యూఎస్ డ్రగ్ ఏజెన్సీ ఆఫీసులో వెనిజువెలా అధ్యక్షుడు.. వీడియో..

 యూఎస్ డ్రగ్ ఏజెన్సీ ఆఫీసులో వెనిజువెలా అధ్యక్షుడు.. వీడియో..

 

వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భారయ సిలియా ఫ్లోర్స్‌ అమెరికా భద్రతా దళాల అదుపులో ఉన్నారు. మదురోకి సంబంధించి వీడియోను యూఎస్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఓ వీడియోను విడుదల చేశాయి.

న్యూయార్క్, జనవరి 4: వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోర్స్‌ అమెరికా భద్రతా బలగాల అదుపులో ఉన్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి ఫోటోను ట్రంప్ రిలీజ్ చేయగా.. ఇప్పుడు తాజాగా వీడియోలు కూడా విడుదల చేశారు. మదురోని వెనిజువెలా నుంచి తీసుకువచ్చి.. అమెరికా డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్(DEA) న్యూయార్క్ డివిజన్ కార్యాయలంలో నిర్బంధించినట్లు ఈ వీడియో ద్వారా స్పష్టమవుతోంది.
శనివారం తెల్లవారుజామున వెనిజువెలా రాజధాని కారకాస్‌పై ప్రత్యేక అమెరికా దళాలు ఆకస్మిక దాడి జరిపాయి. ఈ దాడి సమయంలోనే ఆ దేశ అధ్యక్షుడు మదురో ఆయన భార్య సిలియా ఫ్లోర్స్‌ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుండగా.. యూఎస్ సెక్యూరిటీ ఫోర్సెస్ వారిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, యూఎస్ దాడి సమయంలో మదురో, ఆయన భార్య కారకాస్‌లోని హై సెక్యూరిటీ ఫోర్ట్ టియునా మిలిటరీ కాంపౌండ్‌లోని తమ నివాసంలో ఉన్నట్లు తెలుస్తోంది. దాడి విషయం తెలియగానే హైసెక్యూరిటీతో పారిపోయే ప్రయత్నం చేశారు. కానీ, వారి ప్రయత్నం ఫలించలేదు.

ఖలీదా జియా మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం…

ఖలీదా జియా మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం..

 

 

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి మంగళవారం ఉదయం ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో కన్నుమూశారు. ఆమె మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.

బంగ్లాదేశ్ (Bangladesh)మాజీ ప్రధానమంత్రి, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) అధినేత్రి బేగం ఖలీదా జియా (80)(Khaleda Zia) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆమె అనారోగ్యంతో (Health Issue) బాధపడుతున్నారు. ఈ రోజు (మంగళవారం) తెల్లవారుజామున ఢాకాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆమె మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) సంతాపం (condolences)వ్యక్తం చేశారు. భారతదేశం – బంగ్లాదేశ్ సంబంధాలను బలోపేతం చేయడంతో ఆమె పాత్రను ప్రశంసించారు.

బిగ్‌బాస్‌లో సల్మాన్ ఖాన్ ట్రంప్‌పై పరోక్ష సెటైర్లు

 డొనాల్డ్ ట్రంప్‌పై సల్మాన్ ఖాన్ సెటైర్లు.. అసలేం జరుగుతోందో తెలియట్లేదని కామెంట్

 

 

బిగ్‌ బాస్ తాజా సీజన్‌లో వ్యాఖ్యాతగా ఉన్న సల్మాన్ ఖాన్ డొనాల్డ్ ట్రంప్‌పై పరోక్షంగా సెటైర్లు పేల్చారు. సమస్యలు సృష్టించేవారికి శాంతి బహుమతులా అంటూ ఎద్దేవా చేశారు. ఓ కంటెస్టెంట్ తీరును ఎండగడుతూ సల్మాన్ ఖాన్ ఈ కామెంట్స్ చేశారు.

ఇంటర్నెట్ డెస్క్: తాను పలు యుద్ధాలను ఆపానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే చెప్పుకుంటున్నారు. ఆయనకు నోబెల్ బహుమతిపై మనసు పుట్టిందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. భారత ప్రధానితో స్నేహబంధం అకస్మాత్తుగా చెడటానికి నోబెల్ అంశం కూడా ఒక కారణమన్న వాదన ఉంది. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ 19 సీజన్ వేదికగా బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ట్రంప్‌పై పరోక్ష సెటైర్లు పేల్చారు. సమస్యలు సృష్టించే వారే శాంతి బహుమతులు కోరుకుంటున్నారేంటో అర్థం కావట్లేదంటూ ట్రంప్ పేరెత్తకుండానే ఎద్దేవా చేశారు.

బిగ్‌బాస్ షోలో పాల్గొంటున్న ఫర్హానా భట్ అనే కంటెస్టెంట్‌ను సల్మాన్ తలంటేశారు. ఓ మహిళగా సాటి కంటెస్టెంట్‌ను పైసా విలువలేని వ్యక్తివని ఎలా నిందించారని ప్రశ్నించారు. ‘మీకుమీరు శాంతిదూతనని ఎలా భావిస్తున్నారు. మీకసలే అహంకారం ఎక్కువ. అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారో అర్థం కావట్లేదు. సాటి మహిళను పైసా కూడా విలువ చేయవని అనొచ్చా. మీరూ ఓ మహిళే అన్న విషయం మర్చిపోయారా? అసలు ఈ ప్రపంచంలో ఏం జరుగుతోందో అర్థం కావట్లేదు. అందరికంటే ఎక్కువ సమస్యలు సృష్టించేవారే శాంతి బహుమతులను కోరుకుంటున్నారు’ అని సల్మాన్ అన్నారు. ఈ కామెంట్స్ వైరల్ కావడంతో సల్మాన్ ట్రంప్‌ను టార్గెట్ చేశారని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు

ట్రంప్ నోబెల్ శాంతి బహుమతిని కోరుకుంటున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. భారత్-పాక్ మధ్య రాజీ కుదుర్చినందుకు తన పేరును నోబెల్ ప్రైజ్‌ కోసం ప్రతిపాదించాలని భారత ప్రధానిని ట్రంప్ కోరారట. అయితే, భారత్-పాక్ వ్యవహారాల్లో మూడో దేశం జోక్యాన్ని ఆమోదించబోమని ప్రధాని మోదీ స్పష్టం చేయడంతో ఇద్దరి మధ్యా చెడిందని ఇటీవల మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే, మోదీ తనకు ఎప్పటికీ మిత్రుడేనని ట్రంప్ తాజాగా కామెంట్ చేశారు. దీనికి ఎక్స్ వేదికగా స్పందించిన భారత ప్రధాని మోదీ.. తనదీ అదే మాట అని పోస్టు పెట్టారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version