సజావుగా రైతులకు యూరియా పంపిణీ…
రైతు భరోసా పోర్టల్ నుంచే రైతులకు యూరియా
రైతులు ఎవరు అధైర్య పడవద్దు… మండల వ్యవసాయ అధికారి వెంకన్న
కేసముద్రం/ నేటి ధాత్రి
కేసముద్రం మండలంలో రెండు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు మరియు, ప్రైవేటు డీలర్ల ద్వారా కేసముద్రం మండల రైతులకు గ్రామాల వారిగా రైతు భరోసా పోర్టల్ నుంచి రైతుల లిస్టులు
ఒకరోజు ముందు గ్రామాలకు పంపించి మరుసటి రోజు శనివారం సుమారు 2844 బస్తాలను రైతులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పంపిణీ చేయడం జరిగింది.
కేసముద్రం మండల లోని వివిధ యూరియా పంపిణి సెంటర్ల ను మండల వ్యవసాయ అధికారి కేసముద్రం బి వెంకన్న పంపిణి విధానాన్ని పరిశీలించడం జరిగింది.
మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ రైతులు ఎవరు యూరియా కోసం ఆందోళన చెందవద్దని మండలానికి కావలసినటువంటి యూరియా రైతులకు విడతలవారీగా తెప్పించి పంపిణీ చేయడం జరుగుతుందని కావున రైతులు ఎవరు అధైర్య పడవద్దని వారు సూచించారు. అదేవిధంగా మహబూబాబాద్ జిల్లా యూరియా డిస్ట్రిబ్యూషన్ యాప్ ద్వారా పంపిణీ చేసే విధానంలో రెండో విడతలో ఉన్నందున త్వరలో యాప్ అందుబాటులోకి వస్తుందందున కేసముద్రం మండలంలోని ప్రతి రైతు గూగుల్ ప్లే స్టోర్ నుండి యూరియా బుకింగ్ యాప్ ను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని అప్డేట్ చేసుకోవాలని వారు సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల వ్యవసాధికారి బి వెంకన్న, పోలీసు శాఖ సిబ్బంది, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సీఈవోలు వ్యవసాయ విస్తరణ అధికారులు జిపిఓ పాల్గొన్నారు.
