బ్రిడ్జిపై కుంగిన రోడ్డు… భయాందోళనలో వాహనదారులు
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
క్యాతనపల్లి రైల్వే గేటు సమీపంలో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కొరకు 35 కోట్ల నిధులతో దశాబ్దం క్రితం పనులు మొదలు పెట్టినప్పటికీ అప్రోచ్ రోడ్డు పనులు ఇటీవల ముగియడంతో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి పై రోడ్డు వేసి ప్రయాణికుల సౌకర్యార్థం గత ఆరు నెలల క్రితం స్ధానిక ఎమ్మెల్యే ప్రారంభించారు. బ్రిడ్జి ప్రారంభించిన 6 నెలలలోని బ్రిడ్జిపై వేసిన రోడ్డు కుంగిపోయింది.
రామకృష్ణాపూర్ నుండి మంచిర్యాల వైపునకు వెళ్లే దారిలో బ్రిడ్జిపై రోడ్డు కుంగిపోవడంతో పాటు ఫుట్‌పాత్‌పై పగుళ్లు సైతం ఏర్పడ్డాయి.బ్రిడ్జి పై రోడ్డు కుంగడంతో వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. కాంట్రాక్టర్లు నాణ్యత పాటించకపోవడం, అధికారులు దృష్టి సారించకపోవడంతో రోడ్డు కొంగిపోయే పరిస్థితి తలెత్తిందని, కాంట్రాక్టర్ పై ఆర్ అండ్ బి అధికారులు తగు చర్యలు తీసుకోవాలని పుర ప్రముఖులు, పలువురు వాహనదారులు ఆరోపిస్తున్నారు. రానున్న రోజుల్లో బ్రిడ్జి పరిస్థితి ఏ విధంగా ఉంటుందోనని వాహనదారులు, ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.