రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలైన సంఘటన సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల పరిధిలోని కప్పాడ్ రాయికోడ్ మధ్య అనుసంధానమైన రోడ్డుపై కప్పాడ్ గ్రామ శివారులో సాయంత్రం సుమారు 6 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రోడ్డు ప్రక్కనున్న ద్విచక్ర వాహనాన్ని ఏరేటిగా కారు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలైనట్లు గాయపడినటువంటి వ్యక్తులు రేగోడు మండలం జగిర్యాల్ గ్రామానికి చెందిన వారని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాసింపూర్ లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం.

కాసింపూర్ లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం..

నిజాంపేట నేటి ధాత్రి:

నిజాంపేట మండల పరిధిలోని కాసింపూర్ గ్రామంలో అంతర్గత రోడ్లు బాగోలేనందున 5 లక్షల వ్యయంతో శుక్రవారం గ్రామంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభించారు ఈ సందర్భంగా గ్రామ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ సిసి రోడ్డు నిర్మాణ పనులకు సహకరించిన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావుకు గ్రామస్తుల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలోకాంగ్రెస్ నాయకులు నీలం కనకరాజు,కుంటకనకరాజు, దావీద్,ప్రశాంత్,మధు, రవి,స్వామి,కొమురయ్య, బిక్షపతి,తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో గాయపడి మృతి చెందిన రాజా గౌడ్.!

రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన

ముదిగుంట మాజీ సర్పంచ్ రాజా గౌడ్

జైపూర్,నేటి ధాత్రి:

 

 

 

జైపూర్ మండలం ముదిగుంట గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మొగిలి పాక రాజా గౌడ్ రోడ్డు ప్రమాదంలో గాయపడి మరణించారు. వివరాల్లోకి వెళితే కొన్ని రోజులుగా మంచిర్యాలలో నివాసం ఉంటూ పని నిమిత్తం ఇంటి నుంచి నడుచుకుంటూ బయటికి వెళ్తున్న సమయంలో మంచిర్యాల ఓవర్ బ్రిడ్జ్ సమీపంలో టూ వీలర్ పై వచ్చిన వ్యక్తి వెనుక నుంచి ఢీకొనగా మొగిలి పాక రాజా గౌడ్ తలకి త్రీవ గాయాలైనట్లు స్థానికులు తెలిపారు.విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మంచిర్యాలలోని ఆస్పత్రి తరలించగా మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ తీసుకెళ్లాలని ఇక్కడి వైద్యులు సూచించగా కుటుంబ సభ్యులు హుటాహుటిన కరీంనగర్ లోని వజ్ర హాస్పిటల్ తరలించగా అక్కడి వైద్యులు వెంటనే గుర్తించి తలకు శాస్త్ర చికిత్స చేయాలని తెలిపారు. వెంటనే వైద్యుల సూచనలు మేరకు శాస్త్ర చికిత్స చేపించినప్పటికీ కూడా 20 రోజులుగా చికిత్స పోదుతూ శనివారం తెల్లవారుజామున మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.సర్పంచి పదవి కాలంలో గ్రామానికి చేసిన సేవలను గ్రామస్తులు స్మరించుకుంటూ కన్నీటి పర్వతం అయ్యారు.

నేషనల్ హైవే రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం.

నేషనల్ హైవే రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

మండలంలో రోడ్డు విస్తరణలో భాగంగా వరంగల్ నుండి మంచిర్యాల వరకు. నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు మార్గం కొత్తగా నిర్మాణం చేయడం జరుగుతున్న నేపథ్యంలో. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశాలతో మొగుళ్లపల్లి మండల తాహసిల్దార్ జాలి సునీత బుధవారం రోజున మొగుళ్లపల్లి గ్రామ శివారు ( భారత్ గ్యాస్ సమీపంలోని) వ్యవసాయ భూముల మీదుగా హైవే రోడ్డు నిర్మాణం చేపడుతున్న ప్రదేశానికి తాహసిల్దార్ చేరుకొని అక్కడున్న వ్యవసాయ భూములను పరిశీలించిన తాసిల్దార్. ప్రభుత్వం రైతుల వద్దనుండి స్వీకరించిన వ్యవసాయ భూములకు రోడ్డుకు అనుగుణంగా రెండు వైపులా హద్దులను వేయించారు. ఇరువైపులా. రోడ్డు నిర్మాణం పనులను పరిశీలించి వివిధ వాహనాలతో వ్యవసాయ భూమిని చదును చేయించి రోడ్డు విస్తరణ పనులను తాహసిల్దార్ మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో. ఎస్సై బొరగల అశోక్, గిరిధవార్. శివరామకృష్ణ, రెవెన్యూ సిబ్బంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

బైపాస్ రోడ్డు నుంచి డంపు యార్డ్ ను తరలించాలి.!

బైపాస్ రోడ్డు నుంచి డంపు యార్డ్ ను తరలించాలి

డంపు యార్డు వద్ద పొగలు ఆర్పి వేయుటకు తక్షణ చర్యలు తీసుకోవాలి-సిపిఐ

కరీంనగర్ నేటిధాత్రి:

కరీంనగర్ నగర శివారు బైపాస్ రోడ్ లోని డంపు యార్డును తరలించి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని, డంప్ యార్డ్ నుంచి వచ్చే పొగను వెంటనే ఆర్పివేయాలని కోరుతూ సోమవారం రోజున సిపిఐ ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయ ముట్టడి నిర్వహించడం జరుగుతుందని దీనిలో వందలాదిగా ప్రజలు తరలి రావాలని సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, సహాయ కార్యదర్శి పైడిపల్లి రాజు,న్యాలపట్ల రాజులు ఒక సంయుక్త ప్రకటనలో నగర ప్రజలకు పిలుపునిచ్చారు. ఈసందర్భంగా కసిరెడ్డి సురేందర్ రెడ్డి, పైడిపల్లి రాజు, న్యాలపట్ల రాజులు మాట్లాడుతూ కరీంనగర్ నగరంలో ఉన్నటువంటి బైపాస్ రోడ్ లో గల డంప్ యార్డు వల్ల నగరంలోని దాదాపు పది డివిజన్లలో ముఖ్యంగా కోతిరాంపూర్, అల్కాపురి కాలని, హనుమన్ నగర్, గణేష్ నగర్, లక్ష్మీ నగర్, హౌసింగ్ బోర్డు, కట్టరాంపూర్, పోచమ్మ వాడ, శాషామహల్, మారుతి నగర్, అలుగునూర్, బొమ్మకల్ ప్రజలకు ఎండాకాలంలో మంటలు అంటుకుని పొగ రావడం వల్ల వాయు కాలుష్యం నెలకొని చాలామంది ప్రజలు శ్వాసకోశ ఇబ్బందులతో ఆసుపత్రిల పాలవుతున్నారని, గర్భిణతో ఉన్న స్త్రీలు ఈపొగ పీల్చడం ద్వారా పుట్టే బిడ్డలకు కూడా ఇబ్బందులు జరుగుతున్నాయని కనీసం నగరపాలక అధికారులకు డంపు యార్డు తరలింపుపై ఆలోచన లేకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. గతంలో కరీంనగర్ మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు గంగుల కమలాకర్, మాజీ మేయర్ సునీల్ రావు కొన్ని కోట్ల రూపాయలతో చెత్తను శుద్ధి చేయడం కోసం మిషనరీని ఏర్పాటు చేశారని ఆమిషనరీ రెండు, మూడు రోజులు మాత్రమే నడిచి మూలకు పడ్డదని కోట్ల రూపాయల మిషనరీలో కుంభకోణానికి మేయర్, ఎమ్మెల్యే పాల్పడ్డారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. డంపు యార్డ్ మిసనరి కొనుగోలుపై న్యాయవిచారణ చేయాలన్నారు. దొంగే దొంగ అన్నట్లుగా మాజీ మేయర్ తన హయంలో స్మార్ట్ సిటీలో డంప్ యార్డ్ మిషనరీలో కోట్ల రూపాయల అవినీతికి పాల్పడి తన హాయంలో జరిగిన పనులలో అవినీతి జరిగిందని చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. కరీంనగర్ లోని తీగల వంతెన, రివర్ ఫ్రంట్ లలో తీవ్ర అవినీతి జరిగిందని సాక్షాత్తు మాజీ మేయర్ సునీల్ రావు చెప్పడం చూస్తుంటే ప్రజలు వీస్తూ పోతున్నారని అన్నారు. తీగల వంతనపై నెలల తరబడి వీధి దీపాలు రాకపోవడం చూస్తుంటే నగరపాలక కమిషనర్ మొద్దు నిద్రలో ఉన్నారా అని వారు ప్రశ్నించారు. డంప్ యార్డ్ వల్ల ఇబ్బందులు పడుతున్నామని వివిధ వార్డులకు చెందిన ప్రజలు ప్రతి రోజు నిరసనలు తెలుపుతుంటే మున్సిపల్ అధికారులు తమకేమీ పట్టనట్లు మొద్దు నిద్రలో ఉండడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి డంప్ యార్డులో వస్తున్న మంటలను ఆర్పి వేయుటకు చర్యలు తీసుకోవాలని వెంటనే డంపింగ్ యార్డ్ ని ఇక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేశారు.

రోడ్డుకు మోక్షం ఎప్పుడో !

రోడ్డుకు మోక్షం ఎప్పుడో!

కంకర వేశారు గాని రోడ్డు వేయడం మరచారు

సూర్య నాయక్ తండా నుండి పిఆర్ కొప్పుల వరకు బీటీ నిర్మాణం

శాయంపేట నేటిధాత్రి:

 

హనుమకొండ జిల్లా శాయంపేట మండలం సూర్య నాయక్ తండా నుండి పిఆర్ కొప్పుల వరకు బీటీ నిర్మాణ ము అసంపూర్తిగా నిలిచి పోయింది. పనులు పూర్తి చేసే విషయంలో ప్రజా ప్రతినిధులు అధికారులు చొరవ చూపడం లేదని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు కంకర పోసి వదిలి వేసిన రోడ్డుపై రాకపో కలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రోడ్డు పనులు చేపట్టా లని పలుమార్లు అధికా రులకు చెప్పిన స్పందన లేదు రెండేళ్ల క్రితం సూర్య నాయక్ తండా నుండి కొప్పుల గ్రామా నికి నాలుగు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం 262. 50 లక్షల రూపాయలను మంజూరు చేసింది రెండు ఏండ్లు క్రితం రోడ్డు పనులు ప్రారంభించారు సూర్య నాయక్ తండా నుండి కొప్పుల వెళ్లే రోడ్డుపై కంకర పోశారు కాగా మంజూరైన నిధులకు పనులు చేపట్టిన కాంట్రాక్టర్ మధ్యలోనే వదిలేశారు.

BT construction Surya Nayak Thanda.

చాలా కాలంగా సూర్య నాయక్ తండా నుండి కొప్పుల ప్రజలు వాహనదారులు ప్రయాణానికి అవస్థలు పడుతున్నారు ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని అసంపూర్తిగా రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

రోడ్డు ప్రమాదంలో గాయపడిన.!

రోడ్డు ప్రమాదంలో గాయపడిన సీనియర్ జర్నలిస్ట్ మల్యాల బాలస్వామి ని ఫోన్ లో పరామర్శిస్తున్న ఎమ్మెల్యే తూడి
వనపర్తి నేటిదాత్రి :

వనపర్తి జిల్లా కేంద్రంలో రాజనగరం గోశాల దగ్గర రోడ్డు ప్రమాదానికి గురైన సీనియర్ జర్నలిస్ట్ నాగవరం మల్యాల బాలస్వామిని ఫోన్ లో వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డి పరామర్శించి గాయాలపై ఆరా తీశారు .. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెగా రెడ్డి మాట్లాడుతూ మెరుగైన వైద్యం చేయించుకుని త్వరగా కోలుకోవాలని సీనియర్ జర్నలిస్ట్ బాలస్వామిని కోరారు.

కంకర పరిచారు.. రోడ్డు మరిచారు.

కంకర పరిచారు.. రోడ్డు మరిచారు

రోడ్డు వెయ్యండి బాబు… ప్రజలకు తప్పని ఇబ్బందు లు

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలం కొప్పుల గ్రామం నుండి గంగిరేణిగూ డానికి రైతులు పంట పొలా లకు గంగిరేణి గూడెం గ్రామం వరకు నూతన బిటి రోడ్డు మంజూరు చేశారు సదరు గుత్తేదారు రోడ్డును తవ్వి కంకర పోసి వదిలేశారు. సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటివరకు పనులు పూర్తి కాకపోవడంతో రోడ్డుపై ప్రయాణం చేయాలంటే నరకం చూస్తున్నట్లు స్థానికులు ఆవేదం వ్యక్తం చేస్తున్నారు రాకపోకలకు వేరే మార్గం లేక తీవ ఇబ్బందులు ఎదుర్కొ న్నట్లు ఆగ్రహం చేస్తున్నారు. నెలలు గడుస్తున్న రోడ్డును తీసి కంకర పోసి వదిలిపెట్టారు దీన్ని ఎవరు పట్టించుకోక పోవడం వల్ల రాకపోకలను ఇబ్బందులు గురవుతున్నారు అధికారులు కానీ, ప్రజాప్రతిని ధులు గాని స్పందించి సకాలం లో రోడ్డు పూర్తయ్యాలో చూడా లని ప్రజలు కోరుతున్నారు. రాత్రి వేళల్లో రోడ్డు సరిగ్గా కని పించక స్లిప్పు అయి చాలా మంది ప్రమాదాలు గురవుతు న్నారు రోడ్డు అసంపూర్తిగా ఉండడంతో పాటు కంకర రాళ్ల వల్ల ఇప్పటికి చాలామంది గాయపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.

రోడ్డు పై ప్రమాదకరంగ ఉన్న దిమ్మే తొలగించాలి

రోడ్డు పై ప్రమాదకరంగ ఉన్న
దిమ్మే తొలగించాలి
వనపర్తి నేటిదాత్రి :

 

వనపర్తి జిల్లా కేంద్రంలోని 33 వ వార్డులో రిలయన్స్ మార్ట్ పక్కన నూతనంగా సిసి రోడ్డు మురుగు కాలువ నిర్మాణం ప్రారంభమైన సందర్భంగా పట్టణ ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్న రిలయన్స్ స్మార్ట్ పక్కన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మురుగు కాల్వ పైన మరియు రోడ్డుపై ఉన్నటువంటి దిమ్మెను తొలగించి మోడల్ గా పిల్లర్ వేసి రోడ్డుపైన ప్రమాదంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్ను నూతనంగా నిర్మించాలని వార్డు ప్రజలకు రోడ్డుపైన వెళ్లే ప్రయాణికులకు ప్రమాదం జరగకుండా ఉండే విధంగా ఏర్పాటు చేయాలని మాజీ మున్సిపల్ కౌన్సిలర్ వుంగుళం తిరుమల్ విద్యుత్ ఏఈ రాజయ్య గౌడ్ కు సమాచారం ఇవ్వగా అక్కడి కి వచ్చి పరిశీలించి వెంటనే వీటిని మురుగు కాలువపై రోడ్డుపై ఉండకుండా పక్కనే నిర్మాణం చేసే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని తిరుమల్ తెలిపారు

రోడ్డు వెడల్పు విషయంలో అంబేద్కర్ విగ్రహాలు.

రోడ్డు వెడల్పు విషయంలో అంబేద్కర్ విగ్రహాలు తొలగించడం సమంజసం కాదు

నిజాంపేట: నేటి ధాత్రి

 

 

మెదక్, సిద్దిపేట నేషనల్ హైరోడ్డు వెడల్పు విషయంలో అంబేద్కర్ విగ్రహాలు తొలగించడం సమంజసం కాదు

నిజాంపేట: నేటి ధాత్రి

మెదక్, సిద్దిపేట నేషనల్ హైవే రోడ్డు పనుల్లో భాగంగా అంబేద్కర్ విగ్రహాలను తొలగించడం విషయమై తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యను కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు. తొలగించిన విగ్రహాలను యధావిధిగా ప్రతిష్టించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ఏంఆర్పిఎస్టిఎస్ అధ్యక్షులు గరువుల శ్రీనివాస్, నిజాంబాద్ జిల్లా అధ్యక్షులు సల్లూరి శ్రీనివాస్, ఆందోల్ దళిత నాయకుడు మాసన్నపల్లి నాగరాజు ,పిఎస్ టీఎస్ నిజాంపేట మండల అధ్యక్షుడు జనగామ స్వామి మెదక్ కాంగ్రెస్ యువ నాయకులు పవన్ తదితరులు పాల్గొన్నారు
వే రోడ్డు పనుల్లో భాగంగా అంబేద్కర్ విగ్రహాలను తొలగించడం విషయమై తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యను కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు. తొలగించిన విగ్రహాలను యధావిధిగా ప్రతిష్టించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ఏంఆర్పిఎస్టిఎస్ అధ్యక్షులు గరువుల శ్రీనివాస్, నిజాంబాద్ జిల్లా అధ్యక్షులు సల్లూరి శ్రీనివాస్, ఆందోల్ దళిత నాయకుడు మాసన్నపల్లి నాగరాజు ,పిఎస్ టీఎస్ నిజాంపేట మండల అధ్యక్షుడు జనగామ స్వామి మెదక్ కాంగ్రెస్ యువ నాయకులు పవన్ తదితరులు పాల్గొన్నారు

రోడ్డు ప్రమాదం లో ఇద్దరు మృతి.

రోడ్డు ప్రమాదం లో ఇద్దరు మృతి.

కల్వకుర్తి /నేటి దాత్రి :

 

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటన జడ్చర్ల- కోదాడ రహదారిపై మంగళవారం రాత్రి చోటు చేసుకుంది.పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణానికి చెందిన కాసుల అరవింద్ చారీ (31)చీపుర కార్తీక్ చారీ (32)ద్విచక్ర వాహనంపై దేవరకొండ వెళ్లి స్వగ్రామానికి తిరిగి ప్రాణమయ్యారు. మార్గమధ్యంలో ఎర్రగుంటపల్లి గేట్ సమీపంలో జడ్చర్ల- కోదాడ ప్రధాన రహదారిపై ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడింది.

 

accident

 

ఈ ప్రమాదంలో అరవింద్ చారి, కార్తీక్ చారి లకు తలకు బలమైన గాయం తగలడం వల్ల అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ రాజు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి.

రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని పస్తాపూర్ గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం లో వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు, పోలీసులు తెలిపారు. వారు తెలిపిన వివరాలు ప్రకారం ఝరాసంగం మండలం చిలేపల్లి గ్రామానికి చెందిన బోయిని నర్సింలు తన పని ముగించుకొని రాత్రి ఆటోలో జహీరాబాద్ నుండి తన స్వగ్రామమైన చిలేపల్లి కి వస్తున్న క్రమంలో పస్తాపూర్ గ్రామ సమీపంలో గల బ్రిడ్జి వద్ద ఆటో ఎదురుగ వస్తున్న డీసీఎం తో ఆటో అదుపు తప్పి ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని తెలిపారు.

Road accident

 

ఈ దూర్ఘటనలో చిలేపల్లి గ్రామానికి చెందిన బోయిని నర్సింలు తీవ్రంగా గాయపడి సంఘటన స్థలలోనే మృతి చెందాగా, డ్రైవర్‌ కు గాయాలు కావడతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదం జరిగిందన్న సమాచారం తెలుసుకున్న జహీరాబాద్ రూరల్‌ పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకొని పరిస్థితుల్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన నర్సింలు కు, సింధు (5), స్వాతి (3) సంవత్సరల ఇద్దరు కూతుర్లు ఉన్నట్లు తెలిపారు.

మా భూమి రధయాత్ర ను విజయవంతం చేయండి.

ఒకలక్ష కిలోమీటర్ల మా భూమి రధయాత్ర ను విజయవంతం చేయండి

ధర్మసమాజ్ పార్టీ పరకాల మండల అధ్యక్షులు నాగ మహారాజ్ నేటి ధాత్రి:

 

 

పరకాల నేటిధాత్రి మండలంలోని బీసీ,ఎస్సీ,ఎస్టీల హక్కులు మరియు రాజ్యాధికార సాధన జేఏసీ,ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఏప్రిల్ 14 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజున ఆదిలాబాద్ డైట్ కాలేజీ గ్రౌండ్లో డాక్టర్ విశారదన్ మహరాజ్ చేపట్టబోయే ఒక లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్ర కరపత్రం ఆవిష్కరించడం జరిగింది.ఈ కసందర్బంగా పరకాల మండల అధ్యక్షులు నాగరాజు మహారాజ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని 90 శాతం ప్రజలైన బీసీ,ఎస్సీ,ఎస్టీలు ప్రజలకు రాజకీయ చైతన్యాన్ని అందిస్తూ ఈ దేశంలోనే ఎవరూ ఇంతవరకు చేయని సాహసోపేతమైన ఒక లక్ష కిలోమీటర్ల మాభూమి రథయాత్ర అంతర్లీనంగా పదివేల కిలోమీటర్ల పాదయాత్ర కొనసాగిస్తూ వీరిని రాజ్యాధికారం వైపు నడిపించడానికి అధిక సంఖ్యలో వివిధ కుల సంఘాల నాయకులు,విద్యార్థి సంఘాల నాయకులు,ప్రజాస్వామిక వాదులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపును ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రశాంత్,సూర్యం,ప్రవీణ్, ప్రభాస్,సిద్దార్థ్ తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి పార్లమెంటు రహదారి సమస్యలకి.

*తిరుపతి పార్లమెంటు రహదారి సమస్యలకి పరిష్కారం చూపండి..

*కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో తిరుపతి ఎంపీ గురుమూర్తి బేటీ..

*త్వరలోనే తిరుపతి ఇంట్రా మోడల్ బస్ స్టేషన్ నిర్మాణ పనులు ప్రారంభం..

*కేంద్ర మంత్రి
గడ్కరీ హామీ..

తిరుపతి(నేటి ధాత్రి) మార్చి 27:

 

తిరుపతి పార్లమెంటు పరిధిలోని జాతీయ రహదారులకు సంబందించిన సమస్యలు, ఇంట్రా మోడల్ బస్ స్టేషన్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కోరుతూ తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖా మాత్యులు నితిన్ గడ్కరీతో బేటీ అయ్యారు.

ఈ సందర్బంగా నాయుడుపేట, తూర్పు కనుపూరు జాతీయ రహదారి -71లో ప్యాకేజ్ 4, వరగలి క్రాస్, తూర్పు కనుపూరు జాతీయ రహదారి-516 డబ్ల్యూ ప్యాకేజ్ 2లో సర్వీస్ రోడ్లు, వెహికల్ అండర్ పాస్ లు మంజూరు చేసి సరైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎంపీ కోరారు.

ఈ రహదారుల్లో రూపొందించిన అండర్ పాస్ ల డిజైన్ కారణంగా ప్రజలకు ఇబ్బందికరంగా ఉందని, ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తుల రవాణా విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

రైతుల పొలాలలో రహదారులు నిర్మిస్తున్నందున వారికి కనీస మౌళిక సదుపాయాలు కల్పించాలని మంత్రిని కోరారు.

రైతులు ప్రదానంగా రహదారికి ఒక వైపు నుంచి మరో వైపుకు తమ వ్యవసాయ ఉత్పత్తులను తరలిచేందుకు, వ్యవసాయ సామగ్రిని తీసుకెళ్లేందుకు అనువుగా సర్వీస్ రోడ్లు, వెహికల్ అండర్ పాస్ లు అవసరం అని ఆయనకి వివరించారు.

ఆయా ప్రాంతాలలో రైతులు చేపట్టిన ఆంధోళన కార్యక్రమాల విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

సర్వీసు రోడ్లు, అండర్ పాస్ లు కావాలని రైతులు అందించిన వినతి పత్రాలతోపాటుగా సమగ్రమైన వివరాలను ఆయనకు అందజేశారు.

ఈ అంశంపై సానుకూలంగా స్పందించిన గడ్కరీ ఈ రహదారులకు సంబందించి మరోసారి పరిశీలన చేసి సమగ్ర నివేదిక ఇవ్వాలని అదికారులను ఆదేశించారు.

తిరుపతి ఇంట్రా మోడల్ బస్ స్టేషన్ నిర్మాణ పనులు ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరగా డిజైన్ లలో స్వల్ప మార్పుల కారణంగా ఆలస్యమైనదని త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకొంటామని ఆయన హామీ ఇచ్చారని ఎంపీ తెలియజేశారు.

రేణిగుంట, నాయుడుపేట మధ్య జాతీయ రహదారిపై నుండి సర్వీసు రోడ్లకు ప్రవేశం లేదని, ప్రస్తుత డిజైన్ స్థానిక ప్రజలకు అసౌకర్యంగా ఉందని ఆయనకి వివరించారు.

అలాగే ఈ రహదారిపై శ్రీకాళహస్తి నుండి ముచ్చువోలు, వెంకటగిరిల రోడ్డును కలిపేందుకు యాక్సెస్ రోడ్డు, చావలి నుండి గుర్రపుతోట జంక్షన్ వరకు సర్వీస్ రోడ్డు విస్తరణ, చిల్లకూరు నుండి గుర్రపుతోట వరకు సర్వీస్ రోడ్డు విస్తరణ చేయాలని కేంద్ర మంత్రి గడ్కరీని అభ్యర్దించారు..

రోడ్డు నిబంధనలు పాటించని వారిపై చర్యలు.

“రోడ్డు నిబంధనలు పాటించని వారిపై చర్యలు”
– ఎస్సై సంగమేశ్వర్

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు రోడ్డు నిబంధనలు కచ్చితంగా పాటించాలని లేనిపక్షంలో నిబంధనలు పాటించని వారిపై చట్టరీత్య చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఝరాసంగం ఎస్సై సంగమేశ్వర్ తెలిపారు. జహీరాబాద్ నుండి రాయికోడ్ కు వయా ఝరాసంగం వెళ్లే ప్రధాన రోడ్డు పై మల్లన్న గట్టు కు వెళ్లే కూడలి రామయ్య జంక్షన్ వద్ద సోమవారం సాయంకాల సమయంలో పోలీస్ సిబ్బంది తో కలిసి వాహనాలు తనిఖీ చేశారు.

Ramaiah Junction

ఈ సందర్బంగా ఆయన వాహనదారులకు పలు సూచనలు సలహాలు చేసి, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో పట్టుబడ్డ వారికి చలాన్లు వేశారు. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు రోడ్డు నిబంధనలు కచ్చితంగా పాటించి డ్రైవింగ్ లైసెన్సు, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, పొల్యూషన్, సంబందిత పత్రాలు కల్గి ఉండి మంచి కండిషన్ గల వాహనల్ని నడపాలని, వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని, మానవ ప్రాణం అత్యంత విలువైనదాని, అతి వేగంతో వాహనాల్ని నడపారాదని, రహదారులు పచ్చని చెట్ల నీడతో కప్పబడాలి తప్ప మనిషి రక్తంతో తడవకూడదని వాహనాలు ఢీకొనడం గాని రోడ్డు ప్రమాదాలు జరగడం వల్ల అంగ వికలాంగులు కావడం కుటుంబ సభ్యులకు దూరమావడం తన పై ఆధారపడ్డ వారికి దుఃఖం ను మిగిల్చకూడదని వారి జీవితం అగమ్య గోచరంగా మారుతుందని అందుకు
ప్రతి ఒక్కరు బరువుగా కాకుండా బాధ్యత గా హెల్మెట్ ధరించాలని సూచించారు. చిన్నపిల్లలకు బైకులు ఇవ్వరాదని మద్యం సేవించి వాహనాలు నడపరాదని, ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించి ప్రమాదాల నివారణకు సహకరించాలని ఆయన సూచించారు.

రోడ్డు వేయకుండా వదిలిపెట్టారు.

28వ వార్డులో .రోడ్డు కోసం త్రవ్వారు. రోడ్డు వేయకుండా వదిలిపెట్టారు

 

వనపర్తి నేటిదాత్రి :

వనపర్తి లో
ఆరు నెలల క్రితం రోడ్డు మంజూరు అయిందని చెప్పి 28వ శ్రీవాణి కాలేజీ వెనకాల చాణిక్య స్కూల్ వైపు, యాదవ సంఘం భవనం పక్కన రోడ్డు కోసం మట్టిని త్రవ్వారు . దానిపై అక్కడక్కడ డస్ట్ వేశారు ప్రజల ఇబ్బంది పడుతున్నా పట్టించుకునే నాధుడు లేడు ఆరు నెలలుగా ఎం ఈ దగ్గరికి వెళ్లినా వారు సమయానికి ఆఫీస్ లో ఉండరని ఫోన్ చేస్తే ఎత్తరు, కాంట్రాక్టర్ ఎవరో తెలియదు,డీ ఈ ని అడుగుతే నాకు తెలియదు నా వర్క్ కాదు అంటూ తప్పించుకున్నారని పబ్లిక్ హెల్త్ డి. ఈ కిందికి వస్తుంది మున్సిపాలిటీ ఏ ఈ ప్రశాంత్ కు సంబంధం అని తెలిపాడు. పబ్లిక్ హెల్త్ డీఈకి ఫోన్ చేసి వెంటనే రోడ్డు వేయాలని డిమాండ్ చేయడం జరిగింది. దీనివల్ల ఆరు నెలలుగా 28 వ వార్డు ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని ద్విచక్ర వాహనాలు కిందపడి కాలు విరగొట్టుకున్నారని జిల్లా అఖిలపక్షఐక్య వేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ తెలిపారు. వెంటనే ఆ పనులు చేపట్టకుంటే వెంగళరావు కాలనీ మాజీ కౌన్సిలర్ గా ప్రజల తరఫున స్థానిక ఎమ్మెల్యే తూడిమేగా రెడ్డి జిల్లా కలెక్టర్కు అధికారులకు ఫిర్యాదు చేస్తామని సతీష్ యాదవ్ తెలిపారు.

మురికి కాలువ నిర్మించిన తర్వాత రోడ్డు వేయాలి..

మురికి కాలువ నిర్మించిన తర్వాత రోడ్డు వేయాలి..

సంతకాలు సేకరించి మున్సిపల్ అధికారులకు వినతిపత్రం అందజేత..

రామాయంపేట మార్చి 22 నేటి ధాత్రి (మెదక్)

 

రామాయంపేట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి నుండి బైపాస్ రోడ్డులో డబుల్ బెడ్ రూమ్ వద్దకు వెళ్లడానికి బీటి రోడ్డు మంజూరు అయింది. ఈ పనులు రెండు మూడు రోజుల్లో ప్రారంభిస్తారని తెలుసుకున్న కాలనీ ప్రజలు సంతకాలు సేకరించి మున్సిపల్ అధికారులకు అందజేశారు. ఈ ప్రాంతం చెరువు దగ్గర ఉండటం వల్ల చెరువుల నుండి , వర్షాలు పడితే వర్షపు నీరు ఇండ్లలోకి వచ్చే పరిస్థితి ఉందన్నారు. ముందుగా సైడ్ డ్రెయిన్స్ నిర్మించిన తర్వాత రోడ్డు వేస్తే శాశ్వత పరిష్కారం ఉంటుందని కాలనీ ప్రజలు అన్నారు. ఒకవేళ ఇలా నిర్మించకుంటే మురికి నీరు వర్షపు నీరు ఇండ్లలోకి వచ్చే దుస్థితి ఉందన్నారు. తాము అభివృద్ధికి ఏమాత్రం వ్యతిరేకం కాదని కానీ సైడ్ డ్రయిన్స్ నిర్మించిన తర్వాత రోడ్డు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై సదర్ కాంట్రాక్టర్ ను అడిగితే తమకు కేవలం రోడ్డు నిర్మాణానికి మాత్రమే తనకు నిధులు వచ్చాయని సైట్ డ్రీమ్స్ కు ఎలాంటి నిధులు రాలేదని కాంట్రాక్టర్ తెలిపారని వార్డు ప్రజలు అన్నారు. సైడ్ డ్రాయింగ్స్ వేయకుండా రోడ్డు వేయడానికి ప్రయత్నిస్తే అడ్డుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండి అస్నుద్దీన్. ఎండి సల్మాన్. ఎస్.కె షకిల్. సయ్యద్ జియా. సయ్యద్ నాజర్ బాయ్. పల్లె పెంటయ్య. ఎరుకల పోచయ్య. పల్లె యాదగిరి. ఎరుకల మోహన్. శ్రీశైలం. పల్లె కృష్ణ. తదితరులు పాల్గొన్నారు.

Municipal officials.

రోడ్డు ప్రమాదం లో బి ఆర్ ఎస్ గ్రామ అధ్యక్షులు.!

రోడ్డు ప్రమాదం లో బి ఆర్ ఎస్ గ్రామ అధ్యక్షులు రా చన్న పటేల్ మృతి.

జహీరాబాద్ నేటి ధాత్రి:

Ra Channa Patel

ఝరాసంగం మండల పరిధిలోని కప్పాడ్ గ్రామ బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు రాచన్న పటేల్ కప్పా డ్ గ్రామంలో రోడ్డు ప్రమాదం లో మృతి చెందారు. సాయకాలం వాకింగ్ కోసం వెళ్లి వస్తుండగా ఈ సంఘంటానా జరిగింది అని స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకోన్న డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్,బి ఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకటేశం, కేతకి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ నర్సింహా గౌడ్ లు ఆస్పత్రి కి వెళ్లి పరామర్శించారు. అయన మృతి చెందడంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ప్రధాన రహదారి మీద బ్రిడ్జి కృగడం.!

ఏదిరా గుట్టలు, యాకన్నగూడెం మధ్య ప్రధాన రహదారి మీద బ్రిడ్జి కృగడం,

ప్రయాణికులు అంతరాయం..

తక్షణమే బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టాలి..

తెలంగాణ ప్రభుత్వం యాకన్నగూడెం,బ్రిడ్జి నిర్మాణ పనులకు చర్యలు తీసుకోవాలి..

భద్రాచలం నియోజకవర్గం ఎమ్మెల్యే బ్రిడ్జి నిర్మాణ పనుల గురించి పట్టించుకోవాలి..

ఇక్కడ ప్రయాణం చేసే ప్రజల ఇబ్బందులు కష్టాలు,వర్ణా తితం..

దుమ్ము ధూళి, మంచుల కమ్మకొస్తుంది..

బ్రిడ్జి కృంగి 6 నెలలు అవుతునా..
పట్టించుకునే నాడుడే లేరు..

ఈ ప్రజాస్వామ్యం లో ప్రజలు ఉన్నారా..!వెంకటాపురం నుండి చర్ల వరకు అది రొడ్డ బట్రే పొక్కలా

ప్రజలు ఎప్పుడు మేధావులు అవుతారు.

ప్రజల నుండి ఓట్లు లాగే అంతవరకే నా రాజకీయ పార్టీలు..

వర్షాకాలంలో బ్రిడ్జి నిర్మాణ పనులకు చర్యలు లేకుంటే ప్రజలుకు ఇబ్బందులు తప్పవా.

నూగూర్ వెనకాకటాపురం (నేటి దాత్రి ):

మర్చి 15 ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ఏదిరా గ్రామ పంచాయితీ, యాకన్నగూడెం,గ్రామ చివరి లో బ్రిడ్జి కృంగి పోయింది. బస్సు లో వెళ్లే ప్రయాణికులకు, మరి ఇతర వాహనాలమీద ప్రయాణించే వారు చాలా ఇబ్బందులకు గురివుతున్నారని. ప్రజాసంఘాలు మాట్లాడు తున్నాయని అన్నారు.యాకన్నగూడెం బ్రిడ్జి కృంగి పోయి చాలా కాలం అయి నప్పటికీ ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు పట్టించుకోవడం లేదు, అని ప్రజలు ఆరోపిస్తున్నారు.వెంకటాపురం నుండి చర్ల వేళ్లే ప్రయాణికులకు దుమ్ము, దూళి, అధిక గా, ముక్కు, నోట్లోకి వేళ్లడం వల్ల ప్రయాణా నికి అంతరాయం జరుగుతుంది అని ఆదివాసీ సంఘాలు అంటున్నాయి.ప్రజల ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం, అధికారులు పట్టింసుకోవాలని ప్రజాసంఘాలు మాట్లాడుతున్నాయి.యాకన్నగూడెం బ్రిడ్జి ని గమనించి త్వరగా నిర్మాణపనులు చేపట్టాలని ప్రజలు అంటున్నారు.

సిసి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ.

సిసి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ.

చందుర్తి, నేటిధాత్రి:

చందుర్తి మండలంలోని కిష్టంపేట గ్రామనికి వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సహకారంతో సిసి రోడ్డుకు నిధులు మంజూరు అయ్యాయి. 14 లక్షల విలువైన సిసి రోడ్ల నిర్మాణానికి బుధవారం కాంగ్రెస్ నాయకులు భూమి పూజ చేసి పనులు ప్రారంభించటం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, గ్రామాల అభివృద్ధియే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.వేములవాడ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆది శ్రీనివాస్ అహర్నిశలు శ్రమిస్తున్న తీరుపై కొనియాడారు. ఈ కార్యక్రమంలో రుద్రంగి మార్కెట్ ఏ ఎంసి డైరెక్టర్ కరీమ్, మాజీ ఎంపిటిసి మొకానపెల్లి దేవరాజు మంజుల, బాణాల లక్ష్మా రెడ్డి, కోమటిరెడ్డి శ్రీనివాస్, పోతుగంటి రఘుపతి,పోతుగంటి రంజిత్, చిగుర్ల మల్లేశం, చిగుర్ల నాగేష్,భూమాండ్ల కొమురయ్య, మ్యాదరి లచ్చయ్య, పుల్లూరి జెలందర్, భూమాండ్ల మధు,తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version