త్రిసూర్ రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం.. వందలాది బైకులు దగ్ధం
కేరళలోని త్రిసూర్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వందలాది బైకులు కాలి బూడిదయ్యాయి.
ఇంటర్నెట్ డెస్క్: కేరళలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది(Massive Fire explosion at Kerala). త్రిసూర్ రైల్వే స్టేషన్(Trissur Railway Station) ప్రాంతంలో ఆదివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంతో పార్కింగ్ ఏరియాలో ఉన్న వందలాది బైకులు దగ్ధమయ్యాయి. ప్రమాద సమయంలో ఆ పెయిడ్ పార్కింగ్ షెడ్‌లో సుమారు 600కు పైగా మోటార్ సైకిళ్లు ఉన్నట్టు సమాచారం(Motorbikes Gutted).
ఓ విద్యుత్ తీగ బైక్‌లకు తగలడంతో ప్రమాదం చెలరేగిందని ప్రాథమికంగా నిర్ధారణ అవుతోంది. తొలుత రెండు మోటార్ సైకిళ్లలో ఈ మంటలు చెలరేగి.. ఆ తర్వాత వేగంగా పార్కింగ్ ప్రాంతమంతా వ్యాపించినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో పార్కింగ్ ప్లేస్‌లో ఉన్న సుమారు 500కి పైగా బైకులు కాలి బూడిదైనట్టు సమాచారం. ఈ ఘటనలో పార్కింగ్ షెడ్ సహా రైల్వే స్టేషన్ రెండో గేటు వద్దనున్న టికెట్ కౌంటర్, ఆగి ఉన్న ఓ తనిఖీ వాహనం కూడా దగ్ధమైంది. అయితే.. అక్కడి వారు వెంటనే అప్రమత్తమై పరుగులు తీయడంతో ఎలాంటి ప్రాణ నష్టమూ వాటిల్లలేదు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక బృందాలు(Fire Officials).. ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపు చేశాయి. ఈ ప్రమాదంపై పోలీసులు, రైల్వే అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునే దిశగా విచారణ చేపట్టినట్టు ఆ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి కే.రాజన్(Kerala Revenue Minister Rajan) వెల్లడించారు. ప్రమాదానికి సంబంధించి.. వెంటనే నివేదిక సమర్పించాలని త్రిసూర్ నగర పోలీస్ కమిషనర్‌ను కోరినట్టు ఆయన చెప్పారు.
ఆ కంటెంట్‌ను తొలగిస్తాం.. అప్లోడ్ చేసిన అకౌంట్లను సస్పెండ్ చేస్తాం: ఎలన్ మస్క్
ఎక్స్’లో పోస్ట్ చేసే చట్ట విరుద్ధమైన కంటెంట్‌ను పూర్తిగా తొలగిస్తామని, అలాంటి కంటెంట్‌ను పోస్ట్ చేసిన అకౌంట్లను శాశ్వతంగా సస్పెండ్ చేస్తామని ‘ఎక్స్’ వెల్లడించింది. అందుకోసం అవసరమైతే స్థానిక ప్రభుత్వాలతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది
ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్‌కు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (గతంలో ట్విటర్) కంటెంట్ గురించి కీలక ప్రకటన చేసింది. ‘ఎక్స్’లో పోస్ట్ చేసే చట్ట విరుద్ధమైన కంటెంట్‌ను పూర్తిగా తొలగిస్తామని, అలాంటి కంటెంట్‌ను పోస్ట్ చేసిన అకౌంట్లను శాశ్వతంగా సస్పెండ్ చేస్తామని వెల్లడించింది. అందుకోసం అవసరమైతే స్థానిక ప్రభుత్వాలతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది (X illegal content policy)
ఎక్స్ గ్లోబల్ గవర్నమెంట్ అఫైర్స్’ ఖాతా ద్వారా ఈ ప్రకటన వెలువడింది. తమ ఏఐ ప్లాట్‌ఫామ్ ‘గ్రోక్’ను ఉపయోగించి అశ్లీల కంటెంట్‌ను సృష్టించిన వారిపై, వాటిని నేరుగా అప్లోడ్ చేసిన వారిపై ఒకే రకమైన చర్యలు తీసుకుంటామని ఎలన్ మస్క్ హెచ్చరించారు. మస్క్ ప్రకటన అనంతరం ‘ఎక్స్ గ్లోబల్ గవర్నమెంట్ అఫైర్స్’ కూడా అదే తరహా ప్రకటన చేసింది. ‘ఎక్స్’ నియమాలకు సంబంధించిన ఒక లింక్‌ను కూడా షేర్ చేసింది (Elon Musk statement).స్థానిక చట్టాలకు, నియమాలకు విరుద్ధంగా అశ్లీల, అసభ్య కంటెంట్ పెరుగుతున్నట్టు భారత ప్రభుత్వం గుర్తించి ‘ఎక్స్’కు జనవరి రెండో తేదీన నోటీసులు జారీ చేసింది (X platform crackdown). ‘గ్రోక్’ ఉపయోగించి మహిళల అసభ్యకర చిత్రాలు సృష్టించి ‘ఎక్స్’లో పోస్ట్‌లు చేయడంపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ‘గ్రోక్’ ఉపయోగించి రూపొందించిన అశ్లీల కంటెంట్‌ను తొలగించాలని, ఈ మొత్తం ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ‘ఎక్స్’ తగిన చర్యలు చేపట్టింది.
ప్రాణం తీసిన మొబైల్ నెట్‌వర్క్.. 17వ అంతస్తు నుంచి కిందపడి..
సమస్య తలెత్తటంతో అవతలి వ్యక్తి వాయిస్ సరిగా వినిపించలేదు. దీంతో మొబైల్ ఫోన్ తీసుకుని బాల్కనీలోకి వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత అదుపుతప్పి 17వ అంతస్తు నుంచి కిందపడిపోయాడు.
మొబైల్ ఫోన్ నెట్‌వర్క్ కోసం వెతుకుతూ ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. 17వ అంతస్తు నుంచి కిందపడి చనిపోయాడు. ఉత్తర ప్రదేశ్‌లో శనివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. నోయిడాకు చెందిన అజయ్ గార్గ్ ఢిల్లీలోని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు. సెక్టార్ 104లోని ఏటీఎస్ వన్ హంలెట్ సొసైటీలో భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. శనివారం ఉదయం 10.30 గంటల సమయంలో అతడికి ఓ ఫోన్ కాల్ వచ్చింది.అతడు ఉంటున్న ప్లాట్‌లో మొబైల్ నెట్‌వర్క్ సమస్య తలెత్తటంతో అవతలి వ్యక్తి వాయిస్ సరిగా వినిపించలేదు. దీంతో మొబైల్ ఫోన్ తీసుకుని బాల్కనీలోకి వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత అదుపుతప్పి 17వ అంతస్తు నుంచి కిందపడిపోయాడు. నేలపై చలనం లేకుండా పడి ఉన్న అజయ్‌ని అక్కడి వారు గుర్తించారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అతడ్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు ధ్రువీకరించారు. ఇక, సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకున్నారు. అజయ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక దర్యాప్తులో అజయ్ పైనుంచి కిందపడ్డం వల్లే చనిపోయినట్లు తెలియవచ్చింది. అయితే, ఆయన మొబైల్ ఫోన్ నెట్‌వర్క్ కోసం వెతుకుతూ కిందపడ్డాడా? లేక సూసైడ్ చేసుకున్నాడా? అన్నది తెలియరాలేదు. సరైన కారణం కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
అది మీకే తెలియాలి.. సెలక్టర్లపై ఇర్ఫాన్ పఠాన్ అసహనం
న్యూజిలాండ్‌తో భారత్ మూడు వన్డేలు ఆడనుంది. దీనికి సంబంధించిన జట్టులో సీనియర్ పేసర్ షమీని ఎంపిక చేయలేదు. ఈ విషయంపై భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ తీవ్రంగా స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత్ జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను ఆడనుంది. దీనికి సంబంధించిన భారత జట్టును శనివారం బీసీసీఐ ప్రకటించింది. అయితే ఈ జట్టులో సీనియర్ పేసర్ మహ్మద్ షమీకి మరోసారి చోటు దక్కకపోవడం తీవ్ర చర్చకు దారితీసింది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించిన షమీ, అప్పటి నుంచి సెలెక్షన్‌కు దూరంగానే ఉన్న
గాయాల నుంచి కోలుకున్న అనంతరం కూడా షమీని ఇంగ్లండ్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లకు పక్కనపెట్టారు. ఆపై ఆస్ట్రేలియాతో వన్డేలకు ఎంపిక కాలేదు. ఇప్పుడు బ్లాక్‌క్యాప్స్‌తో వన్డే సిరీస్‌కూ అతడికి నిరాశే ఎదురైంది. దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో షమీ అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ షమీని ఎంపిక చేయకపోవడంపై మాజీ భారత ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్(Irfan Pathan) స్పందించాడు.షమీ(Mohammed Shami ) నిన్న మొన్న వచ్చిన ఆటగాడు కాదు. 450-500 అంతర్జాతీయ వికెట్లు తీసిన బౌలర్. 400కి పైగా వికెట్లు పడగొట్టిన ఆటగాడిని పక్కనపెట్టి ఫిట్‌నెస్‌పై ప్రశ్నలు లేవనెత్తడం ఆశ్చర్యంగా ఉంది. ప్రతి ఆటగాడికీ ఫిట్‌నెస్ పరీక్షలు సహజమే. కానీ షమీ ఇప్పటికే 200 ఓవర్లు బౌలింగ్ చేశాడు. అన్ని ఓవర్లు వేసిన తర్వాత కూడా ఫిట్‌నెస్ సరిపోదంటే.. ఇంకా ఏ అతడు ఏం చేయాలి? అది సెలెక్షన్ కమిటీకే తెలియాలి’ అని ఇర్ఫాన్ వ్యాఖ్యానించాడు.
నేనే షమీ స్థానంలో ఉంటే..
‘నేనైతే షమీ స్థానంలో ఉంటే ఐపీఎల్‌లో ఆడి విధ్వంసం సృష్టిస్తాను. కొత్త బంతితో నా పాత రిథమ్ చూపిస్తాను. దేశవాళీ క్రికెట్‌ను గుర్తిస్తారు కానీ ఐపీఎల్‌లో ప్రదర్శన ఇస్తే ప్రపంచమే చూస్తుంది. అక్కడ రాణిస్తే ఎవరూ పట్టించుకోకుండా ఉండలేరు. అతడి కోసం తలుపులు పూర్తిగా మూసేయకూడదు’ అని స్పష్టం చేశారు.
: ఎలక్ట్రిక్ గీజర్ వాడుతున్నారా? ఈ సంకేతం వస్తే జాగ్రత్త సుమీ.!
శీతాకాలం కావడంతో సాధారణంగా గీజర్లు వాడకం పెరిగిపోయింది. అయితే.. వీటిని ఉపయోగించే విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా.. భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. తాడిపత్రిలో ఇటీవల జరిగిన గీజర్ పేలుడు ఘటనే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ.
ఇంటర్నెట్ డెస్క్: చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల చాలా మంది ఇళ్లలో ఎలక్ట్రిక్ గీజర్లను(Electric Geyser) వాడుతుంటారు. ఇవి మనకు వేడి నీటిని అందిస్తున్నప్పటికీ.. వీటి నుంచి ముప్పు వాటిల్లే అవకాశాలూ ఎక్కువే. గతంలో ఢిల్లీలో ఓ మహిళ విద్యుత్ షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోగా.. తాజాగా ఏపీలోని తాడిపత్రిలో గీజర్ పేలడంతో సుమారు 8 మంది గాయపడ్డారు. ఇలా గీజర్లను ఉపయోగించడం తెలియక చాలా ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో గీజర్ల వాడకంపై తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు మీకోసం…
ఎలక్ట్రిక్ గీజర్లలో ఎలాంటి లీకేజీ లేకుండా జాగ్రత్త పడాలి. సాధారణంగా చాలా మంది చిన్న లీకేజే కదా అని నిర్లక్ష్యం తీసుకుంటారు. ఇది పేలుడుకు దారితీసే అవకాశముంది.
గీజర్ పేలడానికి మరో కారణం అధిక పీడనం. గీజర్ థర్మోస్టాట్ సెన్సార్ పనిచేయకపోవడం వల్ల ఈ ప్రమాదం సంభవిస్తుంది. నీరు వేడికావడం నిర్ణీత ఉష్ణోగ్రతకు చేరాక.. ఈ సెన్సార్ గీజర్‌కు విద్యుత్‌ను నిలిపేస్తుంది. ఈ సంకేతంతో పవర్ ఆఫ్ చేయాలి.చాలా మంది రాత్రంతా గీజర్లను ఆన్‌లో ఉంచుతారు. ఇది ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఇలా చేయడం వల్ల నీరు చాలా వేడిగా మారుతుంది. దీనివల్ల పీడనం ఎక్కువై.. గీజర్ పేలిపోయే ఛాన్స్ ఉంది.
గీజర్లో నీరు లేనప్పుడు దానిని ఆన్ చేయవద్దు. ఇది గీజర్ వేగంగా పనిచేయకపోవడానికి దారితీస్తుంది. దీని వల్ల పెద్ద ప్రమాదానికీ దారితీయవచ్చు.
గీజర్లలో అమర్చిన ప్రెజర్ వాల్వ్‌ను ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేయించాలి. లేదంటే ఈ వాల్వ్ దెబ్బతినడం వల్ల పీడనం ఎక్కువై గీజర్ పేలుడుకు కారణమవుతుంది.
నిధి కోసం తల్లిదండ్రుల దారుణం.. 8 నెలల బిడ్డను బలి ఇచ్చేందుకు..
ఓ భార్యాభర్తల జంట నిధి కోసం 8 నెలల చంటి బిడ్డను బలివ్వడానికి సిద్ధమైంది. చివరి నిమిషంలో వారికి ఊహించని షాక్ తగిలింది. పోలీసుల ఎంట్రీతో కథ మొత్తం అడ్డం తిరిగింది. ఇద్దరూ అరెస్ట్ అయ్యారు.
బెంగళూరు రూరల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. డబ్బు మీద పిచ్చితో చంటిబిడ్డను చంపడానికి సిద్ధమయ్యారు తల్లిదండ్రులు. నిధి కోసం 8 నెలల పసి కందును బలి ఇవ్వడానికి చూశారు. అయితే, పోలీసుల ఎంట్రీతో కథ అడ్డం తిరిగింది. చిన్నారి క్షేమంగా బయటపడింది. కీచక తల్లిదండ్రులు జైలు పాలయ్యారు. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. హొసకోటే తాలూకా, సులిబెలెలోని జనతా కాలనీకి చెందిన సయ్యద్ ఇమ్రాన్ పురాతన నిధుల కోసం గత కొంత కాలం నుంచి గాలిస్తూ ఉన్నాడు.
ఈ నేపథ్యంలోనే ఇంట్లోని ఓ గదిలో నిధి ఉన్నట్లు అతడికి తెలిసింది. నిధి తమకు దక్కాలంటే ఓ చిన్నారిని బలివ్వటం తప్పదని భావించారు. ఇందుకోసం 8 నెలల తమ బిడ్డను బలివ్వడానికి సిద్ధమయ్యారు. శనివారం రాత్రి నిధిని బయటకు తీయడానికి పూజలు మొదలయ్యాయి. గొయ్యి పూర్తిగా తవ్విన తర్వాత చంటి బిడ్డను బలివ్వడానికి సయ్యద్, అతడి భార్య అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే, ఈ సమాచారం పోలీసులకు అందింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వారు సయ్యద్ ఇంటి దగ్గరకు వెళ్లారు. పాపను కాపాడారు. భార్యాభర్తలను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు. వ్యక్తిగతంగా హరీష్ రావును ఒక్క మాట అంటే సభని బైకాట్ చేస్తారా అంటూ ప్రశ్నించారు. ఆ అంశంపై వాకౌట్ చేస్తే..
సూర్యాపేట, జనవరి 4: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు. వ్యక్తిగతంగా హరీష్ రావును ఒక్క మాట అంటే సభని బైకాట్ చేస్తారా అంటూ ప్రశ్నించారు. ఆ అంశంపై వాకౌట్ చేస్తే.. తరువాత సభకు రావొచ్చు కదా? అని అన్నారు. ఆదివారం నాడు సూర్యాపేటలో మీడియాతో మాట్లాడిన కవిత.. అసెంబ్లీ జరిగిన తీరుపైనా.. హరీష్ రావుపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో బిల్లులపై చర్చ జరుగుతుంటే ప్రతిపక్షం ఉండొద్దా? అని ప్రశ్నించారామె. సభ నుంచి వాకౌట్ చేయాలనే నిర్ణయం హరీష్ రావుదేనా? అని ప్రశ్నించారు కవిత. బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు ఒక గుంపును తయారు చేస్తున్నారని అన్నారు.అసెంబ్లీ బయట సభలు పెట్టడం కంటే.. చట్ట సభల్లో మాట్లాడటం మంచిదని.. ఈ అవకాశం వదులుకోవడం కరెక్ట్ కాదని కవిత అభిప్రాయపడ్డారు. గుంటనక్క హరీష్ రావు వ్యవహారం.. తోక కుక్కను ఊపినట్లుగా ఉందంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు కవిత. కృష్ణా పంపకాలల్లో హక్కులు తగ్గించి హరీష్ సంతకం ఎందుకు పెట్టాడో చెప్పి.. పీపీటీ చేయాలని కవిత డిమాండ్ చేశారు. హరీష్ రావు ధన దాహం కోసమే జూరాలా నుంచి శ్రీశైలానికి ప్రాజెక్టును మార్చారని ఆరోపించారు. హరీష్ రావు నిర్ణయాలతోనే సాగునీటి ప్రాజెక్టులకు తీవ్ర నష్టం జరిగిందన్నారు.
ఇదే సమయంలో అసెంబ్లీలో ప్రభుత్వ తీరుపైనా కవిత మండిపడ్డారు. అసెంబ్లీలో కేసీఆర్ తప్పులు చేశాడనే తప్ప.. కృష్ణా నది నీటి వాటాపై చర్చే పెట్టడం లేదన్నారు. ఆల్మట్టి ఎత్తు పెంచుకుంటే ఉత్తరం రాసి వదిలేశారని విమర్శించారామె. కృష్ణా నీటిపై చిత్తశుద్ధి ఉంటే ఎందుకు సమగ్ర చర్చ జరపడం లేదని ప్రశ్నించారు. తుంగభద్ర, కృష్ణా నీటిపై కర్నాటకతో పేచీ ఉంటే.. రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నా ఎందుకు పరిష్కరించడం లేదన్నారు.
కురచ స్వభావంతో గత ప్రభుత్వంపై నిందలు వేస్తూ తమ తప్పులను కప్పిపుచ్చుకుంటున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డిపై కవిత మండిపడ్డారు. చిత్తశుద్ధి ఉంటే కర్ణాటక అప్పర్ భద్ర జాతీయ హోదా తొలగించాలని.. ఆల్మట్టి ఎత్తు తగ్గించాలనే అంశంపై అసెంబ్లీలో తీర్మానం చేయాలని కవిత డిమాండ్ చేశారు.
: ఐపీఎల్ నుంచి ఔట్.. తొలిసారి స్పందించిన ముస్తాఫిజుర్ రెహమాన్
ఐపీఎల్ నుంచి బంగ్లా ప్లేయర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. బంగ్లాలో జరుగుతున్న పరిస్థితుల దృష్ట్యా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై ముస్తాఫిజుర్ తొలిసారి స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడి.. రాజకీయ అస్థిరత నేపథ్యంలో ఆ దేశ ఆటగాడిని ఐపీఎల్‌లోకి తీసుకోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. వెంటనే అతడిని తొలగించాలని.. లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బీసీసీఐకి, కేకేఆర్ సహ యజామాని, ప్రముఖ నటుడు షారుక్ ఖాన్‌కు బెదిరింపులు కూడా వచ్చాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వెంటనే జట్టు నుంచి బంగ్లా ప్లేయర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను రిలీజ్ చేయాలని బీసీసీఐ(BCCI) కేకేఆర్‌కు ఆదేశాలు జారీ చేసింది.
దీని తర్వాత కూడా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఘాటుగా స్పందిస్తూ వస్తుంది. తాము కూడా భారత్‌లో క్రికెట్ ఆడబోమని.. టీ20 ప్రపంచ కప్ 2026లో భారత్‌తో బంగ్లాకు ఉన్న మ్యాచులను శ్రీలంకకు మార్చాలని ఐసీసీకి లేఖ రాస్తున్నట్లు వెల్లడించారు. ఈ గందరగోళాల మధ్య ముస్తాఫిజుర్ రెహమాన్(Mustafizur Rahman).. జట్టు నుంచి తనను తప్పించడంపై తొలిసారి స్పందించాడు.మిమ్మల్ని జట్టు నుంచి తీసేస్తే మీరు ఇంకా ఏమీ చేయగలరు? నేనూ అంతే’ అని బంగ్లా మీడియాలో మాట్లాడుతూ అన్నాడు. ప్రస్తుతం అతడి ప్రతిస్పందన వైరల్‌గా మారింది. గత నెలలో అబుదాబీలో జరిగిన ఐపీఎల్ 2026 మినీ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ముస్తాఫిజుర్‌ను రూ.9.2కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
సేకరించిన రక్తాన్ని ప్యాక్ చేసి వేరే చోటుకు తరలిస్తూ ఉన్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు మటన్ షాపుపై రైడ్ చేశారు.
మూగ జీవాల రక్తం సేకరిస్తున్న ఓ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. మేడ్చల్ జిల్లా కీసర పీఎస్ పరిధిలోని సత్యనారాయణ కాలనీలో కొంతమంది దుర్మార్గులు మూగ జీవాల రక్తం సేకరిస్తూ ఉన్నారు. మటన్ షాపులో మేకలు, గొర్రెలు, ఇతర మూగ జీవాల రక్తం సేకరించటం మొదలెట్టారు. సేకరించిన రక్తాన్ని ప్యాక్ చేసి వేరే చోటుకు తరలిస్తూ ఉన్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు మటన్ షాపుపై రైడ్ చేశారు.
మటన్ షాపు ఓనర్‌తో పాటు నకిలీ వెటర్నరీ డాక్టర్‌ను అరెస్ట్ చేశారు. షాపు నుంచి 180 ప్యాకెట్ల రక్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మూగ జీవాల రక్తంతో కొన్ని రకాల వ్యాధులు నయం అవుతాయని ప్రచారం జరుగుతున్నట్లు సమాచారం.ఇవి కూడా చదవండి
అవమానాన్ని సహించం.. ఐపీఎల్‌పై బంగ్లాదేశ్ కఠిన నిర్ణయం?
బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడుల నేపథ్యంలో భారత్‌లో నిరసనలు ఊపందుకున్నాయి. దీంతో ముస్తాఫిజూర్‌ను ఐపీఎల్ నుంచి తప్పించాలన్న డిమాండ్లు గట్టిగా వినిపించాయి. చివరకు బీసీసీఐ సూచనలతో కేకేఆర్ అతడిని జట్టు నుంచి విడుదల చేసింది. ఈ విషయంపై బంగ్లాదేశ్ తీవ్రంగా స్పందిస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: భారత్-బంగ్లాదేశ్ మధ్య రాజకీయ ఉద్రిక్తతలు ఇప్పుడు క్రికెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) జట్టు నుంచి బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజూర్ రెహమాన్‌ను రిలీజ్ చేయడంతో ఈ పరిణామాలకు మరింత ఆజ్యం పోసింది. బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడుల నేపథ్యంలో భారత్‌లో నిరసనలు ఊపందుకున్నాయి. దీంతో ముస్తాఫిజూర్‌ను ఐపీఎల్ నుంచి తప్పించాలన్న డిమాండ్లు గట్టిగా వినిపించాయి. చివరకు బీసీసీఐ(BCCI) సూచనలతో కేకేఆర్ అతడిని జట్టు నుంచి విడుదల చేసింది.అయితే ఇదే అంశం భారత్-బంగ్లాదేశ్ క్రికెట్ సంబంధాలను మరింత దెబ్బతీసేలా కనిపిస్తోంది. ఇప్పటికే బంగ్లాదేశ్ ప్రభుత్వ సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీ20 ప్రపంచకప్ 2026కి సంబంధించి భారత్‌లో జరగాల్సిన బంగ్లాదేశ్ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించేలా ప్రణాళికలు చేయాలని ఐసీసీకి లేఖ రాయమని ఆయన బీసీబీ(BCB)కి సూచించారు. పాకిస్తాన్ తరహాలోనే ఈ నిర్ణయం ఉండాలని అభిప్రాయపడ్డారు.
ఇలాంటి ఘటనలపై నిర్లక్ష్యం వహిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదు..హోంమంత్రి వార్నింగ్
SVS కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ ప్రతినిధులపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చారు.అచ్యుతాపురం సెజ్‌లో నిన్న జరిగిన అగ్నిప్రమాదం దురదృష్టకరమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత (AP Home Minister Vangalapudi Anitha) వ్యాఖ్యానించారు. రాంబిల్లి మండలం, అచ్యుతాపురం, ఏపీఎస్ఈజడ్‌లో SVS కెమికల్ ఇండస్ట్రీస్ వద్ద నిన్న(శనివారం) భారీ అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ సంఘటన స్థలాన్ని హోంమంత్రి అనిత, యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రమాదం ఎలా జరిగిందో కంపెనీ ప్రతినిధులను, అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈక్రమంలో SVS కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు హోంమంత్రి అనిత.
వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భారయ సిలియా ఫ్లోర్స్ అమెరికా భద్రతా దళాల అదుపులో ఉన్నారు. మదురోకి సంబంధించి వీడియోను యూఎస్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఓ వీడియోను విడుదల చేశాయి.
న్యూయార్క్, జనవరి 4: వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోర్స్ అమెరికా భద్రతా బలగాల అదుపులో ఉన్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి ఫోటోను ట్రంప్ రిలీజ్ చేయగా.. ఇప్పుడు తాజాగా వీడియోలు కూడా విడుదల చేశారు. మదురోని వెనిజువెలా నుంచి తీసుకువచ్చి.. అమెరికా డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్(DEA) న్యూయార్క్ డివిజన్ కార్యాయలంలో నిర్బంధించినట్లు ఈ వీడియో ద్వారా స్పష్టమవుతోంది.
శనివారం తెల్లవారుజామున వెనిజువెలా రాజధాని కారకాస్‌పై ప్రత్యేక అమెరికా దళాలు ఆకస్మిక దాడి జరిపాయి. ఈ దాడి సమయంలోనే ఆ దేశ అధ్యక్షుడు మదురో ఆయన భార్య సిలియా ఫ్లోర్స్ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుండగా.. యూఎస్ సెక్యూరిటీ ఫోర్సెస్ వారిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, యూఎస్ దాడి సమయంలో మదురో, ఆయన భార్య కారకాస్‌లోని హై సెక్యూరిటీ ఫోర్ట్ టియునా మిలిటరీ కాంపౌండ్‌లోని తమ నివాసంలో ఉన్నట్లు తెలుస్తోంది. దాడి విషయం తెలియగానే హైసెక్యూరిటీతో పారిపోయే ప్రయత్నం చేశారు. కానీ, వారి ప్రయత్నం ఫలించలేదు.
`ఎవరి ‘‘పదవి’’ ఎప్పుడు పోతుందో ‘‘గ్యారెంటీ లేదు’’!
`నీళ్లిచ్చిండు..కరంటు తెచ్చిండు..కడుపు నింపిండు.
`నీళ్ళాపిండు..నిలువ చేసిండు..చెరువులు నింపిండు.
kcr leader of telangana
`అనుమతుల కోసం ప్రయత్నస్తూనే… ప్రాజెక్టులు కట్టిండు.
`తెలంగాణా దిశ మర్చిండు… దశ మర్చిండు.
`నీటి గోస తీర్చిండు.. తెలంగాణ నెంబర్ వన్ చేసిండు.
`తిండికి గతి లేని తెలంగాణను అన్నపూర?ను చేసిండు.
`పంజాబ్ ను పక్కకు తోసిండు.
`బెంగాల్ ను కిందికి తోసిండు.
`పదేళ్లలో తెలంగాణ రైతును రాజును చేసిండు.
`శాపనార్ధాలతో సమస్యలు పరిష్కారం కావు.
`తెలంగాణా దేవుణి? తిట్టి తప్పు చేస్తుండ్రు.
చావు భాష ఎవరు మాట్లాడినా మంచిది కాదు.
`ప్రజాస్వామ్యంలో ఆహ్వానించదగ్గది కాదు.
`పదవులు ఎవరికీ శాశ్వతం కాదు.
`ఆ మాత్రం దానికి మిడిసిపాటు ఎవరికీ తగదు.
`ఉన్నత పదవుల్లో వున్న వారికి అసలే మంచిది కాదు.
`తిట్లు కాదు కనీసం తెలివైన సమాధానం వెతకండి.
`జనం చేత శబాష్ అనిపించుకోండి!
`ఎన్నికల ముందు ఆరోపణలు వేరు?
`ఇప్పుడు ‘‘కెసిఆర్’’ ను దూషిస్తే జనం మెచ్చుకోరు.
`‘‘కెసిఆర్’’ ను పాలకులు తక్కువ చేసి మాట్లాడినంత మాత్రనా గొప్ప వారు కారు.
మళ్ళీ జన్మేత్తినా ‘‘కెసిఆర్’’ చరిత్ర చేరపలేరు.
హైదరాబాద్, నేటిధాత్రి:
మంత్రాలకు చింతకాయలు రాలవు. శాపనార్దాలకు నీళ్లు రావు. తిట్టుకుంటే వచ్చే తుప్పిళ్లు నీళ్లు కావు. నీళ్లంటే మాటలు కాదు. మాటలు చెప్పినంత సులువుగా నీళ్లు రావు. మాటల మూటలు కట్టుకంటూ పోతే కాలం చాలదు. ప్రజాస్వామ్యంలో పాలకులు ఎవరూ శాశ్వతంకాదు. ప్రాణాలే శాశ్వతం కానప్పుడు పదవులెంత? ప్రాపకాలెంత? వైభవాలెంత? ఇవి తెలిస్తే ఏ వ్యక్తి మరో వ్యక్తిని దూషించడు. చావులు కోరుకోరు. పాలకులా లేక ప్రత్యర్ధులను తిట్టుకుంటూ, శాపనార్థాలు పెట్టుకుంటూ, చావులు కోరుకునే వాళ్లా? ఇవెక్కడి దిక్కుమాలని రాకీయాలు. ప్రజలు ఎంతో నమ్మకంతో బాధ్యతలు అప్పగించారు. అది నాయకుల పుణ్యం కాదు. ప్రజల దయాదాక్షిణ్యం. ఏ వ్యక్తికైనా కొపం వుంటే ఒకసారి తిట్టొచ్చు. రెండుసార్లు తిట్టొచ్చు. కాని పదే పదే మాటకు ముందు ఒకసారి, మాటకు వెనకొకసారి, నోరు తెరిస్తే తిట్ల పర్వం తప్ప మరొక పని లేదా? ప్రజలు పని చేయమని పట్టం కట్టారా? లేక కేసిఆర్ ను తిట్టుకుంటూ కాలం గడపమని గెలిపించారా? రెండేళ్లుగా ఒకటే పనా? కేసిఆర్‌ను దూషించడం తప్ప మరో పని లేదా? ఇన్ని తిడుతున్నా, ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నా ఎంతో హుందాగా కేసిఆర్ మౌనంగానేవుంటున్నారు. ప్రజలు చక్కటి అవకాశమిచ్చారు. మాకంటే బాగా పనిచేయండి. నేను ఒక దారి చూపాను. తెలంగాణ భవిష్యత్తు మీది అని ఎంతో హుందా కేసిఆర్ సూచించారు. అయినా సరే మేం మేం మారమన్నట్లు సాగుతున్నారు. అటు బూతులు, ఇటు తిట్లతోనే పుణ్యం కాలం గడిపేస్తారా? ఎంత కాలం కేసిఆర్ మీద పడి ఏడుస్తారు? కేసిఆర్ చేసిన తప్పేంటి? కేసిఆర్ చేసిన అన్యాయమేమిటి? కేసిఆర్ ఒక యోగి. తెలంగాణ త్యాగి. తెలంగాణ మూర్తి. తెలంగాణ స్పూర్తి. తెలంగాణ ఆర్తి. తెలంగాణ దీప్తి. కేసిఆర్ గురించి ఎన్ని మాటలు చెప్పినా తక్కువే. ఎన్ని పదాలు రాసిన తక్కువే. అంత గొప్పది కేసిఆర్ చరిత్ర. ప్రజల గురించి ఆయన ఆలోచించినంతా మరే నాయకుడు ఆలోచించరు. తెలంగాణ కోసం కొట్లాడిరడు. తెలంగాణ తెచ్చిండు. 60 ఏళ్లుగా సాద్య పడని తెలంగాణ సాధన సుసాద్యం చేసిండు. తెచ్చిన తెలంగాణను పదేళ్లలో కనకం చేసిండు. తెలంగాణను అన్ని రంగాల్లో పరుగులు తీయించిండు. ఎప్పుటి నుంచో పరుగులు తీస్తున్న రాష్ట్రాలను దాటుకొని, పదేళ్లలో అన్ని రాష్ట్రాలను దాటేలా చేసింది. అభివృద్ది అంటే ఇదీ అని చూపించిండు. విఫల రాష్ట్రం చేయాలని చూసి, కళ్లలో నిప్పులు పోసుకున్న వారి కనువిప్పు కలిగేలా చేసిండు. తెలంగాణ వైపు కన్నెత్తి చూస్తే కర్రు కాల్చి వాత పెట్టింతన పని చేసిండు. అలా భయం పెట్టి, తెలంగాణను కాపాడిరడు. అదీ కేసిఆర్. తెలంగాణ ద్రోహులు కపట పన్నాగాలు పన్నుతుంటే, కాళ్లల్లో కట్టెలు పెడుతుంటే కూడా క్షమించిండు. తన కర్తవ్యమే ముఖ్యమని ముందుకు సాగిండు. తెలంగాణను బంగారు తునక చేసిండు. ఇదీ ఒక పాలకుడికి వుండాల్సిన లక్షణం. కాని ఇప్పుడు తెలంగాణలో ఏం జరుగుతోంది. అసలు కేసిఆర్ తెలంగాణ తేవడమే తప్పనుకుంటున్నారా? కేసిఆర్ తెలంగాణ కోసంకొట్లాడడమే పాపమనుకుంటున్నారా? అరవై ఏళ్లలో కాంగ్రెస్, తెలుగుదేశం చేసిన విద్వంసం నుంచి తెలంగాణను కాపాడినందుకా? కాంగ్రెస్ పార్టీ ఎందుకు అసహనమో అర్దం కావడం లేదు. అరవైఏళ్లు పాలించి, తెలంగాణను సర్వనాశనం చేసి, తెలంగాణ ప్రజలను అన్నమో రామ చంద్రా అని ఏడిపించిన కాంగ్రెస్ పార్టీ పదేళ్లలో కేసిఆర్ తెలంగాణను నాశనం చేశాడడనడంలో ఔచిత్యమేమిటో కనిపించడం లేదు. 50 ఏళ్లు తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే కళ్లు చూడలేక, నోరు మాట్లాడలేక, పదవుల్లో వుండి పనులు చేయలేక చేష్టలుడిగిన నాయకులు కూడా ఇప్పుడు కేసిఆర్‌ను తిడుతున్నారు. ఉమ్మడి రాష్ట్ర నాయకులను ఇంకా నెత్తి మీద పెట్టుకుంటున్నారు. వాళ్ల వల్లనే రాజకీయ జీవితాలు వచ్చాయని కృతజ్ఞతలు చూపిస్తున్నారు. ఓట్లేసేసి గెలిపించేది తెలంగాణ ప్రజలు. కాని ఊడిగం ఇంకా ఆంద్రా నాయకులకు చేద్దామనుకే నాయకులు వుండడం దౌర్భాగ్యం. కేసిఆర్ ఏం చేసిండు? ఏం చేసిండు? అని పదే పదే ప్రశ్నించే వారికి కళ్లు లేవా? చూడడం లేదా? కనిపించడం లేదా? ప్రగతి అంటే ఏమిటో చూడకుండానే రాజకీయాలు చేస్తున్నారా? పదేళ్ల కింద పచ్చ గడ్డికి కూడా దిక్కులేని భూముల్లో పచ్చని పైర్లు కనిపించడం లేదా? నీటి చుక్క జాడ లేని చోట పచ్చని పంటలు కనిపించడం లేదా? ఉమ్మడి రాష్ట్రంలోనే పాలమూరు పచ్చబడితే ప్రజలు వలసలెందుకు వెళ్లేవారు? పంటలు లేని భూముల్లో పలుగు రాళ్లెందుకు తేలేవి? తొండలు కూడా గుడ్లుపెట్టవని ఆంద్రా నాయకులు ఎందుకు ఎగతాళి చేసేవారు? ఇవన్నీ నాయకులు మర్చిపోయినా, జనం మర్చిపోరు. కుప్ప మీద కూర్చొని, తిండికి గతి లేదని ఏడ్చేవారు, గుప్పెడు మెతుకులు చూడని కాలం మర్చిపోతారు. అవకాశ వాద రాజకీయాలు చేస్తారు. కేసిఆర్ లాంటి నాయకుడు దేశంలోనే కాదు ప్రపంచంలోనే లేరు. ప్రపంమంతా వెతికినా కనిపించరు. అంత గొప్ప పాలకుడు కేసిఆర్. అరవై ఏళ్లలో సాద్యం కానిది ఐదేళ్లలో చూపించారు. తెలంగాణ తెచ్చి నీళ్లిచ్చిండు. అదే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ఎందుకివ్వలేదు? కాని తెలంగాణ తెచ్చిన ఆరు నెలల్లోనే నీళ్లిచ్చిండు. మిషన్ కాకతీయ తేవడానికి ముందే ప్రయోగం చేసిండు. గొలుసు కట్టు చెరువులు నింపడం మొదలు పెట్టిండు. చెరువులన్నీ నింపేందుకు తెలంగాణలో మిషన్ కాకతీయ తెచ్చిండు. 46వేల చెరువులకు పూర్వ వైభవం తెచ్చిండు. వాగులు వంకల ద్వారా చెరువులు నింపిండు. వాగుల్లో నీళ్లు పారించిండు. భూగర్భ జలాలు సమృద్ది చేసిండు. వంకలు, ఒర్రెలు, కుంటలలో కూడా నీళ్లు పారించిండు. అదీ సంకల్పమంటే…అదీ పుట్టిన గడ్డ మీద మమకారమంటే…కరంటు కష్టాల నుంచి ఒక రాష్ట్రాన్ని మూడు నెలల్లో గట్టెక్కించిన నాయకుడు, దార్శనికుడు ప్రపంచంలో ఎవరూ లేరు. ఆరు నెలల్లో ఒట్టిపోయిన తెలంగాణను గంగాళం చేసిండు. అలాంటి పాలకుడు మరొకరు లేరు. తలాపున పారుతున్న గోదారికి తన కాళ్లు అడ్డం పెట్టి ఆపిండు. వాటిని నిలువ చేసిండు. చెరువులు నింపిండు. కాళేశ్వరం కట్టిండు. తెలంగాణ మొత్తం పారించిండు. అటు ఖమ్మందాకా, ఇటు కోదాడ దాక, చిట్ట చివరి పాలమూరు ఊరు దాకా కాళేశ్వరం నీళ్లు పారించాడు. ఎండి ఎండి డొక్కలీడ్చుకుపోయి వున్న తెలంగాణ కడుపు నింపిండు. తెలంగాణ రైతు కన్నీళ్లు తుడిచిండు. అరవై ఏళ్లు ఎండిన బీళ్లకు దాహం తీర్చిండు. తొండలు కూడా గుడ్లు పెట్టవని ఎగతాళి చేసిన నేలన పుట్లకొద్ది వడ్లు పండిరచిండు. తెలంగాణలో ఒక్క గుంట కూడా పంట లేకుండా వుండకుండా సాగయ్యేలా నీళ్లిచ్చిండు. పంటతో పాటు పాడి పెంచాడు. పాడి పంటలతో తెలంగాణ తులతూగేలా చేసిండు. తెలంగాణ కన్నీళ్లు తుడిచేందుకు ఆగమేఘాలమీద ప్రాజెక్టులు కట్టిండు. కేంద్రం కొర్రీలు పెడుతున్నా, అనుమతులలో జాప్యం చేస్తున్నా లెక్క చేయలేదు. తన తెలంగాణ ప్రజలే తనకు ముఖ్యమని నీళ్లను మళ్లించిండు. అనుమతులు కోసం ఎదురుచూసుకుంటూ కూర్చోలేదు. అటు అనుమతులు కోసం ప్రయత్నాలు సాగిస్తూనే మరో వైపు ప్రాజెక్టులు పూర్తి చేసిన గొప్ప పాలకుడు కేసిఆర్. అన్నమో రామచంద్రా అని ఆకలి కేకలు పెట్టిన తెలంగాణను అన్న పూర్ణను చేశారు. అన్న పూర్ణ అని పేరున్న ఆంద్రా ప్రాంతాన్ని వెనక్కి నెట్టేశాడు. దేశంలోనే నెంబర్ వన్ అని చెప్పుకున్న పంజాబ్‌ను పక్కకు నెట్టేశాడు. బెంగాల్‌ను కిందకు తోసేశాడు. సాగు రంగంలో తెలంగాణలో పదేళ్లలో పంటల విప్లవాన్ని సృష్టించారు. ఎడారిలా మారిన తెలంగాణను ఒయాసిస్సు చేసిండు. అన్ని రంగాలలో తెలంగాణ నెంబర్ వన్ చేసిండు. ఒకప్పుడు బియ్యమే లేని కాలం. అందులోనూ సన్న బియ్యం అంటే ఆంద్రా నుంచి రావాలని అనుకునే సందర్భం. ఇప్పుడు తెలంగాణ అంతా సన్నబియ్యమే. అందుకు కారణం కేసిఆర్. అలాంటి నెంబర్ వన్ రాష్ట్రాన్ని పాలిస్తూ, కేసిఆర్‌కు శాపనార్దాలు పెట్టడం సరైంది కాదు. నీళ్ల విషయంలో కేసిఆర్‌ను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ తప్పుల మీద తప్పు చేస్తోంది. కేసిఆర్ మీద నిందలేస్తూ పొరపాట్ల మీద పొరపాట్లు చేస్తోంది. కేసిఆర్ ఆకాశమంత మహా మనిషీ. ఆయనను కన్నెత్తి చూసే అర్హత లేని వాళ్లు కూడా కవ్విస్తున్నారు. అదే సమయంలో కలలో కేసిఆర్‌ను గర్తుచేసుకుంటూ జడుసుకుంటున్నారు. పైకి మేక పోతు గాంబీర్యం ప్రదర్శిస్తున్నారు. కేసిఆర్ ముందే కుప్పి గంతులేస్తున్నారు. అసాధ్యాన్ని సుసాద్యం చేసిన యోధుడు. ప్రజలకు సంక్షేమం అందించిన వారే నిజమైన పాలకుడు. ఆ పాలకుడు ఒకే ఒక్కడు. కేసిఆర్. ఆ పేరే తెలంగాణకు సూపర్ పవర్.
*నర్సంపేటను అభివృద్ధి చేసింది పెద్ది సుదర్శన్ రెడ్డి
నియోజకవర్గలో విధ్వంసం సృష్టించిన కాంగ్రెస్ నాయకులు
విద్య ,వైద్య,సాగు,త్రాగు అన్ని రంగాలలో అభివృద్ధి పరిచిన పెద్ది
నర్సంపేట,నేటిధాత్రి:
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలలోనే నర్సంపేట నియోజకవర్గలో విధ్వంసం సృష్టించి ఇక్కడ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న వారిని ప్రజలు గమనిస్తున్నారని టిఆర్ఎస్ నర్సంపేట పట్టణ అధ్యక్షుడు నాగేల్లి వెంకటనారాయణ గౌడ్, ఎంపీపీ, మాజీ సర్పంచ్ నల్ల మనోహర్ రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఆసాధనకై అనేక ఉద్యమాలు చేసి సాధించుకున్న తెలంగాణలో నర్సంపేట శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారని పేర్కొన్నారు.నిరంతరం నియోజకవర్గ అభివృద్ధినీ ఆకాంక్షించే వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి ని ఖబర్దార్ అంటే..సామాన్య ప్రజల పరిస్థితి ఏంటో తెలపాలన్నారు.పాకాల సరస్సు, రంగయచెరువు, మాదన్నపేట చెరువులకు గోదావరి జలాలను తీసుకొచ్చి ఎన్నో దశాబ్దాల నాటి కలను సహకారం చేసిన జలసాధకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అని అభిప్రాయం వ్యక్తం చేశారు.నర్సంపేట పట్టణ అభివృద్ధికై రూ. 42 కోట్ల టియుఎఫ్ఐయు డబ్ల్యూ నిధులు తెచ్చి పట్టణ అభివృద్ధికై పట్టం కట్టారని తెలిపారు.నర్సంపేట నియోజకవర్గానికి మెడికల్ కాలేజ్ , నర్సింగ్ కళాశాల, జిల్లా ఆస్పత్రిని తీసుకొచ్చి నియోజకవర్గాన్ని విద్యా,వైద్య హబ్ గా తీర్చిదిద్దిన ఘనుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అని కొరియాడారు.నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో 10 కిలోమీటర్ల మేర సెంట్రల్ లైటింగ్ పనులు,9 కిలోమీటర్ల మేర అంతర్గత బిటి రోడ్ల నిర్మాణ పనులు పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు.నర్సంపేట పట్టణానికి పాకాల ఆడిటోరియం,మోడల్ వెజిటేబుల్ మార్కెట్,మినీ స్టేడియం,పట్టణ పకృతి వనం,పట్టణ ప్రజల తాగునీటి కష్టాలను తీర్చేందుకు 5 లక్షల లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంకుల నిర్మించారని తెలిపారు. ఖానాపురం మండలంలో గల అశోక్ నగర్ గ్రామానికి సైనిక్ స్కూల్ తెచ్చిన ఘనత పెద్దిదే అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నర్సంపేట నియోజకవర్గానికి నయా పైసా కూడా తీసుకురాని మీరు నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదని కాంగ్రెస్ నాయకులను హెచ్చరించారు. ప్రస్తుతం నర్సంపేట నియోజకవర్గం లో ఆ పార్టీ నాయకులు చేస్తున్న అభివృద్ధి పనులు పెద్ది సుదర్శన్ రెడ్డి తెచ్చిన నిధులే అని ఎద్దేవా చేశారు. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ సాధించిన విజయాన్ని చూసి ఓర్చుకోలేని కాంగ్రెస్ పార్టీ నాయకులు.. ఫ్రస్టేషన్ తో మాట్లాడుతున్నారని చెప్పారు.శాసనసభ ఎన్నికల సమయంలో 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ నాయకుల్ని మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వస్తే ప్రజలే తరిమి కొడతారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలకు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ నాయకులను హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బిఆర్టియు జిల్లా అధ్యక్షులు గోనే యువరాజ్,పట్టణ ప్రచార కార్యదర్శి మండల శ్రీనివాస్,మాజీ మున్సిపల్ కౌన్సిలర్స్ నాగిశెట్టి ప్రసాద్,దేవోజు సదానందం,రాయిడి దుష్యంత్ రెడ్డి, పెండం వెంకటేశ్వర్లు, పుల్లూరు స్వామి,వార్డు అధ్యక్షులు రావుల సతీష్,బీరం నాగిరెడ్డి,సంపంగి సాలయ్య, ఐలోని శ్రీనివాస్, నాయిని వేణు,బిఆర్ఎస్ పార్టీ నాయకులు అప్పల సుదర్శన్,రాంప్రసాద్,కడారి కుమారస్వామి, మద్దెల సాంబయ్య,మంద ప్రసాద్, ఆంబోతు రాజు,తోటకూరి సదానందం, గిరగాని సాంబయ్య, పైసా ప్రవీణ్,ముచిక రాజు,బుస రాజు ,చేరాల గోవర్ధన్, గోనెల కరుణాకర్, మాదాసి శ్రీనివాస్, మాదాసి ప్రవీణ్, దేవోజు హేమంత్ తదితరులు పాల్గొన్నారు.
మండలంలోని కంఠాత్మకూర్ గ్రామంలో సర్పంచ్, పంచాయతీ కార్యదర్శిలతో కలిసి నిర్మాణం లో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన ఎంపీడీఓ రామకృష్ణ స్లాబ్ స్థాయి వరకు పూర్తయిన ఇళ్లను ప్రారంభించడానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. నిరుపేదల సంక్షేమం కోసం ప్రభుత్వం అందించిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసే విధంగా ఇందిరమ్మ కమిటీ సభ్యులు,గ్రామ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించిన ఎంపీడీఓ రామకృష్ణ,నిర్మాణం లో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల ను లబ్ధిదారులతో కలిసి ఎంపీడీఓ రామకృష్ణ,సర్పంచ్ కోంగంటి తిరుపతి పంచాయతీ కార్యదర్శి శ్రీమతి భార్గవి లబ్ధిదారులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నిర్మాణాలు చేపట్టాలన్నారు, ఇందుకోసం గ్రామాల్లో అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు త్వరలోనే ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకొని ప్రారంభించాలని తెలియజేశారు.అనంతరం గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని తెలిపారు, అలాగే మరుగుదొడ్లు లేని వారు వెంటనే నిర్మించాలని తెలిపారు,పెన్షన్ లబ్ధిదారులతో సమావేశం అయినా ఎంపీడీఓ వారి సమస్య కు న్యాయం చేస్తా అని మాట ఇచ్చారు.గ్రామ పంచాయతీ పరిసరాలను పరిశీంచారు,అంగన్వాడీ సెంటర్ కిరాయి లో ఉన్నందున్న చిన్న బడి లో వచ్చే విధంగా మార్చాలి అని ఎంపీడీఓ కి సర్పంచ్ కోంగంటి తిరుపతి తెలిపారు.
సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో శనివారం సావిత్రిబాయి పూలే 195వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో మహిళా ఉపాధ్యాయుల పాత్ర కీలకమని, ప్రతి విద్యార్థికి ఉపాధ్యాయులే రోల్ మోడల్ అని పేర్కొన్నారు. భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా, మహిళల కోసం తొలి పాఠశాలను స్థాపించిన సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం గర్వకారణమని తెలిపారు.ఈ కార్యక్రమంలో భాగంగా,జహీరాబాద్ నియోజకవర్గ (ఎం పి పి ఎస్) రెజింతల్, న్యాల్కల్ మండల ప్రధానోపాధ్యాయులు సఫియ సుల్తానా భాగ్యసాములుగా పాల్గొన్నారు,
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకొలి
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండల మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్) నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించడాన్ని నిరసిస్తూ ఫీల్డ్ అసిస్టెంట్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా ధర్నాకు టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ మాట్లాడుతూ, ఉపాధి హామీ పథకం నుంచి గాంధీజీ పేరును తొలగించడం రాజ్యాంగ విలువలకు, ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. గ్రామీణ పేదల జీవనాధారంగా నిలిచిన ఈ పథకానికి గాంధీజీ పేరు చరిత్రాత్మకంగా అనుసంధానమై ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులు, రైతులు, పేదల పక్షాన పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేస్తూ, ఫీల్డ్ అసిస్టెంట్ల హక్కులు, ఉపాధి భద్రత కోసం పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా జాతీయ మహిళా దినోత్సవం
కేసముద్రం/ నేటి ధాత్రి
కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ వివేకవర్ధిని హై స్కూల్లో శనివారం సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ యాకాంతం గౌడ్ సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సావిత్రిబాయి పూలే భారతదేశంలో మహిళా విద్యకు పునాది వేసిన మహనీయురాలని పేర్కొన్నారు. మహిళలకు విద్య లేకుండా సమాజ అభివృద్ధి సాధ్యం కాదన్న ఆలోచనతో ఆమె చేసిన సేవలు నేటి తరానికి ఆదర్శమని తెలిపారు.
మహిళలు విద్య, ఆత్మవిశ్వాసం, ధైర్యంతో ముందుకు సాగాలని, ప్రతి విద్యార్థిని సావిత్రిబాయి పూలే ఆశయాలను ఆచరణలో పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని సావిత్రిబాయి పూలే సేవలను స్మరించుకున్నారు.
రైతులు ఎవరు అధైర్య పడవద్దు… మండల వ్యవసాయ అధికారి వెంకన్న
కేసముద్రం/ నేటి ధాత్రి
కేసముద్రం మండలంలో రెండు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు మరియు, ప్రైవేటు డీలర్ల ద్వారా కేసముద్రం మండల రైతులకు గ్రామాల వారిగా రైతు భరోసా పోర్టల్ నుంచి రైతుల లిస్టులు ఒకరోజు ముందు గ్రామాలకు పంపించి మరుసటి రోజు శనివారం సుమారు 2844 బస్తాలను రైతులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పంపిణీ చేయడం జరిగింది. కేసముద్రం మండల లోని వివిధ యూరియా పంపిణి సెంటర్ల ను మండల వ్యవసాయ అధికారి కేసముద్రం బి వెంకన్న పంపిణి విధానాన్ని పరిశీలించడం జరిగింది. మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ రైతులు ఎవరు యూరియా కోసం ఆందోళన చెందవద్దని మండలానికి కావలసినటువంటి యూరియా రైతులకు విడతలవారీగా తెప్పించి పంపిణీ చేయడం జరుగుతుందని కావున రైతులు ఎవరు అధైర్య పడవద్దని వారు సూచించారు. అదేవిధంగా మహబూబాబాద్ జిల్లా యూరియా డిస్ట్రిబ్యూషన్ యాప్ ద్వారా పంపిణీ చేసే విధానంలో రెండో విడతలో ఉన్నందున త్వరలో యాప్ అందుబాటులోకి వస్తుందందున కేసముద్రం మండలంలోని ప్రతి రైతు గూగుల్ ప్లే స్టోర్ నుండి యూరియా బుకింగ్ యాప్ ను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని అప్డేట్ చేసుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాధికారి బి వెంకన్న, పోలీసు శాఖ సిబ్బంది, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సీఈవోలు వ్యవసాయ విస్తరణ అధికారులు జిపిఓ పాల్గొన్నారు.
భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని మర్రిపల్లి సర్పంచ్ డ్యాగం సుజాత సుధాకర్ అన్నారు.సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు మర్రిపల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించగా సర్పంచ్ డ్యాగం సుజాత సుధాకర్ పాల్గొని ఘన నివాళులర్పించారు. సర్పంచ్ మాట్లాడుతూ మహిళల విద్య కోసం సావిత్రిబాయి త్యాగం, విద్యనే ఆయుధంగా చేసుకుని సమానత్వం కోసం పోరాడి ఆమె జీవితం అందరికీ మార్గదర్శకమని చూపారాన్నారు.అనంతరం ప్రభుత్వ పాఠశాల అంగన్వాడీ ఉపాధ్యాయుయులను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో గ్రామ వార్డ్ సభ్యులు గాజు శివాజీ,కుక్కమూడి కవిత,డ్యాగం రాణి నర్సింగం,రాజేందర్ అపర్ణ,మాజీ సర్పంచ్ చాతరాశి నాగేందర్,మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కొత్తకొండ రవివర్మ,మాజీ ఉప సర్పంచ్ పొన్నాల ప్రతాపరెడ్డి,మహిళా సంఘం సీసీ వేల్పుల సుజాత,గ్రామ పెద్దలు ఇట్టబోయిన ఐలయ్య,గాజు చిన్న రాజయ్య,కుక్కమూడి సాంబయ్య,గ్రామ మహిళలు కశివొజ్జువుల రాజేశ్వరి,కుక్కమూడి కర్ణ,తలారి రజిత,మైదం స్రవంతి,ఆశా వర్కర్ మైదం సరోజన,యూత్ సభ్యులు డ్యాగం శివాజీ,పొన్నాల మైపాల్,కుక్కమూడి గోవర్ధన్,చిరంజీవి,మైదం దిలీప్,కుక్కమూడి స్వామి,శ్రీనివాస్,ప్రదీప్,సిద్దు,ఇల్లందుల ప్రశాంత్,తదితరులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.