బాబాసాహెబ్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు.

మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి..

 

 

తంగళ్ళపల్లిమండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రవీణ్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి జై భీమ్ జై అంబేద్కర్ నినాదాలతో ర్యాలీ నిర్వహించి గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ స్థాయి గర్వించదగ్గ గొప్ప మహనీయులని ఆయన రచించిన రాజ్యాంగం ఇప్పటికి ప్రపంచ స్థాయిలో దేశ చరిత్రలో నిలిచిపోతుందని ఆయన రచించిన రాజ్యాంగం ఇప్పటికి అమలవుతుందని ఆయన రచించిన రాజ్యాంగం ద్వారా దేశ ప్రజలకు అన్ని కులాలకు ఎస్సీ ఎస్టీ మైనార్టీ రిజర్వేషన్ లోపల అభివృద్ధి కార్యక్రమాలు రాజ్యాంగం ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా మండల మహిళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు

డాక్టర్.బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు..

ఘనంగా డాక్టర్.బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు..

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి..

 

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలో ఎమ్మెల్యే .పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్
134వ జయంతి సందర్భంగా డాక్టర్..బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రపంచ మేధావి,నవభారత నిర్మాత,బహుముఖ ప్రజ్ఞాశాలిగా అణగారిన పేద,బడుగు,బలహీన వర్గాల క్షేమం కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహానీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అన్నారు..అత్యంత మేధోసంపతితో భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ .అణగారిన వర్గాల కోసం జీవితాంతం పరితపించి వారి జీవితాల్లో సామాజిక విప్లవ స్ఫూర్తి నింపిన ప్రదాత అంబేద్కర్ అని పేర్కొన్నారు..స్వాతంత్ర భారత దేశంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కులాలకు,మతాలకు అతీతంగా ప్రజలందరూ సుఖ జీవనం గడపాలని ఆశించి భావితరాలకు సమ సమాజాన్ని అందించాలని కాంక్షతో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగానీ రచించారన్నారు..అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన తెలిపారు
ఈ కార్యక్రమంలో
మండల కిషన్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగ బండి వెంకటేశ్వర్లు , మండల యువజన అధ్యక్షులు కునుసోత్ సాగర్ , మండల నాయకులు షేక్ రఫీ , బరపటి వెంకన్న , చందా నాగేశ్వరరావు , ఒగలబోయిన శ్రీను , పూజారి వెంకన్న, కొమరం వెంకటేశ్వర్లు , బిలపాటి సంపత్ , తోలేం కృష్ణ , గాంధర్ల రామనాథం , పోలేబోయిన చందర్రావు అశ్రపునిసా , కార్యకర్తల,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు..

జిల్లా గ్రంధాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు.

జిల్లా గ్రంధాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని సినారె గ్రంథాలయంలో
డాక్టర్,భీమ్ రామ్ అంబేద్కర్ గారి 134వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలు సమర్పించారు.
అనంతరం గ్రంథాలయ విద్యార్థినీ,విద్యార్థులను పాఠకులను ఉద్దేశించి మాట్లాడుతూ మన జిల్లా గ్రంథాలయంలో చదువుకొని ఉన్నత ఉద్యోగాలు సాధించి. మహనీయుడైన అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలని కోరారు .
ఈ కార్యక్రమంలో గ్రంథపాలకుడు కమటం మల్లయ్య, గ్రంథాలయ సిబ్బంది, సాయి,
మహేష్ మరియు, విద్యార్థులు,పాఠకులు పాల్గొని విజయవంతం చేశారు.

నేటినుండే అగ్నిమాపక వారోత్సవాలు.

నేటినుండే అగ్నిమాపక వారోత్సవాలు

పరకాల అగ్నిమాపక అధికారి వి.భద్రయ్య

బాబా సాహెబ్ చిత్రపటానికి,విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఘన నివాళులు

 

పరకాల నేటిధాత్రి

 

సోమవారం రోజున పరకాల పట్టణంలో అగ్నిమాపక శాఖ వారోత్సవాల మొదటి రోజైన ఏప్రిల్ 14వ తేదీన దేశంలోని అగ్నిమాపక సిబ్బంది విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారికి అగ్నిమాపక అధికారి వి. భద్రయ్య శ్రద్ధాంజలి ఘటించి మౌనంపాటించి నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ ఏప్రిల్ 15వ తేదీ నుండి 20వ తేదీ వరకు జిల్లాలోని స్కూళ్లు, కాలేజీలు,పెట్రోల్ బంకులు, సినిమా హాళ్లు,కోల్డ్ స్టోరేజీలు, పరిశ్రమలు,మొదలైన వాటిలో అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాలని తెలిపారు.ఏదైనా ప్రమాదం సంభవిస్తే పరకాల అగ్నిమాపక కేంద్రం 8712699306, 8712699307 ఫోన్ నెంబర్లను సంప్రదించాలని కోరారు.అగ్ని ప్రమాద సమాచారం త్వరగా తెలియజేస్తే ప్రమాద నష్టం ఎక్కువగా జరగకుండా చూడవచ్చునని అన్నారు.

అంబెడ్కర్ చిత్రపటానికి నివాళులు

అగ్నిమాపక కార్యాలయంలో అగ్నిమాపక అధికారి వి.భద్రయ్య భారత రాజ్యాంగ నిర్మాత 134వ జయంతి సందర్బంగా అంబెడ్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో అగ్నిమపక సిబ్బంది పాల్గొన్నారు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు…

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

 

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం గోపాలపల్లి గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా తంగళ్ళపల్లి మండల బిజెపి అధ్యక్షులు వెన్నమనేని శ్రీధర్ రావు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు పురస్కరించుకొని తంగళ్ళపల్లి మండలం గోపాల్ రావు పల్లి గ్రామంలో అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని జై భీమ్ జై అంబేద్కర్ నినాదాలతో విగ్రహానికి పూలమాలలు వేసి అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఈ సందర్భంగా నిర్మించారు ఇట్టి కార్యక్రమంలో ఎస్సీ మోర్చా అధ్యక్షులు కన్నె అరుణ్ కుమార్ జనరల్ సెక్రెటరీ కన్వీనర్ రెడ్డి మల్ల సుఖేందర్ పోకల శ్రీనివాస్ ఓబీసీ మోర్చా అధ్యక్షులు నాగుల శ్రీనివాస్ బీజేవైఎం అధ్యక్షులుకోసిని వినయ్ యాదవ్ ఉపాధ్యక్షులు బక్క శెట్టి రాజు ఇటికల మహేందర్ సహాయ కార్యదర్శి రెడ్డి మల్ల ఆశీర్వాద్ మహేష్ బలగం భాస్కర్ గౌడ్ నిఖిల్ బాబు అధ్యక్షులు జంగం కిషన్ బుజ్జ తిరుపతి తదితరులు పాల్గొన్నారు

ఘనంగా డాక్టర్ అంబేద్కర్ జయంతి వేడుకలు.

ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు…

– నివాళులర్పించిన కలెక్టర్ రాహుల్ రాజ్….

కొల్చారం, (మెదక్)నేటి ధాత్రి :-

 

 

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. మెదక్ జిల్లా కేంద్రంలో రాందాస్ చౌరస్తా, పోస్ట్ ఆఫీస్ సర్కిల్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించగా, కలెక్టర్ రాహుల్ రాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

 

B.R. Ambedkar

ఈ సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి కలెక్టర్ మెదక్ ఆర్డీవో రమాదేవి, తాసిల్దార్ శ్రీనివాస్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్, వివిధ కుల సంఘ నాయకులు, ప్రజా ప్రతినిధులతో కలిసి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. 
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహోన్నత వ్యక్తి బాబా సాహెబ్ అంబేద్కర్ అని అన్నారు
అంబేద్కర్ గారి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని సమాజంలో అసమానతలను రూపుమాపడానికి
ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేయాలని హితవు పలికారు.
ఈ కార్యక్రమంలో వివిధ కుల సంఘ నాయకులు, ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా బి ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు.

కల్వకుర్తిలో ఘనంగా బి”ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు.

కల్వకుర్తి/నేటి దాత్రి:

 

 

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో భారతరత్న, రాజ్యాంగ ప్రధాత, ప్రపంచమేదావి, బి.ఆర్.అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా పట్టణంలోని బిజెపి నాయకులు పార్టీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు తదనంతరం పాలమూరు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్దకు ర్యాలీగా తరలి వెళ్లి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు ఈకార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మొగిలి దుర్గాప్రసాద్, మండల అధ్యక్షులు మట్ట నరేష్ గౌడ్, పట్టణ అధ్యక్షులు గన్నోజు బాబిదేవ్,
మాజీ అధ్యక్షులు బోడ నరసింహ,
జిల్లా కార్యవర్గ సభ్యులు నరేడ్ల శేఖర్ రెడ్డి,
బీసీ మోర్చా పాలకూర రవిగౌడ్,
మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ గుండోజు గంగాధర్,
పట్టణ ఉపాధ్యక్షులు కొల్లూరి శ్రీధర్, నాయకులు నాప శివ, వాకిటి శ్రీకాంత్,అరవింద్ రెడ్డి, లక్ష్మీ నరసింహ, తదితరులు పాల్గొన్నారు

డాక్టర్. బి..ర్.అంబేద్కర్ గారి జయంతి వేడుకలు.

ఉమ్మడి జిల్లా బార్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో  డాక్టర్. బి..ర్.అంబేద్కర్ గారి జయంతి వేడుకలు:-

వరంగల్/హనుమకొండ, నేటిధాత్రి(న్యాయ విభాగం):-

 

 

14-04-2025 నాడు ఉమ్మడి బార్ అసోసిషన్ల ఆధ్వర్యంలో డాక్టర్ బి. ర్. అంబేద్కర్ గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.  జిల్లా  కోర్టు కాంప్లెక్స్ లో గల డాక్టర్ బి. అర్ అంబేద్కర్ భవనంలో ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహించారు. 
వరంగల్, హన్మకొండ బార్ అసోసియేషన్ల అధ్యక్షులు అయిన వలస సుదీర్, పులి సత్యనారాయణ అంబేద్కర్ విగ్రహానికి  పూల మాల వేసి ఆ మహనీయునికి ఘన నివాళులర్పించారు. అనంతరం ఇరువురు అధ్యక్షులు మాట్లాడుతూ అంబేద్కర్ గారు మనకు అందించిన భారత రాజ్యాంగం అన్ని రాజ్యాంగంలో కెల్లా అతి పెద్ద రాజ్యాంగం అని అన్నారు. అంబేద్కర్  పేద, బడుగు, బలహీన, అణగారిన వర్గాల వారి కోసం పోరాడార‌ని,  ఆయన గొప్ప మానవతా వాది అని తెలిపారు. న్యాయవాదులు మరియు యువత రాజ్యాంగ నిర్మాతను ఆదర్శంగా తీసుకొని సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో వరంగల్ బార్ అసోియేషన్ వైస్ ప్రెసిడెంట్ జైపాల్, ప్రధాన కార్యదర్శి D.రమాకాంత్, హన్మకొండ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కొత్త రవి, ఇరు బార్ అసోసియేషన్ కమిటీ సభ్యులు,  తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యులు జయాకర్, జనార్ధన్ మరియు  సీనియర్, జూనియర్ న్యాయవాదులు.   మరియు మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు.

హనుమాన్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న.

హనుమాన్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న మండల బిజెపి అధ్యక్షులు…

తంగళ్ళపల్లి నేటి దాత్రి…

 

 

తంగళ్ళపల్లి మండలం పాపాయిపల్లి గ్రామంలో హనుమాన్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న మండల బిజెపి అధ్యక్షులు వెన్నమనేని శ్రీధర్ రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జరిగే హనుమాన్ జయంతి ఉత్సవాల్లో పాల్గొని అలాగే ఆంజనేయ స్వాములు మాల ధారణ చేసి 41 రోజు గానీ. 21 రోజు గానీ. 11 రోజులు గాని. మాల దారణ చేసి పిల్ల పాపలకు కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ భక్తిశ్రద్ధలతో హనుమాన్ మాలధారణ పూర్తి చేసుకోవడం జరుగుతుందని ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలని వారు పిల్లాపాపలతో ఆయు ఆరోగ్యాలతో సుఖసంతోత్సంగా కలకాలం చల్లగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఏ రెడ్డి వెంకట్ రెడ్డి ఉప సర్పంచ్ చెన్నమనేని పరశురాములు ఏ రెడ్డి రాజు రెడ్డి కొ స్ని. శ్రీనివాస్ వర్కులు అంజయ్య వర్కుడు చంద్రయ్య బొజ్జ రాజేంద్రప్రసాద్ వివేక్ గ్రామ యువకులు మహిళలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు.

మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండలం కేంద్రంలోని కూడలి వద్ద వెనుకబడిన వర్గాల అభ్యున్న తకై అవిశ్రాంతంగా కృషి చేసిన మహనీయులు ప్రముఖ సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఎమ్మార్పీ ఎఫ్ నాయకులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజల బానిస బతుకుల నుంచి విముక్తి కోసం అలుపెరగని పోరాటం చేసిన గొప్ప సంఘ సంస్కర్త అన్నారు మన భారత దేశానికి ఆ మహనీయుడు చేసిన సేవలు మరవలేవనని గ్రామస్థాయి నుంచి నేటి యువత మహాత్మజ్యోతి రావు పూలేను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో అరికెల దేవయ్య, ముక్కెర ముఖేష్, తుడుం వెంకటేష్, గజ్జి రమేష్ కొమ్ముల తిరుపతి, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు, పాపయ్య, ప్రసాద్, ఎమ్మార్పీఎఫ్ నాయకులు పాల్గొన్నారు.

జ్యోతి రావు పూలే జయంతి వేడుకలు.!

బహుజన సంఘర్షణ సమితి అధ్వర్యం లో జ్యోతి రావు పూలే జయంతి వేడుకలు…పాల్గొన్న నాయకులు అధికారులు…

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

ఝరాసంగం మండల కేంద్రం లో జరిగిన మహాత్మా జ్యోతి రావు పూలె జయంతి సందర్బంగా మహాత్మా జ్యోతి రావు పూలె చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన బహుజన, సంఘర్షణ నాయకులు ఈ సందర్బంగా ఝరాసంగం ఎంపిడిఓ సుధాకర్ బహుజన సంఘర్షణ సమితి అధ్యక్షులు చింతల్ గట్టు శివరాజ్ మాట్లాడుతూ, స్వాతంత్రానికి పూర్వం వంద ఏబై ఏండ్ల క్రితమే జ్యోతి రావు పూలె బహుజనులకు సామాజిక న్యాయం కోసం స్త్రీ విద్య మరియు సమానత్వం కోసం అగ్రకులాల వారి తో పోరాటం చేసి బహుజన వర్గాల సామాజిక హక్కులు కాపాడిన మహనీయుడు జ్యోతి రావు పూలె అన్నారు. ఆయన ఆశయాల సాధనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు బడ్జెట్ కేటాయింపులలో, సామాజిక న్యాయం కోసం బహుజనుల విద్య ఉపాధి అవకాశల కోసం బడ్జెట్ లో అధిక నిధులు కేటాయింపులు చేసి రాజ్యాంగ ఫలాలు, చట్ట బద్దంగా అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చుడాలని అన్నారు. ఇట్టి కార్యక్రమం లో ఎంపీడీఓ సుదాకర్, సమత సైకిక్ దళ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బాలరాజ్,మాజీ ఎంపీటీసీ సి. హెచ్ రాజ్‌కుమార్,అడ్వాకేట్ షకీల్, పెన్ గన్ ఎడిటర్ రాయికోటి నర్సింలు, బహుజన సంఘర్షణ సమితి అధ్యక్షులు చింతలగట్టు శివరాజ్, బహుజన నాయకులు జాగృతి అధ్యక్షులు ముదిరాజ్ పాండు, సి హెచ్ దత్తు, కొల్లూర్ గ్రామ అధ్యక్షులు డప్పుర్ సంగమేష్,బోజ్యానాయక్ తండా అధ్యక్షులు సుబాష్,సామాజికవేత్త దన్‌రాజ్ గౌడ్, 24 న్యూస్ మీడియా దిగంబర్,నాయకులు అమృత్, ప్రవీణ్,రవి విద్యాసాగర్,ఉపేందర్ మరియు ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది మరియు వివిధ పార్టీ నాయకులు,వివిధ సంఘనాయకులు తధితరులు పాల్గోని మహాత్మ జ్యోతి రావు పూలే గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు.

అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండల కేంద్రంలో అంబేద్కర్ భవనం వద్ద అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు శనిగరపు రాజేందర్ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే 198వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా జ్యోతిరావు పూలే ఫోటో కు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.

రాజేందర్ మాట్లాడుతూ సుప్రసిద్ధ భారతీయ సామాజిక కార్యకర్త ఆలోచనపరుడు కుల వ్యతిరేక సంఘసంస్కర్త అని అన్నారు. అంటరానితనం నిర్మూలన కోసం మహిళలు అనగారిన కులాల ప్రజలలో విద్య వ్యాప్తికి కృషిని కొనసాగించారని వారి సేవలను గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు తిక్క సంపత్,కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు ఓరుగంటి కృష్ణ,నాయకులు దూడపాక శ్రీనివాస్,రజనీకాంత్,సంపత్,శివకుమార్ యూత్ నాయకులు పాల్గొన్నారు._

అంగన్వాడి కేంద్రంలో ఘనంగా స్కూల్ డే వేడుకలు.

అంగన్వాడి కేంద్రంలో ఘనంగా స్కూల్ డే వేడుకలు.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

మొగుడంపల్లి మండలంలోని అంగన్వాడీ కేంద్రంలో గురువారం ఘనంగా స్కూల్ డే వేడుకలు, గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మెడికల్ ఆఫీసర్ సింఫోనియా, అంగన్వాడి సూపర్వైజర్ సద్గుణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు తప్పకుండా పంపించాలని తల్లిదండ్రులను కోరారు. అదేవిధంగా మెనూ ప్రకారం పిల్లలకు పౌష్టికాహారం అందించాలని టీచర్లను ఆదేశించారు.

మాజి జడ్పిటిసి స్వప్న భాస్కర్ జన్మదిన వేడుకలు.

ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మాజి జడ్పిటిసి స్వప్న భాస్కర్ జన్మదిన వేడుకలు

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

న్యాల్కల్ మండల మాజి జడ్పిటిసి స్వప్న భాస్కర్ గారి జన్మదిన సందర్భంగా ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో కేక్ కటింగ్ నిర్వహించి జన్మదిన శుభాకంక్షలు తెలిపిన శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు,

ZPTC

డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ ,మాజి మార్కెట్ చైర్మన్ గుండప్ప ,మాజి ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్,జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం ,పాక్స్ చైర్మన్ మచ్చెందర్,సీనియర్ నాయకులు నామ రవికిరణ్,మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్, మొహిద్దీన్,మాజి కౌన్సిలర్ అబ్దుల్లా,ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్,మాజి ఆలయ చైర్మన్ నర్సింహ గౌడ్,మాజి సర్పంచ్ శేఖర్ రెడ్డి,
యువ నాయకులు మిథున్ రాజ్,నాయకులు గణేష్ , చంద్రయ్య,దీపక్ తదితరులు.

BJP ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాల్లో.

BJP ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాల్లో.

నేటి ధాత్రి కథలాపూర్

 

 

భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మండల అధ్యక్షులు మల్యాల మారుతి ఆధ్వర్యంలో కథలాపూర్ BJP పార్టీ కార్యాలయంలో పార్టీ క్రియాశీల సభ్యుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ఇంచార్జ్ గా రాజన్న సిరిసిల్ల జిల్లా OBC మోర్చా జిల్లా అధ్యక్షులు నంద్యాడపు వెంకటేష్ రావడం జరిగింది వారు మాట్లాడుతూ BJP పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మరియు క్రియాశీల సభ్యులు ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన విషయాల్నింటిని క్లుప్తంగా వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కోడిపెల్లి గోపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు రాచమడుగు వెంకటేశ్వర్రావు,జిల్లా కౌన్సిల్ సభ్యులు కథలాపూర్ మహేష్, పిడుగు ఆనంద్ రెడ్డి,నరెడ్ల రవి,దయ్యా లక్ష్మి నర్సయ్య,జిల్లా సత్యం, అల్లకొండ నవీన్,పాలేపు, రాజేష్,నరేష్,గంగామల్లయ్య, శ్రీధర్,శివ,వినయ్, నరేందర్,మహేష్,సంతారం, సాయిరెడ్డి,వినయ్,రాజేష్,రాజరెడ్డి శ్రీకాంత్ పాల్గొన్నారు.

ఎన్.ఎస్.యు.ఐ 55వ ఆవిర్భావ వేడుకలు.

ఎన్.ఎస్.యు.ఐ 55వ ఆవిర్భావ వేడుకలు.

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి )

 

సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో
ఎన్.ఎస్. యు.ఐ 55 ఆర్బో వేడుకలు పాల్గొన్న రాష్ట్ర కోఆర్డినేటర్ వేల్పుల వేణు యాదవ్ మాట్లాడుతూ నేడు అంబేద్కర్ విగ్రహం సాక్షిగా జై భీమ్, జై బాపు జై సంవిధాన్ అనే కార్యక్రమం కూడా ఇక్కడే నిర్వహించడం గర్వకారణంగా ఉంది.అని అలాగే ఎన్నో సంవత్సరాలనుండి విద్యార్థుల సమస్యలపై పోరాడుతున్న ఎన్.ఎస్.యు.ఐ నేడు 55వ ఆవిర్భావ దినోత్సవం సిరిసిల్ల పట్టణంలో జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది అని తెలిపారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్.ఎస్.యు.ఐ ఆవిర్భవ దినోత్సవం సిరిసిల్ల జిల్లా స్థాయిలో పట్టణ స్థాయిలో విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చొప్పదండి ప్రభాకర్, పద్మశాలి పట్టణ అధ్యక్షులు గోలి వెంకటరమణ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వైద్య శివప్రసాద్,తంగళ్ళపల్లి మండల అధ్యక్షులు జలగం ప్రవీణ్,టోనీ తదితర కాంగ్రెస్ నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు.

కిసాన్ పరివార్ అధినేత జన్మదిన వేడుకలు..

కిసాన్ పరివార్ అధినేత జన్మదిన వేడుకలు

కనివిని ఎరుగని రీతిలో ప్రజాసేవకుడి జన్మదిన వేడుకలు

– దంతాలపల్లి మండలంలో ఘనంగా భూపాల్ నాయక్ జన్మదిన వేడుకలు.

– ప్రజానీకంలో అశేష ఆధారణ పొందుతున్న యువ నేత భూపాల్ నాయక్.

మరిపెడ/దంతాలపల్లి నేటిధాత్రి.

 

ప్రజా సేవకుడు ప్రజల పక్షాన నిలబడి కొట్లాడుతున్న కిసాన్ పరివార్ సేవా సంస్థ వ్యవస్థాపకులు నానావత్ భూపాల్ నాయక్ జన్మదిన వేడుకలను మహబూబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం దంతాలపల్లి మండలంలోని పెద్ద ముప్పారం గ్రామ అమ్మ ఒడి అనాధ శరణాలయంలో యువ దళపతి జన్మదిన వేడుకలను నిర్వహించుకోవడం జరిగింది.. అనంతరం వృద్ధులకు పండ్లను అందజేయడం అందజేసినారు.. అలాగే భూపాల్ నాయక్ జన్మదిన వేడుకలను ఆగపేట గ్రామ ఉపాధి హామీ కూలీలు,వాల్య తండా లో యువకులు,బిరిశెట్టి గూడెం లో భూపాల్ నాయక్ అభిమానులు,రేఖ్య తండాలో శ్రీరామ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు..దంతాలపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్ లో పేషెంట్లకు పండ్లను పంపిణీ చేయడం జరిగింది…. దంతాలపల్లి మండలంలో బాణసంచాలు కాల్చి భూపాల్ నాయక్ జన్మదిన వేడుకల సంబరాలు జరుపుకున్నారు…పెద్ద ముప్పారం అనాధ ఆశ్రమ ఇంచార్జ్ మాట్లాడుతూ అనాధాశ్రమాలలో జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని,కిసాన్ పరివార్ వ్యవస్థాపకులు భూపాల్ నాయక్ కు మా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. రైతుల పక్షాన నిలిచిన ప్రజా నాయకుడు,రైతు సంక్షేమం,అభివృద్ధి కోసం నిరంతరం ఆలోచించే ప్రజా సేవకుడు భూపాల్ నాయక్ అని అన్నారు..గతంలో ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యల పక్షాన నిలబడి మద్దతు తెలిపారని గుర్తు చేశారు.. పల్లెల్లో పలకరింపు కార్యక్రమంలో ఆగపేట ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లను అందజేసి,ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకొని పనులు చేయాలని సూచించారన్నారు.ఈ కార్యక్రమంలో మూడవత్ రవి నాయక్,ప్రవీణ్ కుమార్,యాకుబ్ నాయక్,పోలేపక మధు,ధర్మారపు సందీప్ ఇంకా తదితరులు పాల్గొన్నారు.

కామ్రేడ్ జార్జి రెడ్డి 53వ వర్ధంతి.!

కామ్రేడ్ జార్జి రెడ్డి 53వ వర్ధంతి మహాసభలను విజయవంతం చేయాలి.

కస్తూర్బా బాలికల వసతి గృహంలో గోడ పత్రాలను విడుదల చేసిన పి డి ఎస్ యు నాయకులు

జైపూర్,నేటి ధాత్రి:

 

 

ఉస్మానియా అరుణతార, యువ మేధావి కామ్రేడ్ జార్జి రెడ్డి స్పూర్తితో విద్యారంగంలో మనువాద భావజాలానికి వ్యతిరేకంగా పోరాడాలని పి డి ఎస్ యు జిల్లా ఉపాధ్యక్షుడు సికిందర్ పేర్కొన్నారు.రాష్ట్రవ్యాప్తంగా కమిటీ పిలుపుమేరకు ఈ నెల 10 నుంచి 14 వరకు చేపట్టనున్న జార్జి రెడ్డి 53 వ వర్ధంతి మహాసభలను విజయవంతం చేయాలని సోమవారం పిలుపునిచ్చారు.జైపూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల వసతి గృహం విద్యార్థినిల ఆధ్వర్యంలో గోడపత్రాలను విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆహారం,దుస్తులు,వైద్యం లాంటి కనీస అవసరాలు అందరికీ సంపూర్ణంగా అందాలన్నదే జార్జిరెడ్డి ఆకాంక్ష అన్నారు.ఉస్మానియా విశ్వ విద్యాలయంలో అవినీతి, ర్యాగింగ్,గూండాల దాడులకు వ్యతిరేకంగా జార్జిరెడ్డి గళం విప్పి పోరాడిన విద్యార్థి నాయకుడన్నారు.మతోన్మాద చీకటి కోణాలను చీల్చి చెండాడి,ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చేందుకు జార్జిరెడ్డి పలు సభలు,సమావేశాలు నిర్వహించారన్నారు.ఉస్మానియా విద్యార్థి సంఘంతో మొదలైన జార్జిరెడ్డి విప్లవం.పిడిఎస్ గా నిర్మితమై,జార్జిరెడ్డి మరణానంతరం అది పీ డీ ఎస్ యూ గా మారిందని వివరించారు.కామ్రేడ్ జార్జిరెడ్డి ఆశయాల సాధనకై పోరాడాలని,అమరత్వాన్ని స్మరించుకుంటూ,జరుగు వర్ధంతి సభలను జయప్రదం చేయాలని విద్యార్థులను కోరారు.ఈ కార్యక్రమంలో అఖిల,రమ్య,కావ్య, మహేశ్వరి,ప్రసన్న,స్వప్న తదితరులు పాల్గొన్నారు.

శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొన్న.!

శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి…

▪శ్రీ.సీతా రామచంద్రుల స్వామి దీవెనలతో నియోజకవర్గ ప్రజలంతా చల్లగా ఉండాలి…
– యన్.గిరిధర్ రెడ్డి

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

శ్రీరామ నవమి వేడుకలను పురస్కరించుకొని ఆదివారం రోజున జహీరాబాద్ పట్టణంలో ఘనంగా శోభయాత్ర నిర్వహించారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ…దేశ స్థాయిలో శ్రీరామ నవమి వేడుకలను ఆనందాల మధ్య సంతోషలు నింపుకొని భక్తిశ్రద్ధలతో సీతారాముల కల్యాణ మహోత్సవాలను ప్రజలు ఘనంగా నిర్వహించుకోవడం ఎంతో గొప్పతనం అని ప్రజలు నిండుగా అభివృద్ధి చెందాలని తాను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

N. Giridhar Reddy

 

సితా రామచంద్రస్వామి వారి దీవెనలతో జహీరాబాద్ నియోజకవర్గం ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి అని కోరుకున్నాను అన్నారు.ఈకార్యక్రమంలో జహీరాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్ మంకాల్ సుభాష్,మాజీ వైస్ యం.పి.పి.వి.రాములు,జహీరాబాద్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పి.నాగిరెడ్డి, సీనియర్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి,ఖాసీంపూర్ మాజీ యం.పి.టి.సి రాజు,రాష్ట్ర యూత్ కాంగ్రెస్ కార్యదర్శి హర్షవర్ధన్ రెడ్డి,సీనియర్ నాయకులు ప్రతాప్ రెడ్డి,అక్తర్ గోరి,బి.మల్లికార్జున్, ప్రజలు,భక్తులు,వివిధ సంఘాల నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.

జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు.

విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు.

నర్సంపేట,నేటిధాత్రి:

 

భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా నర్సంపేట విద్యుత్ శాఖ డివిజన్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా డిఈ తిరుపతి బాబు జగ్జీవన్ రామ్ యొక్క స్ఫూర్తి గురించి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఏ.డి.ఈ బి.లక్ష్మణ్, టౌన్ ఏ.ఈ ఎన్ .విజయభాస్కరరావు టెక్నికల్ ఏ ఈ సంపత్ తో పాటు నర్సంపేట టౌన్ విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version