సరస్వతి శిశు మందిర్.!

సరస్వతి శిశు మందిర్ 2000-2001 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ :పట్టణ పరిధిలోని సరస్వతి శిశు మందిర్ 2000-2001 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళ్లనం ను ఘనంగా నిర్వహించిన విద్యార్థులు, చదువొక్కటేనా..
విద్యతో పాటు బుద్ధులు బుద్ధులతో పాటు విలువలు..
క్రమశిక్షణా కట్టుబడి దేశభక్తి జాతీయభావనను
నరనరమున నింపి… వినయవిధేయతలు,ధర్మనిష్టా సత్సాంప్రదాయ సదాచారాలు కణకణమున అలవర్చిన మన బడి…బడి కాదు అది వ్యక్తిత్వ నిర్మాణ ధర్మక్షేత్రం సమాజ నిర్మాణ కార్య క్షేత్రం మనందరిలో ఏకాత్మతా భావనను నింపిన దైవ క్షేత్రం..బడి కాదు అది బ్రతుకు నేర్పిన అమ్మ ఒడి..మన శిశు మందిర్ గుడి..!ఆ దైవ క్షేత్రం..ఆ ధర్మక్షేత్రం..ఆ కార్య క్షేత్రం..స్మరిస్తూ శారదామాతా ఒడిలో స్నేహాతులు కలుసుకుని వాళ్ళ బాల్యపు మధుర స్మృతులను,మరపురాని అనుభవాలను వారి ఆచార్యులతో పంచుకున్న విద్యార్థులు మన పాఠశాల 2000-2001 బ్యాచ్ పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం పాఠశాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు. 25 సంవత్సరాల తర్వాత బాల్య మిత్రులు అంతా ఒక్కటిగాఏర్పడి చిన్న నాటి మధుర జ్ఞాపకాలను అందరితో కలసి పంచుకున్నారు. పాఠశాలలో దాదాపు 4 లక్షల వ్యయంతో 2 తరగతి గదులను మరియు రేలింగ్ వేయించి ఆధునీకరించడం జరిగిందని పాఠశాల అధ్యక్షులు సాయి రెడ్డి విఠల్ రెడ్డి అన్నారు,పాఠశాల తిరిగి పునర్ వైభవం లోకి రావడానికి పూర్వవిద్యార్థులు,పూర్వ ఆచార్యులు అన్ని విధాలుగా సహకరిస్తున్నందుకు వారందరినీ అభినందించారు.ఈ కార్యక్రమంలో పూర్వ ప్రధానాచార్యులు గోకుల కృష్ణయ్య ,పూర్వ ఆచార్యులు మరియు పూర్వ విద్యార్ధి పరిషత్ సభ్యులు గిరీష్,మహేష్ విద్యార్థులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం.

ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

దేశవ్యాప్తంగా జనగణన,కులగణన చేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర ప్రకటించిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నర్సంపేట పట్టణ కమిటీ
అధ్యక్షులు గూడూరు సందీప్, పట్టణ నాయకులతో కలిసి పట్టణంలోని వరంగల్ రోడ్ సర్కిల్ లో గల అమరవీరుల స్థూపం దగ్గర ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.జనగణన దేశ అభివృద్ధికి మార్గదర్శిని,కులగణనతో అభివృద్ధిలో సమానతను తీసుకువచ్చే సాధనం అని అధ్యక్షులు గూడూరు సందీప్ పేర్కొన్నారు.జిల్లా ఉపాధ్యక్షులు రేసు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రధాని తలపెట్టిన జనగణనతో పాటు కులగణన చేపట్టడం చారిత్రాత్మక నిర్ణయమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వడ్డేపల్లి నరసింహారాములు,ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి గడ్డం ఆంజనేయులు, సీనియర్ నాయకులు ఠాకూర్ రవీందర్ సింగ్ (చిన్న),జిల్లా కౌన్సిల్ మెంబర్ పొదిళ్ల రామచందర్, రూరల్ మండల అధ్యక్షులు తనుగుల అంబేద్కర్ ,పట్టణ ప్రధాన కార్యదర్శలు కందికొండ శ్రీనివాస్, సూత్రపు సరిత,ఉపాధ్యక్షులు కాసుల నాగేంద్రబాబు, ఠాకూర్ విజయ్ సింగ్, కార్యదర్శులు చేను నరేష్, సామల ప్రవీణ్ కుమార్, సీనియర్ నాయకులు పొనుగోటి రవీంద్ర చారి, దుగ్యాల సమ్మయ్య, ఠాకూర్ శివాంజన్ సింగ్, నూనె రంజిత్, రూరల్ నాయకులు బట్టు మదన్, తాళ్లపల్లి రాము, బూసాని సుదర్శన్, యువ మోర్చా జిల్లా ప్రధాన

కార్యదర్శి అచ్చ దయాకర్ ఉపాధ్యక్షులు కొంకిసా విగ్నేష్ గౌడ్, శ్రీనివాస్, కార్యదర్శి చిలువేరు అన్వేష్, నర్సంపేట యువ మోర్చా అధ్యక్షులు తప్పెట్ల సతీష్ మరియు తదితరులు  పాల్గొన్నారు.

*కీలపట్లలో శాశ్వత విద్యుత్ సమస్య పరిష్కారం..

*కీలపట్లలో శాశ్వత విద్యుత్ సమస్య పరిష్కారం..

*అంతరాయం లేకుండా త్రీ ఫేస్ విద్యుత్ సరఫరా..

*గృహ అవసరాలతో పాటు చిన్న పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం…

*రూ. 60 లక్షలతో ఏర్పాటు చేసిన 100 కేవి ట్రాన్స్ ఫార్మర్ లను ప్రారంభించిన ఎమ్మెల్యే అమర్..

గంగవరం(నేటి ధాత్రి) మే05:

 

 

గంగవరం మండలంలోని కీలపట్ల పంచాయతీ పరిధిలో విద్యుత్ సమస్య శాశ్వతంగా పరిష్కారానికి నోచుకుందని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. కీలపట్లలోని కోనేటి రాయస్వామి ఆలయంలో స్వామి వారిని ఆదివారం ఆయన దర్శించుకుని పంచాయతీ కేంద్రంలో రూ.60 లక్షల ఆర్డీఎస్ నిధుల ద్వారా ఏర్పాటు చేసిన నాలుగు 100 కేవి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుల తో పాటు విద్యుత్ శాఖ అధికారులు ఆయనకు ఘన స్వాగతం తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన కీలపట్ల గ్రామంలో స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్బంగా చేపట్టే ఉత్సవ విగ్రహాల ఊరేగింపులో విద్యుత్ తీగల కారణంగా ఇబ్బందులు ఉండేవన్నారు. గ్రామస్తులు మరియు భక్తుల శ్రేయస్సు దృష్ట్యా 60 లక్షలతో గ్రామంలో విద్యుత్ స్తంభాల ఏర్పాటుతోపాటు 100కేవి ట్రాన్స్ ఫా
ర్మర్లను మరియు సమస్య అనేదే ఉత్పన్నం కాకుండా ఉండేందుకు అదనంగా 25 కేవి అడిషనల్ ట్రాన్స్ఫార్మర్ను సైతం ఏర్పాటు చేశామన్నారు. దీంతో అంతరాయం లేకుండా నిరంతరం విద్యుత్ సరఫరా ఉండడమే కాకుండా లో ఓల్టేజి సమస్య అనే మాటే ఉండదన్నారు. ఈ ప్రాంతంలోని ప్రజల అవసరాలకే గాక 24 గంటలు త్రీఫేస్ విద్యుత్ ను వాడుకోనేందుకు వీలుందన్నారు. దాంతో పాటు పంచాయతీ పరిధిలో చిన్న పరిశ్రమలను సైతం ఏర్పాటు చేసుకోవచ్చని వివరించారు. అతి తక్కువ సమయంలో ఆర్డీఎస్ కాంట్రాక్టర్ లు మరియు విద్యుత్ శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధతో ఈ పనులను పూర్తి చేయడం అభినందించదగ్గ విషయం అన్నారు. కీలపట్ల పంచాయతీ పరిధిలో ఆలయాన్ని టిటిడి పరిధిలోకి తీసుకోవడం, రోడ్లు,గృహాలు, విద్యుత్, తాగునీరు, పాఠశాలలు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి గా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే జరిగాయన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ట్రాన్స్ కో ఈఈ శ్రీనివాస మూర్తి, ఏడి చిన్నబ్బ, కన్స్ట్రక్షన్ ఏడి రెడ్డి కుమార్, ఏఈ రామక్రిష్ణ, మరియు టీడీపీ నాయకులు సోమశేఖర్ గౌడ్, ప్రతాప్ రెడ్డి, సర్పంచ్ చంద్ర శేఖర్, వేణు, గిరిధర్ గోపాల్, రాము,శీనప్ప, శ్రీనివాసులు, జనసేన నాయకులు చంద్ర తదితరులున్నారు..

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మృతి.

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మృతి.

కల్వకుర్తి /నేటి దాత్రి :

 

 

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, సిల్వర్ జూబ్లీ క్లబ్ అధ్యక్షుడు చింతల రమణారెడ్డి ఆకస్మికంగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం సాయంత్రం మరణించాడని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపులో ఆయన కీలక పాత్ర పోషించారని, ఆయన మృతి పార్టీకి తీరని లోటు అని పలువురు కాంగ్రెస్ నేతలు అన్నారు. ఆకస్మిక మరణానికి చింతిస్తూ ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణ రెడ్డి ఆయన మృత దేహానికి పూలమాల వేసి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఘనంగా గండ్ర వెంకట రమణారెడ్డి పుట్టినరోజు వేడుకలు.

ఘనంగా గండ్ర వెంకట రమణారెడ్డి పుట్టినరోజు వేడుకలు

శాయంపేట నేటిధాత్రి:

 

 

శాయంపేట మండల కేంద్రంలో ఘనంగా గండ్ర వెంకటరమ ణారెడ్డి జన్మదిన వేడుకలను బిఆర్ఎస్ నాయకులు మండ ల కేంద్రంలో భూపాలపల్లి అభివృద్ధి ప్రదాత, ప్రజానా యకుడు, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది.

బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంగుల మనోహర్ రెడ్డిమరియు మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి ఆధ్వ ర్యంలో కూడలి వద్ద కేక్ కట్ చేసి, పండ్లు పంపిణీ చేయడం జరిగింది.

 

Gangula Manohar Reddy.

 

 

అనంతరం గవర్న మెంట్ హాస్పిటల్ కి వెళ్లి రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది.

 

ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ మాజీ శాసన సభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి ఆయురా రోగ్యాలతో ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ, భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలకు ఎంతో సేవ చేయాలని ఆకాంక్షించారు.

Gangula Manohar Reddy.

ఈ కార్యక్ర మంలో మాజీ వైస్ ఎంపీపీ వంగల నారాయణరెడ్డి, సీనియర్ నాయకులు లక్ష్మా రెడ్డి, మండల సోషల్ మీడి యా కన్వీనర్ దాసి శ్రావణ్ కుమార్, మండల యూత్ అధ్యక్షులు మారేపల్లి మోహన్, గ్రామ శాఖ అధ్యక్షులు గాదె రాజేందర్, మేకల వెంకటే శ్వర్లు,సవాసి రమేష్, చల్లా శ్రీనివాస్ రెడ్డి, పసుల ప్రవీణ్, చిలుకయ్య, పిఎసిఎస్ చైర్మన్ కుసుమ శరత్, ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షులు మేకల శ్రీనివాస్, మాజీ సర్పంచులు వలపదాస్ చంద్రమౌళి, బొమ్మ కంటి సాంబయ్య, రఘుపతి రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ మారపల్లినందం, గడిపే విజయ్, ధైనంపల్లిసుమన్, పోతురమణారెడ్డి సావుళ్ళ కిష్టయ్య, నర్రరాజు, ఆకుల లక్ష్మణ్, కల్వాలశ్యామాజీ, అట్లతిరుపతి, రంగుమహేం దర్,కొమ్ముల రాకేష్,కరుణ్ బాబు, పైండ్లభానుచందర్, పైండ్లశంకర్, ఫైండ్లశ్రీనివాస్, కోగీలరవికిరణ్, కుతాటి రమేష్, మామిడి శంకర్, ప్రశాంత్, ఆదిరెడ్డి, నారాయణ రెడ్డి, రామరాజు, రమేష్ , మొగిలి,సుభాష్, వైద్యుల సాం బరెడ్డి, మస్కే సుమన్ , నాగరాజు ,దేవయ్య,రేణికుం ట్ల సంతోష్ ,కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు.

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

శాయంపేట నేటిధాత్రి:

 

 

శాయంపేట మండలంలో కొప్పుల గ్రామానికి చెందిన జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో చదువుకున్న ఎస్ఎస్ సి పూర్వ విద్యార్థులు 2000-2001 బ్యాచ్ విద్యార్థులు అందరు కలిసి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ ను లలిత కన్వెన్షన్ హాల్ పరకాలలో జరుపుకోవ డం జరిగింది ఇట్టి సమావేశా నికి ముఖ్య అతిథులుగా ఉపాధ్యాయులు రవీందర్ ముక్తవరం శ్రీనివాసచారి, రేగులమొగిలి, వేములపల్లి మొగిలి,అడిదల మోహన్ రెడ్డి పసునూటి సంపత్, ఆడెపు ఆనంద్,అల్వాల శ్రీధర్, కల్లెపూ సమ్మయ్య , ఆనాటి విద్యా కమిటీ చైర్మన్ అయిన తడక చంద్రమౌళి గౌడ్ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన డం జరిగిందిఉపాధ్యాయులం దరూ మాట్లాడుతూ మీలాంటి ఇంత మంచి బ్యాచ్ ని సమావేశం ఏర్పరచుకొని ఒకరినొకరు కోఆర్డినేషన్ చేసుకుంటూ 50 ఒకే చోట చేరి ఆనాటి రోజులను గుర్తు చేసుకుంటూ తరగతి గదిలో జరిగే ప్రతీది గుర్తు చేసుకుంటూ ఉపాధ్యా యులకు విద్యార్థుల మధ్య జరిగిన సంఘటనలను గుర్తుకు తెచ్చుకుంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు ప్రతి ఒక్క విద్యార్థి మంచి స్థాయికి చేరుకోవాలని ఉపాధ్యాయులు దీవించడం జరిగింది ఈ కార్యక్రమంలో బండి రాజు, సామల శ్రీనివాస్, ఆకుతోట తిరుపతి, రాంపల్లి రాము, మరియు ఆలువాల హేమలత తదితరులు పాల్గొన్నారు

మండల బీజేపీ అధ్యక్షులుగా గోపాల్ నాయక్ నియామకం.!

మండల బీజేపీ అధ్యక్షులుగా గోపాల్ నాయక్ నియామకం

బాలానగర్ నేటి ధాత్రి:

 

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల బీజేపీ అధ్యక్షులుగా.. మండలంలోని సూరారం గ్రామపంచాయతీ శంకరాయపల్లి తండాకు చెందిన పాత్లావత్ గోపాల్ నాయక్ సోమవారం నియామకమయ్యారు. ఆయన మాట్లాడుతూ.. మండలంలోని బీజేపీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థులను గెలుపొందేందుకు కృషి చేస్తానన్నారు. మండల అధ్యక్షుడుగా నియమించినందుకు ఎంపీ డీకే అరుణకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు గోపాల్ నాయక్ కు శుభాకాంక్షలు తెలిపారు.

వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీ మల్లు రవి.

వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీ మల్లు రవి.

నాగర్ కర్నూల్/నేటి దాత్రి:

 

 

నాగర్ కర్నూల్ పార్లమెంట్ కల్వకుర్తి నియోజకవర్గం కడ్తాల మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రంలో కొబ్బరికాయ కొట్టి వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవిఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి ధాన్యం రైతుల నుండి తొందరగా కొనుగోలు చేయాలని, తరుగు తీయకుండా చర్యలు తీసుకోవాలని,వరి ధాన్యం తడవకుండా తాడ్పల్ ను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ జిల్లా డిసిసిబి చైర్మన్ మామిళ్ళపల్లి విష్ణువర్ధన్ రెడ్డి,మార్కెట్ కమిటీ చైర్మన్ కడ్తాల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు  పాల్గొన్నారు.

వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన. !

వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీ మల్లు రవి.

నాగర్ కర్నూల్/నేటి దాత్రి:

 

 

 

నాగర్ కర్నూల్ పార్లమెంట్ కల్వకుర్తి నియోజకవర్గం కడ్తాల మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రంలో కొబ్బరికాయ కొట్టి వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవిఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి ధాన్యం రైతుల నుండి తొందరగా కొనుగోలు చేయాలని, తరుగు తీయకుండా చర్యలు తీసుకోవాలని,వరి ధాన్యం తడవకుండా తాడ్పల్ ను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ జిల్లా డిసిసిబి చైర్మన్ మామిళ్ళపల్లి విష్ణువర్ధన్ రెడ్డి,మార్కెట్ కమిటీ చైర్మన్ కడ్తాల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు  పాల్గొన్నారు.

ధాన్యాన్ని వేగవంతంగా మిల్లులకు తరలించాలి.!

ధాన్యాన్ని వేగవంతంగా మిల్లులకు తరలించాలి.

జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద.

నర్సంపేట మార్కెట్ యార్డ్‌ను సందర్శన.

నర్సంపేట నేటిధాత్రి:

 

రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్ద నుండి వేగవంతంగా మిల్లులకు తరలించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నర్సంపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో గల పిఎసిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పరిశీలించారు.ఇటీవల అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిసినట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో, మార్కెట్‌లో అధికారులు, రైతులు తీసుకుంటున్న జాగ్రత్తలను కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అకాల వర్షాల ప్రభావం నుంచి ధాన్యాన్ని రక్షించేందుకు రైతులు టార్పాలిన్ కప్పి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.వర్షం వలన తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టి, పాడి క్లీనర్ ద్వారా శుభ్రపరచి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

Grain

ఈ సందర్భంగా కలెక్టర్ కొనుగోలు కేంద్రాల నిర్వహణ, సిబ్బంది పనితీరు, ధాన్యం నాణ్యత, రైతుల అవసరాలు, డబ్బు చెల్లింపులు తదితర అంశాలను పరిశీలించారు.
ధాన్యాన్ని వేగవంతంగా మిల్లులకు తరలించాలని అధికారుల కలెక్టర్ ఆదేశించారు. కేంద్రాలలో ప్యాడి క్లీనర్ లు, గన్ని బ్యాగులు, తాగునీరును అందుబాటులో ఉంచాలని సూచించారు.రైతులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా పూర్తి పారదర్శకంగా ధాన్యం సేకరణ జరగాలన్నారు. ధాన్యం రవాణాకు సరిపడా వాహనాలను, ధాన్యం ఎగుమతులు, దిగుమతులు వెంటనే జరిగేలా అవసరమైన హమాలీలను సమకూర్చుకోవాలన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన రెండు రోజుల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు జమ అయ్యేవిధంగా ఏర్పాట్లు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి నీరజ,జిల్లా పౌర సరఫరాల అధికారి కిష్టయ్య,జిల్లా మేనేజర్ సంధ్యారాణి,ఆర్డీఓ ఉమారాణి, జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ,మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్,కార్యదర్శి జి.రెడ్డి, తహసీల్దార్ రాజేష్, తదితరులు పాల్గొన్నారు.

మావోయిస్టుల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తులు అరెస్ట్

మావోయిస్టుల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తులు అరెస్ట్

సీఐ లోడిగా రవీందర్,ఎస్సై సైదా రహూఫ్

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:

 

గుండాల ఎస్సై రహుఫ్ తమ సిబ్బందితో కలిసి సోమవారం పెట్రోలింగ్ కు వెళుతుండగా తురుబాక గ్రామం నందు రోడ్డుపై ఇద్దరు వ్యక్తులు అనుమానస్పదంగా కనిపించగా వారిని పట్టుకొని విచారించగా వారి పేర్లు
పాయం రాజేందర్ నడిమిగూడెం,ఆళ్లపల్లి మండలం కల్తీ పాపయ్య (అలియాస్ సర్పంచ్) ఘణపురం గ్రామం,గుండాల మండలం అను ఇద్దరు గతంలో ప్రజా ప్రతిఘటన దళంలో పనిచేశారు.
కల్తీ పాపయ్య 2010 సంవత్సరంలో హత్యా ప్రయత్నం కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి పోయి వచ్చాడు.పాయం రాజేందర్ గతంలో ప్రజా ప్రతిఘటన దళంలో పని చేసి ఆళ్లపల్లి పోలీస్ ఎదుట లొంగిపోయాడు వీరిద్దరూ జల్సాలకు అలవాటుపడి ఎలాగైనా డబ్బులు సంపాదించాలనే ఉదేశ్యంతో మావోయిస్టు పార్టీ పేరు చెప్పి గుండాల,ఆళ్లపల్లి మండలాల వ్యాపారస్తులను గత రెండు,మూడు నెలల నుండి ఫోన్లు చేసి పార్టీ ఫండ్ కోసం డబ్బులు కావాలని బెదిరిస్తున్నారు.సోమవారం వీరిద్దరిని గుండాల పోలీస్లు అరెస్ట్ చేశారు.వీరి ఇరువురి నుండి 5000 రూపాయలు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత మావోయిస్టులది కాలం చెల్లిన సిద్దాంతాలని,భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టు ఉనికి అనేది లేదని ఇల్లందు డిఎస్పి చంద్రభాను తెలిపారు.ఎవరైనా మావోయిస్టుల పేరుతో ఫోన్లు చేసి బెదిరిస్తే ప్రజలు ఎటువంటి భయబ్రాంతులకు గురి కాకుండా పోలీస్ వారికి పిర్యాదు చేయవలసిందిగా కోరారు.వీరిని పట్టుకోవటం లో కృషి చేసిన గుండాల సిఐ లోడిగ రవీందర్,ఎస్ఐ సైదా రహుఫ్, పిసి వెంకటేశ్వర్లు ను డిఎస్పి అభినందించారు.

నూతన గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించిన.!

నూతన గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం

ఎమ్మెల్యే పాయంకు ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు

 

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..నేటిధాత్రి..

 

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రఘునాధపాలెంలో 20 లక్షల అంచనా ఖర్చుతో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అనంతరం కార్యాలయం స్థల దాతలు పోలెబోయిన కుటుంబస్తులు ప్రభాకర్ రావు, నరసింహారావు, కృష్ణమూర్తి, ముత్తయ్యను శాలువాతో సత్కరించి అభినందించారు, అనంతరం అన్ని శాఖల అధికారులతో పంచాయితీ సమీక్ష సమావేశాన్ని నిర్వహించి ఎమ్మెల్యే ఈ సందర్బంగా ఆయా శాఖల అధికారులతో ప్రజల సమక్షంలోనే మాట్లాడి ఆయా పంచాయతీ పరిధిలో గల గ్రామలలో ప్రభుత్వం ప్రారంభించిన గ్యారెంటీ పథకాలు ప్రజలకు చేరుతున్నాయా లేదా ఏమైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ప్రజలకు తెలియజేసారు అలాగే పంచాయతీలలో నీటి సరఫరా గురుంచి, కరెంటు సమస్యల గురుంచి, ఇరిగేషన్, విద్య, వైద్యం,అన్ని సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చి వారం లోగ అన్ని సమస్యలు పరిష్కారం చేయాలనీ అదేశించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇల్లు అర్హులయినా ప్రతీ ఒక్కరికి ఇప్పించే బాధ్యత తనదని తెలియజేశారు అలాగే ప్రజలకి ఎలాంటి కష్టం రాకుండా అధికారులతో పనులు చేపిస్తూ ప్రభుత్వం చేపట్టే ప్రతీ పథకం అర్హులైన ప్రతీ ఒక్కరికి అందేలా చూసుకునే బాధ్యత తనై చూసుకుంటానని అని ప్రజలకు హామీ ఇచ్చారు అనంతరం స్థానిక ప్రజలు పలు సమస్యలపై ఎమ్మెల్యే పాయం వినతి పత్రాలు అందజేశారు.

ఈ యొక్క కార్యక్రమానికి కరకగూడెం ఎమ్మార్వో నాగప్రసాద్ , ఎంపీడీవో దేవ వర కుమార్అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు కరకగూడెం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ హుసేన్ , మాజీ సర్పంచ్ పోలేబోయిన శ్రీవాణి,, మండల నాయకులు ఎర్ర సురేష్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మహిళ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

బిఆర్ఎస్ పార్టీ మండల సోషల్ మీడియా.

బిఆర్ఎస్ పార్టీ మండల సోషల్ మీడియా కన్వీనర్ గా దాసి శ్రావణ్ కుమార్

శాయంపేట నేటిధాత్రి:

 

 

శాయంపేట మండల కేంద్రంలో.బిఆర్ఎస్ పార్టీ మండల సోషల్ మీడియా కన్వీనర్ గా దాసి శ్రావణ్ కుమార్ ఎన్నుకున్నారు. అభివృద్ధి ప్రదాత ప్రజల సంక్షేమం కోసం భూపాలపల్లి మాజీశాసనస భ్యులుగండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ రూరల్ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ & బిఆర్ఎస్ పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షు రాలు గండ్ర జ్యోతి ఆదేశాల మేరకు మండల అధ్యక్షుడు గంగుల మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో దాసి శ్రావణ్ కుమార్ బిఆర్ఎస్ పార్టీ మండల సోషల్ మీడియా కన్వీనర్ గా, ప్రకటించినందుకు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి మాజీ జెడ్పి చైర్మన్ గండ్ర జ్యోతి మండల నాయకులు గంగుల మనోహర్ రెడ్డి మెతుకు తిరుపతి రెడ్డి రామ్ శెట్టి లక్ష్మారెడ్డి మాజీ ఎంపిటిసి మాజీ సర్పంచ్ లకు బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులకు, గ్రామశాఖ అధ్యక్షులకు, ప్రధాన కార్యదర్శి లకు, ఉపాధ్యక్షులకు బిఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలకు, యూ త్ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం.

పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం

నేటి ధాత్రి కథలాపూర్

 

కథలాపూర్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ హై స్కూల్ లో 10 వ తరగతి చదివిన 1999-2000 సంవత్సరనికి చెందిన విద్యార్థులు 25 సంవత్సరాల తరువాత మండల కేంద్రంలో నీ SRR ఫంక్షన్ హాల్ లో సిల్వర్ జూబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పూర్వ విద్యార్థులందరూ పాల్గొని చిన్ననాటి జ్ఞాపకాలన్నిటిని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు,ఉపాధ్యాయులు భూమా చారి, అఖిల్ అహ్మద్, శ్రీనివాస్, అంజయ్య, రాజయ్య పాల్గొన్నారు.

జహీరాబాద్ విద్యార్థినికి గోల్డ్ మెడల్..

జహీరాబాద్ విద్యార్థినికి గోల్డ్ మెడల్..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ మండలం రంజోల్కు చెందిన మహమ్మద్ కరీం కూతురు నూరిన్ ఫాతిమా లా విద్యాలో సత్తా చాటి గోల్డ్ మెడల్ సాధించింది. HYDలో లా పూర్తి చేసిన ఫాతిమా మూడు రోజులపాటు HYDలోని సుల్తాన్ ఉల్ ఉలమ్ కాలేజ్ ఆఫ్ లాలో హార్మనీ ఇన్ డిస్ప్యూట్స్ అనే అంశంపై నిర్వహించిన పోటీ పరీక్షల్లో ప్రతిభ చాటి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నాగేశ్వరరావు చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకుంది. దీంతో కుటుంబీకులు హర్షం వ్యక్తం చేశారు.

విద్యుత్ ప్రమాదంతో వృద్ధురాలు మృతి…

విద్యుత్ ప్రమాదంతో వృద్ధురాలు మృతి…

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

స్నానం చేసి శౌచాలయం (బాత్ రూమ్) లోంచి బయటకు వస్తుండగా విద్యుత్ ప్రమాదానికి గురై ఓ వృద్ధురాలు మృతి చెందిన సంఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. కుటుంబీకులు, హద్దునూరు ఎస్పై చెల్లా రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. న్యాల్కల్ మండలంలోని హుస్సేన్ నగర్ గ్రామానికి చెందిన వడగామ సిద్ధమ్మ (56) ఆదివారం ఉదయం స్నానం, కాళ కృత్యాలు చేసేందుకు శౌచాలయంలోకి వెళ్ళింది. స్నానం అనంతరం బయటకు వస్తుండగా ఓ ఇనుప రాడ్డును పట్టుకోవడంతో విద్యుత్ ప్రమాదం చోటు చేసుకుంది. అపస్మారక స్థితిలో ఉన్న సిద్ధమ్మ (56)ను గుర్తించిన సమీప స్థానికులు వెను వెంటనే బీదర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతి చెందిన సిద్ధమ్మకు ఓ కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. మృతురాలి సోదరి కుమారుడు సంజీవ్ కుమార్ (31) ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్పై చెల్లా రాజశేఖర్ కేసు నమోదు చేసి. శివ పంచనామ, పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు.

పురాతన శివలింగం నంది విగ్రహాం లభ్యం.

పురాతన శివలింగం, నంది విగ్రహాం లభ్యం

చోప్పదండి, నేటిధాత్రి:

 

 

కరీంనగర్ జిల్లా చోప్పదండి మండలం దేశాయిపేట గ్రామ చెరువు వద్ద ఆదివారం పురాతన నంది, శివలింగం విగ్రహాలు లభ్యమయ్యాయి.

 

ఈవిషయం గ్రామంలోని ప్రజలకు తెలియడంతో విగ్రహాల దగ్గర కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు.

 

విగ్రహాలు లభ్యమైన చోటనే శివాలయం నిర్మించాలని కొందరు అభిప్రాయం తెలుపగా, పూజారులను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని మరి కొందరు, ఆలయ నిర్మాణానికి వేరే స్థలం తీసుకొని విగ్రహాలు ప్రతిష్టించాలని గ్రామ నాయకుల మద్య చర్చ జరుగుతోంది.

 

ఈకార్యక్రమంలో మాజీ సర్పంచ్ గుంట రవి, మాజీ ఉపసర్పంచ్ సింగిరెడ్డి వెంకటరాంరెడ్డి, మార్కెట్ డైరెక్టర్ రవీందర్, దుబ్బాక మల్లేశం, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

శ్రీ శ్రీ శ్రీ దుర్గా భవాని జాతర మహోత్సవంలో పాల్గొన్న.

శ్రీ శ్రీ శ్రీ దుర్గా భవాని జాతర మహోత్సవంలో పాల్గొన్న

◆ జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్…

◆ *మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డా౹౹ఏ. చంద్రశేఖర్…

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

కొహిర్ మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో జరిగిన మహిమాన్విత మన్య ప్రజల ఆరాధ్య దైవం శ్రీ శ్రీ శ్రీ దుర్గా భవాని జాతర మహోత్సవంలో పాల్గొనడం జరిగింది.

అనంతరం ఆలయ అర్చకులు అతిథులను స్వాగతిస్తూ, ఆశీర్వచనం చేసి,తీర్థ ప్రసాదాలు అందించారు.ఈ కార్యక్రమంలో సెట్విన్ చైర్మెన్ గిరిధర్ రెడ్డి, మాజీ ఇండస్ట్రియల్ చైర్మన్ మహమ్మద్ తన్వీర్,మండల అధ్యక్షులు రామలింగారెడ్డి,హన్మంతరావు పాటిల్, శ్రీనివాస్ రెడ్డి,మాజీ జడ్పీటీసి భాస్కర్ రెడ్డి,మాజీ ఎంపీటీసీ మల్లన్న పాటిల్,కాంగ్రెస్ నాయకులు ఉజ్వల్ రెడ్డి,శుక్లవర్ధన్ రెడ్డి, గ్రామ కాంగ్రెస్ నాయకులు అంజయ్య ,సాయిలు, దశరథ్, అరుణ్ తథితరులు పాల్గొన్నారు.

శ్రీ శ్రీ దుర్గా భవాని జాతర మహోత్సవం హాజరైన.

శ్రీ శ్రీ శ్రీ దుర్గా భవాని జాతర మహోత్సవం హాజరైన మాజి మంత్రివర్యులు ,సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

కోహిర్ మండలం నాగిరెడ్డి పల్లి లో జరుగుతున్న శ్రీ దుర్గా భవాని మాత జాతర ఉత్సవాలకు మాజీ మంత్రులు హరీష్ రావు , సబితా ఇంద్రారెడ్డి గారు,స్థానిక ఎమ్మెల్యే మాణిక్ రావు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్,మాజి జిల్లా పరిషత్ చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి గార్లతో తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమ్మవారి దయతో రాష్ట్రం బాగుండాలని ఆకాంక్షించారు.రానున్న రోజుల్లో గ్రామ అభివృద్ధికి తమ వంతు సహకారాన్ని అందిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజి మార్కెట్ చైర్మన్ లు గుండప్ప ,రామకృష్ణ రెడ్డి,మాజి ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్,కోహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు, జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం,పాక్స్ చైర్మన్ స్రవంతి అరవింద్ రెడ్డి,ఆలయ కమిటీ , గ్రామస్థుల తదితరులు పాల్గొన్నారు.

శ్రీశ్రీశ్రీ జగద్గురు రేవణ సిద్దేశ్వర స్వామి.

శ్రీశ్రీశ్రీ జగద్గురు రేవణ సిద్దేశ్వర స్వామి-చండికాంభ మాత సమేత జయంతి మహోత్సవ ఆహ్వానము

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

ఈ కార్యక్రమునకు విచ్చేయుచున్న పూజ్యులు శివాచార్య మహా స్వాములు

1. ష బ్ర॥ శ్రీ108 శ్రీగురు శివయోగి శివాచార్య మహాస్వామి గారు, జంగమయ్య గుట్ట తంగెడపల్లి

2. శ్రీశ్రీశ్రీ 1008 వైరాగ్య శిఖామణి అవధూతగిరి మహారాజ్ గారు, బర్దిపూర్

3. శ్రీశ్రీశ్రీ ష||బ్ర|| 108 వీరేశ్వర శివాచార్య మహారాజ్ గారు, హీరేమఠ్ ధనసిరి

4. శ్రీశ్రీశ్రీ షుబ్ర॥ చంద్రశేఖర శివాచార్య మహారాజ్ గారు, బేమలే ఖేడ్

5. శ్రీశ్రీశ్రీ బసవలింగ అవధూతగిరి మహారాజ్ గారు మల్లన్నగుట్ట ఆశ్రమము

గ్రామ శ్రీ సిద్ధేశ్వర మఠం నుండి స్వామి వారి పాదుకలను మంగళవాయిద్యములతో మరియు భజన
భక్తి గీతాలను ఆలపిస్తు మందిరమునకు తీసుకొని పోవుట.ద్వజరోహణము – శిఖర పూజ గురుస్వాములచే.మహన్యాస పూర్వక రుద్రాబిషేకము. తీర్థ ప్రసాదములు, రాత్రికి భజన కీర్తనములు
స్వామి వారికి రుద్రాబిషేకము శ్రీ చండికాంభ మాతకు సహస్ర కుంకుమార్చన హారతులు తదుపరి తీర్థప్రసాదములు

11 మంది దంపతులచే మహన్యస రుద్రాభిషేకము

రుద్రస్వాహాకార హోమము, యజ్ఞం, మహామంగళ హారతి తదుపరి భక్తులకు

తీర్ధప్రసాదము, అన్నదానం నిర్వహించబడును.

శ్రీ రేవణసిద్దేశ్వరస్వామి వారికి డోలారోహణము

శ్రీ వీరసోమేశ్వర చండికాంభ మాత సమేత పార్వతి పరమేశ్వరుల కళ్యాణము

అఖండ దీపారాధన (2500 జ్యోతులు వెలింగించుట)

మాహాత్ములచే ప్రవచనములు

సంగీత ధర్బార్ వివిద కళాకారులచే నిర్వహించబడును. తదుపరి భజనలు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version