ఆరు నెలలు హార్మూజ్ క్లోజ్! భారత్‍లో పెట్రోల్ ధరల పెంపు?

ఆరు నెలలు హార్మూజ్ క్లోజ్!
భారత్‍లో పెట్రోల్ ధరల పెంపు?

 

అంతర్జాతీయంగా చమురు సెగలు మంటలు రేపుతున్నాయి. ఇజ్రాయెల్, అమెరికా-ఇరాన్ మధ్య మొదలైన యుద్ధం.. ఇప్పుడు మీ జేబులకు చిల్లు పెట్టబోతోంది. అవును.. మీరు విన్నది నిజమే! ప్రపంచానికే ఇంధనాన్ని సరఫరా చేసే అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి ఇప్పుడు ఒక మృత్యుపాశంగా మారింది!”

​”తాజా సమాచారం ప్రకారం.. హర్మూజ్ జలసంధి ఇప్పట్లో తెరుచుకునే సూచనలు కనిపించడం లేదు. ఎందుకో తెలుసా? ఇరాన్ సైన్యం అక్కడ అమర్చిన ‘సీ మైన్స్’! సముద్ర గర్భంలో దాదాపు 20కి పైగా శక్తివంతమైన గనులను ఇరాన్ పేర్చిందన్నది పెంటగాన్ రహస్య నివేదిక. అత్యంత ఆధునిక GPS టెక్నాలజీతో వీటిని అమర్చడం వల్ల.. ఏ నిమిషానికి ఏ నౌక పేలిపోతుందో తెలియక అగ్రరాజ్యం అమెరికా కూడా వణికిపోతోంది. వీటిని తొలగించడానికి కనీసం ఆరు నెలల సమయం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.”

​”ఇక మన భారత్ విషయానికి వస్తే.. పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది! ప్రస్తుతం తమిళనాడు, బెంగాల్ ఎన్నికల హడావుడిలో ఉన్నాం కాబట్టి ధరలు నిలకడగా ఉన్నాయి. కానీ, ఒక్కసారి ఎన్నికల ప్రక్రియ ముగిసిందా.. సామాన్యుడి నడ్డి విరగడం ఖాయం!
​అంతర్జాతీయ మార్కెట్ లెక్కల ప్రకారం.. పెట్రోల్ లీటర్‌పై ఏకంగా 25 నుంచి 28 రూపాయలు పెరిగే అవకాశం ఉందట! అంటే.. ఒక్క పెట్రోల్ మాత్రమే కాదు, రవాణా చార్జీలు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకబోతున్నాయి.
​కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎక్సైజ్ డ్యూటీ తగ్గించినా.. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు ఇలాగే పెరిగితే ఆ భారం మోయడం ఎవరికైనా కష్టమే. మరి ఈ చమురు సంక్షోభం నుంచి భారత్ ఎలా గట్టెక్కుతుంది? హర్మూజ్ గండం ఎప్పుడు గడుస్తుంది? వేచి చూడాల్సిందే!”

ట్రంప్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.. ఇరాన్ లీడర్ హెచ్చరిక…

ట్రంప్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.. ఇరాన్ లీడర్ హెచ్చరిక

 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన తప్పులకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందేనని ఇరాన్ జాతీయ భద్రతా మండలి సెక్రెటరీ అలీ లారిజానీ తాజాగా వార్నింగ్ ఇచ్చారు.

ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్ జాతీయ భద్రతా మండలి కార్యదర్శి అలీ లారిజానీ (Ali Larijani) తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు (Donald Trump) గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ట్రంప్ భారీ మూల్యం చెల్లించక తప్పదని వార్నింగ్ ఇచ్చారు. తమ సుప్రీం లీడర్ ఖమేనీ, ప్రజల రక్తం చిందినందుకు తప్పక ప్రతీకారం తీర్చుకుంటామని తేల్చి చెప్పారు. ఇటీవల అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో కన్నుమూసిన ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి సన్నిహితుల్లో ఒకరిగా అలీ లారిజానీకి పేరుంది.

అమెరికా సైనికులు కొందరు తమకు చిక్కారని కూడా అలీ లారిజానీ సంచలన ప్రకటన చేశారు. వారు ప్రస్తుతం జైళ్లల్లో ఉన్నారని అన్నారు. ఇరాన్ దాడుల్లో ఆరుగురు అమెరికన్ సైనికులే మరణించారంటూ ట్రంప్ ప్రపంచాన్ని తప్పు దోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వాస్తవానికి ఇరాన్ దాడుల్లో 500 మందికి పైగా అమెరికన్లు మరణించారని అన్నారు. సమయం గడిచే కొద్దీ ఈ సంఖ్య మరింత పెరుగుతుందని హెచ్చరించారు. అయితే, అమెరికా మాత్రం ఈ ప్రకటనలను ఖండించింది. ఇరాన్ మోసాలు, అసత్య ప్రకటనలకు ఇది నిదర్శనమని పేర్కొంది.

రెండు రోజులు నీటి సరఫరా బంద్‌…

రెండు రోజులు నీటి సరఫరా బంద్‌

వేసవి కాలం దృష్టిలో పెట్టుకొని తాగునీటి సమస్య పరిష్కారానికి సమ్మర్‌ యాక్షన్‌ ప్లాన్‌ తయారీకి చర్యలు తీసుకున్నట్లు మిషన్‌ భగీరథ ఏఈ నాగభూషణం ప్రకటనలో తెలిపారు.

మెదక్‌: వేసవి కాలం దృష్టిలో పెట్టుకొని తాగునీటి సమస్య పరిష్కారానికి సమ్మర్‌ యాక్షన్‌ ప్లాన్‌ తయారీకి చర్యలు తీసుకున్నట్లు మిషన్‌ భగీరథ ఏఈ నాగభూషణం ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా పెద్దరెడ్డిపేట వద్ద పైప్‌లైన్‌ లీకేజీ మరమ్మతులు, రాయిపహాడ్‌ వద్ద స్లూయి్‌సవాల్స్‌ రిపేర్లు, సివిల్‌ పనులు, సంపులు శుభ్రపరచడం తదితర నిర్వహణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. పనులు పూర్తిచేయడం కోసం సింగూరు(Singoor) నుంచి జిల్లాలకు నీటి సరఫరా నిలిపివేస్తున్నామని తెలిపారు.

ఇరాన్‌పై అమెరికా దాడులు.. ఆ వ్యాఖ్యలను ఖండించిన భారత్…

ఇరాన్‌పై అమెరికా దాడులు.. ఆ వ్యాఖ్యలను ఖండించిన భారత్

 

ఇరాన్‌పై దాడుల కోసం అమెరికా నౌకాదళం భారత పోర్టులను వినియోగిస్తున్నదన్న వార్తలను కేంద్రం ఖండించింది. ఇలాంటి ఆరోపణలు నిరాధారం, కల్పితమని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

ఇంటర్నెట్ డెస్క్: మధ్యప్రాచ్యంలో కొన్ని రోజులుగా భీకర యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై దాడుల కోసం అమెరికా నావికాదళం భారత నౌకలను ఉపయోగిస్తోందంటూ విస్తృతంగా జరుగుతున్న ప్రచారాలను కేంద్రం ఖండించింది. ఆ ఆరోపణలు పూర్తిగా అవాస్తవం, నిరాధారమని కేంద్ర విదేశాంగ శాఖ(MEA) స్పష్టం చేసింది.

అమెరికా మాజీ ఆర్మీ కల్నల్ డగ్లస్ మాక్‌గ్రెగర్ ఇటీవల ఓ ఛానల్ ఇంటర్వ్యూ సందర్భంగా మాట్లాడుతూ.. ‘గల్ఫ్ ప్రాంతంలో అమెరికా సైనిక స్థావరాలపై ఒత్తిడి పెరగడంతో మా నావల్ బేస్‌లు ధ్వంసమయ్యాయి. మా నౌకాశ్రయ సదుపాయాలూ ధ్వంసమయ్యాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము భారత్, ఆ దేశానికి చెందిన నౌకాశ్రయాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఇది సరైన మార్గం కాదు. అయినప్పటికీ పరిస్థితుల ప్రభావం కారణంగా అలా చేయక తప్పడం లేదు’ అని మాక్‌గ్రెగర్ అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో ఈ వివాదం చెలరేగింది. దీనిపై స్పందించిన కేంద్ర విదేశాంగ శాఖ ఫ్యాక్ట్‌చెక్ విభాగం.. ఆ వ్యాఖ్యలను పూర్తిగా ఖండించింది. ‘భారత పోర్టులు అమెరికా దాడులకు ఉపయోగిస్తున్నాయన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు’ అని ‘ఎక్స్’ వేదికగా ప్రకటించింది. నిర్ధారణ లేని సమాచారం సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దని హెచ్చరించింది.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version