మృతి చెందిన కుటుంబాలకు పరామర్శ.

మృతి చెందిన కుటుంబాలకు పరామర్శ

బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి

వీణవంక, ( కరీంనగర్ జిల్లా): నేటి ధాత్రి :

 

 

 

వీణవంక మండల పరిధిలోని వల్బాపూర్ గ్రామనికి చెందిన మాజీ సర్పంచ్ మరుమళ్ళ కొమురయ్య గారి తల్లి స్వర్గస్తులైన సమాచారం తెలిసిన వెంటనే వచ్చి భౌతికాయానికి పువ్వుల మాలలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంబాన్ని ఓదార్చి మనోధైర్యం కల్పించి వారికి అండగా ఉంటామని బిజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు లక్ష్మక్క పల్లి మాజీ ఉపసర్పంచ్ మేకల సమ్మి రెడ్డి గారి తండ్రి స్వర్గస్తులైన తెలుసుకున్న వెంటనే వారి కుటుంబాన్ని ఓదార్చారు ఈ కార్యక్రమంలో వారి వెంట బిజెపి నాయకులు మాజీ మండల అధ్యక్షుడు ఆదిరెడ్డి,మల్లారెడ్డి ,శ్రీనివాస్ యాదవ్, ఉడుత కుమార్,కొండల్ రెడ్డి, అప్పన కొమురయ్య, ఈదునూర్ కుమార్ ,సమ్మిరెడ్డి,శంకర్, మోటం శ్రీనివాస్, పల్లె రాయమల్లు, బూత్ అధ్యక్షులు పాల్గొన్నారు.

రెడ్డి సంఘం ఆధ్వర్యంలో కాశ్మీర్ పహల్గావ్.!

రెడ్డి సంఘం ఆధ్వర్యంలో కాశ్మీర్ పహల్గావ్ మృతులకు సంతాపం

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

 

సిరిసిల్ల పట్టణ కేంద్రం లోని జిల్లా రెడ్డి సంఘం ఆధ్వర్యంలో రెండు రోజుల క్రితం కాశ్మీర్ పహల్గావ్ లో జరిగిన ఉగ్రదాడిలో చనిపోయిన 27 మంది హిందూ బంధువులకు రాజన్న సిరిసిల్ల జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగినది. ఈ ఉగ్రదాడి దారుణమైన దుశ్చర్య గా భావిస్తూ అన్ని కులాలను సమానంగా సోదర భావంగా భావించే ఈ భారత దేశంలో ఇలాంటి దుర్ఘటన జరగడం చాలా బాధాకరం. ఇకముందు హిందువుల పైన ఇలాంటి దాడులు జరిగితే ఊరుకోమని తెలియపరుస్తూ ఈ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ చనిపోయిన హిందూ బంధువులకు శాంతి చేకూరాలని వారి కుటుంబాలకు మనమందరము బాసటగా ఉంటూ మనోధైర్యాన్ని నింపాలని జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం తరఫున ఆ భగవంతున్ని ప్రార్థించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి నల్ల నాగిరెడ్డి, ఉపాధ్యక్షులు ఎగుమామిడి కృష్ణారెడ్డి, మడుపు ప్రమోదరెడ్డి,నరెడ్ల రాఘవరెడ్డి,గుల్లపల్లి నరసింహారెడ్డి,డబ్బు తిరుపతిరెడ్డి, గడ్డమీద ప్రసాద్ రెడ్డి, కూతురు వెంకట్ రెడ్డి లక్కిరెడ్డి కమలాకర్ రెడ్డి, సంయుక్త కార్యదర్శులు, దుండ్రా జలజా రెడ్డి, ముసుకు తిరుపతిరెడ్డి, ఏమి రెడ్డి కనక రెడ్డి, జువ్వెంతుల, లక్ష్మారెడ్డి మంద బాల్ రెడ్డి, కోశాధికారి- ఎడ్మల హనుమంత రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ – భీమ నీలిమారెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, మడుపు ప్రేమ్ సాగర్ రెడ్డి, కంకణాల శ్రీనివాస్ రెడ్డి, ముత్యాల రాజిరెడ్డి, కంది భాస్కర్ రెడ్డి కరెడ్ల మల్లారెడ్డి, అబ్బాడి తిరుపతి రెడ్డి, గడ్డం సత్యనారాయణ రెడ్డి,బిచ్చల రాజిరెడ్డి, సంతాపం ప్రకటించడం జరిగినది.

మురికి నీటిలో ఆయిల్ ఫాల్స్ వేసుకోవాలి.

మురికి నీటిలో ఆయిల్ ఫాల్స్ వేసుకోవాలి
దోమతెరలు వాడాలి

మండల వైద్యాధికారి అమరేందర్ రావు

ముత్తారం :- నేటి ధాత్రి

 

 

 

ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించూకొని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అన్న ప్రసన్న ఆదేశాల మేరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి అమరేందర్ రావు తన యొక్క సిబ్బందితో కలిసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి శ్రీరాంపూర్ చౌరస్తా మీదుగా ఎంపీడీవో ఆఫీస్ నుండి గ్రామపంచాయతీ వరకు మలేరియా అవేర్నెస్ ర్యాలీ నిర్వహించారు. ఇట్టి ర్యాలీలో మలేరియా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు
అనంతరం వైద్యాధికారి అమరేందర్ రావు మాట్లాడుతూ మంగళవారాలను మరియు శుక్రవారం అన్నివేళలా పరిసర శుభ్రంగా ఉంచుకోవాలని డ్రైడి పాటించాలని ఇంటి చుట్టూ నీటి నిలువలు ఉండకుండా చూసుకోవాలని మురికి నీటిలో ఆయిల్ ఫాల్స్ వేసుకోవాలని దోమతెరలు వాడాలని మరియు ముఖ్యంగా దోమలు అభివృద్ధి చెందకుండా వారంలో రెండుసార్లు పాత నీరు అంతా పడబోసి మళ్లీ మీరు పట్టుకోవాలని దోమలు మరియు ఈగల అభివృద్ధిని అరికట్టే చర్యలు తీసుకోవాలని ఇంకా అనేక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించిచారు ఈ కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ నర్స్ గ్రేసీమని ఫార్మసిస్ట్ జగదీష్ ల్యాబ్ టెక్నీషియన్ అనిల్ స్టాఫ్ నర్స్ రవళి మరియు ఝాన్సీ హెల్త్ అసిస్టెంట్ ఎం శ్రీనివాస్ మరియు వైద్య సిబ్బంది మరియు ప్రజలు పాల్గొన్నారు

ఉగ్రదాడికి నిరసనగా బీజేపీ ర్యాలీ.!

ఉగ్రదాడికి నిరసనగా బీజేపీ ర్యాలీ
మృతుల కుటుంబలకు సంతాపం

సిరిసిల్ల టౌన్  (నేటిధాత్రి):

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని బీజేపీ ఆధ్వర్యం లో కాశ్మీర్ లోయలో జరిగిన ఉగ్రవాదుల దాడి కి నిరసన గా సిరిసిల్ల లోని అంబేద్కర్ చౌక్ లో నిన్న రాత్రి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్ మాట్లాడుతూ పాకిస్తానీ ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తున్న భారత్ లోని సెక్యులర్ పార్టీలను రాజకీయంగా అణిచివేయాలని హిందువులంతా ఒక్కటై పోరాడితేనే హిందువులకు భవిష్యత్తు ఉంటుందని తెలియజేస్తూ మరోసారి ఇలా జరగకుండా ఉండాలంటే హిందువులంతా సంఘాటీతంగా ఒక్కటి కావాలని పిలుపునిస్తూ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న సెక్యులర్ పార్టీలను అంతం చేయాలని తెలియజేస్తూ నిన్న ఈ మరణకాండలో మృతి చెందిన కుటుంబలకు వారికి కొవ్వొత్తుల ర్యాలీ ద్వారా జననివాళి అర్పిస్తూ వారి ఆత్మ శాంతి చేకూరాలని దేవుని ప్రార్థించడం జరిగినది. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్ జిల్లా అధికార ప్రతినిధి నవీన్ యాదవ్, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు అల్లం అన్నపూర్ణ,అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ పత్తిపాక సురేష్, ఉరవకొండ రాజు,జ్ఞాన రాంప్రసాద్,దూడం శివప్రసాద్ ,దుమాల శ్రీకాంత్,కోడం రవి,మోర రవి,పండగ మాధవి,వైశాలి హరీష బండారి వెంకటేశ్వర్లు సురేష్ దూడం సురేష్ ఇంజాపూర్ మురళి, రాజేందర్ మరియు పట్టణ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

లక్ష్మీ ప్రసన్న కుటుంబాన్ని ఆదుకోవాలని ధర్నా.!

లక్ష్మీ ప్రసన్న కుటుంబాన్ని ఆదుకోవాలని ధర్నా.

బాధిత కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి.

బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజి డిమాండ్.

బెల్లంపల్లి నేటిధాత్రి :

మంచిర్యాలలోనీ సాంఘిక సంక్షేమ శాఖ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్న లక్ష్మీ ప్రసన్న కుటుంబాన్ని ఆదుకోవాలి అని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజి డిమాండ్ చేశారు. ఈ రోజు ఆ విద్యార్థినీ ప్రభుత్వ ఆసుపత్రిలో చనిపోయింది. మృతురాలు లక్ష్మీ ప్రసన్న కుటుంబ సభ్యులతో కలిసి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఆమె తల్లిదండ్రులతో కలిసి ధర్నా చేశారు. ఆమె మృతిపై విచారణ జరిపి బాధ్యులపై చర్య తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థిని కుటుంబ సభ్యులకు 50 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. వారి కుటుంబ సభ్యులకు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలనీ అన్నారు. విద్యార్థిని ఉదయం చనిపోతే సాయంత్రం వరకు ఒక్క అధికారి కూడా రాకపోవడం దురదృష్టం అన్నారు. జిల్లా కేంద్రంలో జరిగినా కనీసం పట్టించుకోలేదని విమర్శించారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ సంఘటన స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రభుత్వం తరపున వారి కుటుంబ సభ్యులను ఆదుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు వేంకటేశ్వర గౌడ్, మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి, కృష్ణ, నవీన్, నర్సింగ్, శీతల్, సంగీత, స్రవంతి, కమల, దుర్గం ఎల్లయ, వాణి, శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు.

గోర్ మాటీ సదస్సును విజయవంతం చేయండి.!

గోర్ మాటీ సదస్సును విజయవంతం చేయండి

ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రనాయక్

మరిపెడ నేటిధాత్రి:

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో లంబాడీల ఐక్య వేదిక డోర్నకల్ నియోజక వర్గ కమిటీ ఆధ్వర్యం లో భవ సంగ్ మహారాజ్ మరియు దండి మ్యారాయా యాడీ మాకుల క్షేత్రం లో జరిగే గోర్ మాటీ ఆత్మ గౌరవ సదస్సు కు యొక్క పోస్టర్ ను ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామ్ చందర్ నాయక్ ను ఐక్య వేదిక బృందం కలిసి పోస్టర్ ను ఆవిష్కరించడం జరిగింది ఈ సమావేశానికి అందరూ హాజరు అయి విజయవంత చేయాలి అని పిలుపు ఇవ్వడం జరిగింది.ఈ సందర్భముగా లంబాడీల ఐక్య వేదిక ఆధ్వర్యం లో జరిగే సప్త భవాని మాతలు , 6 గురు జాతి గురువులు, బాలాజీ మహారాజ్, భవసంగ్ మహారాజ్, బుడియ బాపు, లింగ మసంద్, లోక మసంద్ ల భోగ్ భండార్ కార్య క్రమానికి జాతి గురువులు, సాధువులు, సంతువులు, బావాలు, భగత్ ల చేతుల మీదుగా మాత్రమే జరిగే భోగ్ కార్య క్రమానికి హాజరు అయ్యి శనివారం ఏప్రిల్ 26 న జరిగే మాకుల భవసంగ్ మహారాజ్ వెంకటేశ్వర స్వామి వారి బండ్లు తిరిగే కార్య క్రమానికి అందరూ హాజరు అవ్వాలని పిలుపు ఇచ్చారు.ఈ కార్య క్రమం లో జాదవ్ రమేష్ నాయక్ లంబాడీల ఐక్య వేదిక రాష్ట్ర ముఖ్య సమన్వయ కర్త అలాగే పూజారుల సంఘం నాయకులు బానోత్ సీతారాం నాయక్,రవి నాయక్ గూగులోత్ ,మరిపెడ కాంగ్రెస్ మండల అధ్యక్షులు పెండ్లి రఘువీరా రెడ్డి, యుగంధర్ రెడ్డి,భట్టు నాయక్, మున్సిపాలిటీ కాంగ్రెస్ నాయకులు బోడ రవి నాయక్ జిల్లా విద్యార్థి విభాగం సమన్వయ కర్త బాసు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

వేసవి కాలంలో ప్రకృతి సోయగం.

వేసవి కాలంలో ప్రకృతి సోయగం

కనువిందు చేస్తున్న ముదిగుంట రహదారి

జైపూర్,నేటి ధాత్రి:

 

 

 

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ముదిగుంట, కాన్కూర్ మార్గంలో కనువిందు చేస్తున్న రహదారి వనాలు.

ముదిగుంట రహదారి నుండి ప్రయాణించే వాహనాదారులు ఈ ప్రకృతి వనాన్ని ఆస్వాదిస్తూ ఫోటోలు దిగుతూ సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు.ఇంత మండు వేసవి కాలంలో కూడా ఈ చెట్లు ఒకదానికి ఒకటి అల్లుకొని చల్లదనాన్ని ఇస్తూ రహదారి వెంట పూలవనంతో చూపరులను అబ్బురపరుస్తున్నాయి. ఇలాంటి ఆహ్లదమైన వాతావరణాన్ని పకృతి ప్రేమికులు ఆస్వాదిస్తున్నట్లు తెలిపారు.

టీజీ ఎఫ్ డీసీ ప్లాంటేషన్.!

టీజీ ఎఫ్ డీసీ ప్లాంటేషన్ లో వన్య ప్రాణుల కోసం నీటి కుంట ఏర్పాటు

మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేష్ కుమార్

జైపూర్  నేటి ధాత్రి:

 ఎండలు తీవ్రంగా ఉండడం తో ప్లాంటేషన్ లలో,అటవీ ప్రాంతంలో సంచరించే వన్యప్రాణుల దాహార్తి తీర్చడానికి నీటి కుంటలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ(టీజీ ఎఫ్ డీసీ) మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేష్ కుమార్ పేర్కొన్నారు.జైపూర్ మండలంలోని కాన్కూర్ గ్రామ సమీపంలో ఉన్న టీజీ ఎఫ్ డీసీ నీలగిరి ప్లాంటేషన్ లో శుక్రవారం నీటి కుంట తవ్వించారు.జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన ఈ పనులను శుక్రవారం ఉదయం పరిశీలించారు.ఈ సందర్భంగా ప్లాంటేషన్ మేనేజర్ మాట్లాడుతూ ఎండలు తీవ్రమై నీటి కోసం వన్యప్రాణులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో నీటి ఊటలు ఉన్న ప్రాంతాలను గుర్తించి నీరు నిల్వ ఉండే విధంగా తవ్వించి నీటి కుంటలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.కాన్కూర్, ముదిగుంట అటవీ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేశామన్నారు.ఈ కార్యక్రమంలో ప్లాంటేషన్ వాచర్ టి.శంకర్,సిబ్బంది పాల్గొన్నారు.

పాకిస్తాన్ ఉగ్రవాదులను తరిమికొట్టాలని నల్ల రిబ్బన్లతో.

పాకిస్తాన్ ఉగ్రవాదులను తరిమికొట్టాలని నల్ల రిబ్బన్లతో నమాజ్.

మాజీ కోఆప్షన్ సభ్యులు
ఎండి రాజ్ మహమ్మద్.

చిట్యాల, నేటిధాత్రి :

 

 

 

ఈనెల 22వ తేదీన జమ్మూ కాశ్మీర్ లోని పైల పహిలగామ్ లో పాకిస్తాన్ టెర్రరిస్టులు జరిపిన కాల్పుల్లో 28 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు వారి మృతికి సంతాప సూచకంగా శుక్రవారం రోజున చిట్యాల మండల కేంద్రంలోని మరియు మండలంలో ఉన్నటువంటి మసీదు లలో శుక్రవారం నమాజులో ముస్లిం సోదరులు అందరూ నల్ల రిబ్బన్లు ధరించి నమాజ్ చేసుకొని ఉగ్రవాద కార్యకలాపాలను చేసేవారిని తరిమికొట్టాలని ముఖ్యంగా టెర్రరిస్టులు కాల్పులు జరిపిన సమయంలో కాశ్మీరు వస్త్ర వ్యాపారి నాజా కతలి మరియు సయ్యద్ ఆదిల్ హుస్సేన్ వీరోచితంగా పోరాడి చాలామంది టూరిస్టుల ప్రాణాలు కాపాడారు కావున ముస్లింలు ఎప్పుడు కూడా భారతదేశానికి స్వాతంత్ర సమరంలో ప్రాణాలర్పించి ముందు వరుసలో ఉన్నారు కావున అందరం కలిసి టెర్రరిస్టుల చర్యను ఖండించాలని చిట్యాల మండలం

మాజీ కోఆప్షన్ సభ్యులు ఎండి రాజ్ మహమ్మద్ ఒక ప్రకటనలో తెలియజేశారు.

హిందూ ధర్మమే మనల్ని రక్షిస్తుంది.!

హిందూ ధర్మమే మనల్ని రక్షిస్తుంది.

జహీరాబాద్ నేటి ధాత్రి:

వేద పాఠశాల విద్యార్థులు హిందూ ధర్మ రక్షణ కోసం కృషి చేయాలని, అదే మనల్ని రక్షిస్తుందని జహీరాబాద్ సివిల్ కోర్టు న్యాయమూర్తి కవితా దేవి అన్నారు. ఝరాసంగం మండలం మరిదిపూర్ లోని దత్తగిరి ఆశ్రమంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దత్తగిరి పీఠాధిపతి అవధూత గిరి మహరాజ్ తో కలిసి ఈనెల 29న జరిగే శనీశ్వర జయంతి కరపత్రాలను ఆవిష్కరించారు.

జమ్మూ కాశ్మీర్ పహల్గం లో ఉగ్రమూకల దాడిని ఖండిస్తూ.

జమ్మూ కాశ్మీర్ పహల్గం లో ఉగ్రమూకల దాడిని ఖండిస్తూ

నేటి ధాత్రి కథలాపూర్

 

 

 

 

భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు కథలాపూర్ మండల కేంద్రంలో ఉగ్రమూఖల దాడిలో అసువులు బాసిన పర్యాటకులకు అశ్రునివాళి అర్పించి, కొవ్వాత్తుల ర్యాలీ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో హిందువులరా మేల్కొండి, ఉగ్రవాదం నశించాలి, పాకిస్థాన్ కుక్కలారా ఖబర్దార్ ఖబర్దార్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడం జరిగింది ముక్యంగా హిదువులను గుర్తించి మరి దాడి చేయడం దేనికి సంకేతం అని ప్రశ్నించారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మల్యాల మారుతి,కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కోడిపెల్లి గోపాల్ రెడ్డి,జిల్లా కౌన్సిల్ మెంబర్ కథలాపూర్ మహేష్, గడ్డం జీవన్ రెడ్డి,దండిక లింగం,బూమయ్య,సంతారం,రాజేష్,శ్రీకర్,ప్రసాద్,గణేష్,శివ, శ్రీహరి, మల్లేష్,గంగమల్లయ్య, చారి నాయకులు, బీజేపీ కార్యవర్గ సభ్యులు సురబీ నవీన్ పాల్గొన్నారు బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు

జెరూసలేం తీర్థయాత్రకీ వెళుతున్న మాజీ ఏ.జి.పి.!

జెరూసలేం తీర్థయాత్రకీ వెళుతున్న మాజీ ఏ.జి.పి నాథానేయల్ గారిని సన్మానించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు

◆ డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి గారి స్వగృహంలో గురువారం రోజున పవిత్ర జెరూసలేం తీర్థయాత్రకీ వెళుతున్న శుభ సందర్భంగా మాజీ ఏ.జి.పి నాథానేయల్ గారిని సన్మానించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి.ఈకార్యక్రమంలో సిడిసి చైర్మన్ ముబీన్,మాజీ సర్పంచ్ నర్సింహారెడ్డి,ఆశ్విన్ పాటిల్,అక్షయ్ జాడే,పెంటారెడ్డి,బి.మల్లీకార్జున్,నర్సింహా యాదవ్,రాజు మరియు తదితరులు పాల్గొన్నారు.

ఇంటర్మీడియట్ ఫలితాలలో.!

ఇంటర్మీడియట్ ఫలితాలలో మెరిసిన కక్కిరాలపెల్లి విద్యార్థిని లయశ్రీ
ఇంటర్మీడియట్ ఎం. ఎల్ టి గ్రూపులో స్టేట్ మొదటి ర్యాంక్
ఆరూరి లయశ్రీ రాయపర్తి సోషల్ వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థిని
ఆరూరి లయశ్రీకి గ్రామస్తులు బి. ఆర్. ఎస్ నాయకుల అభినందన

నేటిధాత్రి ఐనవోలు :-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాలలో అయినవోలు మండలం కక్కిరాల పల్లి గ్రామానికి చెందిన ఆరూరి లయశ్రీ ఇంటర్మీడియట్ ఎంఎల్టి గ్రూప్ లో స్టేట్ లో మొదటి ర్యాంకు సాధించి ఉత్తమ ప్రతిభ కనబరిచింది. కక్కిరాలపల్లి గ్రామానికి చెందిన ఆరూరి సుమలత ప్రభాకర్ దంపతులకు కుమార్తె లయశ్రీ రాయపర్తి లోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుతూ ఈ ఘనత సాధించడం విశేషం.ఈ సందర్భంగా కక్కిరాలపెళ్లి గ్రామ బి. ఆర్. ఎస్ పార్టీ నాయకులు లయశ్రీ ని ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్ కంజర్ల రమేష్ మాట్లాడుతూ కక్కిరాలపల్లి గ్రామానికి చెందిన విద్యార్థిని రాష్ట్రంలోని అత్యుత్తమ ర్యాంకు సాధించడం మన గ్రామానికి గర్వకారణం అన్నారు. చదువులోనే కాకుండా లయశ్రీ సాఫ్ట్ బాల్ కాంపిటీషన్లో నేషనల్ లో సిల్వర్ మెడల్ సాధించడం కూడా విశేషం. ఇలాంటి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన లయశ్రీ గ్రామంలోని యువత కే కాకుండా మండలంలోని యువత కూడా ఆదర్శంగా నిలిచిందని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ ఉపసర్పంచ్ బొల్లం ప్రకాష్ మాజీ వార్డు సభ్యులు మంద రజిత కాటబోయిన కుమార్ స్వామి టిఆర్ఎస్ పార్టీ ప్లీనరీ నాయకులు యాదగిరి ఏలియా నిమ్మాని వెంకటేశ్వరరావు మోహన్ తదితరులు పాల్గొన్నారు.

వరంగల్ తూర్పు వర్కింగ్ జర్నలిస్ట్ ల.!

వరంగల్ తూర్పు వర్కింగ్ జర్నలిస్ట్ ల డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సాధనకై జర్నలిస్టులు చేపట్టిన నిరహార దీక్షకి,

“నేటిధాత్రి”

దినపత్రిక ఎండీ కట్ట రాఘవేంద్రరావు,

డైరెక్టర్ కట్టా శివ సుబ్రమణ్యం లు హాజరై సంఘీభావం తెలిపారు..

భూభారతి చట్టంతో సమస్యలకు శాశ్వత పరిష్కారం.!

భూభారతి చట్టంతో సమస్యలకు శాశ్వత పరిష్కారం

రైతుల భూములకు రక్షణ కవచంలా భూభారతి
* మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం రైతులకు విశ్వాసం కల్పించే విధంగా, వారి భూములకు రక్షణ కవచంలా ఉండేలా భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చిందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. మొగుళ్ళపల్లి, మండలంలోఏర్పాటు చేసిన భూ భారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఇతర అధికారులతో కలిసి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ… గతంలో ఉన్న ధరణిలో అనేక లోపాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ధరణి స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకువచ్చేందుకు మేధావులు, రైతు సంఘాలు, అందరితో చర్చించి గత చట్టంలోని లోపాలను సవరిస్తూ కొత్త చట్టం భూ భారతిని తీసుకు వచ్చిందన్నారు. అంతకుముందు భూ భారతి చట్టం యొక్క అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. లోపభూయిష్టంగా ఉన్న ధరణి వల్ల పట్టా జారీలో ఏదేని పొరపాటు జరిగితే అప్పీలు చేయడానికి ఆవకాశం లేదని, రైతులు సివిల్ కోర్టు చుట్టూ తిరగాల్సి వచ్చేదని దానివల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారం లోకి వస్తే ధరణి స్థానంలో భూ భారతి తెస్తామని చెప్పిన ప్రకారం సీనియర్ అధికారులతో అన్ని రాష్ట్రాల్లో విచారణ చేసి సులువైన పటిష్టమైన చట్టాన్ని అమల్లోకి తెచ్చినట్లు తెలిపారు.

 

MLA

భూములు కొన్నా, అమ్మినా లైసెన్స్డ్ సర్వే యర్ ద్వారా హద్దులతో మ్యాపు తయారు చేసి పట్టాదారు పాసుపుస్తకాల్లో నమోదు చేస్తారని తద్వారా భూమి గుర్తింపుకు అవకాశం కలుగుతుందని తెలిపారు. తహసీల్దార్ ద్వారా ఏదేని పొరపాటు జరిగితే ఆర్డిఓ, ఆర్డిఓ నుండి కలెక్టర్, కలెక్టర్ నుండి భూ ట్రిబ్యునల్ నకు వెళ్ళడానికి అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఉచిత న్యాయ సహాయ సేవలు అందించడానికి అవకాశం కల్పించారని అన్నారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 31వ తేదీన రికార్డుల నవీకరణలను చేయడానికి అవకాశం కల్పించినట్లు తెలిపారు. ప్రజలకు ఆధార్ ఎలా ఉందో అలానే భూములకు భూదార్ జారీ చేయనున్నట్లు తెలిపారు. గ్రామ పహణి కూడా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ధరణి వచ్చిన తరువాత పహణిలో నమోదులు జరగలేదని తెలిపారు. 2014 జూన్ 2 కంటే ముందు గ్రామీణ ప్రాంతంలోని వ్యవసాయ భూమిని సాదా బైనామా ద్వారా కొనుగోలు చేసి, గత 12 ఏండ్లుగా అనుభవంలో ఉంటూ 12-10-2020 నుండి 10-11-2020 మధ్య కాలంలో క్రమబద్దీకరణ కోసం సన్న చిన్నకారు రైతులు పెట్టుకున్న దరఖాస్తులపై ఆర్డిఓ విచారణ చేసి అర్హత ఉన్న వారి నుండి ప్రస్తుత రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ ప్రకారం భూ హక్కులు జారీ చేస్తారని అన్నారు.

అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యం.!

గ్రామ పంచాయితీల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యం = ఎంపీడీవో ఇందిరమ్మ.

ఆర్ సి పురం లో ఘనంగా జాతీయ. పంచాయతీరాజ్ దినోత్సవం

పంచాయతీ సిబ్బందిని ఘనంగా సన్మానించిన నేతలు.

రామచంద్రపురం(
నేటి ధాత్రి) ఏప్రిల్ 24:

 

 

దేశానికి పట్టుకొమ్మలైన గ్రామ పంచాయతీల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని ఎంపీడీవో ఇందిరమ్మ అన్నారు, గురువారం మండలంలోని చుట్టుగుంట రామాపురం గ్రామపంచాయతీ కార్యాలయంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ కె సుబ్రహ్మణ్యం రెడ్డి అధ్యక్షతన పంచాయతీ కార్యదర్శి పి చంద్రశేఖర్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభింపజేశారు.ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు. సర్పంచ్ కే సుబ్రహ్మణ్యం రెడ్డి మాట్లాడుతూ గ్రామపంచాయతీల సర్వతోముఖాభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా అందరి సహకారం అందించాలని కోరారు. టిడిపి సీనియర్ నాయకుడు‌ కొట్టే నరసింహారెడ్డి మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేయడంతో అభివృద్ధి కుంటి బడిందన్నారు.. కూటమి ప్రభుత్వ హయాంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులు నేరుగా గ్రామ పంచాయతీల అకౌంట్ లో
జమ చేస్తున్నాయని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్య మంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ లు గ్రామీణాభివృద్ధి కోసం సీసీ రోడ్లు, మురికినీటి కాలువల నిర్మాణం, తాగునీటి పథకాలు, స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నారని కొనియాడారు. పంచాయతీ కార్యదర్శి పి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ సి రామాపురం గ్రామపంచాయతీని సమస్యల రహిత పంచాయితీగా తీర్చిదిద్దడానికి ప్రజలందరూ సహకరించాలని కోరారు.ఇంటి పన్ను,తాగునీటి కనెక్షన్ పన్నులను సకాలంలో చెల్లించి పంచాయతీ అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలని ప్రజలను కోరారు. పంచాయతీలోని గ్రామాలలో పరిసరాల పరిశుభ్రత, ఈ వేస్ట్ సేకరణ తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులను, సిబ్బందిని, స్థానిక టిడిపి నాయకులు కె. గిరిధర్ రెడ్డి, ముద్దు కృష్ణారెడ్డి, ముని రామిరెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి,రంజిత్ కుమార్ రెడ్డిలు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వార్డ్ మెంబర్లు, వీఆర్ ఓ
ఝాన్సీ,డిజిటల్ అసిస్టెంట్ భరత్ కుమార్ రెడ్డి,బిల్ కలెక్టర్ సుబ్రహ్మణ్యం, పంచాయతీ కార్యాలయ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు…

భూభారతి రైతులకు మేలు చేస్తుంది.!

‘భూభారతి రైతులకు మేలు చేస్తుంది’

దేవరకద్ర /నేటి ధాత్రి:

ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి

మదనాపురం మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టం అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ మరియు రెవెన్యూ అధికారులతో కలిసి పాల్గొన్న దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని వీవర్స్ కాలనీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి, తనదనంతరం కాంగ్రెస్ పార్టీ జెండాను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

అఖండ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర :

అఖండ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర :

కాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడి కి నిరసనగా న్యాయవాదుల ర్యాలీకి మద్దతు.

కేంద్ర ప్రభుత్వం , సైన్యం తీసుకునే ఏ నిర్ణయానికైనా మనం అండగా ఉందాం.

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి.

మహబూబ్ నగర్/నేటి ధాత్రి

 

 

అఖండ భారతదేశాన్ని విచ్చిన్నం చేయడానికి పాకిస్థాన్ ఉగ్రవాదులు కుట్ర చేస్తున్నారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. కాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో న్యాయవాదులు చేపట్టిన ర్యాలీ కి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. భారతదేశంలో కులమతాలకు అతీతంగా కలిసిమెలిసి సోదర భావంతో జీవిస్తున్నామని, పాకిస్థాన్ ఉగ్రవాదులు, భారతదేశంలో కులమతాల మధ్యన చిచ్చు పెట్టి దేశంలో అల్లర్లు సృష్టించేందుకు పన్నాగం పన్నారన్నారు. భారత ప్రభుత్వం, దేశ సైనికులు ఏ నిర్ణయం తీసుకున్నా దేశం మొత్తం రాజకీయాలకు అతీతంగా, పార్టీ భావ జాలాలకు అతీతంగా ఏకతాటి మీద ఉండి, అండగా ఉండాల్సిన సమయం అని ఆయన చెప్పారు. ఇప్పుడిప్పుడే కాశ్మీర్ లో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతూ కళకళలాడుతూ.. ఉందని, టూరిస్టులు పెరగడంతో కాశ్మీర్ ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని, అక్కడ వారి జీవన ప్రమాణాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయని, పాఠశాలలు కూడా అభివృద్ధి చేసుకుంటూ కులమతాలకు అతీతంగా వారు సంతోషంగా మంచి జీవనాన్ని సాగిస్తున్నారన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు పాక్ ఉగ్రవాదులు పన్నాగం పన్నారని ఆయన అన్నారు. ఈ దేశం నాది, ఈ దేశం మనది అనే భావన మనకందరికి ఉండాలని, ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో టి.పిసిసి ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎన్.పి వెంకటేష్, గుండా మనోహర్, వీరబ్రహ్మచారి, రమాకాంత్ గౌడ్, మురళి కృష్ణ, లక్ష్మయ్య, కృష్ణయ్య, అనంతచారి, శ్రీపాదరావు, విక్రం గౌడ్, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

జమ్మూ కాశ్మిర్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము.

జమ్మూ కాశ్మిర్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము…_

— మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఎస్సీ సెల్ అద్యక్షులు పత్తి కుమార్

కాప్రా నేటిధాత్రి 24

 

 

జమ్మూ కాశ్మిర్ లోని అనంత నాగ్ జిల్లా పెహల్గామ్ లో నిన్న జరిగిన ఉగ్ర దాడిని కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఎస్సీ సెల్ అద్యక్షులు పత్తి కుమార్ అన్నారు.
జమ్మూ కాశ్మీర్ అందమైన పర్యాటక ప్రాంతంలో ఇలాంటి ఘటనలు చాలా దురదృష్టకరం, ఈ ఘటనకు కేంద్ర ప్రభుత్వo పూర్తి బాధ్యత వహించాలని దాడిలో మరణించిన వారి కుటుంబాలకు సానుభూతిని తెలియజేస్తున్నాము..
గాయపడిన కుటుంబాలకు మెరుగైన చికిత్స అందించి వారి కుటుంబాలకు ధైర్యాన్ని చేకూర్చాలి అదేవిధంగా ఉగ్రదాడి బాధితులను కేంద్ర ప్రభుత్వం ఆదుకొని వారికి అండగా నిలవాల్సిన బాధ్యత ఉన్నది దాడికి బాధ్యులైన వారిని వెంటనే పట్టుకొని ఉరిశిక్ష అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి సమయంలొ దేశప్రజలు అందరు ఒక్కటై బాధితకుటుంబలకు అండగా నిలబడాలని కోరుతున్నాము.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version