ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి – ఎంపిడిఓ రాజిరెడ్డి

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంను త్వరగా పూర్తి చేయాలి

ఎంపిడిఓ రాజిరెడ్డి

నగరం గ్రామంలో నిర్మాణ దశల్లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంను ఎంపిడిఓ రాజిరెడ్డి పర్యవేక్షించారు . ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ను త్వరితగతంగా పూర్తి చేయాలని లబ్ధిదారులకు సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ అంతంపల్లి సుశీల సురేష్ బాబు ,హౌసింగ్ ఏఈ సంధ్య ,పంచాయతీ కార్యదర్శి మొహమ్మద్ ఆరీఫ్ హుస్సేన్, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఉన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి….

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి

నడికూడ,నేటిధాత్రి:

 

మండలంలోని కంఠాత్మకూర్ గ్రామంలో సర్పంచ్, పంచాయతీ కార్యదర్శిలతో కలిసి నిర్మాణం లో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన ఎంపీడీఓ రామకృష్ణ
స్లాబ్‌ స్థాయి వరకు పూర్తయిన ఇళ్లను ప్రారంభించడానికి సిద్ధం చేయాలని ఆదేశించారు.
నిరుపేదల సంక్షేమం కోసం ప్రభుత్వం అందించిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసే విధంగా ఇందిరమ్మ కమిటీ సభ్యులు,గ్రామ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించిన ఎంపీడీఓ రామకృష్ణ,నిర్మాణం లో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల ను లబ్ధిదారులతో కలిసి ఎంపీడీఓ రామకృష్ణ,సర్పంచ్ కోంగంటి తిరుపతి పంచాయతీ కార్యదర్శి శ్రీమతి భార్గవి లబ్ధిదారులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నిర్మాణాలు చేప‌ట్టాల‌న్నారు, ఇందుకోసం గ్రామాల్లో అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు త్వరలోనే ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకొని ప్రారంభించాలని తెలియజేశారు.అనంతరం గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని తెలిపారు, అలాగే మరుగుదొడ్లు లేని వారు వెంటనే నిర్మించాలని తెలిపారు,పెన్షన్ లబ్ధిదారులతో సమావేశం అయినా ఎంపీడీఓ వారి సమస్య కు న్యాయం చేస్తా అని మాట ఇచ్చారు.గ్రామ పంచాయతీ పరిసరాలను పరిశీంచారు,అంగన్వాడీ సెంటర్ కిరాయి లో ఉన్నందున్న చిన్న బడి లో వచ్చే విధంగా మార్చాలి అని ఎంపీడీఓ కి సర్పంచ్ కోంగంటి తిరుపతి తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version