అహ్మదాబాద్ పిచ్.. టీమిండియా ఆందోళన పడుతోందా..

అహ్మదాబాద్ పిచ్.. టీమిండియా ఆందోళన పడుతోందా..

 

మరికొద్ది గంటల్లో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో టీ-20 ప్రపంచకప్-2026 ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. ఈ స్టేడియంలో ఇటీవలి కాలంలో భారత్‌కు మెరుగైన రికార్డు లేదు. ఈ స్టేడియంలోనే 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో ఓడిపోయింది.

మరికొద్ది గంటల్లో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో టీ-20 ప్రపంచకప్-2026 ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. ఈ స్టేడియంలో ఇటీవలి కాలంలో భారత్‌కు మెరుగైన రికార్డు లేదు. ఈ స్టేడియంలోనే 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో ఓడిపోయింది. అలాగే ప్రస్తుతం జరుగుతున్న టోర్నీలో టీమిండియాకు ఎదురైన ఏకైక ఓటమి కూడా ఈ పిచ్‌లోనే. సూపర్-8 దశలో అహ్మదాబాద్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైంది (Ahmedabad pitch conditions).

కాగా, ప్రస్తుతం ఫైనల్ మ్యాచ్ కోసం తయారు చేసిన పిచ్, గతంలో టీమిండియా ఓడిపోయినప్పుడు ఉపయోగించిన పిచ్‌ల కంటే చాలా భిన్నంగా ఉందట. పిచ్‌ను పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలంగా మార్చేశారట. పిచ్ మీద గడ్డిని పూర్తిగా తొలగించి ఫ్లాట్‌గా మార్చేశారట. ప్రస్తుత పిచ్ చక్కటి బౌన్స్‌తో బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందట. అలాగే దూకుడుగా ఆడే స్ట్రోక్‌ప్లేయర్లకు స్వర్గధామంగా ఉంటుందట. అయితే పిచ్ పూర్తి ఫ్లాట్‌గా ఉండడం వల్ల స్పిన్నర్ల విషయంలో కెప్టెన్లు ఇద్దరూ ఆలోచనలో పడ్డారట (IND vs NZ final pitch analysis).
Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version