: ఎలక్ట్రిక్ గీజర్ వాడుతున్నారా? ఈ సంకేతం వస్తే జాగ్రత్త సుమీ.!
శీతాకాలం కావడంతో సాధారణంగా గీజర్లు వాడకం పెరిగిపోయింది. అయితే.. వీటిని ఉపయోగించే విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా.. భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. తాడిపత్రిలో ఇటీవల జరిగిన గీజర్ పేలుడు ఘటనే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ.
గీజర్ పేలడానికి మరో కారణం అధిక పీడనం. గీజర్ థర్మోస్టాట్ సెన్సార్ పనిచేయకపోవడం వల్ల ఈ ప్రమాదం సంభవిస్తుంది. నీరు వేడికావడం నిర్ణీత ఉష్ణోగ్రతకు చేరాక.. ఈ సెన్సార్ గీజర్‌కు విద్యుత్‌ను నిలిపేస్తుంది. ఈ సంకేతంతో పవర్ ఆఫ్ చేయాలి.చాలా మంది రాత్రంతా గీజర్లను ఆన్‌లో ఉంచుతారు. ఇది ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఇలా చేయడం వల్ల నీరు చాలా వేడిగా మారుతుంది. దీనివల్ల పీడనం ఎక్కువై.. గీజర్ పేలిపోయే ఛాన్స్ ఉంది.
గీజర్‌లో నీరు లేనప్పుడు దానిని ఆన్ చేయవద్దు. ఇది గీజర్ వేగంగా పనిచేయకపోవడానికి దారితీస్తుంది. దీని వల్ల పెద్ద ప్రమాదానికీ దారితీయవచ్చు.
గీజర్లలో అమర్చిన ప్రెజర్ వాల్వ్‌ను ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేయించాలి. లేదంటే ఈ వాల్వ్ దెబ్బతినడం వల్ల పీడనం ఎక్కువై గీజర్ పేలుడుకు కారణమవుతుంది.
