నిత్యం జనపక్షాన ప్రశ్నించే గొంతును గెలిపించండి…

నిత్యం జనపక్షాన ప్రశ్నించే గొంతును గెలిపించండి

* ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే నాయకులను నమ్మకండి

* ప్రజలకు సేవ చేసే నాయకులను నమ్మి తమ అమూల్యమైన ఓటు వేయాలి

* చేవెళ్ళ మున్సిపాలిటీ 17 వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కడమంచి ఆనంద్

చేవెళ్ల, నేటిధాత్రి:

 

చేవెళ్ళ మున్సిపల్ ఎన్నికల్లో 17 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీలో ఉన్న బీ ఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కడమంచి ఆనంద్ వార్డులో ప్రచారం నిర్వహించారు. ఓటర్లను కలుసుకుని తమ విలువైన ఓటుతో మేధావులను చదువుకున్న విజ్ఞాన వంతులను సామాజిక బాధ్యత ఉన్న పౌరులను ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. డబ్బు, మద్యానికి కాకుండా 5 సంవత్సరాలు ప్రజల కోసం పనిచేసే వారిని ప్రశ్నించే గొంతులను గెల్పించాల్సిన బాధ్యత ఓటర్లపై ఉందని చెప్పారు. చేవెళ్ళ మున్సిపల్ ఎన్నికల్లో ఉన్న 18 వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించేందుకు ఓటర్లు ఉత్సాహంగా ఉన్నారని స్పష్టం చేశారు. కాలనీలలో ప్రచారం కొనసాగిస్తుంటే ప్రజలు ఏళ్ల తరబడి ఉన్న సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. ఇన్నాళ్లు కేవలం పదవుల కోసమే పనిచేశారని ప్రజా సమస్యలపై దృష్టి సారించలేకే ఇలాంటి దుస్థితి ఏర్పడ్డదని వాపోయారు. పదవులు వచ్చాక ప్రజలను , అభివృద్ధిని మరిచిపోయే నాయకులను గెల్పించకూడదని స్పష్టం చేశారు. ప్రజలు గెలిపించే నాయకులను నిత్యం ప్రశ్నించాలంటే ఎటువంటి ప్రలోభాలకు తావివ్వకూడని సూచించారు. ఇన్నాళ్లు ప్రశ్నించలేకే కాలనీల్లో సమస్యలు సమస్యలుగానే మిగిలిపోయాయని అన్నారు. తనను గెలిపిస్తే వార్డును అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కటికే రమేష్, మహమ్మద్ ఖలీల్, బాబు, కాలనీ పెద్ద మనుషులు సత్యనారాయణ, విష్ణు తదితరులు అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ ప్రచారంలో పాల్గొన్నారు.

అమ్మవార్లకు పుస్తె, మట్టెలను మొక్కు తీర్చుకున్నముల్కలపల్లి…

అమ్మవార్లకు పుస్తె, మట్టెలను మొక్కు తీర్చుకున్నముల్కలపల్లి సర్పంచ్ నాంపల్లి శ్రీవాణి-రమేష్
మొగుళ్ళపల్లి నేటి దాత్రి

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని ముల్కలపల్లి-మొగుళ్లపల్లి గ్రామాల మధ్యన అత్యంత వైభవంగా నిర్వహించిన మినీ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఉత్సవాలలో భాగంగా ముల్కలపల్లి గ్రామ సర్పంచ్ నాంపల్లి శ్రీవాణి-రమేష్ దంపతులు మొక్కుకున్న పుస్తె, మట్టెలను జాతర ఉత్సవ కమిటీ కార్యదర్శి చదువు అన్నారెడ్డి సమక్షంలో అమ్మవార్లకు బహుకరించారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడారు. ముల్కలపల్లి గ్రామ సర్పంచ్ గా తాను గెలిస్తే సమ్మక్క-సారలమ్మలకు పుస్తె, మట్టెలను బహుకరిస్తానని మొక్కుకున్నట్లు తెలిపారు. అమ్మవార్ల అనుగ్రహంతో తాను గెలిచానని, తాను మొక్కుకున్నట్లుగానే అమ్మవార్లకు పుస్తె, మట్టెలను బహుకరించినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో చదువు జయపాల్ రెడ్డి, చదువు మహిపాల్ రెడ్డి తదితరులున్నారు.

అమ్మవార్లను దర్శించుకున్న వేముల మహేందర్ గౌడ్ కుటుంబం

అమ్మవార్లను దర్శించుకున్న వేముల మహేందర్ గౌడ్ కుటుంబ సభ్యులు
మొగులపల్లి నేటి ధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని ముల్కలపల్లి-మొగుళ్ళపల్లి గ్రామాల మధ్యన అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న శ్రీ సమ్మక్క-సారలమ్మ మినీ మేడారం జాతరను బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా కిక్కిరిసిన జనసందోహం మధ్య మహేందర్ గౌడ్ అమ్మవార్లను దర్శించుకుని, మొక్కులను సమర్పించారు. అనంతరం తన పెద్ద కుమార్తె వేముల అనుప్రియ అమ్మవార్లకు ఇష్టమైన నిలువెత్తు బంగారంను దేవతలకు సమర్పించారు. ఈ క్రమంలో ఆయన జాతరలో ఏర్పాటు చేసిన విలేకరులతో మాట్లాడారు. సమ్మక్క-సారలమ్మ తల్లులు వారిని నమ్ముకున్న భక్తులకు కష్టాల చీకట్లను తరిమి కొట్టి, వారిని చల్లగా చూసేందుకు చల్లని పున్నమి వెన్నెల కాంతుల నడుమ మినీ మేడారం గద్దెలపై ఆసీనులైనారన్నారు. ఆ తల్లుల దీవెనలతో ప్రజలంతా కుటుంబ సభ్యులతో కలిసి మెలిసి, సుఖశాంతులతో, అష్టైశ్వర్యాలతో, పిల్లాపాపలతో, పాడి పంటలతో వర్ధిల్లాలని ఆ దేవతలను వేడుకున్నట్లు మహేందర్ గౌడ్ తెలిపారు.

మొగుళ్లపల్లిలో ఘనంగా మినీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర

గద్దెపై ఆసీనురాలైన వన దేవతలు పరిపూర్ణతను సంత రించుకున్న మొగుళ్ళపల్లి మినీ జాతరత

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

భక్తుల గుండెల్లో భక్తి జ్వాలగా వెలిగే వన దేవతలు ములకలపల్లి మొగుళ్లపల్లి గ్రామాల మధ్యలో శుక్రవారం మినీ మేడారం జాతరలో శరణు శరణు సమ్మక్క, శరణు శరణు సారక్క అంటూ. శివసత్తుల పూనకాలతో పోటెత్తిన భక్తజనం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగళ్ళపల్లి మండలంలోని ములకలపల్లి మొగుళ్లపల్లిలో మినీ మేడారం గా ప్రసిద్ధిగాంచిన సమ్మక్క సారలమ్మ జాతరకు వరంగల్ జిల్లాలోని పరకాల, నడికూడా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా. చిట్యాల టేకుమట్ల, కరీంనగర్ జిల్లా.

ఇల్లంతకుంట, జమ్మికుంట, మండలాలకు చెందిన అశేష భక్త జనవాహినితో సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంగణం లో జై సమ్మక్క జై జై సమ్మక్క అంటూ జయజయ ధ్వనులతో మారు మోగింది కోరిన కోర్కెలు తీర్చే చల్లని తల్లులు నమ్ముకున్న భక్తులను చల్లంగా చూసేందుకు కష్టాల చీకట్లను తరిమికొట్టి వరాలను వెన్నెలను చల్లెందుకు చల్లని పున్నమి కాంతుల నడుమ సమ్మక్క సారక్క గద్దెలపై కొలువు ధీరడంతో అంగరంగ వైభవంగా జాతర ఉత్సవాలను కమిటీ సభ్యులు నిర్వహించారు. ఉత్సవ కమిటీ సభ్యుల అంచనాకు మించి రెండు లక్షలకు పైగా భక్తులు వచ్చి అమ్మవార్లకు నిలువెత్తు బంగారం, కానుకలు, యాటపోతులను నైవేద్యంగా సమర్పించి అమ్మవార్లను దర్శించుకొని మొక్కులను చెల్లించుకున్న భక్తులు. జాతర ప్రదేశంలోనీ పెద్దవాగు, చిన్నవాగులలోనీ ప్రశాంత వాతావరణంలో తమ కుటుంబ సభ్యులతో అనందంగా జాతరను జరుపుకున్నారు.

మేడారం జాతరలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ 71 కేజీల బంగారం సమర్పణ

మేడారం సమ్మక్క – సారలమ్మకు బంగారాన్ని సమర్పించిన ఎమ్మెల్యే జీఎస్సార్

భూపాలపల్లి నేటిధాత్రి

తెలంగాణ కుంభమేళాగా పిలవబడే ములుగు జిల్లా ఎస్ ఎస్ తాడ్వాయి మండలం మేడారం గ్రామంలోని శ్రీ సమ్మక్క – సారలమ్మ మహా జాతరలో భాగంగా శుక్రవారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు- పద్మ(గణపురం మాజీ జడ్పీటీసీ) దంపతులు వనదేవతలను దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అధికారులు, సిబ్బంది స్వాగతం పలికారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తన బరువుకు సమానంగా 71 కేజీల బంగారం(బెల్లం)ను వనదేవతలకు నైవేద్యంగా సమర్పించారు.గిరిజన సంప్రదాయం ప్రకారం బెల్లాన్ని బంగారంలా భావించి సమర్పించడం మేడారం జాతరలో ముఖ్యమైన ఆచారమని,శ్రీ సమ్మక్క – సారలమ్మ ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని మొక్కుకున్నారు.
గట్టమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే దంపతులు.

మేడారం శ్రీ సమ్మక్క–సారలమ్మ తల్లుల దర్శనం కన్నా ముందు ఎమ్మెల్యే దంపతులు ములుగు పట్టణానికి సమీపంలోని గట్టమ్మ తల్లిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యే దంపతులకు అధికారులు, పూజారులు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలను ఎమ్మెల్యేకు అందజేశారు. మేడారం గిరిజన జాతరకు వెళ్లే భక్తులకు గట్టమ్మ ఆలయం గేట్ వే ఆఫ్ మేడారం గా ప్రసిద్ధి చెందింది.
కమలాపూర్ శ్రీ సమ్మక్క – సారలమ్మ జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులు.
భూపాలపల్లి మండలం కమలాపూర్ గ్రామ శివారులో జరుగుతున్న శ్రీ సమ్మక్క – సారలమ్మ మినీ మేడారం జాతరలో ఎమ్మెల్యే దంపతులిద్దరూ పాల్గొని, వన దేవతలను దర్శించుకుని మొక్కులను చెల్లించారు. కాగా, జాతర కమిటీ నిర్వాహకులు కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే దంపతులకు శాలువాలు కప్పి డప్పు చప్పుళ్ళతో స్వాగతం పలికారు. కమలాపూర్ శ్రీ సమ్మక్క – సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version