బస్సు సౌకర్యం లేక అవస్థలు.

బస్సు సౌకర్యం లేక అవస్థలు

బయటకు వెళ్లాలంటే మూడు కిలోమీటర్లు వెళ్లాల్సిందే

నేటిధాత్రి :

 

 

మహిళలు, విద్యార్థులు, ప్రజలు,వైద్యం, ఇతర అవసరాల నిమిత్తం బయటికి పోవాలంటే ప్రజలకు బస్సు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారు. మారుమూల గ్రామాలకు చెందిన ప్రజలు కిలోమీటర్ల మేరకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పాత బస్సు సర్వీసులను పునరు ద్ధరించాలి.

వ్యవసాయ మోటార్ల దొంగలు ఇద్దరు అరెస్ట్..

అంతర్ జిల్లా వ్యవసాయ మోటార్ల దొంగలు ఇద్దరు అరెస్ట్..

వ్యవసాయ మోటార్ల దొంగలను చాకచక్యంగా పట్టుకున్న పోత్కపల్లి పోలీసులు

39 వ్యవసాయ మోటార్స్ మరియు 750 మీటర్స్ సర్వీస్ వైర్ స్వాధీనం.

వీటి విలువ మొత్తం కలిపి 10,67,500/- రూపాయలు

 

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

 

 

 

వ్యవసాయ మోటార్ల దొంగలను పోత్కపల్లి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈరోజు పోలీస్ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు మీడియా సమావేశంలో పెద్దపల్లి డిసిపి కరుణాకర్ నిందితుల అరెస్టు వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా డిసిపి కరుణాకర్ మాట్లాడుతూ ఈజీగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో ఇద్దరు నిందితులు గత రెండు నెలలుగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ సర్కిల్ పరిధిలో లో రైతులు బావులపై, వాగులపై, చెరువు లపై, వ్యవసాయ నీటి అవసరాల కోసం ఏర్పాటు చేసుకున్న మోటార్లు, మోటార్ సర్వీస్ లను నిందితులు దొంగలించారు. ఈ దొంగతనాలకు సంబంధించి సర్కిల్ పరిధిలో కేసులు నమోదు చేయడం జరిగింది.ఇట్టి కేసుల దర్యాప్తు చేస్తున్న పోత్కపల్లి పోలీసులు ఈ రోజు పోత్కపల్లి మండల పరిధిలో శానగొండ గ్రామ శివారు జమ్మికుంట వెళ్లే రహదారిలో పోత్కపల్లి ఎస్సై ఉదయం10:00 గంటల ప్రాంతం లో వాహనాలు తనిఖీ చేస్తుండగా ట్రాలీ లో ఇద్దరు వ్యక్తులు సిరిగిరి ప్రసాద్ మరియు అంగిడి సాయికుమార్ అనే వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించగా వారిద్దరినీ పోలీసులు అదుపులకి తీసుకోని ట్రాలీ ని ఆపి తనిఖీ చేయగా అనుమనస్పదంగా వ్యవసాయ మోటర్స్, కరెంట్ సర్వీస్ వైర్ కనిపించగా దీని మీద పోలీసులు ఆరా తీయగా మొత్తం వ్యవహారం అంతా బయటకు వచ్చింది. వీరి దగ్గర నుంచి 39 మోటార్స్,750 మీటర్స్ సర్వీస్ వైర్, ట్రాలీ సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు.
వివరాల్లోకి వెళితే….

 

Police

 

సిరిగిరి ప్రసాద్, తారకరామ కాలనీ, ఓదెల, పాత ఇనుపసామను వ్యాపారం చేస్తూ జీవిస్తాడు. సరియైన గిరాకీ లేక ఇబ్బందులు పడుతూ, అతిగా మద్యానికి, జల్సాలకు అలవాటుపడి ఎలాగైనా డబ్బులు సంపాదించాలనే దుద్దేశ్యం తో ఆన్లైన్ బెట్టింగ్ ఆర్థిక లో డబ్బులు పెట్టి పేకాట ఆడి డబ్బులు పోగొట్టుకొన్నాడు. ఎలాగైనా డబ్బులు సంపదిన్చాలనే చెడు ఉద్దేశ్యంతో చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ, గత 2 నెలల నుంచి ఓదెల గ్రామస్థుడు ఐన అంగిడి సాయికుమార్ s/o సమ్మయ్య తో పరిచయం ఏర్పడి, ఇద్దరం కలిసి మధ్యం సేవిస్తూ రాత్రి సమయలలలో ఇద్దరం కలిసి చిన్న చిన్న పాత ఇనుప సామాను దొంగాలించి గుర్తు తెలియని వ్యక్తులకు అమ్ముకొనేవారు. వీరి జల్సాలకు డబ్బులు సరిపోక, చుట్టుపక్కల రైతుల కరెంటు మోటర్లు దొంగతనం చేసి అమ్ముకొని నిర్ణయించుకొన్నాని పోత్కపల్లి, కాల్వ శ్రీరాంపూర్, జూలపల్లి, సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ ల పరిధిలో 39 వ్యవసాయ కరెంట్ మోటార్ లు, 750 మీటర్స్ కరెంట్ సర్వీస్ వైర్ ( కాచాపూర్ శివార్ లోని 6 మోటార్లు, కొనరాపేట్ శివారు లోని 1 మోటార్, మల్యాల శివారు లోని 100 మీటర్ల వైరు, మడిపల్లి కెనాల్ దగ్గర 01 మోటార్, శివపల్లి శివారు లోని బావి వద్ద 1 మోటార్, కొమిరె SRSP కెనాల్ దగ్గర్ 6 మోటార్ లు, కొలనూర్ శివారులోని 5 మోటర్లు మరియు పోత్కాపల్లి, శానగొండ శివారులోని 4 మోటర్లు, 17 బావుల వైర్లు 170 మీటర్లు, రూప్ నారాయణ పేట మానేరు లోని 23 బోరు మోటార్ ల వైర్లు 270 మీటర్లు, ఓదెల శివారులోని 6 మోటార్లు మరియు రూపనారాయణపేట శివారులోని 200 మీటర్ల వైరు ) ఆటో ట్రాలీలో తిరుగుతూ మోటార్లను ఎత్తుకెళ్ళడం వీరి అలవాటు. బోర్ ల మోటార్ లు, సర్వీస్ వైర్ లు దొంగలించి రైతులకు తీవ్ర నష్టం చేసి రైతులను భయాందోళనలకు గురి చేసారు.
ఈ దొంగలను పట్టుకోవడం లో ప్రతిభ కనబరిచిన పోత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ తో పాటు 13 మంది సిబ్బందిని అభినందించి డీసీపీ రివార్డులు అందజేశారు.ఈ కార్యక్రమం లో పెద్దపల్లి ఏసీపీ జి. కృష్ణ, సుల్తానాబాద్ సీఐ సుబ్బా రెడ్డి, పోత్కపల్లి ఎస్ఐ దీకొండ రమేష్,మరియు సిబ్బంది పాల్గొన్నారు.

శాయంపేట మండల సమస్య తీరేది ఎన్నాడో!

శాయంపేట మండల సమస్య తీరేది ఎన్నాడో!

ఆర్టీసీ బస్సు రాదు.. అవస్థలు తీరవు

ప్రభుత్వం స్పందించి బస్సు సౌకర్యాన్ని కల్పించాలి

శాయంపేట నేటిధాత్రి:

 

 

హనుమకొండ జిల్లా శాయంపేట మండలానికి బస్సు సౌకర్యం లేకపోవడం వలన ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు చాలామంది విద్యార్థులు మహిళలు ఉద్యోగాలు కూలీల ఇతర అవసరాల నిమిత్తం ప్రయాణం చేస్తే ప్రజలు బస్సు సౌకర్యం లేక అవస్థలు అనుభవిస్తున్నారు ముఖ్యంగా విద్యార్థులు మహిళలు ఇతర ముఖ్యమైన పనులకు వెళ్లాలంటే మండల కేంద్రం నుండి జిల్లాకు పోవడానికి 30 కిలోమీటర్ల దూరానికి పోవుట గూర్చి ఆటోలు ఇతర ప్రైవేట్ వాహనాల ప్రయాణం భారంగా మారింది.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వర్తించని మండలం

కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది.మండల కేంద్రానికి బస్సు సౌకర్యం లేక ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకొని ఆడబిడ్డల కళ నెరవేర్చిన ప్రభుత్వం వెంటనే బస్సు సర్వీస్ లను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు.

బస్సులు నడిపితేనే ప్రయాణం సులువు

శాయంపేట మండల కేంద్రం నుంచి హన్మకొండకు వెళ్లా లంటే ఆటోలో ప్రయాణిస్తూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు విద్యార్థులు, ఇతర పనులకు వెళ్లే ప్రజలు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత ప్రయాణం కల్పిస్తుంది బస్సులు నడిపితేనే ఆర్థిక భారం తగ్గుతుందని ప్రజలు కోరడమైనది.

మారుమూల గ్రామాలకు లేని బస్సు సర్వీసులు

శాయంపేట మండలంలోని మారుమూల గ్రామాలకు లేని బస్సు సర్వీసులు మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ప్రజలు 8,000 మంది నివసిస్తారు. 24 గ్రామ పంచాయతీలోని ప్రజలు సుమారుగా 30 వేల మందికి పైగా ఉంటారు జిల్లా నుండి మండలానికి బస్సు సౌకర్యం లేక ప్రజలు అవస్థల పాలవు తున్నారు. ప్రభుత్వం ఈ సమస్యను గుర్తించి వెంటనే పాత బస్సు సర్వీసులను పునరుద్ధరించాలి.

‘భూభారతితో భూ సమస్యలు పరిష్కారమవుతాయి’.

‘భూభారతితో భూ సమస్యలు పరిష్కారమవుతాయి’

భూభారతితో భూములకు భరోసా

ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి

మహబూబ్ నగర్/ నేటి ధాత్రి

 

 

మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టం అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ మరియు రెవెన్యూ అధికారులతో కలిసి పాల్గొన్న దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..భూ భారతి చట్టం ద్వారా భూ వివాదాలకు శాశ్వతంగా పరిష్కారం లభిస్తుందని, రైతుల భూములకు పూర్తి భరోసా లభిస్తుందని, రైతుల భూ సమస్యలు శాశ్వతంగా తీరుతాయని, ఇకపై గ్రామాల్లో భూ పంచాయితీలు, వివాదాలు ఉండవని అన్నారు. భూములకు సంబంధించి శాశ్వత పరిష్కారం చూపించాలన్న ఉద్దేశంతో భూ భారతి చట్టం, పోర్టల్ తెచ్చామని, భూ భారతిపై ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు.

 

Land issues

రైతులను మోసం చేయడానికే గత బీఆర్ఎస్ సర్కార్ ధరణి పోర్టల్ తెచ్చిందని, పేదలకు ఇచ్చిన భూములను సైతం ధరణి పేరుతో కొల్లగొట్టిందని ఆరోపించారు. ధరణి పేరుతో రైతులను, సామాన్యులను కోర్టుల చుట్టూ, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేదాకా తిప్పిందని, 20 లక్షల ఎకరాలను ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టడం వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారని అన్నారు. సాదా బైనామాలతో పాటు ఇతర ఏ సమస్య ఉన్న పరిష్కరిస్తామని తెలిపారు. పేర్లు, సర్వే నంబర్లు, ఎకరాలు తప్పు పడినా గతంలో కార్యాలయాలు చుట్టూ తిరిగిన పనులు కాలేదని, ప్రస్తుతం చట్టం ద్వారా పరిష్కరిస్తామని తెలిపారు. ఒక్క రూపాయి చెల్లించకుండా రైతులు నేరుగా MRO, ఆర్డీవో, కలెక్టర్ల ద్వారా భూ సమస్యలు పరిష్కరించుకోవచ్చని సూచించారు. మే 1 నుంచి ప్రతి రెవెన్యూ గ్రామాలకు అధికారులు వచ్చి రైతుల నుండి దరఖాస్తులు స్వీకరించి పరిష్కరిస్తారని తెలిపారు.
భూభారతి కింద భూముల వివరాలను డిజిటలైజేషన్ చేస్తామని, దీంతో భవిష్యత్‌లో రైతులకు భూ సమస్యలు, వివాదాలు రావన్నారు. భూభారతి చట్టం దేశానికి రోల్ మోడల్‌గా నిలుస్తుందని చెప్పారు, ఈ చట్టం ద్వారా భూములపై పూర్తి యాజమాన్య హక్కులు లభిస్తాయన్నారు, ఈ పోర్టల్‌పై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలని కోరారు.

అధికారుల తీరు మార్చుకోవాలి.     

ఏజెన్సీ చట్టాలను గౌరవించండి…

అధికారుల తీరు మార్చుకోవాలి.     

భారతదేశంలో అందరు
బతుకులు మారిన ఆదివాసి బతుకులు మారడం లేదు

ఏజెన్సీలో ఆదివాసీల అభివృద్ధి ఎక్కడ..

గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి..

నూగూర్ వెంకటాపురం

నేటి ధాత్రి /ములుగు జిల్లా వెంకటాపురం:

 

 

ఏజెన్సీ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు, తమ ఉద్యోగ ధర్మాన్ని విస్మరించకుండా, ఏజెన్సీలో ఉన్న విలువైన శాసనాలను గౌరవించాలని. ఆదివాసీల అభివృద్ధి కోసం, నిరంతరం పాటుపడాలని గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి విజ్ఞప్తి చేశారు. మండల కేంద్రంలో జరిగిన జీఎస్పీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో సాయి మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా, అభివృద్ధి పథకాలు మారినా, ఏజెన్సీలోని ఆదివాసీల బ్రతుకులు మారడం లేదని, ఏజెన్సీ చట్టాల ఉల్లంఘన ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంబేడ్కర్ ఇచ్చిన హక్కుతో చట్టసభలకు ఎన్నిక అవుతున్న స్థానిక ప్రజాప్రతినిధులు గిరిజనేతరులకు,కొమ్ముగాస్తూ, ఆదివాసి గూడేల అభివృద్ధికి సైంధవుల్లా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ప్రజా ప్రతినిధుల మాయమాటలకు ఆదివాసీలు మోసపోతూనే ఉన్నారని అన్నారు. ఏజెన్సీలోని ప్రత్యేక చట్టాల అమలుకు, ప్రభుత్వ పథకాల పంపిణీలో, ఆదివాసీల అభివృద్ధికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల, 1/70, ఎల్ టి ఆర్ లాంటి చట్టాలు నీరు గారి పోతున్నాయని, రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కుల కోసం నిరంతరం పోరాటాలు చేయాల్సి వస్తుందంటే, పాలకుల, ప్రభుత్వ ఉద్యోగుల నిర్లక్ష్య ధోరణి వళ్ళనే అని మండిపడ్డారు. పాలకులు వస్తుంటారు, పోతుంటారు, ఉద్యోగులు మాత్రం ఆత్మస్తుతి పరినిందలా వ్యవహరించ కుండా, ఆత్మ సాక్షిగా, ఆదివాసీల అభివృద్ధికి, చట్టాల అమలుకు కట్టబడి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగం ద్వారా అంబేడ్కర్ అందించిన హక్కులకోసం, మన్యం బిడ్డల అభివృద్ధి కోసం, గోండ్వానా సంక్షేమ పరిషత్ నిరంతరం విశ్రమించకుండా పోరాడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో చంటి,నరేష్ పాల్గొన్నారు

అనారోగ్యంతో బాధపడుతున్న శశి ను పరామర్శించిన.

అనారోగ్యంతో బాధపడుతున్న శశి ను పరామర్శించిన ఎమ్మెల్యే

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ శాసనసభ్యులు కోనీటి మాణిక్ రావు
అనారోగ్యంతో బాధపడుతూ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న ఉద్యమకారుడు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శశి,విషయం తెలుసుకున్న శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు, పార్టీ సీనియర్ నాయకులు నామ రవికిరణ్,మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్, మోహీ ఉద్దీన్,తులసి దాస్,గణేష్ తదితరులు వారి నివాసానికి చేరుకుని పరామర్శించడం  జరిగింది.

ఘనంగా. ఈస్టర్. పండుగ వేడుకలు

ఘనంగా. ఈస్టర్. పండుగ వేడుకలు

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 


జహీరాబాద్ నియోజకవర్గం గ్రామాల్లో..ఘనంగా. ఈస్టర్ పండుగ వేడుకలు. నిర్వహించారు. యేసు క్రీస్తు. వారు. మానవాళి. పాప పరిహారం. నిమిత్తం. సిలువ వేయబడి.. తిరిగి మూడవ రోజు నాడు తిరిగి లేచాడని. క్రైస్తవులు. నమ్ముతారు..ఆయన. శుక్రవారం నాడు.సిలువ వేయబడి.. శనివారం నాడు.. సమాధిలో.. ఉంచబడి.. ఆదివారం ఉదయం. ముడున్నర. గంటల సమయం లో సమాధిలో నుండి. తిరిగి పునరుతానుడై. లేప బడుతాడు..ఆ తరువాత కొందరు శ్రీలకు. అటు తరువాత ఐదు వందలకు పైగా. మనుషుల కు కనిపించి. అటు తరువాత. ఆయన.. పరలోకం వెళ్లిపోయడు.. అందు నిమిత్తం.. ఇస్టర్.. పండుగ ను. నిర్వహించు కొంటారు.. ఈ పండుగ కార్యక్రమం లో. పాస్టర్ లు. సంఘపెద్దలు. భక్తులు. యువకులు. తదితరులు పాల్గొన్నారు

పేకాట స్థావరంపై దాడులు ఐదుగురి అరెస్ట్.

పేకాట స్థావరంపై దాడులు ఐదుగురి అరెస్ట్, రూ. 25వేలు స్వాధీనం

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

ఝరాసంగం: సంగారెడ్డి జిల్లా ఝరాసంగం
మండలం గుంత మర్పల్లి గ్రామంలో పేకాడుతున్న వారిని అరెస్టు చేసినట్లు ఎస్సె నరేష్ తెలిపారు. నమ్మద గిన సమాచారంతో ఆదివారం సాయంత్రం గుంత మర్పల్లి గ్రామ శివారులో పేకాట ఆడుతున్న స్థావరంపై దాడులు నిర్వహించి ఐదుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ. 25,090ల నగదుతో పాటు పేక ముక్కలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.

ఆర్టిఐ నేత చర్లపల్లి వెంకటేశ్వర్లు ను పరామర్శించిన.

ఆర్టిఐ నేత చర్లపల్లి వెంకటేశ్వర్లు ను పరామర్శించిన
రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామిడీ సతీష్ రెడ్డి
ఆర్టిఐరాష్ట్ర కమిటీ సభ్యుడు కమలాకర్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

ఇటీవల రోడ్ ప్రమాదములో గాయపడ్డ భూపాల్ పల్లి జిల్లా సమాచార హక్కు చట్టం యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ జిల్లా కన్వీనర్ చర్లపల్లి వెంకటేశ్వర్లును మొగుళ్ళ పల్లి మండలం ఎల్లా రెడ్డి పల్లి గ్రామంలో ఆదివారం రోజున తెలంగాణ సామాజిక రచయితల సంఘం రాష్ట్ర అధ్య క్షులు కామిడి సతీష్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు ముఖ్య సలహాదారులు కల్వల కమలాకర్ రావు లు పరామర్శించారు ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు సమాచార హక్కు చట్టాన్ని ప్రతీ గ్రామము లోకి తీసుకు వెళ్లిన వెంకటేశ్వర్లు రోడ్ ప్రమాదము లో గాయపడడం బాధాకరం అన్నారు వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు

బీరప్ప స్వామి వారికి ఘనంగా బోనాలు.

శ్రీశ్రీశ్రీ బీరప్ప స్వామి వారికి ఘనంగా బోనాలు

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

ఝరాసంగం మండలం లోని కొల్లూర్ గ్రామస్తులు, గొల్ల కుర్మ కులస్తులు మహిళలు బుధవారం శ్రీ బీరప్ప స్వామి వారి జాతర ఉత్సవాలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఉదయం స్వామి వారికి అభిషేకము, కుంకుమార్చన, అలంకరణ, సాయంత్రం గ్రామానికి చెందిన మహిళలు గ్రామస్తులు బోనాలతో ఊరేగింపుగా వచ్చి బోనాల నైవేద్యం సమర్పించారు. ఊరేగింపులో పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాల మధ్య భక్తిశ్రద్ధలతో బోనాల ఊరేగింపు శోభాయ మానంగా జరిగింది. ఉత్సవాలు తిలకించేందుకు వివిధ గ్రామాల ప్రజలు తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శ్రీ బీరప్ప దేవాలయ కమిటీ కుర్మా సంఘం గ్రామ పెద్దలు పూర్తిస్థాయి ఏర్పాటు చేసి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

దంచి కొడుతున్న ఎండలు.!

దంచి కొడుతున్న ఎండలు.. ఉక్కపోతతో ప్రజల ఉక్కిరి బిక్కిరి

నిప్పుల కొలిమి..!

◆ దంచి కొడుతున్న ఎండలు

◆ ఉక్కపోతతో ప్రజల ఉక్కిరి బిక్కిరి

◆ జిల్లాలో 42.5 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

◆ జాగ్రత్తలు పాటించాలని వైద్యుల సూచన

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

సంగారెడ్డి జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. భానుడు ఉగ్రరూపం దాల్చి తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉదయం 8 దాటితే భానుడు భగభగమనడంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. సూర్యుడు రోజురోజుకూ తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఎండలు దంచికొడుతున్నాయి. ఎండ వేడిమి తట్టుకునేందుకు ఫ్యాన్లు, కూలర్లు నడిచినా ఉక్కపోతతో సతమతమవుతున్నారు. ఉదయం 10 గంటలకే ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఎండకు తోడుగా వడగాల్పులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జిల్లాలోని 38 ప్రాంతాల్లో 40.1 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లా జిన్నారం, కడ్పల్, నిజాంపేట్, కల్హేర్ 42.1 పైగా గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, న్యాల్ కల్, కోహిర్, ఝరాసంగం, 39 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదయింది. శనివారం 40 డిగ్రీలు ఉన్న ఉష్ణోగ్రత ఆదివారం వచ్చేసరికి 42.5 డిగ్రీలు దాటేసింది. 

 

Temperatures

 

జిల్లాలో ఉష్ణోగ్రతల వివరాలు..

పాల్వట్ల, అన్నాసాగర్, పాశమైలారం, దిగ్వాల్, సిర్గాపూర్, పుల్ కాల్, గుండ్ల మాచనూర్, నారాయణఖేడ్, ఆర్సీ పురం, 41.1 పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వట్టిపల్లి, హత్నూర్, మనూర్, అందోల్, లక్ష్మీ సాగర్, పటాన్ చేరు, మునిపల్లి, కంది, సదాశివపేట్, కిష్టారెడ్డిపేట్, కంగిటి, సుల్తాన్ పూర్, గుమ్మడిదల, కొండాపూర్, రాయికోడ్, రుద్రారం, చౌటకూర్, జహీరాబాద్, మొగుడంపల్లి, నాగలిగిద్ద, సంగారెడ్డి, ముక్తాపూర్ తదితర ప్రాంతాల్లో 40.1 డిగ్రీలకు పైగా ఎండలు దంచి కొట్టాయి. మరోవైపు రాత్రి పూట ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. అర్ధరాత్రి ఉక్కపోత ఎక్కువగా పెరగడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండలకు ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని డాక్టర్లు సూచిస్తున్నారు.

అత్యవసరమైతేనే బయటికి వెళ్లండి..

 

Temperatures

 

పలు ప్రాంతాలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బయటకు వెళ్లేటప్పుడు తాగునీటిని వెంట తీసుకె ళ్లాలి. ఓఆర్ఎస్ ను విని యోగించాలి. 12గం టల నుంచి 3గంటల వరకూ బయటకు వెళ్లాడు అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలి. చిన్నపిల్లలను, గర్భిణులు, వృద్ధులను ఎండలో బయటకు తీసుకెళ్లకూ దదు. చాయ్, కాఫీ, ఆల్కహాల్ చక్కెర అధికంగా ఉన్న ద్రవపదార్థాల ను తీసుకోవద్దు. తీవ్రమైన తలనొప్పి, వాంతులు, విరేచనాలు, ఉంటే వెంటనే డాక్టర్లను సంప్రదించాలి. అత్యవసరమైతే డాక్టర్లు సంపాదించాలి.

సరమైతే డాక్టర్లు సంపాదించాలి. -డాక్టర్ రమ్య, మండల వైద్యాధికారి ఝరాసంగం,

తెలంగాణ పేగు బంధమే బిఆర్‌ ఎస్‌.

తెలంగాణ ఆత్మ గౌరవమే కేసీఆర్‌

తెలంగాణ జీవం వున్నంత వరకు కేసీఆర్‌ కీర్తి అజరామరంగా వెలుగుతుంది

ఇప్పటికీ రామ రాజ్యం గురించి చెప్పుకున్నట్లే వచ్చే తరాలు కేసిఆర్‌ గురించి చెప్పుకుంటాయంటున్న బిఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు, హుస్నాబాద్‌ మాజీ ఎమ్మెల్యే ఒడితల సతీష్‌ కుమార్‌, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో పంచుకున్న అనేక ఉద్యమ విశేషాలు ఆయన మాటల్లోనే…

`తెలంగాణ దేవుడు కేసిఆర్‌ అని భవిష్యత్తు తరాలు కొలుస్తారు

`తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ బీఆర్‌ఎస్‌.

`బిడ్డ పుట్టినప్పుడు ఎలా వుందో అలాగే వుండాలనుకోరు.

`టీఆర్‌ఎస్‌ నుంచి బిఆర్‌ఎస్‌గా మారడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు.

`ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీ కావడం గిట్టని వారు చేస్తున్న అసత్య ప్రచారం.

`తెలంగాణ ఆత్మ, ఆవిష్కారం బీఆర్‌ఎస్‌

`ప్రజల గుండెల్లో వెయ్యేల్లు నిలిచిపోయే పార్టీ బీఆర్‌ఎస్‌

`కాంగ్రెస్‌, బీజేపీలు తెలంగాణకు వ్యతిరేక పార్టీలు

`తెలంగాణ ఇస్తామని మాటిచ్చి పదేండ్లు దాట వేసిన పార్టీ కాంగ్రెస్‌

`సమైక్య వాదుల కుట్రలు నమ్మి ప్రకటించిన తెలంగాణ వెనక్కి తీసుకున్నది కాంగ్రెస్‌

`కేసీఆర్‌ ఆమరణ దీక్షకు భయపడి కాంగ్రెస్‌ తెలంగాణ ఇచ్చింది

`తప్పని పరిస్థితులలో బీజేపీ సమ్మతిచ్చింది

`ఇప్పటికీ తెలంగాణపై బీజేపీ కడుపులో కత్తులు పెట్టుకున్నది

`ఆనాడు తెలంగాణ ఎందుకని అద్వానీ అన్నాడు

`తల్లిని చంపి బిడ్డను బతికించారని ప్రధాని మోడీ పలుసార్లు అన్నారు

`తెలంగాణ ఆత్మగౌరవం రాష్ట్ర బీజేపీ నాయకులలో లేదు

`తెలంగాణపై ఆ పార్టీ పెద్దలు విషం చిమ్ముతున్నా పదవులు పట్టుకొని వేళాడుతున్నారు

`తెలంగాణ కోసం కొట్లాడితే ఆ విలువ బీజేపీ నాయకులకు తెలిసేది

`తెలంగాణ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే, కిషన్‌ రెడ్డి అమెరికా వెళ్లిపోయాడు

`తెలంగాణ తల్లి బిడ్డలే బీఆర్‌ఎస్‌ నాయకులు

`తెలంగాణ తల్లికి ద్రోహం చేసినవే ఆ రెండు పార్టీలు

`అందుకే బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ అంటే ఎండాకాలంలో గజగజ వణుకుతున్నారు

`రెండు పార్టీలకు తెలంగాణ మనుగడ వుండదని భయపడుతున్నారు

అప్పటికీ, ఇప్పటికీ,ఎప్పటికీ తెలంగాణ పేగుబంధం బిఆర్‌ఎస్‌కు మాత్రమే వుంటుంది. ఎందుకంటే తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ బిఆర్‌ఎస్‌. తెలంగాణ గురించి, బిఆర్‌ఎస్‌ పార్టీ గురించి మాట్లాడే నైతికత ఏ పార్టీకి లేదు. ఎందుకంటే ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో వున్న అన్ని పార్టీలు తెలంగాణను వ్యతిరేకించిన పార్టీలే. ఆనాడు కాంగ్రెస్‌ పార్టీ గెలుపుకోసం, అదికారంకోసం తప్పని పరిస్దితుల్లో తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్‌ అన్నదే తప్ప, ఆ పార్టీకి చిత్తశుద్ది ఆనాడు లేదు. ఇప్పుడూ లేదు. ఒక ఓటు రెండు రాష్ట్రాలంటూ మాయ మాటలు చెప్పి, తెలంగాణ ఏర్పాటుకు సహకరించని పార్టీ బిజేపి. బిజేపి ఎన్టీయే హయాంలో మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసి, తెలంగాణకు తీరని అన్యాయం చేసిన పార్టీ బిజేపి. ఆ రెండు పార్టీలలో తెలంగాణ ఆత్మ ఇసుమంతైనా కనిపించదు. నిజంగా తెలంగాణ ఇవ్వాలన్న ఆలోచన కాంగ్రెస్‌కు వుంటే సమైక్యవాదుల కృత్రిమ ఉద్యమానికి మద్దతు పలికేదే కాదు. తెలంగాణ ఇవ్వకుండా తప్పించుకునే అవకాశం దొరికిందని తెలంగాణ ప్రకటన వెనక్కి తీసుకునేదే కాదు. తెలంగాణ ప్రకటించి పట్టుమని పది రోజులు కూడా కాకముందే తెలంగాణను వెనక్కి తీసుకుని కాంగ్రెస్‌ ఎప్పుడో తెలంగాణ ద్రోహం చేసింది. కేవలం అధికారం కోసం తెలంగాణ ప్రజల ఆత్మాభిమానాన్ని కూడా లెక్కచేయని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఇప్పటికీ మనస్పూర్తిగా జై తెలంగాణ అనరు. అనడానికి కూడా మనసురాదు. ఇప్పుడు పాలను సాగిస్తున్న ముఖ్యులెవరైనా సరే ఏ సభలోనైనా సరే జై తెలంగాణ అనడం జరుగుతుందా? కనీసం ప్రజలు ఏమనుకుంటారో అన్న భయం కూడా వారిలో లేదు. ఎందుకంటే ఆ కాంగ్రెస్‌ నాయకులు జై తెలంగాణ అంటే కూడా ఎక్కడ ఆ క్రెడిట్‌ కేసిఆర్‌కు వెళ్తుందో అనే భయమే ఆవహించి వుంది. అది చాలు తెలంగాణ ఆత్మలో కేసిఆర్‌ మాత్రమే వున్నాడని చెప్పడానికి అంటున్న బిఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు, హుస్నాబాద్‌ మాజీ ఎమ్మెల్యే ఒడితల సతీష్‌ కుమార్‌ , నేటి దాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావుతో కేసిఆర్‌ గొప్పదనం, బిఆర్‌ఎస్‌ పార్టీ ప్రస్ధానంపై చెప్పిన ఆసక్తికరమైన విషయాలు ఆయన మాటల్లోనే…

ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ ఆత్మగౌరవమే కేసిఆర్‌. తెలంగాణ అనే జీవం వున్నంత వరకు కేసిఆర్‌ కీర్తి అజరామరంగా వెలుగుతూనే వుంటుంది. యుగాలు మారినా రామ రాజ్యం గురించి ఎలా చెప్పుకుంటున్నారో, తరాలు ఎన్ని మారినా భవిష్యత్తులో కేసిఆర్‌ ఉద్యమం, స్వర్ణయుగ పాలన గురించి నిత్యం చెప్పుకుంటారు. అంతగా తెలంగాణను తీర్చిదిద్దిన నాయకుడు కేసిఆర్‌. దేశంలో కేవలం రాష్ట్ర సాధనకోసం ఏర్పాటైన పార్టీలు రెండు. జార్ఖండ్‌ ముక్తి మోర్చా. రెండోది బిఆర్‌ఎస్‌. అయితే జార్ఖండ్‌ కోసం కేసిఆర్‌ సాగించింతనంత ఉద్యమం సాగలేదు. పద్నాలుగేళ్ల సుదీర్ఘ కాలం జరగలేదు. తెలంగాణ ఆత్మ ఆవిష్కారం కోసం, ఆత్మగౌరవం కోసం, అస్దిత్వం కోసం, స్వయం పాలన కోసం కేసిఆర్‌ తెగించి, పద్నాలుగు సంవత్సరాల పాటు సాగించిన ఉద్యమం చరిత్రలో నిలిచిపోయింది. ప్రపంచ ఉద్యమ చరిత్రలకే పాఠాలు నేర్పింది. అంత గొప్పది కేసిఆర్‌ సాగించిన ఉద్యమం. చైనా లాంటి దేశాలలో తెలంగాణ ఉద్యమం గురించి పాఠాలుగా చెప్పుకుంటున్నారంటే అది కేసిఆర్‌ గొప్పదనం. ఆయన త్యాగం. భవిష్యత్తు తరాలు ఖచ్చితంగా కేసిఆర్‌ను దేవుడుగా కొలుస్తారు. ఒక్క రాజమండ్రి బ్రిడ్జిని కట్టిన కాటన్‌ దొరనే కోనసీమలో దేవుడు అని కొలుస్తున్నారంటే ఎడారి లాంటి తెలంగాణను బంగారు మాగాణ చేసి, సిరుల పంటలు పండేలా చేసిన కేసిఆర్‌ను ఇంకెంత గొప్పగా కీర్తించాలి. ఇంకెంత భక్తితో కొలువాలి. అందుకే భవిష్యత్తు కాలంలో కేసిఆర్‌ను స్మరించకుండా సాగు కూడా చేయరు. అంతగా కేసిఆర్‌ రైతు బాంధవుడయ్యారు. రైతును రాజును చేసిన కీర్తిని సంపాదించుకున్నారు. అలాంటి కేసిఆర్‌ కేవలం తెలంగాణ ఉద్యమం కోసం బిఆర్‌ఎస్‌ ఏర్పాటుచేసి ఇప్పటికీ 25 సంవత్సరాలు పూర్తవుతోంది. ఇంత కాలం ఒక పార్టీ మనుగడ సాగించడం అంటే సామాన్యమైన విషయం కాదు. ప్రజల గుండెల్లో కేసిఆర్‌ కొలువై వుండడం వల్లనే సాధ్యమౌతోంది. బిఆర్‌ఎస్‌ పార్టీ పురుడు పోసుకున్న నుంచి చిదిమేయాలని సమైక్యవాదులు అనేక సార్లు చూశారు. పార్టీని పలుసార్లు చీల్చే ప్రయత్నం చేశారు. బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను లాక్కున్నారు. తెలంగాణ ఉద్యమం లేదని చెప్పే ప్రయత్నం చేశారు. బిఆర్‌ఎస్‌ను లేకుండా చేయాలని కుట్రలు చేశారు. ఏకంగా కేసిఆర్‌ను కూడా భౌతికంగా లేకుండా చేయాలని అనేక సార్లు రెక్కిలు కూడా నిర్వహించారు. కేసిఆర్‌ పుట్టిందే తెలంగాణకోసం. కేసిఆర్‌ రాజకీయం చేసిందే తెలంగాణ కోసం. కేసిఆర్‌ ఉద్యమ జెండా ఎత్తిందే తెలంగాణ కోసం..అలాంటి గొప్ప త్యాగధనుడిపై కుట్రలు చేసిన వారు కాలగర్భంలో కలిసిపోయారు. రాజకీయంగా కనుమరుగైపోయారు. కేసిఆర్‌ మాత్రం పద్నాలుగేళ్లపాటు కొట్లాడి తెలంగాణ తెచ్చారు. డిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించారు. అలాంటి బిఆర్‌ఎస్‌ పార్టీ రజతోత్సవం జరుపుకుంటుంటే ఎండా కాలంలో కూడా కాంగ్రెస్‌, బిజేపిలు గజగజ వనుకుతున్నాయి. తెలంగాణ ప్రజలు అంతా రజతోత్సవ సభ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారని తెలిసి, ఆ పార్టీ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. తెలంగాణ తల్లి నిజమైన బిడ్డలే బిఆర్‌ఎస్‌ నాయకులు. తెలంగాణకు తీరని ద్రోహంచేసిన పార్టీలే కాంగ్రెస్‌,బిజేపిలు. అందుకే ఆ పార్టీలను నమ్మడానికి కూడా తెలంగాణ ప్రజలు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. కాని గత ఎన్నికల్లో ప్రజలకు లేనిపోనివి చెప్పి, చెప్పి, అబద్దాలు ఆడి, ఆడి గెలిచారు. అదికారంలోకి వచ్చిన వెంటనే నయ వంచన మొదలు పెట్టారు. అందుకే వంద రోజుల్లోనే కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం చెప్పివన్నీ అబద్దాలని, మోసాలని ప్రజలకు తెలిసిపోయింది. ఆరు నెలల్లోనే ఎంతో వ్యతిరేకత మూటగట్టుకున్నది. అందుకే బిఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ అంటే కాంగ్రెస్‌కు వణుకు పుడుతోంది. పైగా బిఆర్‌ఎస్‌ సభలంటే ఎలా వుంటాయో ప్రపంచానికి మొత్తం తెలుసు. పోరుగర్జన, సంహిగర్జన, మహాసింహగర్జన, కొంగర కలాన్‌ సభలు ఇప్పటికే చరిత్రోలో నిలిచిపోయాయి. ఇప్పుడు ఒక్క అడుగు వెనక్కి వేసిన పులి వేటకు వెళ్తే ఎలా ముందుకు దూకుతుందో అలా బిఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ వుంటుందని ముందే కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్‌పార్టీలు ఊహిస్తున్నాయి. అందుకు ఆ పార్టీ నాయకులకు నిద్రలు కూడా వుండడం లేదు. ప్రజలు పుట్టల నుంచి చీమలు బైటకు వచ్చినట్లు పల్లెల నుంచి లక్షలాదిగా వరంగల్‌ రజతోత్సవ సభకు వస్తారని తెలుసు. బిఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు వచ్చే సభ రాజకీయ సభల చరిత్రలోనే సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే తెలంగాణ తెచ్చింది కేసిఆర్‌. బిఆర్‌ఎస్‌. తెలంగాణ కోసం కొట్లాడిరది బిఆర్‌ఎస్‌. తెలంగాణ కోసమే పుట్టింది బిఆర్‌ఎస్‌. కాంగ్రెస్‌,బిజేపిలు పక్తు తెలంగాణ వ్యతిరేక పార్టీలు. తెలంగాణ ఇస్తామని చెప్పి పదేళ్లు కాలయాపన చేసి, నమ్మక ద్రోహం చేద్దామనే చూసింది. అది పసిగట్టిన కేసిఆర్‌ ఆమరణ నిరసన దీక్ష చేపట్టారు. కాంగ్రెస్‌కు దిగిరాక తప్పలేదు. లేకుంటే కాంగ్రెస్‌ తెలంగాణ ఇచ్చేదే కాదు. బిజేపి తప్పని పరిస్దితుల్లో సమ్మతిచ్చిందే. ఎందుకంటే తెలంగాణ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేసినప్పుడు కాంగ్రెస్‌,బిజేపి ఎమ్మెల్యేలు ఎవరూ రాజీనామా చేయలేదు. బిజేపి ఏకైక శాసన సభ్యుడుగా వున్న కిషన్‌ రెడ్డి తెలంగాణ ప్రజలు ఒత్తిడి చేస్తారని గ్రహించి అమెరికా వెళ్లిపోయారు. ఇప్పటికీ బిజేపి తెలంగాణపై కడుపులో కత్తులు పెట్టుకొన్నట్లే మాట్లాడుతుంది. 1999 నుంచి 2004 వరకు కేంద్రంలో అదికారంలో వున్న బిజేపి కేంద్ర ప్రేభుత్వంలో ఉప ప్రదానిగా వున్న అద్వానీ తెలంగాణ ఎందుకు అని వెటకారం చేశాడు. తెలంగాణ వచ్చి ఇంతకాలమైనా ప్రధాని మోడీ అవకాశం దొరికినప్పుడుల్లా విషం చిమ్ముతూనే వుంటాడు. పార్లమెంటులో తలుపులు మూసి తెలంగాణ ఇచ్చారంటాడు. తల్లిని చంపి బిడ్డను బ్రతికించారని తెలంగాణ అసి ్దత్వాన్ని అవమాన పర్చుతూనే వుంటాడు. ఎందుకంటే తెలంగాణ బిజేపి నాయకుల్లోనే ఆత్మగౌరవం లేదు. అందుకే కేంద్ర పెద్దలు తెలంగాణను కించపర్చుతుంటారు. తెలంగాణపై ఆ పార్టీ పెద్దలు విషం చిమ్ముతున్నా పదవులు పట్టుకొని వేళాడుతుంటారు. కాని తెలంగాణ కోసం కేసిఆర్‌ పదవులను గడ్డిపోచల్లా వదులుకున్నారు. తెలంగాణ సాధించారు. అందుకే తెలంగాణ జాతి పిత అని కేసిఆర్‌ కొనియాడబడతున్నారు.

మృతి చెందిన తాపీ మేస్త్రి.!

మృతి చెందిన తాపీ మేస్త్రి కార్మికునికి కుటుంబానికి ఆర్థిక చేయూత…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

క్యాతనపల్లి మున్సిపాలిటీ పరదిలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల14వ వార్డ్ పోచమ్మ బస్తీ ఏరియాకు చెందిన భవన నిర్మాణ కార్మికుడు పానుగంటి వెంకటేష్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. అయన కుటుంబం నిరుపేద కావడంతో పట్టణ భవన నిర్మాణ కార్మిక సంఘం సభ్యులందరూ కలిసి 17 వేల 7 వందల రూపాయలను మృతి చెందిన కుటుంబ సభ్యులకు ఆ సంఘం గౌరవ అధ్యక్షుడు గాండ్ల సమ్మయ్య, అధ్యక్షుడు జీలకర్ర రాయమల్లు చేతుల చేతుల మీదుగా అందజేసి మానవత్వం చాటుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చి మనోధైర్యం కల్పించారు. ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఎర్రబెల్లి రాజేష్, సంగ రవికుమార్, భవన నిర్మాణ కార్మిక సంఘం జనరల్ సెక్రెటరీ గొప్ప శంకర్, ట్రెజరరీ కత్తెర సతీష్, సభ్యులు బాదావత్ రాజు, ముంత శ్రీనివాస్, కల్లేపల్లి ప్రసాద్, బొబ్బిలి వీరస్వామి, చొప్పరి నరేష్ తదితరులు పాల్గొన్నారు.

పోలీసులను అభినందించిన బెల్లంపల్లి ఏసిపి రవికుమార్.!

జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు…

బెల్లంపల్లి ఏసిపి రవికుమార్

గంటల వ్యవధిలో దొంగను చేదించిన పోలీసులు…

పోలీసులను అభినందించిన బెల్లంపల్లి ఏసిపి రవికుమార్..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

జల్సాలకు అలవాటు పడి సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో కొందరు దొంగతనాలకు పాల్పడుతున్నారని బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ అన్నారు.
సాంకేతిక పరిజ్ఞానం తో 10 గంటల్లో దొంగతనం కేసు చెందించి దొంగను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు బెల్లంపల్లి ఏసిపి రవి కుమార్ తెలిపారు. రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ లో విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గోదావరి ఖని కి చెందిన ఇమాన్యూల్ అనే యువకుడు జల్సా లకు అలవాటు పడి దొంగతనాలు చేస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. రామకృష్ణపూర్ పట్టణం లోని హనుమాన్ నగర్ లో ఆదివారం తెల్లవారుజామున ఇంట్లో కిటికీ ప్రక్కన నిద్రిస్తున్న మహిళ మేడలో నుండి మూడున్నర తులాల బంగారు పుస్తెల తాడు, ఎదురు ఇంటిలో కిటికీ ప్రక్కన పెట్టిన మొబైల్ ఫోన్ లను ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. బాధితులు పిర్యాదు చేయగా సి.సి కెమెరాలను పరిశీలించి ఇమాన్యూల్ నేరాలకు పాల్పడ్డాడని నిర్ధారిరించుకొని పొలుసులు మూడు బృందాలుగా ఏర్పాటు చేసి ముమ్మర గాలింపు చర్యలు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ సమావేశం లో మందమర్రి సి.ఐ శశిధర్ రెడ్డి,పట్టణ ఎస్.ఐ రాజ శేఖర్, కాసిపేట ఎస్. ఐ ప్రవీణ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. క్రైమ్ టీమ్ సిబ్బంది జంగు, రాకేష్, మహేష్ ,వెంకటేష్, సిసిఎస్ సిబ్బంది సతీష్ శ్రీనివాస్ లను ఏసిపి అభినందించి రివార్డులను అందజేశారు.

బీఆర్‌ఎస్‌ రజతోత్సవం..తెలంగాణ కుంభమేళా సాక్షాత్కారం!

-కాంగ్రెస్‌కు మళ్ళీ ఉద్యమ రోజుల రుచి చూపిస్తాం.

-ప్రజల పక్షాన మరో తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుడతాం.

-కాంగ్రెస్‌ యాభై ఏళ్లైనా లేవకుండా చూస్తాం.

-కాంగ్రెస్‌ ప్రభుత్వం తెచ్చిన చీకటి రోజులను తరిమేస్తాం.

తెలంగాణకు మళ్ళీ కేసిఆర్‌ నాయకత్వంలో వెలుగులు తెస్తాం అంటున్న ‘‘రైతు రుణ విముక్తి కమిషన్‌’’ చైర్మన్‌ నాగుర్ల వెంకన్న నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో బిఆర్‌ఎస్‌ రజతోత్సవ సభతో తెలంగాణలో మరో సారు బిఆర్‌ఎస్‌ కుంభమేళా ఎలా వుంటుందో చూపిస్తామంటూ చెబుతున్న విషయాలు ఆయన మాటల్లోనే..

-పదేళ్లలో అపర భగీరథుడు కేసిఆర్‌ పారించిన నీటి పరవళ్లే కాదు, రజతోత్సవ సభలో జన ప్రవాహం కూడా చూపిస్తాం.

-దెబ్బకు తెలంగాణలో కాంగ్రెస్‌తో కమ్మిన గ్రహణం వీడిపోతుంది.

-కాంగ్రెస్‌ తెచ్చిన అమావాస్య చీకట్లు తరిమి నిండు పున్నమి లాంటి కేసిఆర్‌ పాలన మళ్లీ తెస్తాం.

-ప్రజా కంటక కాంగ్రెస్‌ కు తగిన బుద్ది చెబుతాం.

-ఉద్యమ కాలంలో ద్రోహులను తరిమినట్లు మళ్ళీ తరిమేస్తాం.

-తెలంగాణలో మళ్ళీ బిఆర్‌ఎస్‌ పాలన తెస్తాం.

-రజతోత్సవ సభ సాక్షిగా ఉద్యమానికి పునరంకితమౌతాం.

-తెలంగాణ ప్రతి పల్లెల నుంచి లక్షల మంది వస్తారు.

-కాంగ్రెస్‌, బిజేపి గుండెలు అదిరి, బెదిరిపోతాయి.

-పచ్చగా వున్న తెలంగాణను కాంగ్రెస్‌ విద్వంసం చేస్తోంది.

-పదేళ్లు కేఆర్‌ పాలనలో చల్లగా వున్న ప్రజలను కాంగ్రెస్‌ పీడిస్తోంది.

-పథకాలు అమలు చేయలేక చతికిలపడి తెలంగాణను గోసపెడుతోంది.

-ప్రజల్లో ఆగ్రహం రోజు రోజుకూ పెరిగి కట్టలు తెంచుకునేలా వుంది.

-దేవుడటువంటి కేసిఆర్‌ పాలనపై విషం చిమ్మి అధికారంలోకి వచ్చి జనానికి నరకం చూపిస్తున్నారు.

-అసమర్థుల చేతుల్లో పాలన పెట్టి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

తెలంగాణ ప్రజలకు మాయ మాటలు చెప్పి గద్దె మీద కూర్చున్నవారిలో తెలంగాణ వాదులు లేరు. తెలంగాణ కోసం కొట్లాడిన వారు కాదు. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు. తెలంగాణ ఉద్యమం ఈ తరం వీరుడు, పట్టు వదలని విక్రమార్కులు, తెలంగాణ కల నిజం చేసిన పోరాట యోధుడు చేసిన కృషిలో భాగస్వామ్యమైన వారు కాదు. అలాంటి వారికి తెలంగాణ ఆత్మ ఎలా తెలుస్తుంది. తెలంగాణ అస్థిత్వం గురించి ఏం తెలుస్తుంది. తెలంగాణ ఆత్మ గైరవం వారిలో ఎలా వుంటుంది. పదవుల కోసం ఆశపడే వారికి తెలంగాణ ప్రజల మీద మమకారమెలా వుంటుంది. అందుకే గత ఎన్నికల్లో ప్రజలకు మాయ మాటలు చెప్పి, లేని పోని సృష్టించి, మసిబూసి మారేడు కాయ చేశారు. అత్తెసరు మెజార్టీతో అదికారంలోకి వచ్చారు. నిజాయితీతో, నిబద్దతతో అధికారంలోకి రావాలని కాంగ్రెస్‌ పార్టీ అనుకోలేదు. ఎలాగైనా అధికారంలోకి రావాలనుకున్నారు. 60 ఏళ్లుగా తెలంగాణను ఎలా మోసం చేయొచ్చో తెలిసిన కాంగ్రెస్‌ పార్టీ అధికారం కోసం సర్వం అబద్దాలు చెప్పింది. ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించింది. ఒక్క ఛాన్స్‌ ప్లీజ్‌..ఒక్క ఛాన్స్‌ ప్లీజ్‌ అంటూ ఊరూరు తిరిగి, మనిషి మనిషిని వేడుకొని సానుభూతితో అధికారంలోకి వచ్చారు. అమాయకమైన తెలంగాణ ప్రజలు నమ్మి కాంగ్రెస్‌ను గెలిపించారు. అధికారంలోకి వచ్చిన పట్టుమని పది రోజులు కాకముందే ప్రజలను మోసం చేస్తూ వచ్చారు. ఇచ్చిన హమీలు తుంగలో తొక్కారు. ఆరు గ్యారెంటీలలో వున్న పదమూడుకే దిక్కులేదని చెప్పడానికి 420 హమీల రచనలోనే కాంగ్రెస్‌ అంతరార్ధం చెప్పారు. కాని ప్రజలు ఊహించలేదు. అప్పటికీ తెలంగాణ తెచ్చి, తెలంగాణను కోడి తన పిల్లలను రెక్కల కింద దాచుకున్నంత భద్రంగా రాష్ట్రాన్ని కాపాడుతుంటే కాంగ్రెస్‌ వచ్చిన గద్దలాగా తన్నుకుపోతుందని చెప్పారు. కొన్ని సార్లు మంచికన్నా, చెడు వినసొంపుగా వుంటుంది. నిజం కన్నా అబద్దమే నమ్మేలా చేస్తుంది. అదే జరిగింది. పాపమని ఎన్నుకున్న పాపానికి ప్రజలను గోస పెడుతున్నారు. అందుకే మళ్లీ బిఆర్‌ఎస్‌ తన ఉద్యమ కాలానికి వెళ్లి, కాంగ్రెస్‌కు మరోసారి బుద్ది చెబితే తప్ప మరో యాభై ఏళ్లు దాని నీడ కనిపించదు. ఉనికి వుండదు. అందుకు బిఆర్‌ఎస్‌ శ్రేణులంతా కంకణబద్దులైన వుండాలని కోరుతూ బిఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ రైతు రుణ విముక్తి కమీషన్‌ చైర్మన్‌ నాగుర్ల వెంకన్న, తెలంగాణకు మళ్లీ కేసిఆర్‌ నాయత్వంలో వెలుగులు తెస్తామంటూ రజతోత్సవ సభ విశేషాలను పంచుకుంటూ చెప్పిన ఆసక్తికరమైన విషయాలు ఆయన మాటల్లోనే…

పద్నాలుగేళ్ల క్రితం గోస పడుతున్న తెలంగాణను చూసి చలించిన తెలంగాణ పిత కేసిఆర్‌ జై తెలంగాణ అని నినదించారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించారు. తెలంగాణ సమాజ సాక్షిగా నిలదీశారు. ప్రజలను కదలించారు. తెలంగాణ యావత్‌ సమాజాన్ని దండుగా కదిలించారు. తెలంగాణ ఉద్యమాన్ని ఆకాశంత ఎత్తుగా నిలబెట్టారు. తెలంగాణ సాధించారు. తెచ్చిన తెలంగాణను బంగారు తెలంగాణచేశారు. గొప్ప తెలంగాణను ఆవిష్కరించారు. ఒకప్పుడు ఒట్టిపోయిన ఆవు వంటి తెలంగాణను మళ్లీ కల్పతరువు చేశారు. తెలంగాణలో కరువును తరిమికొట్టారు. తెలంగాణ రైతుకు కష్టం దరి చేరకుండా కళ్లల్లో పెట్టుకొని చూసుకున్నారు. అన్ని వర్గాల ప్రజలను గుండెల్లో పెట్టుకొని కేసిఆర్‌ గొప్పగా పాలించారు. పదేళ్లతో తెలంగాణను దేశంలోనే నెంబర్‌ వన్‌ రాష్ట్రం చేశరు. ఒకప్పుడు ఆకలికేడ్చిన తెలంగాణను అన్న పూర్ణ చేశాడు. తెలంగాణకు నీళ్లివడం అసాధ్యమే కాదు, ఇవ్వడం కుదరదని తెగేసి చెప్పి సమైక్యపాలకులు తెలంగాణకు తీరని అన్యాయంచేశారు. తెలంగాణ అంతా నీరెలా పారదో చూపిస్తాను..తెలంగాణ అంతా సస్యశ్యామలం చేస్తాను. తెలంగాణలో ఒక్క గుంట కూడా పడావు పడకుండా సాగుయోగ్యం చేస్తానని శఫథం పూనిన కేసిఆర్‌ కోటిన్నర ఎకరాల మాగాణగా మార్చారు. రైతుల ఇంట్లో పసిడి రాసులు కురిసేలా చేశారు. అంత గొప్పగా తీర్చిదిద్దబడిని తెలంగాణను కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చి మూడు నెలల్లోనే ప్రజలకు మూచ్చెమటలు పట్టిస్తున్నారు. చెరువులను ఎండబెడుతున్నారు. తెలంగాణలో నీటి జాడలుపోయి, కరువు చాయలు తెచ్చారు. అందుకే కాంగ్రెస్‌ అంటేనే కరువు..కరువు అంటేనే కాంగ్రెస్‌ అని ఎప్పుడో పెద్దలు చెప్పారు. అయితే తెలంగాణ విషయంలో ప్రకృతి తెచ్చిన కరువు ఎప్పుడూ లేదు. సమైక్య రాష్ట్రంలోనైనా, ఇప్పుడు తెలంగానలోనైన కాంగ్రెస్‌ పాలకులు తెచ్చిన కరువు. ప్రజలు చల్లగా వుండడం కాంగ్రెస్‌కు నచ్చదు. ప్రజలు సంతోషంగా వుండడాన్ని కాంగ్రెస్‌ చూడలేదు. అందుకే మాయ మాటలు చెప్పింది. ప్రజలను నిండా ముంచింది. ఇక ఈ అరాచం ఇంకా సాగనివ్వము. కాంగ్రెస్‌ పార్టీని తెచ్చిన చీకట్లను మళ్లీ తరిమేస్తాం..60 ఏళ్లపాటు తెలంగాణను చీకట్లోకి నెట్టి కాంగ్రెస్‌ పాపం మూటగట్టుకున్నది. తెలంగాణ తెచ్చిన కేసిఆర్‌ మూడు నెలల్లో తెలంగాణ అంతటా కాంతులు విరజిమ్మేలా చేశారు. తెలంగాణ ప్రగతికి కరంటుతోనే శ్రీకారం చుట్టారు. ఒకప్పుడు ఎప్పుడు కరంటు వస్తుందో..ఎప్పుడుపోతుందో తెలియని కాలం నుంచి, కనురెప్ప పాటు కూడా కరంటు పోని రోజలు కేసిఆర్‌ తెచ్చారు. ఆ కాంతిని చూసి ఓర్వలేని కాంగ్రెస్‌ మళ్లీ చీకట్లు తెచ్చింది. కరంటు కష్టాలు తెచ్చిపెట్టింది. రైతులను గోస పెడుతోంది. సామాన్య ప్రజల ఉసురుపోసుకుంటోంది. అందుకే ఈ బిఆర్‌ఎస్‌ రజతోత్సవ సభలో అపర భగీరధుడు కేసిఆర్‌ తెలంగాణలో పారించిన నీళ్ల పరవళ్ల లాంటి జన ప్రవాహం చూపిస్తాం..కాంగ్రెస్‌ గుండెల్లో నిద్రపోతాం. దెబ్బకు తెలంగాణపై కాంగ్రెస్‌ కమ్మిన దుష్టగ్రహణం వీడిపోతుంది. తెలంగాణ ప్రజలకు వెలుగు పంచే కాలం ముందున్న భరోసా కల్పించినట్లౌవుంది. రజతోత్సవ సభకు పుట్టల నుంచి చీమలు దండుగా వచ్చినట్లు తెలంగాణ పెల్లల నుంచి లక్షలాది మంది వస్తారు. కాంగ్రెస్‌ గుండెలు దడదడలాడేలా చేస్తారు. తెలంగాణలో బిఆర్‌ఎస్‌ కుంభమేలా చూస్తారు. ప్రజా కంటక కాంగ్రెస్‌ను వచ్చే స్ధానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ది చెబుతాం. ఉద్యమ కాలంలో తెలంగాణ ద్రోహులను తరిమినట్లు, మళ్లీ తెలంగాణకు నష్టం చేస్తున్న వారిని తరిమేస్తాం. తెలంగాణలో మళ్లీ ఇరవై ఐదేళ్ల పాటు సాగే సుస్ధిరమైన బిఆర్‌ఎస్‌పాలన తెస్తాం..ప్రజలకు రెట్టించిన ఉత్సాహంతో సేవ చేస్తాం. తెలంగాణను వజ్రపు తెలంగాణ తయారుచేస్తాం. రజతోత్సవ సభ సాక్షిగా తెలంగాణలో బిఆర్‌ఎస్‌ నేతృత్వంలో మరో ఉద్యమానికి శ్రీకారం చుడాతం…తెలంగాణ అభివృద్దికి పునరంకితమౌతాం. కాంగ్రెస్‌, బిజేపి గుండెలు అదిరిపోయేలా సభను నిర్వహిస్తాం. ప్రజలు కూడా ఎప్పుడెప్పుడు బిఆర్‌ఎస్‌ రజతోత్సవ సభకు వెళ్తామా? అని ఎదురుచూస్తున్నారు. ఆ రోజు కోసం నిరీక్షిస్తున్నారు. అయితే ప్రజలు ఎప్పుడు ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వం పోతుందా? అని ఎదురుచూస్తున్నారు. ఆరు గ్యారెంటీలలో ఒకే ఒక్కటి ఉచిత బస్సు పదకం అమలు చేస్తున్నారు. దాంతో ఆర్టీసీ పూర్తిగా దివాళా తీస్తోంది. ఉచిత బస్సు పధకానికి బిఆర్‌ఎస్‌ వ్యతిరేకం కాదు. కాని దాని వల్ల నష్టపోయిన వర్గాలకు న్యాయం జరగాలని కోరుతున్నాం. పైగా బస్సుల సంఖ్య పెంచకుండా బస్సులను తగ్గించి నడపడం వల్ల సమస్యలు ఎదురౌతున్నాయి. ఇక మిగతా పథకాలన్నీ మర్చిపోయారు. రైతు భరోసాకు దిక్కులేదు. పంటకు పదిహేను వేలు ఇస్తామని చెప్పి మోసం చేశారు. అసలు మా ప్రభుత్వంలో ఇచ్చిన రైతుబంధు పదివేలు కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేయడంలేదు. ఒక్కొ మంత్రి ఒక్కొరకమైన ప్రకటన చేస్తుంటారు. రైతు భరోసాకు ఎప్పుడో మంగళం పాడారు. కాని పదే పదే లేనిపోని ముచ్చట్లు చెబుతున్నారు. ప్రజలను ఇంకా ఎంతో కాలం మాయ మాటలు చెప్పి నమ్మించలేరు. రుణమాఫీ చేశామని చెప్పి మాయ చేశారు. కల్యాణలక్ష్మి పథకంలో లక్షరూపాయలకు తోడు తులం బంగారం ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ఆ పధకం అమలు చేసింది లేదు. అమలు చేస్తారన్న నమ్మకం వారికేలేదు. ప్రజలకు కూడా లేదు. ఇక ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బిఆర్‌ఎస్‌ సునామీలో కాంగ్రెస్‌కు ఒక్కసీటు కూడా రాదు. అంతగా ప్రజా వ్యతిరేకత పెరిగింది. బిఆర్‌ఎస్‌ గ్రాఫ్‌ అమాంతం పెరిగింది. అదే తరుణంలో వచ్చిన రజతోత్సవాలు తెలంగాణలో బిఆర్‌ఎస్‌ మరోసారి ఎదురులేని, తిరుగులేని శక్తిగా మారుతుందని చెప్పడంలో సందేహం లేదు.

ప్రగతి స్టేడియంలో జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్.

ప్రగతి స్టేడియంలో జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్.

శ్రీరాంపూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

 

మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో కొక్కిరాల రఘుపతి రావు జ్ఞాపకార్థంగా ఎంఎల్ఏ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు యువసేన శ్రీరాంపూర్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు. యువకులలో క్రీడా స్ఫూర్తినీ పెంచడంకోసం,మానసిక వికాసం కోసం,స్నేహభావాన్ని పెంపొందించడం కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని కాంగ్రెస్ నాయకులు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో నస్పూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి నూకల రమేశ్,ధర్ని మధు 21 వార్డు ఇంచార్జీ
,మాజీ కౌన్సిలర్లు పుదరీ కుమార్,తెనుగు దేవేందర్,మాజి ఎంపీటీసీ ఎల్పుల రవీందర్,చిలుకా మల్లేష్ వార్డు ఇన్చార్జులు అత్కాపూర్ సతీష్,నియోజక వర్గ యూత్ అధ్యక్షుడు నారిగే నరేష్,అంగిడి ,రాజేష్,ఉప్పల్ రమేష్ మారు మల్లన్న నాగార్జున,ఆర్గనైజర్ భీమిని రాజేష్,కొండే రజినీ కాంత్,గుర్రపు సురేష్,మూట శేఖర్,ప్రదీప్,ప్రశాంత్ తదితర పాల్గోన్నారు

ఓబులాపూర్ గ్రామ శాఖ అధ్యక్షుడి రాజీనామా.

ఓబులాపూర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడి రాజీనామా

మల్లాపూర్ ఏప్రిల్ 18 నేటి ధాత్రి

 

కాంగ్రెస్ పార్టీ కోరుట్ల కాంసెన్సీ ఇంచార్జ్ జువ్వడి నర్సింగ రావు గారు, నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలను కలుపుకోలేక పోతున్నారు మల్లాపూర్ మండలంలో పది సంవత్సరాలు కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్య కర్తలు తీవ్ర ఆవేదనలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వారందరికీ న్యాయం చేయాలని కోరుకుంటూ ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నేను గత పది సంవత్సరాలుగా పార్టీ కోసం పైసలు ఖర్చు పెట్టుకున్నాను కష్టపడ్డాను ఫలితంగా నాకు అవమానాలే ఎదురు అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నర్సింగరావు గారు నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పట్టించుకోకపోవడంలేదు నిరసన గా కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నానని తెలియపరుస్తున్నాను
పల్లె శేఖర్ ముదిరాజ్.
.

అగ్నిప్రమాదం లో సుద్దాల బుచ్చిరాజు.!

అగ్నిప్రమాదం లో సుద్దాల బుచ్చిరాజు కి చెందిన ఇల్లు పూర్తిగా కాలి పోవడం జరిగింది

నేటి ధాత్రి

 

కథలాపూర్

ఇటీవల ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదం లో సుద్దాల బుచ్చిరాజు కి చెందిన ఇల్లు పూర్తిగా కాలి పోవడం జరిగింది ఇట్టి విషయాన్ని మన ఆపద్బాంధవులు ఫౌండేషన్ కి తెలుపగానే వారు స్పందించి సుద్దాల బుచ్చిరాజు కి ఒక నెలకి సరిపడా నిత్యావసర సరుకులతో పాటు వంట చేసుకోవడానికి బొల్లు, గ్యాస్ స్టవ్, చిరెలు మరియు చేద్దార్లు పంపిణీ చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో Dr.సతిష్, గంగాధర్, B. తిరుపతి, సాగర్, జలందర్, గంగాధర్, రాజేందర్ వంశీ తదితరులు పాల్గొన్నారు ఇట్టి దాతలకు మరియు ఫౌండేషన్ కి వారి కుటుంబ సభ్యులు మరియు సిరికొండ గ్రామ ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.

మల్లాపూర్ గ్రామానికి చెందిన మృతుడు పుట్ట రాజేష్.

మల్లాపూర్ ఏప్రిల్ 18 నేటి ధాత్రి

 

మల్లాపూర్ గ్రామానికి చెందిన మృతుడు పుట్ట రాజేష్ తండ్రి పోశెట్టి (13సం) తేదీ :18/04/2025 రోజున ఉదయం పూట తన తండ్రికి జ్వరం రావడం వలన తన తండ్రి మేపుతున్న పశువులను మల్లాపూర్ గ్రామ శివారు లింగన్న చెరువు వద్దకి మేపడానికి తీసుకువెళ్లగా అక్కడ చెరువు ఒడ్డుకు మృతుడు ధరించి బట్టలు, చెప్పులు,సర్ది డబ్బకనపడగా ఆచూకీ కొరకు వెతకగా లభించక పోవటంతో శనివారం రోజున ఉదయం చెరువులో నీట మునుగి పైకి తెలినాడు.స్నానం కోసం చెరువులో దిగగా ప్రమాదవశత్తు (లేక) ఈత రాక నీటిలో మునుగి చనిపోయినడని తన తండ్రి పుట్ట పోశెట్టి వెంకటి పిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై కే రాజు తెలిపారు.

నీటి సమస్యపై స్పందించిన సింగరేణి అధికారులు..

నీటి సమస్యపై స్పందించిన సింగరేణి అధికారులు..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల అబ్రహం నగర్ ,సర్దార్ వల్లభాయ్ నగర్ ఏరియాలో నివసించే సింగరేణి కార్మికులకు, మంచినీళ్లు అందించేలా సింగరేణి యాజమాన్యం చొరవ తీసుకోవాలని వారం రోజుల క్రితం కాంగ్రెస్ సీనియర్ నాయకులు యాకుబ్ ఆలీ సింగరేణి అధికారులను కోరారు. స్పందించిన సింగరేణి అధికారులు శనివారం కల్వర్టులో ఉన్న కొన్ని నీటి పైపులైన్లను తొలగించి నూతన పైప్ లైన్లను ఏర్పాటు చేశారు. నీటి సమస్య ఉందని తెలిపిన వెంటనే స్పందించిన సింగరేణి అధికారులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ జెడ్పిటిసి యాకూబ్ అలీ అన్నారు. లింగేశ్వర పాఠశాల నుండి అబ్రహం నగర్ బోర్డ్ వరకు కూడా కొత్త పైప్ లైన్లు వేయాలని సింగరేణి అధికారులను కోరుతున్నామని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి కి నూతన నీటి పైప్ లైన్ వేయించాలని కోరడం జరిగిందని తెలిపారు.స్పందించిన ఎమ్మెల్యే సింగరేణి అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్తామని, కాలనీ వాసుల నీటి అవసరం నిమిత్తం నూతన పైప్లైన్ వేయిస్తామని ఎమ్మెల్యే హామీ ఇవ్వడం జరిగిందని యాకుబ్ ఆలీ అన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version