జట్టును ప్రకటించిన బంగ్లాదేశ్.. ముస్తాఫిజుర్‌కు చోటు…

 జట్టును ప్రకటించిన బంగ్లాదేశ్.. ముస్తాఫిజుర్‌కు చోటు

 

టీ20 ప్రపంచ కప్ 2026 సమీపిస్తుంది. భారత్-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది. అయితే దీని కోసం బంగ్లాదేశ్ తమ జట్టును ప్రకటించింది. లిటన్ దాస్ కెప్టెన్‌గా 15 మంది ఆటగాళ్లను ఎంపిక చేశారు.

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 సమీపిస్తుంది. భారత్-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది. అయితే దీని కోసం బంగ్లాదేశ్ తమ జట్టును ప్రకటించింది. లిటన్ దాస్ కెప్టెన్‌గా 15 మంది ఆటగాళ్లను ఎంపిక చేశారు. భారత్, బంగ్లాదేశ్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల వల్ల ఐపీఎల్ 2026(IPL)లో చోటు కోల్పోయిన ముస్తాఫిజుర్ రెహమాన్‌(Mustafizur Rahman )కు ప్రపంచ కప్ జట్టులో చోటు కల్పించారు. ముస్తాఫిజుర్, తస్కిన్ అహ్మద్ పేస్ విభాగం బాధ్యతలు మోయనున్నారు. మెహదీ హసన్, రిషాద్ హొస్సేన్‌ను ప్రధాన స్పిన్నర్లుగా తీసుకున్నారు. బ్యాటింగ్‌లో లిటన్ దాస్, తంజిద్ హసన్, పర్వేజ్ హొస్సేన్ ఎమోన్‌పై బంగ్లా ఎక్కువగా ఆధారపడనుంది.
గ్రూప్ స్టేజీలో బంగ్లాదేశ్ ఆడాల్సిన నాలుగు మ్యాచులను భారత్‌లోనే షెడ్యూల్ చేశారు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా వెస్టిండీస్(ఫిబ్రవరి 7), ఇటలీ(ఫిబ్రవరి 9), ఇంగ్లండ్(ఫిబ్రవరి 14), నేపాల్(ఫిబ్రవరి 17) మ్యాచులు ఆడాల్సి ఉంది.బంగ్లాదేశ్ జట్టు గ్రూప్ ‘సి’లో ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌, నేపాల్‌, ఇటలీ జట్లతో తలపడనుంది. ఫిబ్రవరి 7 నుంచి 20 వరకు మొత్తం 40 లీగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్రతి గ్రూప్ నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ 8 దశకు చేరుకుంటాయి. ఫిబ్రవరి 21 నుంచి సూపర్ 8 మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. సూపర్ 8 దశ అనంతరం టాప్-4 జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. సెమీస్ కోల్‌కతా, కొలంబో, ముంబైలో జరగనుండగా, ఫైనల్ మార్చి 8న అహ్మదాబాద్‌ లేదా కొలంబోలో నిర్వహించనున్నారు.

: ఐపీఎల్ నుంచి ఔట్.. తొలిసారి స్పందించిన ముస్తాఫిజుర్ రెహమాన్

: ఐపీఎల్ నుంచి ఔట్.. తొలిసారి స్పందించిన ముస్తాఫిజుర్ రెహమాన్

 

ఐపీఎల్ నుంచి బంగ్లా ప్లేయర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. బంగ్లాలో జరుగుతున్న పరిస్థితుల దృష్ట్యా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై ముస్తాఫిజుర్ తొలిసారి స్పందించాడు.

ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడి.. రాజకీయ అస్థిరత నేపథ్యంలో ఆ దేశ ఆటగాడిని ఐపీఎల్‌లోకి తీసుకోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. వెంటనే అతడిని తొలగించాలని.. లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బీసీసీఐకి, కేకేఆర్ సహ యజామాని, ప్రముఖ నటుడు షారుక్ ఖాన్‌కు బెదిరింపులు కూడా వచ్చాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వెంటనే జట్టు నుంచి బంగ్లా ప్లేయర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను రిలీజ్ చేయాలని బీసీసీఐ(BCCI) కేకేఆర్‌కు ఆదేశాలు జారీ చేసింది.
దీని తర్వాత కూడా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఘాటుగా స్పందిస్తూ వస్తుంది. తాము కూడా భారత్‌లో క్రికెట్ ఆడబోమని.. టీ20 ప్రపంచ కప్ 2026లో భారత్‌తో బంగ్లాకు ఉన్న మ్యాచులను శ్రీలంకకు మార్చాలని ఐసీసీకి లేఖ రాస్తున్నట్లు వెల్లడించారు. ఈ గందరగోళాల మధ్య ముస్తాఫిజుర్ రెహమాన్(Mustafizur Rahman).. జట్టు నుంచి తనను తప్పించడంపై తొలిసారి స్పందించాడు.మిమ్మల్ని జట్టు నుంచి తీసేస్తే మీరు ఇంకా ఏమీ చేయగలరు? నేనూ అంతే’ అని బంగ్లా మీడియాలో మాట్లాడుతూ అన్నాడు. ప్రస్తుతం అతడి ప్రతిస్పందన వైరల్‌గా మారింది. గత నెలలో అబుదాబీలో జరిగిన ఐపీఎల్ 2026 మినీ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ముస్తాఫిజుర్‌ను రూ.9.2కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

అవమానాన్ని సహించం.. ఐపీఎల్‌పై బంగ్లాదేశ్ కఠిన నిర్ణయం….

అవమానాన్ని సహించం.. ఐపీఎల్‌పై బంగ్లాదేశ్ కఠిన నిర్ణయం?

 

బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడుల నేపథ్యంలో భారత్‌లో నిరసనలు ఊపందుకున్నాయి. దీంతో ముస్తాఫిజూర్‌ను ఐపీఎల్‌ నుంచి తప్పించాలన్న డిమాండ్లు గట్టిగా వినిపించాయి. చివరకు బీసీసీఐ సూచనలతో కేకేఆర్‌ అతడిని జట్టు నుంచి విడుదల చేసింది. ఈ విషయంపై బంగ్లాదేశ్ తీవ్రంగా స్పందిస్తోంది.

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌-బంగ్లాదేశ్ మధ్య రాజకీయ ఉద్రిక్తతలు ఇప్పుడు క్రికెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (KKR) జట్టు నుంచి బంగ్లాదేశ్ పేసర్‌ ముస్తాఫిజూర్‌ రెహమాన్‌ను రిలీజ్ చేయడంతో ఈ పరిణామాలకు మరింత ఆజ్యం పోసింది. బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడుల నేపథ్యంలో భారత్‌లో నిరసనలు ఊపందుకున్నాయి. దీంతో ముస్తాఫిజూర్‌ను ఐపీఎల్‌ నుంచి తప్పించాలన్న డిమాండ్లు గట్టిగా వినిపించాయి. చివరకు బీసీసీఐ(BCCI) సూచనలతో కేకేఆర్‌ అతడిని జట్టు నుంచి విడుదల చేసింది.అయితే ఇదే అంశం భారత్‌-బంగ్లాదేశ్ క్రికెట్ సంబంధాలను మరింత దెబ్బతీసేలా కనిపిస్తోంది. ఇప్పటికే బంగ్లాదేశ్ ప్రభుత్వ సలహాదారు ఆసిఫ్‌ నజ్రుల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీ20 ప్రపంచకప్‌ 2026కి సంబంధించి భారత్‌లో జరగాల్సిన బంగ్లాదేశ్ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించేలా ప్రణాళికలు చేయాలని ఐసీసీకి లేఖ రాయమని ఆయన బీసీబీ(BCB)కి సూచించారు. పాకిస్తాన్ తరహాలోనే ఈ నిర్ణయం ఉండాలని అభిప్రాయపడ్డారు.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version