లాభాల బాటలో.. ఉద్యాన పంటలు……!
లాభాల బాటలో.. ఉద్యాన పంటలు ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మెండుగా ప్రభుత్వ ప్రోత్సాహకాలు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి.
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం: ఆరుగాలం కష్టపడి పంటలు పండించే రైతన్నలకు తరచుగా ఏదో ఒక రూపంలో నష్టం వస్తోంది. పంటలకు సరిపడా వర్షాలు కురవకపోయినా, పంట చేతికొచ్చే సమయంలో అధిక వర్షాలు కురిసిన రైతులు నష్ట పోతారు. ఈ పరిస్థితుల్లో, ఉద్యానవన శాఖ ఆధి కారులు ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు మల్లెల రైతులను ప్రోత్సహిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా ఝురాసంగం మండలంలోని వివిధ గ్రామాల రైతులు ఈ కొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నారు.
బర్దిపూర్, ఏల్గోయ్, కుప్పా నగర్, పొట్టిపల్లి, జీర్లపల్లి, చిలేపల్లి, వసంపల్లి, ఝరాసంగం, సంగం (కే), ఏడాకులపల్లి, గుంత మర్పల్లి, బోరేగావ్, అనంతసాగర్, గినియార్ పల్లి, కృష్ణాపూర్, చిల్మేప ల్లి, మాచ్నూర్ తదితర గ్రామాల రైతులు ఉద్యానవన పంటల సాగుకు మొగ్గు చూపుతూ లాభాల బాట పడుతున్నారు. వివిధ గ్రామాల రైతులు కూరగాయలు, పండ్ల, పూల తోటలు, సుగంధ ద్రవ్యాలు, ఔషధ పంటలు పండిస్తూ లాభాల బాటలో పయని స్తున్నారు.
పూలతోటల సాగు వైపు..
బద్దిపూర్ గ్రామానికి చెందిన కోట ఆశన్న, కుమ్మరి వేణు, మహమ్మద్ షేర్, న్యాలకంటి సుధాకర్, వడ్డ సంగమేశ్వర్లు లిల్లీ, గులాబి, బంతి, పూల తోటలను సాగు చేస్తున్నారు. తక్కువ పెట్టుఐ డితో 6 నెలల లోపే పంట చేతికొచ్చి మార్కెట్ కు తరలిస్తు న్నారు. ప్రతిరోజు 2నుంచి3 వేల రూపాయల ఆదాయం వస్తుంది పువ్వులను సమీపంలోని జహీరాబాద్. మార్కెట్కు లేదా ఎక్కువ మొత్తం పూలు లేదా హైదరాబాద్ను తరలిస్తు న్నారు.
ఫామాయిల్ సాగు వైపు అడుగులు..
కుప్పా నగర్, కు చెందిన బి. చంద్రమ్మ, మల్లికార్జున్ పాటిల్, పండరినాథ్, సంగన్న లతో పాటు ఇతర గ్రామాల్లో సైతం పామాయిల్ సాగు చేస్తున్నారు. ప్రస్తుతం పంటసాగు రెండు సంవత్సరాలు కావొస్తుం ది మరో రెండు సంవత్సరాలుపంట చేతికొచ్చే అవకా శం ఉంది. వీరికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి 90శాతం సబ్సిడీ కింద మొక్కలను పంపిణీ చేస్తున్నారు. ఏటా ఎకరానికి రూ.4200 చొప్పున 4 సంవత్సరాల వరకు సాగు ప్రోత్సాహకాలు అంద జేస్తారు. నాలుగేళ్ల తర్వాత పంట 35 సంవత్సరాల వరకు 10 నుంచి 12 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. జిల్లావ్యాప్తంగా 1225 ఎకరా లలో సాగు చేస్తున్నారు.
కూరగాయల సాగు వైపు రైతు..
మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు వాణిజ్య పంటలతో పాటు తక్కువగా వ్యవధిలో చేతికొచ్చే కూరగాయల పంట సాగు వైపు రైతులు అడుగులు వేస్తున్నారు. బర్దిపూర్ కు చెందిన వద్ద సంగమేశ్వర్, కుప్ప నగర్ కు చెందిన ముల్ల చాందు, గొల్ల యాదప్ప, రాములు, భీమన్న, గైబు, ఎల్లోయి, ఝరాసంగం, సంగం (కే), గుంత మరిపల్లి, ఈదులపల్లి, కక్కెర వాడ, బొప్పనపల్లి, నర్సాపూర్, మేడపల్లి తదితర టమాట, బెండ, వంకాయ, చిక్కుడుకాయ, బీర, పాలకూర తదితర కూరగాయలను సాగు చేస్తూ లాభాల బాటలో పయ నిస్తున్నారు.