పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి.

పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:

పెండింగ్ జీపీఎఫ్,టీఎస్ జి ఎల్ఐ,ఎస్ ఎల్ బిల్లులు విడుదల చేయాలనీ డి ఏ ,పి ఆర్ సి ప్రకటించి సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఓ పి ఎస్ అమలు చేయాలనీ పొదిలి సత్యనారాయణ కుటుంబాన్ని ఆడుకోవాలని గుండాల మండల పిఆర్టీ యూటీఎస్ అధ్యక్షులు వి వీరాస్వామి, ప్రధాన కార్యదర్శి ఎన్ ప్రసాద్ గుండాల తహసీల్దార్ ఇమ్మానుయేల్ కు వినతి పత్రం ఇచ్చారు.ఈ కార్యక్రమం లో పిఆర్టీ యూ సభ్యులు పాల్గొన్నారు.

ఏప్రిల్ 1 నుండి సన్న బియ్యం పంపిణీ.

ఏప్రిల్ 1 నుండి సన్న బియ్యం పంపిణీ

రేషన్ డీలర్లకు సమావేశం ఏర్పాటు చేసిన ఎమ్మార్వో

ఎమ్మార్వో సత్యనారాయణ

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండలంలోని 30 రేషన్ షాప్స్ డీలర్స్ తో తహసీ ల్దార్ కార్యాలయంలో సమా వేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం
ఏప్రిల్ నుండి రేషన్ కార్డు దారులకు ప్రభుత్వం సన్న బియ్యం సరఫరా చేస్తుంది కాబట్టి డీలర్స్ వద్ద ఏమైనా మార్చి నెల దొడ్డు బియ్యం నిల్వలు ఉంటే అట్టి నిల్వలను పై నుండి ఆదేశాలు వచ్చేంత వరకు భద్రపరచాలి. ఎట్టి పరిస్థితుల్లో దొడ్డు బియ్యం ఇవ్వరాదని ,సన్న బియ్యం మాత్రమే ఇవ్వాలని ప్రతి రోజు ఉదయం 7 గం.లకు తీయాలని ,ఎట్టి పరిస్థితుల్లో కార్డ్ ఉన్న వారి దగ్గర డబ్బులు ఇచ్చి బియ్యం కొనకూడదు అలాంటి కంప్లైంట్స్ వస్తె 6-A కేసులు పెట్టుతామని హెచ్చ రించారు. ఈ కార్యక్రమంలో ఇద్దరు ఆర్ ఐ తోపాటు మల్లయ్య అద్యక్షుడు మరియు డీలర్స్ పాల్గొన్నారు.

సింగరేణి C&MD ని కలిసిన BMS యూనియన్ నాయకులు.

సింగరేణి సి అండ్ ఎండి ని కలిసిన బిఎంఎస్ యూనియన్ నాయకులు

 

జైపూర్,నేటి ధాత్రి:

 

 

మంచిర్యాల జిల్లా జైపూర్ ఎస్టిపిపి లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని సి అండ్ ఎండి కి వినతి పత్రం అందజేసిన నాయకులు
శుక్రవారం రోజున హైదరాబాదులోని సింగరేణి ప్రధాన కార్యాలయంలో బొగ్గు పరిశ్రమల ఇంచార్జ్ జాతీయ సేఫ్టీ కమిటీ సభ్యులైన కొత్త కాపు లక్ష్మారెడ్డి,బి ఎమ్మెస్ రాష్ట్ర అధ్యక్షులు అయిన యాదగిరి సత్తయ్య ఆధ్వర్యంలో సింగరేణి సిఎండి బలరాం నాయక్ కి జైపూర్ ఎస్టిపిపి లో ఉన్న వివిధ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా బిఎమ్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి సత్తయ్య మాట్లాడుతూ…పవర్ ప్లాంట్ విస్తరణలో భూములు కోల్పోయిన భూ నిర్వాసితులకు వెంటనే పర్మినెంట్ ఉద్యోగాలు కల్పించాలని పవర్ ప్లాంట్ లో వివిధ కంపెనీలలో ఐదు సంవత్సరాలు విధులు నిర్వహించిన వివిధ కార్మికులకు వెంటనే పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేశారు.పవర్ ప్లాంట్ లో విధులు నిర్వహిస్తున్న వివిధ గ్రామాల మీదుగా కార్మికులకు వెంటనే బస్సు సౌకర్యం కంపెనీ కల్పించాలని కోరారు. డిప్యూటీ సెంట్రల్ లేబర్ కమిషన్ హైదరాబాద్ వారి ఒప్పందం ప్రకారం క్యాంటీన్ ను వెంటనే ప్రారంభించి కార్మికులకి అతి తక్కువ ధరలకు నాణ్యమైన ఆహారాన్ని అందచేయాలని తెలియజేశారు.ఈఎస్ఐ హాస్పిటల్ ను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని ప్రమాదంలో చనిపోయిన కార్మికులకు భీమా సౌకర్యంతో పాటు వారి యొక్క కుటుంబంలో ఒకరికి అర్హతను బట్టి ఉద్యోగం కల్పించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పులి రాజిరెడ్డి,మండ రమాకాంత్, ప్రధాన కార్యదర్శి దుశ భాస్కర్,బోడకుంట శ్రీధర్, పెద్దిరెడ్డి,కిషన్ రెడ్డి,శివకృష్ణ,కే. సతీష్ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి విఫలం.

పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి విఫలం

తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న బిజెపి
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ఆరోపణలకు వాడుకున్నకాంగ్రెస్, బీఆర్ఎస్

చట్టసభల్లో ప్రభుత్వాన్ని నిలదీసిన బిజెపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

అసెంబ్లీలో నియోజకవర్గ సమస్యల్ని ప్రస్తావించని భూపాలపల్లి ఎమ్మెల్యే

తెలంగాణ బిజెపి అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తి రెడ్డి

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండలంలో పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని
తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని
తెలంగాణ బిజెపి అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తి రెడ్డి సత్యపాల్ అన్నారు.

శుక్రవారం గణపురం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ బుధవారం నిర్వహించిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడానికి సమయం సరిపోతుందన్నారు.

రాష్ట్రంలో తాగు సాగు నీరందక రైతాంగం ఇబ్బంది పడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.

తెలంగాణ వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చట్టసభల్లో ప్రభుత్వాన్ని నిలదీశారని ఆమె అన్నారు.

రాష్ట్రంలో విద్యారంగం నిర్వీర్యమైందని విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కీర్తి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

అసెంబ్లీ సమావేశాల్లో బిఆర్ఎస్ పార్టీ ప్రజా సమస్యలను ప్రస్తావించడంలో విఫలమైందని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పై ఆరోపణలు చేయడం తిరిగి కాంగ్రెస్ బిఆర్ఎస్ పై ఆరోపణలు చేయడం జరిగిందే తప్ప ప్రజా సమస్యలను ప్రస్తావించడంలో రెండు పార్టీలు విఫలమయ్యాయని అన్నారు.

చట్టసభల సమయం వృధా అవ్వడం తప్ప ప్రజా సమస్యలపై చర్చించిన పాపాన పోలేదన్నారు.

అదేవిధంగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు నియోజకవర్గ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించడంలో విఫలమయ్యారని మొక్కుబడిగా కొన్ని విషయాలు మాత్రమే అసెంబ్లీలో ప్రస్తావించారని కీర్తి రెడ్డి ఈ సందర్భంగా అన్నారు.

ముఖ్యంగా మండలంలోని గాంధీ నగర్ లో ఇండస్ట్రియల్ కార్యులర్ కోసం శిలాఫలకం వేసి సంవత్సరం గడుస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆమె విమర్శించారు.

ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు నిశిదర్ రెడ్డి, పార్లమెంట్ కో కన్వినర్ ప్రసాద్ రావు, గణపురం మండల శాఖ అధ్యక్షులు ఊర నవీన్ రావు,రేగొండ మండల మాజీ అధ్యక్షులు తిరుపతి రెడ్డి,సోషల్ మీడియా కన్వినర్ దుగ్యల రామ్ చందర్ రావు, నాయకులు మంద మహేష్, ప్రవీణ్, రాజు, విప్లవ రెడ్డి, రాజు, తదితరులు పాల్గొన్నారు.

రంజాన్ తోఫా కిట్స్ పేద ముస్లిం లకు నిత్యవసర.

రంజాన్ తోఫా కిట్స్ పేద ముస్లిం లకు నిత్యవసర సరుకులు పంపిణీ

వనపర్తి నేటిదాత్రి :

తెలంగాణ జన సమితి
పార్టీ జిల్లా అధ్యక్షులు
య౦ఏ ఖాదర్ పాష.
ఆధ్వర్యంలో
రంజాన్ పండుగ సందర్భంగా ఖాదర్ నివాసంలో పేదా ముస్లిం మహిళలకు
రంజాన్ నెల సందర్భంగా నిరుపేద ముస్లింలకు రంజాన్ పండుగ తోఫా నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు 250.మంది.ముస్లిం ల కు తోఫా కిట్స్ ఇచ్చారు .
గత 8 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఖాదర్ తెలిపారు. ఈ రంజాన్ పండుగ తోఫా
కిట్స్ పంపిణీ కార్యక్రమా౦ విజయవంతం చేశామని
ఆయన వెల్లడించారు . ఈ కార్యక్రమానికి తెలంగాణ జన సమితి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అని ఖాదర్ పాష అన్నారు
ఈ కార్యక్రమంలో
టి జేఏసీ ప్రజా వాగ్గేయకారుడు రాజారాం ప్రకాష్.
సామాజిక నేత పోచ రవీందర్ రెడ్డి
మండల అధ్యక్షులు ఎండి సమీ. . జే. వినోద్ కుమార్ గారు తదితరులు పాల్గొన్నారు

డాక్టర్ రామచంద్రనాయక్ కి అవకాశం కల్పించాలి.

మంత్రివర్గంలో డాక్టర్ రామచంద్రనాయక్ కి అవకాశం కల్పించాలి

ఎల్లంపేట గ్రామ పార్టీ అధ్యక్షుడు గండి వీరభద్రం గౌడ్

మరిపెడ నేటిధాత్రి.

 

విద్యావంతుడు స్నేహశీలి మృదుస్వభావి నిరంతరం ప్రజల్లో ఉండే నాయకుడు డాక్టర్ రామచంద్రనాయక్ కి,పది సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడి గ్రామ గ్రామన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసిన నాయకుడు,ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజల కష్టాలను దగ్గరుండి చూసిన నాయకుడు వారికి మంత్రి పదవిలో ప్రజల కష్టాలని తీరుతాయి అన్నారు,నిత్యం యువతను ప్రోత్సహిస్తూ చదువుకున్న యువకులు రాజకీయాలకు రావాలి అని ఈ రాజకీయ వ్యవస్థను మార్చాలని ఉద్దేశంతో యువతకు ప్రాధాన్య ఇచ్చిన నాయకుడు32 లక్షల మంది ఉన్న లంబాడ జాతికి న్యాయం జరగాలంటే నిత్యం జాతి ప్రయోజనాల కోసం కృషి చేసే నాయకుడు డాక్టర్ రామచంద్రనాయక్ గారికి మంత్రి పదవి ఇవ్వాలి అని అన్నారు,తన వైద్య వృత్తిలో స్వయంగా పేదల కష్టాలను చూసి చలించి వారి కష్టాలను తీర్చడానికి రాజకీయంగా అడుగుపెట్టి ప్రతిక్షణం వారికి అండగా నిలిచి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అత్యధిక మెజార్టీగా గెలిచిన ప్రజా నాయకుడు డాక్టర్ రామచంద్రనాయక్, అత్యధిక గిరిజనులకు ఉన్న నియోజకవర్గ నుండి గెలిచిన ఎమ్మెల్యే అని అన్నారు.

ప్రణాళికబద్ధంగా ప్రిపేర్ కావాలి.

ప్రణాళికబద్ధంగా ప్రిపేర్ కావాలి
– పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ అల్లం రమేష్

సిరిసిల్ల (నేటి ధాత్రి):

రాజన్న సిరిసిల్లా బీసీ స్టడీ సర్కిల్ ఉద్యోగ నైపుణ్య శిక్షణ కేంద్రానికి సిరిసిల్ల పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ అల్లం రమేష్ విచ్చేసి ఆర్ఆర్ బి, బ్యాంకింగ్, యస్ యస్ సి కోచింగ్ విద్యార్థిని విద్యార్థులకు మోటివేషన్ క్లాస్ చెప్పడం జరిగింది. తను చదువుకున్న స్థితి గతులు,ఇప్పుడు వస్తున్న పేపర్ మోడల్ గూర్చి, ఆర్థమెటిక్ అప్లికేషన్ మెథడ్,కరెంట్ అఫ్ఫైర్స్ గూరించి పూర్తిగా విశ్లేషణముగా చెప్పడం జరిగింది. ఇట్టి ఈ కార్యక్రమంలో బిసి స్టడీ సర్కిల్ డైరెక్టర్ జెల్ల వెంకటస్వామి, కోర్స్ కోఆర్డినేటర్ హరీష్, ఫాకల్టీ నాగరాజు సార్,సిబ్బంది సురేష్, దివ్య, ప్రసాద్,మురళి, వనిత పాల్గొన్నారు.

రేపు శని అమావాస్య వేడుకలు.

రేపు శని అమావాస్య వేడుకలు

జహీరాబాద్. నేటి ధాత్రి:

ఝరాసంగం మండల పరిధిలోని ఏడాకులపల్లి సప్తపురి శనిఘాట్ దేవాలయంలో శని అమావాస్య వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.

ఉదయం 5గంటల నుంచి స్వామివారికి తైలాభిషేకం, శని మహాయజ్ఞం, మహా మంగళహారతి నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.

ఒప్పందాన్ని స్టార్ మీటర్ సర్దుబాటు చార్జీలు రద్దు చేయాలి.

రాష్ట్ర ప్రభుత్వం సే కి ఒప్పందాన్ని స్టార్ మీటర్ సర్దుబాటు చార్జీలు రద్దు చేయాలి

సిపిఎం నాయకులు డిమాండ్

పలమనేరు (నేటి ధాత్రి) మార్చి 28:

 

పలమనేరు మండలంలో విద్యుత్ కార్యాల నందు కరెంట్ ఆఫీసు నందు శుక్రవారం 28వ తేదీన ఉదయం 11 గంటలకి ధర్నా నిర్వహించినాము ఈ ధర్నా లో పట్టణ కార్యదర్శి గిరిధర్ గుప్తా మాట్లాడుతూ
28 మార్చి 2025
రాష్ట్ర ప్రభుత్వము స కి ఒప్పందాన్ని స్మార్ట్ మీటర్లు సర్దుబాటు చార్జీలు రద్దు చేయాలని ప్రజలపై మోపుతున్న భారాలను వెంటనే రద్దు చేయాలని ప్రతిపక్షంగా ఉన్న టిడిపి జనసేన కూటమి మ్యానుఫెస్టివల్లో విద్యుత్ చార్జీలను నీ య నియంత్రస్తామని విద్యుత్ బిల్లులను తగ్గిస్తామని హామీ ఇచ్చినారు వైసిపి ప్రభుత్వ పాలనలో ఐదేళ్లలో రకరకాల పేరుతో వేసిన 32 కోట్ల . 166 కోట్ల బారాలతో బాధపడుతున్న రాష్ట్ర ప్రజలను ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు గారు ఐదు ఏళ్ళు కరెంటు చార్జీలు పెరగబోవుని భావించారు

ఆదా నీ– సే కి సోలార్ విద్యుత్ పై వైసీ ప్రభుత్వము తప్పు దోవ పట్టిస్తుందని ఉండగా ప్రతిపక్షం ప్రతిపక్షం ఉండగా నేటి ఆర్థిక శాఖ మంత్రులు పయ్యాల కేశవ్ గారు వివరించారు ఒక యూనిట్ కి విద్యుత్తు 1. 99 పైసలు వైసిపి ప్రభుత్వం 2 రూపాయల 49 పైసలకు ఒప్పందం చేసింది ఆనాటి యువతరం పాదయాత్ర సందర్భంగా 2023 జూలై రెండో తేదీన( 144వ రోజు సందర్భంగా) నెల్లూరు స్టార్ మీటర్లని పగలగొట్టాలని నారా లోకేష్ పిలుపునిచ్చార పుండు పై కారం చెల్లినట్టుగా
వ్యవసాయం పంపు సెట్ స్టార్ మీటర్లని దానిని పగలగొట్టాలని వారే ఉపన్యాసాలు ఇచ్చారు,
పలమనేరు కమిటీ ఈశ్వర మాట్లాడుతూ స్టార్ మీటర్లతో కొత్త భారం అన్ని రంగాల విద్యుత్ వినియోగదారులకి పి పెయిడ్ మీటర్లను బిగించి విద్యుత్తు పంపిణీ సంస్థను సిద్ధమయ్యాయి రాష్ట్రంలో
1 90 కోట్ల మంది విద్యుత్ వినియోగదారులను ప్రస్తుతం ప్రభుత్వం పరిశ్రమలు వారి ప్రీపెయిడ్ మీటర్లు బిగిస్తున్నారు 200 యూనిట్లు దాటి గృహ వినియోగదారులు కూడా అమర్చి ఒక మీటర్ కి పదివేల 25 రూపాయలు చొప్పున అదనపుగా 56 లక్షల మీటర్లు అంగీకరించి ఆ దానికి అప్పగించినారు
పాల్గొన్నవారు రాజా శ్రీరామయ్య లక్ష్మయ్య రత్తమ్మ కైరునిషా సరోజమ్మ బాబు బాలకృష్ణ మొదటి వారు పాల్గొన్నారు..

విశ్వావసు నామ సంవత్సర పంచాంగ ఆవిష్కరణ..

విశ్వావసు నామ సంవత్సర పంచాంగ ఆవిష్కరణ..

జహీరాబాద్. నేటి ధాత్రి:

జహీరాబాద్ బ్రాహ్మణ సేవా సంస్థ ఆధ్వర్యంలో హౌసింగ్ బోర్డులో సంస్థ కార్యాలయంలో విశ్వావసు నామ సంవత్సర పంచాంగ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బ్రాహ్మణ సమాజ బ్రాహ్మణ సమాజ సేవా సంస్థ ZHB శాఖ అధ్యక్షులు రాజ్కుమార్ దేశ్ పాండే హాజరై పంచాంగ పత్రికను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ.. రాసుల, గ్రహాల సంచారాన్ని పంచాంగం తెలియజేస్తుందని పేర్కొన్నారు

మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం..!

మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం..!

జహీరాబాద్. నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణంలో ఈనెల 21న కురిసిన అకాల వర్షానికి చెట్లు విరిగి రోడ్లపై, మురికి కాలువలలో విరిగిపడ్డాయి. వారం రోజులు కావస్తున్నా మున్సిపల్ సిబ్బంది పట్టించుకోవడం లేదు. ఇదే విషయంపై మున్సిపల్ అధికారిని సంప్రదించగా తీయిస్తామని తెలిపారు. కానీ ఇంతవరకు మురికి కాలువలో నుంచి చెట్లను, చెత్తను ఇంకా తీయలేదు. మున్సిపల్ అధికారులు స్పందించి చెట్లను, మురికిని తీయించాలని కాలనీవాసులు కోరుతున్నారు.

వాక్ బిల్లును వ్యతిరేకిస్తున్న ముస్లింలు.

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వాక్ బిల్లును వ్యతిరేకిస్తున్న ముస్లింలు

జహీరాబాద్ .నేటి ధాత్రి:

కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు ఆస్తులకు సంబంధించిన బిల్లు రద్దు చేయాలని కోరుతూ ముస్లిం కమ్యూనిటీ వారు శుక్రవారం నమాజ్ తరువాత నల్లబ్యాడ్జీలు కట్టు కొని నిరసన తెలిపారు. వక్ఫ్ (సవరణ) బిల్లు,ను వ్యతిరేకించడానికి శుక్రవారం జహీరాబాద్ నియోజకవర్గ ఆయా మండలాలలో వివిధ ముస్లిం సంస్థలు ఏకమయ్యాయి.

Central Government.

పార్లమెంటులో ప్రవేశపెట్టబడిన ఈ బిల్లు, వక్ఫ్ బోర్డు పనులను క్రమబద్ధీకరించడం మరియు వక్ఫ్ ఆస్తుల నిర్వహణను మెరుగుపరచడం లక్ష్యంగా 1995 వక్ఫ్ చట్టాన్ని సవరించడానికి ప్రయత్నిస్తుందాని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్, ప్రతిపాదిత సవరణ తమ విశ్వాసంపై ప్రత్యక్ష దాడి అని వారు పేర్కొన్నారు మరియు దానిని ఆమోదించవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. “రాబోయే రోజుల్లో మేము మరింత శక్తితో ముందుకు వచ్చి ప్రభుత్వానికి ఈ బిల్లును అనుమతించబోమని సందేశం వ్యక్తం చేశారు
ఇది ముస్లింల ఆస్తి ఎందుకంటే ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ను ముస్లింల పెద్దలు తన వాటాలో ఉన్న భూమి దానమిచ్చిన ఆస్తి ఇది అన్నారు ఇది ప్రభుత్వ ఆస్తులు కాదన్నారు. బిల్లును ఆమోదిస్తే ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ఆధ్వర్యంలో దేశమంతా ధర్నాలు నిరాసనాలు జరుగుతాయన్నారు.

రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఎమ్మార్వోకి వినతిపత్రం.

రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఎమ్మార్వోకి వినతిపత్రం…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి..

 

.తంగళ్ళపల్లి గ్రామానికి చెందిన రెడ్డిసంఘం సభ్యులు తంగళ్ళపల్లి ఎమ్మార్వో గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ తంగళ్ళపల్లి మండలం గోపాలరావు పల్లె రెడ్డి సంఘం ఆధ్వర్యంలో మహంకాళి అమ్మవారి గుడి నిర్మించుట కొరకు రెడ్డి సంఘం ఆధ్వర్యంలో కుల సభ్యులం అందరము నిర్ణయించడం జరిగిందని దీని ప్రకారం గోపాలపల్లి గ్రామంలో బే ద్రెంపల్లి వెళ్లే దారిలో స్థానిక ఐకెపి సెంటర్ దగ్గర గుట్ట బోరు ఉన్నందున ఇట్టి భూమి సర్వే నెంబర్.647. లో ఉన్నస్థలాన్ని స్థానిక మహంకాళి అమ్మవారి గుడికి స్థలంఇవ్వడానికి ప్రొసీడింగ్ ఇవ్వాలని ఇవ్వాలని స్థానిక రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఎమ్మార్వోకి కలిసి రెడ్డి సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో రెడ్డి సంఘం అధ్యక్షులు ఏసి రెడ్డి నరసింహారెడ్డి ఉపాధ్యక్షులు కరుణాకర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి కాసర్ల నర్సింహారెడ్డి సభ్యులు తంకర తిరుపతి రెడ్డి ఆలూరి బాల్రెడ్డి రాజిరెడ్డి బింద్రపు రాజిరెడ్డి ఎగుమంటి సాయి రెడ్డి కాసర్ల లిజీ ప్ రెడ్డి రెడ్డి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు

తహసీల్దార్ కార్యాలయం వద్ద చలివేంద్రం.

తహసీల్దార్ కార్యాలయం వద్ద చలివేంద్రం

నిజాంపేట: నేటి ధాత్రి

మండల కేంద్రంలో గల తహసీల్దార్ కార్యాలయం వద్ద శుక్రవారం ఇంచార్జ్ తహసీల్దార్ రమ్య శ్రీ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… గ్రామానికి చెందిన పాక మైసయ్య జ్ఞాపకార్థంగా వారి కుమారుడు నాగరాజు చలివేంద్రం ఏర్పాటు చెయ్యడం సంతోషంగా ఉందన్నారు. అలాగే జిల్లా కలెక్టర్, ఆర్డీఓ రమాదేవి ఆదేశాల మేరకు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలన్నారు. ఈ కార్యక్రమం లో రెవిన్యూ సీనియర్ అసిస్టెంట్ రమేష్, ఆర్ ఐ ప్రీతి, కంప్యూటర్ శ్రీకాంత్ గౌడ్, కళ్యాణ్, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.

చందుర్తి సర్కిల్ కార్యాలయం చందుర్తి రుద్రంగి పోలీస్ స్టేషన్లు.

చందుర్తి సర్కిల్ కార్యాలయం,చందుర్తి, రుద్రంగి పోలీస్ స్టేషన్లు సందర్శించిన జిల్లా ఎస్పీ మహేష్ బి గితే ఐపీఎస్.
ప్రజలకు అందుబాటులోకి ఉంటూ సమర్థవంతమైన సేవలు అందించాలి..

సర్కిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో విజిబుల్ పోలీసింగ్ పై దృష్టిసారించాలి..

చందుర్తి, నేటిధాత్రి:

 

శుక్రవారం రోజున చందుర్తి సర్కిల్ కార్యాలయం, చందుర్తి , రుద్రంగి పోలీస్ స్టేషన్లతో పాటుగా రుద్రంగి మానాల చెక్ పోస్ట్ ,లింగంపేట గ్రామశివారులో ఉన్న పోలీస్ అమరవీరుల స్తూపం సందర్శించిన అనంతరం పోలీస్ స్టేషన్ల పరిసరాలు, సిబ్బంది పని తీరు,సర్కిల్ పరిధిలో నమోదు అవుతున్న కేసుల వివరాలు, పెండింగ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకుని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.

Rudrangi PS

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ సంవర్దవంతమైన సేవలు అందజేస్తు సత్వర న్యాయం జరిగేలా కృషి చేయాలన్నారు.విజిబుల్ పోలీసింగ్లో భాగంగా అధికారులు,విలేజ్ పోలీస్ అధికారులు తరచు గ్రామాలు పర్యటిస్తూ ప్రజలతో మమేకం అవుతు ప్రజలకు సైబర్ నేరాలు,ట్రాఫిక్ నియమాలు,అక్రమ బెట్టింగ్ ,గేమింగ్ యాప్స్ కలుగు అనర్ధాలపైమరియు తదితర అంశాల మీద అవగాహన కల్పించాలని, గ్రామ స్థాయిలో ఇన్ఫర్మేషన్ వ్యవస్థ పటిష్టం చేసుకోని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు.

Rudrangi PS

స్టేషన్ల పరిధిలో ప్రమాదాల నివారణకు ప్రతీ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, వాహనల తనిఖీలు నిర్వహించాలని అన్నారు. పాత నేరస్థుల కదలికలపై నిఘా పెడుతూ పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఎస్పీ వెంట సి.ఐ వెంకటేశ్వర్లు, ఎస్.ఐ లు అశోక్, అంజయ్య, పోలీస్ స్టేషన్ సిబ్బంది ఉన్నారు.

వైన్స్ ను తనిఖీ చేసిన ఎక్స్సైజ్ అధికారులు.

— వైన్స్ ను తనిఖీ చేసిన ఎక్స్సైజ్ అధికారులు

నిజాంపేట: నేటి ధాత్రి

 

మండలంలోని రెండు వైన్స్ లను రామాయంపేట ఎక్స్సైజ్ సీఐ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం తనిఖీ చేశారు. మద్యం షాపులో రికార్డులను పరిశీలించి మాట్లాడారు .. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే మద్యం అమ్మకాలు జరపాలని నిర్వాహకులకు సూచించడం జరిగిందన్నారు. వైన్స్ లో స్టాక్ నిల్వ ఉండేలా చూసుకోవాలని సూచించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం లో ఎక్స్సైజ్ ఎస్ఐ సిద్దార్థ, సిబ్బంది ఉన్నారు.

ఎమ్మెల్యే దొంతికి మంత్రి పదవి కేటాయించాలి.

ఎమ్మెల్యే దొంతికి మంత్రి పదవి కేటాయించాలి

రాజకీయ నిబద్ధత,నిజాయితీకి నిదర్శనం దొంతి

మంత్రి పదవికి ఎమ్మెల్యే దొంతి అర్హుడు

పార్టీకి చేసిన త్యాగాన్ని హైకమాండ్ గుర్తించాలి

టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్

నర్సంపేట,నేటిధాత్రి:

తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వంలో మరో ఆరు మంత్రి పదవులను భర్తీ చేయాలని చూస్తున్న నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా సీనియర్ నాయకుడు రాజకీయ నిబద్ధతకు నిజాయితీకి నిదర్శనమైన నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డికి మంత్రిపదవి కేటాయించాలని టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ ప్రభుత్వాన్ని కోరారు.

శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామానంద్ మాట్లాడుతూ 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎన్నోవ్యాయ ప్రయాసాలు ఒడిదుడుకులను అనుభవిస్తూ నర్సంపేట గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేసిన నాయకుడు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అని అన్నారు.

నర్సంపేట నియోజకవర్గం చెన్నారావుపేట మండలం అమీనాబాద్ గ్రామ సర్పంచిగా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి సొసైటీ చైర్మన్ గా డిసిసిబి చైర్మన్ గా ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా సుదీర్ఘకాలం పనిచేసి పిసిసి సభ్యులుగా ఏఐసీసీ సభ్యులుగా పదవులు చేపట్టి నిబంధత క్రమశిక్షణ కమిట్మెంట్ కు మారుపేరుగా నిలిచి కాంగ్రెస్ పార్టీ ఎదుగుదల కోసం జీవితాన్ని దారపోసి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి రాష్ట్ర నాయకుడిగా గుర్తింపు పొంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తూ వారు చేపట్టిన పాదయాత్రలో చురుకైన పాత్ర పోషించారని పేర్కొన్నారు.

2004 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీల పొత్తులో భాగంగా నర్సంపేట టికెట్ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కంభంపాటి లక్ష్మారెడ్డికి టికెట్ కేటాయిస్తే కలత చెందకుండా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ను ఏకతాటిపై నడిపించి లక్ష్మారెడ్డి గెలుపులో కీలక పాత్ర పోషించాడని అన్నారు.

2009లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి కొద్దిపాటి తేడాతో ఓటమి చెందినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తూ వచ్చారని 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం దొంతి మాధవరెడ్డికి టికెట్ కేటాయించకుండా మోసంచేస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,నియోజకవర్గ ప్రజల బలమైన కోరికతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఏకైక స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్రవ్యాప్తంగా దొంతి మాధవరెడ్డి ప్రభంజనం సృష్టించారని వివరించారు.

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు నీతిమాలిన రాజకీయాలు చేస్తూ పదవుల కోసం జంపుజిలానిలుగా మారి టిఆర్ఎస్ పార్టీలో కిరాయిప్పులకు పాల్పడుతుంటే అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్వతంత్ర ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని టిఆర్ఎస్ పార్టీకి ఆహ్వానించినప్పటికీ అలాగే మంత్రి పదవి ఇస్తామని కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఆఫర్లు చేసిన ఆశపడకుండా కాంగ్రెస్ పార్టీని వీడకుండా మాతృపార్టీపై ప్రేమతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో ఢిల్లీలో చేరి తన రాజకీయ నిబద్ధతను చాటుకోవడం జరిగిందని గుర్తుకు చేశారు.

2014 నుండి 2018 వరకు ఎమ్మెల్యేగా నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధికి పనిచేస్తూ అప్పటి అధికార పార్టీ ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేసిన నిఖర్సగా ఎదుర్కొంటూ కాంగ్రెస్ పార్టీని కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడిన గొప్ప నాయకుడు దొంతి మాధవరెడ్డి అని అభివర్ణించారు.

2018 ఎన్నికల ముందు టీపీసీసీ అధ్యక్షులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ప్రజా చైతన్య బస్సు యాత్రను ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ముందుండి నిర్వహిస్తూ నడపారన్న విషయాన్ని గుర్తు చేశారు.

2018 ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయినప్పటికీ నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ పార్టీ కోసం నిలబడే వ్యక్తిగా గుర్తింపు పొందిన నాయకుడని దాదాపు నర్సంపేట నియోజకవర్గం ఏర్పడి 45 ఏళ్ల చరిత్రలో చేతి గుర్తుపై గెలిచిన దాఖలాలు లేకపోగా మొదటిసారి నర్సంపేట గడ్డపై కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై గెలిచి చరిత్ర తిరిగరాశాడన్నారు.

కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వ అధిష్టానం పార్టీలు ఫిరాయింపులు చేసిన వారికి కొత్తగా వివిధ పార్టీల నుండి పదవుల కోసం పార్టీలోకి వచ్చిన వారికి మంత్రి పదవులను ఇవ్వడం వరంగల్ ఉమ్మడి జిల్లా సీనియర్ నాయకుడిగా ఉండి కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని గుర్తించి మంత్రిపదవి ఇవ్వకుండా వరంగల్ ఉమ్మడి జిల్లా అదేవిధంగా నర్సంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ను నిరాశకు గురి చేయడం సరికాదని వాపోయారు.

ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వంలో భర్తీ చేయనున్న మంత్రి పదవుల్లో రాజకీయ నిబద్ధతకు నిదర్శనంగా ఉన్న ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి గారికి మంత్రి పదవిని కట్టబెట్టి నర్సంపేట ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ లకు టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా ఓబీసీ అధ్యక్షులు ఓర్సు తిరుపతి, నర్సంపేట నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్, ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులు భూసాని సుదర్శన్, బీరం భరత్ రెడ్డి, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ కార్యదర్శి చిప్ప నాగ, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ ప్రచార కార్యదర్శి జన్ను మురళీ, నర్సంపేట నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ములుకల మనీష్, పున్నం రాజు, భూక్య గణేష్, కొత్తగట్టు ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు

మంత్రి సీతక్కకు ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ క్షమాపణ.

మంత్రి సీతక్క ( ఆదివాసీ ) కు ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ క్షమాపణ చెప్పాలి

ఆదివాసీలు అంటే అంత చులకనా

*రాష్ట్ర మొదటి అధికార భాష
తెలుగు తెలుగు తెలియనిమీరు తెలంగాణ శాషనసభలోఉండడం సబబా?
సాగర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు.

జమ్మికుంట :నేటిధాత్రి

 

మంత్రి గారికి హిందీ, ఇంగ్లీష్ రాదు .. సరే ..
మరి
మీకు తెలుగు ఎందుకు రాదు ?
రాష్ట్ర మాతృబాష తెలుగు
రాష్ట్ర మొదటి అధికార భాష తెలుగు.
అలాంటి తెలుగు తెలియని
తెలంగాణ శాషన సభలో
మీరు ఉండటం సబబా .
హైదరాబాద్ లోనే పుట్టి పెరిగిగారు కదా !
రాష్ట్రం లో మెజారిటీ ప్రజలు మాట్లాడే మొదటి అధికార బాషా తెలుగు నేర్చుకోవాలనే సామజిక బాధ్యత మీకు ఉండాలి కాని లేదు.

అసెంబ్లీ లో అందరు సభ్యులు మంత్రులు తెలుగులోనే మాటాడుతున్నప్పుడు ఏం అర్ధం అవుతుంది మీకు ?

ఏదోకటి అసెంబ్లీ లో ఇంగ్లీష్ లో స్పీచ్ ఇచ్చేసి వెళ్ళిపోతే సరిపోతుందా ?

రాష్ట్రం లో సమస్యలు నీకు ఎలా అర్ధం అవుతాయి మీకు ?

ఇతరులకు
హిందీ , ఇంగ్లీష్ రాకపోతే
వారిపై అంత చిన్న చూపా ?

ఆదివాసీలు ( ఎస్టీ ) లు అంటే
అంత చిన్న చూపా ?

మీ అహంకారాన్ని తగ్గించుకొని ,

ఆదివాసీ బిడ్డ అయిన
గౌరవ మంత్రివర్యులు
సీతక్క గారికి మీరు
క్షమాపణ చెప్పాలి.

అప్పుడే మీరు ఉన్న
శాసన సభ కు ,
శాసన సభ్యులు గా ఉన్న మీకు
గౌరవం ..

కొసమెరుపు…

మంత్రి సీతక్క ను అవమానించిన అక్బరుద్దీన్ ఓవైసీ మాటలను ఖండించక పోవడం , శాసన సభలో ఎవరూ కూడా సీతక్కకు క్షమాపణ చెప్పాలి అని నిలదీయక పోవడం  ఆశ్చర్యం.

కేంద్ర మంత్రి కుమారస్వామితో ఎంపీ వద్దిరాజు భేటీ.

ఎంపీ వద్దిరాజు కేంద్ర మంత్రి కుమారస్వామితో భేటీ

“నేటిధాత్రి” న్యూఢిల్లీ.

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి డి.కుమారస్వామితో శుక్రవారం మధ్యాహ్నం భేటీ అయ్యారు.ఎంపీ రవిచంద్ర పార్లమెంటులోని మంత్రి ఛాంబర్ లో ఆయన్ను కలిసి ఆదిలాబాద్ వద్ద ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ప్లాంటును పునరుద్ధరించాల్సిందిగా కోరుతూ వినతిపత్రం అందజేశారు.

Kumaraswamy

వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి చేయడంలో భాగంగా నెలకొల్పిన ఈ పరిశ్రమ కొన్నేళ్లుగా మూతపడడంతో కార్మికులు,వారి కుటుంబ సభ్యులు రోడ్డున పడ్డారని ఎంపీ రవిచంద్ర మంత్రి కుమారస్వామికి వివరించారు.ఈ విషయమై మాజీ మంత్రి జోగు రామన్న నాయకత్వాన కార్మిక నాయకులతో కూడిన ఒక ప్రతినిధి బృందం వచ్చే నెల 2వతేదీన ఢిల్లీ వస్తున్నదని,వారు కలిసేందుకు అపాయింట్ మెంట్ ఇవ్వాల్సిందిగా ఎంపీ వద్దిరాజు కోరగా, మంత్రి కుమారస్వామి సానుకూలంగా స్పందించారు.

అమ్మ చారిటబుల్ ట్రస్ట్ చేయూత.

అమ్మ చారిటబుల్ ట్రస్ట్ చేయూత

 

పాలకుర్తి నేటిధాత్రి

 

ఎస్సీ కాలనీకి చెందిన గాయాల మధు (మానసిక వికలాంగుడు) అనారోగ్యంతో మృతిచెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ట్రస్ట్ తరుపున పూర్తి సహకారంగా ఉంటామని ధైర్యం చెప్పి 25 కేజీల బియ్యం, నిత్యావసరాలు, కూరగాయలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ యతిపతి శ్రీకాంత్, జనరల్ సెక్రటరీ జీడి హరీష్, కోశాధికారి ఒర్రె కుమారస్వామి, ట్రస్ట్ సభ్యులు పెండ్లి భాస్కర్, తాళ్లపెళ్లి రత్నాకర్, ఈ కార్యక్రమంలో గాదేపాక భాస్కర్, మృతుడి కుటుంబసభ్యులు, తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version