గీత కార్మికుడికి తీవ్రంగా గాయాలు.

గీత కార్మికుడికి తీవ్రంగా గాయాలు

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండల కేంద్రానికి చెందిన గడ్డమీది వెంకటేశ్వర్లు అనే గీతా కార్మికుడు ప్రమాదవశాత్తు తాటి చెట్టు మీది నుంచి జారి కింద పడగా తోటి కార్మికులు చూసి మండల కేంద్రంలోని ప్రైవేట్ హాస్పటల్ కు తరలించగా గాయాలు పరిస్థితి తీవ్రంగా ఉండడం వలన వరంగల్ జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చడం జరిగింది

పేద ప్రజలను దోచుకుంటున్న మెడికల్ షాపు యజమానులు.

పేద ప్రజలను దోచుకుంటున్న మెడికల్ షాపు యజమానులు..!

◆ నిషేధిత మందులు అంటగడుతున్న వైనం

◆ వందల నుంచి వెయ్యిలో దోపిడీ

◆ పట్టించుకోని సంబంధిత అధికారులు

◆ చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలు

జహీరాబాద్. నేటి ధాత్రి:

Medical shop owners are looting poor people.

జహీరాబాద్ నియోజకవర్గంలో, ముఖ్యంగా జహీరాబాద్ పట్టణంలో ఆయా మండలాల మెడికల్ షాపుల నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. వ్యాపారం పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. నాణ్యతలేని మందులను విక్రయిస్తూ అధిక లాభాలను ఆర్జించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనిపై జిల్లా ద్రగీ అధికారులు పట్టించుకునే స్థితిలో లేరు. నిర్లక్ష్య ధోరణితో అనేక మెడికల్ షాపులు నిబంధనలను అతిక్రమించి నిషేధిత మందులు సైతం విక్రయిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం నిషేధించిన మందులు, అబార్షన్ కిట్ లు గుట్టుచప్పుడు కాకుండా అమ్ముతున్నారు. మెడికల్ షాపుల నిర్వహణ పూర్తిగా వా ణిజ్యపరంగా మారింది. ప్రజల ఆరోగ్యాన్ని పక్కనపెట్టి, ఏది ఎక్కువ లాభం తెస్తుందో ఆ మందులను రోగులకు అందిస్తున్నారు. ఏది అందుబాటులో ఉంటే అది ఇచ్చే పరిస్థితి ఏర్పడింది. నిషేధిత మందులు సైతం గుట్టుచ ప్పుడు కాకుండా విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయినప్పటికీ సంబందిత అధికారులు స్పందించక పోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జహీరాబాద్ లో కొన్ని ఏజెన్సీలు కూడా నిలువు దోపిడి చేస్తున్నారు. జిల్లాలో డ్రగ్ ఇన్స్ పెక్టర్ ఉన్నా, మెడికల్ షాపులను తనిఖీ చేసిన దాఖలాలు కని పించడం లేదు. తనిఖీలకు భయపడాల్సిన మెడికల్ షాపుల యజమానులు ఇప్పుడు మరింత రెచ్చిపోతున్నారు. మందుల సర ఫరాలో పారదర్శకత లేక పోవడం, నాణ్యత లేని ఔషధాలను విక్రయించడాన్ని నియంత్రించాల్సిన అధికారులే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ప్రజల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం పడుతుంది ప్రజలు వాపోతున్నారు.

ప్రసూతి దావకాన మీద పట్టింపేది.

ప్రసూతి దావకాన మీద పట్టింపేది

#చెట్ల తీగలతో ముసురుకున్న ఆసుపత్రి

#శిధిల వ్యవస్థకు దగ్గరగా వెల్నెస్ సెంటర్

#పాములకు పక్షులకు నివాసంగా!

#భయభ్రాంతులకు గురవుతున్న రోగులు

#కానరాని అధికారులు

హనుమకొండ జిల్లా, నేటిధాత్రి (మెడికల్):

 

హనుమకొండలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి లోని వెల్నెస్ సెంటర్ భవనం చుట్టుప్రక్కల పిచ్చి మొక్కలు పెరగడంతో ఆసుపత్రి ప్రాంగణం మొత్తం చెట్లతీగలతో ముసురుకుంది.

అసలు ఇక్కడ వెల్నెస్ సెంటర్ ఉందా లేదా అనే భావన కలుగుతుంది.

వెల్ నెస్ సెంటర్ కి రోజుకి కనీసం వందకు మంది పైగా ప్రభుత్వ ఉద్యోగులు మరియు పత్రిక పాత్రికేయులు వస్తుంటారు అదేవిధంగా వెల్నెస్ సెంటర్ భవనం మొదటి అంతస్తుకి గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లలు టీకాలు తీసుకోవడానికి వస్తుంటారు,వెల్నెస్ సెంటర్ భవనానికి చుట్టుపక్కల పిచ్చి చెట్లు పెరిగి తీగలు పారి మొదటి అంతస్తులోకి విస్తరించడంతో వాటి నుండి పాములు కీటకాలు వచ్చే అవకాశం ఉండడంతో రోగులు మరియు సిబ్బంది భయభ్రాంతులకు గురవుతున్నారు.

ఆరోగ్య సమస్య వస్తే హాస్పిటల్ కి రావాలి కానీ హాస్పిటల్ కి వస్తేనే సమస్య ఎదురయ్యేలా ఉంది ఇక్కడి పరిస్థితి ఇదిలా ఉంటే గర్భిణీలు ప్రసూతి కోసం చుట్టుపక్కల జిల్లాలైన కరీంనగర్, ఖమ్మం ప్రాంతాల నుండి ఆసుపత్రి కి వస్తుంటారు, రోజుకు వందకు మందికి పైగా అవుట్ పేషెంట్స్ వస్తుంటారు వందకు మంది పైగా ఇన్ పేషెంట్స్ అడ్మిట్ అవుతారు, అందులో 30 నుండి 50 ప్రసవాలు జరుగుతాయి.

Hospital

 

ఆసుపత్రిలో డాక్టర్లు మరియు సిబ్బంది తక్కువగా ఉండడంతో రోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ప్రభుత్య ఆసుపత్రి అంటేనే రోగులు జంకుతున్నారు మెరుగైన వైద్యం అందడం లేదనీ రోగుల బంధువులు అంటున్నారు,ఆసుపత్రిలో బెడ్స్ కూడా తక్కువగా ఉన్నాయని దీనికి తోడు ఆసుపత్రి గోడల చుట్టూ చెట్ల తీగలతోభయంకరమైన చెట్ల తీగలతో ఉండటంతో రోగులు భయభ్రాంతులకు గురవుతున్నామని ఇలాంటి సంఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని రోగులు కోరుకుంటున్నారు.

ఇదిలా ఈ సమస్యపై అధికారులకు సమాచారం అందించిన కూడా ప్రభుత్వ దావఖాన పట్టింతే లేకుండా పోయిందని రోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

వైద్య ఖర్చుల నిమిత్తం L.O.C మంజూరు.

వైద్య ఖర్చుల నిమిత్తం ఎల్. ఓ. సి మంజూరు

– ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కేకే మహేందర్ రెడ్డి, వెలుముల స్వరూప తిరుపతిరెడ్డి కృషితో

సిరిసిల్ల టౌన్(నేటి ధాత్రి):

 

సిరిసిల్లలోని స్థానిక పోచమ వీధి లో నివాసం ఉంటున్న పెంటమ్ కవిత భర్త నర్సింగ్ అనారోగ్యరిత్య నిమ్స్ లో చేర్చడం జరిగింది. వారియొక్క అనారోగ్య పరిస్థితిని సిరిసిల్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ వెలుముల స్వరూప తిరుపతి రెడ్డి దృష్టికి తీసుకవెళ్లారు. వారు వెంటనే స్పందించి వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన ఆది శ్రీనివాస్ నిమ్స్ లో వైద్యఖర్చుల నిమిత్తం 2,50,000 రూపాయిల ఎల్. ఓ. సి ని మంజూరు చెయ్యడం జరిగిందని తెలిపారు. 2,50,000 రూపాయలు ఎల్. ఓ. సి ని మంజూరు చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి, సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డికి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వెల్ముల స్వరూప తిరుపతి రెడ్డికి పెంటమ్ కవిత భర్త నర్సింగ్ కృతజ్ఞతలు తెలిపారు.

తీవ్ర ఎండతో పడిపోయిన ఉపాధి హామీ కూలీకి.

తీవ్ర ఎండతో పడిపోయిన ఉపాధి హామీ కూలీకి మెరుగైన వైద్యం అందించాలి- కొయ్యడ సృజన్ కుమార్

కరీంనగర్, నేటిధాత్రి:

 

తీవ్ర ఎండతో ఉపాధి హామీ పనులకు వెళ్లి పడిపోయిన సిరిసిల్ల గణపతికి మెరుగైన వైద్యం అందించి వారికీ ఆర్ధిక సహాయం అందించి వారి కుటుంబాన్ని ఆడుకోవాలని బికెయంయు రాష్ట్ర కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్ డిమాండ్ చేశారు.

శనివారం తీవ్ర ఎండతో పడిపోయిన గణపతిని 108 వాహనంలో కరీంనగర్ ప్రభుత్వ అస్పత్రిలో చేర్చగా వారిని పరమార్శించి ఆరోగ్య పరిస్థితులు తెలుసుకున్నారు.

ఈసందర్బంగా సృజన్ కుమార్ మాట్లాడుతూ శంకరపట్నం మండలం చింతలపల్లి గ్రామంలో రోజులాగే ఉపాధి హామీ పనికి వెళ్లిన కార్మికులు పని ప్రదేశం గట్టిగా ఉండడం వల్ల ముందు రోజే ఆప్రదేశంలో నీటితో తడిపి శుక్రవారం రోజున పనికి వెళ్లగా ఎండ తీవ్రంగా ఉండడం వల్ల నీటితో పని ప్రదేశాన్ని తడిపిన చెట్ల పొదలు ఎంత తీసిన రాకపోయే సరికి ఇంటికి వెళ్లి గడ్డపార తీసుకు రావడానికి వెళ్ళుతుండగా ఎండ ఎక్కువ ఉండడంతో అక్కడే కల్లు తిరిగి పడిపోవడంతో 108కు ఫోన్ చేయగా అంబులెన్సు వచ్చి కరీంనగర్ ప్రభుత్వ అస్పత్రిలో చేర్చారని, ఇప్పటికి సంబంధిత అధికారులు అస్పత్రికి రాలేదని, పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉపాధి హామీ కూలికి ప్రమాదం జరిగిన ఇప్పటివరకు అధికారులు బాధితున్ని పరమార్శించకపోవడం బాధ్యత రహిత్యమని, ఆగ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ లేకపోవడం అధికారుల పనితీరుకు నిదర్శనం అని వేంటనే ఉపాధి హామీ అధికారులు స్పందించి వారికీ మెరుగైన వైద్యం అందించాలని, వారి కుటుంబాన్ని ఆర్ధికంగా ఆడుకోవాలని అన్నారు, ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని పని ప్రదేశాల్లో మంచినీటి సౌకర్యం, నీడ సౌకర్యం తో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్స్ పంపిణి చేయాలని, ఎండ ప్రమాదాల నుండి కూలీలకు రక్షణ కల్పించాలని సృజన్ కుమార్ డిమాండ్ చేశారు.

ఈకార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు బ్రాహ్మణపల్లి యుగేందర్, నాయకులు నల్లగొండ శ్రీనివాస్, రాజయ్య, మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.

బాలాజీ టెక్నో స్కూల్లో ఉగాది సంబరాలు.

బాలాజీ టెక్నో స్కూల్లో ఉగాది సంబరాలు

 

నర్సంపేట,నేటిధాత్రి:

 

శ్రీ క్రోధినామ సంవత్సరానికి వీడుకోలు, శ్రీ విశ్వావసు నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ నూతన సంవత్సరంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు,సిబ్బంది అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుతూ
నర్సంపేట మండలంలోని లక్నేపల్లి బాలాజీ టెక్నో స్కూల్లో ఉగాది సంబరాలు వైభవంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, విద్యార్థులు ఉత్తమ విద్యను అభ్యసించి భవిష్యత్తులో ఉన్నత స్థానానికి చేరుకోవాలని బాలాజీ టెక్నో స్కూల్ ప్రిన్సిపల్ పెరుమాండ్ల రాజేంద్రప్రసాద్ అన్నారు. లక్నెపల్లి శివారులోని బాలాజీ టెక్నో స్కూల్లో ఏర్పాటు చేసిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న ప్రిన్సిపల్ పెరుమాండ్ల రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ తెలుగు కాలమానం ప్రకారం 60 సంవత్సరాల క్యాలెండర్ ఉంటుందని అందులో ఈ విశ్వావసు నామ సంవత్సరం 39వ సంవత్సరమని అన్నారు. ఉగాది సందర్భంగా ప్రతి తెలుగు వారు షడృచులతో పచ్చడి తయారు చేస్తారు. భక్ష్యాలు అనే ప్రత్యేక పిండివంటలు తయారుచేసి కుటుంబ సభ్యులందరూ కలిసి తీసుకోవడం తెలుగు వారి ఆనవాయితి అని,ప్రతి పండుగను కుటుంబ సమేతంగా జరుపుకునే గొప్ప సంప్రదాయమని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో టెక్నో స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన DMHO.

ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన డి ఎం హెచ్ ఓ

 

పాలకుర్తి నేటిధాత్రి

 

జనగామ జిల్లా వైద్యాధికారి డాక్టర్ కె. మల్లికార్జున రావు బుధవారం పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక ఉన్నత ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ వైద్యులు ఎల్లప్పుడూ రోగులకు అందుబాటులో ఉండాలని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ప్రసవాల సంఖ్య పెంచాలన్నారు. ప్రతి గర్భిణీ స్త్రీ ఇంటి వద్దకు వెళ్లి ప్రత్యేకంగా కలిసి ఆరోగ్య సూచనలు అందించాలని కోరారు. ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీల సంఖ్య పెంచాలని తల్లి శిశువు మరణాలను తగ్గించాలని అన్నారు. కుక్కకాటు,పాము కాటు, తేలు కాటు కు మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. వేసవిలో ఎండ దెబ్బకు గురి కాకుండా ప్రతి సెంటర్ లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అలాగే మందులు అందుబాటు లో ఉండాలని ఆసుపత్రి సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో పీహెచ్ సి ఇన్చార్జి డాక్టర్ సిద్ధార్థ రెడ్డి, హాస్పిటల్ సిబ్బంది, తదితరులు ఉన్నారు.

యువ జ్యోతి ఆధ్వర్యంలో టీబి వరల్డ్ డే కార్యక్రమం.

యువ జ్యోతి ఆధ్వర్యంలో టీబి వరల్డ్ డే కార్యక్రమం,,,,

టిబి వ్యాధి రాకుండా నివారణ కు వివరించిన హెల్త్ ఆఫీసర్ భరత్ కుమార్,,,,

సిద్దిపేట ఎన్వైకే సహకారంతో విజయవంతంగా కార్యక్రమం,,,,

రామాయంపేట మార్చి 24 నేటి ధాత్రి (మెదక్)

 

ప్రపంచంలో టీ బి వ్యాధితో అనేకమంది గతం లో మరణించడం జరిగిందన్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా ప్రత్యేకమైన వ్యాక్సిన్ తయారుచేసి మందులతో టీబీ వ్యాధిని చాలా వరకు నివారించడం జరిగిందని రామాయంపేట మండల పి హెచ్ ఎస్ హెల్త్ ఆఫీసర్ భరత్ అన్నారు అయినా కానీ జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు కరోనా లాంటి వ్యాధులు రావడానికి టీబిలాంటి వ్యాధులు ఉండడం కూడా ప్రాణాంతక వ్యాధులకు గురవుతారని అన్నారు ముఖ్యంగా తంబాకు పొగాకు సిగరెట్టు గుట్కా పాన్ మసాలా లాంటి వాటితోనే కాకుండా దుమ్ముదులి వాతావరణ కాలుష్యంలో జాగ్రత్తగా ఉండకపోవడం వల్ల ఈ వ్యాధి ఒకరు నుండి మరొకరికి సోగుతుందని అందుకే

TB disease

ఈ వ్యాధిని పూర్తిగా నివారించిన తగు జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు విద్యార్థులు కూడా తమ తల్లిదండ్రులకు ధూమపానం పాన్ మసాలా గుట్కా లాంటి వాడుకున్న నివారించుకోవాలని ఇతవు ఈ పలికారు ఈ కార్యక్రమంలో యువజ్యోతి స్పోర్ట్స్ అండ్ యూత్ కోఆర్డినేటర్ సత్యనారాయణ హాస్టల్ మరియు పాఠశాల విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సిద్దిపేట వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సత్యనారాయణ తెలిపారు

ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం.!

ముప్పిరెడ్డిపల్లి లో విజయవంతమైన ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం…

300 మందికి పైగా రోగులకు పరీక్షలు….

 

రామయంపేట మార్చి 25 నేటి ధాత్రి (మెదక్)

 

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మెదక్ శాఖ, వి ఎస్ టి ఇండస్ట్రీస్ తూప్రాన్ వారి సహకారంతో… మనోహరాబాద్ మండలంలోని ముప్పిరెడ్డిపల్లి గ్రామంలోనీ గ్రామ పంచాయతీ భవనంలో మంగళవారం నాడు ఏర్పాటు చేసిన మల్టీ స్పెషాలిటీ ఉచిత ఆరోగ్య శిబిరానికి అపూర్వ స్పందన లభించింది.. తూప్రాన్ వి ఎస్ టి సీనియర్ మేనేజర్ కిషోర్ కుమార్, కంపెనీ అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ గోపికృష్ణ ఇండియన్ రెడ్ క్రాస్ ప్రతినిధులతో కలిసి ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించారు. ప్రతి సంవత్సరం తాము రెడ్ క్రాస్ సంస్థతో కలిసి కంపెనీ పరంగా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామనీ వారు తెలియజేశారు..

Medical health camp

 

గ్రామంలో నిర్వహించిన ఉచిత వైద్య ఆరోగ్య శిబిరానికి అపూర్వ స్పందన లభించింది.. రెడ్ క్రాస్ సంస్థ
రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఆరోగ్య శిబిరంలను నిర్వహిస్తూ పేదలకు సేవలు అందించడం పట్ల పలువురు వర్షం వ్యక్తం చేశారు. ప్రైవేటు ఆసుపత్రులకు చెందిన ప్రత్యేక వైద్య బృందం గ్రామానికి చేరుకొని ఉచిత వైద్య పరీక్షలను నిర్వహించింది.. అంతేకాకుండా రోగులకు ఉచితంగా మందులను పంపిణీ చేశారు. వైద్య బృందంలో ఐశ్వర్యా రెడ్డి, రోనిత్ రెడ్డి, డాక్టర్ తేజస్వారి, కే అమూల్య రెడ్డి, శ్రేయ సింగ్,రమాదేవి, షాదిన్ మహాదీన్, లిఖిత, సుమానియాతో పాటు పనులు డాక్టర్లు ఉన్నారు.
ఈ వైద్య పరీక్షల్లో సుమారు 300 వందల మందికి పైగా రోగులు వివిధ రకాల వైద్య పరీక్షలు చేయించుకున్నారు. దంత పరీక్షలు, నరాలకు సంబంధించిన కీళ్ల నొప్పులు, దగ్గు ,దమ్ము రోగులను డాక్టర్ల బృందం పరిశీలించిoది..
ఈ కార్యక్రమం లో మనోహరాబాద్ ఎంపీడీవో కృష్ణమూర్తి,మెదక్ జిల్లా చైర్మన్ లయన్ డాక్టర్ ఏలేటి రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర సభ్యులు సింగం శ్రీనివాసరావు, కార్యదర్శి టి.సుభాష్ చంద్రబోస్, ఉపాధ్యక్షుడు లక్ష్మణ్ యాదవ్,
కోశాధికారి డి.జి.శ్రీనివాస శర్మ, మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు పి.దామోదర్ రావు,దేమేయాదగిరి, మద్దెల సత్యనారాయణ, మద్దెల రమేష్, వంగరి కైలాసం,సభ్యులు తోట శ్రీనివాస్ గుప్తా,వి. సతీష్ రావు తో పాటు గ్రామానికి చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన.

తంగళ్ళపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన జిల్లా వైద్యాధికారి…..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మండల వైద్యాధికారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి అధికారి రజిత మాట్లాడుతూ ఆసుపత్రి పరిసరాలపైఅన్ని ప్రోగ్రాంలో పై రివ్యూ చేసి ఆరోగ్య మహిళ క్లినిక్ పై సంబంధించి హాస్పిటల్ కి వచ్చే రోగులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని వారికి ఎటువంటి అసౌకర్యాలు కాకుండా చూడాలని రిజిస్టర్ను పరిశీలించి అన్ని ప్రోగ్రాములపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి హార తీశారు ఇట్టి సందర్శనలు జిల్లా వైద్య శాఖ అధికారి ఎస్ రజిత తంగళ్ళపల్లి వైద్యాధికారి డాక్టర్ అఫీజ హాస్పటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

టి బి వ్యాధి పై అవగాహనా..

టి బి వ్యాధి పై అవగాహనా కల్పించిన
మండల వైద్యాధికారి అమరేందర్ రావు

ముత్తారం :- నేటి ధాత్రి

 

ప్రపంచ టీబీ దినోత్సవం పురస్కరించుకొని,మండల వైద్యాధికారి రాయిని అమరేందర్ రావు తన యొక్క సిబ్బందితో కలిసి ముత్తారంలో ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో భాగంగా ప్రజలకి క్షయ వ్యాధి మీద అవగాహన కల్పిస్తూ క్షయ వ్యాధి అనగా ఏమిటి, అది ఎలా సోకుతుంది, ఎవరికి సోకే అవకాశం ఉంది , క్షయ(టీబీ) సోకిన వారికి ఎటువంటి చికిత్స అందించబడుతుంది సమాజంలో టీబీ వ్యాధి యొక్క తీవ్రత మరియు దాని నివారణ మార్గాలు, మరియు ప్రపంచ టీబీ డే యొక్క ప్రధాన ఉద్దేశం, గురించి ప్రజలకు పూర్తి అవగాహన కల్పించినారు . దీనిలో భాగంగా రెండు వారాలకు మించి దగ్గు ఉన్నను ప్రతిరోజు సాయంత్రము జ్వరం వస్తే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని సంప్రదించాలని మరియు టీబీ వ్యాధి పైన ప్రజలతో ఒక ప్రతిజ్ఞ చేయించారు టి బి సోకిన వారు భయపడవద్దని ప్రజలు టి బి వ్యాధి పై పూర్తి అవగాహనగా కలిగి ఉండి వారి యొక్క కుటుంబంలో తద్వారా సమాజంలో టీబీ వ్యాధి బారిన పడకుండా ఉండాలని ,తద్వారా ప్రతి గ్రామము టీబీ రహిత గ్రామంగా ఏర్పడాలని తెలియచేశారు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఖమ్మంపల్లి మచ్చుపేట సెంటర్స్ లో లావణ్య ఎం ఎల్ ఎచ్ పి బొల్లం దీప్తి ఎం ఎల్ ఎచ్ పి ఆధ్వర్యంలో క్షయ వ్యాధి పై అవగాహనా కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పి హెచ్ ఎన్ గ్రేసీ మనీ . సూపర్వైజర్ రమాదేవి ఏ నేమ్స్ స్రవంతి రమాదేవి సునీత ల్యాబ్ టెక్నీషియన్ అనిల్ స్టాఫ్ నర్స్ రవళి మరియు ఝాన్సీ సుస్మిత ఏఎన్ఎం లో శృతి పుష్పలత మరియు ఆశ కార్యకర్తలు శశికళ లత రజిత కల్పన విజయలక్ష్మి జయ అల్లం స్రవంతి ప్రజలు పాల్గొన్నారు

మద్యం సేవించి వాహనం నడిపితే నిండు ప్రాణాలు.!

మద్యం సేవించి వాహనం నడిపితే నిండు ప్రాణాలు బలి..

మందుబాబులు ఇకనైనా మారండి..

మద్యం తాగి వాహనం నడిపితే జైలుకు వెళ్లాల్సిందే.

ప్రతిరోజు డ్రంకన్ డ్రైవ్..

రామాయంపేట మార్చి 19 నేటి ధాత్రి (మెదక్)

Drunk driving

మద్యం తాగి వాహనాలునడిపితే తరచూ ప్రమాదాలు జరుగుతూ ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా.. తాగే వారు మాత్రం తాగక మానడం లేదు. వాహనాలు నడిపేవారు మాత్రం నడపక మానడం లేదు. నిత్యం ఈ తంతు జరుగుతూనే ఉంది. అధికారులు వారు తగిన విధాలుగా ప్రయత్నాలు చేస్తున్న తాగి నడపడం మాత్రం మానుకోవడం లేదు.
మద్యం సేవించి వాహనాలు నడపరాదు అంటూ అధికారులు ఆదేశించిన ప్రయాణీకుల్లో మాత్రం దృష్టి పెట్టడం లేదు. అధికారులు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్న వాహనాదారులు మాత్రం తాగిన మైకంలో వాహనాలను నడుపుతూ ప్రమాదాలకు గురి చేస్తున్నారు. డ్రింక్ అండ్ డ్రైవ్ లో దొరికి జైలుకు పోతున్న సందర్భాలు ఉన్న, ప్రయాణికుల్లో మాత్రం చలణం కనిపించడం లేదు. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం తాగినడపడమే అని చాలామంది వాదిస్తున్న వారికి ఆలోచనలు మాత్రం రావడం లేదు. తాగిన మైకంలో ద్విచక్ర వాహనదారులు వారి ఇష్టాను రీతిలో వాహనాన్ని నడుపుతున్నారు. ఆదివారం వచ్చిందంటే చాలు ప్రధాన రహదారిపై వాహనాల జోరు పెరిగింది. విందులు, వినోదాల పేరుతో దైవదర్శనాలకు వెళుతూ వచ్చేవారు కొంతమంది అయితే, తాగినడిపేవారు ఎక్కువగా ఉన్నారు.

వాహనదారుల తీరు మారాల్సిందే..

Drunk driving

తాగి నడిపిన పాపానికి కేవలం మనమే ఒకరికే కాకుండా ఎదుటి వ్యక్తులకు కూడా తీవ్ర నష్టం జరుగుతుంది. కొన్నిసార్లు ప్రాణ నష్టం కూడా వాటిల్లుతుంది. దీని ప్రభావం ఎన్నో కుటుంబాల పైన పడుతుంది. దీనితో వాహనదారులు సైతం తాగి వాహనాలు నడిపే ధోరణిని మానుకోవాలి, రామాయంపేట మండల ప్రాంతంలో తరచు ఏదో ఒక రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రాణాలు పోతూనే ఉన్నాయి. ఇప్పటికైనా వాహనదారులు మారితే అందరికీ మేలు కలుగుతుంది.

తాగి నడిపితే జైలు శిక్ష తప్పదు..
ఎస్సై బాలరాజు రామయంపేట.

మందుబాబులు మద్యం సేవించి వాహనాలతో రోడెక్కుతున్నారా అయితే మీకు జైలు శిక్ష తప్పదు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ అమాయక ప్రజల ప్రాణాలు తీస్తున్న వారిని కఠినంగా శిక్షించి జైలు శిక్షలు విధిస్తున్నాయి. మద్యం మత్తులో వాహనం నడిపే వారికి ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదంటూ న్యాయస్థానాలు కఠినంగా ఆదేశాలు జారి చేసిన వాహనదారుల్లో మాత్రం భయం ఏర్పడడం లేదు. ఇటీవలె మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ అమాయకమైన వారి ప్రాణాలు బలిగొన్న సంఘటనలు రోజు జరుగుతూనే ఉన్నాయి, వారికి కోర్టుల్లో జరిమానాలు జైలు శిక్షలు విధిస్తూనే ఉన్నారు. అయినా వాహనదారులలో మాత్రం మార్పు రావడం లేదు.
మద్యం సేవించి రోడ్డుపై వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవని చెబుతున్న డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాన్ని ప్రతిరోజు నిర్వహించి మద్యం సేవించిన వారిని పట్టుకుని కేసులు చేస్తున్నాం.మద్యం సేవించి వాహనం నడపడం నేరం అన్న విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు.

పేద ప్రజల వద్దకే… మెగా హెల్త్ క్యాంప్.

పేద ప్రజల వద్దకే… మెగా హెల్త్ క్యాంప్…

ఆరోగ్య సమస్యల కోసం సంపూర్ణ సురక్ష కేంద్రంను సంప్రదించాలి

కేసముద్రం/ మహబూబాబాద్: నేటి ధాత్రి

కేసముద్రం మండలం దీన్ దయల్ నగర్ కాలనీ ఎస్ ఆర్ స్కూల్ దగ్గర జిల్లా ప్రధాన ఆసుపత్రిలోని సంపూర్ణ సురక్ష కేంద్రం, ఆధ్వర్యంలో మంగళవారం మెగా హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగిందని సంపూర్ణ సురక్ష కేంద్రం మేనేజర్ బి రమేష్ తెలియజేశారు. ఈ క్యాంపులో మొత్తం 138 అన్ని రకాల రక్త పరీక్షలు
షుగర్, బీపీ మరియు సాధారణ పరీక్షలు హెల్త్ క్యాంప్లో నిర్వహించడం జరిగిందని కాలనీ లోని ప్రజలు అందరు సధ్వినియోగ పరుచుకున్నారని తెలిపారు.
ఈ క్యాంపు కు ముఖ్య అతిధిగా జిల్లా హెచ్ ఐ వి /ఎయిడ్స్, టీబీ, లేప్రసీ కంట్రోల్ ప్రోగ్రాం ఆఫీస్ విజయ్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ దాదాపు 148 మందిని ఒపీ చూడటం జరిగిందని తెలియజేసారు. గ్రామీణ ప్రాంతాలలో పేద ప్రజల వద్దకే వచ్చి హెల్త్ క్యాంపు పరీక్షలు నిరహించటం మూలంగా వారి యొక్క స్థితి తెలుస్తుందని చెప్పారు. మీకు ఆరోగ్య పరమైన,మానసిక ఆరోగ్య పరమైన కౌన్సిలింగ్ మరియు సుఖ లైంగిక సమస్యల కోసం సంపూర్ణ సురక్ష కేంద్రం ను సంప్రదించాలని కోరారు సంపూర్ణ సురక్ష కేంద్రం యొక్క కరపత్రాలను వారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్. శ్రవణ్ డాక్టర్, శ్రీకాంత్ , ఏ ఎన్ ఎం సుప్రజా , ఆశ వర్కర్ పూలమ్మ , ఎస్ ఎస్ కె ఓ ఆర్ డబ్ల్యు మానస, సర్వోదయ యూత్ ఆర్గనైజషన్ ఓ ఆర్ డబ్ల్యు రమదేవి సరోజ , చిట్టమ్మ, విజయ గ్రామప్రజలు పాల్గొన్నరు. మా గ్రామంలో హెల్త్ క్యాంపు నిర్వహించడం ద్వారా మాకు చాలా ఆనందంగా ఉందని ప్రజలు హార్షం వ్యక్తం చేసారు.

ప్రైవేట్ హాస్పిటల్లో ఉద్యోగిని పట్ల అనుచిత ప్రవర్తన..!

ప్రైవేట్ హాస్పిటల్లో ఉద్యోగిని పట్ల అనుచిత ప్రవర్తన..!

 

నేటిధాత్రి, బ్రేకింగ్, వరంగల్…

 

100 ద్వారా పోలీసులకు పిర్యాదు చేసిన బంధువులు

మీడియా ప్రతినిధుల పట్ల దురుసుగా ప్రవర్తించిన హాస్పిటల్ ఇన్చార్జి శ్రీకాంత్ రెడ్డి

సారి చెప్పి సద్దుమనిగించే ప్రయత్నం చేస్తున్న యాజమాన్యం

గతంలో కూడా ఇలాగే మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడినట్లు సమాచారం

హనుమకొండ “కూరపాటి రమేష్ హాస్పిటల్లో” పనిచేస్తున్న ఉద్యోగిని పట్ల హాస్పిటల్ యజమాని డాక్టర్ రమేష్ అనుచితంగా ప్రవర్తించిన తీరు..

సదరు మహిళ తన భర్తకు ఫోన్ చేసి తన పట్ల డాక్టర్ ప్రవర్తించిన తీరును తెలిపారు. వెంటనే భర్త 100ద్వారా స్థానిక పోలీసులకు పిర్యాదు.

హాస్పిటల్ చేరుకున్న పోలీసులు విచారణ జరిపినట్లు సమాచారం..

విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు హాస్పిటల్ చేరుకోగా, ఇది మా కుటుంబ సమస్య అంటూ దాటవేసే ప్రయత్నం చేశారు సదరు డాక్టర్..

ఈలోగా హాస్పిటల్ ఇన్చార్జి అని చెప్పుకొనే శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి మీడియా పట్ల దురుసు ప్రవర్తన.. మేము సర్ది చెప్పుకుంటాం, మీరు ఎక్కువ చేస్తున్నారు బయటకు వెళ్ళండి అంటూ వ్యంగ్య మాటలు..

శ్రీకాంత్ రెడ్డి తీరు పట్ల సదరు డాక్టర్ రమేష్ కు ఫోన్ ద్వారా తెలుపుటకు ప్రయత్నించగా ఫోన్ ఆన్సర్ చేయని డాక్టర్ రమేష్..

గతంలో కూడా హాస్పిటల్ లో కొందరు మహిళా ఉద్యోగినిలపై ఇలాగే దురుసుగా ప్రవర్తించారని, మహిళా సిబ్బందిపై చేతులు వేసేవారిని, హాస్పిటల్ లో పనిచేసి మానేసిన కొందరు ఫోన్ ద్వారా మీడియాకు సమాచారం ఇచ్చారు…

తన కింద పనిచేసే వారిపై బానిసంగా చూస్తూ, ఇష్టం వచ్చినట్లు దుర్భాషాలాడిన ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని సదరు మహిళా ఉద్యోగులు కోరుతున్నారు..

మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం.

మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల గ్రామంలో సిరిసిల్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో పశు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు పశువులకు వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల రైతులందరూ అప్రమత్తంగా ఉండాలని పశువులకు ఇచ్చే వ్యాక్సినేషన్ సకాలంలో ఇప్పించి వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్త వహించాలని ఈ సందర్భంగా చింత వైద్య శిబిరంలో రైతులను ఉద్దేశించి ప్రసంగించారు ఇట్టి కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ నర్సింగ్ గౌడ్ డైరెక్టర్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు

అనారోగ్యంతో మృతి చెందిన మాజీ కోఆప్షన్ సభ్యురాలి భర్త.

అనారోగ్యంతో మృతి చెందిన మాజీ కోఆప్షన్ సభ్యురాలి భర్త

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

క్యాతనపల్లి మునిసిపాలిటీ మాజీ కోఆప్షన్ సభ్యురాలు రజియా భర్త ఇటీవల అనారోగ్యానికి గురి కావడంతో శనివారం మృతి చెందారు. బిఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ కోఆప్షన్ సభ్యురాలు రజియా భర్త మరణం పార్టీకి తీరని లోటని బిఆర్ఎస్ పార్టీ చెన్నూర్ నియోజకవర్గ ఇన్చార్జి రాజా రమేష్ బాబు అన్నారు. కుటుంబాన్ని పరామర్శించి శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించారు. రజియా కుటుంబానికి మనోధైర్యాన్ని అందించారు. కుటుంబానికి ఎల్లవేళలా పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, సీనియర్ నాయకులు రామిడి కుమార్, మాజీ కౌన్సిలర్ పోగుల మల్లయ్య, గడ్డం సంపత్, నాయకులు జక్కన బోయిన కుమార్, గడ్డం రాజు, చంద్రమౌళి, సదానందం, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

3వ రోజుకు చేరిన ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి రిలే నిరాహార దీక్షలు.

3వ రోజుకు చేరిన ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి రిలే నిరాహార దీక్షలు

గోలి సుధాకర్ మాదిగ ఎమ్మార్పీఎస్ వరంగల్ జిల్లా నాయకులు

ఈరోజు వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి మరియు అనుబంధ సంఘాల నిరాహార దీక్షలు ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు ఎర్ర సంతోష్ మాదిగ అధ్యక్షతన రెండో రోజు కొనసాగడం జరిగింది
ఈ దీక్షకు ముఖ్య అతిథులుగా
ఎమ్మార్పీఎస్ వరంగల్ జిల్లా సీనియర్ నాయకులు గోలి సుధాకర్ మాదిగ హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవాలని ఎస్సీల వర్గీకరణ చేసిన తర్వాతనే ఇప్పుడు ప్రకటించినటువంటి ఉద్యోగ ఎస్సీల వర్గీకరణ అమలైన తర్వాతనే ఈ ఉద్యోగ ప్రక్రియను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నా లేని పక్షంలో గౌరవ పద్మశ్రీ మందా కృష్ణ మాదిగ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఉప కులాలను అన్నిటిని కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు
గజవెల్లి ప్రభాకర్ చిందు
చిందుఅక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు
ముత్యాల మల్లేష్ మాది

ఏజెన్సీలో డాక్టర్ గీతా పావని వైద్య సేవలు అభినందనీయం.

*ఏజెన్సీలో డాక్టర్ గీతా పావని వైద్య సేవలు అభినందనీయం.

కిడ్నీ డే సందర్భంగా కిడ్నీ వైద్య నిపుణురాలిని అభినందించిన ఐద్వా*

భద్రాచలం నేటి ధాత్రి

భద్రాచలం వంటి ఏజెన్సీ ప్రాంతంలో మహిళ కిడ్నీ వైద్యురాలు ఉండటం ఎంతో అవసరం అని గుర్తించి ఇతర ప్రాంతాలలో మంచి అవకాశాలు ఉన్నప్పటికీ ఏజెన్సీ ప్రాంత ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యంతో భద్రాచలం పట్టణంలో సూర్య ఆసుపత్రిని నెలకొల్పి ఈ ప్రాంత ప్రజలకు కిడ్నీ వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ గీత పావని అభినందినియురాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు డి సీతాలక్ష్మి సీనియర్ నాయకురాలు నాదెండ్ల లీలావతి అన్నారు. గురువారం ప్రపంచ కిడ్నీ డే సందర్భంగా భద్రాచలం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సూర్య హాస్పిటల్స్ కిడ్నీ వైద్య నిపుణురాలు డాక్టర్ గీత పావని శాలువా తో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా సీత లక్ష్మీ లీలావతి లు మాట్లాడుతూ ఏజెన్సీ కేంద్రమైన భద్రాచలం పట్టణంలో అత్యాధునిక సౌకర్యాలతో సూర్య ఆస్పత్రిని నెలకొల్పటమే కాక డయాలసిస్ సెంటర్ ను కూడా అందుబాటులో తీసుకురావడం అభినందనీయమని అన్నారు. చిన్న వయసులోనే వైద్య వృత్తిలో రాణిస్తున్న గీత పావని భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు. ఏజెన్సీలో అనునిత్యం కిడ్నీ సంబంధిత వ్యాధులు వ్యాధులతో బాధపడుతూ హైదరాబాద్ ఖమ్మం విజయవాడ వంటి సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి నుండి ఇక్కడే అన్ని రకాల కిడ్నీ వైద్య సేవలు అందడం ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరమని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా కమిటీ సభ్యురాలు జి జీవనజ్యోతి వై పూర్ణిమ నాగలక్ష్మి కనక శ్రీ తదితరులు పాల్గొన్నారు

హుగ్గెల్లి బస్తీ దవఖానకు పదిహేను వేలు ఆర్థిక సహాయం.

హుగ్గెల్లి బస్తీ దవఖానకు పదిహేను వేలు ఆర్థిక సహాయం

జహీరాబాద్. నేటి ధాత్రి:

జహీరాబాద్:బస్తీ దవఖానలో చిన్న చిన్న మరమ్మత్తుల కోసం సీనియర్ జర్నలిస్ట్ షకిల్ అహ్మద్ రూ. 15,000 నగదు అందజేశారు. ఈ మొత్తాన్ని ఏఎన్ఎం బి. రేణుక కు అందించారు, దవఖానకు రంగులు వేయించడం, రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడడం కోసం ఉపయోగించుకోవాలని సూచించారు.ఆరోగ్య సేవలు మెరుగుపరిచే లక్ష్యంతో తాను సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో మరెవరైనా ఆర్థిక సహాయం అవసరమైతే తనను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

ఎయిడ్స్ పై విస్తృత అవగాహన కార్యక్రమం.

ఎయిడ్స్ పై విస్తృత అవగాహన కార్యక్రమం

ఎయిడ్స్ పై అప్రమత్తంగా ఉండాలి

శాయంపేట నేటిధాత్రి:

హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో ఎయిడ్స్ పై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని వ్యాధి నిర్మూలనపై విస్తృత ప్రచారం జరుగుతుంది. అందుకుగాను తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాలమేరకు జిల్లా కలెక్టర్, డిఎం అండ్ హెచ్ ఓ, వైఆర్ జి కేర్ సహాయ సహకారము తోటి కళారంజని సందీప్ కళాబృందం ద్వారా కూడలి వద్ద హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిపై కళా ప్రదర్శనలు నిర్వహించారు హెచ్ఐవి వ్యాధి నాలుగు కారణాల ద్వారా వస్తుంది. రక్షణ లేని సెక్స్,కలుషితమైన రక్త మార్పిడి,కలుషితమైన చిరంజీలు,తల్లికి హెచ్ఐవి వ్యాధి ఉంటే గర్భంధాలిస్తే పుట్టబోయే బిడ్డకు వస్తుంది

AIDS

హెచ్ఐవి అంటువ్యాధి కాదు ఈ నాలుగు కారణాల వల్ల మాత్రమే వస్తుంది.సుఖ వ్యాధులు ఉన్నవారికి హెచ్ఐవి వ్యాధి వచ్చే అవకాశం పది రెట్లు ఎక్కువ సుఖ వ్యాధులు ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు మందులు వాడాలి. హెచ్ఐవి వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి యువకులు దీని పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలి తల్లికి హెచ్ఐవి వ్యాధి ఉంటే ఆమె గర్భం దాలుస్తే పుట్ట బోయే బిడ్డను కాపాడడానికి మందులు ఉన్నాయి పుట్టబోయే బిడ్డను కాపా డవచ్చు కనుక గర్భం దాల్చిన ప్రతి తల్లి హెచ్ఐవి పరీక్ష చేయించుకోవాలి.హెచ్ఐవి వ్యాధిగ్రస్తులను హింసించకుం డా ప్రేమ ఆప్యాయతలు చూపిస్తే వారు ఎక్కువ కాలం జీవించడానికి అవకాశ ముంది.కళాకారులు,పాటల ద్వారా, పల్లె సూక్తుల ద్వారా నాటకాల ద్వారా తెలియ జేశారు, ఉచిత హెల్ప్ లైన్ నెంబర్ 1097 గూర్చి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో వైఆర్ జి కేర్ , డి ఆర్ పి ముస్తక్ ,పంచాయితీ కార్యదర్శి రత్నాకర్, సిబ్బంది మరియు హెడ్ కానిస్టేబుల్, రవీందర్, కారోబార్. రమేష్ బాబు సూపర్ వేజర్ రంజిత్, మామిడి స్వప్న,సిబ్బంది,
కళాకారులు పోలేపాక సందీప్,,కృష్ణం రాజు , రజని, కరుణాకర్, సమ్మయ్య ,రామ పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version