అమరరాజా గిగా యూనిట్ -1 కు శంకుస్థాపన.
స్థానికులకు ఉద్యోగ కల్పన.
మహబూబ్ నగర్/ నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లి ఐటి పార్కు సమీపంలో రూ. 3, 225 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
ప్రత్యక్షంగా 4500 మందికి ఉపాధి, పరోక్షంగా 10 వేలమందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రూ. 800 కోట్లతో అల్టిమన్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ ఏర్పాటు చేయనున్నారు. రూ.502 కోట్లతో లోహమ్ మెటీరియల్స్ కంపెనీ ఏర్పాటు చేస్తారు. రూ.25 కోట్లతో సెల్ ఎనర్జీ కంపెనీ లకు కేంద్ర రైల్వే, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ ఐటి శాఖ మంత్రివర్యులు అశ్విని వైష్ణవ్, రాష్ట్ర ఐటి శాఖ మంత్రి శ్దుద్దిళ శ్రీదర్ బాబు, మహబూబ్ నగర్ ఎంపి శ్రీమతి డికె అరుణ, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డితో కలిసి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై , అమరరాజా గిగా ఫ్యాక్టరీ మరియు ఇతర కంపెనీలకు భూమి పూజ చేసి కంపెనీ యాజమాన్యానికి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకుముందు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సాదరంగా ఆహ్వానించారు. కంపెనీ ఆవరణలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత, వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయేందిర బోయి, జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ కాంగ్రెస్, అమరరాజా కంపెనీ గల్లా జయదేవ్ , కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.