ఈ నెల 27న మద్యం షాపుల లాటరీ ప్రక్రియ
మద్యం షాపులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు రిసిప్ట్ ఎంట్రీ పాస్ ఒరిజినల్ తీసుకొని రాగలరు
ఎక్సైజ్ సూపర్డెంట్ శ్రీనివాస్
జయశంకర్ భూపాలపల్లి ములుగు జిల్లాలకు గాను 2025 – 27 సంవత్సరాలకు గాను ఏ4 మద్యం షాపుల దరఖాస్తు ప్రక్రియ తేదీ 23.10.2025 నాటికి ముగిసింది. భూపాలపల్లి ఎక్సైజ్ యూనిట్ లోని మొత్తం (59) మద్యం దుకాణాలకు గాను 1,863 దరఖాస్తులు రావడం జరిగింది. దరఖాస్తు ఫీజు రూపంలో 55 కోట్ల 89 లక్షల రూపాయల ఆదాయం వచ్చిందని జిల్లా ఎక్సైజ్ అధికారి శ్రీనివాస్ తెలిపారు.
భూపాలపల్లి ఎక్సైజ్ యూనిట్ లో అత్యధికంగా మల్లంపల్లి గ్రామం మండలం మద్యం షాపుకు 77 దరఖాస్తులు రావడం జరిగిందని తెలిపారు. 27.10.2025 సోమవారం రోజున మద్యం షాపుల కేటాయింపుకు సంబంధించిన లాటరీ ప్రక్రియను భూపాలపల్లి పట్టణం, మంజూరు నగర్ లోని ఇల్లందు క్లబ్ హౌస్ ఫంక్షన్ హాల్ నందు జిల్లా కలెక్టర్ మేజిస్ట్రేట్ రాహుల్ శర్మ సమక్షంలో ఉదయం 10 గంటలకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి భూపాలపల్లి ఎక్సైజ్ యూనిట్ లో మద్యం షాపులకు దరఖాస్తు చేసిన దరఖాస్తుదారులు ఆర్థరైజ్డ్ రెప్రెసెంటేటివ్స్ తేదీ 27.10.2025 సోమవారం ఉదయం 9 గంటల వరకు ఇల్లందు క్లబ్ హౌస్ ఫంక్షన్ హాల్ కు హాజరు కావాల్సిందిగా ఆయన సూచించారు. దరఖాస్తుదారులు ఆర్థరైజ్డ్ రెప్రెసెంటేటివ్స్ ఈ కార్యక్రమానికి హాజరు కావడానికి మద్యం దుకాణానికి దరఖాస్తు చేసిన సమయంలో వారికి ఇచ్చినటువంటి రిసిప్ట్ ఎంట్రీ పాస్ ఒరిజినల్ ను తీసుకొని రావాలని ఎక్సైజ్ సూపర్డెంట్ శ్రీనివాస్ సూచించారు
