స్టాలిన్‌కు పట్టాభిషేకమా? విజయ్ సంచలనమా..

స్టాలిన్‌కు పట్టాభిషేకమా?
విజయ్ సంచలనమా?

తమిళనాడు రాజకీయ పీఠం కోసం సాగుతున్న ఈ మహా సంగ్రామం ఇప్పుడు ఒక ఉత్కంఠభరితమైన క్లైమాక్స్‌కు చేరుకుంది. ముఖ్యమంత్రి స్టాలిన్ తన “సంక్షేమ మంత్రాన్ని” నమ్ముకుని మరోసారి కోటపై జెండా ఎగురవేయడానికి సిద్ధమవుతుండగా, తాజా ఓపీనియన్ పోల్ ఫలితాలు రాష్ట్రంలో రాజకీయ సెగలు పుట్టిస్తున్నాయి. డీఎంకే కూటమి 121 సీట్లతో మళ్లీ అధికారాన్ని దక్కించుకోబోతోందని ఈ సర్వే చెబుతున్నప్పటికీ, అది కేవలం మిత్రపక్షాల అండతోనే సాధ్యమని తేల్చి చెప్పంది. సొంతంగా మెజారిటీ సాధించలేక పోవడం స్టాలిన్ టీమ్‌కు కాస్త కలవరపెట్టే అంశమే.

​మరోవైపు, ప్రతిపక్ష ఏఐడీఎంకే కూటమి 83 స్థానాలతో గట్టి పోటీ ఇస్తూ అధికారం కోసం వేచి చూస్తోంది. అయితే, ఈ ఎన్నికల్లో అసలైన “ఎక్స్‌ ఫ్యాక్టర్” మాత్రం సినీ నటుడు విజయ్ రూపంలో తెరపైకి వచ్చింది. ఆయన నేతృత్వంలోని టీవీకే పార్టీ కేవలం మూడు సీట్లకే పరిమితమైనా, ఏకంగా 24.71 శాతం ఓట్లను కొల్లగొట్టి ప్రధాన పార్టీల లెక్కలన్నీ తలకిందులు చేయడానికి సిద్ధమైంది. విజయ్ సాధించబోయే ఈ భారీ ఓట్ షేర్ అటు డీఎంకే, ఇటు ఏఐడీఎంకే అభ్యర్థుల గెలుపోటములను శాసించే రేంజ్‌లో ఉండబోతుంది.

​ఈ ఎన్నికల యుద్ధంలో అన్నింటికంటే ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, సుమారు 27 నియోజకవర్గాల్లో ఫలితం ‘టాస్’ వేసినట్లుగా అత్యంత స్వల్ప తేడాతో మారే అవకాశం ఉందని సర్వే పేర్కొనడం. ఈ హోరాహోరీ స్థానాలే తమిళనాట అసలైన కింగ్ ఎవరో తేల్చనున్నాయి. ఏప్రిల్ 23న జరగబోయే ఈ పోలింగ్ సమరంలో తమిళ ఓటరు స్టాలిన్‌కు పట్టం కడతాడా లేక విజయ్ ఎంట్రీతో సమీకరణాలు మారి సరికొత్త ట్విస్ట్ ఎదురవుతుందా అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

స్టాలిన్‌ సార్‌కు ఇవే చివరి ఎన్నికలు…

స్టాలిన్‌ సార్‌కు ఇవే చివరి ఎన్నికలు

 

డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్‌కు ఇవే చివరి ఎన్నికలని, ఆయన్ని ఇంటికి సాగనంపాలని ప్రజలు నిర్ణయించారని ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధ్యక్షుడు విజయ్‌ పేర్కొన్నారు.

ప్రచారంలో విజయ్‌

 

LATEST

ప్రబలిన డయేరియా.. వారం రోజులు మాంసం విక్రయాలపై నిషేధం

స్టాలిన్‌ సార్‌కు ఇవే చివరి ఎన్నికలు

అదృష్టం కోసం ఏ కలర్ బ్యాగ్ లేదా పర్సు వాడాలో తెలుసా?

పొట్ట ఉంటేనే పట్టం.. ఇథియోపియా అమ్మాయిలకు బొజ్జ ఉన్నవాళ్లే ఇ

షాకింగ్ వీడియో.. పారాసైలింగ్ చేస్తుండగా గాల్లోనే ఏం జరిగిందో

హైదరాబాద్‌లోని జయలలిత నివాసం సీజ్

ప్రేమ వివాహం.. విషాదాంతం

రేపటి నుంచే మార్పులు.. మీ పాకెట్ పై ప్రభావం చూపించే అంశాలు!

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం..

TVK పార్టీ అధ్యక్షుడు విజయ్‌పై కేసు నమోదు

అదే మా ఓటమికి కారణం.. సీఎస్కే కెప్టెన్ రుతురాజ్

బీహార్ ఆలయంలో తొక్కిసలాట.. 8 మంది మృతి..

నెల్లూరు జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్‌ ట్రైన్.. నిలిచిన రా

ప్రబలిన డయేరియా.. వారం రోజులు మాంసం విక్రయాలపై నిషేధం

స్టాలిన్‌ సార్‌కు ఇవే చివరి ఎన్నికలు

అదృష్టం కోసం ఏ కలర్ బ్యాగ్ లేదా పర్సు వాడాలో తెలుసా?

పొట్ట ఉంటేనే పట్టం.. ఇథియోపియా అమ్మాయిలకు బొజ్జ ఉన్నవాళ్లే ఇ

షాకింగ్ వీడియో.. పారాసైలింగ్ చేస్తుండగా గాల్లోనే ఏం జరిగిందో

హైదరాబాద్‌లోని జయలలిత నివాసం సీజ్

ప్రేమ వివాహం.. విషాదాంతం

రేపటి నుంచే మార్పులు.. మీ పాకెట్ పై ప్రభావం చూపించే అంశాలు!

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం..

TVK పార్టీ అధ్యక్షుడు విజయ్‌పై కేసు నమోదు

అదే మా ఓటమికి కారణం.. సీఎస్కే కెప్టెన్ రుతురాజ్

బీహార్ ఆలయంలో తొక్కిసలాట.. 8 మంది మృతి..

నెల్లూరు జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్‌ ట్రైన్.. నిలిచిన రా

చెన్నై: డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్‌కు ఇవే చివరి ఎన్నికలని, ఆయన్ని ఇంటికి సాగనంపాలని ప్రజలు నిర్ణయించారని ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధ్యక్షుడు విజయ్‌ పేర్కొన్నారు. ఏప్రిల్‌ 23న ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో, టీవీకే తరుఫున 234 నియోజకవర్గాల్లో ‘విజిల్‌’ గుర్తుపై టీవీకే ఒంటరిగా పోటీచేయనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో తిరుచ్చి (ఈస్ట్‌), పెరంబూరు నియోజకవర్గాల్లో పోటీచేసేందుకు నిర్ణయించిన విజయ్‌ సోమవారం పెరంబూరు నియోజకవర్గంలో పోటీచేసేందుకు వ్యాసర్పాడి ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో రిటర్నింగ్‌ అధికారికి తన నామినేషన్‌ పత్రాలు సమర్పించారు.

ఆయన నామినేషన్‌ పత్రాల్లో సి.జోసెఫ్‌ విజయ్‌ అని ఉండటం గమనార్హం. ఆ తర్వాత ఆయన తన ప్రచారానికి శ్రీకారం చుట్టారు. పెద్దసంఖ్యలో గుమిగూడిన పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజల మధ్య విజయ్‌ మాట్లాడుతూ.. పెరంబూరు ప్రాంతం తనకు తల్లిలాంటిదని, తనను అభిమానంగా ప్రేమించే వారు నివసిస్తున్న ప్రాంతం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించడం శుభ సూచికమన్నారు. ఉత్తర చెన్నైకి మంచి గుర్తింపు తీసుకొచ్చిన సెయింట్‌ లూర్థు చర్చి, పురాతన ఆలయాలు, మసీదులున్న ఈ ప్రాంతం నుంచే ప్రచారం ప్రారంభించాలని తన మనసుకు తోచిందన్నారు.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version