ఎట్లా ఉండే రామాయంపేట ఎట్లా అయ్యింది.

ఎట్లా ఉండే రామాయంపేట ఎట్లా అయ్యింది…

ఉమ్మడి రాష్ట్రంలో,స్వ రాష్ట్రం వచ్చిన అభివృద్ధికి దూరమయింది…

కొత్త మండలాలు సైతం వేగంగా అభివృద్ధి జరిగాయి..
కానీ రామయంపేట అందుకు నోచుకోలేదా.!

ఎవరి లోకం అనేది వారికి కచ్చితంగా తెలుసు..

పార్టీల పంతం వీధి అభివృద్ధికి నాయకులు సహకరిస్తే అన్ని సాధ్యం…

రామాయంపేట మార్చి10 నేటి ధాత్రి (మెదక్)

Ramayampet

ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో రామయంపేట నియోజకవర్గం, తాలుక, మండల కేంద్రం ఉండి ఎంతో కళకళలాడుతూ ఉండేది. కాలక్రమమైన నియోజకవర్గం పోవడం జరిగింది. అలాగే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రామయంపేట నుండి నిజాంపేట మండలం విడిపోయింది. అంతేకాకుండా కొన్ని కార్యాలయాలు తరలిపోవడం జరిగాయి. రామయంపేట ప్రధానంగా పట్టణ అభివృద్ధి రోజురోజుకు దీనస్థితిలోకి జారిపోతుంది. నిజమాబాద్, కామారెడ్డి, సిద్దిపేట, మేడ్చల్, హైదరాబాద్, సంగారెడ్డి లకు వెళ్లడానికి ఇది కేంద్ర బిందువు. నిత్యం ఎన్నో వాహనాలు ప్రయాణికులు రాకపోకలు జరిగే పట్టణం. అయినప్పటికీ ఇప్పటివరకు ప్రధానంగా రోడ్లు, నిర్మాణం లేకపోవడం వ్యాపార వాణిజ్య సంస్థలు సైతం అభివృద్ధి లేకపోవడం వల్ల ఇటువైపు కన్నెత్తి చూసిన దాఖలాలు కనిపించడం లేదు. మండల స్థాయి నుండి జిల్లా రాష్ట్రస్థాయి వరకు ప్రధాన పార్టీల్లో ఎంతో అనుభవం కలిగిన నాయకులు ఉండి ఆయా పార్టీలకు చెందిన పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ పట్టణ అభివృద్ధి జరగకపోవడం విడ్డూరంగా ఉంది. పదేపదే ఒకరి పార్టీని ఒకరు ఒకరి నాయకులను మరొకరు దూషించుకోవడం తప్ప అభివృద్ధి విషయంలో కలసికట్టుగా ఉంటే ఇప్పటివరకు రామాయంపేట ఎంతో అభివృద్ధి జరిగేదని ప్రజలు అంటున్నారు. కొత్తగా ఏర్పడిన మండలాల సైతం ఎంతో అభివృద్ధి చెందాయని అక్కడ అన్ని రకాల వ్యాపారాలు, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. రామయంపేటకు సమీపంలో ఉన్న మండలాలు ఎంతో సుందరంగా వేగంగా అభివృద్ధి జరిగినా రామయంపేట మాత్రం అదే స్థితిలో ఉంది. పట్టణంతోపాటు మండలంలో ఎంతో అనుభవం ఉన్న నాయకులు అన్ని రాజకీయ పార్టీలో ఉన్నారు. అయినప్పటికీ రామయంపేట వెనుకబడి ఉండడానికి కారణమేంటని అందరికీ తెలిసిందే. వ్యక్తిగత, మరియు పార్టీ భేదాలు విడిచిపెట్టి రామాయంపేటకు ఉపయోగపడే అభివృద్ధి గురించి సంక్షేమ పథకాలు అమలు గురించి ప్రశ్నిస్తే కచ్చితంగా ఇప్పటికైనా రామాయంపేట ను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది. మన భవిష్యత్ తరాలకు ఇప్పటి రామయంపేట ఇస్తే వారి మనసులో మనం చేసిన పొరపాటులను ఇచ్చినట్లే అవుతుంది. భవిష్యత్ తరాలకు అన్ని రంగాల్లో ఉపయోగపడే విధంగా అందరం కలిసి పనిచేద్దాం అప్పుడే అభివృద్ధి జరుగుతుందని భావన రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రజలు, పార్టీల నాయకులు, అన్ని వర్గాలు, కుల సంఘాల్లో ఏకతాటి పై ఉండి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రామాయంపేట అభివృద్ధి జరుగుతుందా లేదా.? వేచి చూడాల్సిందే..!

నిరుపేద వివాహానికి ఆర్థిక సాయం.

నిరుపేద వివాహానికి ఆర్థిక సాయం..

రామాయంపేట మార్చి 10 నేటి ధాత్రి (మెదక్)

నిరుపేద కుటుంబ వివాహానికి ఆర్థిక సాయం అందజేశారు. ఈ మేరకు రామాయంపేట మండలం దంతేపల్లి గ్రామంలో గ్రామానికి చెందిన నిరుపేద డేవిడ్ కూతురు వివాహానికి కటారెడ్డి తిరుపతిరెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో 5000 రూపాయల ఆర్థిక సహాయాన్ని తన అనుచరులతో నిరుపేద కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కంట తిరుపతిరెడ్డి శుభ, ఆశుభ కార్యక్రమాలకు తనవంతుగా ఆర్థిక సహాయాన్ని అందజేయడం చాలా గొప్ప విషయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో.శ్యామ్ రెడ్డి,రాజ గుప్త బిక్షపతి ,సుధాకర్,దేవేందర్,సంతోష్ జి స్వామి,సాయిలు, సాయిలు,సిద్దయ్య నవీన్,నారాయణ తదితరులు పాల్గొన్నారు

చరిత్రకారులను మరుగుపెట్టే చరిత్ర ఇంకా కొనసాగుతోంది.

చరిత్రకారులను మరుగుపెట్టే చరిత్ర ఇంకా కొనసాగుతోంది…
– చదువుకు కారణమైనోళ్ల గురించి తెలియకపోవడం దురదృష్టకరమే
– సావిత్రీబాయి పూలే మహిళాలోకానికే ఆదర్శనమని చాటాలే
– త్వరలో సావిత్రీబాయిపూలే విగ్రహం ఏర్పాటు చేస్తం
– మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌

మంథని :- నేటి ధాత్రి

అట్టడుగువర్గాల కోసం త్యాగాలు చేసిన చరిత్రకారులను మరుగుపెట్టే చరిత్ర ఇంకా దేశంలో కొనసాగుతోందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ అన్నారు. చదువులతల్లి సావిత్రీబాయి పూలే వర్థంతి సందర్బంగా సోమవారం మంథని పట్టణంలోని రాజగృహాలో సావిత్రీబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఆయన నివాళులు అర్పించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు అక్షరజ్ఞానం నేర్పిన సావిత్రీబాయి పూలే మహిళాలోకానికి ఆదర్శమనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలని, అయితే ఆమె గురించి సమాజానికి తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ఆనాడు అణగారిన వర్గాలతో పాటు బ్రాహ్మణమహిళలను చదువుకు దూరంగా ఉంచిన సందర్బంలో మహాత్మాజ్యోతిరావుపూలే తన సతీమణి సావిత్రీబాయికి చదువు నేర్పించి మహిళలకు అక్షరాలు నేర్పించేలా ప్రోత్సాహం అందించారన్నారు. ఆనాడే మహిళల కోసం పాఠశాలను స్థాపించిన సావిత్రీబాయి పూలే చరిత్ర గురించి చెప్పాల్సిన బాధ్యత బీసీ, ఎస్సీ సమాజంపై ఉందన్నారు. ఆడవాళ్లు చదువుకోలేని సమయంలో వారికి అక్షరాలు నేర్పించారని, ఆనాడు ఆమె నేర్పించిన అక్షరజ్ఞానంతోనే ఈనాడు ఎంతో మంది ప్రయోజకలు అయ్యారని ఆయన గుర్తు చేశారు. చదువు రావడానికి, చదువుకోవడానికి కారణమైన సావిత్రీబాయి పూలే గురించి తెలియకపోవడం దురదృష్ణకరమని, సావిత్రీబాయి చరిత్ర గురించి ప్రతి ఒక్కరు భుజాన వేసుకుని గర్వంగా చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. మంథని నియోజకవర్గంలో అనేక మంది మహనీయుల చరిత్ర తెలిసేలా విగ్రహాలు ఆవిష్కరించుకోవడం జరిగిందని, త్వరలోనే పుట్ట లింగమ్మ చారిటబుల్‌ ట్రస్టు ద్వారా మంథనిలో సావిత్రీబాయి పూలే విగ్రహాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తామని ఆయన ఈ సందర్బంగా తెలిపారు ఈ కార్యక్రమం లో బి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు

శ్రీ వెంకటేశ్వర స్వామి రాజగోపుర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం.

మల్యాల గ్రామంలో ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి రాజగోపుర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం.
– ఆకట్టుకున్న చిన్నారుల నృత్య ప్రదర్శన చందుర్తి,

నేటి ధాత్రి:

చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో ఆదివారం రోజున ఆలయ రాజగోపుర ప్రాణ ప్రతిష్ట జరిగింది ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తో పాటు త్రిదండి దేవనాథ్ జీయర్ స్వామి, స్వామి వారి శిష్య బృందం కూడా పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని వేదమంత్రాలతో సాంప్రదాయ బద్దంగా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మాదాడి కిషన్ రావు, ఆలయ ప్రధాన అర్చకులు కందాలయ రమణచార్యులు, ప్రముఖులు అల్లాడి రమేష్, సెస్ డైరెక్టర్ పొన్నాల శ్రీనివాస్, ఫ్యాక్స్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్, సిరికొండ శ్రీనివాస్ చిర్రం తిరుపతి, ఈసరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతిభ విద్యాలయం చిన్నారుల నృత్య ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

గ్రామాలలో ఖజానా ఖాళీ.!

గ్రామాలలో ఖజానా ఖాళీ..!

• పెరుగుతున్న అప్పులు

• భారమవుతున్న నిర్వహణ

• నెత్తి పట్టుకుంటున్న కార్యదర్శులు

• మౌళిక వసతుల నిర్వహణకు కటకట

• చుట్టపు చూపుగా ప్రత్యేకాధికారులు

• దిక్కుతోచని స్థితిలో పంచాయతీల తీరు

జహీరాబాద్. నేటి ధాత్రి:

coffers

నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీలలో నిధులు లేక” ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతు న్నాయి. ఇప్పటికే చేపట్టిన పనులకు బిల్లులు రాక కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. కనీసం పారిశుధ్య సిబ్బందికి జీతాలు ఇవ్వడా నికి కూడ పంచాయతీల్లో చిల్లిగవ్వ లేదు. సర్పంచుల పదవీ కాలం ముగిసి ప్రత్యేకాధికా రుల పాలనలోకి వెళ్లిన పంచాయతీలకు ఇప్పుడు ఈ ఆర్థిక భారం పెను సవాల్ గా మారింది. పాలకీవర్గాలు లేని పంచాయితీల్లో బాధ్యతల భారం కార్యదర్శులకు తలనొప్పిగా మారింది. ప్రస్తుతం పంచాయతీ పాలనలో తామే కీలకం కావడంతో కార్యదర్శులు అడక త్తెరలో పోకచెక్కలా నలిగిపోతున్నారు. ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. పంచాయతీల్లో పనులకు అవసరమైన నిధులు లేక సొంతంగా ఇంకెంతకాలం ఖర్చులు భరించాలో తెలియక తల పట్టుకుంటున్నారు. ప్రత్యేక ఏర్పాట్లకు నిధులు తప్పనిసరి. ఈ పరిస్థితి మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్టు మారడంతో కార్యదర్శులు ఆవేదం వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీలో ప్రతి పని అర్థికప రమైన అంశమే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సకాలంలో నిధులు అందక ఆర్థిక ఇబ్బందులతో గ్రామపంచాయతీ కార్యదర్శులు నలిగిపోతున్నారు. పంచాయతీలలో నిధులు లేక కార్యదర్శులే 2 సంత్సరాల నుండి ఆర్థిక భారాన్ని మోస్తున్నారు. దీంతో తప్పనిసరి పీరి స్థితుల్లో అప్పులుచేసి పంచాయితీ బాధ్యత నిర్వహిస్తూ ఉన్నారు. పంచాయతీల స్థాయిని బట్టి నెలకు రూ.50 వేల నుండి లక్ష రూపాయల నిధులు అవసరం పడుతున్నాయి. గత కొంతకాలంగా ఈ భారం అంతా పంచాయతీ కార్యదర్శులు నెట్టుకొస్తున్నారు. పంచాయతీ కార్మికులకు కొన్ని నెలల నుంచి జీతాలు రాకపోవడంతో వారిని సముదా యించి పనిచేయించడానికి కార్యదర్శులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత సంవత్సరం జనవరి నెలాఖరులో పంచాయతీ పాలకవర్గం పదవీకాలం ముగియగా ప్రభుత్వం ప్రత్యేకఱ ధికారులను నియమించిన సంగతి తెలిసిందే. ఇతర శాఖలో కీలకంగా ఉన్న గెజిటెడ్ అధికా రులకు అదనపు బాధ్యతలు అప్పగించడంతో వారు తీరిక దొరికినప్పుడే గ్రామాలకు వెళ్లి వస్తున్నారు. కార్యదర్శులకు సలహాలు సూచనలు ఇవ్వడానికి పరిమితం అవుతు న్నారు. ట్రాక్టర్లకు అవసరమైన డీజిల్ తోపాటు పల్లె ప్రకృతి, పనులు పారిశుద్ధ్య నిర్వహణ, చెత్త డంపింగ్ యార్డులు, స్మశాన వాటిక, నిర్వహణ వాటర్ ట్యాంకుల క్లోరినే షన్, బాధ్యతలను పంచాయతీ కార్యదర్శులు నిర్వహిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయమై దృష్టిలో పెట్టుకొని పంచాయితీ నిధులను వెంటనే విడుదల చేయాలని కార్యద ర్శులు విజ్ఞప్తి చేస్తున్నారు.

సమస్యల పరిష్కరం కోసం అవగాహన సదస్సు.

సమస్యల పరిష్కరం కోసం అవగాహన సదస్సు.

జహీరాబాద్. నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గ ము ,స్థానిక స్వస్తిక్ హోటల్ లో జహీరాబాద్ పట్టణానికి చెందిన డా.మనసా మనషికంగా లోపలున్న పిల్లల కోసం మొదటి సరిగా అవగాహన సమావేశం నిర్వహించారు. మన జహీరాబాద్ పట్టణం లో మెట్టమొదటి సరిగా ప్రతేకా అవసరాలున్న పిల్లల కోసం ప్రసంగ సమస్య లక్షణాలు అయిన అటిజం, ప్రవర్తన సమస్యలు, మనషిక ఆరోగ్యం, కంటి సంబంధమైన,భాషా సమస్యలు, హైపర్ అక్టీవ్ అదే విదంగా పిల్ల మెదడు అభివృద్ధి ఆలస్యం కావడానికి కారణాలు పిల్లల్లో వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు దారితిస్తాయి కాబట్టి తల్లిదండ్రులకు చాలా రకాల మనషిక సమస్యల కోసం చాలా మంది థెరపిస్టులు అవగాహన కల్పించారు. సమస్యలు ఉంటే పిల్లల పేర్లను నామెదు చేసుకుంటే ప్రతేకా థెరపిస్టుల ద్వారా ట్రీట్మెంట్ ఇప్పిస్తామని మనసా తెలియజేసారు.ఈ సమావేశంలో అధ్యాపకులు మారుతి రావు ,రచయిత డా.పెద్దగొల్ల నారాయణ,విజయకుమార్ ,నంద,మనసా,వంశీ కృష్ణ ,శివశేఖర్, శ్రీనివాస్,రాజమౌళి,కృష్ణ,థెరపిస్టులు శ్రావణి,కుశల,సుభాష్ పిల్లల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

conference

చేనేత కార్మికులకు రుణమాఫీ చేసిన.!

*చేనేత కార్మికులకు రుణమాఫీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం….
* ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతో 33 కోట్లు రూపాయలు రుణమాఫీ …
* కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన సిరిసిల్ల చేనేత కార్మికులు ….

* రాజన్న సిరిసిల్ల టౌన్ 🙁 నేటి ధాత్రి )

గత ప్రభుత్వ కాలంలో పెండింగ్లో ఉన్న చేనేత కార్మికుల వ్యక్తిగత రుణమాఫీని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతో జీవో నెంబర్ 56 లో భాగంగా 1-4-2017 నుండి 31-3-2024 తీసుకున్నటువంటి చేనేత రుణమాఫీని మాఫీ చేయడం జరిగినది. తెలంగాణ మొత్తంలో 33 కోట్లు రుణమాఫీ చేయడం జరిగినది అంతేకాకుండా ఒక్కొక్క చేనేత కార్మికుడు తీసుకున్న రుణం వచ్చేసి లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయడం ద్వారా చేనేత కార్మికులు ఎంతగానో సంతోషం వ్యక్తం చేశారు. మన సీఎం రేవంత్ అన్న గారికి, టెక్స్టైల్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వర రావు అన్నగారికి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారికి, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే అది శీనన్న గారికి, సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ గారైన కేకే మహేందర్ అన్నగారికి రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా కాంగ్రెస్ తరపున కామూరి వనిత, నలినీకాంత్ మరియు చేనేత మహిళా కార్మికులు కృతజ్ఞతలు తెలియజేశారు.

మంత్రి పొన్నం ను కలిసిన నూతన ఎస్పీ.

మంత్రి పొన్నం ను కలిసిన నూతన ఎస్పీ

రాజన్న సిరిసిల్ల టౌన్,నేటిధాత్రి:

రాజన్న సిరిసిల్ల జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన మహేష్ బాబా సాహెబ్ గీతే మంత్రి పొన్నం ప్రభాకర్ ను అలాగే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లను మర్యాదపూర్వకంగా కలిశారు.అనంతరం పూల మొక్కను అందించి శుభాకాంక్షలు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో శాంతి భద్రతల దృష్ట్యా సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా మంత్రిని కోరినట్లు ఎస్పీ తెలిపారు.

కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం.


ఝరసంగం: కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

జహీరాబాద్. నేటి ధాత్రి:

ఝరసంగం లోని కేంద్రీయ విద్యాలయంలో ఒకటవ తరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల ప్రిన్సిపల్ బేబీ సింగ్ ఆదివారం తెలిపారు.
కేంద్రీయ విద్యాలయాల సంఘటన్ (కేవీఎస్) 2025-26 సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. బాల్వాటిక-1, 2, 3 (ప్రీ ప్రైమరీ)తో పాటు, ఒకటో తరగతి నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం వరకు అడ్మిషన్లు నిర్వహించనున్నారు. బాల్వా టికా క్యాటగిరీ తప్ప మిగిలిన తరగతుల సీట్లను అందుబాటులో ఉన్న ఖాళీల ఆధారంగా భర్తీ చేస్తారు. భద్రతా దళాలు, కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వరంగ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు అలాగే ఏక సంతానంగా ఆడపిల్లలు ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు. దర ఖాస్తుల దాఖలుకు ఈ నెల 21న చివరి తేదీ. ఆ తరువాత నాలుగైదు రోజుల్లో ఎంపికైన వి ద్యార్థుల జాబితాను ప్రకటిస్తారు. కేంద్రీయ విద్యాలయ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకో వచ్చు. పూర్తి వివరాల కోసం https://kvsangathan.nic.in/en/ వెబ్సైట్ చూడవచ్చు.

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి.

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి..

మహిళలు సమానత్వం, సాధికారత సాధించేలా ముందుకు నడవాలి…..

అంజనీపుత్ర సంస్థ చైర్మన్ గుర్రాల శ్రీధర్

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి.. సమానత్వం, సాధికారత సాధించేలా ముందుకు నడవాలనీ అంజనేపుత్ర రియల్ సంస్థ చైర్మన్ గుర్రాల శ్రీధర్, ఎండీ పిల్లి రవి పేర్కొన్నారు. శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రం లోని చున్నం బట్టి వాడలో ఆ సంస్థ కార్యాలయం లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ అమ్మగా, ఆలిగా,ఆలిగా పోరాట జ్వాలవై, ఆశయాల బాటవై, ఈసృష్టికి మూలమై, మానవుడి మనుగడకు ప్రాణమై, అన్నిట్ల సగభాగమై, ఆదేరువై, ఆధరణై, అనునిత్యం అండగా ఉంటున్న ఆడబిడ్డలందరూ అన్ని రంగాల్లో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో అంజనీ పుత్ర సంస్థ డైరెక్టర్ లు మహిళలు తదితరులు పాల్గొన్నారు

చావా సినిమాను స్కూల్స్ విద్యార్థిని విద్యార్థులకు చూపించిన.

చావా సినిమాను స్కూల్స్ విద్యార్థిని విద్యార్థులకు చూపించిన బిజెపి నాయకులు

బిజెపి మండల అధ్యక్షులు ఊర నవీన్ రావు

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో హిందూ హృదయ సామ్రాట్ చత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంబాజి మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా చావా చిత్రాన్ని తెలుగులో గణపురం లోని శ్రీ లక్ష్మీ శ్రీనివాస థియేటర్లో ప్రదర్శించిన సందర్భంగా బిజెపి గణపురం మండల పార్టీ అధ్యక్షుడు ఊర నవీన్ రావు ఆధ్వర్యంలో మండలంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 170 విద్యార్దిని విద్యార్దులకు ఉచితంగా సినిమా ప్రదర్శన చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చావా మూవీ డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకేర్ కి నా ప్రత్యేక కృతజ్ఞతలు దు రాక్రమణదారుడైన ఔరంగాజెబ్ మన మరాఠా యోధుడు శంబాజీ మహారాజును స్వరాజ్య పోరాటంలో ఏ విధంగా చిత్రహింసలు పెట్టి చంపాడో అదేవిధంగా స్వాతంత్రం వచ్చిన 60 ఏళ్లలో ఎంతోమంది వీరుల చరిత్రను దాచిపెట్టి దురాక్రమన దారులైన ఔరంగాజెబ్,మహమ్మద్ బిన్ తుగ్లక్, అక్బర్, బాబర్, షాజహాన్,లాంటి వారి చరిత్రను పాఠ్యపుస్తకాలలొ చేర్చి మన పోరాట యోధుల చరిత్రను దాచి పెట్టింది కాంగ్రెస్ మన దేశ కేంద్ర మొట్టమొదటి విద్యా శాఖ మంత్రిని అరబ్ దేశాల నుండి తీసుకొచ్చి మన వీరుల చరిత్రపుటల్లో లేకుండా చేసింది దయచేసి స్కూల్ యాజమాన్యాలు తల్లిదండ్రులు మీ పిల్లలకు ఈ సినిమాను చూపించి హిందూ సామ్రాట్ చత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ చేసిన పోరాటం పిల్లలకు తెలిసేలా చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేవైఎం కలాశాలాల విభాగం రాష్ట్ర కన్వీనర్ మంద మహేష్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు గాలిఫ్, బీజేపీ మండల నాయకులు దుగ్గుశేట్టి పున్నం చందర్, వడ్డెం రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ.

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ
ఆధ్వర్యంలో… పారిశుద్ధ్య కార్మికులకు టిఫిన్ బాక్సుల పంపిణీ….

మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ మహిళ పరిశుద్ధ కార్మికురాలికి ఘనంగా సన్మానం..

రామాయంపేట మార్చి 8
నేటి ధాత్రి(మెదక్)

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మెదక్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం నాడు రామాయంపేట పట్టణంలో ఉన్న మున్సిపల్ కార్యాలయంలో పని చేస్తున్న సీనియర్ మహిళ పరిశుద్ధ కార్మికురాలికి సన్మానం… అలాగే 18 మంది మహిళా పరిశుద్ధ కార్మికురాళ్ల కు వారి సేవలకు గుర్తింపుగా స్టీల్ టిఫిన్ బాక్స్ ల పంపిణి చేయడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో జిల్లా శాఖ అధ్యక్షుడు ఏలేటి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు టిఫిన్ బాక్సులను అందజేస్తున్నట్లు తెలిపారు. మున్సిపల్ మాజీ కౌన్సిలర్ దెమే యాదగిరి మాట్లాడుతూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం అన్ని రకాల చర్య లు చేపడుతుందనీ తెలిపారు. గతంలో తాను కూడా వార్డు సభ్యునిగా, కౌన్సిలర్ గా ఉన్న సమయంలో పేదలకు సేవా కార్యక్రమం ద్వారా ఆదుకున్నట్లు తెలిపారు.. ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కోశాధికారి డి.జి. శ్రీనివాస శర్మ, వైద్య శిబిరాల నిర్వాహన చైర్మన్ దామోదర్ రావు, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు మద్దెల సత్యం, మద్దెల రమేష్, పాతూరు సిద్ధ రాములు, దారం రమేష్, సతీష్ తో పాటు పలువురు పాల్గొన్నారు.

కమిషనరేట్ లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు.

వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

వరంగల్, నేటిధాత్రి

celebrations

ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఘనంగా మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డిసిపి షేక్ సలీమా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ వేడుకల్లో వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు, పరిపాలన విభాగం మహిళా అధికారులతో కలిసి కేక్ కట్ చేశారు. మహిళా పోలీస్ అధికారులకు శుభాకాంక్షలు తెలియజేసారు. ఉమెన్స్ డే సందర్భంగా ఇంతేజార్ గంజ్ స్టేషన్ లోని మహిళా కానిస్టేబుళ్లను అభినందిస్తూ వారితో కలసి ఫొటోస్ దిగారు.

celebrations

అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం,ఘనంగా సన్మానించిన ఆర్టిఐ నేత వెంకటేశ్వర్లు గౌడ్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం మొట్లపల్లి గ్రామపంచాయతీ ఆవరణంలో యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టిఐ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్వీనర్ చర్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా,గ్రామపంచాయతీ కార్యదర్శులు ,సుజాత
గుండ్ల కర్తి పంచాయతీ కార్యదర్శి మౌనిక,అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ కరుణ,మాజీ వార్డ్ మెంబర్ స్వరూప ఘనంగా శాలువాతో సన్మానించిన వెంకటేశ్వర్లు గౌడ్ మాట్లాడుతూ
మనకు స్వాతంత్య్రం సిద్దించి దాదాపు 78 సంవత్సరాలు కావస్తున్న ఇంకను మహిళలకు రక్షణ కొరవడింది మనమంతా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నమరోసారి మనం మహిళల సాధికారత, స్వేచ్చ,వారి హక్కులు,రక్షణ గురించి ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకుంటే ఈనాటికి కూడా మహిళలు పూర్తి స్థాయిలో స్వేచ్చ,వాయువులు పీల్చుకోలేక పోతున్నారు అనే మాట మనకు చాలా స్పష్టంగా అవుతుందని
ఎందుకంటే ఈనాటికి మహిళలు అనేక విధాలుగా గృహ హింస, లైంగిక దాడులు,భృణ హత్యలు, అత్యాచారాలు,పురిటిలోనే పసిపాపలను కడతెర్చడం,లింగ సమానత్వం వంటి విషయాల్లో తీవ్రస్థాయిలో అధిపత్య ధోరణి, దౌర్జన్యాలను,అమానుష ఘటనలను నిత్యం ఎదుర్కొంటుండటం ఈ ప్రజాస్వామ్యానికి సంబందించి అత్యంతదురదృష్టకరం.ముఖ్యంగా చట్ట సభల్లో మహిళల ప్రాధాన్యత 30 శాతానికి మించక పోవడం కూడా మహిళల పాలిట ఓ,శాపంగా పరిణమించి వారి ప్రశ్నించే గొంతుకకు కళ్లెం వేసినట్లయింది,అయినప్పటికీ మహిళలు ఈ మధ్యకాలంలో పురుషులతో సమానంగా అన్ని రంగాలలో వందే భారత్ ఎక్ష్ప్రెస్స్ లా దూసుకుపోతున్నారు స్త్రీలేకపోతేజనం లేదు, శ్రీ,లేకపోతే గమనం లేదు , శ్రీ,లేకపోతే అసలు సృష్టి లేదు కంటిపాపల కాపాడే శ్రీ మూర్తికి మహిళల హక్కులను వర్ధిల్లాలని నారీ శక్తిమణులు మహిళలకు వందనాలు,తెలుగు రాష్ట్రాల మహిళా మణులకు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు వెంకటేశ్వర్లు గౌడ్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్టిఐ, సభ్యుడు రమేష్, ఎంఈఓ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు,

అమరరాజా గిగా యూనిట్ -1 కు శంకుస్థాపన.

అమరరాజా గిగా యూనిట్ -1 కు శంకుస్థాపన.

స్థానికులకు ఉద్యోగ కల్పన.

మహబూబ్ నగర్/ నేటి ధాత్రి

మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లి ఐటి పార్కు సమీపంలో రూ. 3, 225 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
ప్రత్యక్షంగా 4500 మందికి ఉపాధి, పరోక్షంగా 10 వేలమందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రూ. 800 కోట్లతో అల్టిమన్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ ఏర్పాటు చేయనున్నారు. రూ.502 కోట్లతో లోహమ్ మెటీరియల్స్ కంపెనీ ఏర్పాటు చేస్తారు. రూ.25 కోట్లతో సెల్ ఎనర్జీ కంపెనీ లకు కేంద్ర రైల్వే, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ ఐటి శాఖ మంత్రివర్యులు అశ్విని వైష్ణవ్, రాష్ట్ర ఐటి శాఖ మంత్రి శ్దుద్దిళ శ్రీదర్ బాబు, మహబూబ్ నగర్ ఎంపి శ్రీమతి డికె అరుణ, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డితో కలిసి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై , అమరరాజా గిగా ఫ్యాక్టరీ మరియు ఇతర కంపెనీలకు భూమి పూజ చేసి కంపెనీ యాజమాన్యానికి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకుముందు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సాదరంగా ఆహ్వానించారు. కంపెనీ ఆవరణలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత, వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయేందిర బోయి, జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ కాంగ్రెస్, అమరరాజా కంపెనీ గల్లా జయదేవ్ , కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

జ్ఞానోదయ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం.

జ్ఞానోదయ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం పురస్కరించుకొని లీగర్ లీటరసి క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది.

మెట్ పల్లి మార్చి 8 నేటి ధాత్రి
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వరరావు హాజరయ్యారు.
అనంతరం సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వరరావు మాట్లాడుతూ మహిళా దినోత్సవం సందర్భంగా మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని భారత దేశ న్యాయస్థానం మహిళలకు ఉద్యోగులలో రాజకీయాలలో అన్ని రంగాలలో రిజర్వేషన్ ఇచ్చిందని దీనిని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు మహిళలకు మన భారత దేశంలో ప్రాధాన్యత ఇస్తారని మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నారని వివిధ రంగాల ఉద్యోగాలలో ముందుగా పురుషులకంటే మహిళలు ఉద్యోగం సాధించి మంచి గుర్తింపు పొందుతున్నారని వారికి మరిన్ని ఉపయోగ ప్రభుత్వ పథకాల ద్వారా వారికి ప్రోత్సాహక వ్యాపారాలు ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నాయని గుర్తింపు వీటిని మహిళలు మంచి లబ్ధి పొందుతున్నారని మీకు ఏ న్యాయ సలహా కావాలన్నా మా దగ్గరకు వచ్చి మీ సమస్యలు తెలుపాలని దానికి మేము పరిష్కరిస్తామని అన్నారు. అనంతరం కళాశాల కరెస్పాండెంట్ ఇల్లెందుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీనియర్ సివిల్ జడ్జ్ డి నాగేశ్వరరావు సామాన్య గృహిణిగా ఉన్న సాధారణ మహిళ చిరు పట్ట గొలుసుల తయారు చేసే వ్యాపారము ప్రారంభించి ఉన్నత వ్యాపార స్థానం చేరిన గృహిణి ని మరియు సీనియర్ మహిళ అడ్వకేట్లను ఘనంగా సన్మానం చేశారు .
ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి టి నాగేశ్వరరావు బార్ అసోసియేషన్ అధ్యక్షులు పుప్పాల లింబాద్రి కరస్పాండెంట్ ఇల్లెందుల శ్రీనివాస్, టి వేణుగోపాల్ ,మగ్గిడి నరసయ్య ,కోటగిరి వెంకటస్వామి, ప్రిన్సిపాల్ సంతోష్ ,తెడ్డు సురక్ష, దయ రాజారామ్, తుల రాజేందర్, ఓజ్జల శ్రీనివాస్ ,గడ్డం శంకర్ రెడ్డి, అలల శంకర్, తదితరులు విద్యార్థిని విద్యార్థులు అడ్వకేట్లు అధ్యాపకులు పాల్గొన్నారు.

మహిళా సాధికారతకు తెలంగాణ పట్టం.

మహిళా సాధికారతకు.. తెలంగాణ పట్టం

దేవరకద్ర /నేటి ధాత్రి

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ మున్సిపాలిటీ కేంద్రంలో.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో సతీ సమేతంగా.. ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇందిరా మహిళ శక్తి పథకం కింద రూ. 15 లక్షల చెక్ లను మహిళా సంఘాలకు అందజేశారు‌. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా ఎదిగే విధంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని అన్నారు.
ఇందిరమ్మ రాజ్యం, ప్రజా ప్రభుత్వం వచ్చిన వెనువెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించిందని పేర్కొన్నారు. ఉచిత ప్రయాణమే కాకుండా ఆ బస్సులకు ఓనర్లుగా మహిళలను చేయడం ప్రజాప్రభుత్వం చేపట్టిన విజయమన్నారు. ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలని, ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలని, అన్ని రంగాల్లో వారిని ముందంజలో ఉంచాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం తీసుకుంటున్న చర్యల వల్ల పది మందికి ఉపాధి కల్పించే విధంగా మహిళలు ఎదిగారని అన్నారు. మహిళా సంఘాలకు వ్యాపారం ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వము వడ్డీ లేకుండా రుణ సదుపాయం కల్పిస్తున్నామని వెల్లడించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోపే 21 వేల కోట్లకు పైగా రుణాలను మహిళా సంఘాలకు ఇచ్చామన్నారు. వడ్డీలు, చక్రవడ్డీలు అప్పుల బాధకు కుటుంబాలు బలి కాకుండా మహిళ సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని తెలిపారు. పెద్దపెద్ద కార్పొరేట్లకే పరిమితమైన పరిమితం అయిన సోలార్ విద్యుత్ ప్లాంట్లను మహిళా సంఘాలకు అప్పగిస్తున్నామన్నారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ. రేవంత్ రెడ్డి గారు మహిళలకు పెద్దన్నగా ఉంటూ అండగా ఉంటూ ప్రజా పాలన అందిస్తున్నారని వెల్లడించారు. మహిళా సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న తమ ప్రభుత్వాన్ని, తమను ఈ సందర్భంగా మహిళలందరూ దీవించాలని ఎమ్మెల్యే గారు విజ్ఞప్తి చేశారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు.

కుటుంబ కలహాలతో వ్యక్తి మృతి.!

కుటుంబ కలహాలతో వ్యక్తి మృతి

కరకగూడెం,,

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటి ధాత్రి..

కరకగూడెం మండలం నీలాద్రిపేట వలస ఆదివాసీ గ్రామానికి చెందిన సోడి మాసయ్య (35) అనే వ్యక్తి గత కొంత కాలంగా కుటుంబ కలహాలతో మద్యానికి బానిసై శనివారం ఇంటి వద్ద మృతి చెందాడు. గ్రామస్థులు గమనించి పోలీసులకు సమాచారం అందించాగా విషయం తెలుసుకున్న కరకగూడెం ఎస్ఐ రాజేందర్ ఘటన స్థలం వద్దకు వెల్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుడు బాబాయ్ సోడి మడకం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఎస్ఐ శవ పరీక్షకు తరలించారు.

బీసీ సమాజం సంబరాలు జరుపుకోవాలి.

బీసీ సమాజం సంబరాలు జరుపుకోవాలి

యావత్ బీసీలు కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉండాలి
ఈనెల లొనే శాసనసభలో బీసీ బిల్లు ఆమోదం
బీసీ సెల్ జిల్లా జనరల్ సెక్రెటరీ బోయిని హన్మాండ్లు
జగిత్యాల మార్చి08 నేటి ధాత్రి .

స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు, విద్య ఉద్యోగాలలో కూడా 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడాన్ని కాంగ్రెస్ పార్టీ ఓబిసి సెల్ జిల్లా జనరల్ సెక్రెటరీ బోయిని హన్మాండ్లు హర్షం వ్యక్తంచేస్తూ కృతజ్ఞతలు తెలిపారు పత్రికా ప్రకటన ద్వారా హన్మాండ్లు మాట్లాడుతూ గ్రామ గ్రామాన బీసీలు సంబరాలు జరుపుకోవడానికి సిద్ధంగా ఉండాలని బీసీ సంఘలు యావత్ బీసీ సమాజం కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉండాలని తెలిపారు. భారతదేశంలో కుల గణన జరిపి బీసీల కు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కాంగ్రెస్ పార్టీతోనే ఏదైనా సాధ్యమవుతుందని తెలిపారు రిజర్వేషన్ల అమలుకు, న్యాయపరమైన చిక్కులు రాకుండా, కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసి సహకరించేలా దేశ జనాభా గణ నలో బీసీ కులాల గణన, చేపట్టడంతో పాటు, చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని అన్నారు. కేంద్ర మంత్రులు, కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ ప్రధాని మోడీని ఒప్పించాలని కోరారు. నిత్యం బీసీ జపం చేసే ప్రతిపక్ష పార్టీల నాయకులు కూడా బిసి రిజర్వేషన్ల పెంపుకు సహకరించాలని లేనియెడల వచ్చే ఎన్నికలలో బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదని ఆయన తెలిపారు.

మహిళలు మరింత చైతన్యవంతులై ముందుకు సాగాలి.

మహిళలు మరింత చైతన్యవంతులై ముందుకు సాగాలి
ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని విజయం సాధించాలి
*ప్రతి ఇంటికో మహిళా పారిశ్రామిక వేత్తగా ఎదగాలి..
*ప్రభుత్వ పథకాలలో మహిళలకు పెద్ద పీట..
*ఇచ్చిన హామీలన్నీ ప్రభుత్వం నెరవేరుస్తుంది..
*మహిళా దినోత్సవ కార్యక్రమంలో పలమనేరు ఎమ్మెల్యే అమర్..
*రూ.10.58 కోట్ల చెక్కు పంపిణి..
పలమనేరు(నేటి ధాత్రి)మార్చి 08:
మహిళలు మరింత చైతన్యవంతులుగా రాణించాలని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథరెడ్డి పేర్కొన్నారు. పలమనేరు మున్సిపల్ కార్యాలయంలో మెప్మా ఆధ్వర్యంలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు.
మొట్ట మొదట మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
మహిళలు ఆర్థికంగా రాజకీయంగా ఎదగడానికి నాడు బీజం వేసింది స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీనేనన్నారు. 
Women’s Day
మహిళలను ఆర్థికంగా రాణించడానికి దేశంలోనే డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసింది తెలుగుదేశం ప్రభుత్వమని,మహిళలకు రాజకీయ హక్కు కల్పించి 33% రిజర్వేషన్ ద్వారా స్థానిక సంస్థలందు అవకాశం కల్పించిన ఘనత కూడా టీడీపీదేనన్నారు. 
బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి మహిళల వెంట నేడు క్యూ కడుతున్నాయంటే అందుకు మీరు కల్పించుకున్న నమ్మకమే కారణమని అన్నారు,
మహిళలు వంటింటిలో పడుతున్న బాధలు చూసి వారికి దీపం పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చి ఆదుకున్న నాయకుడు చంద్రబాబు అని ఇప్పుడు దీపం-2 ద్వారా మూడు సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇస్తున్నది తెలుగుదేశం ప్రభుత్వమే అని గుర్తు చేశారు.
మహిళలు ఆర్థికంగా ఎదగడానికి చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి,ఏపి ఎల్,ఎల్,సి,
ద్వారా భూమిని సగం ధరకే ఇచ్చి ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని మహిళలు తమ స్వశక్తితో రాణించడానికి టైలరింగ్ లో ఉచిత శిక్షణ ఇస్తూ వారికి ఉచితంగా కుట్టు మిషన్లు  ఇస్తూ అండగా ఈ ప్రభుత్వం నిలుస్తోందన్నారు.
ప్రతి ఇంటిలో ఒక మహిళ పారిశ్రామికవేత్తగా ఎదగాలని సరళమైన విధానాలతో అన్ని రకాల ప్రోత్సాహకాలు,సబ్సిడీ రుణాలను ప్రభుత్వం అందిస్తోందని,తల్లికి వందనం పేరుతో ప్రతిబిడ్డకు  చదువుకోవడానికి 15000/- రూపాయలు త్వరలో చెల్లిస్తుందని పేర్కొన్నారు. 
ప్రభుత్వ పథకాలన్నీ మహిళలకు అందేలా తెలుగుదేశం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇలా అన్ని ప్రభుత్వ పథకాలల్లో మహిళలకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని అన్ని అవకాశాలను అందిపుచ్చుకొని మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా రాణించాలని కోరారు. అనంతరం పట్టణ స్వయం సహాయక సంఘలకు రూ.10.58 కోట్ల మెగా చెక్ ను అందజేశారు. తదనంతరం పలువురు వివిధ రంగాలల్లో రాణించిన మహిళలను ఆయన సన్మానించి అభినందించారు.ఈ కార్యక్రమాల్లో పలమనేరు బాలాజీ కో ఆపరేటివ్ సూపర్ బజార్ అధ్యక్షులు ఆర్వీ బాలాజీ,మున్సిపల్ కమిషనర్ రమణా రెడ్డి, మెప్మా మేనేజర్ బాబా లతో పాటు కౌన్సిలర్లు సునీతా నాగరాజు, కిరణ్, బీ ఆర్ సీ కుమార్ మరియు టీడీపీ నాయకులు ఆర్ బిసి
కుట్టి,గిరిబాబు,మదన్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు..
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version