జహీరాబాద్: ఇందిరమ్మ ఇళ్ళ స్థలాలను పరిశీలించిన అదనపు కలెక్టర్
జహీరాబాద్ నేటి ధాత్రి
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్కల్ మండల రాఘవ పూర్ గ్రామానికి నూతనంగా మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ళ స్థలాలను జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ రావు బుధవారం ఉదయం స్వయంగా సందర్శించి, పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజశేఖర్ కౌలాస్ ఏపీఓ, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.
వివాహ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మరియు చైర్మన్…
జహీరాబాద్ నేటి ధాత్రి
లక్ష్మి కన్వేషన్ హాల్ కంకోల్ లో జరిగిన వివాహ వేడుకల్లో ల్గొపాని నూతన వధూవరులను ఆశీర్వదించిన జహీరాబాద్ శాసనసభ్యులు కోనింటి మాణిక్ రావు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం,మాజి సర్పంచ్లు బస్వరాజ్,శ్రీనివాస్ రెడ్డి,కృష్ణ, పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ పాటిల్, ఉపసర్పంచ్లు మాణిక్యం యాదవ్, శివశంకర్, తదితరులు.
డిసిసి అధ్యక్ష పదవి చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యంకి కేటాయించాలి- అనుపురం పరశురాం గౌడ్
రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా డిసిసి అధ్యక్ష పదవిని చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యంకి కేటాయించాలని యువజన కాంగ్రెస్ రామడుగు మండల అధ్యక్షులు అనుపురం పరశురాం గౌడ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మేడిపల్లి సత్యం పీహెచ్డీ చేసిన ఒక విద్యావేత్త, యువ నాయకులు, పేదల ప్రజల అభివృద్ధి కోసం కృషి చేసే నాయకులు, పార్టీ కోసం అహర్నిశలు పాటుపడే గొప్ప వ్యక్తి. మంచి నాయకత్వ లక్షణాలు కలిగివున్న సత్యంకు డిసిసి అధ్యక్ష పదవిని అందించడం ద్వారా ముందు ముందు పార్టీ మరింత బలోపేతం కావడమే కాకుండా యువత కూడా రాజకీయంగా ముందుకు వెళ్తుందని ఆయన తెలిపారు.
సంగారెడ్డి జిల్లా : ఝరాసంగం మండల కేంద్రంలోని షాదీఖానా భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని ఎంఐఎం మండల అధ్యక్షుడు షేక్ రబ్బాని కోరారు. మంగళవారం ముస్లిం షాది ఖానా పెండింగ్‌లో ఉన్న షాదీఖానా భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… షాదీఖానా నూతన భవన నిర్మాణానికి గత ప్రభుత్వ హయాంలో మాజీ చంద్రశేఖర్ రావు హాయంలో జహీరాబాద్ ఎమ్మెల్యే కోట నుండి 20 లక్షలు మంజూరైన నిధులు మంజూరు చేశారన్నారు.
Shadikhana building
అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా షాదీఖానా పనులు పూర్తి చేయకపోవడం దారుణమన్నారు. కక్ష పూరితంగానే కాంగ్రెస్ లో చేపట్టిన పనులను అధికార పార్టీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. షాదీఖానా పనులు పూర్తి కాకపోవడంతో ముస్లింలు పెళ్లిలు చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారన్నారు.
రాజ్యాంగ పరిరక్షణలో భాగస్వాములు కావాలి -పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి
తొర్రూరు (డివిజన్) నేటి ధాత్రి
భారత రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. మంగళవారం ఏఐసీసీ మరియు పీసీసీ ఆదేశాల మేరకు మంగళవారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంచు సంతోష్ ఆధ్వర్యంలో మండలంలోని కర్కాల నుండి హరిపిరాల గ్రామ వరకు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ సన్నాహ సమావేశం నిర్వహించి పాదయాత్రను కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగ అమలుకు 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్‌ను అవమానించే విధంగా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా “జై బాపు, జై భీమ్” కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలియజేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయాలన్నారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయాన్ని సాధించేందుకు రాజ్యాంగ పరిరక్షణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే ఆదర్శంగా నిలిచిన గొప్ప రాజ్యాంగమని, దానిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైనా ఉందని గుర్తు చేశారు. రాజ్యాంగ పరిరక్షణకు అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. చేతిలో గాంధీ అంబేద్కర్ చిత్రపటం పట్టుకొని పాదయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తొర్రూర్ పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్,మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్, కాంగ్రెస్ నాయకులు గంజి విజయపాల్ రెడ్డి, డాక్టర్ పొనుగోటి సోమేశ్వరరావు, దేవేందర్ రెడ్డి, చిత్తలూరి శ్రీనివాస్, ప్రసాద్ రెడ్డి,రామచంద్రయ్య, సురేందర్ రెడ్డి,అచ్చిరెడ్డి, అశోక్ రెడ్డి,శ్రావణ్ కుమార్,చెవిటి సధాకర్,యాకూబ్ రెడ్డి,ధరావత్ సోమన్న, రవి నాయక్, ఫింగిలి ఉష, ప్రశాంతి, వెంకట్ రెడ్డి, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హెచ్చరించిన బిఆర్ఎస్ పార్టీ జిల్లా మహిళా నాయకురాలు ఇరుప విజయ
#గత పది సంవత్సరాలలో ఏం అభివృద్ధి చేసామో ప్రజలకు తెలుసు..
#కాంట్రాక్టర్ల నుండి 12 శాతం కమిషన్లు తీసుకుంటున్నది మీ నాయకులే చెప్తుండ్రు.
#బడే నాగజ్యోతి ని విమర్శిస్తే మీరు నాయకురాలు అవుతారని అనుకోవడం నీ మూర్ఖత్వం
#ములుగును జిల్లాను చేసిందే బిఆర్ఎస్ పార్టీయే.
ములుగు జిల్లా, నేటిధాత్రి:
గత పది సంవత్సరాలలో అధికారంలో ఉండి ఏం చేశారని మీరు అడుగుతున్నారు కదా పది సంవత్సరాల కేసీఆర్ పాలనలో ములుగు జిల్లా చేశాడు ట్రైబల్ యూనివర్సిటీ కి భూములు సేకరించి గిరిజన యూనివర్సిటీ కోసం కేంద్రంతో కొట్లాడి తీసుకొచ్చిన యోధుడు కేసీఆర్ గిరిజనల్ పట్ల ఆధార అభిమానాలు చూపించాడు మల్లంపల్లి మండలం కేసీఆర్ ఉన్నప్పుడే చేశాడు అది మేము చేశామని మీరు గొప్పలు చెప్పుకుంటున్నారు ములుగు మున్సిపాలిటీగా ప్రకటించింది కేసీఆర్ కాదా అది మర్చిపోతున్నారా మీరు అది కూడా మేమే తెచ్చామని కాంగ్రెస్ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారు ఎటునాగారం రెవెన్యూ డివిజన్ చేసింది వాస్తవం కాదా దాన్ని తుంగలో తోక్కారు నాగారం బస్టాండ్ బస్ డిపో తెచ్చింది కేసీఆర్ టైంలో కాదా ? ఎటు నగరానికి అగ్నిమాపక కేంద్రం తెచ్చింది వాస్తవం కాదా గోదావరి పరివాహ ప్రాంతంలో కరకట్ట కేసీఆర్ టైంలో కదా శాంక్షన్ అయింది ఇప్పుడు ఎందుకు ఆగిందో కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలి తెలంగాణ రాష్ట్రంలో అనేక గ్రామపంచాయతీలను చేసిన చరిత్ర కేసీఆర్ కి ఉంది అందులో భాగంగానే కామారం గ్రామంలో రేగ కళ్యాణి సర్పంచ్ కావడానికి కూడా కేసీఆర్ ఏ కారణమనే సంగతి రేగ కళ్యాణి మర్చిపోతున్నావు మీ తాడువాయి గ్రామాలలో మండల కేంద్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కనబడట్లేదా తాడువాయి మండలంతో సహా మీ గ్రామం కామారంతో సహా ఇంటింటికి మిషన్ భగీరథ నల్ల నీళ్లు ఇస్తున్నది మీకు కనబడట్లేదా ఇలాంటి అనేక సంక్షేమ పథకాలను అందించిన ఘనత కేసిఆర్ ఉంటే మీరు వాటిని తుడిపేసే ఘనకార్యం లో ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ కి ఎక్కడ పేరు వస్తుందోనని కెసిఆర్ కిట్టును తీసేసి అత్యధికంగా ఉన్న గిరిజనలు పేద ప్రజలు ఉన్న ములుగు జిల్లాలో కేసీఆర్ కిట్టును అందనీయకుండా చేసింది మీరు కాదా ఇన్ని వాస్తవాలను కళ్ళ ముందు పెట్టుకుని కేసీఆర్ ని బడే నాగజ్యోతిని విమర్శించే నైతిక కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదు అనేక సంక్షేమ పథకాలను తుంగలో తొక్కిన 420 హామీలు ఇచ్చి నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెడుతున్నది మీరు కాదా ములుగు జిల్లా వెనుకబడ్డ జిల్లా అని కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ ములుగు నియోజకవర్గంలో కెసిఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధికి ఇచ్చింది నిజం కాదా దాంట్లో అప్పటి ఎమ్మెల్యే సీతక్క అనేక నిధులు దయాకర్ రావు ద్వారా తెచ్చుకుని చేసింది వాస్తవం కాదా బడే నాగజ్యోతికి రాజకీయ బిక్ష పెట్టింది సీతక్క అని అనటం కూడా విడ్డూరంగా ఉంది ఇండిపెండెంట్ అభ్యర్థిగా సర్పంచిగా కాల్వపల్లి ప్రజలు గుండెల్లో ఉంచుకొని తనని గెలిపించుకున్నారు తప్ప సీతక్క దయా దక్షిణాల మీద కాదని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలని ఇంకొకసారి బడే నాగజ్యోతిని విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరిస్తున్నాం బిఆర్ఎస్ పార్టీ నాయకులకు మతిభ్రమించలేదని కేసీఆర్ రజితోత్సవ సభను చూసి కాంగ్రెస్ పార్టీ నాయకులకి మతిభ్రమించి అవాక్కులు చవాకులు పేలుతూ లేనిపోని ఆరోపణ చేస్తూ కాంగ్రెస్ పార్టీ అక్రమాల గురించి మాట్లాడిన వాళ్ళని అక్రమ కేసుల్లో ఇరికించి జైళ్ళకు పంపడమే పరమావధిగా పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్న తీరు ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం సీతక్కని విమర్శించి బడే నాగజ్యోతి నాయకురాలు కావాల్సిన అవసరం లేదు బడే కుటుంబం అంటే ములుగు నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు విప్లవ త్యాగాలతో బడే నాగజ్యోతి అమ్మానాన్నలు వాళ్ళ బాబాయి ప్రాణత్యాగం అర్పించి ఇక్కడ ఉన్న గిరిజనుల ఈ ప్రాంత ప్రజల తరపున పోరాడి అమరులైన కుటుంబం వారి త్యాగాల పురిటి నొప్పుల నుంచి ఉద్భవించిందే బడే నాగజ్యోతి ఆ సంగతి మీరు మర్చిపోతున్నారా రేగ కళ్యాణి ఇప్పుడు సీతక్క మెప్పుల కోసం కాంగ్రెస్ పార్టీ మెప్పుల కోసం విమర్శిస్తుంది కావచ్చు బడే నాగజ్యోతికి ఆ అవసరం లేదు ఇప్పటికైనా బిఆర్ఎస్ పార్టీ మీద ములుగు నియోజకవర్గ ఇన్చార్జి బడే నాగజ్యోతి మీద అనవసరమైన ఆరోపణలు చేసే బదులు ములుగు నియోజకవర్గ మీద అభివృద్ధి మీద సంక్షేమ పథకాలు అమలు చేసే మీద ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుపరిచే విధంగా పని చేయాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం.
అనుమతులు లేకుండా నడిపిస్తున్న జూనియర్ కళాశాలలను మూసివేయాలి
డి ఐ ఈ ఓ గోపాల్ కి వినతిపత్రం అందజేత
స్వేరో స్టూడెంట్స్ యూనియన్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు ఎల్తూరి సాయికుమార్
హన్మకొండ, నేటిధాత్రి:
సాయికుమార్ మాట్లాడుతూ హనుమకొండ నగరంలో ప్రభుత్వ అనుమతులు లేకుండా విచ్చలవిడిగా జూనియర్ కళాశాలను నడిపిస్తున్న చైర్మన్ ల పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మరియు అదేవిధంగా విద్యార్థులను మరియు విద్యార్థుల తల్లిదండ్రులను ఇటు ప్రభుత్వాన్ని కూడా మోసం చేస్తూ విద్యార్థుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తూ ,కనీస మౌలిక సదుపాయాలు లేకుండా కాలేజ్ స్ట్రక్చర్ లేకుండా నడిపించడమే కాకుండా జేఈఈ,మెయిన్స్ పేరిట లక్షల రూపాయలు విద్యార్థుల నుండి ముక్కు పిండి వసూలు చేస్తున్న కళాశాలల చైర్మన్లు, పర్మిషన్ ఉన్న బ్రాంచ్ వద్ద అడ్మిషన్ చేర్చుకొని అక్కడ క్లాసులు చెప్పకుండా విచ్చలవిడిగా అద్దె భవనాలు తీసుకొని అక్కడ కళాశాలలను నడిపించడం జరుగుతుంది ప్రమాదవశాత్తు అక్కడ ఏదైనా జరగరానిది జరిగితే విద్యార్థులకు బాధ్యత ఎవరు అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. స్థానిక డిస్టిక్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డి ఐ ఈ ఓ స్పందించి తక్షణమే అనుమతులు లేని కాలేజీలను మూసివేయాలని స్వేరో స్టూడెంట్స్ యూనియన్ హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చెట్టుపల్లి శివకుమార్, సిద్ధార్థ , విక్రం, సాత్విక్ ,శ్రావణ్, జస్వంత్ ,సాయి ,ముఖేష్ గణేష్ తదితరులు పాల్గొన్నారు.
వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన పీసీసీ సభ్యులు పెండెం
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట పట్టణ కేంద్రానికి చెందిన విగ్నేశ్వర రైతు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ బుదవారం ప్రారంభం చేశారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు బత్తిని రాజేందర్, మాజీ వైస్ ఎంపీపీ చింతల సాంబరెడ్డి, ఓబీసీ జిల్లా అధ్యక్షులు ఓర్సు తిరుపతి, నర్సంపేట మాజీ మార్కెట్ చైర్మన్ ఎర్ర యాకుబ్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి అజ్మీర మేఘ్య నాయక్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్, మాజీ కౌన్సిలర్ ఎలకంటి విజయ్ కుమార్, నర్సంపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్, నర్సంపేట మార్కెట్ డైరెక్టర్ కొల్లూరి మధుకర్, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పంబి వంశీకృష్ణ, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ కార్యదర్శి చిప్ప నాగ, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ ప్రచార కార్యదర్శి బిట్ల మనోహర్, 13వ వార్డు ఇంచార్జ్ శ్రీరామోజు మురళి, బీరం భరత్ రెడ్డి, నర్సంపేట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొంత రంజిత్, విగ్నేశ్వర రైతు సంఘం అధ్యక్షులు చిలువేరు కుమారస్వామి, విజ్ఞేశ్వర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి రేమిడి శ్రీనివాసరెడ్డి, ఇంచార్జ్ రాజా మల్లారెడ్డి, మేడబోయిన కుమార్, విగ్నేశ్వర రైతు సంఘం సభ్యులు, రైతులు, పాల్గొన్నారు.
శాయంపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య అంతర్గతంగా కొనసాగుతున్న విభేదాలకు సమస్య సమన్వ యం జరుగుతుందా! గండ్ర వర్సెస్ చారి కార్యకర్తల మధ్య సమస్య తీరుతుందో లేదో !ఈ సమస్య ఇంతవరకు ఓ కొలిక్కి వచ్చిన దాఖనాలు కల్పించడం లేదు ఈ వివాదం ఇంకా చక్క బడకపోవడంతో విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. మండల పరిధిలోని పలు గ్రామాల్లో కూడా పార్టీ ప్రజా ప్రతినిధుల మధ్య అంతర్గత విభేదాలు చాప కింద నీరులా కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య అంతర్గతంగా ఉన్న విభేదాలు సమస్య పోతాయా! బీఆర్ఎస్ పార్టీ మండల పరిధిలో కార్యకర్తలకు సమావేశం నిర్వహించినప్పుడు మమ్మల్ని దూరంగా ఉంచడం నిదర్శనం. కేసీఆర్ జెండా ఎజెండా కింద మేము పనిచేస్తాం. బీఆర్ఎస్ పుట్టుక నుండి ఉద్యమం చేసి జైలుకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి పార్టీ నుంచి సస్పెండ్ చేయడం బాధాకరం. పార్టీ నుండి సస్పెండ్ ను ఎత్తివే యాలని డిమాండ్ చేశారు.
BRS
కారులో కొట్లాట
మండలంలో బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య అంతర్గత కుమ్ములాటలు పెరిగిపోతున్నా యి చాలా గ్రామాల్లో గండ్ర వర్సెస్ చారి కార్యకర్తల మధ్య కొట్లాటలు చోటు చేసుకుంటు న్నాయి ఇతర పార్టీల నుంచి వచ్చిన వారి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది ఒకరిపై ఒకరు దుష్ప్రచారం కొనసాగు తుంది. సమస్యను సమన్వ యము చేయకపోతే పార్టీ యంత్రాంగం ఎలా ఎదుర్కొని చల్ల బరచ గలదో వేచి చూడా ల్సిందే మరి!ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షులు గుర్రం రవీందర్, మాజీ మార్కెట్ డైరెక్టర్ నిమ్మల మహేందర్, మాజీ సర్పంచ్ ఫోరం అధ్యక్షులు ఇమ్మడిశెట్టి రవీందర్, మాజీ మండల ఉపాధ్యక్షులు పల్లెబోయిన సారయ్య, అశోక్, జుపాక సారయ్య అరికెళ్ల వీరయ్య దూదిపాల మల్లారెడ్డి దూదిపాల రాజిరెడ్డి జిల్లా యువజన నాయకులు విజయ్ కుమార్ ,కొత్తగట్టు సాయి ,మండల యూత్ నాయకులు బెరుగు తరుణ్ గోపి, సాగర్ ,గజ్జి శంకర్, బుర్ర విజయ్ ,బుర్ర గణేష్, దర్శన్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రీయ బసవ దళ్ పూజా కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు
◆ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి,
◆ మాజీ టిజిఐడిసి చైర్మన్ మహ్మద్.తన్వీర్*
జహీరాబాద్ నేటి ధాత్రి:
రాష్ట్రీయ బసవ దళ్ వారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శంకర్ పటేల్ గారి ఆహ్వానం మేరకు మంగళవారం పట్టణం లోని బసవ మంటపం లో జరిగిన పూజా కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి ,మాజీ టిజిఐడిసి చైర్మన్ మహ్మద్.తన్వీర్ ఈ సంధర్బంగా డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి మాట్లాడుతూ అందరికీ ముందుగా బసవ జయంతి శుభాకాంక్షలు తెలిపారు,ప్రేమతత్వం, సమానత్వం,సౌభ్రాతృత్వాన్ని విశ్వమానవాళికి ప్రబోధించిన మహాత్మ శ్రీ బసవేశ్వరుడి చూపిన మార్గంలో నడవాలాన్నారు.బసవేశ్వరుడి జయంతి సందర్భంగా రక్త దాన కార్యక్రమాలు చేయడం ఒక పుణ్య కార్యం అని,బసవ జయంతి పురస్కరించుకొని రాష్ట్రీయ బసవ దళ్ వారు ప్రతి సంవత్సరం రక్త దాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయం అని అన్నారు.ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు పి.నర్సింహారెడ్డి,యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు పి.నాగిరెడ్డి, మాజీ కౌన్సిలర్ రాజశేఖర్,సీనియర్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి,అశ్విన్ పాటిల్,రంగా అరుణ్ కుమార్, కుతుబోద్దిన్,తాజోద్దిన్,యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి హర్షవర్ధన్ రెడ్డి,నర్సింహా యాదవ్,బి.జి.సందీప్ మరియు రాష్ట్రీయ బసవ దళ్ తెలంగాణ అధ్యక్షులు శంకర్ పటేల్ ,రాష్ట్రీయ బసవ దళ్ డాక్టర్ శర్నప్ప ,వైద్యులు డాక్టర్ రాజ్ కుమార్,డాక్టర్ సచిన్ ,కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
బతికుండగానే చంపేశారు.. సంగారెడ్డి జిల్లాలో సంచలన సంఘటన…
◆ అధికారుల తప్పుడు ధృవీకరణ పత్రం…
◆ సంగారెడ్డి జిల్లాలో సంచలనం రేపిన సంఘటన…
◆ బాధితుడి ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి..
◆ అధికారులపై కలెక్టర్ క్రాంతి వల్లూరు సీరియస్…
◆ ఆరి, డిప్యూటీ తహసీల్దార్ పై పడిన వేటు…
◆ మరికొందరిపై చర్యలు తీసుకునే అవకాశం…
జహీరాబాద్ నేటి ధాత్రి:
రెవెన్యూ అధికారుల తప్పుడు ధృవీకరణతో భూములు తారుమారైన సంఘటన జహీరాబాద్ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. బాధితుల అప్రమత్తతతో రెవెన్యూ ఉన్నతాధికారులు స్పందించడంతో వారికి కొంత మేరకు ఊరట కలిగింది. ఇందుకు కారకులైన ఇద్దరు రెవెన్యూ అధికారుల పై కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. తప్పుడు ధ్రువీకరణ తెచ్చిన తంటాతో ఇద్దరు అధికారులు సస్పెన్షన్ గురవ్వగా, అంతటితో ఆగుతుందా లేక మరి కొందరి పై వేటు పడుతుందా అనే చర్చలు జరుగుతున్నాయి. జహీరాబాద్ మండలం కొత్తూరు( బీ) గ్రామంలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలోని సర్వే నంబర్ 7/అ- లో బాధితుడు రాయికోడ్ షేక్ అహ్మ ద్, ఆయన అన్న దివంగత ఇస్మాయిల్ ఇద్దరు కలిసి 1995లో 1.29 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఇందులో బాధితుడు షేక్ అహ్మద్ పేరుమీద 0.34 గుంటల భూమి ఉంది. ఈయన బతికే ఉన్నప్పటికీ అతను చనిపోయినట్లు ఇతరుల పేరుతో వాస్తవికతకు విరుద్ధంగా తప్పుడు వారసత్వ ధ్రువీకరణ పత్రం అధికారులు మంజూరు చేశారు. దీంతో తప్పుడు వారసత్వం పొందిన వారు మరొకరికి, వారు ఇంకొకరికి ఇలా ముగ్గురి పేరుతో లావాదేవీలు జరిగాయి. చివరిగా నెల క్రితం కబ్జాపైకి రావడంతో బాధితులు అప్రమత్తమయ్యారు.సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన అధికారులు విచారించి తగిన చర్యలు తీసుకున్నారు. తప్పుడు వారసత్వ ధ్రువీకరణ పత్రం జారీ చేసి భూ తగాదాలకు కారకులు గతంలో జహీరాబాద్ డిప్యూటీ తహశీల్దార్ గా పనిచేసి, ప్రస్తుతం కల్హేర్ డిప్యూటీ తహశీల్దార్ గా చేస్తున్న బీటీ. పవన్ కుమార్, జహీరాబాద్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ యాది లాల్ లను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఉత్తర్వులు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో విచారణ జరుపకుండానే బతికి ఉన్న వ్యక్తి చనిపోయినట్లు పంచనామా నివేదిక సమర్పించారు. వారసత్వ ధ్రువీకరణ పత్రం మంజూరు చేసిన డిప్యూటీ తహశీల్దార్ బీటీ. పవన్ కుమార్, తప్పుడు నివేదిక సమర్పించిన ఆర్ఐ యాదిలాల్ కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. వారిని సస్పెన్షన్ చేస్తూ కలెక్టర్ క్రాంతి వల్లూరు ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉండగా మరణ ధ్రువపత్రం జారీచేసిన గ్రామ, మున్సిపల్ స్థాయి అధికారి, సిబ్బంది పై కూడా వేటు పడే అవకాశాలు ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ కోణంలో విచారణ కొనసాగుతున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది.
Sensational incident
భూ మాతలో ఫౌతీకి గడువు..
ధరణి పోర్టల్ లో ఉన్న లొసుగులను ఆసరా చేసుకొని తప్పుగా వారసత్వ ఆస్తిని ఇతర వ్యక్తులు పొందారు.
అదే భూ మాత పోర్టల్ లో అలాంటి తప్పులకు ఆస్కారం లేదని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు.
వారసత్వం కింద భూమి బదలాయింపునకు దరఖాస్తు చేసుకున్న సదరు వ్యక్తుల వారసత్వ ఉదాహరణ కోసం నోటీసులు జారీచేసి, విచారణ జరుపుతారు.
వారం రోజుల పరిశీలన అనంతరం అభ్యంతరాలు రాకుంటే వారసుల పేర్లతో భూమిని బదలాయింపునకు చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు.
లక్ష్యం మేరకు ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపిక పూర్తి చేయాలి
– కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
– ఇందిరమ్మ ఇండ్ల పథకంపై ప్రత్యేక అధికారులతో కలెక్టర్ సమీక్ష
సిరిసిల్ల(నేటి ధాత్రి):
జిల్లాలో లక్ష్యం మేరకు ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపిక పూర్తి చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంపై జిల్లాలోని ఆయా మండలాలు, మున్సిపాలిటీల ప్రత్యేక అధికారులతో కలెక్టర్ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? ఎన్ని సర్వే చేశారు? ఎన్ని దరఖాస్తులు ఆన్లైన్ చేశారో హౌసింగ్ పీడీ శంకర్ ను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయా మున్సిపాలిటీలు, మండలాల వారిగా లక్ష్యం మేరకు ఎంత పూర్తి చేశారో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు. అర్హులైన పేదల సొంత ఇంటి కల సాకారం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రవేశపెట్టిందని వివరించారు. ఇప్పటికే వచ్చిన దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో సర్వే చేశారని, అర్హులకే అందేలా చూడాలని స్పష్టం చేశారు. జిల్లాలోని ఆయా మున్సిపాలిటీలు, మండలాల్లో మొత్తం 7690 దరఖాస్తులు అధికారులు క్షేత్ర స్థాయిలో సర్వే చేశారని, వీటిలో ఇప్పటిదాకా 5776 వారి వివరాలు ఆన్లైన్ చేశారని వెల్లడించారు. మిగతా వివరాలు పరిశీలిస్తున్నారని పేర్కొన్నారు. అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు అందించాలని సూచించారు. వచ్చే నెల 2వ తేదీన ఆయా గ్రామాలు, మున్సిపాలిటీల వార్డుల్లో దరఖాస్తుదారు జాబితా ప్రదర్శిస్తారని, 5వ తేదీన తుది జాబితా ప్రదర్శిస్తారని కలెక్టర్ తెలిపారు. అధికారులు సమన్వయంతో పని చేసి లక్ష్యాన్ని పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో సిరిసిల్ల ఆర్డీవో రాధాబాయి, డీఆర్డీఓ శేషాద్రి, ఆయా మండలాల ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు.
*ప్రజల్లో సామాజిక చైతన్యాన్ని పెంపొందించిన గొప్ప సంఘసంస్కర్త బసవేశ్వరుడు : ఎమ్మెల్యే మాణిక్ రావు *
జహీరాబాద్ నేటి ధాత్రి:
892వ బసవ జయంతి* సంధర్బంగా జహీరాబాద్ లింగయత్ సమాజ్ వారి ఆధ్వర్యంలో స్థానిక బసవేశ్వర ఆలయం వద్ద జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన శాసనసభ్యులు శ్రీ కోనింటి మాణిక్ రావు బసవ వాదాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తూ జహీరాబాద్ లింగాయత్ సమాజ్ అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన డాక్టర్ మడుపతి. బస్వరాజ్ గారికి లింగయాత్ సమాజ్ వారితో కలిసి ఘనంగా సన్మానించారు,అనంతరం రాష్ట్రీయ బసవ దళ్ వారి ఆహ్వానం మేరకు దత్తగిరి కాలనీ లో బసవేశ్వర విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన సేవలను కొనియాడారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.
Social Reformer
మహాత్మా బసవేశ్వరుడు 12వ శతాబ్దంలోనే కుల వివక్షతను వ్యతిరేకించి ధనిక, పేద, అందరూ సమానమే అని చాటిచెప్పిన మహనీయుడు శ్రీ కళ్యాణ బసవేశ్వరుడు బసవ జయంతి సందర్భంగా మహనీయునికి ఘనమైన నివాళి శ్రీ బసవేశ్వర స్వామి వారి శుభాశీస్సులు అందరికి ఉండాలని కోరుకుంటూ బసవ జయంతి శుభాకాంక్షల తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజి సీడీసీ చైర్మన్ ఉమకాంత్ పాటిల్,జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ,సీనియర్ నాయకులు నామ రవికిరణ్,ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్,మహిళ నాయకురాలు పద్మజ ,మాజి సర్పంచ్ లు ప్రభు పటేల్,అప్ప రవ్ పాటిల్,అశోక్ పటేల్, లింగాయాత్ సమాజ్ అధ్యక్షులు రాజు శెట్కార్, ప్రధాన కార్యదర్శి సుభాష్ ,కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఓటర్లను పోలింగ్ బూత్‌ల వద్దకు తీసుకువచ్చే క్షేత్రస్థాయి కార్యకర్తలు లేరు
గ్రామీణ, పట్టణ ప్రాంత పేదలకోసం మమత అమలు చేస్తున్న పథకాలు
బీజేపీ పట్ల బెంగాలీల్లో వ్యతిరేక భావం
భాజపాను ఉత్తరాది పార్టీగా పరిగణిస్తున్న బెంగాలీలు
ప్రభుత్వ మద్దతుతో రెచ్చిపోతున్న రాడికల్ ముస్లింలు
భద్రత కొరవడి బిక్కుబిక్కు మంటున్న హిందువులు
వక్ఫ్ బిల్లు అల్లర్లలో హిందువుల ఆస్తుల విధ్వంసం
ముస్లిం మెజారిటీ ప్రాంతాల్లో రెండోతరగతి పౌరులుగా హిందువులు
హిందువులపై దాడులు సర్వసాధారణం
హైదరాబాద్,నేటిధాత్రి:
ముస్లిం మెజారిటీ ప్రాంతాల్లో తమపై దాడులు జరుగుతున్నా, రెండో తరగతి పౌరులుగా పరిగణిస్తున్నా, మమతా బెనర్జీ ముస్లింల బుజ్జగింపు రాజకీయాలు అనుసరిస్తున్నప్పటికీ, పశ్చిమబెంగాల్ హిందువుల్లో చాలామంది ఇంకా తృణమూల్ కాంగ్రెస్‌కే ఓటు వేస్తుండటం విచిత్రమనిపిస్తుంది. ఇటీవల వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా రాష్ట్రంలో అల్లర్లు జరిగిన ముర్షిరాబాద్ జిల్లాకు చెందిన జఫ్రాబాద్ అనే ఒక చిన్న పట్టణంలో మైనారిటీలుగా వున్న హిందువులకు చెందిన ఏ ఒక్క ఇల్లుదాడికి లేదా లూటీకి గురికాకుండా లేదంటే అతిశయోక్తి కాదు. జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లో పెచ్చరిల్లిన హింస ప్రభావాన్ని ఇక్కడి హిందువులు చవిచూశారు. ఈ చిన్న పట్టణం కోల్‌కతాకు 284 కిలోమీటర్ల దూరంలో వుంది. ఇక్కడ 25వేల మంది ముస్లిం జనాభా వుంటే, హిందువు లు కేవలం 5100 మాత్రమే. షంషేర్‌గంజ్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఈ పట్టణం వుంది. ఈ నియోజకవర్గంలో 2.16లక్షల మంది ఓటర్లుండగా ఇందులో 80శాతం మంది ముస్లిం లే. ఈ నియోజకవర్గంలో ముస్లిం అభ్యర్థి తప్ప మరొకరు గెలవరు. ముస్లిం మెజారిటీ ప్రాంతా ల్లో హిందువుల బతుకులు ఎంత దుర్భరంగా వుంటాయనేదానికి జఫ్రాబాద్ పట్టణం ఒక ఉదా హరణ మాత్రమే! మమతా బెనర్జీ ముస్లింల బుజ్జగింపు రాజకీయాల పుణ్యమాని, ఇక్కడి హిందువులు ఎన్ని బాధలు పడుతున్నా పోలీసులు కూడా పట్టించుకోరు. రాష్ట్రంలో ముస్లింలు మెజారిటీలుగా వున్న అన్ని ప్రాంతాల్లో హిందువుల పరిస్థితి ఇట్లాగే కొనసాగుతోంది.
హిందువుల్లో ఓటింగ్ శాతం తక్కువ
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 7.6కోట్లు. వీరిలో హిందువులు 68శాతం. హిందువుల్లో బెంగాలీ హిందువులు 54శాతం వుంటే, గుజరాతీలు, మార్వాడీలు, యు.పి, బిహార్ ప్రాంతా లనుంచి వచ్చిన వారు, గూర్ఖాలు, గిరిజనులు కలిసి 14శాతం వుంటారు. అంటే బెంగాలీ హిం దువులు 4.1 కోట్లు కాగా, బెంగాలేతర హిందువుల సంఖ్య 1.6కోట్లు. ఇక రాష్ట్రంలో ముస్లిం ఓటర్ల సంఖ్య 2.43కోట్లు. బెంగాల్‌లో సాధారణంగా ఓటింగ్ శాతం 80శాతానికి పైగా నమోద వుతుంది. ముస్లిం ఓటర్లు 90 నుంచి 94శాతం వరకు తమ ఓటు హక్కును వినియోగించుకుం టే, హిందువులు కేవలం 65శాతం మంది మాత్రమే పోలింగ్ బూత్‌లకు వెళతారు. అంటే రా ష్ట్రంలోని మొత్తం 5.16 కోట్ల హిందువుల్లో కేవలం 3.5కోట్ల మంది మాత్రమే ఓటు హక్కు విని యోగించుకుంటున్నారు. అదే 2.43కోట్లమంది ముస్లింలలో 2.18కోట్లమంది ఓట్లు వేస్తారు. దీవల్ల రాష్ట్రంలోని 42 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలైన మొత్తం ఓట్లను పరిశీలిస్తే హిందువుల ఓట్లు కేవలం 3.16లక్షలు మాత్రమే అధికంగా పోలవడం గమనార్హం.
హిందువుల్లో 66శాతం మంది బీజేపీకి మద్దతు
2024 లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్‌కు 2.75కోట్ల ఓట్లు (45.76%) పోల్ కాగా, బీజేపీకి 2.33 కోట్ల (38.73%) ఓట్లు పోలయ్యాయి. అంటే తృణమూల్ కాంగ్రెస్‌కు బీజేపీ కంటే 42.37లక్షల ఓట్లు మాత్రమే అధికంగా పడటం గమనార్హం. ఈ ఎన్నికల్లో బీజేపీకి పడిన ఓట్లు మొత్తం హిందువులవే. 3.51కోట్లమంది హిందువులు ఓటుహక్కును వినియోగించుకోగా, ఇం దులో 2.33కోట్ల మంది బీజేపీకే తమ ఓట్లు వేసినట్లు తేలుతోంది. అంటే మొత్తం పోలైన హిందూ ఓట్లలో 66శాతం మంది బీజేపీకి అనుకూలంగా ఓటువేసారని స్పష్టమవుతోంది. అంటే మిగిలిన 34శాతం (1.18కోట్లు) ఇతర పార్టీలు ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్‌కు ఓటు వేసారను కోవాలి. వీరిలో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలకు 64లక్షల మంది హిందువులు అనుకూలంగా ఓటు వేయగా మిగిలినవారు తృణమూల్ కాంగ్రెస్‌కు మద్దతు పలికారు.
ఈ విశ్లేషణను పరిశీలిస్తే 34శాతం మంది హిందువులు ఇంకా తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ మరియు లెఫ్ట్ పార్టీలకు ఎందుకు ఓటు వేస్తున్నారనే ప్రశ్న సహజంగానే ఉదయిస్తుంది.
హిందువులపై యదేచ్ఛగా దాడులు
హిందువుల వేడుకలు, ఊరేగింపులపై యదేచ్ఛగా దాడులు జరుగుతున్నాయి. హిందువుల పండుగల సందర్భంలో తీవ్రమైన ఆంక్షలు విధిస్తోంది. హిందువుల పట్ల ప్రభుత్వం పూర్తి పక్షపాత వైఖరిని అవలంబిస్తోంది. ఇస్లామిక్ ఛాందసవాదులు నిర్హేతుక కోర్కెలకు తలగ్గి ఎన్నో తరాలుగా కొనసాగుతున్న హిందువుల పండుగలు, వేడుకలపై మమత ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోంది. హిందువులపై దాడులకు, హింసాకాండకు పాల్పడిన ఇస్లామిక్ ఛాందసవాదులపై చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించవు. దీన్ని అలుసుగా తీసుకొని మతఛాందసవాదులు యదేచ్ఛగా పేట్రేగిపోతున్నారు. హిందువులు మెజారిటీగా ఉన్న ప్రాంతాల్లో కూడా ఇస్లామిస్టులు దాడులకు తెగబడటానికి ప్రధాన కారణం మమతా బెనర్జీ ప్రభుత్వం అండ వున్నదన్న ధైర్యంతోనే! ఉదాహరణకుచందన్నాగోర్ సబ్‌డివిజన్‌కు చెందిన చంపదాని పట్టణంలో హిందువుల జనాభా 76%. కానీ ఏప్రిల్ 11న శుక్రవారం నమాజు ముగిసిన తర్వాత ఇస్లామిక్ రాడికల్స్ హిందువుల ఆస్తులపై పెద్దఎత్తున దాడులకు పాల్పడ్డారు. ఈ దాడులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. హిందువులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. కర్రలు, లాఠీలు పట్టుకొని స్వైరవిహారం చేస్తున్న రాడికల్ ముస్లింలు, పోలీసులను కూడా తరిమివేశారు.
ఇస్లామిక్ రాడికల్స్ దాడులనుంచి తమను తాము కాపాడుకోవడానికి బెంగాలేతర హిందూ యువకులు గ్రూపులుగా ఏర్పడి ఇస్లామిస్టులను నిరోధిస్తున్నప్పుడు, పోలీసులు వీరినే నియంత్రించా రు తప్ప దాడులకు పాల్పడిన వారిని పల్లెత్తుమాట అనుకపోవడం బెంగాల్‌లో జరుగుతున్న అరాచక పాలనకు నిదర్శనం. ఆవిధంగా తాము మెజారిటీగా ఉన్న ప్రాంతాల్లో కూడా హిందువుల కు రక్షణ లేకుండా పోయింది. బెంగాల్‌లోని గ్రామీణ, పట్టణ, సెమి అర్బన్ ప్రాంతాలకు చెందిన హిందువులకు ఈ దాడుల అనుభవాలు వెన్నాడుతున్నాయి.
పేదలకు అనుకూల పథకాలు
మమతా బెనర్జీ ప్రభుత్వం ఎంత గొప్పలు చెప్పుకునా, రాష్ట్రంలో కమతాల విస్తీర్ణం కుంచించుకు పోతుండటంతో వ్యవసాయ దిగుబడులు గణనీయంగా పడిపోతున్నాయి. ఫలితంగా గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో అత్యధికశాతం ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారు. మమతా బెనర్జీ అమ లు చేస్తున్న పథకాల వల్ల, లక్షల సంఖ్యలో బాలబాలికలు పాఠశాలలకు వెళ్లగలుగుతున్నారు. ఉన్నత విద్యకూడా అందుబాటులోకి వచ్చింది. ఇందుకు ప్రతిగా మమతా బెనర్జీ ఆయా వర్గాల ఓట్లను కోరుతున్నారు. తమకు అందుతున్న పథకాల ప్రయోజనం నేపథ్యంలో ఆయా ప్రాంతాలకు చెందిన పేద హిందువులు తృణమూల్ కాంగ్రెస్‌కే అనుకూలంగా వుంటున్నారు. ఇదే సమ యంలో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రయోజనాలు పొందు తుండటం ఓటుబ్యాంకు పటిష్టంగా వుండటానికి మరో కారణం. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే, ప్రభుత్వ భూమిలో ఒక టీస్టాల్ లేదా దుకాణాన్ని నడుపుకోవడం, పన్నులు చెల్లించకుండా చట్టవిరు ద్ధంగా ఆటోరిక్షాలు నడుపుకోవడానికి పేదలకు స్థానిక తృణమూల్ నాయకులనుంచి మద్దతు లభిస్తోంది. అదేవిధంగా చట్టవిరుద్ధంగా మైక్రో ఎంటర్‌ప్రైజెస్‌లను నడుతున్న లక్షల సంఖ్యలో ప్రజలు కూడా తృణమూల్‌కు గట్టి మద్దతుదార్లుగా వున్నారు.
స్థానిక పార్టీగా బీజేపీకి గుర్తింపు లేదు
చాలామంది బెంగాలీ హిందువులు బీజేపీని బయటినుంచి వచ్చిన పార్టీగా పరిగణిస్తారు. బీజేపీ చేసుకున్న కొన్ని స్వయంకృతాపరాధాలు కూడా ఇందుకు కారణం. ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా తృణమూల్ కాంగ్రెస్, ప్రజల్లో బీజేపీకి వ్యతిరేకంగా విస్తృత ప్రచారం చేసింది. ముఖ్యంగా బీజేపీ ఉత్తరభారత్‌కు చెందిన పార్టీగా ఇక్కడి ప్రజలు పరిగణిస్తారు. తమకు బీజేపీకి ఎంత మాత్రం పొసగదన్న అభిప్రాయం దృఢంగా వుంది. ఇదే సమయంలో భాజపాకు రాష్ట్రంలో గట్టి సంస్థాగత బేస్ ఇంకా ఏర్పడలేదు. అటువంటి బేస్ ఏర్పడితే, ఓటర్లు ధైర్యంగా పోలింగ్ బూత్‌లకు వెళ్లి ఓటుహక్కును వినియోగించుకోగలుగుతారు. అరాచకానికి, హింసాత్మక రాజకీయాలకు పెట్టింది పేరుగా వున్న బెంగాల్‌లో ఏ రాజకీయ పార్టీ అయినా తన మద్దతుదార్లకు రక్షణ క ల్పించే స్థితిలో వుండాలి. బీజేపీకి అటువంటి సంస్థాగత బలం లేకపోవడంతో ఎంతోమంది హిందువులు పార్టీకి అనుకూలంగా ఉన్నప్పటికీ పోలింగ్ బూత్‌లకు రావడానికి భయపడుతున్నారు. అంతేకాదు బూత్ స్థాయిలో రిగ్గింగ్‌ను అడ్డుకునేందుకు అవసరమైన కార్యకర్తల బలం బీజేపీకి లేదు. ఇక పట్టణ ప్రాంత బెంగాలీలు ప్రత్యేకించి కోల్‌కతా నగరానికి చెందిన హిందువులు లెఫ్ట్ పార్టీలకు అనుకూలం. ఎప్పుడైతే కమ్యూనిస్టులు తెరమరుగైపోయారో వీరంతా తృణమూల్ కాం గ్రెస్ మద్దతుదార్లుగా మారిపోయారు. వీరు బీజేపీని మతతత్వ పార్టీగా విస్తృతంగా ప్రచారం చే స్తున్నారు. రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల్లో బెంగాలేతరుల జనాభా అధికం. వీరంతా తృణ మూల్ కాంగ్రెస్‌కే ఓటు వేస్తారు. ఇటువంటి బెంగాలేతర వర్గాలనుంచి ప్రముఖ నాయకులను ఆకర్షించడంలో బీజేపీ ఇంకా సఫలీకృతం కాలేదు. దీంతో పాటు వీరిని విస్మరించడం కూడా పార్టీకి ప్రతికూలతగా మారింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాలకు అనుకూలుడైన సమర్థ నాయకుడిని ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఏర్పడిరది. హిందువుల్లోని అన్ని వర్గాలను ఆకర్షించగలిగే ఛరిష్మా నాయకుడు లేకపోవడం పార్టీకి పెద్దలోటుగా మారింది. ఇన్ని కారణాల నేపథ్యంలో ముస్లింల బుజ్జగింపు రాజకీయాలు నడిపే పార్టీలకు హిందూ ఓటర్లు అనుకూలంగా వుండటంలో పెద్ద విశేషమేం లేదు. బలం వున్నవాడి వైపే వీరు మొగ్గు చూపుతున్నారు. ఇదే తృణమూల్‌కు లాభం.
-ప్రత్యేకంగా పెత్తనం చేయాలనుకొన్న వారు ఊగిసలాడుతున్నారు.
-మీడియా ప్రాపకం కోసం పాకులాడుతున్నారు.
-అతి విశ్వాసంతో రాజకీయాలను ఏలుదామనుకున్నారు.
-రాణించలేక చతికిలపడిపోతున్నారు.
-ఒంటరి పోరాటంలో అలసిపోయి పార్టీల పంచన చేరుతున్నారు.
-అక్కడ గుర్తింపు కోసం ఆరాపడుతున్నారు.
-నిన్నటిదాకా పోరాటం చేసిన వారి పంచన చేరిన వారు వున్నారు.
-రెండు తెలుగు రాష్ట్రాలలో ఇలాంటి వారున్నారు.
-ఉనికి కోసం తహతహలాడుతున్నారు.
-అధికారిగా వున్నప్పుడు ప్రజలకు దూరంగా వున్నారు.
-రిటైర్ అయ్యాక రాజకీయాలలో చేరి జనాన్ని ఉద్దరిస్తామంటారు.
-రాజకీయ పదవుల కోసం అర్రులు చాస్తున్నారు.
-సవాలు చేసిన పార్టీలు పంచన చేర్చుకునేందుకు రాయబారాలు చేస్తున్నారు.
-వున్న పేరును చెడగొట్డుకొని, విమర్శల పాలౌతున్నారు.
-రాజకీయ విశ్లేషకుల పాత్రలు పోషిస్తూ నిత్యం మీడియాలో వుంటున్నారు.
-ప్రతి సమస్య మీద ఏదో ఒక డిబేట్ లో పాల్గొంటున్నారు.
-ఎప్పటికైనా అవకాశాలు రాకపోతాయ అని ఎదురుచూస్తున్నారు.
హైదరాబాద్,నేటిధాత్రి:
ఉద్యోగులు ముదిరితే నాయకులౌతారంటే ఇదేనేమో! రాను రాను రాజకీయాల్లోకి ఉద్యోగులు పెద్దఎత్తున వచ్చే అవకాశాలుకూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగులుగా ఎడాపెడా సంపాదించి, తర్వాత వాటిని రాజకీయాల కోసం కొంత ఖర్చు చేసి, మరింత దోచుకునేందుకు మార్గం వేసుకునే వారు చాలా మంది క్యూలో వున్నట్లున్నారు. తొండ ముదిరితే ఊసరవెళ్లి అవుతుందన్నది ఎంత నిజమే ఉద్యోగులు నాయకులైతే కూడా అదే జరుగుతుంది. అంతకు మించి ప్రజలు కూడా వారి నుంచి ఏదీ ఆశించడం లేదు. నిజాయితీగా ఉద్యోగం చేసిన ఎంత పెద్ద అధికారులైనా ఇప్పటికీ సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాని కొంత మంది మాత్రమే రాజకీయాల్లో అడుగు పెడుతున్నారు. వాళ్లేమీ జీవితాలు త్యాగంచేసిన వారు కాదు. ఉద్యోగం చేసిన నాడు వారి జీతాల నుంచి జనానికి సేవ చేసిన వారు కాదు. కాని ఆగష్టు 15, జనవరి 26 నాడు పుటక్కున దేశ భక్తి పుట్టుకొచ్చి, జెండా వందనం అయిపోగానే చట్టుక్కున మర్చిపోయినట్లే వుంటుంది. ఉద్యోగం చేసినంత కాలం వారి జీవిత కాలం మొత్తం సామాన్యుడిని దగ్గర తీసుకున్న సందర్భాలే వుండవు. కాని అంతా అయిపోయాక రాజకీయాల్లోకి వచ్చే ముందుకు ఎవరూ చూడని, వినని ముచ్చట్లన్నీ చెప్పేస్తుంటారు. జనాన్ని నమ్మించే ప్రయత్నాలు చేస్తుంటారు. అలా రాజకీయాల్లోకి వచ్చిన వారిలో సక్సెస్ రేటు చాలా తక్కువ. ఇయితే ఇక్కడ కొన్ని విషయాలు స్పష్టంగా చెప్పుకోవాలి. తమకు తాము గొప్ప బలవంతులమని, అతి విశ్వాసానికి వెళ్లిన నాయకులెవరూ తెలుగు రాష్ట్రాలలో సక్సెస్ అయిన వారు లేరు. ముందుగా చెప్పుకోవాల్సిన నాయకుడు జయప్రకాశ్ నారాయణ్. ఏకంగా లోక్‌సత్తా అనేపార్టీ పెట్టారు. ఉద్యోగానికి రాజీనామా చేసి అవినీతి రహితసమాజ నిర్మాణం కోసం పోరాటం చేస్తానన్నాడు. ఉమ్మడి రాష్ట్ర్రంలో ఓ పదేళ్ల పాటు రాజకీయం చేశాడు. కాని ప్రజలు ఆదరించలేదు. పైగా ఆయనకు రాజకీయాలు చేసేంత సొమ్మెక్కడిది అని జనం ప్రశ్నించుకున్నారు. ఒక దశలో హైదరాబాద్ నగరమే కాదు, ఉమ్మడి రాష్ట్రంలోని అనేక నగరాల్లో లోకస్ సత్తాను ముందుగా విస్తరించాలని చూశారు. ఆ రోజుల్లో హైదరాబాద్‌తోపాటు, అనేక నగరాల్లో లోక్ సత్తా గురించి ఆయన చేసిన ప్రచారం కోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఆ సొమ్ము ఎక్కడిది? అన్న ప్రశ్న మొదలైంది. దాంతో అప్పటి నుంచి ఆయన పతనం కూడా మొదలైంది. ఏపి ప్రజలు ఆదరించలేదు. తెలంగాణ ప్రజలు దరి చేర్చుకోలేదు. తెలంగాణ ఉద్యమం మీద లేని పోని కిరికిరి పెట్టే ప్రయత్నం చేసి మొదటికే మోసం తెచ్చుకున్నాడు. 2009లో ఓసారి జనం నమ్మి చూద్దామని కూకట్ పల్లి నుంచి గెలిపించారు. కాని ఆయన నాయకుడిగా పనిచేయలేదు. అమెరికాలో రాజకీయం ఇలా వుంటుంది. లండన్‌లో ఇలా వుంటుంది. ఇక్కడ కూడా అదే అమలు చేద్దామన్నట్లు మాటలు చెప్పారు. ప్రజలకు దూరమయ్యారు. రేషన్ కార్డు కోసం మన దేశంలో నాయకుడికి దగ్గరకు వెళ్లడమే ప్రజలకు అలవాటు. అదే రివాజు. తర్వాత అదికారులకు అర్జీలు పెట్టుకుంటారు. ఇలాంటి సమయంలో రేషన్ కార్డు కావాలంటే రెవిన్యూ కార్యాలయానికి వెళ్లి ధరఖాస్తు చేసుకోవాలి. నా దగ్గరకు వస్తే నేనేం చేస్తా?అని అన్నట్లు వార్తలు వచ్చాయి. అంతే సామాన్యుడికి ఎంత దగ్గరగా వుంటే నాయకుడు అంత ప్రజల గుండెల్లో వుంటాడు. అధికారికి ప్రజలకు దూరం వుండడమే తెలుసు. డాబు, దస్కం చూపించడమే అలవాటు. అలాంటి వారు ప్రజలకు చేరువ కావడం అన్నది దుర్లభం. ఎంత మంది అదికారి అనే పేరున్నా, నేరుగా ప్రజలకు సేవ చేసే నాయకుడు కాలేదు. 1999 ఎన్నికల్లో చంద్రబాబు నాయకుడు తటస్ధులను రాజకీయాల్లోకి తీసుకొచ్చి, సరికొత్త రాజకీయం చూపిస్తానన్నాడు. ఎన్నికల్లో మాజీ సిబిఐ డైరెక్టర్ జనరల్‌గా పనిచేసిన విజయరామారావును ఖైరతాబాద్ నుంచి పోటీ చేయించారు. అలా మరి కొంత మందికి అవకాశాలు కల్పించారు. ఆ ఎన్నికల్లో వాళ్లంతాగెలిచారు. అందులో ఓ నలుగురికి కూడా మంత్రి పదవులు ఇచ్చారు. ఆ నలుగురు ఆ తర్వాత రాజకీయాలకు దూరమయ్యారు. ప్రజలకు గుర్తు కూడా లేరు. కాకపోతే ఒక్కసారైనా గెలిచారు. మంత్రి పదవులు కూడా అనుభవించారు. అలా ఒకపార్టీని నమ్ముకొని రాజకీయాలు చేసిన ఉద్యోగులు అంతో ఇంతో రాజకీయంగా కూడా రాణించారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ లాంటి వారు రాజకీయాలలో ఇప్పటికీ కీలకభూమిక పోషిస్తున్నారు. తొలి తెలంగాణ మండలి చైర్మన్‌గా పనిచేసిన స్వామీ గౌడ్ ఉద్యోగ సంఘ నాయకుడిగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. తర్వాత బిఆర్‌ఎస్‌లో చేరి ఎమ్మెల్సీ అయ్యారు. తెలంగాణ వచ్చిన తర్వాత తొలి మండలి సభకు చైర్మన్ అయ్యారు. మహబూబాబాద్ ఎమ్మెల్యేగా పనిచేసిన శంకర్ నాయక్ కూడా తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్నారు. తర్వాత మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. అలా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఎమ్మెల్సీ కోదండరాం రాజకీయాల్లోకి వచ్చారు. పార్టీ పెట్టారు. కాని ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయనే గెలవలేకపోయారు. బిఆర్‌ఎస్‌లో చేరి వుంటే ఎప్పుడో రాజకీయంగా మరో స్ధాయిలో వుండేవారు. కాని ఆయన వేసిన తప్పటడుగుల మూలంగా పార్టీ పెరిగింది లేదు. ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో గెలిచింది లేదు. కాకపోతే గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు తెలిపడంతో ఇటీవల ఎమ్మెల్సీ అయ్యారు. 2023 ఎన్నికల ముందు పోలీస్ ఉన్నతాధికారిగా పనిచేసిన ఆర్‌ఎస్. ప్రవీణ్ కుమార్ , తన ఉద్యోగానికి రాజీనామాచేసి రాజకీయాల్లోకి వచ్చారు. ఆయనను బిఆర్‌ఎస్ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. అయినా దాన్ని కాదనుకొని రాజకీయాల్లోకి వచ్చారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వంమీద తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. తానే స్వయంగా ఒక రాజకీయ పార్టీ పెట్టాలని అనుకున్నారు. కాని బిఎస్పీ పార్టీలో చేరి ఆ పార్టీ తెలంగాణ కన్వీనర్‌గా పనిచేశారు. గత ఎన్నికల్లో ఆయన కూడా పోటీ చేశారు. అప్పుడు గాని రాజకీయాలంటే ఏమిటో ఆయనకు అర్ధం కాలేదు. దాంతో బిఎస్పీని వదిలేసి బిఆర్‌ఎస్‌లో చేరారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం అదికారంలో వున్నప్పుడే ఆయన పార్టీలో చేరితే ఆయన రాజకీయం మరోలా వుండేది. కాని ఆయన అడుగడుగునా కేసిఆర్‌ను విమర్శిస్తూ వెళ్లారు. ఒక రకంగా బిఆర్‌ఎస్ ఓటమికి ఆయన కూడా నీటి బొట్టుగా మారారు. అప్పుడు కేసిఆర్‌ను తూర్పార పట్టిన ప్రవీణ్ కుమార్ ఇప్పుడు ఆకాశానికెత్తుకుంటున్నారు. అంటే ఉద్యోగులు కూడా అవకాశ వాద రాజకీయాలు చేయడానికి మాత్రమే వచ్చారని అర్దం చేసుకోవచ్చు. గతంలో కూడా ఉద్యోగులు కొంత మంది రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్‌లో చేరి పదవులు పొందిన వారున్నారు. వరంగల్ ఎంపిగా రెండు సార్లు గెలిచిన సిరిసిల్ల రాజయ్య ఒకప్పుడు ఉద్యోగం చేసిన వారే. ప్రస్తుత మహబూబాబాద్ ఎంపి బలరాం నాయక్ కూడా ఒకప్పుడు ఉద్యోగి. ఆయన గతంలో ఎంపిగా గెలిచి కేంద్రంలో మంత్రి పదవి నిర్వహించారు. ఈసారి మళ్లీ ఎంపిగా గెలిచారు. ఉమ్మడి రాష్ట్రంలో ఒక టీచర్‌గా పనిచేసిన స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, గత నాలుగు దశాబ్ధాలుగా రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తూ వస్తున్నారు. ఒకటి రెండు ఓటములు తప్ప ఆయన వరుస విజయాలు సాదిస్తూవచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో సుమారు 9 సంవత్సరాలపాటు మంత్రిగా పనిచేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత నాలుగేళ్లపాటు ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా కొనసాగుతూ వున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏపి మాజీ ముఖ్యమంత్రి జగన్ కేసును పర్యవేక్షించిన సిబిఐ. జాయింట్ డైరెక్టర్‌గా పనిచేసిన ఇంటిపేరు జేడిగా స్ధిరపర్చుకున్న లక్ష్మి నారాయణ రాజకీయాల్లో విజయాలు చవి చూడలేకపోతున్నారు. సొంతంగా పార్టీ పెట్టి చతికిలపడిపోయారు. కొన్ని పార్టీలు తిరిగి అక్కడ కూడా నెగల్లేక పోయారు. ఇప్పుడు రాజకీయాలపై యువత అవగాహన కార్యాక్రమాలు చేపడుతున్నారు. మీడియాలో విశ్లేషకులుగా పనిచేస్తున్నారు. ఎంతో సమర్ధవంతమైన అధికారిగా ఆయనకు వున్న పేరును రాజకీయాల్లోకి వచ్చి చెడగొట్టుకున్నారు. ప్రజల్లో వున్న గుర్తింపు తనకు తానే చెరిపేసుకున్నారు. ఒకప్పుడు ఆయన మాట కోసం మీడియా ఎగబడిపోతుండేది. ఇప్పుడు తన మాటలు చెప్పడంకోసం మీడియా సంస్దల చుట్టూ లక్ష్మినారాయణ తిరగాల్సి వస్తుంది. ఉద్యోగం చేసినప్పుడు ఆయన ప్రజలకు ఏంసేవ చేశారో లేదోగాని, రాజకీయాల్లోకి వచ్చి సేవ చేద్దామనుకుంటు ప్రజలు స్వాగతించలేదు. ఇక పెద్దఎత్తున అవినీతి ఆరోపణలు ఎదుర్కొన వారు కూడా రాజకీయాల్లోకి వచ్చారు. రాణించాలని కూడా చూస్తున్నారు. వారిపై మరో ప్రత్యేక కధనం త్వరలో…
జిల్లావైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం లో పి.సి.పి.ఎన్.డి.టి సమావేశం
సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):
ఈరోజు సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్. రజిత ఆధ్వర్యంలో పి.సి.పి.ఎన్.డి.టి జిల్లా అడ్వైజరీ కమిటీ సమావేశం ఏర్పాటు చేయనైనది. ఈ కమిటీ సమావేశంలో జిల్లాలో పి.సి.పి.ఎన్.డి.టి నిబంధనలు వ్యతిరేకంగా నిర్వహించే స్కానింగ్ సెంటర్లను, లింగ నిర్ధారణ తెలియజేసే స్కానింగ్ సెంటర్లను సీజ్ చేయడంతో పాటు చట్ట ప్రకారము మూడు సంవత్సరాల జైలు శిక్షతోపాటు10,000 రూపాయల జరిమానా విధిస్తామని గైనకాలజిస్ట్ డాక్టర్లకు, రేడియాలజిస్ట్లకు, స్కానింగ్ సెంటర్ నిర్వాహకులకు ఈ సందర్భంగా సూచించినారు. ఈ కమిటీ సమావేశంలో పి.సి.పి.ఎన్.డి.టి ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అంజలి ఆల్ఫ్రెడ్, ఎన్జీవో ప్రెసిడెంట్ చింతూరు భాస్కర్, లీగల్ అడ్వైజర్ శాంతి శుక్ల, ఎన్జీవో కమిటీ సభ్యురాలు ఝాన్సీ లక్ష్మి, డిప్యూటీ డెమో రాజ్ కుమార్, హెచ్. ఇ.బాలయ్య, డి.ఇ.ఓ మహేష్ పాల్గొన్నారు.
ఆదివాసీల అంతం కోసమే కేంద్ర ప్రభుత్వ కుట్ర ఆపరేషన్ కగార్ ను నిలిపి వేయాలి.
తుడుందెబ్బ డిమాండ్.
కొత్తగూడ, నేటిధాత్రి:
ఆదివాసీ ల భూభాగం లోని అడవి బిడ్డల కాళ్ళ కింద ఉండబడిన వనరులను,విలువైన ఖనిజ సంపదను కార్పొరేట్ కంపెనీలకు దోచి పెట్టేందుకు,సిద్దపడి బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం ఆదివాసుల ఆవాస నివాస ప్రాంతం లోకి మిల్టరీ,సి ఆర్ పి యఫ్,కొబ్రా,బ్లాక్ కామోండో బాలగాలను దించి ఆదివాసీల స్వేచ్ఛకు భంగం వాటిల్లే విధంగా,ఇష్టా రాజ్యాంగ ఆదివాసీల పై ఉచ్చకోత కోస్తుందని, పౌర హక్కుల ను కాలరాస్తూ, అల్లకల్లోలం సృష్టిస్తూ ఆదివాసీలని అంతం చేయాలనే కుయుక్తులు పన్నుతుందని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ దమణ కాండను ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ తీవ్రంగా ఖండిస్తుందని, ఆదివాసుల పై వనరుల దోపిడీ కోసం జరుగుతున్న దుచర్యలను యావత్ పౌర సమాజం ముక్తాఖంఠం తో వ్యతిరేకించి ఆపరేష్ కగార్ ను నిల్పివేసే వరకు తమ నిరసన ను తెలిపాలని కర్రే గుట్టలనుండి సాయుధ బలగాలను వెంటనే వెనుకకు రప్పించెందు కు హక్కుల సంఘాలు,బిజేపేతర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం పై పోరాటాలు చేయాలని ఈ రోజు కొత్తగూడ గ్రామ పంచాయితీ ఆవరణములో మండల అధ్యక్షులు ఈక విజయ్ అధ్యక్షతన జరిగిన కగార్ వ్యతిక సమావేశం లో జిల్లా అధ్యక్షలు కుంజ నర్సింగరావు డిమాండ్ చేశారు సమావేశం లో పూనెం సురేందర్,ఈక సాంబయ్య,సిద్దబోయిన లక్ష్మీ నారాయణ,బంగారు సారంగా పాణి,భూపతి రమేష్ లు పాల్గొన్నారు.
కొత్తగూడ మండలం కార్ల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కల్తీ నరసయ్య గారి అమ్మగారు ఇటీవల కాలం చేశారు వారి యొక్క దశదినకర్మలకు కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు వజ్జ సారయ్య, గారి ఆధ్వర్యంలో మంగళవారం రోజు దశదినకర్మలకు హాజరై వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు కల్తీ నరసయ్య గారిని ఓదార్పు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారి వెంట కాంగ్రెస్ పార్టీ బ్లాక్ ప్రెసిడెంట్ మొగిలి గ్రామ పార్టీ అధ్యక్షులు ఇర్ప వెంకన్న, మాజీ సర్పంచ్ మండల అధికార ప్రతినిధి ఇర్పరాజేశ్వర్, మాజీ వైస్ ఎంపీపీ కాడబోయిన జంపయ్య, సోలం వెంకన్న, కాంగ్రెస్ గ్రామ కమిటీ నాయకులు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు..
ఆదివాసి సంక్షేమ పరిషత్ మండలం అధ్యక్షులు తూర్స, క్రిష్ణ బాబు.
నూగూర్ వెంకటాపురం
(నేటి ధాత్రి ):
మంగళవారం నాడు వెంకటాపురం ఆదివాసి సంక్షేమ పరిషత్ వెంకటాపురం ఉపాధ్యక్షుడు తాటి రాంబాబు అధ్యక్షనలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం ఆదివాసి సంక్షేమ పరిషత్ వెంకటాపురం మండల అధ్యక్షులు తుర్స కృష్ణ బాబు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతాలలో ఆదివాసీల రక్షణకై ఏర్పాటు చేసిన చట్టాలను నిర్వీర్యం చేస్తూ ఏజెన్సీలో గిరిజనేతరులకు అన్ని విధాలుగా హక్కులు కల్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదవ షెడ్యూల్ భూభాగంలో పనిచేస్తున్న వంటి ప్రభుత్వ అధికారులు కూడా గిరిజన ఇతరులకు అనుకూలంగా వ్యవహరించడం వల్లనే ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనేతరులకు హక్కులు కావాలని సుప్రీంకోర్టులో కేసులు వేసి ఆదివాసుల పొట్టలు కొడుతూ G.O.Ms no.3 ని కాజేశారని మండిపడ్డారు. జీ.ఓ.ఎంఎస్. నెం. 3ను మినీ అసెంబ్లీ అయినటువంటి ట్రైబల్ అడ్వైయిజరీ కమిటీలో మరియు అసెంబ్లీలో తీర్మానం చేసి చట్టంగా మార్చాలని డిమాండ్ చేశారు. 5వ షెడ్యూల్డ్ ప్రాంతాల చట్టాలను పరిరక్షించుటకై 5 మే 2025 న ములుగు జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదివాసి ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తాటి నాగరాజు, బొగ్గుల రాజ్ కుమార్, బొగ్గుల ప్రశాంత్, గట్టుపల్లి సంజయ్, పూణేం అర్జున్, తాటి నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ తూర్పులో జరుగుతున్న భూ భారతి చట్టం అవగాహన సదస్సులో, ఒక పేద మహిళ రైతు, తన సమస్య చెప్పుకోవడానికి వేదిక పక్కన వేచి ఉండడంతో, అది గమనించిన మంత్రి పొంగులేటి, సదరు మహిళను స్టేజ్ మీదకు పిలిచి, తన పక్కన కూర్చోబెట్టుకొని, మహిళా సమస్యను విని, సానుకూలంగా స్పందించి, వెంటనే అధికారులకు ఆమె సమస్య పరిష్కారం చేయాలని ఆదేశించారు. ఇది చూసిన వారందరూ మంత్రిని అభినందించారు. పేద వాళ్లకు అండగా ఇందిరమ్మ ప్రభుత్వం ఉంటుందని మంత్రి పొంగులేటి వరంగల్ లో మరోసారి నిరూపించారు..
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.