జిల్లాలో ప్రశాంతంగా కొనసాగిన మొదటి విడత పంచాయితీ ఎన్నికలు
జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల,నేటి ధాత్రి:
2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గురువారం మొదటి విడత సర్పంచ్,వార్డు సభ్యుల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగాయని జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.గురువారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో ఏర్పాటు చేసిన సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళి, కౌంటింగ్ ప్రక్రియను అదనపు ఎన్నికల అధికారి,జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు తో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 2వ సాధారణ పంచాయతీ ఎన్నికలు- 2025 మొదటి విడతలో జిల్లాలోని జన్నారం, దండేపల్లి,లక్షెట్టిపేట,హాజీపూర్ మండలాలలో సర్పంచ్,వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగిందని తెలిపారు.జిల్లాలో గుర్తించిన 24 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించి వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
