ఎఫ్ఎల్ఎన్ ద్వారా విద్యార్థులకు బోధించాలి.

ఎఫ్ఎల్ఎన్ ద్వారా విద్యార్థులకు బోధించాలి.

జహీరాబాద్ నేటి ధాత్రి:

FLN ద్వారా విద్యార్థులకు బోధించాలని మండల విద్యాధికారి జాకీర్ హుస్సేన్ అన్నారు. కోహిర్ మండలంలోని కొత్తూరు ప్రాథమిక పాఠశాలను బుధవారం అకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఆటపాటల ద్వారా భోజనం చేయాలని చెప్పారు. మధ్యాహ్న భోజనాన్ని మెనూ ప్రకారం నాణ్యతగా వండించాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో గ్యాస్‌ కనెక్షన్ల ఏర్పాటకు చర్యలు.

ప్రభుత్వ పాఠశాలల్లో గ్యాస్‌ కనెక్షన్ల ఏర్పాటకు చర్యలు

జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట,నేటిధాత్రి:

ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండేందుకు గాను గ్యాస్ కనెక్షన్లు ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సంబంధిత అధికారులను ఆదేశించారు.జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత శాఖల జిల్లా అధికారులు,గ్యాస్ ఏజెన్సీ డీలర్లతో కలెక్టర్ సమావేశమై తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కట్టెల పొయ్యితో కాకుండా గ్యాస్ ద్వారా వంట చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు.
ఈనేపథ్యంలో జిల్లావ్యాప్తంగా ఉన్న సుమారు 500 ప్రభుత్వ పాఠశాలల్లో గ్యాస్ సిలిండర్ కనెక్షన్ ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకోవాలని అందుకు ఎల్పిజి గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులు సహకరించాలని కోరారు. ప్రతి మండలానికి సుమారు 35 నుండి 40 ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నందున ఆయా మండల ఎల్పిజి ఏజెన్సీల నుండి గ్యాస్ సిలిండర్లు సరఫరా చేసేలా చూడాలని ఎల్పిజి ఏజెన్సీ ప్రతినిధులను కోరారు.వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆర్ బి ఎస్ కె ద్వారా జిల్లాలోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో,కేజిబివిలలో
విద్యార్థులకు ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయుటకు సంబంధిత విద్యాసంస్థల సమన్వయంతో ప్రణాళికలు రూపొందించాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని కలెక్టర్ సూచించారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి,జిల్లా రెవెన్యూ అధికారి విజయలక్ష్మి,జెడ్పి సీఈఓ రామిరెడ్డి, డిఆర్డిఓ కౌసల్యాదేవి, జిల్లా విద్యాశాఖ అధికారి జ్ఞానేశ్వర్, డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు,జిల్లా బీసీ,ఎస్సీ,ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులు, ప్రత్యేక అధికారులు మండల విద్యాశాఖ అధికారులు,కెజిబివి స్పెషల్ ఆఫీసర్లు,గ్యాస్ ఏజెన్సీ డీలర్లతో తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ ఓపెన్ స్కూల్ అడ్మిషన్ల గడువు పొడిగింపు..

తెలంగాణ ఓపెన్ స్కూల్ అడ్మిషన్ల గడువు పొడిగింపు

జహీరాబాద్ నేటి ధాత్రి:

తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) 2025-26 విద్యా సంవత్సరం SSC, ఇంటర్ ప్రవేశాల గడువును పొడిగించింది. జూలై 31 వరకు సాధారణ ఫీజుతో, ఆగస్ట్ 28 వరకు లేట్ ఫీజుతో అప్లికేషన్లు అధికారిక వెబ్సైట్లో www.telanganaopenschool.org లేదా MeeSevaలో అందుబాటులో ఉన్నాయి. అప్లికేషన్ తర్వాత అభ్యర్థులు మూడు రోజుల్లో ధృవపత్రాలను సంబంధిత స్కూల్లు/కళాశాలలకు ఇవ్వాలి.

ఎస్సీ బాలికల వసతి గృహాలు అంటే ఇంత నిర్లక్ష్యమా!

ఎస్సీ బాలికల వసతి గృహాలు అంటే ఇంత నిర్లక్ష్యమా!

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణ పరిధి లతీఫ్ రోడ్ లో గల షెడ్యూల్డ్ కులాల బాలికల వసతి గృహం ప్రహారీ గోడ కూలి పక్షం రోజులు గడుస్తున్న పట్టించుకునే నాదులే లేరని ఎస్సీ సెల్ జహీరాబాద్ నియోజవర్గ అధ్యక్షులు బండి మోహన్ బుధవారం మండిపడ్డారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థినులతో మాట్లాడి అక్కడ నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గురుకుల, ఎస్సీ వసతి గృహాల్లో అనేక సమస్యలు తిష్ట వేశాయన్నారు.

విద్యార్థులు ఉన్నత లక్ష్యాల సాధనకు కృషి చేయాలి.

విద్యార్థులు ఉన్నత లక్ష్యాల సాధనకు కృషి చేయాలి

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్

సిరిసిల్ల పట్టణంలో జూనియర్ కళాశాల మైదానంలో 10వ తరగతి పిల్లలకు సైకిల్ పంపిణీ చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

విద్యార్థులు ఉన్నత లక్ష్యాల సాధనకు కృషి చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ అన్నారు. మంగళవారం సిరిసిల్ల పట్టణంలో జూనియర్ కళాశాల మైదానంలో 10వ తరగతి పిల్లలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ, ఎస్పీ మహేష్ బి గీతే, ఎమ్మెల్సీ అంజి రెడ్డిలతో కలిసి సైకిళ్ళు పంపిణీ చేశారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ మాట్లాడుతూ విద్యా, వైద్యం రూపంలో రాజకీయాల కతీతంగా ప్రతి ఒక్కరికి సహాయం అందించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు మోడీ గిఫ్ట్ పేరిట 10వ తరగతి చదివే బాల బాలికలకు ఉచితంగా సైకిల్ అందిస్తున్నామని అన్నారు.
విద్యార్థులకు మొదటి ఆస్తి సైకిల్ అందించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను ప్రోత్సహించాలని సైకిల్స్ అందించామని అన్నారు.నాణ్యమైన సైకిల్ అందిస్తున్నామని, వీటిని వినియోగించి విద్యార్థులు సకాలంలో తరగతి గదులకు హాజరు కావాలని పేర్కొన్నారు.

Bandi Sanjay

రాబోయే సంవత్సరాలలో కూడా 10వ తరగతి చదివే విద్యార్థులకు మోడీ గిఫ్ట్ కింద సైకిల్స్ అందిస్తామని అన్నారు. ఎల్.కే.జి నుంచి 6వ తరగతి చదివే విద్యార్థులకు మోడి కిట్స్ పేరిట బ్యాగ్, నోట్ బుక్స్, ఇతర సామాగ్రి అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, పెద్ద పెద్ద కంపెనీలు వివిధ పనులపై వచ్చినప్పుడు వారితో చర్చించి సీ.ఎస్.ఆర్. నిధుల ద్వారా ఈ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు.
చిన్నతనంలో గంటకు 15 పైసలు, 40 పైసలు కిరాయి తెచ్చుకొని సైకిల్ నడిపేవారిమని కేంద్రమంత్రి గుర్తు చేసుకున్నారు. సైకిల్స్ వినియోగించుకొని విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవాలని అన్నారు. చిన్నతనం నుంచి అనేక ఇబ్బందులు గురైనప్పటికీ బాబా సాహెబ్ అంబేద్కర్ బాగా చదువుకొని దేశానికి రాజ్యాంగం రచ్చించే స్థాయికి ఎదగారని అన్నారు.
సిరిసిల్ల జిల్లా కలెక్టర్ నిబద్ధతతో పని చేస్తున్నారని అన్నారు. యూ.పి. రాష్ట్రానికి చెందిన కలెక్టర్, మహా రాష్ట్ర కు చెందిన ఎస్పీ క్రమశిక్షణ, పట్టుదల, ప్రణాళికతో కృషి చేయడం వల్ల గొప్ప స్థాయికి ఎదిగామని అన్నారు. విద్యార్థులు ఉదయం సమయంలో చదువుకోవాలని, మన తల్లిదండ్రుల కష్టాన్ని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలని కేంద్ర మంత్రి తెలిపారు.

Bandi Sanjay

విద్యార్థులు పట్టదలతో పని చేస్తుందని, 2014 కంటే ముందు విద్య కోసం 68 వేలకోట్లు కేటాయిస్తే, మోడీ ప్రభుత్వం ప్రస్తుతం 1,25,000 కోట్లు ఖర్చు చేస్తుందని, ఏకలవ్య పాఠశాలలు నవోదయ పాఠశాలలు సైనిక్ స్కూల్స్ క్రమశిక్షణకు మారుపేరుగా పని చేస్తున్నాయని పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారని అన్నారు. రోడ్డుపై సైకిల్ నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని , ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, 20 రోజుల తర్వాత సర్వీసింగ్ చేసుకోవాలని తెలిపారు.
ఎమ్మెల్సీ అంజి రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థుల ఇబ్బందులు తొలగించాలనే ఉద్దేశంతో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి వర్యులు సైకిల్స్ పంపిణీ చేస్తున్నామని అన్నారు. చిన్నతనంలో సర్వ శిక్షా అభియాన్ లో చదువుకునే రోజుల్లో తాను పడిన ఇబ్బందులు విద్యార్దులకు ఉండవద్దని బహుమతిగా సైకిల్స్ అందిస్తున్నామని పేర్కొన్నారు.విద్యార్థులు బాగా చదువుకోవాలని, మంచి ఫలితాలు సాధించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఎమ్మెల్సీ తెలిపారు. మోడీ గిఫ్ట్ పేరిట అందిన సైకిల్స్ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, రోడ్డు పై జాగ్రత్తగా నడపాలని అన్నారు. ఎస్.ఆర్. ట్రస్ట్ తరపున విద్యార్థులకు 10వ తరగతి తర్వాత ఎటువంటి కెరియర్ ఆప్షన్స్ ఉంటాయో తెలుసుకునేందుకు వీలుగా పుస్తకాలను పంపిణీ చేస్తున్నామని అన్నారు.

Bandi Sanjay

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సిరిసిల్ల జిల్లాలో 4 వేల సైకిళ్ళ పంపిణీకి శ్రీకారం చుట్టారని అన్నారు. రక్త విద్యా సంవత్సరం సిరిసిల్ల జిల్లాలో 10 వేల మంది విద్యార్థులు అదనంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని, రానున్న రోజుల్లో మరింత మెరుగ్గా ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందుతాయని కలెక్టర్ తెలిపారు.
ఎస్పీ మహేష్ బి గీతే మాట్లాడుతూ,విద్యార్థులకు ఎంపీ మంచి సైకిల్స్ అందించారని, వర్షా కాలంలో రోడ్లు స్కిడ్ అధికంగా అవుతాయని, విద్యార్థులు జాగ్రత్తగా నడపాలని అన్నారు. అనంతరం కాలేజీ గ్రౌండ్ నుండి బతుకమ్మ ఘాట్ వరకు విద్యార్థులతో సైకిల్ ర్యాలీ ని జెండా ఊపి ప్రారంబించి కొంత దూరం సైకిల్ సవారీ చేశారు.
ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు ఇన్చార్జి డిఈఓ వినోద్ కుమార్, స్థానిక నాయకులు, విద్యార్థులు, ప్రజలు సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

చదువుకి దూరం అవుతున్నాడని తెలుసుకొని.

చదువుకి దూరం అవుతున్నాడని తెలుసుకొని సైకిల్ సహాయం చేసిన రవి

జహీరాబాద్ నేటి ధాత్రి:

చిలేమామిడి గ్రామం లోని పిచ్చకుంట్ల నాగరాజు అనే విద్యార్థి zphs జీర్లపల్లి పాఠశాలలో 6th class చదువుతున్నాడు నాగరాజు తండ్రి మరణించాడు తల్లి డబ్బులు లేక ఇంటి దగ్గరనే పిల్లల్ని ఉంచింది విషయం తెలుసుకున్న CRP చిరంజీవి చిలేమామిడి గ్రామం కి వెళ్లి పిల్లల్ని ZPHS జీర్లపల్లి స్కూల్ లో జాయిన్ చేయడం జరిగింది స్కూల్ కి రావడానికి ఇబ్బంది అవుతుంది అని తెలుసుకొని ఝరాసంగం రవి కి తెలియజేయగా వెంటనే విద్యార్థి కి సైకిల్ సహాయం చేయడం జరిగింది.

సి ఆర్ నగర్ లో ఉచిత వైద్య శిబిరం నిర్వహణ.

సి ఆర్ నగర్ లో ఉచిత వైద్య శిబిరం నిర్వహణ

భూపాలపల్లి నేటిధాత్రి

మున్సిపాలిటీ పరిధిలోని సి ఆర్ నగర్ లో భూపాలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. వార్డు ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. అనంతరం
సీజనల్ వ్యాధుల పై అవగాహన కల్పించారు
ఈ కార్యక్రమంలో డాక్టర్ శారద, వి బృందా. శ్రీదేవి ఏఎన్.ఎంలు రమ, కరుణ,ఆశ వర్కర్లు స్వరూప,అరుణ తదితరులు పాల్గొన్నారు.

బీసీ బాలికల హాస్టల్ కు వాటర్ ఫిల్టర్ బహుకరణ..

బీసీ బాలికల హాస్టల్ కు వాటర్ ఫిల్టర్ బహుకరణ

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండల కేంద్రం లోని వెనుకబడిన తరగతుల బాలికల హాస్టల్ కు శాయం పేటకు చెందిన క్రీస్తు శేషులు బాసని శంకరయ్య జ్ఞాపకార్థం ఆయన కుమారులు వినయ భూషణ్ శైలేష్ కుమార్ వాటర్ ఫిల్టర్ ను బహుకరిం చారు. ఈ మేరకు శంకరయ్య సోదరుడు బాసని సుబ్రహ్మ ణ్యం మంగళవారం హాస్టల్ కు వెళ్లి 25 వేల విలువగల వాటర్ ఫిల్టర్ ను హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సుష్మాకు అందజేసి ఫిట్టింగ్ చేయించి హాస్టల్ బాలికలకు పరిశుభ్రమైన తాగునీరు కోసం చర్యలు తీసుకున్నారు. ఈ సంద ర్భంగా హాస్టల్ బాలికలు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి హాస్టల్ సిబ్బంది పాల్గొన్నారు.

బాలాజీ టెక్నో స్కూల్ లో ప్రపంచ యువజన.

బాలాజీ టెక్నో స్కూల్ లో ప్రపంచ యువజన నైపుణ్య దినోత్సవం

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట మండలం లక్నేపల్లిలోని బాలాజీ టెక్నో స్కూల్లో ఎన్.సి.సి పదవ బెటాలియన్ ఆదేశాల మేరకు సోషల్ సర్వీస్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ లో భాగంగా ఎన్.సి.సి థర్డ్ ఆఫీసర్ యం.డి రియాజుద్దీన్ ఆధ్వర్యంలో ప్రపంచ యువజన నైపుణ్య దినోత్సవం నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ పి.రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ యువతకు నైపుణ్యాలు చాలా అవసరమని, నైపుణ్యాలతోటే భవిష్యత్తులో ఉన్నతమైన స్థానాన్ని చేరుకోవచ్చని తెలిపారు. విద్యార్థులు పాఠశాల దశ నుండే చదువుతో పాటుగా వివిధ రంగాల్లో నైపుణ్యాలను నేర్చుకోవాలని సూచించారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు యువతలో నైపుణ్యాలను పెంపొందించడానికి రాజీవ్ యువ వికాసం లాంటి అనేక సంక్షేమ పథకాలను అందించేందుకుఅనేక కార్యక్రమాలను, నైపుణ్య శిబిరాలను నిర్వహిస్తున్నాయని, వాటిని యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్యార్థులు నైపుణ్యాల యొక్క ప్రాముఖ్యతను, ప్రపంచ యువత నైపుణ్యాల దినోత్సవం- 2025 యొక్క ఉద్దేశం గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు భవాని చంద్,రమేష్,నరసింహారెడ్డి, కృష్ణవేణి,అనిత,హేమలత, ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.

ప్రభుత్వ డిగ్రీ కళాశాల త్వరగా పూర్తి చేయాలి.

ప్రభుత్వ డిగ్రీ కళాశాల త్వరగా పూర్తి చేయాలి

ఎస్ఎఫ్ఐ నాయకుల డిమాండ్

పరకాల నేటిధాత్రి
పరకాల పట్టణంలోని డిగ్రీ కళాశాల త్వరగా పూర్తి చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు
బొచ్చు కళ్యాణ్ మాట్లాడుతూ వివిధ గ్రామాల నుండి వచ్చే విద్యార్థులకు చదువుకుందామని
కాలేజీకి వస్తే రూమ్స్ లేక
తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని,ప్రభుత్వ డిగ్రీ కళాశాల నాణ్యతగా నిర్మించి త్వరగా పూర్తిచేయలన్నారు.స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి వెంటనే స్పందించి కాంట్రాక్టర్ లకు ఆదేశాలిచ్చి త్వరగాతినా బిల్డింగ్ పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పరకాల మండల అధ్యక్షుడు మడికొండ ప్రశాంత్,పట్టణ అధ్యక్షుడు బొచ్చు ఈశ్వర్,ఎస్ఎఫ్ఐ నాయకులు అరవింద్,మహేష్,విజయ్,అరుణ్,సాయి కృష్ణ పాల్గొన్నారు.

వరండాలు, చెట్ల కింద పై చదువులు.

వరండాలు, చెట్ల కింద పై చదువులు
• ఆరు బయట వంట
• సరిపడ గదులు లేక ఇబ్బందులు..

నిజాంపేట: నేటి ధాత్రి

Principal Padma Reddy’s

ఆరు బయట చెట్ల కింద, వరండాలలో విద్యార్థుల చదువులు కొనసాగుతున్నాయి. ఈ మేరకు నిజాంపేట మండలం రాంపూర్ గ్రామంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అదనపు గదులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షాకాలం నేపథ్యంలో ఆరు బయట చదువులు కొనసాగించలేమని విద్యార్థులు వాపోతున్నారు. సరైన గదులు లేక ఆరుబయటే వంట కూడా కొనసాగించడం జరుగుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఆరు బయట వంటశాలకు విష సర్పాలు వస్తున్నాయని దీనిపై అధికారులు ప్రజాప్రతినిధులు దృష్టి పెట్టి పాఠశాలకు అదనపు గదులతో పాటు కాంపౌండ్ వాల్ నిర్మించాలని వేడుకుంటున్నారు.

ప్రధానోపాధ్యాయులు పద్మా రెడ్డి వివరణ

పాఠశాలలో అదనపు గదులు లేక ఆరుబయటే చదువులు కొనసాగించడం వాస్తవమేనన్నారు. ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి కూడా తీసుకోబోయినట్లు పేర్కొన్నారు.

గురుదేవ్ విద్యాలయం నందు ఐఎల్ఎమ్ బెంగళూరు టీచర్స్.

గురుదేవ్ విద్యాలయం నందు ఐఎల్ఎమ్ బెంగళూరు టీచర్స్ చే స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు ప్రారంభం

నేటిదాత్రి చర్ల

చర్ల మండల కేంద్రంలోని ప్రముఖ ప్రైవేటు విద్యాసంస్థ అయిన గురుదేవ్ విద్యాలయంలో ఈ విద్యా సంవత్సరం నుండి విద్యార్థులలో ఆంగ్లభాష యందు చక్కని అవగాన కల్పించాలన్న సత్సంకల్పంతో ఆంగ్ల భాషలో కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించాలనే సదుద్దేశ్యంతో ఎంతో వ్యయంతో కూడుకున్నదే అయినా కూడా ఐఎల్ఎమ్ బెంగుళూరు వారితో ఒప్పందం కుదుర్చుకుని ఐఎల్ఎమ్ బెంగుళూరు వారి ఆధ్వర్యంలో శిక్షణా తరగతులు ప్రారంభించడమైనదని పత్రికా ప్రకటన ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులకు తెలిపారు ఈ విద్యా సంవత్సరం విద్యార్థినీ విద్యార్థుల కు చక్కని శిక్షణ ఇచ్చుటకు బెంగుళూరు నుండి కుమారి సౌజన్య శిక్షకులుగా నియమించబడ్డారు ఈ రోజు ఈ కార్యక్రమం పాఠశాల ప్రధానోపాధ్యాయులు హెచ్ జివి ప్రసాద్ అకడమిక్ కోఆర్డినేటర్స్ ఎంవి సుబ్రహ్మణ్యం జి శ్రీనివాస్ మరియు ఐఎల్ఎమ్ బెంగుళూరు నుండి విచ్చేసిన సందీప్ చేతుల మీదుగా ఉపాధ్యాయినీ ఉపాధ్యాయుల సమక్షం లో లాంఛనంగా ప్రారంభించబడినది ప్రధానోపాధ్యాయులు హెచ్ జివి ప్రసాద్ మాట్లాడుతూ కమ్యూనికేషన్ స్కిల్స్ లో శిక్షణ ఇచ్చుటకు ఎంతో సుదూరాల నుండి వచ్చేసిన కుమారి సౌజన్య సందీప్ కు మరియు మన పాఠశాలకు తమ సహకారాన్ని అందిస్తున్న ఐఎల్ఎమ్ బెంగుళూరు సంస్థకు ప్రత్యేక కృతజ్ఞతలు పత్రికా ముఖంగా తెలిపారు

విద్యార్థులు గర్భం దాలిస్తే రూ.లక్ష బహుమతి..

విద్యార్థులు గర్భం దాలిస్తే రూ.లక్ష బహుమతి.. సరికొత్త స్కీమ్ తెచ్చిన ఆ దేశ సర్కార్..

ఓ దేశం తెచ్చిన స్కీమ్ చర్చనీయాంశంగా మారింది. విద్యార్థులు గర్భవతులు అయితే దాదాపు రూ.లక్ష అందిస్తోంది. ఇది విద్యార్థుల కెరీర్‌ను నాశనం చేస్తుందని పలువురు మండిపడుతున్నా.. అక్కడి ప్రభుత్వం మాత్రం జనాభా పెరిగితే చాలా అని భావిస్తోంది. ఎందుకంటే ఆ దేశంలో సంతానోత్పత్తి రేటు దారుణంగా పడిపోవడమే దీనికి కారణం.

గత నాలుగేళ్లుగా ఉక్రెయిన్‌తో యుద్ధంలో బిజీగా ఉంది రష్యా. ఏళ్లు గడుస్తున్నా యుద్ధం మాత్రం ఓ కొలక్కి రావడం లేదు. ఉన్న సైన్యం సరిపోక ఉక్రెయిన్ నుంచి సిబ్బందిని తెచ్చుకుంటుంది రష్యా. ఇప్పటివరకు యుద్ధంలో 2లక్షల 50వేల మంది రష్యన్ సైనికులు మరణించినట్లు తెలుస్తోంది. లక్షలాది మంది యువత దేశం విడిచి వెళ్లిపోతున్నారు. దీంతో జనాభా సంక్షోభం తలెత్తింది. మరోవైపు జననాల రేటు గణనీయంగా తగ్గుతున్న తరుణంలో దానిని పెంచేందుకు ప్రభుత్వం అనేక స్కీమ్స్ ప్రవేశపెడుతుంది. ఈ క్రమంలోనే సంతానోత్పత్తిని పెంచేందుకు రష్యా ఓ కొత్త స్కీమ్‌ను తీసుకొచ్చింది. స్కూల్, కాలేజీ స్టూడెంట్స్ గర్భవతులు అయితే వారికి ప్రోత్సాహకాలు అందజేస్తుంది. ప్రస్తుతం ఎంపిక చేసిన ప్రాంతాల్లో దీనిని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తోంది. ఇప్పుడు ఈ పథకం చర్చనీయాంశంగా మారింది. కొంతమంది మేధావులు విద్యార్థుల భవిష్యత్తును ఈ స్కీమ్ నాశనం చేస్తుందని విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ క్రెమ్లిన్ మాత్రం జనాభా పెరుగుదలను జాతీయ బలం, వ్యూహాత్మక శక్తిగా భావిస్తుంది. అందుకే ఇటువంటి స్కీమ్‌ను ప్రవేశపెట్టింది.

ప్రస్తుతం రష్యాలోని 10 ప్రాంతాల్లో ఈ స్కీమ్‌ను అమలు చేస్తున్నారు. అర్హత గల వయసు ఉన్న విద్యార్థులు మాత్రమే ఈ స్కీమ్‌ను పొందొచ్చు. ఆ విద్యార్థులకు 100,000 రూబిళ్లు అంటే రూ.90వేల రూపాయలను ప్రోత్సాహంగా అందజేస్తుంది. ఈ పథకం రష్యా జనాభా క్షీణతను తిప్పికొట్టడానికి 2025 మార్చిలో ప్రవేశపెట్టారు. స్కూల్ లేదా కాలేజీకి చెందిన యువతి 22వీక్స్ గర్భవతిగా ఉండి తన పేరును ప్రభుత్వ మదర్ క్లినిక్‌లో నమోదు చేసుకుంటే దాదాపు లక్ష రూపాయలు అందజేస్తోంది. 2023లో రష్యా జనన రేటు 1.41శాతంగా ఉంది. అవసరమైన దానికంటే ఇది చాలా తక్కువ. 2024లో మొదటి ఆరు నెలల్లో రష్యాలో దాదాపు 6లక్షల మంది శిశివులు మాత్రమే జన్మించారు. గత పాతికేళ్లలో ఇదే అతి తక్కువ సంఖ్య కావడం గమనార్హం. అందుకే ఈ ఏడాది విద్యార్థులకు సైతం ప్రోత్సాహకాలు అందజేస్తోంది.

ఈ స్కీమ్ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. రష్యన్ పబ్లిక్ ఒపీనియన్ రీసెర్చ్ సెంటర్ ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం.. 43శాతం మంది రష్యన్లు ఈ విధానాన్ని సమర్థిస్తుండగా.. 40శాతం మంది దీనిని వ్యతిరేకిస్తున్నారు. ఈ స్కీమ్ యువతుల భవిష్యత్తును దోపిడీ చేస్తుందని.. విద్య, కెరీర్ అవకాశాలను దెబ్బతీస్తుందని పలువురు మండిపడుతున్నారు. అయితే ఈ విధానాలను రష్యా మాత్రమే కాదు వివిధ దేశాలు అమలు చేస్తున్నాయి. ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న తల్లులకు హంగేరీ పన్ను మినహాయింపులను అందిస్తుంది. పోలాండ్ ప్రతి బిడ్డకు నెలవారీ భత్యాలను చెల్లిస్తుంది. 2050 నాటికి మూడొంతుల కంటే ఎక్కువ దేశాల సంతానోత్పత్తి స్థాయిల దిగువకు పడపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పేద విద్యార్థి రాము 20 వేలు ఆర్థిక సాయం

పేద విద్యార్థి రాము 20 వేలు ఆర్థిక సాయం

శ్రీ శ్రీనివాస లైన్స్ క్లబ్ సభ్యులు లయన్ శాంతి

తిరుపతి(నేటి ధాత్రి) జూలై 11:

లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఓ పేద విద్యార్థి రాము ఉన్నత చదువుల కోసం 20000 రూపాయలు శ్రీ శ్రీనివాస లయన్స్ క్లబ్ సభ్యురాలు శాంతి ఆర్థిక సాయం అందజేశారు. తిరుపతి లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఆర్కాడ్ కృష్ణ ప్రసాద్ వేలూరు జగన్నాథం ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాసా లయన్స్ క్లబ్ సభ్యురాలు శాంతి తన పుట్టినరోజు సందర్భంగా ఓ పేద విద్యార్థి ఉన్నత చదువుల కోసం ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా లైన్స్ క్లబ్ వారు మాట్లాడుతూ ఆ భగవంతుని ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో శాంతి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరిన్ని జరుపుకోవాలని అలాగే ప్రతి సంవత్సరం ఇలాంటి పేదవారికి సహాయాన్ని అందించాలని ఆమెకు ఆసక్తిని భగవంతుడు ఇవ్వాలని ఆ విద్యార్థి మంచి చదువులు చదివి ఉన్నత శిఖరాలను నిర్వహించి తను కూడా ఇలాంటి సహాయ సహకారాలు మరి కొంతమందికే అందించాలని ఆకాంక్షిస్తున్నామని తెలిపారు,
ఈ కార్యక్రమంలో ఆర్కాట్ కృష్ణ ప్రసాద్, వేలూరు జగన్నాథం, శంబోలా హరి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు .

పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే

పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే

విద్యార్థుల బోధన విన్న.. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి.

మహబూబ్ నగర్ /నేటి ధాత్రి

 

మహబూబ్ నగర్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి శనివారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సంగర్భంగా పాఠశాలలో నెలకొన్న సమస్యలను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అరుణకుమారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలలోని తరగతి గదులను ఆయన పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి ఎలా చదువుకొంటున్నారని అడిగారు. మంచిగా చదువుకొని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆయన సూచించారు. విద్యార్థుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. డిజిటల్ బోర్డులో మీ టీచర్లు పాఠాలు బోధిస్తున్నారా.. అని అడిగారు. మీకు డిజిటల్ బోర్డు ఉపయోగించడం తెలుసా అని అడిగారు. కొందరు విద్యార్థులు డిజిటల్ బోర్డు మీద ఫిజిక్స్, బయాలజీ , సబ్జెక్టులను బోధించారు. ఎమ్మెల్యే ఆసక్తిగా విన్నారు. అనంతరం ఎమ్మెల్యే విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, సిఎంఓ బాలు యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు అజ్మత్ అలి, రామస్వామి, కృష్ణకాంత్ రెడ్డి, సంజీవరెడ్డి, దోమ పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత బస్సులు ఏర్పాటు చేయాలి.

‘ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత బస్సులు ఏర్పాటు చేయాలి’

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా కోహిర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత బస్సులు ఏర్పాటు చేయాలని బీసీ ఎస్సీ ఎస్టీ-జేఏసీ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మ్యాతారి మహేందర్ మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న ప్రతి 30 మందికి ఒక బస్సు ఏర్పాటు చేసి స్కూలుకు తీసుకెళ్లాల్సిందిగా కోరారు.

మార్గ మధ్యలో ఆగిన సిబిఎస్ ఈ కాకతీయ స్కూల్ బస్సు.

మార్గ మధ్యలో ఆగిన సిబిఎస్ ఈ కాకతీయ స్కూల్ బస్సు

వీణవంక, (కరీంనగర్ జిల్లా ):నేటి ధాత్రి :

వీణవంక మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో సీబీఎస్సీ కాకతీయ విద్యాసంస్థల బస్సు నడిరోడ్డుపై గత మూడు రోజుల నుండి ఎవరు పట్టించుకోవడంలేదని దీన్ని వెంటనే సంబంధిత అధికారి బస్సును సీజ్ చేయవలసిందిగా బిఆర్ఎస్వి హుజురాబాద్ నియోజకవర్గం సీనియర్ నాయకులు వొల్లాల శ్రీకాంత్ గౌడ్ డిమాండ్ చేయడం జరిగింది.అనంతరం వారు మాట్లాడుతూ, అధికారుల నిర్లక్ష్యమా! యజమాన్య నిర్లక్ష్యమా! పేద మధ్యతరగతి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న సీబీఎస్సీ పేరుతో లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్న విద్యను వ్యాపారం చేస్తూ, ధనార్ధనయ ధ్యేయంగా పనిచేస్తున్న కాకతీయ విద్యాసంస్థల యజమాన్యంపై సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని అలాగే మిగిలిన బస్సులను కూడా పూర్తిస్థాయి ఎంక్వయిరీ చేసి TS 02T 2721 బస్సును వెంటనే సీజ్ చేయాలని కోరుతూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న యజమాన్య నిర్లక్ష్యంపై సంబంధిత అధికారి వెంటనే చర్యలు తీసుకోవాలని లేనియెడల విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని డిమాండ్ చేయడం జరిగింది.

కే డి సి బ్యాంకు ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్ బుక్స్.

కే డి సి బ్యాంకు ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్ బుక్స్ మరియు ప్యాడ్స్ పంపినం

ఇబ్రహీంపట్నం. నేటిధాత్రి

మండలంలోని వర్ష కొండ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల లో విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు నోటు పుస్తకాలు పంపిణీ
చేసారు ఇబ్రహీంపట్నం బ్రాంచ్ వారు కేడీసీ బ్యాంకు ల‌ చైర్మన్ శ్రీ రవీందర్రావు గారి జన్మదిన సందర్భంగా ఫైనాన్షియల్ లిటరసీ అనే కార్యక్రమం 9 ,10 వ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ మరియు పెన్నులు నోటు పుస్తకాలు అందించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు అందరికీ పొదుపు చిన్ననాటి నుండి అలవాటు కావాలని అందుకోసం వారి బ్యాంకులో జీరో బ్యాలెన్స్ తో అకౌంట్ లో ఇస్తామని తెలిపారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి రాజేందర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి మా పాఠశాలను ఎంచుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ జి మారుతి , అసోసియేషన్ సభ్యులు రాము. ఉపాధ్యాయులు శ్రీనివాస్. ఇమ్మానియేల్. మహేష్. ఉపాధ్యాయుని శ్రీమతి మమత. అనిత. మరియు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

పాఠశాలకు దాతల సహకారం.

పాఠశాలకు దాతల సహకారం…

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని మండల పరిషత్ పాఠశాల పూర్వ విద్యార్థులు చాల్కి గ్రామానికి చెందిన రమేష్ స్వామి, పరశురాం దాతలుగా నిలిచారు. పాఠశాలలో అవసరాలకై రమేష్ ఆటవస్తువుల కోసం రూ. 10,000 శుక్రవారం అందించారు. స్వామి, పరశురాం కలిసి పాఠశాలలో గల 93 మంది విద్యార్థులకు టై, బాడ్జిలు అందించారు.

పెండింగ్ స్కాలర్ షిప్స్ చెల్లించాలి .

పెండింగ్ స్కాలర్ షిప్స్ చెల్లించాలి

జైపూర్,నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ముందు ఫీజు రియంబర్మెంట్లు స్కాలర్షిషిపులు విడుదల కొరకు పిడి ఎస్ యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన చేయడం జరిగింది.ఈ సందర్భంగా పిడి ఎస్ యు జిల్లా ఉపాధ్యక్షుడు పి.సికిందర్ మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్రంలోని గత మూడు సంవత్సరాల నుండి విద్యార్థులకు రావలసిన ఫీజు రియంబర్మేంట్,స్కాలర్షిప్ 7200 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉండడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.విద్యార్థులు పై చదువులు చదవాలంటే కార్పొరేట్ కళాశాలలోని ఫీజులు కట్టాలని యాజమాన్యం ఒత్తిడి గురి చేయడం వల్ల విద్యార్థులు చదువులని మానేసే పరిస్థితి నెలకొంటుంది.విద్యార్థులకు రావలసిన బకాయిలు తక్షణమే విడుదల చేసి వారికి న్యాయం చేయాలని కోరారు.జైపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చుట్టూ ప్రహరి గోడ లేకపోవడం వల్ల మహిళ విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనీ దీనిపై తక్షణమే ప్రభుత్వం,ఎమ్మెల్యే స్పందించి జూనియర్ కళాశాల సమస్యలు పరిష్కరించాలని ప్రగశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(పి డి ఎస్ యు) ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో పిడి ఎస్ యు జిల్లా నాయకులు కార్తీక్,అన్వేష్,సుమంత్, వైష్ణవి,రోజా,మేఘన విద్యార్థులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version