బాబు జగ్జివన్ రామ్ జయంతి వేడుకల్లో.!

బాబు జగ్జివన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న టి ఎస్ ఎస్ సి సి డి సి మాజీ చెర్మెన్ వై.నరోత్తం..

జహీరాబాద్. నేటి ధాత్రి

 

భారత దేశ మాజీ ఉపప్రధాని డా:బాబు జగ్జివన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఎస్ ఎస్ సి సి డి సి మాజీ చెర్మెన్ వై.నరోత్తం పస్తాపూర్ గ్రామంలో గల బాబు జగ్జివన్ రామ్ గారి విగ్రహానికి,మరియు కోహిర్ మండలం చింతల్ ఘాట్ చౌరస్తా వద్ద గల బాబు జగ్జివన్ రామ్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు,ఈ సందర్భంగా జరిగిన పస్తాపూర్ గ్రామంలో ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వై.నరోత్తం మాట్లాడుతూ వారు దేశానికి ఎంతో సేవ చేసారని కుల రహిత సమాజం కొరకు, బడుగు బలహీనవర్గాల అభివృద్ధి కొరకు పోరాడిన మహానేత అని వారిని మనమందరం స్ఫూర్తిగా తీసుకుని వారి ఆశయ సాధన కొరకు నిరంతరం కృషి చేస్తూ మనమందరం కలిసి కట్టుగా ముందుకు సాగుదాం అని అన్నారు,ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ స్వామిదాస్, మాజీ ఎంపీటీసీ సంపత్ కుమార్,రాజేందర్,రైతు హక్కుల సాధన సమితి అధ్యక్షులు సి.బాల్ రాజ్,ధన్ రాజ్,సామెల్,విఠల్,చెంగల్ జైపాల్,రాజ్ కుమార్,దిలీప్, తదితరులు పాల్గొన్నారు.

బాబు జగ్జీవన్ రావు 118 వ జయంతి వేడుకలు. 

బాబు జగ్జీవన్ రావు 118 వ జయంతి వేడుకలు. 

నిజాంపేట, నేటి ధాత్రి

 

నిజాంపేట మండల కేంద్రంలో శనివారం రోజున డాక్టర్ బాబు జగ్జీవన్ రావ్ 118 వ జయంతి ఉత్సవాలను దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ టీఎస్ మెదక్ జిల్లా అధ్యక్షులు గరుగుల శ్రీనివాస్ మాట్లాడుతూ 1975 సంవత్సరంలో భారత ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రజల ప్రాథమిక హక్కులను రద్దు చేయడంతో ఇందిరా గాంధీ ఎదురులేని నాయకురాలుగా ఉన్న సమయంలో ఆమెకు ఎదురు తిరిగిన గొప్ప వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ ఆయన బీహార్ రాష్ట్రంలో చాంద్ గ్రామంలో 19O8 ఏప్రిల్ 5వ తేదీన జన్మించాడు.తల్లి వసంతి దేవి తండ్రి శోభిరామ్ లు ఆయన చిన్నతనంలోనే స్కూల్లో హిందువులకు ఒక కుండ క్రైస్తవులకు ఒక కుండా ముస్లింలకు ఒక కుండా అంటరాని వాళ్లకు ఒక్కకుండా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క కుండలను చూసి చలించిపోయి అందరికీ ఒకే కుండా ఉండాలన్న ఆలోచనతో అన్నిటిని మొదలుపెట్టడం జరిగింది. మనుషులంతా ఒక్కటే ఒకే కుండలో అందరం తాగాలి అని ఒక గొప్ప మనసుతో ఆలోచించేవాడు, బాబు జగ్జీర్రావ్ తండ్రి శోభిరామ్ సైన్యంలో పనిచేసేవాడు, అక్కడ అంటరానితనం వివక్ష చూసి అక్కడి నుండి ఇంటికి వచ్చి 20 ఎకరాల భూమి లో వ్యవసాయం చేస్తూ, అంటరానితనం కులవ్యక్ష మీద ప్రజలకు చైతన్యం చేయడంజరిగింది. బాబు జగ్జీవన్ రావు ఒక కుమారుడు ఒక కుమార్తె కుమారుని పేరు సురేషు కూతురు పేరు మీరా కుమారి కలరు.
ఆయన సామాజికంగా ఆర్థికంగా పేదరిక నిర్మూలనకు ఎంతో కృషి చేసిన మహానుభావుడు బాబు జగ్జీవన్ రావు 1929లో అంటరాని ప్రజల గురించి ఉత్తర ప్రదేశ్ బెంగాల్ బీహార్ ప్రజలను సమీకరించి 35 వేల మందితో ఊరేగింపు నిర్వహించాడు. ఆయన జీవితంలో అదొక గొప్ప చరిత్ర కలిగిన రోజు అదే ఆయన రాజకీయానికి పునాది 1935లో ఉప్పు సత్యాగ్రహం సందర్భంలో బాబు రాజేంద్రప్రసాద్ తో స్నేహం ఏర్పడింది,బాబు జగ్జీరావ్ 1931లో గొప్ప సైంటిస్ట్ కావాలని నిర్ణయంతో సైంటిస్ట్ ను అయితే నేను బాగుపడతా నా కుటుంబాలు బాగుపడతాయి, కానీ పేద బడుగు బలహీనవర్గాల పరిస్థితి ఏంటి అని నిర్ణయించుకొని అంటరాని వాళ్ళు కులవ్యవక్షత దుర్భారం గడుపుతున్న మా వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఆలోచించి వారి గురించి, నేనే పోరాడాలి అని గొప్ప సంకల్పంతో ఆలోచన చేస్తాడు అంటరాని వాళ్ళు చదువుకోవాలి అంటరాని వాళ్ళు మద్యపానం నిషేదించాలి పిల్లలను పశువుల కొట్టలాల్లో పనిచేయడం మానేయాలి,
నా జాతి పిల్లలు చదువుకోవాలి అని కొన్ని అభిప్రాయాలతో అట్టడుగు వర్గాలకు ఒక దిక్సూచిగా నిలిచాడు, ఆయన జీవితంలో 50 సంవత్సరాలుగా ఓటమెరుగని పార్లమెంటు సభ్యులుగా గొల్లిపొందిన మహా ఉన్నతమైన వ్యక్తి, ఆయన ఈ భారత దేశ ఉప ప్రధాని పనిచేశారు, ఆయన ఈ దేశ కేంద్రకార్మిక శాఖ మంత్రిగా పనిచేస్తున్న క్రమంలో ఎయిర్ ఇండియా జాతీయం చేశారు, అందులో 7000 ఉద్యోగాలు బడుగు బలహీన వర్గాల బిడ్డలకు అమలు చేశారు, అదే విధంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 70 వేల ఉద్యోగాలు బడుగు బలహీన వర్గాల పిల్లలకు ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో దళిత బహుజన ఫ్రంట్ జిల్లా అధ్యక్షులు దుబాసి సంజీవ్ ఎమ్మార్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు కొమ్మాట సుధాకర్ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు అమర్
మాల మహానాడు కార్యదర్శి టంకరి లక్ష్మణ్, మండల ఉపాధ్యక్షులు బండారి ఎల్లం,ఎరుకల సంఘం మండల అధ్యక్షులు కోనేరు శ్రీనివాస్, కొతాడి నర్సింలు, ఎండి బిలాల్, కొమ్మాట స్వామి, నందిగామ బాబు తదితరులు పాల్గొన్నారు.

డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 110 జయంతి ఉత్సవాలు.

డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 110 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు..

రామాయంపేట ఏప్రిల్ 5 నేటి ధాత్రి (మెదక్)

 

నేడు రామాయంపేట పట్టణంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 117 జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది డాక్టర్ జగ్జీవన్ రామ్ అట్టడుగు వర్గంలో జన్మించి భారతదేశ ఉన్నతమైనటువంటి పార్లమెంట్ యొక్క స్థాయిలో అనేక పదవులను అధిరోహించి భారత దేశ ఉప ప్రధాని పదవిని కూడా ఆయన అనుభవించడం జరిగింది నాటి కాలంలో అంటరానితనం భయంకరంగా ఉన్నప్పటికీని అంతా ఉన్నతమైన స్థానానికి చేరుకున్నారు ఆయన బడుగు బలహీన వర్గాల కొరకు పార్లమెంటులో ఆయన గళం విప్పారు పోరాడినాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో రాసిన మానవ అట్టడుగు వర్గాల హక్కుల కొరకు పోరాటం చేసి రాజ్యాంగాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని అంబేద్కర్ రైటర్ అయితే జగ్జీవన్ రామ్ ఫైటర్గా పోరాటం చేసిన మహనీయుడు ఆయన సేవలు మరువలేని కాబట్టి ఆయన చిరస్మరణీయులు ఆయన ఆశయాలను కొనసాగిస్తాం ఈ యొక్క కార్యక్రమంలో అన్ని కుల సంఘాలు ప్రజా సంఘాలు అన్ని రాజకీయ పక్షాలు అదేవిధంగా లైన్స్ క్లబ్ వారు కూడా పాల్గొనడం జరిగింది బీసీ సంఘం నాయకులు మెట్టు గంగారం బీసీ నాయకులు శ్రీనివాస్ మాజీ కౌన్సిలర్ దళిత నాయకులు కరికివిద్యాసాగర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు పాతూరి రాజు మాదిగ ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు లద్ద నర్సింలు మాదిగ ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు తుడుం పెంటయ్య మాదిగ ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు మల్యాల కిషన్ మాదిగ ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు అక్కిరి గారు రాజు మాదిగ ఎమ్మార్పీఎస్ నాయకులు జేరిపోతుల అశోక్ గడ్డం సిద్ధరాములు ఎర్ర రాములు లైన్స్ క్లబ్ నాయకులు రాజశేఖర్ అదేవిధంగా స్వచ్ఛంద సంస్థ కైలాష్ గారు ఇంకా తదితరులు పాల్గొన్నారు

అంబేద్కర్ భవన్ లో బాబు జగ్జీవన్ రామ్ జయంతి.

అంబేద్కర్ భవన్ లో బాబు జగ్జీవన్ రామ్ 118 జయంతి వేడుకలు. 

నస్పూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

 

మంచిర్యాల జిల్లా నస్పూర్ అంబేద్కర్ కాలనీ లోని అంబేద్కర్ భవనం లో బాబు జగ్జీవన్ రామ్ 118 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ముందుగా మహానీయుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘం జిల్లా సీనియర్ నాయకులు కొప్పర్తి రాజం మాట్లాడుతూ కుల రహిత సమాజం కోసం పాటుపడిన బడుగు బలహీన వర్గాల నేత దేశ స్వతంత్రం కోసం సామాజిక సమానత్వం కోసం పోరాడిన ఆదర్శ నేత దేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం జిల్లా సీనియర్ నాయకులు కోప్పర్తి రాజం, మడుగుల శంకర్,జిలకర రాజం,యువ నాయకులు మడుగుల స్వామి దాస్, మడుగుల మహేష్,కొప్పర్తి చింటూ తదితరులు పాల్గొన్నారు.

బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకలు…

ఎంపీడీవో కార్యాలయంలో బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకలు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కార్యాలయంలో ఎంపీడీవో ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకలను నిర్వహించారు ఇట్టి కార్యక్రమంలో ఎంపీడీవో ఆఫీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

జగ్జీవన్ రావు జయంతి వేడుకలు.

ఎమ్మార్వో కార్యాలయంలో బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకలు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండలంలో స్థానిక ఎమ్మార్వో కార్యాలయంలో ఎమ్మార్వో అధ్యక్షతన బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కార్యాలయంలో బాబు జగ్జీవన్ రావు ఫోటోలకు పూలమాలవేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు ఇట్టి కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు.!

సిరిసిల్ల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

వేడుకల్లో పాల్గొన్న బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య

సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి )

 

సిరిసిల్ల పట్టణంలోని భారత రాష్ట్ర సమితి కార్యాలయంలో మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న బిఆర్ఎస్ జిల్లా తోట ఆగయ్య మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాలకు ఆశయ జ్యోతిగా ఉన్న బాబు జగ్జీవన్ రామ్ అట్టడుగు వర్గాల నుండి అందనంత ఎత్తుకు ఎదిగినటువంటి మహా ఉద్యమ శాలి మరియు తన ఆశయాలు తన బాటలో నడవాల్సిందిగా జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు తోట ఆగయ్య తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పి చైర్ పర్సన్ అరుణా రాఘవరెడ్డి మాజీ మున్సిపల్ పట్టణ అధ్యక్షులు జిందం కళా చక్రపాణి,కుంభలా మల్లారెడ్డి, మాట్ల మధు, అగ్గి రాములు, కొయ్యడ రమేష్, చిరంజీవి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సిరిసిల్ల జిల్లాలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి.

సిరిసిల్ల జిల్లాలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

మరియు జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే
సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి)

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను సిరిసిల్ల జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ  ఆధ్వర్యంలో నిర్వహించగా, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరయ్యారు.

Celebrations.

 

ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి, బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మహేష్.బి.గితే చిత్రపటానికి పూలమాలలు వేసి సమర్పించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో వినోద్ కుమార్, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, ఎస్సీ అభివృద్ధి అధికారి రాజ మనోహర్ రావు, ఆయా శాఖల అధికారులు, అంబేద్కర్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మహనీయుల జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలి.

మహనీయుల జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలి

వర్దన్నపేట (నేటిదాత్రి):

 

 

నేడు వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కూడలిలో మహనీయుల జయంతి ఉత్సవాల కమిటీ కన్వీనర్ జాతీయ యువజన అవార్డు గ్రహీత జక్కి శ్రీకాంత్ ఆధ్వర్యంలో “మహానీయుల స్ఫూర్తి యాత్ర” కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాదిగల ఐక్య సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జన్ను రాములు, తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నరసయ్య హాజరై మాట్లాడుతూ వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలో మహనీయుల జయంతి సందర్భంగా మండల కేంద్రంలో మహనీయుల స్ఫూర్తి యాత్రను నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు ఈ సందర్భంగా జక్కి శ్రీకాంత్ మాట్లాడుతూ ఏప్రిల్ 5వ తేదీన బాపు జగ్జీవన్ రామ్ ఏప్రిల్ 11వ తేదీన మహాత్మ జ్యోతిరావు పూలే ఏప్రిల్ 14వ తేదీన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 5వ తేదీ నుండి ఏప్రిల్ 14వ తేదీ వరకు వర్ధన్నపేట మండలంలోని గ్రామాలలో మహానీయుల స్ఫూర్తి యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఈ యాత్రలో భాగంగా మహనీయుల జీవిత చరిత్రలను ప్రతి గడపగడపకు చేరవేసి వారి ఆశయాలను కొనసాగింపుగా యువతలో చైతన్యాన్ని కల్పిస్తూ విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను చైతన్య పరుస్తూ అవగాహన కల్పించడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది అదేవిధంగా మహానీయుల జయంతి ఉత్సవాలను గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహించాలని పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు మరిపట్ల అంజయ్య, ఆర్ఎస్పి జిల్లా కార్యదర్శి వల్లందాస్ కుమార్, టిఎంఆర్పిఎస్ పొలిట్ బ్యూరో సభ్యులు ఈరెల్లి శ్రీనివాస్, తెలంగాణ అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు కంజర్ల మహేష్, జాతీయ బీసీ సంక్షేమం సంఘం వర్ధన్నపేట నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మామిండ్ల చెన్నయ్య, తెలంగాణ అంబేద్కర్ సంఘం జిల్లా కో కన్వీనర్ జంగిరి భాస్కర్,ప్రజా పార్టీ రాష్ట్ర నాయకులు మల్లెపాక చంద్రమౌళి, వర్ధన్నపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి జనగాం చంద్రమౌళి, తెలంగాణ అంబేద్కర్ సంఘం వర్ధన్నపేట పట్టణ అధ్యక్షులు నందిపాక భాస్కర్, స్వామి, ఎస్టి నాయకులు భీమా నాయక్, అంబేద్కర్ సంఘం నాయకులు కుమారస్వామి, గణేష్, ప్రభాకర్, రమేష్, లాలు నాయక్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన.!   

వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన ఆదర్శ మోడల్ స్కూల్ యాజమాన్యం.  

మందమర్రి నీటి ధాత్రి

 

మందమర్రి పట్టణం లోని తెలంగాణ ఆదర్శమోడల్ పాఠశాల లో జూనియర్ కాలేజీ విద్యార్థుల తో వార్షికోత్సవ (అనివార్సరీ) వేడుకలు ఘనంగా నిర్వహించరు ముందుగా సరస్వతి పూజ జ్యోతిప్రజ్వాల వెలిగించి వార్షికోత్సవ వేడుకలు ప్రారంభించిన మోడల్ పాఠశాల ప్రిన్సిపాల్ సారా తస్లిమా
ప్రిన్సిపాల్ మాట్లాడుతూ

Adarsh ​​Model School.

మీ తల్లిదండ్రులు కష్టాన్ని మీరు గమనించి జీవితంలో మంచి స్థాయి కి ఎదిగి వారిని సంతోషపెట్టాలని ఆ దిశ గా లక్ష్యాన్ని ఏర్పార్చుకోవాలని కోరారు

Adarsh ​​Model School.

విద్యార్థులు చేసిన జానపద నృత్యలు, యోగ విన్యాసాలు,వివిధ పాటలు లంబాడి నృత్యంలు పలువురు ని అలరించాయి ఈ కార్యక్రమం లోప్రిన్సిపాల్ సారా తస్లిమ్ ఉపాధ్యాయులు ఉపాధ్యాయలు విద్యార్థి విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

నా పాక ఆలయ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు.

నా పాక ఆలయ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు.

చిట్యాల, నేటి ధాత్రి :

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నైన్ పాక గ్రామంలో గల అతి ప్రాచీన గల నాపాక దేవాలయ ప్రాంగణంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ యాదడ్ల రాజయ్య తెలిపారు ఈ కార్యక్రమానికి భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు పలువురు రాజకీయ నాయకులు హాజరవుతారని తెలిపారు, ఈ ప్రాచీన ఆలయం రాష్ట్రంలో ఎక్కడ లేని విధానం ఒకే శిలపై నాలుగు ద్వారాలకు నాలుగు విగ్రహాలను రూపొందించి ఏకశిలపై గుడిని ప్రాచీన కట్టడాలతో నిర్మించి ఉన్న విశిష్ట గల దేవాలయం అని తెలిపారు ఈ ఆలయంలో రానున్న రోజుల్లో భూపాలపల్లి శాసనసభ్యుడు సహకారంతో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మరింత అభివృద్ధి జరిగేలా ఆలయ అభివృద్ధికి తోడ్పడతామని అన్నారు సీతారాముల కళ్యాణం అనంతరం నృత్య రవళి కళాక్షేత్రం హనుమకొండ 40 మంది కళాకారులచే కూచిపూడి భరతనాట్యం కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమానికి జిల్లాలోని మండలాల్లోని వివిధ గ్రామాల భక్తుల ప్రజలు సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు కృతజ్ఞతలు కాగలరని తెలిపారు.

కృష్ణవేణి టాలెంట్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు.

అంగరంగ వైభవంగా.కృష్ణవేణి టాలెంట్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు*

 

రాయికల్ నేటి ధాత్రి. ఏప్రిల్ రాయికల్.పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ “విరించి-2025″వార్షికోత్సవ వేడుకలను గురువారం ఆర్ఆర్ కన్వెన్షన్ హాల్లో జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ జూపల్లి వేణుగోపాల్ రావు మాట్లాడుతూ….. పాఠశాలల్లో వార్షికోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం వలన విద్యార్థులలోని ప్రతిభ పాటవాలు వెలికి తీయడానికి దోహదపడతాయని అన్నారు.విద్యార్థులు చదువుతోపాటు ఆటపాటల్లో రాణించాలన్నారు. విద్యార్థుల చదువు విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా చదువుపై దృష్టి పెట్టి భవిష్యత్తులో ఉన్న శిఖరాలను అధిరోహించాలని,సోషల్ మీడియాలకు బానిసలు కాకుండా తగు జాగ్రత్తతో వ్యవహరించాలని సూచించారు.విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలన్న ఉన్నత స్థాయిలో స్థిరపడాలన్న ఉపాధ్యాయులు చెప్పే పాఠాలతో పాటు తల్లిదండ్రుల పెంపకం చాలా ముఖ్యమని అన్నారు.వార్షికోత్సవ కార్యక్రమంలో విద్యార్థులు పలు సందేశాత్మకమైన సాంస్కృతిక కార్యక్రమాలు, డ్యాన్సులు,కరాటే,పౌరాణిక దేశభక్తి నృత్యాలతో పలువురిని అబ్బురపరిచారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ జూపల్లి వేణుగోపాల్ రావు,డైరెక్టర్ జూపల్లి తిరుపతిరావు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ భవన్ లో దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు

తెలంగాణ భవన్ లో దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు

సిరిసిల్ల టౌన్: (నేటి ధాత్రి)

 

సిరిసిల్ల పట్టణంలోని ఈరోజు తెలంగాణ భవన్ లో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య జయంతి సందర్భంగా ఘనంగా నిర్వహించడం జరిగింది, సిరిసిల్ల బిఆర్ఎస్ పట్టణ మాజీ చైర్ పర్సన్ అధ్యక్షులు జిందం కళా చక్రపాణి పూలమాలవేసి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య అని, హైదరాబాద్ సంస్థానాధీశుడు ఏడవ నిజాం నవాబు ఉస్మాన్ ఆలీ ఖాన్ అండ కలిగిన స్థానిక భూస్వాములు, దొరల అరాచకాల నుంచి విముక్తి కోసం సంస్థాన ప్రజలు మధ్య వీరోచిత పోరాటం చేశారు అని తెలిపారు. అంతేకాకుండా కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ తంగళ్ళపల్లి మండల అధ్యక్షుడు గజబింకర్ రాజన్న, సిరిసిల్ల మాజీ కౌన్సిలర్ దార్ల సందీప్ కీర్తన, కుంభాల మల్లారెడ్డి, తదితర టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

దొడ్డి కొమరయ్య జయంతి వేడుకలు.!

ఘనంగా సాయుధ పోరాట వీరుడు దొడ్డి కొమరయ్య జయంతి వేడుకలు

నాగారం నేటి ధాత్రి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా

 

నాగారం మున్సిపాలిటీ సత్యనారాయణ కాలనీలో కురుమ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట వీరుడు దొడ్డి కొమరయ్య గారి 98 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమంలో నాగారం మున్సిపల్ మాజీ చైర్మన్ చంద్ర రెడ్డి అన్నం రాజ్ సురేష్ , కురుమ సంఘం అధ్యక్షుడు జెన్నేయాదగిరి , ప్రధాన కార్యదర్శి నోములనాగరాజు కురుమ, సలహాదారుడు చిన్నం భాస్కర్ కురుమ ,జంగారెడ్డి, రెడ్డినాయక్, నాగరాజు,కురుమ సంఘం సభ్యులు వివిధ పార్టీలకు చెందిన నాయకులు ,కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా రంజాన్ పండుగ వేడుకలు.

ఘనంగా రంజాన్ పండుగ వేడుకలు.

 

నర్సంపేట,నేటిధాత్రి:

 

పవిత్ర రంజాన్ పర్వదిన వేడుకలు నర్సంపేట డివిజన్ పరిధిలోని సోమవారం ఘనంగా నిర్వహించారు.
నర్సంపేట పట్టణంలోని మాదన్నపేట రోడ్డు ఈద్గా స్థలంలో భక్తి శ్రద్ధలతో రంజాన్ ప్రత్యేక నమాజ్ ముస్లిం ప్రజలు జరుపుకున్నారు.మత పెద్ద జామీ మజీద్ ఇమామ్ మహబూబ్ నమాజ్ ను చదివారు. అనంతరం రంజాన్ పండుగ ప్రాముఖ్యతను తెలియజేశారు.ఈ సందర్భంగా తెలంగాణ జన సమితి పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు షేక్ జావిద్ మాట్లాడుతూ భారత దేశ ముస్లింలు రంజాన్ మాసంలో లోనే పవిత్ర గ్రంథం ఖురాన్ ఆర్బించడం జరిగిందన్నారు. 30 రోజులు కఠోర ఉపవాస దీక్షలు పాటించి ప్రతిరోజు ప్రత్యేక తరాబి నమాజు పటించి అనంతరం జకాత్ ఫిత్రాలు మరియు హదీయాలు డబ్బు రూపాన పేదలకు అనాధలకు వితంతువులకు దానం చేస్తారన్నారు. ఈద్-ఉల్-ఫితర్ రంజాన్ పండుగ ప్రత్యేక నమాజుకై ఈద్గాకు మండల స్థాయి ముస్లిం చదువుతారని పేర్కొన్నారు. అనంతరం ఒకరికి ఒకరు అలింగనం చేసుకొని కులమతాల అతీతంగా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం ముస్లిం ఖబురస్థాన్లోకు వెళ్లి చనిపోయిన బంధువుల సమాధులపై పూలతో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం ప్రముఖ నాయకులు జామి మసీద్ అధ్యక్షులు మహమ్మద్ నబీ, మహమ్మద్ హబీబ్, మహమ్మద్ అయుబ్, మీర్జా మసూద్, అలీబేగ్, మహమ్మద్ రబ్బాని, మహమ్మద్ ఆఫీస్,ఇర్ఫాన్ మహమ్మద్, అన్వర్ సయ్యద్ జావేద్ ముస్లిం ప్రముఖులు పాల్గొన్నారు.

కౌసర్ మజీద్ లో ఘనంగా రంజాన్ వేడుకలు.

కౌసర్ మజీద్ లో ఘనంగా రంజాన్ వేడుకలు.

చిట్యాల, నేటిధాత్రి :

ముస్లింల పవిత్ర పండుగ అయినా రంజాన్ పండుగను పురస్కరించుకొని చిట్యాల మండల కేంద్రంలోని కౌసర్ మజీద్ ఆవరణలోని ఈద్గాలో మండలంలోని ముస్లిం సోదరులందరూ ఎంతో భక్తిశ్రద్ధలతో నమాజ్ చేసుకుని ఒకరికొకరు అలై బాలాఈ చేసుకొని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు ఈ సమావేశంలో మండల కో ఆప్షన్ మాజీ సభ్యులు మహమ్మద్ రాజ్ మహమ్మద్ మాట్లాడుతూ ముస్లింలకు పవిత్ర మాసం రంజాన్ నెల ఈ నెలలో ప్రతి ఒక్క ముస్లిం 30 రోజులు కఠోర ఉపవాస దీక్ష లో ఉండి సోమవారం.రోజున ఉపవాస దీక్షను విరమించి రంజాన్ పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు అలాగే సమాజంలో గంగ జమున తహసీబ్ కే జైస హిందూ ముస్లింలు అనే భేదం లేకుండా అందరు కలిసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు ఈ సమావేశంలో మసీదు కమిటీ అధ్యక్షలు అజ్మత్ మియా కార్యదర్శిహైదర్ పాషా వైస్ ప్రెసిడెంట్ షఫీ జాయింట్ సెక్రెటరీ అక్బర్ ట్రెజరర్ షేక్ హుస్సేన్ వివిధ గ్రామాల ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

నెక్కొండలో ఘనంగా రంజాన్ వేడుకలు.

నెక్కొండలో ఘనంగా రంజాన్ వేడుకలు

@ ప్రత్యేక ప్రార్థనలు చేసిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

 

#నెక్కొండ ,నేటి ధాత్రి:

 

ముస్లింలకు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండగ రంజాన్ కావడంతో నెక్కొండ లోని ముస్లిం సోదరులు నెక్కొండ మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హాజరై ముస్లిం సోదరులతో అలైబాలై తీసుకుంటూ ముస్లిం సోదరులతో కలిసి మసీదులో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ ముస్లిం సోదరులు నెల రోజుల నుండి ఉపవాసం ఉంటూ చిన్న పెద్ద తేడా లేకుండా అత్యంత పవిత్రతో జరుపుకునే పండగ రంజాన్ పండగని ఈ రంజాన్ పండుగ సందర్భంగా నర్సంపేట నియోజకవర్గం లోని ప్రతి ఒక్క ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తెలిపారు. అలాగే ఈ సంవత్సరం రాష్ట్రంలో ప్రజలందరూ ఆయురారోగ్యాలతోని పాడిపంటలతోని ఆ అల్లా కాపాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట పిసిసి సభ్యుడు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి, నెక్కొండ మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల మహేష్ రెడ్డి, నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్, నెక్కొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్కీ అశోక్, నెక్కొండ పట్టణ కాంగ్రెస్ పార్టీఅధ్యక్షుడు పెండ్యాల హరిప్రసాద్, మసీద్ కమిటీ అధ్యక్షుడు షేక్ షబ్బీర్, రామాలే కమిటీ చైర్మన్ కొమ్మారెడ్డి సుధాకర్ రెడ్డి, నర్సంపేట ఏజిపి అడ్వకేట్ బండి శివకుమార్, నెక్కొండ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు రావుల మైపాల్ రెడ్డి, దొడ్డ విజయ్, తాళ్లూరి నరసింహస్వామి, నెక్కొండ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు పోలిశెట్టి భాను, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు సింగం ప్రశాంత్, ముస్లిం సోదరులు రఫీ, మహమ్మద్ అమీర్ , మహమ్మద్ హమీద్, ఎండి అన్వర్ పాషా, యాకుబ్ పాషా, ఇబ్రహీం, ఎండి అఫ్జల్, సలీం, ముస్లిం సోదరులు, తదితరులు పాల్గొన్నారు.

రంజాన్ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్.

రంజాన్ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి వర్యులు జహీరాబాద్ ఇన్ చార్జి డాక్టర్ ఏ చంద్రశేఖర్.

 

 జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహిరాబాద్: రంజాన్ పర్వదినం సందర్భంగా మాజీమంత్రి వర్యులు జహీరాబాద్ ఇన్ చార్జి డాక్టర్ ఏ చంద్రశేఖర్ కాంగ్రెస్ నాయకులతో కలిసి పట్టణం లోని ఈద్గా లో రంజాన్ వేడుకల్లో పాల్గోన్నారు ఈ సందర్భంగా ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుని ఈద్ ముబారాక్ అంటు శుభాకాంక్షలు తెలిపారు ఈ వేడుకల్లో కాంగ్రెస్ నాయకులు ఉగ్గేల్లి రాములు పట్టణ అధ్యక్షుడు కండెం నర్సింహులు ,యుత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నరేష్ గౌడ్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.

నిజాంపేట మండలంలో రంజాన్ వేడుకలు.

— నిజాంపేట మండలంలో రంజాన్ వేడుకలు

• ఈద్ శుభాకాంక్షలతో అలింగనం

నిజాంపేట: నేటి ధాత్రి

మండల కేంద్రంలో రంజాన్ పండగను పురస్కరించుకొని ఈద్గాలో ముస్లిం మత పెద్ద జనాబ్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత 30 రోజులపాటు కఠోర ఉపవాస దీక్షలు నిర్వహించి సోమవారం రంజాన్ పండుగను పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థన నిర్వహించి అలైయి, బలైయి చేపట్టడం జరిగిందన్నారు. మతసామరస్యానికి ప్రతీక గా రంజాన్ పండుగను కొలుస్తామన్నారు. సమానత్వం, పరమత సహనం, సహాయగుణం, దయాగుణం వంటి విషయాలపై వివరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

ముందస్తుగా ఉగాది వేడుకలు.

ముందస్తుగా ఉగాది వేడుకలు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండలం ఓబులాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముందస్తుగా ఉగాది వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానోపాధ్యాయుడు బండి ఉపేందర్ ఉగాది పర్వదినమున సకల శుభాలకు నిలయం అలాగే ఉగాదినాడు అడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి మానవుని జీవిత గమనంలో కష్టసుఖాలన్ని మర్చిపోయి ఉగాది పచ్చడి లాగా అన్నిటిని సమానంగా స్వీకరించినప్పుడే మనం మోనగలుగుతామని తెలియజేశారు విద్యార్థుల భావి జీవితంలో గెలుపు ఓటములనుసమానంగా స్వీకరించి ముందడుగు వేయాలని. తెలియజేసి ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు ముందస్తు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో ఉపాధ్యాయుల బృందం బూ ట్ల శ్రీనివాస్ పలుమార్ తిరుపతి గట్టు శ్రీకాంత్ ఆవదాల జ్యోతి రాణి ఎలిగేటి శ్రీనివాస్ రామ్ ప్రసాద్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version