాని వైద్య వృత్తిలో గాని ప్రజలందరికీ అందుబాటులో ఉంటారని వారికి ఎల్లవేళలా వైద్యపరంగా రాజకీయపరంగా కృషి చేస్తాననిఈ సందర్భంగా తెలియజేశారు దయచేసి ఏమైనా పొరపాట్లు ఉన్నచో గ్రామ ప్రజలు రాజకీయ నాయకులు దయచేసి పెద్ద మనసుతో మన్నించాలని ఈ సందర్భంగా తెలియజేశారు

ఎండలకు భయపడి బయటకు రాని ప్రజలు.

భానుడి…… భగభగ.

#సుర్రు మనిపిస్తున్న సూరీడు.

#ఎండలకు భయపడి బయటకు రాని ప్రజలు.

#నిర్మానుషమైన ప్రధాన రహదారులు.

#41డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు.

#వేసవిలో జాగ్రత్తలు పాటించాలని వైద్యుల సూచన.

 

the heat waves

నల్లబెల్లి, నేటి ధాత్రి:

సూరీడు సుర్రుమంటున్నాడు ఉక్క పోత చికాకు పుట్టిస్తుంది వడగాల్పులు వెంటాడుతున్నాయి. వేసవిలో ఎండలు దంచి కొట్టడంతో రహదారులన్నీ నిప్పుల కుంపటిగా మారిపోయి నిర్మానుషంగా కనిపిస్తున్నాయి కొద్ది రోజులుగా సుమారు 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో ఉదయం 8 గంటల నుండి ఇంటి నుండి బయటకు రావడానికి జనం జంకుతున్నారు తప్పని పరిస్థితుల్లో ఉద్యోగులు, ఉపాధి కూలీలు, కార్మికులు వడదెబ్బ తగలకుండా పలు జాగ్రత్తలు తీసుకొని నిర్దిష్ట సమయానికే పని ముగించుకుని ఇండ్లలోకి చేరుకుంటున్నారు ఏప్రిల్ మాసంలోనే ఎండ తీవ్రత ఇలా ఉంటే మే నెలలో మరింత ఉష్ణోగ్రతలు పెరగడం ఖాయమని పలువురు వాపోతున్నారు గత వారం రోజులుగా మండలంలో 41డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం గమనర్వం ఈ అధిక వేడిని తట్టుకోలేక మనుషులతో పాటు పశుపక్షాలు సైతం తల్లాడిల్లుతున్నాయి చెరువులలో, కుంటలలో తగినంత నీరు నిల్వ లేకపోవడంతో మూగజీవాల సైతం మృత్యువాత పడుతున్నాయి మిట్ట మధ్యాహ్నం వేళ ఎండ తీవ్రత మరింత ఎక్కువ కావడంతో ప్రజలు ఏ మాత్రం అజాగ్రత్త వహించిన అనారోగ్యం బారిన పడతారని కావున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు, వాతావరణ శాఖ అధికారులు సూచించడంతో ప్రజలు బయటకు రావడం లేదు మధ్యాహ్నం12 నుండి సాయంత్రం4 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువ ఉండడంతో వాహనాల రాకపోకలు లేకపోవడం వల్ల ప్రధాన రహదారులన్నీ నిర్మానుషంగా మారిపోయాయి రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడం వల్ల మండల ప్రజలు ఉక్కపోత నుండి ఉపశమనం పొందేందుకు పలు రకాల మార్గాలను అన్వేషిస్తున్నారు అందులో భాగంగా ఎయిర్ కండిషన్, కూలర్ల లాంటి వాటిని ఇంటి లోపల సమకూర్చుకుంటున్నారు ఉపాధి హామీ కూలీ పథకానికి వెళ్లే కూలీలు ఉదయం తెల్లవారుజామునే పనికి వెళ్లి 11 గంటల సమయంలోపే పని ముగించుకుని ఇండ్లకు చేరుకొని నిమ్మరసం, మజ్జిగ లాంటి ద్రవ పదార్థాలను సేవించి సేద తీరుతున్నారు రైతులు అరకొర వ్యవసాయ పనులు ఉండడం వల్ల ఉదయాన్నే పనులను ముగించుకుంటున్నారు వాహనాదారులు రాకపోకల సమయంలో వేసవి తాపాన్ని తట్టుకునేందుకు పండ్ల రసాలు, శీతల పానీయాలు, కూల్ డ్రింక్స్ , కొబ్బరి బోండాలు, వాటర్ మిలన్,మజ్జిగ లాంటి వాటిని సేవించి ఎండ ఎద్దడినుండి ఉపశమనం పొందుతున్నారు.

#వేసవిలో తగు జాగ్రత్తలు పాటించాలి…

#డాక్టర్ ఆచార్య వైద్యాధికారి . నల్లబెల్లి.

ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంవల్ల అత్యవసరమైతే తప్ప ఎవరు బయటకు రావద్దు ఎండలో తిరిగే వారికి వేడి గాలులు వీచే సమయంలో డిహైడ్రేషన్ తో పాటు, వడదెబ్బకు గురయ్యే అవకాశాలు ఉంటాయి వడదెబ్బ బారిన పడినవారు ఆకలిని, శక్తిని కోల్పోయి బలహీనపడి సొమ్మ సీలి పడిపోతారు. ముఖ్యంగా వేసవిలో వృద్ధులు, పిల్లలు ఎండ వేడిమిని తట్టుకోలేరు కావున వేసవి నుండి ఉపశమనం పొందుటకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి తప్పని పరిస్థితుల్లో ఎండలో తిరిగేవారు తప్పనిసరిగా గొడుగు, టోపీ, తలపాగా ధరించాలి ఈ వేసవిలో ప్రతి ఒక్కరు వేసవి జాగ్రత్తలు పాటించాలి.

చలివేంద్రం ప్రారంభోత్సవం

చలివేంద్రం ప్రారంభోత్సవం

మాజీ కౌన్సిలర్ కొమురెల్లి అనిత సుధాకర్ రెడ్డి

నాగారం నేటి ధాత్రి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా

నాగారం మున్సిపాలిటీ ఎస్వి నగర్ ప్రధాన రహదారి రోడ్ నెంబర్ – 1 వద్ద శ్రీ సాయి గ్రాండ్ మినీ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ అధినేత శ్రీ ఎనిశెట్టి చంద్రమౌళి గుప్తా గారు ఏర్పాటు చేసిన చలివేంద్రం (వాటర్ ఫ్రీజర్)ను స్థానిక మాజీ కౌన్సిలర్ కోమిరెల్లి అనిత సుధాకర్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించినారు ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రతి వేసవి కాలంలో క్రమం తప్పకుండ బాటసారుల దాహర్తిని దృష్టిలో పెట్టుకొని కుల మతాలకు అతీతంగా చల్లని తాగునీటిని అందించాలని చల్లని ఫ్రీజ్ వాటర్ ఏర్పాటు చేసిన ఎనిశెట్టి చంద్రమౌళి గుప్తా గారి సేవలు ఎంతో అభినందనీయం అని పేర్కొన్నారు కార్యక్రమంలో కోమిరెల్లి సుధాకర్ రెడ్డి,మోకు జగన్ మోహన్ రెడ్డి,కొత్త గోపాల్ రెడ్డి,మామిడి నవీన్ రెడ్డి,పైళ్ల మల్లా రెడ్డి,సారా బాల్ రాజ్, కోమిరెల్లి వీరారెడ్డి,ఉచిడి అంజన్ రెడ్డి,ఏనుగు రమణ రెడ్డి, పండగ నర్సింహా,మర్రి లక్ష్మా రెడ్డి,మోడల నర్సింహా,ఈశ్వర్,గుమ్మడి వేణు,భాష తదితరులు పాల్గొన్నారు.

తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు.! 

తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి- ఎంపీడీవో. 

రామడుగు, నేటిధాత్రి:

 

వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని కరీంనగర్ జిల్లా రామడుగు మండల ఎంపీడీవో రాజేశ్వరి అన్నారు. రామడుగు మండల కేంద్రంలో ఆమె మిషన్ భగీరథ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎంపిడిఓ మాట్లాడుతూ తాగునీటి సమస్య ఉంటే గుర్తించి వెంటనే తగిన పరిష్కారం చూపాలని సూచించారు. ఈకార్యక్రమంలో డిఈ అజీముద్దీన్, ఏఈ షారోన్, ఎంపిఓ శ్రావణ్ కుమార్, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.

వడ దెబ్బతో వ్యవసాయ కూలీ మృతి..

వడ దెబ్బతో వ్యవసాయ కూలీ మృతి

పరకాల నేటిధాత్రి

పరకాల మున్సిపాలిటీ విలీన గ్రామం సీతారాంపురంకు చెందిన కుసుంబ మోతే రావు రోజువారి కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు.రోజువారి లాగే ఏప్రిల్ 8న కూలి పనికి వెళ్తూ వడదెబ్బ తాకడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు.కుటుంబ యజమాని మరణించడంతో శోకసముద్రంలో మునిగిపోయారు.మోతే రావుకు భార్య కుమారుడు కూతురు ఉన్నారు.

వైద్య సిబ్బందికి ఘన సన్మానం.

వైద్య సిబ్బందికి ఘన సన్మానం

రామడుగు, నేటిధాత్రి:

 

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సోమవారం భారత రాష్ట్ర సమితి యూత్ రామడుగు మండల ఉపాధ్యక్షులు బుదారపు కార్తీక్ ఆధ్వర్యంలో గోపాలరావుపేట గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య రంగ నిపుణులకు ఘన సన్మానం చేయడం జరిగింది. ఈసందర్భంగా బుదారపు కార్తీక్ మాట్లాడుతూ ప్రజలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, క్రమం తప్పకుండా వ్యాయామ వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుద్ధత పాటించాలని డాక్టర్ల సూచనలేని అనవసరమైన మందులను ఎట్టి పరిస్థితుల్లో వాడ రాదని తమ ఆరోగ్యాల పట్ల ఎవరికి వారు శ్రద్ధ వహించాలని కోరారు. ఈసందర్భంగా ప్రజల కోసం నిరంతరం పాటుపడుతున్న వైద్య సిబ్బందిని సన్మానిస్తూ అభినందనలు తెలియజేశారు. ఈకార్యక్రమంలో వైద్యాధికారి వెంకట గ్రీష్మన్య, వెంకటేశ్వర్లు, కొలిపాక కమలాకర్, స్వామి, పురాణం రమేష్, తిరుపతి, నరేందర్, శ్రీధర్, కొమురయ్య, శివశంకర్, నాగరాజు, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

నెక్కొండలో లక్క పురుగుల నుండి కాపాడండి….!

నెక్కొండలో లక్క పురుగుల నుండి కాపాడండి….!

దయచేసి అధికారులు విలేకరులు పట్టించుకోండి

వాట్సాప్ గ్రూపులలో కొందరు వ్యక్తులు పోస్ట్ లు

తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న నెక్కొండ మరియు చుట్టుపక్క గ్రామ ప్రజలు…

#నెక్కొండ, నేటి ధాత్రి:

 

నెక్కొండ మండల కేంద్రంగా రైల్వే స్టేషన్ సమీపంలో ఏర్పాటుచేసిన గోధుమల వల్ల మరియు వ్యవసాయ మార్కెట్ యాడ్ లో ఏర్పాటు చేసిన గోధుమల వల్ల ఏర్పడిన లక్క పురుగుల ద్వారా ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని నెక్కొండ మండలానికి చెందిన వాట్సప్ గ్రూపులలో కొందరు వ్యక్తులు లక్క పురుగుల నుండి నెక్కొండ గ్రామం తో పాటు గుండ్రపల్లి,అమీన్ పేట్, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఎలాగైనా అధికారులు మరియు విలేకరులు చొరవ తీసుకొని ఈ విషయం పట్ల స్పందించి లక్క పురుగుల నుండి తమను కాపాడాలని కోరుతూ మెసేజ్ చేయడం గమనార్థం.

నెక్కొండ మండలంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసిన భారీ గోదాంల సముదాయంతో పాటు నెక్కొండ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన గోదాముల వల్ల నెక్కొండ లో నివాసముంటున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నెక్కొండ నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం కావడంతో ఎక్కువగా వాహనదారులు లక్క పురుగుల ద్వారా ప్రమాదాలకు గురి కావడంతో పాటు చెవి, ముక్కు, కను రెప్పల మద్దెలపడడంతో వాహనదారులు ఇబ్బంది పడటం పాటు అనారోగ్యానికి గురవుతున్నారు, అంతేకాక నెక్కొండ స్థానికంగా జీవించే ప్రజలు చర్మవ్యాధులతో పాటు కళ్ళ మంటలతో మరి చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారని వెంటనే అధికారులు అప్రమత్తమై సంబంధిత గోదాములను తనిఖీలు చేసి నివారణ చర్యలు చేపట్టి నెక్కొండ ప్రజలను రక్షించాలంటూ పలువురు నెక్కొండ నివాసులు అభిప్రాయపడుతున్నారు.

మండే ఎండలు….. పదిలం ప్రాణాలు.

మండే ఎండలు….. పదిలం ప్రాణాలు

కొన్నేళ్లుగా భయపేడు తున్న వేసవి ఎండల తీవ్రత

ఏప్రిల్ ,మే నెలలో మండే సూర్యుడి భగభగలు తెలిసిందే

ఈ ఏడాది మరింత ఎక్కువగా ఉండొచ్చని అంచనాలు

శాయంపేట నేటిధాత్రి:

 

ఈ సంవత్సరం ఎండలు బాగానే మండుతున్నాయి రానున్న రోజుల్లో వడదెబ్బ ప్రమాదం పొంచి ఉన్నట్లు వాతావరణ అధికారులు చెబుతున్నారు. ఇలాంట ప్పుడు ఎండల్లో బయటకు వెళ్లేవారు ముఖ్యంగా చిన్నపిల్లలు వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు ఇప్పటికి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో రానున్న రోజుల్లో మరింత ఎండ వేడి పెరిగే ప్రమాదం ఉంది వేసవికాలం కావడంతో పిల్లలు బయటికి ఆడుకోవ డానికి వెళ్తుంటారు అలాంట ప్పుడు పిల్లలు ఎండ తీవ్రతకు బయటికి రాకుండా ఉండ డానికి తగు జాగ్రత్తలు తీసు కోవాలని చెబుతున్నారు. మామూలుగా నలభై డిగ్రీల ఉష్ణోగ్రతలు వల్ల వడగాల్పులు వస్తుంటాయి దీనివల్ల శరీరంపై ఉన్న శ్వేతా రంధ్రాలు మూసుకుపోయి శరీరంలోని వేడి చెమట బయటకు రాకుండా ఉండిపోతుంది దీంతో శరీరంలో ఎండ తీవ్రత ఎక్కువగా అయ్యి అస్వస్థతకు గురవుతారు. స్పృహ కోల్పో వడం వంటి జరుగుతుంది . నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది అలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే ప్రాథమిక చికిత్స అవసరం చిన్నపిల్లల్లో ఈ విషయంలో మరింత జాగ్రత్త వహించాలి.

గర్భిణీ స్త్రీలకు, పసిపిల్లలకు ఇంజక్షన్స్.

గర్భిణీ స్త్రీలకు, పసిపిల్లలకు ఇంజక్షన్స్.
• అంగన్వాడీ లో పౌష్టిక ఆహారం
• ఏఎన్ఎం రేణుక
నిజాంపేట: నేటి ధాత్రి

 

గర్భిణీ స్త్రీలకు, పసి పిల్లలకు నెలవారి ఇంజక్షన్స్ ప్రతి నెల ఇవ్వడం జరుగుతుందని ఏఎన్ఎం రేణుక అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో గల అంగన్వాడి కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు, పసి పిల్లలకు నెలవారి ఇంజక్షన్స్ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం గర్భిణీ స్త్రీలకు, పసి పిల్లలకు పౌష్టికాహారాన్ని అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తుందని గర్భిణీ స్త్రీలు ప్రతి ఒక్కరు పౌష్టిక ఆహారాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ జ్యోతి, సిస్టర్ గౌరీ, గర్భిణీ స్త్రీలు పసుపిల్లలు ఉన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న.!

ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలి.

పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి

బెల్లంపల్లి నేటిధాత్రి:

 

సరైన వైద్య నిపుణులను నియమించాలి

బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలోని సమస్యలను పరిష్కరించాలని సరైన వైద్య నిపుణులను నియమించాలని యంసిపిఐ(యు) పార్టీ జిల్లా కార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్ జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ జోడించండి కిరణ్ కుమారి కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి ఉందని, పేరుకే 100 పడకల ఆసుపత్రి అని నాతో పాటు తెలంగాణ వైద్య విధాన పరిషత్ దీనిని వంద పడకల ఆసుపత్రిగా గుర్తించలేదని, 30 పడకల ఆసుపత్రికి పరిమితమైందని, బడ్జెట్ విషయంలోనూ అదే విధంగా ఉందని, స్పెషలిస్టు డాక్టర్లు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, జనరల్ ఫిజీషియన్ కూడా లేరని, సరైన డాక్టర్లు,వైద్య పరికరాలు లేక జబ్బులతో వచ్చిన రోగులను మంచిర్యాలకు పంపిస్తున్నారని, ఆస్పత్రిలో అడ్మిట్ అయిన రోగులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించడం లేదని, తీవ్రమైన సిబ్బంది కొరత ఉందని, పలుమార్లు సమస్యలను పరిష్కరించాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేదని, ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే స్పందించి ఈ 30 పడక ల ఆసుపత్రిగా కొనసాగుతున్న ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా మార్చే విధంగా చర్యలు తీసుకొని బడ్జెట్ను ఇప్పించాలని, ఆసుపత్రికి సరిపోయే సిబ్బందిని, స్పెషలిస్ట్ డాక్టర్లను అందుబాటులో ఉంచి నాణ్యమైన వైద్యాన్ని అందించాలని,24/7 గంటలు ఎమర్జెన్సీ సేవలను కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని,టెక్నీషియన్ లను అందుబాటులో ఉంచాలని, మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని, మరొక గైనకాలజిస్ట్ డాక్టర్ ను నియమించి ప్రతిరోజు గర్భిణీ స్త్రీలకు పరీక్షలు నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేయాలని, ఎప్పటికప్పుడు మీటింగ్లు ఏర్పాటు చేస్తూ ఆసుపత్రి సమస్యలను తెలుసుకుంటూ ఉండాలని, వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సురేష్,తేజ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version