నర్సాపూర్ ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన.

నర్సాపూర్ ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం నర్సాపూర్ గ్రామంలో శుక్రవారం పేదలకు గ్రామపంచాయతీ సెక్రెటరీ వెంకటేశం ఆధ్వర్యంలో ఇళ్లకు ముగ్గులు వేసి ప్రొసిడింగ్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సురేష్ మాజీ ఉప్పు సర్పంచ్ గోపాల్, మల్లన్న నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బాల కార్మికుల సంకెళ్లని తెంచుదాం..

బాల కార్మికుల సంకెళ్లని తెంచుదాం.. ప్రభుత్వానికి ఫిర్యాదు చేద్దాం..

మందమర్రి నేటి ధాత్రి

 

 

 

 

బాల కార్మికుల సంకెళ్లని తెంచుదాం.. ప్రభుత్వానికి ఫిర్యాదు చేద్దాం.. అనే నినాదంతో కూడిన కరపత్రాల ద్వారా ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం పై సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ సభ్యులు పట్టణ కూడలిలో అవగాహన కల్పించారు.అనంతరం సంఘం అధ్యక్షుడు, అడ్వకేట్ రాజలింగు మోతె మాట్లాడారు.
బాలలు, బాలకార్మిక వ్యవస్థలో మగ్గిపోతే, దేశ భవిష్యత్తు అంధకారమవుతుందన్నారు. అందుకే బాలలకు తగిన విద్యాభ్యాసం, శిక్షణ అందించి విలువైన మానవ వనరులుగా తీర్చిదిద్దాలన్నారు.
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనను ప్రభుత్వంతో పాటు సమాజం కూడా బాధ్యతగా గుర్తించాలన్నారు..వ్యవసాయ సంస్కరణలు, ఉపాధి కల్పన పథకాలు, పేదల్లో సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించటం, అవ్యవస్థీకృత రంగాలను ప్రోత్సహించటం, సహకార సంఘాల ఏర్పాటు, సాంఘిక భద్రతా పథకాల రూపకల్పన వంటి చర్యలు పరోక్షంగా బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఉపయోగపడతాయన్నారు. అందువల్ల ప్రభుత్వం వీటిపై ప్రత్యేకంగా దృష్టిసారించాలన్నారు. బాలలను కార్మికులుగా మార్చే హక్కు ఎవరికీ లేదని, బాలలను కార్మికులుగా మార్చిన వారిపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి, వారి సంకెళ్ళను తెంచే బాధ్యత మనందరిపై ఉందన్నారు.కార్యక్రమంలో సంఘం రాష్ట్ర నాయకుడు, సైకాలజిస్ట్ డా. అంబాల సమ్మయ్య, సభ్యులు రాజు, సాయి తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలలను ఆదరించాలి.

ప్రభుత్వ పాఠశాలలను ఆదరించాలి

గుండెపుడి, రాంపురం పాఠశాల లో సామూహిక అక్షరాభ్యాసం.

మరిపెడ నేటిధాత్రి:

విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రతియేటా నిర్వహించే ప్రొఫెసర్ జయ శంకర్ బడిబాట కార్య క్రమాన్ని 2025 – 26 విద్యా సంవత్సరానికి ఈ నెల జూన్ 6 – 19వ తేదీ వరకు మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ ఆదేశాలతో నిర్వహిస్తున్నట్లు మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో ని రాంపురం ప్రాథమిక పాఠశాల లో ప్రధానోపాధ్యాయుడు గుర్రం వెంకన్న గౌడ్, గుండెపుడి ప్రాథమిక పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నామ చేతుల మీదుగా సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల సంఖ్య పెంచేందుకు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య లభిస్తుందని ఉచిత పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులతో పాటు నోట్ బుక్స్,మధ్యాహ్న భోజనం ఉంటుందన్నారు, పేద మధ్య తరగతి పిల్లలకు భారం కాకూడదు అనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాల లను బలోపేతం చేస్తుందన్నారు,సర్కారు బడుల్లోని వసతులు, నాణ్యమైన బోధనను ప్రజలకు వివరించరు. విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు,అమ్మ ఆదర్శ కమిటీలు ప్రత్యేక చొరవ చూపాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నామ, ఉపాధ్యాయులు నివేదిత, దోమల లింగన్న గౌడ్,మురళి, సునీత,మాధవి, రాంపురం పాఠశాల ఉపాధ్యాయులు లక్ష్మయ్య,రాజేశ్వరి, క్రాంతి గణేష్, గ్రామ పెద్దలు, బందు పరశురాములు, బందు వీరన్న, ఎడ్ల ఉపేందర్, ఆశా వర్కర్లు బందు మంజుల, మమత, చింతపల్లి ఉమా,తదితరులు పాల్గొన్నారు.

ఓసీలకు ఉత్తమ శాఖలు..!

ఓసీలకు ఉత్తమ శాఖలు..!

-బీసీలకు ఉత్తుత్తి శాఖలు..!!

-17 శాతం ఉన్న అగ్రవర్ణాలకు 7 మంత్రి పదవులు

-86 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు 8 మంత్రి పదవులా..!

-ఇదెక్కడి సామాజిక న్యాయం

-బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

 

 

 

రాష్ట్ర మంత్రివర్గంలో ఓసీలకు ఉత్తమ శాఖలను కేటాయించి..బీసీలకు ఉత్తిత్తి శాఖలను కేటాయించడం దేనికి నిదర్శనమని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సామాజిక న్యాయం పాటిస్తామని చెప్పిన రాహుల్ గాంధీ మాటలకు విలువ లేదా? అని ఆయన కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ఘాటుగా ప్రశ్నించారు. రాష్ట్ర జనాభాలో 17 శాతం ఉన్న అగ్రవర్ణాలకు అత్యంత కీలకమైన..బడ్జెట్ ఉన్న 7 మంత్రి పదవులను కేటాయించి..86 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రాధాన్యత లేని..బడ్జెట్ లేని 8 మంత్రి పదవులను కేటాయించడం ఇదెక్కడి సామాజిక న్యాయమంటూ నిలదీశారు. ఎన్నికల ముందు కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తామని చెప్పి అధికారంలోకి రాగానే అందుకనుగుణంగా రాష్ట్రంలో కులగణన చేపట్టి..రాష్ట్ర అసెంబ్లీలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ..చట్టాన్ని చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో మాత్రం సామాజిక న్యాయం పాటించడం లేదని విమర్శించారు. మిగిలి ఉన్న మిగతా 3 మంత్రి పదవులను బీసీలకు కేటాయించాలని, అదేవిధంగా మంత్రివర్గంలో మార్పులు చేసి ప్రాధాన్యత కలిగిన పదవులను బీసీలకు కేటాయించాలని వేముల మహేందర్ గౌడ్ డిమాండ్ చేశారు.

డ్రాయింగ్ టీచర్ పోస్టు పెట్టాలి.

డ్రాయింగ్ టీచర్ పోస్టు పెట్టాలి…

మందమర్రి నేటి ధాత్రి:

 

మందమర్రి సింగరేణి పాఠశాల కళ్యాణి ఖని లో చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు ఆర్ట్ డ్రాయింగ్ టీచర్ పోస్టు పెట్టాలని కార్మికులు విద్యార్థులు కోరుతున్నారు. డ్రాయింగ్ మాస్టర్ లేక విద్యార్థులు వారి నైపుణ్యాన్ని కోల్పోతున్నారని సింగరేణి ప్రాంతంలో 9 సింగరేణి పాఠశాలలు ఉండగా ఒక్క పాఠశాలలోనే డ్రాయింగ్ టీచర్ కొనసాగుతున్నాడు. ఆ ఉపాధ్యాయుడు కూడా త్వరలో కొద్ది నెలలో రిటైర్డ్ కాబోతున్నాడని సింగరేణి పాఠశాలలో డ్రాయింగ్ టీచర్ ఉపాధ్యాయులను నియమించాలని కార్మికులు విద్యార్థులు కోరుతున్నారు. సింగరేణి కోల్ బెల్టు ప్రాంతమైన కొత్తగూడెం మణుగూరు ఇల్లందు భూపాలపల్లి గోదావరిఖని సెక్టార్ 2 సీసీసి మందమర్రి గోలేటి లో డ్రాయింగ్ టీచర్ లేక విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని వారు న్యూస్ టుడే కు ఆవేదన చెప్పారు. ఎన్ ఈ పి నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ ప్రకారం విద్యార్థులకుబోధనతోపాటుసృజనాత్మకత విద్యను అందించుటకు చాలా దోహదపడుతుందిని డ్రాయింగ్ టీచర్లను నియమించాల్సిందిగా సింగరేణి ఎడ్యుకేషనల్ సొసైటీ సెక్రటరీకి విద్యార్థుల తల్లిదండ్రులు విన్నపం చేస్తున్నారు. సింగరేణి పాఠశాలలో ఎన్నోమార్పులు తీసుకొచ్చిన సెక్రెటరీ విద్యార్థులు నైపుణ్యాన్ని మెరుగుపరచడం కోసం డ్రాయింగ్ పోస్టును నియమించాలని సింగరేణి కార్మికులు విద్యార్థులు కోరుతున్నారన్నారు.

మందమర్రిలో అమ్మ మాట – అంగన్వాడి బాట.

మందమర్రిలో అమ్మ మాట – అంగన్వాడి బాట

మందమర్రి నేటి ధాత్రి

 

 

 

 

అంగన్వాడీ కేంద్రాలు పిల్లల భవితకు పునాదులు

మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని విద్యానగర్ సెక్టర్ లో గల మందమర్రి నాలుగవ కేంద్రం,ఒకటవ జోన్ లోని మూడవ కేంద్రంలోని అంగన్వాడి కేంద్రాలలో అంగన్వాడి బడిబాట కార్యక్రమాన్ని గురువారం రోజు పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా సంక్షేమ అధికారి, సిడిపిఓ హాజరు కావడం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా బడిబాట ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం అంగన్వాడీ లో నూతనంగా చేరిన పిల్లలకు అక్షరాభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ రెండున్నర సంవత్సరాల పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని, అంగన్వాడీ కేంద్రాలు అమ్మ ఒడిలాంటివి అని, పిల్లల భవిష్యత్తుకు పునాదులు లాంటివని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల టి డబ్ల్యూ ఓ రోఫ్ ఖాన్, సిడిపిఓ విజయలక్ష్మి, సూపర్వైజర్ సరిత, అంగన్వాడి టీచర్లు, ఆయమ్మలు, పిల్లల తల్లితండ్రులు పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య.

— ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య
• సామూహిక అక్షరాభ్యాసంలో పాల్గొన్న డీఈవో రాధా కిషన్

నిజాంపేట: నేటి ధాత్రి

 

 

 

 

ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య లభిస్తుందని జిల్లా విద్యాధికారి రాధా కిషన్ పేర్కొన్నారు. ఈ మేరకు మండలంలోని చల్మెడ గ్రామంలో శుక్రవారం సామూహిక అక్షరాభ్యాసంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ప్రైవేట్ పాఠశాల కంటే ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య లభిస్తుందని విద్యార్థులకు పౌష్టిక ఆహారాన్ని కూడా ప్రభుత్వమే అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలలో కూడా ప్రోత్సాహం ప్రభుత్వ పాఠశాలలోనే లభిస్తుందని ఆయన కొనియాడారు. ప్రజా ప్రతినిధులు, ఉపాధ్యాయులతో కలిసి ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులు వచ్చే విధంగా చూడాలన్నారు. పాఠశాలలో విద్యా ప్రమాణాలను పెంచాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి సంఘాన్ని యాదగిరి, గ్రామ కార్యదర్శి వెంకట నరసింహారెడ్డి, ప్రధానోపాధ్యాయులు సతీష్ కుమార్, ఉపాధ్యాయులు నవీన్ రత్నాకర్, మోహన్, మమత, జ్యోతిలక్ష్మి ఉన్నారు.

ఓటీటీకి వ‌చ్చేసిన‌.. కేసరి ఛాప్ట‌ర్2!

ఓటీటీకి వ‌చ్చేసిన‌.. కేసరి ఛాప్ట‌ర్2!

డ‌య్య‌ర్‌ను.. ఢీకోట్టిన‌ శంకరన్‌ నాయర్ స్టోరి

 

 

 

రెండు నెల‌ల క్రితం ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి మంచి విజ‌యం సాధించిన బాలీవుడ్ చిత్రం కేసరి ఛాప్ట‌ర్ 2

రెండు నెల‌ల క్రితం ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి మంచి విజ‌యం సాధించిన బాలీవుడ్ చిత్రం కేసరి ఛాప్ట‌ర్ 2 (Kesari Chapter 2).

అక్ష‌య్ కుమార్ (Akshay Kumar), మాద‌వ‌న్ (R. Madhavan), అన‌న్యా పాండే Ananya Panday) కీల‌క పాత్ర‌ల్లో న‌టించగా క‌ర‌ణ్ త్యాగ్ (Karan Singh Tyagi) ర‌చన‌, ద‌ర్శ‌క‌త్వం చేశారు.

ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ (Dharma Productions) బ్యాన‌ర్‌పై క‌ర‌ణ్ జోహార్ (Karan Johar) మ‌రో ఇద్ద‌రు నిర్మాత‌ల‌తో క‌లిసి నిర్మించారు.

హిస్టారిక‌ల్ కోర్ట్ రూ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం సుమారు 50 రోజుల త‌ర్వాత‌ డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది.

క‌థ విష‌యానికి వస్తే..

1919లోబ్రిటీష్ హాయాంలో జ‌రిగిన దారుణ మార‌ణ‌ కాండ‌ జ‌లియ‌న్ వాలా బాగ్‌కు మూల కార‌కుడైన అప్ప‌టి పంజాబ్ జ‌న‌ర‌ల్ మైఖైల్ ఓ డ్వేయ‌ర్ ఆ వార్త బ‌య‌టి ప్ర‌పంచానికి తెలియ‌కుండా చేస్తాడు.

ఆపై త‌మ‌కు అనుకూలంగా రిపోర్టు ఇవ్వాల‌ని ఆ స‌మ‌యంలో వైస్రాయ్‌ కౌన్సిల్‌లో సభ్యుడైన‌ అడ్వ‌కేట్ శంకరన్‌ నాయర్‌ (అక్షయ్‌ కుమార్‌)ను డ్వేయ‌ర్ కోరుతాడు.

కానీ ఆక్క‌డ జ‌రిగిన మార‌ణ‌కాండ విష‌యం తెలుసుకున్న ఆయ‌న అందుకు స‌సేమిరా అని అక్క‌డిక్క‌డే త‌న ప‌ద‌వికి సైతం రాజీనామా చేసి డ‌య్య‌ర్‌పైనే కేసు వేస్తాడు.

 

Kesari Chapter 2

 

దీంతో జ‌న‌ర‌ల్ మ‌రో ప్ర‌ముఖ అడ్వ‌కేట్‌ నెవిల్లే మెక్‌కిన్లే (ఆర్‌.మాధవన్‌)ని ఆశ్ర‌యించ‌డంతో కేసు ర‌స‌వ‌త్త‌రంగా మారుతుంది.

ఈ క్ర‌మంలో శంక‌ర్ నాయ‌ర్‌, మెక్‌కిన్లేల మ‌ధ్య ఎలాంటి వాద‌న‌లు జ‌రిగాయి, నాటి దురాగ‌తాన్ని ఎలా బాహ్య ప్ర‌పంచానికి తెలియ‌జేశారు.

చివ‌ర‌కు క‌థ ఎన్ని మ‌లుపులు తిరిగిందనే క‌థ‌క‌థ‌నాల చుట్టూ సినిమా సాగుతూ నాటి జ‌లియ‌న్ వాలాబాగ్ దుర్ఘ‌ట‌న‌ను త‌లుచుకుని ఎమోష‌న‌ల్‌గా ఫీల‌య్యే విధంగా మూవీ న‌డుస్తుంది.

ఇప్పుడీ చిత్రం జూన్ 13 శుక్ర‌వారం నుంచి జియో హాట్‌స్టార్ (Jio Hotstar) ఓటీటీలో హిందీతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

ఇప్ప‌టికే థియేట‌ర్ల‌లో ఈ సినిమా చూడ‌లేక పోయిన వారు, మల్లీ చూడాల‌నుకునే వారు ఇప్పుడు ఎలాంటి స‌మ‌స్య లేకుండా ఇంటి ప‌ట్టునే ఉంటూ ఫ్యామిలీతో క‌లిసి ముఖ్యంగా పిల్ల‌ల‌కు నాటి జ‌లియ‌న్ వాలా బాగ్‌ ఘ‌ట‌న‌ను తెలియ‌జేస్తూ మూవీ వీక్షించ‌వ‌చ్చు.

డోంట్ మిస్ ఇట్‌.

రెవెన్యూ సదస్సులో భూ సమస్యలకు పరిష్కారం.

రెవెన్యూ సదస్సులో భూ సమస్యలకు పరిష్కారం

వరంగల్ తహశీల్దార్ మహ్మద్ ఇక్బాల్.

వరంగల్ నేటిధాత్రి:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టం ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని 12వ డివిజన్ కార్పొరేటర్ కావటి కవిత రాజు యాదవ్ అన్నారు. దేశాయిపేట షాదిఖానాలో రెవెన్యూ సదస్సు కార్యక్రమానికి వరంగల్ మండల తహసిల్దార్ మహమ్మద్ ఇక్బాల్ తో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించిన కార్పొరేటర్ కవిత మాట్లాడుతూ భూముల్లో ఏవైనా సమస్యలు ఉంటే రెవెన్యూ పరంగా కొలతల్లో పాస్ పుస్తకాల్లో సమస్యలు ఏమైనా ఉత్పన్నమైతే వాటిని పరిష్కరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పథకం భూమి సమస్యలు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని సమస్యలు పరిష్కరించుకోవాలని అన్నారు.

వరంగల్ మండల తహసిల్దార్ మహ్మద్ ఇక్బాల్ మాట్లాడుతూ ప్రజలు భూ సమస్యల మీద కార్యాలయాల చుట్టు తిరుగుతున్న క్రమంలో అధికారులు ఒక్కోసారి అందుబాటులో లేకపోవడం వాళ్ళు వెనుక తిరగడం జరిగేదని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న భూభారతి చట్టం ద్వారా సమస్యలు ఉన్నచోటకే అధికారులు వెళ్లి గ్రామ సభలు నిర్వహించి రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ సమస్యలు పరిష్కరించడం సమస్య ఎదుర్కొంటున్న వారికి ఇదొక మంచి అవకాశం అని దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని భూ సమస్యలు పరిష్కారం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్వేయర్లు రెవెన్యూ సిబ్బంది పాల్గొనగా బాధితులు దరఖాస్తులు సమర్పించుకున్నారు.

భూ భారతి రెవెన్యూ అవగాహన సదస్సు.

భూ భారతి రెవెన్యూ అవగాహన సదస్సు

తహసీల్దార్ శ్రీనివాసులు

భూపాలపల్లి నేటిధాత్రి:

 

మున్సిపాలిటీ పరిధిలో జంగేడు కాసింపల్లి లో భూ భారతి అవగాహన సదస్సు నిర్వహించిన భూపాలపల్లి తహసీల్దార్ వి శ్రీనివాసులు డిప్యూటీ తాసిల్దార్ అంజలి రెడ్డి అనంతరం భూ భారతి దరఖాస్తులు స్వీకరించారు.ఈ సందర్భంగా తాసిల్దార్ శ్రీనివాస్ మాట్లాడుతూ భూ సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. భూ రికార్డుల్లో పేర్లు తప్పులు విస్తీర్ణం హెచ్చు తగ్గులు, వారసత్వ భూములు భూ స్వభావం తప్పులు, నిషేదిత జాబితాలో ఉన్న
భూ సమస్యలు, సర్వే నంబర్ మిస్సింగ్, పట్టా పాసు బు క్కులు లేకపోవడం, ప్రభుత్వ భూములను నవీకరించడం, సాదా బైనామా కేసులు, హద్దుల నిర్ధారణ, పార్ట్ బి లో చేర్చిన భూముల సమస్యలు, భూ సేకరణ కేసులు తదితర భూ సమస్యలకు సంబందించిన దరఖాస్తులు సదస్సులో స్వీకరించి భూ భారతి కొత్త చట్టం ప్రకారం అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ ప్రక్రియ పూర్తి చేస్తా మని అన్నారు. దరఖాస్తుల స్వీకరణ పూర్తైన క్షేత్రస్థాయి పరిశీలన ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ అంజలీ రెడ్డి, రెవెన్యూ ఆర్ ఐ రామస్వామి సర్వేర్ శ్రీనివాస్ రావు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

ముందే ఓటీటీకి వ‌చ్చి షాకిచ్చిన‌ లేటెస్ట్‌ స్పొర్ట్స్‌ కామెడీ మూవీ.

ముందే ఓటీటీకి వ‌చ్చి షాకిచ్చిన‌ లేటెస్ట్‌ స్పొర్ట్స్‌ కామెడీ మూవీ…

 

ప్రేమ‌లు హీరో నస్లెన్ మ‌రో ముగ్గురు యువ న‌టులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించ‌గా థియేట‌ర్లలో మంచి విజ‌యం సాధించిన మ‌ల‌యాళ అనువాద చిత్రం ఓ రోజు ముందే ఓటీటీకి వ‌చ్చి షాకిచ్చింది.

ప్రేమ‌లు హీరో నస్లెన్ (Naslen) మ‌రో ముగ్గురు యువ న‌టులు కీల‌క పాత్ర‌ల్లో ఏప్రిల్ నెలాఖ‌రున థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి మంచి పాజిటివ్ టాక్‌తో విజ‌యం సాధించిన మ‌ల‌యాళ అనువాద చిత్రం అలప్పుజ జింఖానా (Alappuzha Gymkhana). తెలుగు క‌న్నా ముందే ఏప్రిల్ 10న కేర‌ళ‌లో రిలీజైన ఈ మూవీ బ్లాక్‌బ‌స్ట‌ర్ స‌క్సెస్ సొంతం చేసుకుంది. గ‌తంలో టొవినో థామ‌స్‌, క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శన్‌ కాంబోలో త‌ల్లుమాల (Thallumaala) అనే సినిమాతో కేర‌ళ‌ను షేక్ చేసిన ఖ‌లీద్ ర‌హ‌మాన్ (Khalid Rahman) ఈ చిత్రాన్ని నిర్మించి, ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం విశేషం. కేవ‌లం రూ.5 కోట్ల బ‌డ్జెట్‌తో నిర్మిత‌మైన ఈ చిత్రం రూ. 70 కోట్ల వ‌ర‌కు వ‌సూళ్లు చేసి కేర‌ళ‌ నాట‌ హ‌య్యెస్ట్ గ్రాసింగ్ చిత్రాల్లో టాప్5లో నిలిచింది. సుమారు 55 రోజుల త‌ర్వాత ముంద‌స్తుగా ప్ర‌క‌టించిన డేట్ క‌న్నా ఓ రోజు ఎర్లీగానే ఈ చిత్రం డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చి షాకిచ్చింది.
సినిమా టికెట్లు

క‌థ విష‌యానికి వ‌స్తే.. జోజో జాన్సన్ (నెస్లన్), డీజే, చిరుత‌, పెద్దోడు, చిన్నోడు, సెహ‌నావాస్ ఐదుగురు చిన్న‌ప్ప‌టి నుంచి స్నేహితులు. అయితే ఇంట‌ర్ ఫలితాల్లో ఒక‌రు మాత్ర‌మే పాస్ అవుతారు.ఇక రెగ్యుల‌ర్‌గా కాలేజికి వెళ్లి చ‌దువుకోవ‌డం మ‌న వ‌ళ్ల‌ కానీ ప‌ని అని డిసైడ్ అయి కొత్త‌గా ఏదైనా ట్రై చేయాల‌ని నిర్ణ‌యించుకుంటారు. అందుకోసం బాక్సింగ్ పోటీల్లో పాల్గొని స్పోర్ట్స్ కోటాలో కాలేజీలో పాస్ మార్కుల‌తో బ‌య‌ట ప‌డొచ్చ‌ని ఫ్లాన్ చేస్తారు. ఈక్ర‌మంలో స‌మీపంలోని జింఖానా బాక్సింగ్ ఆకాడ‌మీలో శిక్ష‌ణ‌ కోసం చేరుతారు. ఈ నేప‌థ్యంలో ట్రైనింగ్ తీసుకునే క్ర‌మంలో వారు ఆ ప‌ని స‌రిగ్గా చేయ‌లేక, సీరియ‌స్‌నెస్ లేక‌ బాక్సింగ్‌ కోచ్ ముందు, అమ్మాయిల ఎదుట‌ చేసే విన్యాసాలు, జిమ్మిక్కులు ఆపై డిస్ట్రిక్‌ లెవ‌ల్‌, స్టేట్ లెవ‌ల్ టోర్న‌మెంట్స్ ఆడాల్సి రావ‌డంతో చివ‌ర‌కు ఆ కుర్రాళ్లు ఏం చేశారు, చివ‌ర‌కు ఎలా ముగించార‌నే ఆస‌క్తిక‌ర క‌థ‌క‌థ‌నాల‌తో సినిమా సాగుతుంది.

 

కాగా ఈ చిత్రం ఆరంభం నుంచి చివ‌రి వ‌ర‌కు ఫుల్ ఫ‌న్ మోడ్‌లోనే సాగుతూ ప్రేక్ష‌కుల‌కు తీరిక ఇవ్వ‌ని వినోదంతో ఆక‌ట్టుకుంటుంది. అయితే మూవీలో ఫ‌లానా వాడు హీరో అని చెప్ప‌లేం. న‌స్లైన్ త‌ప్ప అంద‌రూ మ‌న‌కు ఏమాత్రం ప‌రిచ‌యం లేని మొహాలే అయినా ఐదుగురి పాత్ర‌ల‌కు స‌మ ప్రాధాన్య‌త ఉంటుంది. వారి చుట్టే క‌థ తిరుగుతూ వారి న‌ట‌న‌, డైలాగులు, వ‌న్ లైనర్స్ వాటినన్నింటినీ మ‌రిచి పోయేలా చేస్తుంది. మూవీ స్టార్ట్ అయిన నిమిషం నుంచే పంచులు, తెలుగు ఫేమ‌స్ మీమ్స్ అలేఖ్య ఫికిల్స్ టేస్ట్ చూయించాలి, వేణు స్వామి వ‌ద్ద జాత‌కం చూపించి చెప్పాలా వంటి వ‌న్ లైన‌ర్స్ తో కిక్ ఇస్తారు. ఫ‌స్టాఫ్ అంతా బాక్సింగ్ ట్రైనింగ్‌, అమ్మాయిల‌కు సైట్ కొట్టే స‌ర‌దా స‌ర‌దా స‌న్నివేశాల‌తో న‌వ్విస్తారు.

ఇక సెకండాఫ్ అంతా బాక్సింగ్ కోర్టులో యాక్ష‌న్ సీన్ల‌తో ఆటాడేసుకుంటారు. మిత్రులు ఒక్కొక్క‌రు బాక్సింగ్ రింగ్‌లోకి వెళ్లే ముందు తోటి మిత్రులు ఇచ్చే బిల్డ‌ప్‌లు, వ‌చ్చేపాట‌, డైలాగులు సీటులో కూర్చోనియ‌కుండా న‌వ్విస్తాయి. ఎక్క‌డా అస‌భ్య‌త‌, అశ్లీల‌త‌ల‌కు చోటివ‌కుండా పాత్ర‌ల మ‌ధ్య సంద‌ర్భోచిత‌ కామెడీతో ఆల‌రిస్తారు.ఇక క్లైమాక్స్ హీరో ఇంట్లో స‌న్నివేశం సినిమాకే హైలెట్‌. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఓ రేంజ్‌లో అదిరిపోతుంది. ఇప్పుడీ సినిమా జూన్ 12 నుంచి సోనీల లివ్ (SONY LIV) ఓటీటీలో మ‌ల‌యాళంతో పాటు తెలుగు ఇత‌ర భాష‌ల్లోనూ స్ట్రీమింగ్ అవుతుంది. చివ‌రి వ‌ర‌కు మంచిగా ఎలాంటి బాద‌ర‌బందీ లేకుండా హాయిగా మ‌న‌స్పూర్తిగా న‌వ్వుకోవాలంటే, ఎలాంటి లాజిక్‌లు వెత‌క్కుండా కుటుంబం అంతా క‌లిసి ఈ సినిమా చూసి తీరాల్సిందే.

ఒకేసారి నాలుగు ఓటీటీల్లోకి వెన్నులో వ‌ణుకు పుట్టించే సినిమా!

ఒకేసారి నాలుగు ఓటీటీల్లోకి.. వెన్నులో వ‌ణుకు పుట్టించే సినిమా!

డోంట్ మిస్‌

 

 

 

 

 

 

 

 

 

 

ఇటీవ‌ల వెబ్ సిరీస్‌ల‌లో వ‌రుస హిట్ల‌తో మంచి క్రేజ్‌తో దూసుకెళుతూ త‌న‌కంటూ స్పెష‌ల్ ఫాలోయింగ్ సంపాందించుకున్న న‌టుడు న‌వీన్ చంద్ర‌.

 

ఇటీవ‌ల వెబ్ సిరీస్‌ల‌లో వ‌రుస హిట్ల‌తో మంచి క్రేజ్‌తో దూసుకెళుతూ థ్రిల్ల‌ర్ సినిమాలంటే త‌న‌కంటూ స్పెష‌ల్ ఫాలోయింగ్ సంపాందించుకున్న న‌టుడు న‌వీన్ చంద్ర‌ (Naveen Chandra).

 

ఆయ‌న హీరోగా న‌టించిన చిత్రం ఎలెవ‌న్ (Eleven) గ‌త నెల‌లో..

 

 

మే16న తెలుగు, త‌మిళ భాష‌ల్లో ప్రేక్ష‌కుల ఎదుట‌కు వ‌చ్చి మంచి పాజిటివ్ టాక్‌తో మ‌స్ట్ వాచ్ మూవీగా పేరు తెచ్చుకుంది.

 

 

క్రైమ్ ఇన్వెస్టిగేష‌న్ థ్రిల్ల‌ర్ జాన‌ర్‌లో రూపొందిన ఈ సినిమాలో రేయ హ‌రి (Reyaa Hari), అభిరామి (Abhirami) కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

 

 

ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ సుంద‌ర్ సీ వ‌ద్ద అనేక సినిమాల‌కు అసిస్టెంట్‌గా ప‌నిచేసిన లోకేశ్ అజిల్స్ (Lokkesh Ajls) ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం చేశారు. ఇప్పుడీ సినిమా ఓటీటీకి వ‌చ్చేసింది.

 

క‌థ విష‌యానికి వ‌స్తే..

 

అరవింద్‌ (నవీన్‌ చంద్ర) విశాఖలో అసిస్టెంట్‌ కమిషనర్‌గా, స్మార్ట్‌ పోలీసుగా మంచి గుర్తింపును తెచ్చుకుంటాడు.

 

అయితే నగరంలో జ‌రుగుతున్న వరుస హత్యల కేసుని డీల్‌ చేస్తున్న పోలీస్‌ అధికారి రంజిత్‌ (శశాంక్‌) రోడ్డు ప్రమాదానికి గురవడంతో ఆ బాధ్య‌త‌ అరవింద్‌ తీసుకుంటాడు.

 

ఆపై కూడా వ‌రుస హత్యలు కొనసాగుతూనే ఉన్నా హంతకుడు, హత్యకి గురైనవాళ్ల ఆనవాళ్లు ఆధారాలు ఎంత‌కీ ల‌భించ‌వు.

 

 

ఈ క్ర‌మంలో చివ‌ర‌కు ఆరో హ‌త్య‌ దగ్గర ల‌భించిన‌ ఓ చిన్న క్లూతో కేసులో కదలిక వచ్చి ఒక్కొక్క‌రిగా హత్యకు గురైన వాళ్ల వివ‌రాలు బ‌య‌ట‌కు వ‌స్తాయి.

 

 

కానీ హత్యలు చేసేది ఎవరనే విష‌యం మాత్రం తెలియ‌దు.

 

చివ‌ర‌కు అరవింద్ ఏం చేశాడు.

 

హంతుకుడిని పట్టుకో గ‌లిగాడా?

లేదా అతను ఈ దారుణాలు చేయడానికి కారణమేంటి?

ట్విన్‌ బర్డ్‌ స్కూల్‌కి, 6 మంది కవలలకి ఈ హత్యలకు సంబంధం ఏంటి?

 

ఈ కథలో బెంజిమన్‌ పాల్‌, ఫ్రాన్సిస్‌ ఎవరు?

అన్నది కథ.

 

సినిమా ఆరంభమైన 10 నిమిషాల‌లోనే ఇన్వెస్టిగేష‌న్ మొద‌లై..

 

ప్రేక్ష‌కులకు స్పైన్ చిల్లింగ్ ఇస్తూ సినిమా ఆద్యంతం స‌స్పెన్స్ తో సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడుతుంది.

 

అంతేగాక సీరియ‌ల్ కిల్ల‌ర్ బ్యాగ్రౌండ్ స్టోరీ ఎమోష‌న‌ల్‌గా ట‌చ్ చేస్తుంది.

 

మ‌రి కొన్ని ఎమోష‌న‌ల్ స‌న్నివేశాలు సైతం ఆక‌ట్టుకుంటాయి.

 

ఇక ఫ్రీ ఇంట‌ర్వెల్‌కు ముందే కిల్ల‌ర్ బ‌య‌ట‌ప‌డ్డప్ప‌టికీ చివ‌ర్లో వ‌చ్చే ట్విస్టు సైతం గూస్‌బ‌మ్స్ తెచ్చేలా ఉంటుంది.

 

 

ఇప్పుడీ సినిమా జూన్ 13 శుక్ర‌వారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లోనే కాకుండా మ‌రో మూడు ఓటీటీల్లో (ఆహా త‌మిళ్, టెన్ కొట్టా, సింప్లీ సౌత్‌) స్ట్రీమింగ్ అవుతోంది.

 

థియేట‌ర్ల‌లో మిస్స‌యిన వారు, మంచి థ్రిల్ల‌ర్ చిత్రం చూడాల‌నుకునే వారు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఈ ఎలెవ‌న్ (Eleven) సినిమాను మిస్ అవ‌కుండా చూసి ఎంజాయ్ చేయ‌వ‌చ్చు.

 

ఇదిలాఉంటే న‌వీన్ చంద్ర న‌టించిన మ‌రో థ్రిల్ల‌ర్ బ్లైండ్ స్పాట్ సైతం ఈ సినిమా విడుద‌ల రోజే థియేట‌ర్ల‌లోకి రాగా ఇప్పుడు డిజిట‌ల్ స్ట్రీమింగ్‌ కూడా ఓకే రోజు రావ‌డ‌డం గ‌మ‌నార్హం.

 

సినిమా రివ్యూవ‌ర్ల‌పై.. ద‌య్యం ప‌గ‌!

సినిమా రివ్యూవ‌ర్ల‌పై.. ద‌య్యం ప‌గ‌! డీడీ నెక్స్ట్‌ లెవెల్ ఓటీటీకి వ‌చ్చేసింది

 

 

పాపుల‌ర్ త‌మిళ క‌మెడియ‌న్ సంతానం హీరోగా న‌టించిన కొత్త చిత్రం ‘డీడీ నెక్స్ట్‌ లెవెల్’ ఓటీటీకి తెలుగులోనూ వ‌చ్చేసింది.

పాపుల‌ర్ త‌మిళ క‌మెడియ‌న్ సంతానం (Santhanam) హీరోగా న‌టించిన కొత్త చిత్రం ‘డీడీ నెక్స్ట్‌ లెవెల్’ (DD Next Level).

సెల్వ రాఘవన్ (Selva raghavan), గౌతమ్ వాసుదేవ్ మీనన్ (Gautham Vasudev Menon), గీతికా తివారి (Geethika Tiwary) తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.

క్రియేటివ్ రైటర్, డైరెక్టర్ ఎస్.ప్రేమ్ ఆనంద్ (S. Prem Anand) ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

గ‌తంలో సంతానం న‌టించిన హ‌ర్ర‌ర్, కామెడీ సినిమా డీడీ రిట‌ర్న్స్ కి సీక్వెల్‌గా వ‌చ్చిన ఈ చిత్రం మే16న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి ప‌రాజ‌యం పాలైంది.

ఇప్పుడీ సినిమా నెల తిర‌గ‌కుండానే డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చింది.

క‌థ విష‌యానికి వ‌స్తే.. ఓ యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వహించే కృష్టమూర్తి (సంతానం) త‌రుచూ కొత్త సినిమాల రివ్యూలు ఇస్తూ అందరి మ‌న్న‌న‌లు అందుకుంటుంటాడు.

ఒకసారి ‘డీడీ నెక్స్ట్‌ లెవెల్’ అనే సినిమా స్క్రీనింగ్‌కు హాజరు కావాలని మూవీ ఫ్యార‌డైజ్ అనే థియేట‌ర్ నుంచి కృష్టమూర్తి, మ‌రికొంత‌మంది రివ్యూవ‌ర్స్‌కి ప్రత్యేక ఆహ్వానం వస్తుంది.

దీంతో ఈ సినిమా చూడ‌డానికి కృష్ణ‌మూర్తి అక్క‌డ చిక్కుకుపోతాడు.

గ‌తంలో త‌న రివ్యూ వ‌ళ్ల న‌ష్ట‌పోయిన నిర్మాత ద‌య్యంగా మారి ట్రాప్ చేసి ఇక్క‌డ‌కు తీసుకు వ‌చ్చిన‌ట్లు తెలుసుకుంటాడు.

అక్క‌డ నుంచి త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేస్తాడు గానీ సాధ్య ప‌డ‌దు..

పైగా ఆ థియేట‌ర్లో ర‌న్ అవుతున్న సినిమాల్లో వ‌చ్చి ప‌డ‌తాడు. 

ఈక్ర‌మంలో కృష్ణ‌మూర్తి ఆ సినిమాలో నుంచి ఆపై ద‌య్యం, థియేట‌ర్‌ నుంచి ఎలా బ‌య‌ట ప‌డ్డాడ‌నే నేప‌థ్యంలో సినిమా సాగుతుంది.

విన‌డానికి, చూడ‌డానికి ఈ మూవీ ఎంతో ఆస‌క్తిక‌రంగా ఉన్న‌ప్ప‌టికీ స్క్రీన్ ప్లే ప‌రంగాఫెయిల్ అయి సెకండాఫ్ కాస్త ఇబ్బంది పెడుతుంది.

అయినా ఒక సారి ఈ సినిమాను చూసేందుకు ప్ర‌య‌త్నించ‌వ‌చ్చు.

ఇప్పుడీ చిత్రం జీ5 (zee 5) ఓటీటీలో త‌మిళంతో పాటు తెలుగు ఇత‌ర సౌత్ భాష‌ల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

హ‌ర్ర‌ర్ చిత్రాలు ఇష్ట‌ప‌డే వారు ఒక‌సారి ఈ ‘డీడీ నెక్స్ట్‌ లెవెల్’ (DD Next Level) చిత్రాన్ని ట్రై చేయ‌వ‌చ్చు.

ప్ర‌గాఢ సానుభూతి తెలిపిన జిల్లా ఉపాధ్యక్షులు మొహమ్మద్ ముల్తాని.

ప్ర‌గాఢ సానుభూతి తెలిపిన జిల్లా ఉపాధ్యక్షులు మొహమ్మద్ ముల్తాని.

జహీరాబాద్ నేటి ధాత్రి:

గుజరాత్ లో జరిగిన విమాన ప్రమాదం పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మొహమ్మద్ ముల్తాని
అహ్మ‌దాబాద్ విమాన ప్ర‌మాద ఘ‌ట‌న‌ పై జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం మండల మాచునూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు మొహమ్మద్ ముల్తాని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ సంఘటన అత్యంత బాధాకరం,సర్ధార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి లండన్ కు బయలుదేరిన ఏఐ 171 విమానం టేకాఫ్ అయిన కొద్దిసేప‌టికే కుప్ప‌కూలిపోవ‌డం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది అని,ఈ ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలుపుతూ
వారి కుటుంబాల‌కు నా ప్ర‌గాఢ సానుభూతి తెలియజేస్తున్నాను..ఈ ప్రమాదంలో గాయ‌ప‌డ్డ వారు ఆ భ‌గ‌వంతుడిని దయతో త్వ‌ర‌గా కోలుకోవాల‌ని మనసారా కోరుకుంటున్నానని మరియు చనిపోయిన కుటుంబాలకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం రూ.50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలన్నారు.

15న వైదిక పాఠశాల ప్రవేశ పరీక్ష.

15న వైదిక పాఠశాల ప్రవేశ పరీక్ష

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండలంలోని బర్దీపూర్ శ్రీ దత్తగిరి మహారాజ్ వైదిక పాఠ ప్రవేశ పరీక్ష నిర్వహించను న్నట్లు పాఠశాల వ్యవసాపకులు సిద్దేశ్వరా నందగిరి మహా రాజ్ తెలియజేశారు. ఇప్పటికే ప్రవేశ పరీక్షకై దరఖాస్తులు స్వీక రించే ప్రక్రియ ప్రారంభమైందన్నారు. ఉమ్మడి రాష్ట్ర నుంచి 200 వరకు దరఖాస్తులు ఇంతవరకు తమకు అందాయన్నారు .దరఖాస్తులు స్వీకరించిన పిదప ఈనెల 15న విద్యార్థులకు ప్రవేశ పరీక్ష నిర్వ హిస్తామన్నారు. ప్రవేశ పరీక్షల్లో అర్హత పొందిన విద్యార్థులకు ఆరు సంవత్సరాల పాటు వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చి వారిలో ఆధ్యాత్మికతను పెంపొందిస్తామని అన్నారు. ఆసక్తి గలవారు వెంటనే ప్రవేశ పరీక్షకై దరఖాస్తులు చేసుకో వాలని సిద్దేశ్వరానందగిరి మహారాజ్ సూచించారు.

విజ‌య్‌సేతుప‌తి లేటెస్ట్ క్రైమ్ థ్రిల్ల‌ర్ ఎస్ స‌డ‌న్‌గా ఓటీటీ స్ట్రీమింగ్కు వ‌చ్చి షాకిచ్చింది.

విజ‌య్‌సేతుప‌తి లేటెస్ట్ క్రైమ్ థ్రిల్ల‌ర్ ఎస్ స‌డ‌న్‌గా ఓటీటీ స్ట్రీమింగ్కు వ‌చ్చి షాకిచ్చింది.

గ‌త నెల మే23న త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో థియేట‌ర్ల‌లోకి మిశ్ర‌మ స్పంద‌న‌ను ద‌క్కించుకున్న రొమాంటిక్ క్రైమ్ డ్రామా చిత్రం ఏస్ (Ace). విజ‌య్ సేతుప‌తి (Vijay Sethupathi), రుక్మిణి వ‌సంత్ (Rukmini Vasanth), దివ్యాపిళ్లై (Divya Pillai), యోగిబాబు (Yogi Babu), ఫృథ్వీ రాజ్‌ (బ‌బ్లూ) (Babloo Prithiveeraj) కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. అర్ముగ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా సామ్ సీఎస్ (Sam C. S), జ‌స్టిన్‌ప్ర‌భాక‌ర‌న్ (Justin Prabhakaran) సంగీతం అందించారు. అయితే పూర్ ప‌బ్లిసిటీ వ‌ళ్ల అటు త‌మిళంలో, ఇటు తెలుగులో ప్రేక్ష‌కుల‌కు చేరువ కాలేక ఈ చిత్రం డిజాస్ట‌ర్‌గా మిగిలింది. అయితే ఇప్పుడు ఈ చిత్రం ఎలాంటి ముంద‌స్తు ప్ర‌క‌ట‌న లేకుండానే స‌డ‌న్గా డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చి షార్ చేసింది.

 

క‌థ విష‌యానికి వ‌స్తే.. బోల్ట్ క‌న్న‌న్ జైలు నుంచి రిలీజై కొత్త జీవితం స్టార్ట్ చేసేందుకు మ‌లేషియా వెళ‌తాడు. అక్క‌డ జ్ఞానందం సాయంతో అక్క‌డే ఉంటూ క‌ల్ప‌న అనే యువ‌తి హోట‌ల్‌లో ప‌ని చేస్తుంటాడు. మ‌రోవైపు మ‌లేసియా పోలీసుగా ప‌ని చేసే కామంధుడైన పెంపుడు తండ్రి రాజా దొరైతో ఇబ్బందులు ప‌డుతూ ఓ బ‌ట్ట‌ల షాప్‌లో ప‌ని చేస్తూ ఉంటుంది రుక్మిణి. అయితే త‌ను అడిగిన డ‌బ్బు ఇస్తే వ‌దిలేస్తాన‌ని చెప్ప‌డంతో ప‌లుచోట్ల ప‌ని చేస్తూ డ‌బ్బు కూడ‌బెడుతూ ఉంటుంది. సేమ్ అపార్ట్‌మెంట్‌లో ఉండ‌డంతో బోల్ట్ క‌న్న‌న్‌, రుక్మిణిల మ‌ధ్య ప‌రిచయం ప్రేగా మారుతుంది.

ఇదిలాఉంటే.. ఓ వైపు క‌ల్ప‌న హోట‌ల్ కోసం తీసుకున్న లోన్ డ‌బ్బులు తిరిగి క‌ట్ట‌లేక పోతుండ‌డం, మ‌రో వైపు రుక్మిణి తన పెంపుడు తండ్రి నుంచి బ‌య‌ట ప‌డ‌డానికి డ‌బ్బులు అవ‌స‌రం ప‌డ‌డంతో క‌న్న‌న్ వారి స‌మ‌స్య‌లు తీర్చేందుకు నిర్ణ‌యించుకుంటాడు. ఈక్ర‌మంలో లోక‌ల్‌గా అక్ర‌మ వ్యాపారుల మ‌ధ్య‌కు వెళ్లి క్యాసినో త‌ర‌హా గేమ్‌లు ఆడి ల‌క్ష‌ల్లో బ‌కాయి ప‌డ‌తారు. అయితే త‌మ డ‌బ్బు కోసం ప్రాణాలు తీసే వారి నుంచి హీరో ఎలా బ‌య‌ట ప‌డ్డాడు, అస‌లు హీరో ఆ గేమ్‌లు ఎందుకు ఆడాడు, క‌ల్ప‌న‌, రుక్మిణిల స‌మ‌స్య‌లు తీర్చాడా, అక్క‌డ జ‌రిగిన బ్యాంక్ రోబ‌రికి క‌న్న‌న్‌కు మ‌ధ్య ఉన్న లింకేంటి అనే క‌థ‌క‌థ‌నాల‌తో సినిమా సాగుతూ ఆక‌ట్టుకుంటుంది.

 

అయితే. సినిమాలో త‌ర్వాత‌ ఏం జ‌రుగ‌బోతుంద‌నేది మ‌న‌కు ముందే తెలుస్తున్నా చూసే ప్రేక్ష‌ల‌కు మాత్రం ఎక్క‌డా బోర్ కోట్ట‌కుండా విజ‌య్ సేతుప‌తి, యోగిబాబు పాత్ర‌లు ఆక‌ట్టుకుంటాయి. వారి మ‌ధ్య వ‌చ్చే సంభాష‌ణ‌లు డార్క్ కామెడీతో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. విల‌న్ల‌తో హీరో ఆడే గేమ్ కూడా స‌ర‌దాగా సాగుతుంది. బ్యాంక్ దొంగ‌త‌నం, క‌న్న‌న్ వేసే ఎత్తులు అన్నీ మంచి క్యూరియాసిటీని క‌లుగ జేస్తాయి. ఇప్పుడీ సినిమా జూన్ 13, శుక్ర‌వారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో (PrimeVideoIN) ఓటీటీలో త‌మిళంతో పాటు తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. మంచి ఫ‌న్ రైడ్ మూవీ చూడాల‌నుకునే వారికి ఈ ఏస్ (Ace) సినిమా మంచి ఆఫ్సన్‌. ఎక్క‌డా ఎలాంటి అస‌భ్య‌త లేకుండా సినిమా అలా స‌రదాగా సాగి పోతూ ఉంటుంది.

 మలయాళ డైరెక్టర్ తో అల్లు అర్జున్.

 మలయాళ డైరెక్టర్ తో అల్లు అర్జున్…

 

అల్లు అర్జున్( Allu Arjun), పుష్ప(Pushpa) తరువాత నుంచి అన్ని ఇండస్ట్రీలను కవర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. పుష్ప 2 తో వెయ్యి కోట్ల క్లబ్ లో చేరిన బన్నీ..  దీని తరువాత అంతకుమించి రికార్డులు సృష్టించాలని చూస్తున్నాడు. దీనికోసం హిట్ డైరెక్టర్లను ఏరికోరి వెతుకుంటున్నాడు. ఇప్పటికే త్రివిక్రమ్(Trivikram) సినిమాను పక్కన పెట్టి.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ(Atlee) తో ఒక సినిమాను పట్టాలెక్కించాడు. జవాన్ తో అట్లీ కూడా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరాడు. ఇప్పుడు  వీరిద్దరూ కలిసి 2500 కోట్ల టార్గెట్ ను రీచ్  అవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అల్లు అర్జున్( Allu Arjun), పుష్ప(Pushpa) తరువాత నుంచి అన్ని ఇండస్ట్రీలను కవర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. పుష్ప 2 తో వెయ్యి కోట్ల క్లబ్ లో చేరిన బన్నీ..  దీని తరువాత అంతకుమించి రికార్డులు సృష్టించాలని చూస్తున్నాడు. దీనికోసం హిట్ డైరెక్టర్లను ఏరికోరి వెతుకుంటున్నాడు. ఇప్పటికే త్రివిక్రమ్(Trivikram) సినిమాను పక్కన పెట్టి.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ(Atlee) తో ఒక సినిమాను పట్టాలెక్కించాడు. జవాన్ తో అట్లీ కూడా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరాడు. ఇప్పుడు  వీరిద్దరూ కలిసి 2500 కోట్ల టార్గెట్ ను రీచ్  అవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇక ఈ సినిమా తరువాత అయినా బన్నీ.. త్రివిక్రమ్ తో  సినిమా చేస్తాడు అనుకుంటే పొరపాటే. ఎవరు ఊహించని డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యనే బన్నీ వాస్ .. మరో నాలుగు నెలలో గీతా ఆర్ట్స్ నుంచి ఒక పెద్ద అనౌన్స్ మెంట్ రాబోతుందని చెప్పుకొచ్చాడు. అయితే అది త్రివిక్రమ్ మూవీ కాదని కూడా  క్లారిటీ ఇచ్చాడు.  అసలు ఇలాంటి ఒక కాంబోను ఊహించలేమని కూడా చెప్పుకొచ్చాడు. దీంతో ఆ కాంబో  ఏంటి.. ? బన్నీ ఏ డైరెక్టర్ ను లైన్లో పెట్టాడా.. ? అంటూ అభిమానులు ఆరాలు తీయడం మొదలుపెట్టి ఎట్టకేలకు ఆ డైరెక్టర్ ఎవరో కనిపెట్టినట్లు తెలుస్తోంది. 

ఇప్పటికే టాలీవుడ్, కోలీవుడ్ డైరెక్టర్స్ తో పనిచేసి విజయాలను అందుకునం బన్నీ.. ఇప్పుడు మలయాళ హిట్ డైరెక్టర్ తో ఒక సినిమా చేస్తున్నాడట. ఆ మలయాళ డైరెక్టర్ ఎవరో కాదు.. బాసిల్ జోసెఫ్(Basil Joseph). మలయాళంలో డైరెక్టర్ గానే కాకుండా నటుడిగా కూడా మంచి విజయాలను అందుకుంటున్న బాసిల్ తోనే అల్లు అర్జున్ జతకట్టినట్లు తెలుస్తోంది. జయ జయ జయ జయహే సినిమాతో బాసిల్ తెలుగువారికి దగ్గరయ్యాడు. ఆ తరువాత అతను నటించిన ప్రతి సినిమా తెలుగువారిని ఫిదా చేసింది. సూక్ష్మ దర్శిని, పోన్ మాన్, మరణ మాస్ లాంటి  సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు. ఇక ఆయన దర్శకత్వంలో వచ్చిన మిన్నల్ మురళీ 2021 లో రిలీజ్ అయ్యి  భారీ విజయాన్ని అందుకుంది. 

దాదాపు నాలుగేళ్ళ తరువాత బాసిల్.. అల్లు అర్జున్ కోసం ఒక కథను సిద్ధం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బన్నీకి..  కేరళలో ఎలాంటి ఫ్యన్ బేస్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ అల్లు అర్జున్ అయితే.. అక్కడ వారికి మల్లు అర్జున్. ఎవరి సినిమాలైనా మలయాళంలో ఆడతాయో లేదో తెలియదు కానీ, బన్నీ సినిమా మాత్రం కచ్చితంగా మలయాళంలో ఆడితీరుతుంది. ఇప్పుడు మలయాళ డైరెక్టర్ తోనే బన్నీ సినిమా చేస్తున్నాడు అంటే వారికి పండగే అని చెప్పాలి. ప్రస్తుతం  స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని, మరో నాలుగు నెలలో అధికారికంగా మేకర్స్  ఈ సినిమాను ప్రకటించనున్నారట. ఏదిఏమైనా బన్నీ స్క్రిప్ట్ సెలక్షన్ మాత్రం సూపర్ అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. 

మార్కెట్‌ డిమాండ్‌ ఘనం…విమానాల సంఖ్య స్వల్పం

నత్తకు పోటీపడుతున్న పౌర విమానయాన రంగం విస్తరణ

చిన్న ఎయిర్‌ క్రాఫ్ట్‌లే దేశీయ అవసరాలకు ఉత్తమం

పెద్ద విమానాలకోసం సంక్లిష్ట డిజైన్లకోసం ఇప్పుడే కుస్తీపట్టనవసరంలేదు

తక్షణావసరాలపై దృష్టిపెట్టాలి

‘ఉడాన్‌’ లక్షం నెరవేరాలంటే చిన్న విమానాలే శ్రేయస్కరం

నమ్మకమైన సాంకేతిక పరిజ్ఞానం, సామర్థ్యమున్న ఎయిర్‌ క్రాఫ్ట్‌లే ఘనం

ప్రపంచంలో ఇప్పటికి వాణిజ్య విమానాలు తయారుచేసే కంపెనీలు ఏవని ప్రశ్నిస్తే బోయింగ్‌, ఎయిర్‌బస్‌ అని ఎవరైనా ఇట్టే సమాధానం చెబుతారు. ఆ రెండు కంపెనీలు ప్రపంచ వ్యాప్తంగాఅంతటి ప్రాచుర్యాన్ని పొందాయి. మరి ప్రపంచంలో ఈ కంపెనీలు మాత్రమేనా? మరే ఇతర కంపెనీలు ఇదేమాదిరిగా వాణిజ్య విమానాలను తయారుచేయడానికి ఎందుకు ముందుకు రావడంలేదన్నది సహజంగానే ఉదయించే ప్రశ్న. ఇదిలావుండగా భారత్‌, చైనా వంటి దేశాల్లో విమానయాన రంగంలో విస్తృత మార్కెట్‌ అవకాశాలున్నప్పటికీ, అవి విస్తరించలేకపోవడానికి ప్రధాన కారణం, వాణిజ్య విమానాల తయారీ సంస్థలు కేవలం పై రెండు మాత్రమే కావడం! ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఆర్డర్లకు తగిన వేగంతో వీటి ఉత్పత్తి జరగకపోవడం వల్ల దశాబ్దాల పాటు ఆర్డర్‌ ఇచ్చిన విమానం సరఫరాకోసం వేచివుండాల్సిన పరిస్థితి వల్ల విమానయాన రంగంవిస్తరణ నత్తకు అన్నమాదిరిగా వుంటోంది. మరి దీనికి పరిష్కారం లేదా? వాణిజ్య విమానాల తయారీకి ఇతర దేశాలు ఎందుకని పూనుకోవడంలేదన్న సందేహం వ్యక్తమవడం కూడా సహజమే. చైనా ఇందుకు ముందుకు వచ్చింది. ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రస్తుతం అమెరికా ఆంక్షల పుణ్యమాని అది ముందుకు కదలలేక చతికిలబడిరది. ఎందుకంటే విమాన తయారీకి అవసరమైన సంక్లిష్ట సాంకేతిక పరిజ్ఞానం, డిజైన్‌ వంటికి ఇంకా పశ్చిమదేశాల చేతుల్లోనే వున్నాయి. ఒక దేశం విమానం తయారుచేయాలంటే అందుకవసరమైన సంక్లిష్టమైన సాంకేతిక వ్యవస్థల కోసం విదేశాలపై ఆధారపడక తప్పదు. అంటే వాటి దయాదాక్షిణ్యాలపైనే దీని అభివృద్ధి ఆధారపడివుంటుంది. అంతేకాదు వాణిజ్య విమానాల తయారీ అంత తేలిక కాదు. ఇదో సుదీర్ఘ సంక్లిష్ట ప్రక్రియ. ఇది కూడా ఇతర దేశాల్లో విమానాల తయారీ జరగకపోవడానికి కారణం. 

డిమాండ్‌కు తగ్గ విమానాల్లేవు

మనదేశంలో పౌరవిమానయాన మార్కెట్‌ వేగంగా విస్తరిస్తోంది. విమాన ప్రయాణికుల డిమాండ్‌అధికంగా వున్నప్పటికీ, అందుబాటులో ఉన్న విమానాల సంఖ్య చాలా తక్కువగా వుండటం పెద్ద అవరోధంగా మారింది. విమానాలను దిగుమతి చేసుకోవాల్సి రావడం, ఇప్పటికీ దేశీయంగా ప్రయాణికుల విమానాలు తయారుకాకపోవడం దేశీయంగా వైమానికరంగం విస్తరణను అడ్డు కుంటోందనే చెప్పాలి. ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌, ఇండిగో వంటి సంస్థలకు తమ వాణిజ్య పరిధిని విస్తరించాలనుకున్నా, విమానాలు అందుబాటులో లేకపోవడం వాటి కాళ్లకు సంకెళ్లు వేసినట్టవుతోంది. కేవలం 2023`24 మనదేశీయ వైమానిక సంస్థలు 1359 విమానాలకోసం బోయింగ్‌,ఎయిర్‌బస్‌ సంస్థలకు ఆర్డర్లు ఇచ్చాయంటే, ఈ రంగంలో డిమాండ్‌ ఏవిధంగా వున్నదీ అర్థం చేసుకోవచ్చు. కానీ వీటి డెలివరీలు వచ్చేసరికి కొన్నేళ్లు పడుతుంది! ఫలితంగా మార్కెట్‌ విస్తరణకుసంస్థల ఉత్సాహంపై ఇది నీళ్లు చల్లినట్లవుతోంది. దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య గణనీ యంగా పెరుగుతోంది. 2024`25లో దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 7.5% వృద్ధి న మోదు చేయడం ఇందుకు ఉదాహరణ. అంటే వీరి సంఖ్య 165.7 మిలియన్లకు చేరుకుంది. మరి పెరుగుతున్న డిమాండ్‌కు మనదేశంలో విమానాల తయారీ జరుగుతున్నదా? అంటే లేదనే చెప్పాలి. అసలు ప్రయాణికుల విమానాల తయారీ మనదేశంలో ఇంకా శైశవస్థితిలోనే కొట్టుమిట్టాడుతోంది. ఈ నేపథ్యంలో చైనా ఈ రంగంలో చేసిన కృషి ఎదుర్కొన్న ఎత్తుపల్లాలను దృష్టిలో వుంచుకొని బలీయంగా అడుగులు ముందుకేయక తప్పదు. విదేశీ సాంకేతిక పరిజ్ఞానంపై ఎక్కువగా ఆధారపడటం వల్ల చైనా విమాన తయారీరంగా ఎటువంటి కష్టనష్టాలు ఎదుర్కొంటున్నదీ అవగాహన చేసుకొని మరీ మనం ముందుకు సాగాల్సిన అవసరం వుంది.

చైనా విమాన తయారీరంగం ప్రస్థానం

చైనాలో కమర్షియల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ చైనా (సీఓఎంఏసీ) ప్రయాణికుల విమానాలను తయారుచేయడానికి ఎంతో కృషిచేస్తున్నది. అయితే ఇందుకు అవసరమైన ఇంజిన్లు, సాంకేతిక సహకా రం అమెరికానుంచే రావాలి. ఇప్పుడు రెండుదేశాల మధ్య వాణిజ్య యుద్ధం నడుస్తున్న నేపథ్యంలో, యు.ఎస్‌. విధించిన ఆంక్షల తెబ్బ ఈ సంస్థ చేపట్టే కార్యక్రమంపై పడిరది. అంటే ఒక వాణిజ్య లేదా ప్రయాణికుల విమానం తయారుచేయడానికి అవసరమైన ముఖ్యమైన భాగాలపై విదేశాల పై ఆధారపడటం వల్ల కలిగే ఇబ్బందులకు చైనా ఉదాహరణగా నిలుస్తోంది. నిజానికి గత రెండు దశాబ్దాలుగా ప్రయాణికుల విమానాలను తయారుచేసే పనిలో తలమునకలుగా వున్నప్పటికీ, నూటికి తొంభయిశాతం వైఫల్యాలే ఎదురయ్యాయి. వీటిల్లో ప్రధానంగా చెప్పుకోవలసింది షాంఘై`వై10 జెట్‌లైనర్‌ గురించి. ఇది అచ్చం బోయింగ్‌`707 విమానం మాదిరిగానే వుండేది. ఇందులో అమెరికా తయారీ ‘ప్రాట్‌ Ê విట్నీ జెటి3డి’ ఇంజిన్లు వాడారు. 1980లో తొలివి మానం ఆకాశంలోకి అట్టహాసంగా ఎగిరింది. కానీ ఈ ప్రాజెక్టు కేవలం మూడు విమానాల త యారీతో మూతబడిరది. ఇందుకు కారణం వుంది. ఇందులో ఉపయోగించింది అప్పటికి 25 సంవత్సరాల పురాతన సాంకేతిక పరిజ్ఞానం! అప్పటికే పశ్చిమ దేశాల తయారీ విమానాల్లో అ త్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నప్పుడు, ఈ పాత చింతకాయపచ్చడి లాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని పట్టుకొని వేలాడటమేంటన్న ప్రశ్నలు ఉదయించడంతో, ఈ విమానాల తయారీని పక్కన పెట్టేశారు. అయితే చైనా తన ప్రయత్నాలను మానలేదు. 1980`90 మధ్యకాలంలో అనటోన్‌ ఎన్‌`24 రకం విమానానికి ప్రతికృతిగా జియాన్‌ ఎంఏ`60 విమానాన్ని, హర్బిన్‌ వై`12 అనే 17 సీట్ల విమానాన్ని తయారుచేసింది. వీటిని ఎక్కువగా సైనిక, రవాణా, అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు, కొన్ని సందర్భాల్లో ప్రయాణికుకోసం కూడా ఉపయోగించారు కానీ పెద్దగా ప్రాచుర్యం పొందలేదు. ఆ తర్వాత 2008లో కమర్షియల్‌ ఎయర్‌క్రాఫ్ట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ చైనా (సీఓఎంఏసీ) స్థాపన జరిగింది. గతంలోని అనుభవాలనుంచి నేర్చుకున్న పాఠాలను దృష్టిలో పెట్టుకొని ఏఆర్‌జే21 అనే రీజినల్‌ జెడ్‌ను తయారుచేసింది. తర్వాత దీన్ని సి909గా పేరు మార్చారు. విమాన సర్టిఫికేషన్‌ సాధించడంలో సంక్లిష్టతలను అధిగమించడానికి అవసరమైన అనుభవం కోసమే ఏఆరర్‌జే21 ప్రాజెక్టుపై దృష్టిపెట్టారు. ఇందుకోసం మెక్‌డోనెల్‌ డగ్లస్‌ ఎండి`80, యుక్రెయిన్‌కు చెందిన ఆంటోనోవ్‌ సాంకేతిక పరిజ్ఞానాలతో పాటు జనరల్‌ ఎలక్ట్రిక్‌ సిఎఫ్‌`34 ఇంజిన్లను వాడారు. చివరకు 2016 జూన్‌లో ఏఆర్‌జే21ను వాణిజ్యపరంగా చెంగ్డూ ఎయిర్‌లైన్స్‌ సంస్థ తొలిసారి ఉపయోగించింది. అంటే ఈ కార్యక్రమం మొదలుపెట్టిన 14 సంవత్సరాల తర్వాత కానీ ఇది పట్టాలెక్కలేదు!!

ఏఆర్‌జే21 విమానాన్ని తయారుచేసిన అనుభవంతో, సీఓఎంఏసీ సి919 ప్రోగ్రామ్‌ను ప్రారం భించింది. బోయింగ్‌`737, ఎయిర్‌బస్‌ఎ`320లకు పోటీగా దీన్ని తయారుచేసింది. విమానాలతయారీలో చైనాకు గొప్ప ముందడుగుగా చెప్పినప్పటికీ ఇందులో ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానం అత్యధికం పశ్చిమదేశాలదే! అదీకాకుండా ఇందులో వాడిన ఉపకరణాల్లో 3/5వ వంతుఅమెరికానుంచి దిగుమతి చేసుకున్నవే! మొట్టమొదటి సి919 విమానాన్ని 2022లో డెలివరీ ఇ వ్వగా 2023లో వాణిజ్యసేవలు ప్రారంభించింది. ఇప్పుడు సీఓఎంఏసీ ఏటా 50`75 యూనిట్ల ఉత్పత్తి లక్ష్యంతో ముందుకెళుతోంది. దేశీయంగా వున్న డిమాండ్‌కు తట్టుకునేరీతిలో వీటి ఉత్ప త్తిని మరింత పెంచాలన్నది కూడా సంస్థ లక్ష్యం. ఇప్పటికి ఈ విమాన తయారీలో 60శాతం వరకు భాగాలు చైనాలోనే తయారవుతున్నాయి. మిగిలిన 40శాతం సాంకేతిక పరిజ్ఞానం ఇంకా పశ్చిమ దేశాలు ముఖ్యంగా అమెరికానుంచి దిగుమతి చేసుకున్నదే. సీఓఎంఏసీ సంస్థ ఈ స్థాయి విజయానికి ప్రధాన కారణం, 2020లో ప్రభుత్వం నుంచి 49 నుంచి 72 బిలియన్‌ యు.ఎస్‌. డాలర్ల సబ్సిడీ, గ్రాంట్ల రూపంలో మద్దతు లభించింది. వీటితో పాటు ఆర్‌Ê డి సహకారం కూడా అందింది. దీంతో పాటు ప్రభుత్వ ఆధీనంలోని ఎయిర్‌లైన్స్‌ సంస్థలు ఆర్డర్లు ఇవ్వడం కూడా సంస్థ నిలదొక్కుకోవడానికి కారణమైంది. నిజం చెప్పాలంటే సీఓఎంఏసీ అభివృద్ధికి సీఎఫ్‌ఎం ఇంటర్నేషనల్‌, జీఈ, హానీవెల్‌, సోఫ్రాన్‌, కోలిన్స్‌ ఏరోస్పేస్‌ వంటి పశ్చిమదేశాల సంస్థల నుంచిఅందిన సరఫరాలు ఎంతో దోహదం చేశాయి. ఇప్పుడు చైనా దేశీయ ఉపకరణాలపై దృష్టి పె ట్టింది. సి919 విమానంకోసం దేశీయంగా సీజే`1000జె ఇంజిన్‌ తయారుచేస్తోంది. అయితే దీని తయారీకి కూడా ఇప్పుడు విదేశీ సాంకేతిక పరిజ్ఞానంపైనే ఆధారపడుతోంది. ఇంత వేగంగా ముందుకెళుతున్నా, ఈరంగంలో పూర్తి స్వయం సమృద్ధి సాధించడానికి దశాబ్దాల కాలం వెనుకబడే వుందని చెప్పాలి. ప్రస్తుతం అమెరికా ఆంక్షల పుణ్యమాని ఈ రంగం కుదేలయ్యే పరిస్థితి ఏర్పడిరది. 

భారత్‌ నేర్చుకోవాల్సిన పాఠాలు

స్వాతంత్య్రం వచ్చిన దగ్గరినుంచి పౌరవిమాన తయారీపై ఏ ప్రభుత్వం కూడా పెద్దగా దృష్టిపె ట్టింది లేదు. చైనాలో మాదిరిగా కమర్షియల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ చైనా (సీఓఎంఏసీ), లేదా పాశ్చాత్య దిగ్గజ సంస్థలైన బోయింగ్‌, ఎయిర్‌బస్‌ వంటి సంస్థల ఏర్పాటు గురించి ప్రభు త్వాలు ఆలోచించకపోవడం విచిత్రం! అయితే పూర్తిగా ప్రయత్నించలేదని చెప్పడం కూడా తప్పే.ఎందుకంటే ఈదిశగా యత్నించినప్పటికీ, పూర్తిస్థాయి నిబద్ధతతో అవి కొనసాగలేదనేది సత్యం. మనదేశం మొట్టమొదటగా 1991లో ‘సరస్‌’ పేరుతో వాణిజ్య విమానాల తయారీరంగంలోకి అడుగుపెట్టింది. దీని కింద మొట్టమొదటి ఫ్లైట్‌ 2004లో ఎగిరింది. అయితే ఈ రంగంలోకి అడుగుపెట్టి మూడు దశాబ్దాలు దాటుతున్నా ఇప్పటివరకు విమానతయారీకి అవసరమైన డిజైన్‌ ఇప్పటివరకు రూపొందలేదు. నేషనల్‌ ఏరోస్పేస్‌ లేబరేటరీస్‌ (ఎన్‌ఏఎల్‌), హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌)లు సంయుక్తంగా ఇప్పుడు 90సీట్ల సామర్థ్యమున్న ప్రాంతీయ రవాణా విమానాన్ని (ఆర్‌టీఏ) అభివృద్ధి చేస్తున్నాయి. ఆర్‌టీఏ డిజైన్‌ మరియు అభివృద్ధికి రెండు బిలియన్లఅమెరికన్‌ డాలర్లు ఖర్చవుతుందని అంచనా. అయితే ప్రభుత్వం స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్స్‌ (ఎస్‌పీఎల్‌) తయారీపట్ల మొగ్గు చూపుతోంది.

‘సరస్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంస్థ ఎన్‌ఏఎల్‌. ఇదే కార్యక్రమం కింద ఈ సంస్థ సరస్‌`ఎంకె2 రకం విమానాల రూపకల్పనలో తలమునకలుగా వుంది. ఈ విమానం 19 సీట్ల సామ ర్థ్యం కలది. 2017లో కేంద్రం ఈ ప్రాజెక్టుకోసం రూ.6వేల కోట్లు కేటాయించింది. దీనికి సం బంధించిన తొలి విమానం 2027 డిసెంబర్‌లో ఎగురుతుందని అంచనా. ఆలస్యమైనా ఆశ్చర్య పడాల్సిందేమీ లేదు.

చైనాకు చెందిన సీఓఎంఏసీ సంస్థ అనుభవాలను పరిశీలిస్తే, చిన్న పరిమాణంలోని ప్రాంతీయ జెట్‌ల తయారీపై దృష్టి పెడితే ప్రయోజనకరంగా వుండవచ్చు. ఎందుకంటే దేశీయ అవసరాల రీత్యా ఇటువంటి చిన్న విమానాల తయారీ మనకు ఉపయుక్తంగా వుండగలవు. సరికొత్త విప్లవాత్మక డిజైన్లకోసం కుస్తీ పట్టేకంటే, అందుబాటులోని సమర్థవంతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి విశ్వసనీయత కలిగిన ఎయిర్‌క్రాఫ్ట్‌లను తయారుచేయగలిగితే ప్రస్తుతానికి మనదేశీ య విమానరంగం డిమాండ్లను అందుకోవచ్చు. వీటికి అవసరమైన సంక్లిష్ట సాంకేతిక వ్యవస్థలను పశ్చిమ దేశాలనుంచి దిగుమతి చేసుకోక తప్పదు. పశ్చిమదేశాలపై ఆధారపడక తప్పకపో యినప్పటికీ విమానయాన రంగంలో మనం ప్రవేశించగలుగుతాం కదా! అదీకాకుండా వీటిని దేశీయంగా వివిధ రూట్లలో తేలిగ్గా నడపవచ్చు. దేశవ్యాప్తంగా 90G విమానాశ్రాయాలను కలి 

 పేవిధంగా 625 రూట్లతో రూపొందించిన ‘ఉడాన్‌’ అవసరాలు తీరతాయి. ఉడాన్‌ కింద టుటైర్‌, త్రీటైర్‌ పట్టణాలకు విమాన సదుపాయం కల్పించాలన్నది కేంద్రం లక్ష్యం. ఈ లక్ష్యాన్ని సా ధించడంలో ‘ఆర్టీఏ`90’, ‘సరస్‌ ఎకె`2’ రకం విమానాలు ఎంతగానో దోహదం చేయగలవు. నూటికి నూరుశాతం స్వదేశీ పరిజ్ఞానంతో విమానాలు తయారుచేయడం ఇప్పట్లో సాధ్యమయ్యే పనికాదు. పశ్చిమదేశాల సాంకేతిక సహకారంతో వేగంగా ఈ చిన్న విమానాల తయారీ చేపట్ట వచ్చు. 

ప్రస్తుతం భారత్‌ మల్టిపుల్‌ ఫైటర్‌ జెట్‌ల తయారీపై దృష్టి కేంద్రీకరించింది. ఇందులో భాగంగా వడోదరలో టాటాఎయిర్‌బస్‌, సి295 సైనిక రవాణా విమానాన్ని తయారుచేస్తోంది. ఇటువంటిప్రాజెక్టులకు అవసరమైన ఎరోస్పేస్‌ కాంపోనెంట్స్‌ తయారుచేసి ఎప్పటికప్పుడు అందించే చిన్న సంస్థలు మనదేశంలో పుష్కలంగా వున్నాయి. సి295 సైనిక రవాణా విమానానికి సంబంధించిన13వేల విడిభాగాలను దేశీయంగా 37 సప్లయర్స్‌ తయారుచేస్తున్నారు. ఈ నైపుణ్యాలు, ప్రయాణికుల విమానాల తయారీకి కూడా ఉపయోపడగలవు. అదేవిధంగా టాటా సంస్థ కర్నాటకలోని కోలార్‌లో ఎయిర్‌బస్‌ హెచ్‌125 హెలికాప్టర్‌ అసెంబ్లీ యూనిట్‌ను నెలకొల్పుతోంది. ఈవిధం గా ఏరోస్పేస్‌ కాంపొనెంట్స్‌ తయారీ ఎకోసిస్టమ్‌ మనదేశంలో వృద్ధి చెందడం, వీటి ఎగుమతులకు దోహదం చేయగలవు. ప్రస్తుతం మన ఏరోస్పేస్‌ కాంపొనెంట్స్‌ ఎగుమతుల విలువ రెండు బిలియన్‌ డాలర్లుగా వుంది. ఈ ఎగుమతులను పదిరెట్లు పెంచడం ద్వారా, అంతర్జాతీయ ఏరోస్పేస్‌ కాంపొనెంట్స్‌ మార్కెట్‌లో 10శాతం చేజిక్కించుకోవాలన్నది మనదేశ లక్ష్యం. ప్రస్తుతం గ్లోబల్‌దిగ్గజ సంస్థలైన ఎయిర్‌బస్‌, బోయింగ్‌, రోల్స్‌రాయిస్‌ వంటి సంస్థలు తమకు కావలసిన కాంపొనెంట్స్‌కోసం అధికంగా భారత్‌పైనే ఆధారపడుతున్నాయి. ఆవిధంగా ఔట్‌సోర్సింగ్‌ను మనకు ఇవ్వడం వల్ల వాటి తయారీ ఖర్చు 15ా20 శాతం తగ్గడమే కాదు, అత్యంత నాణ్యమైన ఉత్పత్తు లు మననుంచి వారు పొందగలుగుతున్నారు. ఈనేపథ్యంలో రోల్స్‌రాయిస్‌ సంస్థ మనదేశానికిచ్చే ఔట్‌సోర్సింగ్‌ను రెట్టింపు చేయాలన్న ఆలోచనలో వుంది. ప్రస్తుతం ప్రతి వాణిజ్య ఎయిర్‌ బస్‌ విమానంలో మనదేశంలో తయారీ కాంపొనెంట్స్‌ పెద్దమొత్తంలోనే వుంటున్నాయి! ఇప్పటికే నా ణ్యమైన ఎరోస్పేస్‌ కాంపొనెంట్స్‌ తయారీలో గ్లోబల్‌ మార్కెట్‌లో మనదేశానికి మంచిపేరుంది. ఇందులో సాధించే నైపుణ్యం మనదేశం పౌర విమానాల తయారీకి ఎంతగానో ఉపయోగపడగలదు. నైపుణ్యం విషయంలో మనం చైనా అనుభవాలనుంచి పాఠాలు నేర్చుకోవాలి. విమానాలకు సంబంధించి ఉపావ్యవస్థలను స్వల్పకాలం పాటు మనం దిగుమతి చేసుకున్నా, వీటికి ప్రత్యా మ్నాయాలను దేశీయంగా అభివృద్ధి చేసుకోవడం తప్పనిసరి. లేకపోతే ఇప్పుడు సీఓఎంఏసీ సంస్థ ఎదుర్కొంటున్న సమస్యే మనకూ పునరావృతం కాగలదు. చైనానుంచి మనం నేర్చుకోవాల్సిన మరో పాఠం ఏమంటే, ఎయిర్‌క్రాఫ్ట్‌ ప్రాజెక్టుకు సుస్థిరంగా, దీర్ఘకాలం పాటు నిధులను సమ కూర్చడం తప్పనిసరి. ఉదాసీనంగా కొనసాగించిన సరస్‌ ప్రాజెక్టు మాదిరిగా మరే ఇతర ప్రాజె క్టు వుండకూడదు. దానివల్ల ప్రయోజనం వుండదు. ప్రతి విమానం తయారీ వెనుక ప్రభుత్వం సంపూర్ణ మద్దతివ్వాలి. ఉదాహరణకు ఎయిర్‌బస్‌ సంస్థకు యూరోపియన్‌ యూనియన్‌ నుంచి 22 బిలియన్‌ డాలర్ల సబ్సిడీ లభించింది. ఫలితంగా ఎ380, ఎ350 విమానాలను తయారుచేయగలిగింది. ఇదే సమయంలో ప్రైవేటు రంగానికి కూడా సముచిత ప్రాధాన్యం ఇవ్వాలి. మొ త్తంమీద చెప్పాలంటే విమానాల తయారీరంగంలో ప్రస్తుతం చైనా ఎదుర్కొంటున్న పరిస్థితులను దృష్టిలో వుంచుకొని వీటి తయారీలో మన కంటూ ఒక వ్యూహాన్ని ఏర్పరచుకొని ముందుకు సాగాల్సి వుంటుంది.

`తెలంగాణ సొమ్ముతో ఆంద్రాలో రిజర్వాయర్లు?

`తెలుగు దేశం పార్టీ వచ్చాక మరింత దోపిడీ.

`మద్రాసుకు నీళ్లిచ్చారు.

`తెలంగాణను ఎండబెట్టారు.

`పోతిరెడ్డిపాడు పొక్క పెట్డి, తెలుగు గంగ పారించారు.

`రాయలసీమలో అడుగడుగునా ఎత్తిపోతల రిజర్వాయర్లు కట్డుకున్నారు.

`పెద్ద ఎత్తున ఎత్తిపోతల పథకాలు?

`తెలంగాణ ప్రాజెక్టులకు ఆనాడు చేతులు రాలేదు.

`ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయ పార్టీలు చేసిన అన్యాయానికి సాక్ష్యాలు.

`తెలంగాణలో ఎత్తిపోతలు ఖర్చన్నారు.

`అంత ఖర్చు సాద్యం కాదన్నారు.

`ఆంద్రాలో పదుల సంఖ్యలో రిజర్వాయర్లు నిర్మాణం చేసుకున్నారు.

`ఆనాడు నోరు మెదపని తెలంగాణ నాయకులు.

`తెలంగాణ కల్పతరువు కాళేశ్వరం మీద విషం చిమ్ముతున్నారు.

`నీళ్లన్నీ కిందకు వదిలేసి ఆంద్రాకు న్యాయం చేస్తున్నారు.

`తెలంగాణ ఎండబెట్టి ఆంద్రాకు నీళ్లు వదిలేస్తున్నారు.

`కేసిఆర్‌ హయాంలో రాజమండ్రికి నీటి కరువొచ్చింది.

`కాంగ్రెస్‌ హయాంలో ఇప్పుడు ధవళేశ్వరం కళకళలాడుతోంది.

`తెలంగాణకు ఉమ్మడి పాలకులు ఎప్పటికీ శత్రువులే!

`ఉమ్మడి పాలకులకు తెలంగాణ బాగుపడడం ఇష్టం లేదు!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆనాటి ఆంద్రా పాలకులు తెలంగాణ నీళ్లను తరలించుకుపోయారు. నిధులు ఆంద్రాకు మళ్లించుకున్నారు. నియామకాలన్నీ కట్టబెట్టుకున్నారు. తెలంగాణకు తీరని అన్యాయంచేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణకు ఇంకా ఎలా అన్యాయం చేయాలన్న ఆలోచనలే చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని బనకచర్లను తెరమీదకు తీసుకొచ్చారు. వెంటనే దాని పనులు మొదలుపెట్టారు. సముద్రంలో కలిసే నీటిని వృధాగా పోకుండా, వరద జలాల మీద ఆధారపడి బనకచరర్ల నిర్మాణం చేపడతామని ఏపి ప్రభుత్వం అంటోంది. నిజానికి వరద పోటేత్తే సమయంలో వాడుకునే పరిస్థితి వుంటుందనేది శుద్ద అబద్దం. ఎప్పుడైతే ప్రవాహ ఉదృత్తి మోతాదులో వున్నప్పుడే నీటిని వాడుకుంటారు. కాని మాటలకు మాత్రం వరద జాలలను మాత్రమే వినియోగించుకుంటామని చెప్పడం ఏపి పాలకులకు అలవాటైంది. ఉమ్మడి రాష్ట్ర్రంలో కూడా అదే చెప్పేవారు. పోతిరెద్డి పాడు విషయంలోనూ అదే చేశారు. దాంతో ఏపిలో నిర్మాణం చేసిన అనేక ఎత్తిపోతల ప్రాజెక్టుల రిజర్వాయర్లకు అదే సమాదానం చూపించారు. కాని నికర జలాలు మాత్రమే ఎత్తుకుపోతున్నారు. అది గత అరవై సంవత్సరాలుగా సాగుతూనే వుంది. ఇంకా సాగిస్తూనే వున్నారు. ఏ నదికైనా కింది రాస్ట్రానికి ఎక్కువ నీటిని వాడుకునే అవకాశం వుంటుందన్న సాకుతో పరిమితికి మించి నీటిని వాడుకోవడానికే ఏపి ఆనాటి నుంచి అలవాటు చేసుకున్నది. రాష్ట్రం విడి పోయిన తర్వాత ఆ వాదన మరింత ఎక్కువగా చేస్తోంది. తెలంగాణకు చెందిన కాంగ్రెస్‌, బిజేపి నాయకులు ఏపి ప్రభుత్వం బనకచర్లకు నీళ్లు తరలించుకుపోతున్నా స్పందించడం లేదని బిఆర్‌ఎస్‌ ఆరోపిస్తోంది. పోలవరం నుంచి గోదావరి నీటిని ఎత్తిపోసుకునేందుకు రాయలసీమను సస్యశ్యామలం చేయాలని తెలంగాణపై కుట్రలు చేస్తున్నారు. ఓ వైపు శ్రీశైలం నుంచి ఇప్పటికే రాయలసీమకు పోతిరెడ్డిపాడు మొదలుపెట్టి, చెన్నైకి తెలుగు గంగ కాలువ ద్వారా మంచినీటిని అందిస్తున్నారు. కాని తెలంగాణకు మంచినీటిని అందించేందుకు కూడా ఏనాడు ఉమ్మడి పాలకులకు మనసు రాలేదు. ఇప్పుడు రెండు రాష్ట్రాలైనా సరే గోదావరి నీటిని బనకచర్లకు వందల టిఎంసిల నీటిని తరలించుపోయే కుట్ర చేస్తున్నారు. కేంద్రం ఆశీస్సులతో మళ్లీ తెలంగాణకు తీరని అన్యాయంచేస్తున్నారు. ఇంత జరుగుతున్నా తెలంగాణను పాలిస్తున్న కాంగ్రెస్‌ ఫ్రభుత్వానికి, ఆ పార్టీ నాయకులకు నోరు రావడం లేదానే అని ఆరోపణలు వి నిపిస్తున్నాయి. తెలంగాణ నుంచి 8 లోక్‌సభ సీట్లు గెలిచిన బిజేపి బనకచర్ల మీద సమర్ధవంతంగా మాట్లాడితే ఆపార్టీకే ఎంతో మేలు జరుగుతుంది. తెలంగాణలో బిజేపికి మరింత మద్దతు దొరికే అవకాశముంది. పైగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి బనకచర్లకు కేంద్రం ఎలాంటి అనుమతులివ్వలేదంటున్నారు.. కేంద్రం నుంచి అన్ని అనుమతులు తీసుకొని, కేంద్ర ప్రభుత్వ సంస్ధ వ్యాప్కో సూచనలతో కట్టిన కాళేశ్వరాన్ని తప్పు పడుతున్నారు. కేంద్రం ఆశీస్సులతో తెలంగాణ అన్యాయం చేసే బనకచర్లపై మాత్రం మాట్లాడేందుకు రెండు జాతీయ పార్టీల నాయకులు పూర్తి స్ధాయిలో ఎందుకు స్పఏదించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బనకచర్ల లాంటి అతి పెద్ద ప్రాజెక్టు కేంద్రం అనుమతులు లేకుండా నిర్మాణం సాద్యమౌతుందా? ఇంత హడావుడిగా తెలంగాణకు అన్యాయం చేస్తున్న ప్రాజెక్టును అడ్డుకోవాల్సిన సమయంలో ఎందుకు మౌనం వహిస్తున్నారు. తెలంగాణను ఎండబెట్టే కుట్ర తెలంగాణకు చెందిన కాంగ్రెస్‌, బిజేపి నాయకులు ప్రశ్నించపోవడాన్ని తెలంగాణ సమాజం నిశితంగా గమనిస్తోంది. ఇది మన కళ్లముందు కనిపిస్తున్నదే అయినా పెద్దగా స్పందన రావడం లేదు. గెలిపించిన తెలంగాణ రైతుల నోట్లో మట్టికొట్టే ప్రమాదాన్ని అడ్డుకోవాల్సిన అవసరం వుంది. పదేళ్లపాటు పచ్చగా, కాళేశ్వరం ద్వారాకోటి ఎకరాల మాగాణగా మారిన తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోందనేది జల ఇంజనీర్ల అభిబ్రీపాయం. దశాబ్దాల పాటు కరువుతో అల్లాడిన తెలంగాణ ప్రాంతానికి ఉమ్మడి రాష్ట్రంలో గుక్కెడు మంచినీళ్లు ఇవ్వడానికి ఉమ్మడి పాలకులు ఇష్టపలేదు. ఏపి పాలకులు, పార్టీలు తెలంగాణకు మరోసారి తీరని అన్యాయంచేస్తున్నాయి. తెలంగాణను అరవైఏళ్లు పీల్చి పిప్పి చేశారు. గతంలో తెలంగాణ ప్రాజెక్టులు నిర్మాణంచేయలేదు. ఎన్నికల ముందు పునాది రాళ్లు వేయడం, తర్వాత మర్చిపోవడం అలవాటు చేసుకున్నారు. పదవుల కోసం మాత్రమే రాజకీయాలు చేసిన తెలంగాణ నాయకులు ఏపి నాయకులకు తొత్తులుగా మారిపోయారు. దాంతో తెలంగాణలో ప్రాజెక్టు అనే పేరు వినిపించకుండా చేశారు. తెలంగాణ అనే పదాన్ని నిషేదించేదాకా తెచ్చారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా జై తెలంగాణ అనేందుకు ధైర్యం చాలడం లేదు. ఇలాంటి పాలకుల వల్ల ఇప్పటికే తెలంగాణ మళ్లీ పదేళ్లు వెనక్కిపోయింది. ఇంకా ఇలాగే వుంటే యాభై ఏళ్లు వెనక్కి పంపిస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో ప్రాజెక్టులు కట్టలేమన్నారు. నిధులు ఇవ్వలేమన్నారు. ఎత్తిపోతల సాద్యం కాదన్నారు. కాని ఏపిలో మాత్రం అనేక ఎత్తిపోతల పథకాలు నిర్మాణంచేసుకున్నారు. అందులో రాయలసీమలోనే వందల టిఎంసిల నీళ్లతో కూడిన ఎత్తిపోతల ప్రాజెక్టులు కట్టుకున్నారు. ఆనాడు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు నోరు మెదపలేదు. తెలంగాణ ప్రజలు అదికారం కట్టబెట్టినా ఆంద్రా నాయకులకు ఎదురు మాట్లాడడం లేదు. తెలంగాణ ప్రాజెక్టులకు నిదులు లేవని చెప్పిన ఉమ్మడిపాలకులు ఏపిలో కండలేరు నిర్మాణం చేశారు. ముఖ్యంగా తెలుగుదేశం అదికారంలోకి వచ్చిన తర్వాత ఆసియాలోనే అతి పెద్ద మట్టి నిర్మాణంతో జలాశయం నిర్మాణం చేశారు. పదకొండు కిలోమీటర్ల పొడవు కట్ట నిర్మాణం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ నిధులతో కండలేరు కట్టుకున్నారు. తెలంగాణలో మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ను 50 టిఎంసిలో నిర్మాణం చేస్తే భూకంపం వస్తుందని భయపెట్టిన తెలంగాణ ద్రోహులకు, కండలేరు కనిపించలేదు. 1985లోనే కండలేరును 68 టిఎంసిల నీటి సామర్ధంతో నిర్మాణంచేశారు. ఎప్పుడూ 50 టిఎంసిల నీటికి తక్కువ కాకుండా నింపుకుంటూ వచ్చారు. తిరుపతి నగరమేకాదు, ఆఖరుకు తమిళనాడు రాజదానికి చెన్నైకి మంచినీటిని సరఫరా చేశారు. అమ్మకు అన్నం పెట్టని వాళ్లు పినతల్లికి గాజులు చేయించినట్లు చేశారు. తెలంగాణకు మంచినీరు ఇవ్వడానికి ఇష్టపడని తెలుగుదేశంపార్టీ, కాంగ్రెస్‌ పార్టీలు చెన్నై నగర ప్రజల మంచినీళ్ల కోసం ఆలోచించారు. ఉమ్మడి రాష్ట్ర నిధులతో చెన్నైదాకా నీళ్లు తరలించుకున్నారు. ఇలా సాగు, తాగు నీటి అవసరాలు తీర్చుకున్నారు. తెలంగాణలో ఎత్తిపోతల సాద్యం కాదని చెప్పిన కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు ఏపిలో ఎత్తిపోతల పధకాలు వేలాది కోట్లు ఖర్చు చేసి కడుతుంటే కళ్లు మూసుకున్నారు. ఇదే కాకుండా పదుల సంఖ్యలో పెద్ద పెద్ద రిజర్వార్లు నిర్మాణం చేసుకున్నారు. అందులో ప్రధానమైనవి వెలింగొండ ప్రాజెక్టు. సుమారు 43 టిఎంసిల సామర్ధ్యంతో తెలంగాణ నిదులను వాడుకొని నిర్మాణం చేసుకున్నారు. దాని కింద అనేక చిన్న చిన్న రిజర్వాయర్లు నిర్మాణంచేసుకున్నారు. ఊరకళ్లు రిజర్వాయర్‌ 10 టిఎంసిల సామర్ధ్యంతో కట్టారు. బ్రహ్మంగారి మఠం రిజర్వాయర్‌ను 17 టిఎంసిల సామర్ధ్యంతో చేపట్టారు. పూర్తి చేసుకున్నారు. ఉమ్మడి రాష్ట్ర నిధులను ఇలా దోచుకెళ్లారు. అలుగునూరు ప్రాజెక్టుకు 10 టిఎంసిలతో నిర్మించుకున్నారు. అవుకు 9 టిఎంసిలతో రిజర్వాయర్‌ పూర్తి చేసుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం వున్నాయి. వీటి కింద కొన్ని వందల చిన్న చిన్న రిజర్వాయర్లు నిర్మాణం చేసుకున్నారు. ఇదంతా ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ నిదులతో చేపట్టారు. ఆఖరుకు రాజోలిబండ డైవర్షన్‌ స్కీమ్‌ తూములు పగుల గొట్టి మరీ నీళ్లను దోపిడీ చేసుకున్నారు. మహబూబ్‌ నగర్‌ జిల్లా సాగునీటి అవసరాలకోసం నిర్మాణం జరిగిన రాజోలి బండ తూములు పగలగొట్టి మరీ నీళ్లు తీసుకెళ్లారు. నిజం చెప్పాలంటే ఉమ్మడి రాష్ట్రంలో రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టులకు చేసిన ఖర్చుల సగం ఖర్చు చేసినా తెలంగాణ పెండిరగ్‌ ప్రాజెక్టులు పూర్తయ్యేవి. తెలంగాణలో ఒక్క ఎత్తిపోతల ప్రాజెక్టు చేపట్టినా తెలంగాణ అంతా సస్యశ్యామలమయ్యేది. అయినా ఉమ్మడి పాలకులకు మనసు రాలేదు. నీళ్లిచ్చి తెలంగాణ బాగు పడడం చూడాలనుకోలేదు. తెలంగాణను ఎడారిగా మార్చి, తెలంగాణ నిధులతో ఆంద్రా ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నారు. ఏపిని అన్నపూర్ణ అని పిలిపించుకున్నారు. తెలంగాణను ఆకలి కేకలు వింటూ ఆనందపడ్డారు. అలాంటిది ఇప్పుడు కూడా మరో సారి బనకచర్ల పేరుతోమరో పెద్ద జలదోపడీ జరుగుతోంది. ఇప్పుడు తెలంగాణ వాదులు మేలుకోకపోతే, నీటి పంపకాల సమయం వచ్చినప్పుడు మరోసారి తెలంగాణకు తీరని అన్యాయం జరిగే అవకాశం వుంది.

వనజీవి స్ఫూర్తితో.

వనజీవి స్ఫూర్తితో.

“నేటిధాత్రి”, హైదరాబాద్.

ఇటీవలే మరణించిన పద్మశ్రీ వనజీవి రామయ్య ని స్ఫూర్తి గా తీసుకొని వాశ్విక్ ఫౌండేషన్ చైర్మన్ నిడిగొండ నరేష్ ప్రజాపతి ఒక సంవత్సరంలో లక్షమొక్కలు నాటాలనే సంకల్పం తీసుకున్నారు ఈ లక్ష మొక్కల కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారిక నివాసంలో మొదటి మొక్కను నాటించి కార్యక్రమాన్ని ప్రారంభించారు మొదటి మొక్కను నాటిన మంత్రి తన స్వంత నియోజక వర్గమైన ధర్మపురి నుండి మొక్కలు నాటే కార్యక్రమాన్ని కొనసాగించాలని నరేష్ ప్రజాపతి ని కోరారు.

 

 

Inspired by wildlife.

బంజారాహిల్స్ లోని మినిస్టర్ క్వాటర్స్ లో జరిగిన ఈ కార్యక్రమంలో కవి గాయకులు మిట్టపల్లి సురేందర్, వ్యవసాయ శాఖ శాస్త్రవేత్త జిఆర్కే రెడ్డి, గాజుల రవికుమార్ ఎడ్యుజోన్ సీఈఓ లు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version