భూసేకరణ బాధితులకు సహాయం చేయండి…

భూసేకరణ బాధితులకు సహాయం చేయండి…

◆”-: భూ బాధితులు సంగారెడ్డి కలెక్టర్ ప్రవీణ్యకు ఫిర్యాదు

జహీరాబాద్, నేటి ధాత్రి:

 

భూసేకరణ పరిహారాన్ని విడుదల చేయాలని విజ్ఞప్తి – సంగారెడ్డి జిల్లా, ఝరసంగం మండలం, ఎల్లోయ్ గ్రామ నివాసులు. నిమ్జ్ ప్రాజెక్ట్ కోసం సర్వే నంబర్లు 54 మరియు 125లోని మా భూమిని సేకరించారు. అయితే, మా భూములకు నష్టపరిహారం చెల్లించడం లేదు. మొత్తం 8 మంది పట్టాదారులు ఉన్నారు. మా వద్ద అసైన్‌మెంట్ కమిటీ జారీ చేసిన పట్టా సర్టిఫికేట్లు ఉన్నాయి. మేము దీని గురించి డిప్యూటీ కలెక్టర్‌ను అడిగినప్పుడు, ఆ భూమి మా ఆధీనంలో లేదని అప్పటి ఆందోలే ఎంఆర్‌ఓ రాశారని వారు చెప్పారు. ఝరసంగం మండలంలోని ఎల్లోయ్ గ్రామం గురించి ఆందోల్ ఎంఆర్ఓకు ఏమి తెలుసు? అందువల్ల, ఈ గ్రామంలోని 54 మరియు 125 సర్వే నంబర్లలో ఎంత మందికి పట్టాలు ఇచ్చారో మరియు ఎంత మంది అర్హులకు నిరాకరించారో దయచేసి విచారణ జరపండి. దీనిపై విచారణ జరిపి, నిజమైన పట్టాదారులకు నష్టపరిహారం చెల్లించాలని, అలాగే నకిలీ పట్టాదారులకు నష్టపరిహారం ఇచ్చిన అధికారులపై తక్షణమే చర్య తీసుకోవాలని వారు కోరారు. 8 మంది పట్టాదారులకు నష్టపరిహారం విడుదల చేయాలని మా విన్నపం. అధికారులు దీనిని ఉద్దేశపూర్వకంగా 9 సంవత్సరాలుగా ఆలస్యం చేస్తున్నారు, ఈ విషయంపై తక్షణమే స్పందించి పరిష్కరించాలని వారు ఉన్నతాధికారులను కోరారు.

నిరుపేదలకు వరం ముఖ్యమంత్రి సహాయ నిధి..

నిరుపేదలకు వరం ముఖ్యమంత్రి సహాయ నిధి

◆”-: మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డా౹౹ఏ.చంద్రశేఖర్ గారి ఆదేశాలతో

◆”-: లబ్దిదారులకు ₹ 18,35,500 /- సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత

జహీరాబాద్ నేటి ధాత్రి:

నిరుపేదలకు వరం ముఖ్యమంత్రి సహాయనిది అని, నిరుపేదలు అనారోగ్యానికి గురై తన సొంత ఖర్చులతో ఆసుపత్రిలో చికిత్స చేసుకున్న అనంతరం ఖర్చు అయిన బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి అందజేస్తుందని మాజీ మంత్రి, నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ డా:చంద్రశేఖర్ తెలిపారు.నియోజకవర్గంలోని జహీరాబాద్,న్యాలకల్, కోహిర్, ఝారసంఘం, మొగుడంపల్లి,మండలాల లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఇంచార్జ్ డా చంద్రశేఖర్ సూచన మేరకు సిఎంఆర్ఎఫ్ చెక్కులను ఆత్మ కమిటీ చైర్మన్ రామలింగారెడ్డి, మండల అద్యక్షులు హన్మంతరావు పాటిల్, శ్రీనివాస్ రెడ్డి,సర్పంచులు వీరా రెడ్డి, రాజ్ కుమార్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి ,సత్వర్ పిఎసిఎస్ ఛైర్మెన్ చంద్రశేఖర్ రెడ్డి గారు, ఇప్పేపల్లి మాజీ పిఎసిఎస్ ఛైర్మెన్ వెంకట్ రెడ్డి , కాంగ్రెస్ నాయకులు హుగ్గేల్లి రాములు,శేఖర్ ,విష్ణు , ఫైజ్, తదితరులు అందజేశారు..సిఎంఆర్ఎఫ్ చెక్కులను అందుకున్న లబ్ధిదారులు మాజీ మంత్రి డా:చంద్రశేఖర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.

న్యాల్కల్ మామిడ్డిలో సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన సర్పంచ్…

న్యాల్కల్ మామిడ్డిలో సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన సర్పంచ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

న్యాల్కల్ మండలం మామిడ్ది గ్రామంలో ఎన్ఆర్ఆజీఎస్ పథకం కింద రూ.10 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను సర్పంచ్ సవిత జగన్నాథ్ రెడ్డి ప్రారంభించారు. ఈ పనులు గ్రామాభివృద్ధికి ఎంతో దోహదపడతాయని, ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దంత వైద్యుడు రాజేశ్వర్ రెడ్డి, జగన్నాథ్, సంజీవరెడ్డి, తుక్కారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు అధికారులు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

జహీరాబాద్ తహశీల్దార్ నాగేశ్వర్ రావు మృతి…

జహీరాబాద్ తహశీల్దార్ నాగేశ్వర్ రావు మృతి

జహీరాబాద్ నేటి ధాత్రి;

జహీరాబాద్ తహసీల్దార్‌గా పనిచేస్తున్న నాగేశ్వరరావు అనారోగ్యంతో మరణించారు. తహసీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, నాగేశ్వరరావు మండల ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే నిబద్ధత గల అధికారిగా పేరు సంపాదించారు. ఇటీవల అస్వస్థతకు గురైన ఆయన, ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా మంగళవారం ఉదయం మరణించారని కుటుంబ సభ్యులు తెలిపారు. అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఇది అనుకోకుండా జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు.
వారు ఈ విషయం గురించి తెలియజేశారు. అతని మరణం పట్ల చాలా మంది సంతాపం తెలిపారు.

స్పామ్ కాల్స్, మెసేజ్‌లతో ఇబ్బంది పడుతున్నారా.. ఇలా చేయండి..

స్పామ్ కాల్స్, మెసేజ్‌లతో ఇబ్బంది పడుతున్నారా.. ఇలా చేయండి..

మొబైల్ వాడే అందరికీ స్పామ్ కాల్స్ చాలా చికాకు కలిగిస్తుంటాయి. వేర్వేరు నెంబర్ల నుంచి స్పామ్ కాల్స్, మెసేజ్‌లు వస్తూ ఉంటాయి. పర్సనల్ లోన్ కావాలా..? క్రెడిట్ కార్డ్ కావాలా..? ఇన్యూరెన్స్ తీసుకుంటారా..? అంటూ రోజూ కాల్స్ వస్తుంటాయి.

‘పర్సనల్ లోన్ కావాలా..? క్రెడిట్ కార్డ్ కావాలా..? ఇన్యూరెన్స్ తీసుకుంటారా..?’ అంటూ వచ్చే స్పామ్ కాల్స్ చాలా చికాకు కలిగిస్తుంటాయి. వేర్వేరు నెంబర్ల నుంచి స్పామ్ కాల్స్, మెసేజ్‌లు వస్తూ ఉంటాయి. ఆఫీసు పనిలో బిజీగా ఉన్నప్పుడో, బైక్‌పై వెళ్లేటప్పుడో ఇలాంటి స్పామ్ కాల్స్ వస్తే మరింత చిర్రెత్తుతుంది. ఎన్ని నెంబర్లు బ్లాక్ చేసినా, మరో కొత్త నెంబర్ నుంచి స్పామ్ కాల్స్ వస్తూనే ఉంటాయి. వీటికి చెక్ పెట్టేందుకు ట్రాయ్ కఠిన రూల్స్ తీసుకొచ్చింది (TRAI spam control app).

 

LATEST

ప్రబలిన డయేరియా.. వారం రోజులు మాంసం విక్రయాలపై నిషేధం

స్టాలిన్‌ సార్‌కు ఇవే చివరి ఎన్నికలు

అదృష్టం కోసం ఏ కలర్ బ్యాగ్ లేదా పర్సు వాడాలో తెలుసా?

పొట్ట ఉంటేనే పట్టం.. ఇథియోపియా అమ్మాయిలకు బొజ్జ ఉన్నవాళ్లే ఇ

షాకింగ్ వీడియో.. పారాసైలింగ్ చేస్తుండగా గాల్లోనే ఏం జరిగిందో

హైదరాబాద్‌లోని జయలలిత నివాసం సీజ్

ప్రేమ వివాహం.. విషాదాంతం

రేపటి నుంచే మార్పులు.. మీ పాకెట్ పై ప్రభావం చూపించే అంశాలు!

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం..

TVK పార్టీ అధ్యక్షుడు విజయ్‌పై కేసు నమోదు

అదే మా ఓటమికి కారణం.. సీఎస్కే కెప్టెన్ రుతురాజ్

బీహార్ ఆలయంలో తొక్కిసలాట.. 8 మంది మృతి..

నెల్లూరు జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్‌ ట్రైన్.. నిలిచిన రా

ప్రబలిన డయేరియా.. వారం రోజులు మాంసం విక్రయాలపై నిషేధం

స్టాలిన్‌ సార్‌కు ఇవే చివరి ఎన్నికలు

అదృష్టం కోసం ఏ కలర్ బ్యాగ్ లేదా పర్సు వాడాలో తెలుసా?

పొట్ట ఉంటేనే పట్టం.. ఇథియోపియా అమ్మాయిలకు బొజ్జ ఉన్నవాళ్లే ఇ

షాకింగ్ వీడియో.. పారాసైలింగ్ చేస్తుండగా గాల్లోనే ఏం జరిగిందో

హైదరాబాద్‌లోని జయలలిత నివాసం సీజ్

ప్రేమ వివాహం.. విషాదాంతం

రేపటి నుంచే మార్పులు.. మీ పాకెట్ పై ప్రభావం చూపించే అంశాలు!

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం..

TVK పార్టీ అధ్యక్షుడు విజయ్‌పై కేసు నమోదు

అదే మా ఓటమికి కారణం.. సీఎస్కే కెప్టెన్ రుతురాజ్

బీహార్ ఆలయంలో తొక్కిసలాట.. 8 మంది మృతి..

నెల్లూరు జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్‌ ట్రైన్.. నిలిచిన రా

స్పామ్ కాల్స్‌ను అరికట్టేందుకు ట్రాయ్ ‘డూ నాట్ డిస్ట్రబ్’ (DND) యాప్‌ను లాంచ్ చేసింది. ఈ యాప్‌లో నంబర్‌ను నమోదు చేసుకుంటే స్పామ్ కాల్స్, మెసేజ్‌లు రాకుండా ఉంటాయని ట్రాయ్ తెలిపింది. ఈ యాప్‌లో వినియోగదారులు చాలా సులభంగా తమ నంబర్‌లను నమోదు చేసుకోవచ్చు. కమ్యూనికేషన్ ప్రాధాన్యతలను సెట్ చేసుకోవచ్చు. ఈ యాప్ ప్రమోషనల్ కాల్స్, మెసేజ్‌లను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు ఈ యాప్‌ను సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు (DND India guide).

స్పామ్ కాల్స్, మెసేజ్‌లను ఇలా నియంత్రించండి..

  • మీ ఫోన్‌లో ట్రాయ్ డీఎన్‌డీ (TRAI DND) యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి.
  • యాప్ ఓపెన్ చేసి మీరు స్వీకరించాలనుకుంటున్న లేదా పరిమితం చేయాలనుకుంటున్న కమ్యూనికేషన్ వర్గాలను ఎంచుకోండి
  • ఓటీపీ ద్వారా వేగంగా యాక్టివేషన్ చేసుకోండి
  • ఫిర్యాదుల సెక్షన్‌లోకి వెళ్లి స్పామ్ కాల్స్, మెసేజ్‌లపై ఫిర్యాదు చేయవచ్చు
  • మీ ఫిర్యాదును యాప్‌లోనే ట్రాక్ చేయవచ్చు.

 కాట్రియాలలో శివాజీ విగ్రహ భూమి పూజ చిచ్చు…

 కాట్రియాలలో శివాజీ విగ్రహ భూమి పూజ చిచ్చు.
మూడు రోజులుగా ముదిరిన వివాదం.
పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు.

రామాయంపేట నేటి ధాత్రి (మెదక్ )

శివాజీ విగ్రహ స్థాపన స్థల వివాదం ఆ ఊర్లో వివాదాన్ని తెచ్చిపెట్టింది.ఇరు వర్గాల్లో గొడవ పెరిగి పోలీస్ స్టేషన్ దాకా వచ్చింది.వివరాల్లోకెళ్తే.. రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో మూడు రోజుల క్రితం శివాజీ విగ్రహ భూమి పూజకు యువత ఏర్పాట్లు చేసింది.అది ప్రభుత్వ స్థలం అంటూ ఒకరు వాదించగా..పనులు ఆగాయి.దీంతో కోపోద్రిక్తులైన యువకులు,మరొకరి మధ్య మాటల యుద్ధం పెరిగి గ్రామంలో గొడవ రాసుకుంటున్నది.

స్పెల్ బి రాష్ట్రస్థాయి పోటీల్లో బాలాజీ విద్యార్థి ప్రతిభ…

స్పెల్ బి రాష్ట్రస్థాయి పోటీల్లో బాలాజీ విద్యార్థి ప్రతిభ

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

హైదరాబాద్‌లో ఈ నెల 29న నిర్వహించిన స్పెల్ బి రాష్ట్రస్థాయి పోటీల్లో బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్ విద్యార్థిని చి. దాక్షిక ప్రతిభ కనబర్చి రైసింగ్ స్టార్ ట్రోఫీను గెలుచుకుంది.ఈ సందర్భంగా బాలాజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఏ. రాజేంద్రప్రసాద్ రెడ్డి, ట్రెజరర్ డాక్టర్ ఏ. వనజ విద్యార్థినిని అభినందించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్ ప్రిన్సిపాల్ ఆర్. జ్యోతి, అక్షరధా స్కూల్ ప్రిన్సిపాల్ జి. భవాని, ఉపాధ్యాయులు జోసెఫ్, లక్ష్మీ, నవ్య తదితరులు పాల్గొన్నారు.

స్టాలిన్‌ సార్‌కు ఇవే చివరి ఎన్నికలు…

స్టాలిన్‌ సార్‌కు ఇవే చివరి ఎన్నికలు

 

డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్‌కు ఇవే చివరి ఎన్నికలని, ఆయన్ని ఇంటికి సాగనంపాలని ప్రజలు నిర్ణయించారని ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధ్యక్షుడు విజయ్‌ పేర్కొన్నారు.

ప్రచారంలో విజయ్‌

 

LATEST

ప్రబలిన డయేరియా.. వారం రోజులు మాంసం విక్రయాలపై నిషేధం

స్టాలిన్‌ సార్‌కు ఇవే చివరి ఎన్నికలు

అదృష్టం కోసం ఏ కలర్ బ్యాగ్ లేదా పర్సు వాడాలో తెలుసా?

పొట్ట ఉంటేనే పట్టం.. ఇథియోపియా అమ్మాయిలకు బొజ్జ ఉన్నవాళ్లే ఇ

షాకింగ్ వీడియో.. పారాసైలింగ్ చేస్తుండగా గాల్లోనే ఏం జరిగిందో

హైదరాబాద్‌లోని జయలలిత నివాసం సీజ్

ప్రేమ వివాహం.. విషాదాంతం

రేపటి నుంచే మార్పులు.. మీ పాకెట్ పై ప్రభావం చూపించే అంశాలు!

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం..

TVK పార్టీ అధ్యక్షుడు విజయ్‌పై కేసు నమోదు

అదే మా ఓటమికి కారణం.. సీఎస్కే కెప్టెన్ రుతురాజ్

బీహార్ ఆలయంలో తొక్కిసలాట.. 8 మంది మృతి..

నెల్లూరు జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్‌ ట్రైన్.. నిలిచిన రా

ప్రబలిన డయేరియా.. వారం రోజులు మాంసం విక్రయాలపై నిషేధం

స్టాలిన్‌ సార్‌కు ఇవే చివరి ఎన్నికలు

అదృష్టం కోసం ఏ కలర్ బ్యాగ్ లేదా పర్సు వాడాలో తెలుసా?

పొట్ట ఉంటేనే పట్టం.. ఇథియోపియా అమ్మాయిలకు బొజ్జ ఉన్నవాళ్లే ఇ

షాకింగ్ వీడియో.. పారాసైలింగ్ చేస్తుండగా గాల్లోనే ఏం జరిగిందో

హైదరాబాద్‌లోని జయలలిత నివాసం సీజ్

ప్రేమ వివాహం.. విషాదాంతం

రేపటి నుంచే మార్పులు.. మీ పాకెట్ పై ప్రభావం చూపించే అంశాలు!

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం..

TVK పార్టీ అధ్యక్షుడు విజయ్‌పై కేసు నమోదు

అదే మా ఓటమికి కారణం.. సీఎస్కే కెప్టెన్ రుతురాజ్

బీహార్ ఆలయంలో తొక్కిసలాట.. 8 మంది మృతి..

నెల్లూరు జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్‌ ట్రైన్.. నిలిచిన రా

చెన్నై: డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్‌కు ఇవే చివరి ఎన్నికలని, ఆయన్ని ఇంటికి సాగనంపాలని ప్రజలు నిర్ణయించారని ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధ్యక్షుడు విజయ్‌ పేర్కొన్నారు. ఏప్రిల్‌ 23న ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో, టీవీకే తరుఫున 234 నియోజకవర్గాల్లో ‘విజిల్‌’ గుర్తుపై టీవీకే ఒంటరిగా పోటీచేయనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో తిరుచ్చి (ఈస్ట్‌), పెరంబూరు నియోజకవర్గాల్లో పోటీచేసేందుకు నిర్ణయించిన విజయ్‌ సోమవారం పెరంబూరు నియోజకవర్గంలో పోటీచేసేందుకు వ్యాసర్పాడి ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో రిటర్నింగ్‌ అధికారికి తన నామినేషన్‌ పత్రాలు సమర్పించారు.

ఆయన నామినేషన్‌ పత్రాల్లో సి.జోసెఫ్‌ విజయ్‌ అని ఉండటం గమనార్హం. ఆ తర్వాత ఆయన తన ప్రచారానికి శ్రీకారం చుట్టారు. పెద్దసంఖ్యలో గుమిగూడిన పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజల మధ్య విజయ్‌ మాట్లాడుతూ.. పెరంబూరు ప్రాంతం తనకు తల్లిలాంటిదని, తనను అభిమానంగా ప్రేమించే వారు నివసిస్తున్న ప్రాంతం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించడం శుభ సూచికమన్నారు. ఉత్తర చెన్నైకి మంచి గుర్తింపు తీసుకొచ్చిన సెయింట్‌ లూర్థు చర్చి, పురాతన ఆలయాలు, మసీదులున్న ఈ ప్రాంతం నుంచే ప్రచారం ప్రారంభించాలని తన మనసుకు తోచిందన్నారు.

పోలీస్ వాహనంలో పేలుడు.. నలుగురికి గాయాలు…

పోలీస్ వాహనంలో పేలుడు.. నలుగురికి గాయాలు

కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్‌స్టేషన్‌కు చెందిన వాహనంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఎస్సై సహా నలుగురు పోలీసు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు.

 కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్‌స్టేషన్‌కు చెందిన వాహనంలో పేలుడు సంభవించింది. దీపావళి సందర్భంగా సీజ్ చేసిన టపాసులను తరలిస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసు వాహనంలో టపాసులు ఒక్కసారిగా పేలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో వాహనం పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఎస్సై సహా నలుగురు పోలీసు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

 

LATEST

ప్రబలిన డయేరియా.. వారం రోజులు మాంసం విక్రయాలపై నిషేధం

స్టాలిన్‌ సార్‌కు ఇవే చివరి ఎన్నికలు

అదృష్టం కోసం ఏ కలర్ బ్యాగ్ లేదా పర్సు వాడాలో తెలుసా?

పొట్ట ఉంటేనే పట్టం.. ఇథియోపియా అమ్మాయిలకు బొజ్జ ఉన్నవాళ్లే ఇ

షాకింగ్ వీడియో.. పారాసైలింగ్ చేస్తుండగా గాల్లోనే ఏం జరిగిందో

హైదరాబాద్‌లోని జయలలిత నివాసం సీజ్

ప్రేమ వివాహం.. విషాదాంతం

రేపటి నుంచే మార్పులు.. మీ పాకెట్ పై ప్రభావం చూపించే అంశాలు!

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం..

TVK పార్టీ అధ్యక్షుడు విజయ్‌పై కేసు నమోదు

అదే మా ఓటమికి కారణం.. సీఎస్కే కెప్టెన్ రుతురాజ్

బీహార్ ఆలయంలో తొక్కిసలాట.. 8 మంది మృతి..

నెల్లూరు జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్‌ ట్రైన్.. నిలిచిన రా

ప్రబలిన డయేరియా.. వారం రోజులు మాంసం విక్రయాలపై నిషేధం

స్టాలిన్‌ సార్‌కు ఇవే చివరి ఎన్నికలు

అదృష్టం కోసం ఏ కలర్ బ్యాగ్ లేదా పర్సు వాడాలో తెలుసా?

పొట్ట ఉంటేనే పట్టం.. ఇథియోపియా అమ్మాయిలకు బొజ్జ ఉన్నవాళ్లే ఇ

షాకింగ్ వీడియో.. పారాసైలింగ్ చేస్తుండగా గాల్లోనే ఏం జరిగిందో

హైదరాబాద్‌లోని జయలలిత నివాసం సీజ్

ప్రేమ వివాహం.. విషాదాంతం

రేపటి నుంచే మార్పులు.. మీ పాకెట్ పై ప్రభావం చూపించే అంశాలు!

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం..

TVK పార్టీ అధ్యక్షుడు విజయ్‌పై కేసు నమోదు

అదే మా ఓటమికి కారణం.. సీఎస్కే కెప్టెన్ రుతురాజ్

బీహార్ ఆలయంలో తొక్కిసలాట.. 8 మంది మృతి..

నెల్లూరు జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్‌ ట్రైన్.. నిలిచిన రా

ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. పోలీసు వాహనంలో టపాసులు తీసుకెళ్తున్న సమయంలో ప్రమాదవశాత్తు పేలుడు సంభవించిందా? లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేశారా అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

 

ప్రమాదంలో గాయపడిన వారి వివరాలు:

మట్టివాసనలో మానవత్వం… మంజుల కవిత్వ గాథ…

మట్టివాసనలో మానవత్వం… మంజుల కవిత్వ గాథ

 

బాల్యం :
పల్లె పరిమళంలో పుట్టిన వ్యక్తిత్వం
మట్టివాసనలో మమకారం కలిసిన ఆ పల్లె గాలి…
అక్కడే మంజుల పత్తిపాటి అనే ఒక సున్నిత హృదయం రూపుదిద్దుకుంది.ఆలేరు పల్లె గాలిలో, మట్టి పరిమళంలో పెరిగిన ఆ చిన్నారి… పుస్తకాలతో పాటు జీవితాన్ని కూడా చదివింది.
రాధ–నర్సింహారావు దంపతులకు మూడవ సంతానంగా జన్మించిన ఆమెకు, తండ్రి ఉపాధ్యాయ వృత్తి కేవలం జీవనోపాధి కాదు—అది విలువల బాట.
1974లో ఆలేరు నేలపై పుట్టిన ఆ చిన్నారి, పుస్తకాల మధ్య మాత్రమే కాదు, ప్రకృతి ఒడిలో కూడా పెరిగింది. అల్లారుముద్దుగా పెరిగినా, ఆ పల్లె జీవితం ఆమెకు మానవత్వాన్ని నేర్పింది.
టైపింగ్ హయ్యర్, లోయర్ పరీక్షల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించడం—ఆమె పట్టుదలకి నిదర్శనం.
తన చిన్ననాటి జ్ఞాపకాలను “పల్లెటూరి జ్ఞాపకాలు”గా పదాల్లో నింపినప్పుడు—ఆమె హృదయం కవిత్వంగా పలికింది.

వివాహం :

బాధ్యతల బాటలో బలమైన అడుగులు
చిన్న వయస్సులోనే వివాహం…
జీవితం ఒక్కసారిగా బాల్యాన్ని వెనక్కి నెట్టేసి బాధ్యతల వైపు నడిపింది.
బావి నీళ్ళ బరువు కేవలం భుజాలపై కాదు—జీవితంపై పడింది.
బిందెలు మోసిన చేతులు, కట్టెల పొయ్యిపై వండిన వేళ్లు—కష్టాల్ని కరిగించి బలంగా మారాయి తర్వాత కలం పట్టి సమాజాన్ని మేల్కొలిపాయి.
ప్రతి కష్టం ఆమెను కూల్చలేదు—మరింత గట్టి చేసింది. ఆ కష్టాల్లో ఆమె చిరునవ్వు చచ్చిపోలేదు…
అదే ఆమె అంతర్ముఖ బలానికి నిదర్శనం.

MPDO కార్యాలయంలో టైపిస్ట్‌గా పనిచేసి, తరువాత ఉపాధ్యాయురాలిగా సేవలందిస్తూ—
ఒక మహిళగా, ఒక తల్లిగా, ఒక వ్యక్తిగా తన పాత్రలను సమర్థంగా నెరవేర్చింది.

రాజకీయ ప్రస్థానం:
ప్రజల మధ్య పుట్టిన నాయకత్వం
స్వార్థం లేని సేవాభావం—అదే ఆమెకు అసలైన గుర్తింపు.స్వల్ప వేతనంలోనూ అవసరమైన వారికి చేయూతనిచ్చిన ఆ మనసు, రాజకీయాలకు మార్గం చూపింది.అందరిలో కలసి పోయే, అందరి కష్టాల్లో
పాలుపంచుకునే తత్వాన్ని గ్రహించిన వారి జీవిత భాగస్వామి మంజుల పత్తిపాటిని తొలిసారిగా
రాజకీయ- రంగప్రవేశం చేయించారు. మండల కేంద్రంలోని మన్నెవారి తుర్కపల్లి నుండి BRS పార్టీ తరుపున 2018 లో MPTCగా పోటీ చేసి రెండు ఓట్ల తేడాతో ఓడినా—ఆమె సంకల్పం మాత్రం ఓడిపోలేదు. BRS పార్టీ మండల అధ్యక్షురాలిగా, ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి, ప్రజల సమస్యలను తనవిగా భావించింది. రైతుల కష్టాలపై స్పందిస్తూ, రైతు సమస్యలపై గళమెత్తుతూ మార్కెట్ వ్యవసాయ కమిటీలో సేవలు అందించారు.  రైతులకు  గోనె సంచులు అందుబాటులో ఉంచుతు
లారీల కొరత లేకుండా చర్యలు తీసుకున్నారు.
రైతులకు సేవ చేస్తూ కరోన సమయంలో నిత్యావసర సరుకులు ప్రజలకు అందించి ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆమె నాయకత్వం కేవలం పదవి కాదు, బాధ్యతగా మార్చుకొన్నది.
సామాజిక సేవ చేస్తూ వారి కష్టాలను ప్రత్యక్షంగా చూసిన తర్వాత సాహిత్య రచనల పట్ల ఆమె ఆసక్తి కనపరచినారు. అందుకు ఇంకో కారణం ఆమె పడిన కష్టాలు కూడా.
రాజకీయ ప్రయాణంలో ఊరు ఊరు తిరుగుతున్నఅప్పుడు ప్రత్యక్షంగా ప్రజల సాధక బాధలు తెలుసుకొని స్పందించి అధికారులకు తెలియచేసి సమస్య పరిష్కారం చేసేది

అక్షరయాత్ర;
హృదయం పలికిన కవిత్వం
జీవితాన్ని దగ్గరగా చూసిన కళ్లకు…
బాధను అనుభవించిన హృదయానికి…
కవిత్వం ఒక సహజ స్పందన.
మంజుల గారి కలం—కేవలం అక్షరాలు కాదు, అనుభవాల ప్రవాహం. ఆమె జీవితానుభవాలే ఆమె కలానికి మసి అయ్యాయి. మూడు వందలకు పైన కవితలు రాసింది. రైతుల కష్టం, మహిళల వేదన, బాల్యపు జ్ఞాపకాలు, ప్రకృతి పరిరక్షణ…
ప్రతి అంశం ఆమె కవితల్లో జీవిస్తుంది.
రైతుల కష్టాలు, మహిళల అగచాట్లు,బాలకార్మిక వ్యవస్థ గురించి, పండుగలకు పకృతికి గల సంబంధాలు, పర్యావరణ పరిరక్షణ గురించి, బాల్య స్మృతులు, ఓటు హక్కు విలువ,
కళాకారుల కష్టాలు, స్త్రీ హృదయం, సాంఘిక అంశాలపై మరియు కళాకారులు దేవుని రూపాలు, అమ్మ హృదయం, శ్రీ సీతారామ దివ్య చరితం, చివరి దుప్పటి వంటి వంటి రచనలు—
ఆమె అంతరంగ గాథలకు ప్రతిబింబాలు.
పత్రికలు, ఆన్‌లైన్ వేదికలు—అన్నింటిలో ఆమె కవిత్వం పాఠకుల హృదయాలను తాకుతోంది.

ముగింపు:
మట్టిలో మొలిచిన మానవత్వం, పద్యంగా వికసించింది
మట్టిలో పుట్టి…
కష్టాల్లో కరిగి…
సేవలో వెలిగిన ఒక జీవితం—మంజుల పత్తిపాటి.
ఆమె కలం కేవలం రాయదు…
మనసులను మేల్కొలుపుతుంది.
బాధను పలుకుతుంది.
ప్రకృతిని కాపాడమని పిలుస్తుంది.
మట్టివాసనలో మొలిచిన ఆ మానవత్వం…
ఈరోజు కవిత్వంగా వికసించి,
సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తోంది.

మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

డ్రోన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండల కేంద్రం లో మార్క్ఫెడ్ సహకారంతో ప్రాథమిక వ్యవసాయ సహకా ర సంఘం ఆధ్వర్యంలో ఏర్పా టుచేసిన మొక్కజొన్న కొను గోలు కేంద్రాన్ని మంగళవారం స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్య నారాయణ రావు ప్రారంభిం చారు ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ రైతులు ప్రభుత్వం సూచించిన నిబం ధనల ప్రకారం మొక్కజొ న్నలను తీసుకువచ్చి మద్దతు ధరకు ఇక్కడి కొనుగోలు కేం ద్రంలో అమ్ముకోవాలని రైతు లు తమ పంటను మధ్యవ ర్తుల వద్ద అమ్మకుండా ప్రభు త్వం ఏర్పాటు చేసిన కొను గోలు కేంద్రాలనే విక్రయించు కోవాలి ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను చేసుకోవాలని రైతులకు సూచించారు అలా గే రైతులకు న్యాయమైన ధర లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు ఈ కేంద్రాల ద్వారా రైతులకు సరైన ధర లభిస్తుందని మధ్య వర్తుల ప్రభావం తగ్గుతుంద న్నారు ఇది రైతుల ఆదా యాన్ని పెంచే దిశగా ముఖ్య మైన అడుగుగా భావిస్తు న్నారు.

40% సబ్సిడీతో పిఎసిఎస్ కు డ్రోన్ ప్రారంభం

రైతులకు 40 శాతం సబ్సి డీతో ప్రభుత్వం డోన్లను పిఎ సిఎస్ ద్వారా అందించింది. అన్నదాతల అత్యధిక పరికారాలను వ్యవసాయంలో వాడటాన్ని ప్రోత్సహిస్తుంది వ్యవసాయంలో అత్యధిక పరికరాల వాడకo పెరుగు తుంది దీంతో పనులు చకా చకా అవుతాయి పంటల్లో చీడపీడల నివారణకు పి చికారి చేయడానికి డ్రోన్లు వినియోగం ఇటీవల ఎక్కు వవుతుంది రోజంతా చేసే పనినిలో కొన్ని గంటల్లో చేసే స్తాయి అయితే డ్రోన్ లో అధిక ధర కారణంగా అన్నదాతలు కొనలేకపోతున్నారు ఫలితం గా ప్రస్తుతం చాలామంది రైతు లకు పీఏసీఎస్ అందుబాటు లో ఉంచి ప్రభుత్వం రైతులకు అందిస్తుంది రైతులందరూ వ్యవసాయంలో వినియోగిం చుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మార్క్‌ఫెడ్ అధికారులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మారపల్లి రవీందర్ స్థానిక సర్పంచ్ చింతల ఉమ రవిపా ల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి మం డల కాంగ్రెస్ పార్టీ నాయ కులు,రైతులు పాల్గొన్నారు.

సర్వాపురంలో మహిళ మృతి – కౌన్సిలర్ సంతాపం…

సర్వాపురంలో మహిళ మృతి – కౌన్సిలర్ సంతాపం

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డ్ సర్వపురంలో మంగళవారం జన్ను రాజు భార్య జన్ను లావణ్య మృతి చెందారు.ఈ సందర్భంగా 5వ వార్డ్ కౌన్సిలర్ పొన్నాల మనీషా ప్రకాష్ మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో ఊరి పెద్దలు ఆకులపెల్లి రమేష్, చిలుక జంపయ్య, కొంగర సాంబయ్య, మాసు స్వామి, పొన్నాల శంకర్, మాసు కొమ్మలు, బోట్ల కుమార్, తడుగుల ఎల్లయ్య తదితరులు పాల్గొని సంతాపం ప్రకటించారు.

ఇరాన్ అణు కేంద్రక నగరంపై అమెరికా దాడులు.. వీడియో షేర్ చేసిన ట్రంప్..

ఇరాన్ అణు కేంద్రక నగరంపై అమెరికా దాడులు.. వీడియో షేర్ చేసిన ట్రంప్..

ఇరాన్ అణు కేంద్రక నగరం ఇస్ఫహాన్‌పై అమెరికా భీకర దాడులు చేసింది. ఆయుధాలు ఉన్న ఓ డిపోపై బంకర్ బస్టర్లతో దాడి చేసింది. రెండు వేల పౌండ్ల బంకర్ బస్టర్లతో దాడులు చేయడంతో అక్కడ భారీగా మంటలు చెలరేగాయి.

ఇరాన్ అణు కేంద్రక నగరం ఇస్ఫహాన్‌పై అమెరికా భీకర దాడులు చేసింది. ఆయుధ నిల్వలు ఉన్న ఓ డిపోపై బంకర్ బస్టర్లతో విరుచుకుపడింది. రెండు వేల పౌండ్ల బంకర్ బస్టర్లతో దాడులు చేయడంతో అక్కడ భారీగా మంటలు చెలరేగాయి. ఈ దాడికి సంబంధించిన వీడియోను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్‌లో పంచుకున్నారు. అయితే దాడికి సంబంధించి ఆయన ఎలాంటి వివరణా ఇవ్వలేదు (US Iran strike).

 

LATEST

నక్సల్స్‌ శకం ముగిసింది!

వైసీపీది దింపుడుకళ్లం ఆశ!

పేదింటి పండగ

నేతన్నల లోగిళ్లలో వెలుగులు

విద్యాగంధమే ఇరాన్‌ను మండిస్తోంది!

తోడు దొంగలు

పంచాయతీలకు ప్రత్యేకాధికారులు

1,108 కిలోల గంజాయి దహనం

బీఎన్‌ రోడ్డుకు మోక్షం లేదా?

నిలదీస్తేనే మార్పు!

ముంచేసిన మార్చి..రూ.51 లక్షల కోట్లు ఫట్‌

పీవీసీ ధరలు పైపైకి…

ప్రాణాలు తీస్తున్న… ‘పారాక్వాట్‌ ’

నక్సల్స్‌ శకం ముగిసింది!

వైసీపీది దింపుడుకళ్లం ఆశ!

పేదింటి పండగ

నేతన్నల లోగిళ్లలో వెలుగులు

విద్యాగంధమే ఇరాన్‌ను మండిస్తోంది!

తోడు దొంగలు

పంచాయతీలకు ప్రత్యేకాధికారులు

1,108 కిలోల గంజాయి దహనం

బీఎన్‌ రోడ్డుకు మోక్షం లేదా?

నిలదీస్తేనే మార్పు!

ముంచేసిన మార్చి..రూ.51 లక్షల కోట్లు ఫట్‌

పీవీసీ ధరలు పైపైకి…

ప్రాణాలు తీస్తున్న… ‘పారాక్వాట్‌ ’


ఇస్ఫహాన్‌లో ఇరాన్ ఆయుధ నిల్వలు ఉన్న ఓ డిపోపై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు చేసినట్టు ‘వాల్‌స్ట్రీట్ జర్నల్’ వెల్లడించింది (Isfahan bunker buster bomb). ఇస్ఫహాన్‌పై వరుస దాడులు జరగడంతో ఆ ప్రాంతంలో భారీగా మంటలు చెలరేగుతున్నట్టు పేర్కొంది. అయితే ఈ దాడులపై ఇరాన్ ఇప్పటివరకు స్పందించలేదు. కాగా, ఇస్ఫహాన్‌లోని ఓ భూగర్భ కేంద్రంలో సుమారు 540 కిలోల యురేనియం నిల్వలను ఇరాన్ దాచినట్టు వార్తలు వస్తున్నాయి.

బైక్ దొంగల అరెస్ట్ – రెండు వాహనాలు స్వాధీనం…

బైక్ దొంగల అరెస్ట్ – రెండు వాహనాలు స్వాధీనం

నర్సంపేట, నేటిధాత్రి:

నర్సంపేట పట్టణంలోని మహబూబాబాద్ రోడ్డులో ఇటీవల జరిగిన బైక్ దొంగతన కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారిలో పొన్నాల శివశంకర్ (పాల్వంచ), అతని భార్య పొన్నాల రేణుక, పర్ని అశోక్ ఉన్నారు.నిందితుల వద్ద నుంచి సుమారు రూ.3 లక్షల విలువ గల రెండు బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు నర్సంపేట ఏసీపీ రవీందర్ రెడ్డి తెలిపారు.

అనంతరం ముగ్గురిని రిమాండ్‌కు తరలించామన్నారు.ఈ సందర్భంగా ఏసీపీ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రధాన నిందితుడు శివశంకర్‌పై హైదరాబాద్, ఖమ్మం తదితర జిల్లాల్లో పలు కేసులు నమోదై ఉన్నాయని వెల్లడించారు.దొంగలను పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన నర్సంపేట పోలీస్ సిబ్బందిని ఏసీపీ అభినందించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్ఐలు రవికుమార్, అరుణ్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.

మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం డ్రోన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే…

మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం డ్రోన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండల కేంద్రం లో మార్క్ఫెడ్ సహకారంతో ప్రాథమిక వ్యవసాయ సహకా ర సంఘం ఆధ్వర్యంలో ఏర్పా టుచేసిన మొక్కజొన్న కొను గోలు కేంద్రాన్ని మంగళవారం స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్య నారాయణ రావు ప్రారంభిం చారు ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ రైతులు ప్రభుత్వం సూచించిన నిబం ధనల ప్రకారం మొక్కజొ న్నలను తీసుకువచ్చి మద్దతు ధరకు ఇక్కడి కొనుగోలు కేం ద్రంలో అమ్ముకోవాలని రైతు లు తమ పంటను మధ్యవ ర్తుల వద్ద అమ్మకుండా ప్రభు త్వం ఏర్పాటు చేసిన కొను గోలు కేంద్రాలనే విక్రయించు కోవాలి ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను చేసుకోవాలని రైతులకు సూచించారు అలా గే రైతులకు న్యాయమైన ధర లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు ఈ కేంద్రాల ద్వారా రైతులకు సరైన ధర లభిస్తుందని మధ్య వర్తుల ప్రభావం తగ్గుతుంద న్నారు ఇది రైతుల ఆదా యాన్ని పెంచే దిశగా ముఖ్య మైన అడుగుగా భావిస్తు న్నారు.

40% సబ్సిడీతో పిఎసిఎస్ కు డ్రోన్ ప్రారంభం

రైతులకు 40 శాతం సబ్సి డీతో ప్రభుత్వం డోన్లను పిఎ సిఎస్ ద్వారా అందించింది. అన్నదాతల అత్యధిక పరికారాలను వ్యవసాయంలో వాడటాన్ని ప్రోత్సహిస్తుంది వ్యవసాయంలో అత్యధిక పరికరాల వాడకo పెరుగు తుంది దీంతో పనులు చకా చకా అవుతాయి పంటల్లో చీడపీడల నివారణకు పి చికారి చేయడానికి డ్రోన్లు వినియోగం ఇటీవల ఎక్కు వవుతుంది రోజంతా చేసే పనినిలో కొన్ని గంటల్లో చేసే స్తాయి అయితే డ్రోన్ లో అధిక ధర కారణంగా అన్నదాతలు కొనలేకపోతున్నారు ఫలితం గా ప్రస్తుతం చాలామంది రైతు లకు పీఏసీఎస్ అందుబాటు లో ఉంచి ప్రభుత్వం రైతులకు అందిస్తుంది రైతులందరూ వ్యవసాయంలో వినియోగిం చుకో వాలని సూచించారు

ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు ప్రతిపాదించిన సంచలన ప్రణాళిక…

ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు ప్రతిపాదించిన సంచలన ప్రణాళిక

 

హోర్ముజ్‌ జలసంధి గుండా చమురు రవాణాపై ఇరాన్ పదేపదే హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఒక సురక్షితమైన ప్రత్యామ్నాయం మార్గాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు ప్రతిపాదించారు. అదే ‘మెడిటరేనియన్ పైప్‌లైన్’ రీ-రూటింగ్ ప్లాన్.

 పశ్చిమాసియాలో ముదిరిన ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్ పట్టున్న హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) ద్వారా చమురు రవాణాకు ఆటంకాలు ఎదురవుతున్న తరుణంలో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు ఒక దీర్ఘకాలిక పరిష్కారాన్ని ప్రతిపాదించారు. అదే ‘మెడిటరేనియన్ పైప్‌లైన్’ (Mediterranean Pipeline) రీ-రూటింగ్ ప్లాన్.

నక్సల్స్‌ శకం ముగిసింది!

వైసీపీది దింపుడుకళ్లం ఆశ!

పేదింటి పండగ

నేతన్నల లోగిళ్లలో వెలుగులు

విద్యాగంధమే ఇరాన్‌ను మండిస్తోంది!

తోడు దొంగలు

పంచాయతీలకు ప్రత్యేకాధికారులు

1,108 కిలోల గంజాయి దహనం

బీఎన్‌ రోడ్డుకు మోక్షం లేదా?

నిలదీస్తేనే మార్పు!

ముంచేసిన మార్చి..రూ.51 లక్షల కోట్లు ఫట్‌

పీవీసీ ధరలు పైపైకి…

ప్రాణాలు తీస్తున్న… ‘పారాక్వాట్‌ ’

నక్సల్స్‌ శకం ముగిసింది!

వైసీపీది దింపుడుకళ్లం ఆశ!

పేదింటి పండగ

నేతన్నల లోగిళ్లలో వెలుగులు

విద్యాగంధమే ఇరాన్‌ను మండిస్తోంది!

తోడు దొంగలు

పంచాయతీలకు ప్రత్యేకాధికారులు

1,108 కిలోల గంజాయి దహనం

బీఎన్‌ రోడ్డుకు మోక్షం లేదా?

నిలదీస్తేనే మార్పు!

ముంచేసిన మార్చి..రూ.51 లక్షల కోట్లు ఫట్‌

పీవీసీ ధరలు పైపైకి…

ప్రాణాలు తీస్తున్న… ‘పారాక్వాట్‌ ’

కాగా, యుద్ధ కారణంగా సముద్ర మార్గాల్లో చమురు నౌకలపై దాడులు పెరిగాయి. ఈ నేపథ్యంలో భూగర్భ పైప్‌లైన్ల ద్వారా రవాణా చేయడం వల్ల భద్రత పెరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా అరబ్ దేశాలు – ఇజ్రాయెల్ మధ్య ఆర్థిక అనుబంధం మరింత బలపడుతుందని నెతన్యాహు భావిస్తున్నారు. ఇక, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ఇంధనం కోసం ప్రత్యామ్నాయాల వెతుకులాటలో ఉన్న యూరప్‌కు ఇది పెద్ద ఉపశమనం కానుంది.

క్యూబాకు రష్యా చమురు.. అమెరికా ఎందుకు వెనక్కి తగ్గింది…

క్యూబాకు రష్యా చమురు.. అమెరికా ఎందుకు వెనక్కి తగ్గింది..

తీవ్ర ఇంధన కొరతతో సతమతమవుతున్న క్యూబాకు రష్యా ఉపశమనం కలిగించింది. లక్ష టన్నుల ఇంధనాన్ని క్యూబాకు చేరవేసింది. అమెరికా విధించిన ఆంక్షలతో క్యూబాలో తీవ్ర ఇంధన కొరత, విద్యుత్‌ కోతలు నెలకొన్న సంగతి తెలిసిందే.

తీవ్ర ఇంధన కొరతతో సతమతమవుతున్న క్యూబాకు రష్యా ఉపశమనం కలిగించింది. లక్ష టన్నుల ఇంధనాన్ని క్యూబాకు చేరవేసింది. అమెరికా విధించిన ఆంక్షలతో క్యూబాలో తీవ్ర ఇంధన కొరత, విద్యుత్‌ కోతలు నెలకొన్న సంగతి తెలిసిందే. క్యూబా చుట్టూ అమెరికా సేనలు మోహరించి ఉన్నాయి. నెలల తరబడి కొనసాగుతున్న అమెరికా దిగ్బంధనాన్ని దాటి రష్యా నౌక క్యూబా చేరుకుంది. రష్యాకు చెందిన ‘అనటోలీ కొలోడ్కిన్‌’ ట్యాంకర్‌ లక్ష టన్నుల ముడి చమురుతో మాతాన్జాస్‌ నౌకాశ్రయానికి చేరుకుంది (Trump Cuba policy).

 

LATEST

నక్సల్స్‌ శకం ముగిసింది!

వైసీపీది దింపుడుకళ్లం ఆశ!

పేదింటి పండగ

నేతన్నల లోగిళ్లలో వెలుగులు

విద్యాగంధమే ఇరాన్‌ను మండిస్తోంది!

తోడు దొంగలు

పంచాయతీలకు ప్రత్యేకాధికారులు

1,108 కిలోల గంజాయి దహనం

బీఎన్‌ రోడ్డుకు మోక్షం లేదా?

నిలదీస్తేనే మార్పు!

ముంచేసిన మార్చి..రూ.51 లక్షల కోట్లు ఫట్‌

పీవీసీ ధరలు పైపైకి…

ప్రాణాలు తీస్తున్న… ‘పారాక్వాట్‌ ’

నక్సల్స్‌ శకం ముగిసింది!

వైసీపీది దింపుడుకళ్లం ఆశ!

పేదింటి పండగ

నేతన్నల లోగిళ్లలో వెలుగులు

విద్యాగంధమే ఇరాన్‌ను మండిస్తోంది!

తోడు దొంగలు

పంచాయతీలకు ప్రత్యేకాధికారులు

1,108 కిలోల గంజాయి దహనం

బీఎన్‌ రోడ్డుకు మోక్షం లేదా?

నిలదీస్తేనే మార్పు!

ముంచేసిన మార్చి..రూ.51 లక్షల కోట్లు ఫట్‌

పీవీసీ ధరలు పైపైకి…

ప్రాణాలు తీస్తున్న… ‘పారాక్వాట్‌ ’

అమెరికా ఆంక్షలను ధిక్కరించి రష్యా నౌక క్యూబా వైపు పయనం కావడంతో మరో యుద్ధం ప్రారంభమవుతుందేమో అనే ఆందోళన నెలకొంది. అయితే రష్యా నౌకను అమెరికా అడ్డుకోకపోవడం ఉపశమనం కలిగించింది. ఒక్కసారిగా ట్రంప్ వెనక్కి తగ్గడం చాలా మందికి షాకిచ్చింది. అయితే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాజకీయ, వ్యూహాత్మక కారణాల వల్లే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు అర్థమవుతోంది (US Cuba blockade).

క్యూబాలో భారీగా ఇంధన కొరత వల్ల విద్యుత్ సంక్షోభం మొదలైంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో పూర్తిగా బ్లాకేడ్ కొనసాగితే మానవతా విమర్శలు పెరుగుతాయి. క్యూబా విషయంలో చాలా దేశాలు అమెరికాపై ఒత్తిడి తీసుకొచ్చాయి. తన అంతర్జాతీయ ఇమేజ్‌ను మెరుగుపరుచుకునేందుకే అమెరికా వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది. ఇప్పుడు చమురును అనుమతించకపోతే క్యూబా మరింతగా రష్యాకు చేరువయ్యే ప్రమాదం ఉంది (Trump Russia Cuba oil).

అమెరికాలో క్యూబాకు చెందిన ఓటర్లు కూడా గణనీయంగా ఉన్నారు (Cuba sanctions news). వారిని బుజ్జగించేందుకు కూడా ట్రంప్ ఇలా వెనక్కి తగ్గారు. ఇక, ఇప్పటికే ఇరాన్ యుద్ధంలో కూరుకుపోయిన అమెరికా.. రష్యా నౌకను అడ్డుకుని మరో యుద్ధానికి తెరతీయడానికి సిద్ధంగా లేదు. ఈ కారణాలన్నింటి వల్లే క్యూబా విషయంలో అమెరికా వెనక్కి తగ్గింది. అయితే ట్రంప్ పూర్తిగా క్యూబా చుట్టూ బ్లాకేడ్ తీసెయ్యలేదు. క్యూబాకు ఎవరైనా సహాయం చేయాలనుకుంటే తనకు అభ్యంతరం లేదని మాత్రమే చెప్పారు.

Amit Shah: The Modern-Day Chanakya

• A leader tempered and toughened by setbacks

• An unrivalled genius in the art of election management

• Possessing strategic expertise honed alongside Modi in their home state of Gujarat

• A committed leader who strove relentlessly, every single moment, to bring the party to power at the Centre

• A most trusted and loyal confidant of Prime Minister Narendra Modi

• A leader who rose to an indomitable stature, even after being exiled from Gujarat due to political vendetta

• Shah utilized his time away from Gujarat to cultivate a deep understanding of Uttar Pradesh

• Consequently, the BJP achieved a resounding victory in Uttar Pradesh

• Played a pivotal role in the abrogation of Article 370

• Actively engaged in the task of cleansing the political system of the impurities accumulated during the Congress era

Amit Anilchandra Shah, who represents the Gandhinagar parliamentary constituency in Gujarat in the Lok Sabha, has been serving as the country’s 32nd Home Minister since 2019. Furthermore, since July 2021, he has also served as the nation’s first Minister of Cooperation. From 2014 to 2020, he served as the 10th National President of the Bharatiya Janata Party (BJP). Additionally, he has continued to serve as the Chairman of the National Democratic Alliance (NDA) since 2014. He was elected to the Rajya Sabha during the period between 2017 and 2019. He is not only the BJP’s chief strategist but also a very close associate of Prime Minister Narendra Modi. He was elected to the Gujarat Legislative Assembly from the Sarkhej constituency between 1997 and 2012, and subsequently from the Naranpura seat between 2012 and 2017. From 2002 to 2012, he served as the Minister of State for Home, Law and Judiciary, Prisons, Border Security, Civil Defence, Excise, Home Guards, Transport, Prohibition Enforcement, Village Defence Force, Police Housing, and Legislative and Parliamentary Affairs in the cabinet of the then Chief Minister, Narendra Modi. During his student days, he was an active member of the ABVP. Having risen to a prominent position within the ABVP by the age of 18, he joined the BJP in 1987. In the 2014 Lok Sabha elections, he was appointed as the BJP’s ‘in-charge’ for the state of Uttar Pradesh—a region considered the most politically crucial in the country. In these elections, the BJP achieved a resounding victory by winning 73 out of the total 80 seats, a feat that stood as a testament to Amit Shah’s strategic acumen. Following this success, he was appointed as the party’s National President. Although he steered the party to victory in the elections held in Maharashtra, Haryana, Jammu & Kashmir, Jharkhand, and Assam during his first two years in office, the party failed to come to power in Delhi and Bihar in the elections held in 2015. In the 2017 Assembly elections, he successfully led the party to power in the states of Uttar Pradesh, Uttarakhand, Gujarat, and Manipur. However, in the Punjab elections held that same year, the Akali Dal–BJP alliance lost power. In the 2018 Assembly elections, the party suffered defeats in the states of Chhattisgarh, Rajasthan, and Madhya Pradesh, thereby being relegated to the position of the opposition.

Amit Shah was born on October 22, 1964, in Mumbai, into a Gujarati Hindu Baniya family. His great-grandfather served as the Nagar Shreshti (chief merchant) of the town of Mansa. Currently, Mansa is a municipality located in the Gandhinagar district; however, in those days, it existed as the Mansa princely state. Mansa was a prominent town within this princely state, which was ruled by the Rajputs. Amit Shah’s father was a businessman hailing from the town of Mansa; he owned a business dealing in PVC pipes. The town of Mansa was also referred to as Mehsana. It was here that Amit Shah completed his school education; subsequently, in Ahmedabad, he earned a Bachelor’s degree in Biochemistry from the C.U. Shah Science College and assisted his father in his business. Later, he worked as a stockbroker and served in cooperative banks. Amit Shah’s wife is named Sonal Shah. The couple has a son named Jay Shah. Amit Shah has six sisters, two of whom currently reside in Chicago. On June 8, 2010, Amit Shah’s mother passed away following an illness.

From his childhood, he actively participated in the activities of the Rashtriya Swayamsevak Sangh (RSS). Even at a very young age, he regularly and actively attended Shakha (branch) programs held in his neighborhood. During his days as a degree student in Ahmedabad, in 1982, he became an RSS Swayamsevak (volunteer). At that time, the current Prime Minister, Narendra Modi, was serving as an RSS Pracharak (full-time worker) in the city, in charge of youth activities. From that point on, Narendra Modi became well-acquainted with him. Subsequently, acting on Modi’s suggestion, he joined the Akhil Bharatiya Vidyarthi Parishad (ABVP)—the student wing of the RSS—in 1983. Eventually, in 1987, he formally took up membership in the Bharatiya Janata Party (BJP). Interestingly, it is noteworthy that Narendra Modi himself joined the BJP just one year after he did. Later, he joined the Bharatiya Janata Yuva Morcha (BJYM)—the youth wing of the BJP—as a grassroots worker. Rising through the organizational hierarchy of the BJYM, he progressed from the Taluka (block) level all the way to the state level, eventually attaining the ranks of General Secretary and Vice President. His exceptional skills in poll management exposed during the 1991 Lok Sabha elections, when senior BJP leader Lal Krishna Advani contested the polls.

In 1995, the BJP formed a government in Gujarat for the very first time, with Keshubhai Patel assuming the office of Chief Minister. At that juncture, the rural areas of Gujarat were considered an impregnable stronghold for the Congress party. To dismantle this dominance, Narendra Modi and Amit Shah devised a strategic plan: they encouraged influential second-tier leaders in every village to join the BJP. Through this approach, they successfully established a network comprising 8,000 highly influential rural leaders. Adopting this very strategy, he built strong leadership within the state’s cooperative societies as well. In 1999, Amit Shah was elected as the Chairman of the Ahmedabad District Cooperative Bank—the largest of its kind in the country. He transformed the bank, which was operating at a loss of ₹36 crores at the time, into a profit-making entity earning ₹27 crores within a mere one-year span. By 2014, the bank’s profits had soared to approximately ₹250 crores. In 2009, Amit Shah became the Vice-President of the Gujarat Cricket Association, while Modi served as its President. After Modi became Prime Minister in 2014, Shah assumed the presidency of the organization.

Around 1990, during the time when Modi served as the General Secretary of the party’s state unit, he exerted a profound influence on Amit Shah. Modi persuaded Chief Minister Keshubhai Patel to appoint Shah as the Chairman of the Gujarat State Financial Corporation. Subsequently, however, party leaders—such as Shankersinh Vaghela—complained to the central leadership that Modi was interfering excessively in government affairs; consequently, he was summoned to Delhi. During the period from 1995 to 2001, while Modi was working in Delhi, Shah served as his most trusted confidant in Gujarat. In 1997, through his lobbying efforts, Modi secured an election ticket for Shah to contest the by-election for the Sarkhej Assembly constituency in Gujarat. Shah won this election, thereby entering the Legislative Assembly for the first time. He successfully retained this seat in the subsequent elections held in 1998.

Facing the stigma of ineffective leadership, the party’s central command removed Keshubhai Patel from the post of Chief Minister of Gujarat in 2001 and appointed Narendra Modi in his place. In the years that followed, the Modi-Shah duo systematically eliminated their political rivals. During the 12 years that Modi served as the Chief Minister of Gujarat, Amit Shah emerged as the most powerful leader in the state. Shah gained recognition as the youngest individual to hold multiple ministerial portfolios within the Modi administration. Notably, at one point, he managed as many as 12 portfolios simultaneously. Shah played a pivotal role in ensuring that the Modi government introduced the Gujarat Freedom of Religion Bill. Following the enactment of this bill, religious conversions within the state were effectively curbed. In July 2010, he was arrested in connection with the Sohrabuddin encounter case. By that time, he had risen to the stature of a formidable contender for the Chief Minister’s post. It must be said that this arrest dealt a severe blow to his political career. Three months after his arrest—on October 29, 2010—the High Court granted him bail. The very next day, Justice Aftab Alam entertained a petition and ordered Amit Shah’s externment from Gujarat. Consequently, between 2010 and 2012, Amit Shah was compelled to remain outside Gujarat. During this two-year period, he lived with his wife in a room at the Gujarat Bhavan in Delhi. Finally, in September 2012, the Supreme Court granted him bail, paving the way for his return to Gujarat. That same year, he contested and won the election from the Naranpura Assembly constituency. By then, the Sarkhej constituency had been abolished due to delimitation. In 2014, he was exonerated from the Sohrabuddin encounter case after a CBI court delivered a verdict clarifying that there was no evidence to suggest his involvement.

Following Modi’s rise to the Prime Ministership, Amit Shah garnered immense fame and recognition in national politics. In particular, his expertise in “poll management” during elections earned him the moniker of the “Modern-day Chanakya.” Under his tenure as the party’s National President, the BJP crossed the milestone of 100 million memberships. His strategic acumen played a pivotal role in the BJP’s victory in the 2019 general elections. Out of a total of 543 Lok Sabha constituencies, he personally campaigned in 312! He conducted a total of 18 roadshows, 161 public rallies, and 1,500 BJP meetings. As the Home Minister, he successfully introduced and secured the passage of several key bills in both Houses of Parliament—including the abrogation of Article 370 (which granted special status to Jammu and Kashmir), the National Register of Citizens (NRC), the Citizenship Amendment Act (CAA) of 2019, and the Criminal Procedure (Identification) Bill of 2022. In a sense, Amit Shah is indeed the “Modern-day Chanakya” who turned the seemingly impossible into reality!

ఆధునిక చాణిక్యుడు అమిత్ షా

· ఎదురుదెబ్బలు తిని రాటుతేలిన నేత

· ఎన్నికల మేనేజ్‌మెంట్ స్కిల్‌లో తిరుగులేని ధీశాలి

· కలిసొచ్చిన గుజరాత్‌లో మోదీతో కలిసి అమలు చేసిన వ్యూహానుభవం

· కేంద్రంలో పార్టీని అధికారంలోకి తేవడానికి అనుక్షణం తపించిన నిబద్ధ నేత

· ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత విశ్వాసపాత్రుడు

· కక్ష కట్టి గుజరాత్‌నుంచి బహిష్కరించినా, తిరుగులేని నేతగా ఎదిగిన వైనం

· గుజరాత్‌లో లేనప్పుడు ఉత్తరప్రదేశ్‌పై అవగాహన పెంచుకున్న షా

· ఫలితంగా యుపీలో బీజేపీ విజయభేరి

· 370 అధికరణాన్ని తొలగించడంలో అమేయ పాత్ర పోషణ

· కాంగ్రెస్ వల్ల పేరుకున్న మకిలిని తొలగించే పనిలో క్రియాశీలకం

హైదరాబాద్, నేటిధాత్రి: 

గుజరాత్‌లోని గాంధీనగర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ఆయన లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిసున్న అమిత్ అలీచంద్ర షా 2019 నుంచి దేశానికి 32వ ీVAం మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నా రు. అంతేకాకుండా 2021 జులై నుంచి తొలి సహకారశాఖ మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. 2014 నుంచి 2020 వరకు భారతీయ జన తాపార్టీ పదవ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. అంతేకాదు 2014 నుంచి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్‌కు ఛైర్మన్‌గా కొనసాగారు. 2017`2019 మధ్యకాలంలో రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయన బీజేపీకి ప్రధాన వ్యూహకర్త మాత్రమే కాదు, ప్రధాని నరేంద్రమోదీకి అత్యంత సన్నిహితులు. 

1997‘2012 వరకు గుజరాత్‌లోని సర్ఖేజ్ నియోజకవర్గం నుంచి, 2012‘17 మధ్యకాలంలో నారన్‌పుర స్థానంనుంచి గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2002 నుంచి 2012 వరకు అప్పటి ముఖ్యమంత్రి నరేంద్రమోదీ మంత్రివర్గంలో ీVAం, న్యాయశాఖ, జైల్లు, సరిహద్దు భద్రత, పౌరరక్షణ, ఎక్సైజ్, ీVAంగార్డ్స్, రవాణా, మద్యనిషేధ అమలు, గ్రామపరిరక్షక దళం, పోలీసు గహనిర్మాణం, శాసన మరియు పార్లమెంటరీ వ్యవహారాల సహాయమంత్రిగా బాధ్యతలు నిర్వ ర్తించారు. విద్యార్థిదశలో ఏబీవీపీ సభ్యుడిగా కొనసాగారు. 18వ ఏటనే ఏబీవీపీలో ఒక స్థాయికిచేరుకున్న ఆయన 1987లో బీజేపీలో చేరారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో దేశంలో అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ‘ఇన్‌చార్జ్‌గా నియమితులయ్యారు. ఈ ఎన్నికల్లో మొత్తం 80 స్థానాల్లో 73 సీట్లను బీజేపీ గెలుచుకొని అప్రతిహత విజయాన్ని నమోదుచేసి, అమిత్ షా చాణక్యానికి గుర్తుగా నిలిచింది. దీంతో ఆయన పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నియమితులయ్యారు.ఆయన తన తొలి రెండేళ్ల పదవీకాలంలో మహారాష్ట్ర, హర్యానా, జమ్ము‘కశ్మీర్, జార్ఖండ్, అ స్సాం ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడిపించినా, 2015లో జరిగిన ఎన్నికల్లో ఢిల్లీ, బిహార్ లో మాత్రం పార్టీ అధికారంలోకి రాలేకపోయింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్, ఉత్త రాఖండ్, గుజరాత్, మణిపూర్ రాష్ట్రాలో పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగారు. అదే ఏడాది జరిగిన పంజాబ్ ఎన్నికల్లో అకాలీదళ్‘బీజేపీ అలయన్స్ అధికారాన్ని కోల్పోయింది. 2018 అ సెంబ్లీ ఎన్నికల్లో పార్టీ చత్తీస్‌గడ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఓటమిపాలై విపక్ష స్థానానికి పరిమితమైంది. 

1964, అక్టోబర్ 22న ముంబయిలో గుజరాతీ హిందూ బనియా కుటుంబంలో అమిత్ షా జ న్మించారు. ఆయన ముత్తాత మానస నగర శ్రేష్టిగా వుండేవారు. గాంధీనగర్ జిల్లాలో ప్రస్తుతం ఇదొక మున్సిపాలిటీ. అప్పట్లో మనస సంస్థానంగా వుండేది. ఈ సంస్థానంలో మానస ఒక ప్ర ముఖ పట్టణం. దీన్ని రాజ్‌పుత్‌లు పాలించారు. అమిత్ షా తండ్రి మానస పట్టణానికి చెందిన ఒక వ్యాపారి. ఆయనకు పీవీసీ పైప్‌ల వ్యాపారం వుండేది. మానసనే మేహసాన అని కూడా వ్యవహరించేవారు. ఇక్కడే అమిత్ షా పాఠశాల విద్యను పూర్తిచేసి తర్వాత అహమ్మదాబాద్‌లో ఆ యన సీయూ షా సైన్స్ కాలేజీలో బయో కెమిస్ట్రీలో బ్యాచ్‌లర్ డిగ్రీ పూర్తిచేసి, తండ్రి వ్యాపారంలో సహాయంగా వుండేవారు. తర్వాత ఆయన స్టాక్ బ్రోకర్‌గా, కోఆపరేటివ్ బ్యాంక్స్‌లో పనిచేశారు. అమిత్ షా భార్యపేరు సోనాల్ షా. ఈ దంపతులకు జయ్ షా కుమారుడు. అమిత్ షాకు ఆరుగురు అక్కచెలెళ్లుండగా వీరిలో ఇద్దరు చికాగోలో నివిసిస్తున్నారు. 2010, జూన్ 8న అమిత్ షా తల్లి అనారోగ్యంతో కన్నుమూసారు.

చిన్నతనం నుంచే ఆయన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకలాపాల్లో చురుగ్గా పాý£్గనేవారు. పిన్నవయస్సులోనే ఇరుగుపొరుగు ప్రాంతాల్లో శాఖ కార్యక్రమాýకు చురుగ్గా హాజరయ్యేవారు. అహమ్మదాబాద్‌లో డిగ్రీ చుదువుకునే రోజుల నాటికి ఆయన 1982లో ఆరఎసఎస్ స్వయం సేవక్‌గా మా రారు. అప్పట్లో ప్రస్తుత ప్రధాని మోదీ ఆరఎసఎస్ ప్రచారక్‌గా నగరంలో యూత్ కార్యకలాపాలకు ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తుండేవారు. అప్పటినుంచి నరేంద్రమోదీ ఈయనకు బాగా పరిచయమయ్యారు. తర్వాత మోదీ సూచన మేరకు 1983లో ఆయన అఖిలభాతర విద్యార్థి పరిషత్ (ఆరఎసఎస్ రాజకీయ విభాగం)లో చేరారు. చివరకు 1987లో భారతీయ జనతాపార్టీలో సభ్యత్వం తీసుకున్నారు. విచిత్రమేంటంటే ఈయన చేరిన ఏడాదికి నరేంద్రమోదీ బీజేపీలో సభ్య త్వం తీసుకోవడం విశేషం. తర్వాత బీజేపీ యువజన విభాగం భారతీయ జనతా యువమోర్చా లో కార్యకర్తగా చేరారు. బీజేవైఎం అధికార క్రమంలో ఆయన తాలూకా స్థాయి నుంచి రాష్ట్రస్థా యిలో జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగారు. 1991లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ వరిష్ట నేత లాల్‌కష్ణ అద్వానీ పోటీచేసినప్పుడు, అమిత్‌షాలోని పోల్ మేనేజ్‌మెంట్ నైపుణ్యం బయటపడింది. 

1995లో మొట్టమొదటిసారి గుజరాత్‌లో బీజేపీ ప్రభుత్వం ఏరాటై కేశూభాయ్ పటేల్ ముఖ్య మంత్రి అయ్యారు. అప్పట్లో కాంగ్రెస్‌కు గుజరాత్ గ్రామీణ ప్రాంతాలు పెట్టని కోటగా వుండేవి. దీన్ని దెబ్బకొట్టడానికి నరేంద్రమోదీ, అమిత్‌షాలు ఒక ప్రణాళిక రూపొందించి, ప్రతి గ్రామంలో రెండోస్థాయి పలుకుబడి నాయకుడిని బీజేపీలో చేరేలా ప్రోత్సహించారు. ఆవిధంగా 8వేల అ త్యంత పలుకుబడి కలిగిన గ్రామీణ నాయకత్వ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయగలిగారు. ఇదే వ్యూ హాన్ని అనుసరించి రాష్ట్ర సహకారసంఘాల్లో కూడా బలమైన నాయకత్వాన్ని నిర్మించారు. 1999లో అమిత్‌షా దేశంలోనే అతిపెద్ద అహమ్మదాబాద్ జిల్లా సహకార బ్యాంక్ అధ్యక్షుడిగా ఎన్నిక య్యారు. అప్పటికి రూ.36కోట్ల నష్టంతో నడుస్తున్న బ్యాంక్‌ను కేవలం ఏడాది కాలంలోనే రూ. 27 కోట్ల లాభాన్ని ఆర్జించే స్థాయికి తీసుకెళ్లారు. 2014 నాటికి బ్యాంక్ ఏకంగా సుమారు రూ.250 కోట్ల లాభాల్లో వుంది. 2009లో అమిత్ షా గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ వైస్`ప్రెసిడెంట్ అయ్యారు. దీనికి మోదీ ప్రెసిడెంట్‌గా వ్యవహరించారు. 2014లో మోదీ ప్రధాని అయ్యాక, షా ఈ సంస్థకు ప్రెసిడెంట్ అయ్యారు.

1990 ప్రాంతంలో పార్టీ రాష్ట్రశాఖకు మోదీ జనరల్ సెక్రటరీగా వున్నకాలంలో, అమిత్ షాపై అత్యధిక ప్రభావాన్ని కలిగించారు. మోదీ ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్‌ను ఒప్పించి గుజరాత్ స్టేట్ ఫై నాన్సియల్ కార్పొరేషన్‌కు షాను ఛైర్మన్‌గా ఎంపిక చేయించారు. తర్వాత శంకర్‌సింగ్ వాఘేలా వంటి పార్టీ నాయకులు, మోదీకి ప్రభుత్వంలో ఎక్కువగా వేలుపెడుతున్నారంటూ అధినాయకత్వానికి ఫిర్యాదు చేయడంతో, ఆయన్ను ఢిల్లీకి పిలిపించారు. 1995`2001 మధ్యకాలంలో మోదీ ఢిల్లీలో పనిచేసినప్పుడు, షా ఆయనకు గుజరాత్‌లో అత్యంత నమ్మÅ£స్తుడిగా వ్యవహ రించారు. 1997లో మోదీ లాబీయిజం చేసి గుజరాత్ షేర్కెజ్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల్లో టిక్కెట్ ఇప్పించారు. ఈ ఎన్నికల్లో షా గెలిచి మొదటిసారి అంసెంబ్లీ గడప తొక్కారు. మళ్లీ 1998 ఎన్నికల్లో ఈ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. 

అసమర్థ నాయకత్వమన్న అపప్రధ రావడంతో 2001లో పార్టీ అధిష్టానం గుజరాత్ ముఖ్యమం త్రి పదవినుంచి కేశూభాయ్ పటేల్‌ను తప్పించి నరేంద్రమోదీని ముఖ్యమంత్రిగా పంపింది. త ర్వాతి కాలంలో మోదీ, షా ద్వయం తమ ప్రత్యర్థులను క్రమంగా అడ్డు తొలగించుకుంటూ వ చ్చారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ పనిచేసిన 12ఏళ్ల కాలంలో అమిత్ షా గుజరాత్‌లో అత్యంత శక్తివంతమైన నాయకుడిగా ఎదిగారు. మోదీ ప్రభుత్వంలో అనేక మంత్రిపదవులను పొందిన అతి పిన్నవయస్కుడిగా షా గుర్తింపు పొందారు. ఒకదశలో ఆయన 12 పోర్ట్‌పోలియోలను నిర్వహించడం విశేషం. గుజరాత్ ఫ్రీడమ్ ఆఫ్ రిలిజియస్ బిల్లును మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టేలా షా కషిచేశారు. ఈ బిల్లు అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మతమార్పిడులకు అడ్డుకట్టపడింది. 2010 జులైలో సొహ్రాబుద్దీన్ ఎన్‌కౌం{ర్ కేసులో అరెస్టయ్యారు. అప్పటికి ఆయన ము ఖ్యమంత్రి పదవికి గట్టిపోటీదారు స్థాయికి ఎదిగారు. ఈ అరెస్ట్ ఆయన రాజకీయ జీవితాన్ని దెబ్బతీసిందనే చెప్పాలి. అరెస్టయిన మూడు నెలల తర్వాత 2010 అక్టోబర్ 29న హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఆ మరునాడు జస్టిస్ అఫ్తాబ్ అలామ్ ఒక పిటిషన్ స్వీకరించి, అమిత్ షాను గుజరాత్‌నుంచి బహిష్కరించారు. దీంతో 2010`12 మధ్యకాలంలో అమిత్ షా బలవంతంగా గుజరాత్ బయట వుండాల్సి వచ్చింది. ఈ రెండేళ్ల కాలంలో ఆయన తన భార్యతో కలిసి ఢిల్లీలోని గుజరాత్ భవన్‌లోని ఒక గదిలో గడిపారు. ఎట్టకేలకు 2012 సెప్టెంబర్‌లో సు ప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన తిరిగి గుజరాత్ వచ్చారు. అదే ఏడాది నరాన్‌పుర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందారు. అప్పటికి డీలిమిటేషన్ కారణం గా సర్ఖెజ్ నియోజకవర్గాన్ని తొలగించారు. 2014లో సొహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసులో ఆయన పాత్ర వున్నట్టు ఆధారాలు లేవని స్పష్టం చేస్తూ సీబీఐ కోర్టు తీర్పు చెప్పడంతో కేసునుంచి విము క్తమయ్యారు.

మోదీ ప్రధాని అయ్యాక జాతీయ రాజకీయాల్లో అమిత్ షా ఎంతో పేరుప్రఖ్యాతులు సంపాదిం చుకున్నారు. ముఖ్యంగా ఎన్నికల సందర్భంగా ఆయన పోల్‌మేనేజ్‌మెంట్ “అపర చాణిక్యుడి”గా పేరుతెచ్చిపెట్టింది. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా 100మిలియన్ సభ్యత్వాల మార్క్‌ను బీజేపీ దా టింది. 2019 సాధారణ ఎన్నికల్లో బీజేపీ విజయానికి ఆయన వ్యూహచతురత ఎంతగానో పనిచేసింది. మొత్తం 543 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం నిర్వహించినవి 312! ఆయ మొత్తం 18 రోడ్‌షోలు, 161 బహిరంగసభలు, 1500 బీజేపీ సమావేశాలు నిర్వహించారు. ఆయన ీVAం మంత్రిగా జమ్ము`కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న 370 అధికరణం తొలగింపు, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్, సిటిజన్ షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్`2019, క్రిమినల్ ప్రొసీజర్ (ఐడెంటిఫికేషన్) బిల్లు`2022, బిల్లులు ప్రవేశ పెట్టి పార్లమెంట్ ఉభయసభల ఆమోదం పొందేలా చేయగలిగారు. ఒకరకంగా అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన అపర చాణిక్యుడే అమిత్ షా!

??బాధితులకు బకాయిలు చెల్లించాల్సిందే!

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలు!

`మోసం చేసిన చిట్ కంపెనీల ఆస్తులు జప్తు చేయాల్సిందే.

`అవసరమైతే ఆ కంపెనీల ఆస్తులమ్మి చెల్లించండి.

`అధికారులకు మంత్రి పోగులేటి ఆదేశం.

`అయినా అధికారులు, చిట్ కంపెనీలు వెతుకుతున్న పక్క దారులు.

`మంత్రి పొంగులేటికి తప్పుడు సమాచారాలతో కంపెనీలకు అధికారుల సహకారం.

`చీట్ చేస్తాం చిట్ కట్టండి!

`జీవోలను కూడా అనువుగా మార్చుకుంటాం!

`పేదలకు మేలుచేసే జీవోను కూడా మా మేలుకు వాడుకుంటాం.

`బాధితుల పేరుతో కూడా మేమే సొమ్ము చేసుకుంటాం.

`బాధితులకు ఉత్త చేతులు చూపిస్తాం.

`నాయకుల చల్లని చూపులు, అధికారుల సంతకాలు మాకే సొంతం.

`మంత్రి చెప్పినా వినం.. యంత్రాంగం మాకు దాసోహం!

`మాటలతో నమ్మిస్తాం.. పేదల కష్టం దోచుకుంటాం.

`అహర్నిశలు కష్టపడండి.. మా జల్సాలకు దాచుకోండి.

`జనం సొమ్ము కమ్మగా తింటాం.. దివాళా తీశామని చెప్పి శట్టర్ మూసేస్తాం.

`అమాయకుల పెట్టుబడితో ఆనందంగా బతుకుతాం సొమ్ములు పెట్టండి.

` చిట్ కు చీట్ తేడా చిన్నది.. మోసం చాలా పెద్దది!

`నమ్మించి చిట్ వేయిస్తారు..చీట్ చేయడానికి వెనుకాడరు.

`తెలంగాణా లో చిట్ కంపెనీల నయా మోసం.

`ప్రజలనే కాదు, ప్రభుత్వాన్ని కూడా మోసం చేస్తున్నారు.

`ప్రభుత్వ ఆదేశాలను యాదేచ్చగా ఉల్లంగిస్తున్నారు.

`ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగారుస్తున్నారు.

`అధికారుల అండ దండలతో జనాన్ని నిండా ముంచేస్తున్నారు.

`అమాయకుల జీవితాలను ఆగం చేస్తున్నారు.

`చిట్టిలు కట్టిన పాపానికి వారి జీవితాలలో నిప్పులు పోస్తున్నారు.

`పేదల జీవితాలతో అటలాడుకుంటున్నారు.

`అమాయకుల జీవితాలను బుగ్గిపాలు చేస్తున్నారు.

`నమ్మించి నట్టేట ముంచుతున్నారు.

`అధికారుల అండ దండలతో తిమ్మిని బమ్మిని చేస్తున్నారు.

`ప్రభుత్వ ఆదేశాల అమలులో కూడా తీవ్ర అన్యాయం చేస్తున్నారు.

 

హైదరాబాద్, నేటిధాత్రి:                                     

 ప్రజల సొమ్ముంటే అలుసైపోయింది. వారి సొమ్ము దిగమింగడం చిట్ కంపనీలకు అలవాటైపోయింది. ప్రజలను నమ్మించడం, వారి చేత చిట్టీలు కట్టించుకోవడం మోసం చేయడం పరిపాటిగా మారింది. అక్కడా ఇక్కడా అని తేడా లేకుండా తెలంగాణలో అన్ని జిల్లాలో దుర్మార్గపు వ్యాపారం కొన్ని దశాబ్దాలుగా సాగుతోంది. ప్రజల అమాయకత్వం, వారి ఆశలను సొమ్ము చేసుకోవడం చిట్ కంపనీలకు అలవాటుగా మారింది. అడిగే వారు లేరు. నిలదీసే వారు లేరు. అన్యాయం అని ఎలుగెత్తేవారు లేరు. చట్టం పట్టించుకోదు. నాయకులు కనికరం చూపరు. మోసపోయిన ప్రజల పక్షాన ఎవరూ మాట్లాడరు. అయ్యోపాపం అని కూడా అనేవారు లేక చిట్ కట్టిన ప్రజలు అరిగోస పడుతున్నారు. కొన్ని దశాబ్ధాలుగా చిట్ కంపనీలు చేస్తున్న మోసాలను గత పాలకులు ఎవరూ అరికట్టలేదు. బాదితుల పక్షాన నిలవలేదు. వారి న్యాయం చేయాలన్న ఆలోచన చేయలేదు. చిట్ బాదితులు పడుతున్న వేధన అర్దం చేసుకోలేదు. వారి గోసను చూసే తీరిక చేసుకోలేదు. దాంతో చిట్ కంపనీల దగా వ్యాపారం కోట్లకు నిర్వాహాకులకు వరమైపోయింది. బాధితులకు శాపమైపోయింది. ఇలా సాగుతున్న మోసానికి మొదటిసారి అడ్టుకట్ట వేసిన ఘనత మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి దిక్కింది. కాని ఏం లాభం కొందరు అదికారులు, చిట్ వ్యాపారులతో చేతులు కలిపి మంత్రి ఆదేశాలను కూడా పక్కదారి పట్టిస్తున్నారు. అసలు నిజాలు దాచి మంత్రి పొంగులేటిని కూడా మోసం చేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తొలిసారి మంత్రి పొంగులేటి బాధితుల పక్షాన నిలిచి, వారి న్యాయం జరగాలని కోరుకున్నారు. రంగంలోకి దిగి చిట్ కంపనీల మోసాలపై దష్టిపెట్టారు. వారి మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు బహత్తరమైన జీవో తెచ్చారు. అయినా అదికారుల్లో కదలిక పెద్దగా రాలేదు. చిట్ కంపనీలకు భయం కలగడం లేదు. శత కోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలన్నట్లు మంత్రి ఆదేశాలను కూడా ఇంకా తుంగలో తొక్కుతున్నారు. ఎట్టిపరిస్ధితుల్లో ఒక్క బాదితుడు కూడా మళ్లీ కన్నీళ్లు పెట్టుకోవద్దని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆలోచించారు. అనుకున్నదే తడువుగా జీవో జారీ చేశారు. బాదితుల కళ్లలో ఇంత కాలానికైనా ఆనందం చూడాలనుకున్నారు. వారు చెల్లించిన సొమ్మును వారికి దక్కేలా చేయాలనుకున్నారు. ప్రభుత్వం తరుపున జీవో జారీ చేశారు. ఆ జీవోను కూడా చిట్ కంపనీలు వారికి అనువుగా మార్చుకుంటుంటున్నారంటే ఎంత తెలివి మీరిపోయారో అర్దం చేసుకోవచ్చు. ప్రజల నుంచి చిట్ పేరుతో సొమ్మును సేకరించిన ప్రతి చిట్ కంపనీ ఆస్ధులను జప్తు చేసైనా సరే వారికి ప్రతి రూపాయి చెల్లించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆ జీవో ఏ ఒక్క కంపనీకో, ఏ ఒక్క జిల్లాకో పరిమితమైంది కాదు. కాని అదికారులు అతి తెలివిగా ఆ జీవోను అమలు చేయడంలో సరికొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. జీవో అమలుకు తూట్లు పొడుతున్నారు. అసలైన బాదితులకు అందాల్సిన సొమ్మును కంపనీలకు చెందిన వ్యక్తుల పేరు మీద చెక్కులు తీసుకుంటున్నారు. తమ వ్యక్తులనే బాదితులుగా చూపిస్తున్నారు. వారికి సొమ్ము చెల్లించినట్లు లెక్కలు చెబుతున్నారు. అసలైన బాధితులను మళ్లీ, మళ్లీ మోసం చేస్తూనే వున్నారు. అంటే ప్రభుత్వం నేరుగా జీవో జారీ చేసినా దానిని పక్కదారి పట్టించడంలో అదికారులు కీలక పాత్ర పోషిస్తున్నారు. చిట్ కంపనీలకు నేరుగానే మేలు చేస్తున్నారు. వరంగల్ జిల్లాలోని కనకదుర్గ చిట్ కంపనీ నుంచి లబ్దిదారులకు చెక్కులు చెల్లించే విషయం అన్ని జిల్లాలకు పాకింది. దాంతో అన్ని జిల్లాలో వున్న బాదితులంతా వెలుగులోకి వచ్చారు. తమకు న్యాయం జరగాలని రోడ్డెక్కారు. అటు కంపనీల చుట్టూ, ఇటు అదికారుల చుట్టూ తిరుగుతున్నారు. దాంతో ఆ శాఖకు చెందిన ఉన్నతాదికారులు మరో రకమైన ఎత్తు వేశారు. అన్ని జిల్లాకు చెందిన బాదితుల లిస్టును కూడా మళ్లీ వరంగల్ జిల్లాకు చేరవేసేలా శాఖ నుంచి మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. దాంతో ఇతర జిల్లాల అదికారులు తలలు పట్టుకుంటున్నారు. ప్రజలు వారి వద్దకు వెళ్లి మొర పెట్టుకుంటున్నారు. బాదితులకు సమాదానాలు చెప్పలేక ఇతర జిల్లాల అదికారులు నానా అవస్ధలు పడుతున్నారు. ఈ జిల్లాలో చెల్లించిన సొమ్ము కోసం వరంగల్ జిల్లాకు ఎందుకు వెళ్లాలని ఆయా జిల్లాల అదికారులను ప్రజలు నిలదీస్తున్నారు. పై నుంచి వున్న ఆదేశాలని బాదితులకు చెప్పలేక, వారిని వారించలేక ఇతర జిల్లాల అదికారులు నానా తంటాలు పడుతున్నారు. అయినా ఏ జిల్లాలో మోసపోయిన బాదితులకు ఆ జిల్లాలోనే న్యాయం జరగడం పరిపాటి. కాని ఇతర జిల్లాలకు వెళ్లి అక్కడ వారి గోడును చెప్ప్పుకునేలా ఉన్నతాదికారులు తీసుకున్న నిర్ణయం అందిరికీ విస్మయం కలిగిస్తోంది. ఈ విషయం మంత్రి పొంగులేటి వరకు వెళ్లకుండా అధికారులు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. మూడు జిల్లాలకు చెందిన ఓ డిఐజి పర్యవేక్షురాలిగా నిర్ణయించారు. అసలు ఒక్క డిఐజీని ముప్పై మూడు జిల్లాల పర్యవేక్షణ ఎలా సాద్యమౌతుంది? వరంగల్ జిల్లాలోనే అసలు పూర్తి స్దాయి డిఆర్ లేడు. వరంగల్ జిల్లా డిఆర్‌గా కరీంనగర్ డిఆర్ అదనపు బాధ్యతలు వహిస్తున్నారు. ఆ డిఆర్ ఆద్వర్యంలో చెక్కుల పంపణీ చేయించడం అంటేనే పారదర్శకతను పాతర పెట్టడమే అవుతుంది. అదికారులు చాలా తెలివిగా అటు మంత్రిగారి ఆదేశాలను పక్కాగా అమలు చేస్తున్నట్లు కనిపించినా, లోగుట్టును బైటకు పొక్కకుండా చూసుకుంటున్నారు. ఇతర జిల్లాల డిఆర్‌లకు పెద్ద తలనొప్పిని తెచ్చిపెడుతున్నారు. ఇతర జిల్లాల డిఆర్ నుంచి అందాల్సిన చెక్కులు, వరంగల్ ఇన్‌చార్జి నుంచి అందించడమంటేనే అసలైన మోసం దాగి వుంది. ప్రజలను, ప్రభుత్వాన్ని , సాక్ష్యాత్తు మంత్రిని కూడా ఇలా కూడా మోసం చేయగల సమర్ధలు వ్యవస్ధలో వున్నారని తేలిపోయింది. ప్రభుత్వ ఆదేశాలను పక్కాగా అమలు చేయాల్సిన అదికారులు, చిట్ కంపనీలకు తొత్తులుగా మారిపోవడం వల్ల ఇక బాదితులకు న్యాయం ఎలా జరుగుతుంది? పోనీ అన్ని జిల్లాల అదికారులను బాగస్వాములను చేసి, బాదితులకు న్యాయం చేసేలా ఆదేశాలున్నాయా? అంటే అదీ లేదు. ముప్పై మూడు జిల్లాల బాధితుల సమస్యల పరిష్కారం ఒక్క డిఐజీ చేతుల్లో పెట్టడమేమటి? ఆ డిఐజీగా వున్న మూడు జిల్లాలో ఒక్క వరంగల్ జిల్లా ఇన్‌చార్జి డిఆర్ కనుసన్నల్లోనే చెక్కుల పంపణీ కార్యక్రమం జరగడమేమిటి? ఇదేమీ అంతు పట్టని రహస్యం కాదు. కాని బాదితులు అంత దూరం వెళ్లలేక, న్యాయం కోసం రొడ్డెక్కలేక రోదించడం తప్ప ఏం చేయలేరు. పదే పదే పది సార్లు వరంగల్ వెల్లలేరు. పది సార్లు తిరిగినా తమ ఖర్మ ఇంతేనని సరిపెట్టుకుంటారు. ఇదే సమయంలో కంపనీలకు చెందిన వ్యక్తుల పేరు మీద డిపాజిట్ సొమ్మును దోచుకునేందుకు మార్గం పడుతుంది. అలా వరంగల్ జిల్లాలోనే ఒక్క కనకదుర్గ చిట్ కంపనీలోనే కొన్ని వందల మంది బాదితులున్నారు. వారికి అందాల్సిన సొమ్మును ఓ నలుగురికి అందించి, మిగతావన్నీ తమ వ్యక్తుల పేరుతో చెక్కులు జారీ చేసుకున్న వైనం కూడా కనిపిస్తోంది. వరంగల్ జిల్లా కేంద్రంగా వున్న అనేక కంపనీలు, అన్ని జిల్లాల్లోనూ, ఇతర రాష్ట్రాలలోనూ కూడా కంపెనీలు పెట్టాయి. అలా అంతటా చిట్ వ్యాపారాలు మొదలు పెట్టడం, దివాళా తీశామని బోర్డులు తిప్పేయడం పరిపాటిగా మారింది. ప్రజలను ప్రజల సొమ్ముతో మోసం చేయడమే వ్యాపారమైపోయింది. గత పదేళ్ల కాలంలో ఈ మాత్రమైనా న్యాయం జరిగేందుకు ఒక అడుగు ముందుకు పడలేదు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చూపిన చొరవ మూలంగా ఆ అడుగు పడింది. ఆ అడుగును కూడా సక్రమంగా అమలు చేయకుండా, మంత్రి దష్టికి ఎలాంటి వార్త వెళ్లకుండా అదికారులు జాగ్రత్తపడుతున్నారు. బాదితులు తమ సొమ్మును తీసుకునేందుకు వీలు కల్పిస్తున్నట్లు ఓ చిన్న ప్రకటన డిఆర్‌లు జారీ చేసి, చేతులు దులుపుకున్నారు. ఆ ప్రకటన ద్వారా కంపనీల డిపాజిట్ సొమ్మును కూడా అప్పనంగా మళ్లీ కంపనీలకు చెందిన వ్యక్తులకు జారీ చేసి మమ అనిపిస్తున్నారు. దీనిపై మంత్రి మరోసారి దష్టిపెడితే అదికారుల అసలు బాగోతం, కంపనీల గుట్టు మరోసారి రట్టవుతుంది. బాధితులకు మరింత న్యాయం జరిగనట్లౌవుంది.

error: Content is protected !!
Exit mobile version