పోలీస్ అమరవీరుల జ్ఞాపకార్థం రక్తదాన శిబిరం ఏర్పాటు…

పోలీస్ అమరవీరుల జ్ఞాపకార్థం రక్తదాన శిబిరం ఏర్పాటు – యువకులు ముందుకు రావాలని వర్ధన్నపేట పోలీసుల విజ్ఞప్త

వర్ధన్నపేట (నేటిధాత్రి):

 

దేశం కోసం ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల జ్ఞాపకార్థంగా వర్ధన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని యువజన సంఘాలు, యువకులు స్వచ్ఛందంగా రక్తదానంలో పాల్గొనాలని వర్ధన్నపేట పోలీసులు విజ్ఞప్తి చేశారు.ఈ నేపథ్యంలో వర్ధన్నపేట పోలీస్ ఆధ్వర్యంలో అక్టోబర్ 29, 2025 (బుధవారం) ఉదయం 10 గంటల నుండి పాలకుర్తి బసారత్ ఫంక్షన్ హాల్ వద్ద ఉచిత రక్తదాన శిబిరం ఏర్పాటు చేయబడనుంది.
వర్ధన్నపేట పోలీస్ స్టేషన్ ఉప పోలీస్ అధికారి ఎన్. సాయి బాబు మాట్లాడుతూ —
“దేశం కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగానికి గౌరవం తెలపడానికి రక్తదానం చేయడం ఒక మహత్తరమైన సేవ. ప్రతి గ్రామంలోని యువజన సంఘాలు, విద్యార్థులు, ప్రజలు ముందుకు వచ్చి రక్తదానం చేయాలి. మనం ఇచ్చే ఒక్క సీసా రక్తం ఎవరికో కొత్త జీవం అందించగలదు” అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, స్థానిక యువజన సంఘాలు, సామాజిక సేవా సంస్థలు చురుకుగా పాల్గొంటున్నాయని ఆయన తెలిపారు. రక్తదానం ద్వారా సమాజానికి మేలు జరుగుతుందని, ఆరోగ్యానికి ఎలాంటి హాని కలగదని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరారు.
ఈ రక్తదాన శిబిరం నిర్వహణలో స్థానిక వైద్యులు, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది సహకారం అందిస్తున్నారని అధికారులు తెలిపారు. సంప్రదించవలసిన వారి నెంబర
SI ఎన్. సాయి బాబు – 8712685215
PC అజయ్ – 8712552532

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version