ఏప్రిల్ 21 తెలంగాణ ఉద్య మకారుల ప్లీనరీ పోస్టర్.!

ఏప్రిల్ 21 తెలంగాణ ఉద్య మకారుల ప్లీనరీ పోస్టర్ ఆవిష్కరణ

ఉద్యమకారులు అందరూ తరలిరావాలి

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం( టి యు ఎఫ్) మండల అధ్యక్షుడు ఇమ్మడి శెట్టి రవీందర్ ఆధ్వర్యంలో ఈనెల ఏప్రిల్ 21 తెలంగాణ ఉద్యమ కారుల ప్లీనరీ పోస్టర్ ఆవిష్క రించడం జరిగింది.ప్లీనరి సమా వేశానికి పాల్గొనడం కోసం చర్చించడం జరిగింది. ఉద్యమకారులు ప్లీనరీ సమావే శానికి తరలిరావాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి గజ్జి శంకర్ ,ఉమ్మడి వరంగల్ జిల్లా కో కన్వీనర్ పొడిశెట్టి గణేష్ మండల అధ్యక్షులు పోలపెల్లి శ్రీనివాస రెడ్డి బలిజేనరసింహారాములు, గంట శ్యాంసుందర్ రెడ్డి , ఉద్య మకారులఫోరం రాష్ట్ర అధ్య క్షుడు చీమ శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు గిద్దమారి సురే ష్, మండల ప్రధాన కార్యదర్శి చల్ల శ్రీనివాస రెడ్డి,ఉపాధ్య క్షులు వనం దేవరాజ్ ,మండల నాయకులు ఎండి రఫీ ,అడుప ప్రభాకర్, సముద్రాల లింగ మూర్తి, కానుగుల నాగరా జ్ ,తుమ్మ ప్రభాకర్, దూదిపాల జోగిరెడ్డి ,అరకిల వీరయ్య, కోలఆనందం, బాసని సాంబమూర్తి ,బత్తుల రాజేష్, కొడపాక సంజీవరావు శంకర్ రెడ్డి బొంతల నాగరాజు శాయంపేట టౌన్ ప్రెసిడెంట్ రంగు మహేందర్, దామర కొండ కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.

ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర మహాసభలు..

ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర 5 వ మహాసభలు విజయవంతం చేయండి

గోడ పత్రిక ఆవిష్కరించిన ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గుండెల్లి కళ్యాణ్ కుమార్, మల్లారపు ప్రశాంత్

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)

 

 

 

 రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గుండెల్లి కళ్యాణ్ కుమార్, మల్లారపు ప్రశాంత్ అన్నారు. గురువారం రోజున జిల్లా కేంద్రంలో రాష్ట్రమహాసభల వాల్ పోస్టర్స్ జిల్లా కమిటీ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గుండెల్లి కళ్యాణ్ కుమార్, మల్లారపు ప్రశాంత్ లు మాట్లాడుతూ రాష్ట్ర మహాసభలు ఈనెల ఏప్రిల్ 25 ,26, 27 ,తేదీల్లో ఖమ్మం జిల్లా కేంద్రంలో జరుగుతున్నాయని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరంనర అవుతున్న కూడా విద్యారంగ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు పెండింగ్లో ఉన్న దాదాపు 8 వేల కోట్ల దాకా స్కాలర్షిప్స్ ఫీజు రీయింబర్స్ మెంట్ పెండింగ్లో ఉన్నాయి అన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాలకు సొంత భవనాలు లేకపోవడంతో విద్యార్థులు అద్దె భవనాల్లో ఉంటూ తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విద్య సంస్థలలో చదువుకునే విద్యార్థులకు సరైన మౌలిక సదుపాయాలు లేక సతమతమవుతున్నారన్నారు రాష్ట్రానికి ఇప్పుటీ వరకు విద్యశాఖ మంత్రి లేరన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అని తెలిపారు .

ఈ మహాసభల్లో తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై మేధావులతో చర్చించి రాబోవు భవిష్యత్తు కార్యాచరణలను ఎజెండాలను ఎంచుకొని భవిష్యత్ విద్యార్థి ఉద్యమాలు చేసే విధంగా ముందుకు వెళ్తామన్నారు.ఈమహాసభలకు విద్యార్థులు యువకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షులు జాలపల్లి మనోజ్ కుమార్, జిల్లా కమిటీ సభ్యులు సామల్ల సాయి భరత్, కడారీ శివ, నాయకులు శ్రీధర్, రాబిన్సన్, సాయి, చరణ్,అక్షయ్ తదితరులు పాల్గొన్నారు.

వైద్య రంగంలో తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్

వైద్య రంగంలో తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ గా మార్చాము
– బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన కాలంలో తెలంగాణలో మెడికల్ విద్య, ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యత
– కరీంనగర్ చల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజ్ లో జరిగిన 2019 ఎంబీబీఎస్ విద్యార్థుల స్నాతకోత్సవంలో పాల్గొన్న కేటీఆర్

సిరిసిల్ల, ఏప్రిల్ 

ప్రతి జిల్లాలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ ఉన్న ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటే అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన కాలంలో తెలంగాణలో మెడికల్ విద్య, ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చామన్నారు. కరీంనగర్ చల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజ్ లో జరిగిన 2019 ఎంబీబీఎస్ విద్యార్థుల స్నాతకోత్సవంలో పాల్గొన్న కేటీఆర్, పేషంట్లతో డాక్టర్లు సరిగా మాట్లాడితే సగం జబ్బు నయమవుతుందన్నారు.

education

ఈ సందర్భంగా మాజీ మంత్రి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ
2019 బ్యాచ్ ఎంబిబిఎస్ స్టూడెంట్స్ కు డాక్టర్లుగా మారబోతున్నందుకు శుభాకాంక్షలు తెలిపారు.
నా చిన్నతనంలో మా అమ్మ కూడా నేను డాక్టర్ కావాలని కోరుకుందని అన్నారు.
వ్యక్తిగత జీవితం, ప్రాధాన్యతలను కూడా పక్కన పెట్టి ప్రాణాలు కాపాడటమే లక్ష్యంగా డాక్టర్లు పనిచేయాల్సి ఉంటుందని కెసిఆర్ నాకు చెప్పారు.
డాక్టర్లు పేషంట్లతో సరిగా మాట్లాడితే 50 శాతం జబ్బు నయమవుతుంది. ఇది ఒక సైకలాజికల్ ఎఫెక్ట్ అని అన్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ రూపంలో డాక్టర్లకు రాబోయే రోజుల్లో పెద్ద చాలెంజ్ ఎదురు కాబోతుందని అన్నారు.
చాట్ జిపిటి , గ్రోక్ లు ప్రిస్కిప్షన్ లు కూడా రాస్తున్నాయని అన్నారు.
ఏఐ ఇచ్చే సమాచారం ఆధారంతో చాలా మంది పేషెంట్లు డాక్టర్ల దగ్గరకు వస్తున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అన్నారు.
ఇలాంటి పేషెంట్లను చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుందని అన్నారు.
కరుణ, సానుభూతితో రోగులకు డాక్టర్లు సేవ చేయాలని అన్నారు.
బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన కాలంలో తెలంగాణలో మెడికల్ విద్య, ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చామని అన్నారు.
ప్రతి జిల్లాలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ ఉన్న ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటేనని అన్నారు.
హెల్త్ కేర్ రంగంలో తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ గా మార్చామని అన్నారు.
వైద్యరంగంలో తెలంగాణ సాధించబోయే ప్రగతిలో మీరందరూ భాగస్వాములు కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాని అన్నారు.

తెలంగాణ ఉద్యమకారుడికి నివాళిర్పించిన పెద్ది.

తెలంగాణ ఉద్యమకారుడికి నివాళిర్పించిన పెద్ది

కొత్తగూడ, నేటిధాత్రి:

 

తెలంగాణ ఉద్యమకారుడు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తొట్టి సత్యంగారి కుటుంబాన్ని పరామర్శించిన నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి కొత్తగూడ మండలం పొగల్లపల్లి గ్రామ బి ఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తెలంగాణ ఉద్యమకారుడు తొట్టి సత్యం ఈరోజు అనారోగ్యంతో మృతి చెందగా వారి భౌతిక ఖా యాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించారు అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు తొట్టి సత్యం తెలంగాణ ఉద్యమాకారుడుగా రాష్ట్ర సాధనలో మరియు పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు ఈరోజు వారి మృతి పార్టీకి తీరని లోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అని అన్నారు
ఆయన వెంట లో మండల పార్టీ అధ్యక్షులు కొమ్మనబోయిన వేణు, మల్లయ్య మాజీ సర్పంచ్, భానోత్ వీరన్న, అజ్మీర రవి, మాజీ పడాల నాగేశ్వరరావు, ఎంపిటిసిలు బంగారు నారాయణ, ననుబోతుల స్వప్న లింగన్నయాదవ్,దానం నారాయణ, గుల్లపల్లి శీను , మండల్ నాయకులు కొనకంచి నాగమల్లేశ్వరరావు, నామోజు కనకాచారి, కావట్టి సతీష్ మల్లేష్ యాదవ్, కొలిపాక సదానందం, కత్తుల కుమారస్వామి, సంఘీ కుమారస్వామి ,భూక్య సంతోష్, నామోజు కనకాచారి గుంటుక యాకయ్య పల్లె శివ భైరబోయిన చిరంజీవి బోయిని భద్రయ్య ఆగబోయిన రాజయ్య మల్లేష్ యాదవ్ బండి లింగయ్య భైరబోయిన బుచ్చి రాములు బత్తుల ఉత్తరయ్య , పోతుగంటి రామాచారి, వేణు వంక కొమ్మలు, బోళ్ల యాకయ్యతో ,పాటు మండల నాయకులు పాల్గొన్నారు…

కేసీఆర్ వల్లే తెలంగాణకు స్వేచ్ఛ,.! 

కేసీఆర్ వల్లే తెలంగాణకు స్వేచ్ఛ, స్వపరిపాలన సిద్ధించింది. 

-ప్రజా సంక్షేమమే పరమావధిగా కేసీఆర్ పాలన సాగింది

-విలేకరుల సమావేశంలో చదువు అన్నారెడ్డి
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

తెలంగాణ ఆస్తి కేసీఆర్ అని 14ఏండ్ల ఉద్యమ చరిత్ర, 10ఏండ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ నాయకత్వములో తెలంగాణ సుభిక్షంగా ఉందని, కొంతమది చేసిన కుట్రలు, కుతంత్రాల వల్ల అధికారం కోల్పోయిన ప్రజలలో కేసీఆర్ కు అభిమానం తగ్గలేదని సర్పంచుల ఫోరం మొగుళ్లపల్లి మండల మాజీ అధ్యక్షులు చదువు అన్నారెడ్డి అన్నారు. సోమవారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని ముల్కలపల్లి గ్రామంలో గల తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అధికార కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని, కేసీఆర్ విలువ బీఆర్ఎస్ పార్టీ అవసరం ప్రజలకు తెలిసివచ్చిందన్నారు. నాయకులు ఎల్లపుడు ప్రజల మధ్యన ఉండి వారి సమస్యలలో పాలుపంచుకోవాలని అటువంటి నాయకులకే పార్టీ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు రైతుబంధు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, మహిళలకు రూ.2500, తులం బంగారం, నిరుద్యోగ భృతి వంటి అంశాలు ప్రజలకు వివరించాలన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు వస్తాయని సకల జనులు బీఆర్ఎస్ వైపు చూస్తారని అన్నారెడ్డి అన్నారు.

తెలంగాణ భవన్ లో దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు

తెలంగాణ భవన్ లో దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు

సిరిసిల్ల టౌన్: (నేటి ధాత్రి)

 

సిరిసిల్ల పట్టణంలోని ఈరోజు తెలంగాణ భవన్ లో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య జయంతి సందర్భంగా ఘనంగా నిర్వహించడం జరిగింది, సిరిసిల్ల బిఆర్ఎస్ పట్టణ మాజీ చైర్ పర్సన్ అధ్యక్షులు జిందం కళా చక్రపాణి పూలమాలవేసి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య అని, హైదరాబాద్ సంస్థానాధీశుడు ఏడవ నిజాం నవాబు ఉస్మాన్ ఆలీ ఖాన్ అండ కలిగిన స్థానిక భూస్వాములు, దొరల అరాచకాల నుంచి విముక్తి కోసం సంస్థాన ప్రజలు మధ్య వీరోచిత పోరాటం చేశారు అని తెలిపారు. అంతేకాకుండా కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ తంగళ్ళపల్లి మండల అధ్యక్షుడు గజబింకర్ రాజన్న, సిరిసిల్ల మాజీ కౌన్సిలర్ దార్ల సందీప్ కీర్తన, కుంభాల మల్లారెడ్డి, తదితర టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

చలో జోడెన్ ఘాట్ ను విజయవంతం చేయాలి.

చలో జోడెన్ ఘాట్ ను విజయవంతం చేయాలి

“తుడుందెబ్బ” పిలుపు.

కొత్తగూడ, నేటిధాత్రి:

 

తెలంగాణ రాష్ట్రము లోని ఆదివాసీలు తమ అస్తిత్వం ను,కోల్పోయి బ్రతుకు జీవుడా అంటూ అభివృద్ధి కి దూరంగా,ప్రభుత్వ, సంక్షేమ పధకాలకు నోచుకోకుండా,ఆదివాసీ నిరుద్యోగ యువత కు ఉద్యోగ కల్పన,ఉపాధి,లేక పోవడం తో,తీవ్ర మనో వేదనకు గురౌ తున్నారని,రాష్ట్రము లోని ఆదివాసీల భూములు వలస వాదుల,అదీనం అక్రమంగా దోపిడీ కి గురైన విధానము ను గిరి గ్లాని కమీషన్ రిపోర్ట్ తేట తెల్లం చేసిన విషయం,ప్రభుత్వా లకు తెలిసినా ఆదివాసీల దోపిడీ చేసిన వర్గాలకే ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు, వంతపాడుతున్నాయని,ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో ప్రత్యేకంగా స్వయం పాలన అధికారం అమలులో ఉందనే నిజo తెలిసినా పాలకులు తమ రాజకీయ అధికారం కోసం ఆదివాసీలను అణిచి వేసే ధోరణి తో ఆదివాసీల పై,కుట్ర పూరిత విధానాలు అనుసరించి చొర బాటుదారుల తో ఆదివాసీ ప్రాంతం ను చిన్నా భిన్నం చేస్తూ ఆదివాసీ ల మనుగడ కు తీవ్ర ఆటంకం కల్గిస్తున్న భూర్జవ రాజకీయ పార్టీలు,వలసవాద గిర్జనేతరుల,భారీ నుండి ఆదివాసీలను కాపాడు కునేందుకు, ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ,రాష్ట్ర మహాసభ లను ,చలో జోడెన్ ఘాట్ ఏప్రిల్ 12,13, 14 తేదీలలో రాష్ట్ర మహా సభలు, కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా,కెరమేరి మండలం, కొమురం భీమ్ యుద్ధ భూమి అయిన జోడెన్ ఘాట్ లో భారీ ఎత్తున నిర్వహించడం జరుగుతుంది, ఈ రాష్ట్ర మహాసభల కు వక్తలుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ నేత MLC ప్రొపెసర్ ఆచార్య కోదండరాం, ఓయూ ప్రిన్సిపాల్ ప్రొపెసర్ కాశిం, విశ్రాంత ప్రొపెసర్ హరగోపాల్ లు హాజరై ప్రసంగిస్తారాని,ఈ మహా సభల విజవంతం కోసం తుడుందెబ్బ రాష్ట్ర,జిల్లా మండల ముఖ్య నాయకత్వం హాజరై విజయవంతం చేయాలనీ తుడుందెబ్బ రాష్ట్ర కో కన్వీనర్ ఆగబోయిన రవి, ఈ రోజు కొత్తగూడ గ్రామ పంచాయితీ,అవరణం లో జిల్లా అధ్యక్షులు కుంజ నర్సింగ రావు అధ్యక్షతన జరిగిన సమావేశం లో పిలుపునిచ్చారు,సమావేశం లో అల్లెం జంపయ్య,సిడం రమేష్,సిద్దబోయిన లక్ష్మీ నారాయణ,సతీష్,తదితరులు పాల్గొన్నారు…

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ సందర్భంగా ముస్లిం.

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ సందర్భంగా ముస్లిం మంత్రిని చేర్చుకోవాలని ప్రభుత్వం నుండి డిమాండ్ మెనార్టీ యువ నాయకుడు మహమ్మద్ అజీజ్

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం మండల ఎల్గోయి గ్రామానికి చెందిన మెనార్టీ యువ నాయకుడు మహమ్మద్ అజీజ్ మాట్లాడుతూ తెలుగు నూతన సంవత్సర ఆగడి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అందువల్ల, రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో ముస్లిం మంత్రిని చేర్చడం ద్వారా, ప్రభుత్వంపై ముస్లింల ఆందోళనలను తొలగించాలి, ఈ అభిప్రాయాలను శ్రీనగర్ మాజీ ప్రతినిధి హీర్ షేక్ జావేద్ తన పత్రికా ప్రకటనలో వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు న్యాయం చేసే లౌకిక పార్టీ అని ఆయన అన్నారు. ఇటీవల ఎమ్మెల్యే కోటా కింద శాసనమండలికి అభ్యర్థుల ఎన్నిక సందర్భంగా, రాష్ట్రం తెలంగాణ ముస్లింలు ఎమ్మెల్సీ స్థానానికి ముస్లిం అభ్యర్థిని ఎన్నుకుంటారని చాలా ఆశలు పెట్టుకున్నారు, కానీ చివరికి ఫలితం దానికి విరుద్ధంగా మారింది. కాబట్టి, కాంగ్రెస్ హైకమాండ్ మరియు తెలంగాణ ప్రభుత్వం రాబోయే మంత్రివర్గ విస్తరణలో ముస్లిం మంత్రిని చేర్చడం ద్వారా దీనిని పరిష్కరించాలి, తద్వారా ముస్లింల సందేహాలు తొలగిపోతాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముస్లింలు ఏకగ్రీవంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి అధికారం అప్పగించారని, తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలు ఎల్లప్పుడూ రాజు పదవిలో ఉన్నారని, తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలను విస్మరించిన రాజకీయ పార్టీని నష్టాలను చవిచూస్తూ అధికారం నుండి తొలగించారని గత చరిత్ర సాక్షిగా ఉందని మైనారిటీ కాంగ్రెస్ నాయకుడు ప్రభుత్వానికి స్పష్టం చేశారు.

భాషా సాంస్కృతిక శాఖ తెలంగాణ ప్రభుత్వం.

భాషా సాంస్కృతిక శాఖ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో మరియు మానేరు రచయిత సంఘం ఆధ్వర్యంలో రెండు రోజుల జాతీయ సదస్సు.

సిరిసిల్ల టౌన్:( నేటి ధాత్రి )

సిరిసిల్ల జిల్లాలోని భాషా సాంస్కృతిక శాఖ తెలంగాణ ప్రభుత్వం సౌజన్యంతో మరియు మానేరు రచయితల సంఘం సంయుక్త నిర్వహణలో సిరిసిల్ల సిరివెలుగులు డా, నలిమెల భాస్కర్ మరియు జూకంటి జగన్నాథం సమాలోచన రెండు రోజుల జాతీయ సాహిత్య సదస్సు..

ప్రభుత్వ డిగ్రీ కళాశాల అగ్రహారంలో ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా శాతవాహన విశ్వవిద్యాలయం రిజిస్టర్ ఆచార్య రవికుమార్ జాస్తి,అగ్రహారం డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ టి.శంకర్, డాక్టర్ నలిమెల భాస్కర్, జూకంటి జగన్నాథం, మరియు ఎస్.ఆర్.ఆర్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య కలవకుంట రామకృష్ణ, టి.టి.సి.జి.టి.ఏ ప్రధాన కార్యదర్శి డాక్టర్, కాడూరు సురేందర్ రెడ్డి, దక్షిణ ప్రాంత ఆఫీసర్ ఇంచార్జ్ ఎన్బిటి డాక్టర్ పత్తిపాక మోహన్,
సదస్సు కన్వీనర్ కటుకం శారద, రచయిత అన్నవరం దేవేందర్ , మరియు మానేరు రచయితల సంఘం అధ్యక్షులు టీవీ నారాయణ, కార్యనిర్వాహ అధ్యక్షులు ఎలుగొండ రవి, మానేరు రచయితల సంఘం సభ్యులు బూర దేవానందం,ఆడెపు లక్ష్మణ్, చిటికెన కిరణ్ కుమార్, జి.శ్రీమతి,అనిత మాడూరి, దూడం గణేష్, రొండి అర్జున్, మల్యాల దీపిక, ఈడపు సౌమ్య, అంకారపు రవి కవులు, రచయితలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది.

అంకెల గారడీగా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్..

అంకెల గారడీగా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్..

విద్యారంగానికి 7.5%నిధులను మాత్రమే కేటాయించడాన్ని బిఆర్ఎస్వి పక్షాన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం..

బిఆర్ఎస్వి సీనియర్ నాయకుడు వొల్లాల శ్రీకాంత్ గౌడ్

వీణవంక,( కరీంనగర్ జిల్లా ):నేటి ధాత్రి :

 

నేడు ప్రవేశ పెట్టిన బడ్జెట్ సమావేశంలో 2025-2026 ఆర్థిక సంవత్సర బడ్జెట్ పూర్తిగా అంకెల గారడీగా ఉంది. అమలుకాని హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేస్తూ అధికారం చేపట్టిన ఈ ప్రభుత్వం పథకాలను అమలు చేయకుండా నానా అవస్థలు పడుతున్నారు. గత ఎన్నికల సమయంలో విద్యారంగానికి 15%నిధులు కేటాయిస్తామని ప్రగల్బాలు పల్కి, పోయిన బడ్జెట్ లో 7.3%నిరాశ మిగిల్చి, నేడు ఈ బడ్జెట్ లో కూడా 7.5%23,108 కోట్లు మాత్రమే కేటాయించింది. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన అని వారి నినాదాలతో ఈ బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. కానీ వారి నినాదాలు వాస్తవానికి మాత్రం సంక్షేమనికి ఆమడ దూరం, అభివృద్ధి లో వెనుకబాటు తనం, సూపరిపాలన శూన్యం మాత్రమే చూస్తున్నాం. బి ఆర్ ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు విద్యారంగానికి,యూనివర్సిటీలకు, గురుకులాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి అద్భుతంగా అభిరుద్ది పరిచింది. కానీ ఈ ప్రభుత్వం యూనివర్సిటీ, గురుకులాలను నిర్లక్ష్యం చేస్తు విద్యార్థుల మరణాలకు కారణమౌతున్నాయి. గురుకులాలలో చదువుతున్న విద్యార్థులకు కాస్మోటిక్ చార్జీలను 200%, డైట్ చార్జీలు 40% పెంచుతామణి గత బడ్జెట్ లోనే అన్నారు. మళ్ళీ గతంలో మాదిరే ఇప్పుడు కాస్మోటిక్, డైట్ ఛార్జిలను 200%, 40% అంటున్నారు. అంటే గతంలో ఈ కేటాయింపులు జరగలేదా..?. మీ బడ్జెట్ నిధులు నీటి మూటలేనా..? అని అడుగుతున్నాం. సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలు చైతన్య వంతులు, విద్యావంతులు, మేధావులు అన్నీ గమనిస్తూనే ఉన్నారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి మాట నిలబెట్టుకోవాలని కోరుతున్నాం. విద్యారంగా సమస్యల మీద అసెంబ్లీ ముట్టడి చేసిన కూడా మీ వైఖరి మారలేదు. వందేళ్లకు పైబడి ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ కీ 1000 కోట్లు రాష్టంలోని అన్నీ యూనివర్సిటీ లను అభివృద్ధి చేయాలి అలాగే యూనివర్సిటీ లో ఉన్న బోధన, బోధనేతర ఖాళీలను తక్షణమే భర్తీ చెయ్యాలని డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో విద్యారంగా సమస్యలు తీర్చే వరకు బిఆర్ఎస్వి ఆధ్వర్యంలో మా పోరాటాన్ని ఉదృతం చేస్తామని  అన్నారు.

తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ చారిత్రక ముందడుగు.

తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ చారిత్రక ముందడుగు

కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్‌లో చేర్చాలి బీసీ జేఏసీ

మంచిర్యాల,నేటి ధాత్రి:

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ నేడు బిల్లు ప్రవేశపెట్టిన కాంగ్రెస్ పార్టీకి,ముఖ్యంగా రాహుల్ గాంధీకి మరియు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని బిసి జేఏసీ,మంచిర్యాల జిల్లా కమిటీ నాయకులు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మరియు దేశవ్యాప్తంగా సామాజిక న్యాయాన్ని సాధించేందుకు పోరాటం చేస్తున్న అన్ని బీసీ సంఘాల విజయమని,బీసీల హక్కుల కోసం కృషి చేస్తున్న వారందరికీ ఇది గర్వకారణమన్నారు.ఈ బిల్లు ద్వారా స్థానిక సంస్థలు,విద్యా మరియు ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కలగనుండటం ఒక చారిత్రక ముందడుగు అవుతుందని,దేశవ్యాప్తంగా బీసీ సామాజిక న్యాయ ఉద్యమానికి బలాన్ని చేకూర్చే మైలురాయిగా నిలుస్తుందనీ,బీసీ జేఏసీ తరఫున ఈ విధానాన్ని కేంద్ర ప్రభుత్వ పరిమితులలోనూ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ,దేశవ్యాప్తంగా బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించేందుకు మేము నిరంతర పోరాటం కొనసాగిస్తామన్నారు.రిజర్వేషన్ బిల్లుకు న్యాయస్థానాల్లో ఆటంకాలకు అవకాశమున్నందున,దీన్ని భారత రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాలనీ,అప్పుడే ఈ చట్టాన్ని న్యాయపరమైన సవాళ్ల నుండి రక్షించవచ్చునని,ఇది బీసీలకు న్యాయమైన ప్రాతినిధ్యం అందించడంలో కీలక పాత్ర పోషితుందనీ,అసెంబ్లీ లో కాంగ్రెస్ పార్టీ,బీసీ లకు విద్య,ఉద్యోగ,స్థానిక సంస్థల రిజర్వేషన్ 42% శాతం కల్పిస్తూ బిల్లు ను పెట్టి,తెలంగాణ లోని బీసీ ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీ కి ధన్యవాదములు తెలియ జేస్తూన్నామనీ బీసీ జేఏసీ,మంచిర్యాల జిల్లా వ్యవస్థాపక అధ్యక్షులు
ఒడ్డేపల్లి మనోహర్ అన్నారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ సేవ దళ్ నాయకులు,బీసీ నాయకులు డా.నిలకంటేశ్వర్,బీసీ జేఏసీ జిల్లా నాయకులు,డా.రాజకిరణ్,బీసీ జేఏసీ జిల్లా నాయకులు గుమ్ముల శ్రీనివాస్,తీన్మార్ మల్లన్న టీమ్ జిల్లా అధ్యక్షులు మహేష్ వర్మ,బీసీ జేఏసీ నాయకులు రాజన్న యాదవ్,పిట్టల రవీందర్,పెద్దల్ల చెంద్రకాంత్,ఎండీ లతీఫ్, భీమాసేన్,చెంద్రగిరి చెంద్రమౌళి,పిట్టల తిరుపతి,తీన్మార్ మల్లన్న టీమ్ జిల్లా సభ్యులు
దినకర్,దీపక్,సాయిరాం తదితరులు పాల్గొన్నారు.

సభ్యత్వ నమోదు తెలంగాణ ముందంజ.

సభ్యత్వ నమోదు తెలంగాణ ముందంజ

రాజన్న సిరిసిల్ల జిల్లాను సైతం ముందు వరుసలో నిలబెట్టాలి

సిరిసిల్ల టౌన్:( నేటి ధాత్రి )
రాజన్న సిరిసిల్ల జిల్లా సభ్యత్వ నమోదులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో నిలిచిందని, అదే స్ఫూర్తితో రాజన్న సిరిసిల్ల జిల్లాను రాష్ట్రంలోనే ముందు వరుసలో నిలపాలని రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా కాంగ్రెస్ ఇంచార్జీ సుగుణ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా లో పార్టీ ఆఫీస్ కార్యాలయంలో జిల్లా మహిళా కాంగ్రెస్ రాజన్న సిరిసిల్ల జిల్లా విభాగం సభ్యత్వ నమోదు సమావేశం నిర్వహించారు. జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాముని వనిత -నలినీకాంత్ అధ్యక్షతన జరిగిన సమావేశంను ఉద్దేశించి మాట్లాడుతూ మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు ఆల్క లంబా, రాష్ట్ర అధ్యక్షురాలు మొగిలి సునీతా రావు ఆదేశాల మేరకు శనివారం రోజున సమావేశం నిర్వహించగా, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జి సుగుణ , గోవిందమ్మ, సుమలత హాజరయ్యారన్నారు. గత సెప్టెంబర్ 15 నుండి మహిళా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం రోజు నుండి సభ్యత్వం నమోదు ప్రక్రియ ప్రారంభం అయిందన్నారు. సభ్యత్వం నమోదు ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. మహిళ కాంగ్రెస్ లో జిల్లా విభాగంలో బాధ్యతలు నిర్వహిస్తున్న వారందరు సభ్యత్వం నమోదు చేయించాలని కోరారు. అనంతరం ఇంచార్జి సుగుణ గారు మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాకు రావడం సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం చెయ్యడానికి సెప్టెంబర్ 15 న మొదలైన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతి మహిళా నాయకురాలు విజయవంతం చెయ్యాలని పిలుపునిచ్చారు. సభ్యత్వం నమోదు ప్రక్రియలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని, రాజన్న సిరిసిల్ల జిల్లాను సైతం రాష్ట్రం లో ముందు నిలిపేలా ప్రతి ఒక్కరు తమ వంతు తోడ్పాటును అందించాలన్నారు. ఇప్పటివరకు సభ్యత్వం నమోదు చేయని మహిళా కాంగ్రెస్ సభ్యులు సభ్యత్వ నమోదు ప్రక్రియను మొదలు పెట్టాలని సూచించారు. రానున్న రోజుల్లో వచ్చే ఎన్నికలలో అవకాశం వస్తే ప్రతి మహిళా పోరాడాలని, విజయం సాధించాలని సూచించారు. మహిళా కాంగ్రెస్ రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాముని వనిత -నలినీకాంత్ గారికి సహకరిస్తు, సభ్యత్వ నమోదును పెంచాలని సూచించారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రతి గడప గడపకు తీసుకెళ్లి అర్థం అయ్యేలా వివరించాలని కోరారు. ఈ సమావేశంలో సిరిసిల్ల టౌన్ ఏఎంసీ అధ్యక్షురాలు వెలుముల స్వరూప , కాంగ్రెస్ యూనియన్ నాయకురాలు మడుపు శ్రీదేవి, బొప్పాపూర్ ఏఎంసీ చైర్మన్ షేక్ సాబేరా బేగం, బ్లాక్ ప్రెసిడెంట్ రమాదేవి, జిల్లా జనరల్ సెక్రెటరీ కోడం అరుణ, సుధా రోజా ,లత ,హారిక రెడ్డి, వనిత, సానియా, లత, అన్ని మండలాల అధ్యక్షురాలు, గ్రామ శాఖ అధ్యక్షురాలు టౌన్ అధ్యక్షురాలు వార్డు అధ్యక్షురాలు అందరూ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ పాల్గొనడం జరిగినది.

మహిళా సాధికారతకు తెలంగాణ పట్టం.

మహిళా సాధికారతకు.. తెలంగాణ పట్టం

దేవరకద్ర /నేటి ధాత్రి

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ మున్సిపాలిటీ కేంద్రంలో.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో సతీ సమేతంగా.. ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇందిరా మహిళ శక్తి పథకం కింద రూ. 15 లక్షల చెక్ లను మహిళా సంఘాలకు అందజేశారు‌. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా ఎదిగే విధంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని అన్నారు.
ఇందిరమ్మ రాజ్యం, ప్రజా ప్రభుత్వం వచ్చిన వెనువెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించిందని పేర్కొన్నారు. ఉచిత ప్రయాణమే కాకుండా ఆ బస్సులకు ఓనర్లుగా మహిళలను చేయడం ప్రజాప్రభుత్వం చేపట్టిన విజయమన్నారు. ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలని, ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలని, అన్ని రంగాల్లో వారిని ముందంజలో ఉంచాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం తీసుకుంటున్న చర్యల వల్ల పది మందికి ఉపాధి కల్పించే విధంగా మహిళలు ఎదిగారని అన్నారు. మహిళా సంఘాలకు వ్యాపారం ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వము వడ్డీ లేకుండా రుణ సదుపాయం కల్పిస్తున్నామని వెల్లడించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోపే 21 వేల కోట్లకు పైగా రుణాలను మహిళా సంఘాలకు ఇచ్చామన్నారు. వడ్డీలు, చక్రవడ్డీలు అప్పుల బాధకు కుటుంబాలు బలి కాకుండా మహిళ సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని తెలిపారు. పెద్దపెద్ద కార్పొరేట్లకే పరిమితమైన పరిమితం అయిన సోలార్ విద్యుత్ ప్లాంట్లను మహిళా సంఘాలకు అప్పగిస్తున్నామన్నారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ. రేవంత్ రెడ్డి గారు మహిళలకు పెద్దన్నగా ఉంటూ అండగా ఉంటూ ప్రజా పాలన అందిస్తున్నారని వెల్లడించారు. మహిళా సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న తమ ప్రభుత్వాన్ని, తమను ఈ సందర్భంగా మహిళలందరూ దీవించాలని ఎమ్మెల్యే గారు విజ్ఞప్తి చేశారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు.

బియ్యల జనార్దన్ కు ఘన నివాళి..

తెలంగాణ ఉద్యమనీకి ఊపిరి పోసిన బియ్యల జనార్దన్ సార్ కు ఘన నివాళి

కొత్తగూడ,నేటిధాత్రి :

తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన ఆదివాసీల ఆత్మ బంధువు బియ్యాల జనార్దన్ రావు వర్ధంతి సందర్భంగా..తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు
ధనసరి సీతక్క
ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వద్ద సారయ్య ఆధ్వర్యంలో
బియ్యాల జనార్దన్ రావు వర్ధంతి సందర్భంగా కొత్తగూడ మండల కేంద్రంలోని ఆయన విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళి అర్పించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య మాట్లాడుతూ..ఏజెన్సీ ప్రాంతం నుంచి మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన దళిత పీడిత బహుజన వర్గాలకు వెన్నుదన్నుగా నిలబడి ఆదివాసీల ఆత్మబంధువై పేరు లిఖించుకున్న ఉద్యమకారుడు బియ్యాల జనార్దన్ రావు సార్ గారు మన మధ్య లేకపోవడం ఈ ప్రాంతానికి తీరని లోటు.. తెలంగాణ ఉద్యమంలో తన వాక్కు చతుర్యంతో ప్రతి పల్లెలో ఉద్యమ స్ఫూర్తిని నింపి తెలంగాణ పోరాటంలో మన కొత్తగూడ మండలానికి ఒక గుర్తింపు తీసుకొచ్చారని జోహార్ జనార్దన్ సార్ జోహార్ జోహార్ అంటూ నినాదాలు చేశారు..ఈ కార్యక్రమంలో పిసిసి జనరల్ సెక్రటరీ చల్ల నారాయణరెడ్డి, డిసిసి ఉపాధ్యక్షులు వీరనేని వెంకటేశ్వర్రావు, డిసిసి జనరల్ సెక్రెటరీ బానోత్ రూపుసింగ్, కాంగ్రెస్ పార్టీ బ్లాక్ ప్రెసిడెంట్ సుంకరబోయిన మొగిలి, కాంగ్రెస్ పార్టీ మండల అధికార ప్రతినిధి ఇర్ప రాజేశ్వర్ , కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు బోయినేని ప్రశాంత్ రెడ్డి, ఓబీసీ జనరల్ సెక్రటరీ వల్లెపు రంజిత్, యూత్ ఉపాధ్యక్షులు చొప్పారి కుమార్, సోషల్ మీడియా మండల కోఆర్డినేటర్ సిరిగిరి సురేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సోలం వెంకన్న, బానోత్ దేవేందర్, యాదగిరి కిరణ్, మెకానిక్ వెంకట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు,,,

అండర్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన..

అండర్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన

కల్వకుర్తి /నేటి ధాత్రి.

కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండలం గట్టు ఇప్పలపల్లి గ్రామంలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో రూ.15 లక్షలతో అండర్ డ్రైనేజ్ పనులను గురువారం గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో.. గురువారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి,మిన్నాల డేవిడ్, రేణు రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ చంద్రమౌళి, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఇంద్రకంటి శివ కుమార్, మాజీ మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఏదుల శంకర్, రాములు, మట్ట అంజయ్య, ఏదుల మచ్చేందర్, జక్కుల మల్లేష్, డేరంగుల శ్రీశైలం, పరమేష్, రత్నయ్య, జగన్, కృష్ణయ్య, యాదయ్య, అంజయ్య, ఏదుల అశోక్, రాజు, తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థిని ఆత్మహత్య..

విద్యార్థిని ఆత్మహత్య

వరంగల్ :నేటిధాత్రి

వరంగల్ ములుగు రోడ్ లోని పైడిపల్లి వద్ద గల వ్యవసాయ పరిశోధన కేంద్రం ఆవరణలోని వ్యవసాయ కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపింది. కళాశాలలోని ఓ గదిలో ఫ్యానుకు ఉరి వేసుకుని సూసైడ్ చేసుకుంది. మృతురాలి స్వస్థలం నల్గొండ జిల్లా. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి అనుబంధంగా ఇక్కడ నడుస్తున్న వ్యవసాయ కళాశాలలో కొంతకాలంగా ర్యాంగింగ్ జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సీనియర్లు ర్యాంగింగ్కు పాల్పడుతున్నారని గతంలోనే విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పగా వారు నచ్చజెప్పి తిరిగి కాలేజీకి పంపినట్లు సమాచారం. ఈక్రమంలోనే ఇవాళ బలవన్మరణానికి పాల్పడటం గమనార్హం. మరోపక్క ఆత్మహత్యకు వ్యక్తిగత కారణాలు కూడా కారణమని తెలుస్తుంది. ఏనుమాముల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

గుమ్మడి శ్రీదేవిని సన్మానించిన ఏఐసీసీ మహిళా ప్రెసిడెంట్.

గుమ్మడి శ్రీదేవిని సన్మానించిన ఏఐసీసీ మహిళా ప్రెసిడెంట్.

చిట్యాల నేటి ధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు భూపాలపల్లి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అయినా గుమ్మడి శ్రీదేవి ని మంగళవారం రోజున హైదరాబాదులోని గాంధీభవన్లో శాలువాతో సన్మానించిన ఏఐసీసీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కాలాంబా, ఏఐఎంసి తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఇంచార్జి కమలాక్షి
హైదరాబాద్ గాంధీభవన్ లో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత రావు ఆధ్వర్యంలో నిర్వహించిన నారి న్యాయ సమ్మేళన్ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఏఐసీసీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కాలాంబా హాజరై మాట్లాడుతూ దేశంలోనే లక్షకుపైగా సభ్యత్వలు నమోదు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మహిళా కాంగ్రెస్ అని పేర్కొన్నారు.. తదనంతరం భూపాలపల్లి జిల్లాలో అత్యధికంగా సభ్యత్వలు నమోదు చేసిన సందర్భంగా *మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు అయిన గుమ్మడి శ్రీదేవి ని శాలువాతో సన్మానించినారు, పార్టీ కోసం కష్టపడిన వారికి భవిష్యత్తులో చట్టసభలకు అవకాశం కల్పించేలా తన వంతు సహకారం ఉంటుందని ఆమె అన్నారు
కార్యక్రమంలో వివిధ జిల్లాల అధ్యక్షురాలు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

బీసీల జోలికి వస్తే ఊరుకునేది లేదు.

పైడిపల్లి నర్సింగ్ ఖబడ్దార్ బీసీల జోలికి వస్తే ఊరుకునేది లేదు.

మందమర్రి నేటి ధాత్రి: 

మందమర్రి స్థానిక ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో పట్టణ అధ్యక్షుడు సకినాలశంకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి నేరెళ్ల వెంకటేష్, గౌరవ అధ్యక్షులు పోల్ శ్రీనివాస్, మందమర్రి పట్టణ యువజన అధ్యక్షుడు మూడారపు శేఖర్, లు మాట్లాడుతూ గత వారం రోజుల క్రిందట బీసీలపై మాల సంఘం పైడిమల్ల నర్సింగ్ బీసీలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం బీసీలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి అని వారు కోరారు రాబోయే రోజుల్లో క్షమాపణ చెప్పినట్లయితే తీవ్ర పరిణామాలు ఉంటాయని వాటికి పూర్తి బాధ్యత పైడిమల్ల నర్సింగ్ పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందని అన్నారు. అసలు ఏ పార్టీలో ఉండి ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా ఉంది ఒకవైపు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు కుల ఘననకు అనుకూలంగా మాట్లాడిన ముఖ్యమంత్రిని కాదని బీసీల మధ్య చిచ్చుపెట్టే విధంగా ఇలాంటి వాక్యాలు చేయడం సిగ్గుచేటు అన్నారు అసలు మాల l సంఘంలో ఎవరికి ఏం పోస్టు ఉందో కూడా తెలియకుండా ఆ సంఘ సభ్యుల కు అర్థం కాకుండా ఉంది అన్నారు ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘాలన్నీ కలుపుకొని ముందుకు వెళ్లాల్సిన సమయంలో ఇలాంటి వాక్యాలు చేయడం సరైనది కాదన్నారు బే షరతుగా క్షమాపణ చెప్పి తీరాలని వారి కోరారు ఈ కార్యక్రమంలో రామస్వామి శేఖర్. బేరా వేణుగోపాలరావు. దేవరపల్లి ప్రభాకర్. పోల్ సంపత్. మునిసెట్టి సత్యనారాయణ. మాడకుండా శంకర్. తదితరులు పాల్గొన్నారు

ఎమ్మెల్సీ ఎన్నికలు,మహాశివరాత్రి జాతర నిర్వహణ

పటిష్టమైన ప్రణాళికతో, ప్రశాంత వాతావరణంలో ఎమ్మెల్సీ (MLC) ఎన్నికలు,మహాశివరాత్రి జాతర నిర్వహణ.

ఎన్నికల కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం అధికారులు,సిబ్బంది ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.

జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్

వేములవాడ నేటిధాత్రి

ఈనెల 27న జరగనున్న ఉపాధ్యాయ,పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ,25,26,27 తేదీల్లో జరుగు మహాశివరాత్రి జాతరకు సంబంధించి ఈరోజు వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో డిఎస్పి లు, సి.ఐ,ఆర్.ఐ,ఎస్.ఐలతో భద్రతాపరంగా చేయవలసిన ఏర్పాట్ల గురించి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్పి గారు మాట్లాడుతూ….ఈ నెల 27 తేదీన జరుగు ఎమ్మెల్సీ (MLC) ఎన్నికల సమయంలో పోలీసు అధికారులు ఎలక్షన్ ముందు,ఎలక్షన్ రోజు,ఎలక్షన్ తర్వాత, తీసుకోవలసిన చర్యల గురించి క్షుణ్ణంగా అవగాహన కలిగి ఉండాలని,పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలింగ్ కేంద్రాలపై పూర్తిగా అవగాహన కలిగి ఉండలని,ఎన్నికల సమయంలో పోలీసుల పాత్ర అత్యంత కీలకమని,పోలింగ్‌ ప్రక్రియ సజావుగా,నిష్పక్షపాతంగా సాగేందుకు వారు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అదికారులను ఎస్పి గారు ఆదేశించారు.

జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయ,పట్టభద్రుల పోలింగ్ కి సంబందించి 41 పోలింగ్ కేంద్రలో 23,347 మంది ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకుంటారని పోలింగ్ ప్రక్రియ మొదలైనప్పటి నుండి పూర్తి అయేంత వరకు పోలీస్ అధికారులు,సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలింగ్ ప్రక్రియ ముగిసిన తరువాత బ్యాలెట్ బాక్స్ లను పటిష్టమైన ఎస్కార్ట్ తో స్ట్రాంగ్ రూమ్ లకు తరలించవలసి ఉంటుందన్నారు.శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు ఎవరైనా పాల్పడిన ఎన్నికల నియమావళి ప్రకారం ప్రకారం చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

మహాశివరాత్రి జాతర సందర్భంగా పటిష్ట భద్రత..

ఈ నెల 25,26,27 తేదీల్లో జరుగు మహాశివరాత్రి జాతర సందర్భంగా పోలీస్ శాఖ తరుపున సుమారు 1500 పోలీస్ అధికారులు, సిబ్బంది తో పటిష్ట భద్రత ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.వివిధ ప్రాంతాల్లో బందోబస్తు లో ఉంటే అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ వివిధ శాఖల సమన్వయంతో సుదూర ప్రాంతాల నుండి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో రాజన్న దర్శన అయ్యేలా చూడాలన్నారు. పట్టణంలో ప్రధాన కూడళ్ల వద్ద,పార్కింగ్ ప్రదేశాల్లో విధుల్లో ఉండే అధికారులు ,సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ట్రాఫిక్ నియంత్రణ చేయాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి,సి.ఐ లు, ఆర్.ఐ లు,ఎస్.ఐ లు, సిబ్బంది పాల్గొన్నారు.

రంజాన్ మాసం ఎప్పుడు ప్రారంభం

2025: ఈ సంవత్సరం పవిత్ర రంజాన్ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది? డేట్, టైమ్, ఇతర వివరాలు

జహీరాబాద్. నేటి ధాత్రి:

2025 సంవత్సరానికి గానూ పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమయ్యే సమయం దగ్గరపడుతోంది. వివిధ దేశాల్లో ఈ సమయం వేర్వేరుగా ఉంటుంది. నెలవంక దర్శనం ఆధారంగా రంజాన్ మాస ఉపవాసాలను ముస్లింలు ప్రారంభిస్తారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీన కానీ, మార్చి 1 వ తేదీన కానీ నెలవంక కనిపించవచ్చని భావిస్తున్నారు.

ఈ సంవత్సరం పవిత్ర రంజాన్ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది?

2025: చంద్రవంక దర్శనం ప్రకారం.. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమవుతుంది. నెలవంక వేర్వేరు దేశాల్లో వేర్వేరు సమయాల్లో కనిపించడం వల్ల, ఆయా దేశాల్లో రంజాన్ మాసం ప్రారంభ సమయం మారుతూ ఉంటుంది. ఈ వ్యత్యాసం కొత్తదేమీ కాదు, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఇస్లామిక్ చాంద్రమాన క్యాలెండర్ లోని ప్రతి నెల ప్రారంభ తేదీని ప్రభావితం చేసే నెలవంక దర్శనంపై ఆధారపడతారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఈదుల్ ఫితర్ వేడుక తేదీలలో కూడా వైవిధ్యాలకు దారితీస్తుంది.

మార్చి 1వ తేదీననా? లేక మార్చి 2 నా?

ఇస్లామిక్, పాశ్చాత్య దేశాలలో ఎనిమిదవ ఇస్లామిక్ నెల షబాన్ జనవరి 31, 2025 శుక్రవారం ప్రారంభమైంది. అందువల్ల, ఈ సంవత్సరం సాంప్రదాయకంగా, రంజాన్ ప్రారంభాన్ని సూచించే నెలవంక ఫిబ్రవరి 28, శుక్రవారం, అంటే షబాన్ 29 వ రోజున కనిపించే అవకాశం ఉంది. ఒకవేళ నెలవంక కనిపిస్తే ఈ దేశాల్లో 2025 మార్చి 1 నుంచి పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమవుతుంది. అయితే చాలా చోట్ల చంద్రుడు ఆ రోజు కనిపించకపోవచ్చని, అందువల్ల షబాన్ నెల మరో రోజు పొడిగించబడుతుందని భావిస్తున్నారు. అంటే, మార్చి 1వ తేదీన నెలవంక కనిపిస్తే, రంజాన్ మాసం ప్రారంభం 2025 మార్చి 2కి మారే అవకాశం ఉందని కొందరు పండితులు వాదిస్తున్నారు.

రంజాన్ విషయంలో ప్రాంతీయ వ్యత్యాసాలు

సౌదీ అరేబియా ఖగోళ అంచనాలకు అనుగుణంగా మార్చి 1న రంజాన్ ప్రారంభమవుతుందని పాశ్చాత్య దేశాలలోని అనేక నగరాలు ఇప్పటికే తమ రంజాన్ 2025 టైమ్ టేబుల్ ను ప్రచురించాయి.

అయితే, మొరాకో వంటి దేశాలు కఠినమైన విధానాన్ని అనుసరిస్తాయి. అక్కడ నెలవంక స్పష్టంగా కంటికి కనిపించిన మరుసటి రోజు రంజాన్ ను ప్రారంభిస్తారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 28 న మొరాకోలో చంద్రుడు కనిపించకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంటే మొరాకోలో మార్చి 2 నుండి రంజాన్ ఉపవాసాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

జర్మనీలో రంజాన్ 2025 ఫిబ్రవరి 28 న ప్రారంభమవుతుందని అంచనా వేశారు. అలాగే, అక్కడ ఈ పవిత్ర మాసం మార్చి 30 నాటికి ముగుస్తుంది.

అమెరికాలో కూడా మార్చి 1వ తేదీన పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అలాగే, ఈద్ అల్-ఫితర్ వేడుకలతో పవిత్ర మాసం మార్చి 30న ముగుస్తుందని భావిస్తున్నారు.

2025 మార్చి 1న రంజాన్ ప్రారంభమైతే, 2025 మార్చి 30న సౌదీ అరేబియా సహా పలు దేశాల్లో ఈద్ ఉంటుందని భావిస్తున్నారు. అయితే మార్చి 2న రంజాన్ ప్రారంభమయ్యే వారికి ఈద్ 2025 మార్చి 31న వచ్చే అవకాశం ఉంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version