గండి లచ్చపేట గ్రామంలో సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ….

గండి లచ్చపేట గ్రామంలో సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

తంగళ్ళపల్లి మండలం గండి లచ్చపట గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలోని పలువురికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను. గండి లచ్చపేట కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీనివాస్.సర్పంచ్.జంగిటి అంజయ్య ఉపసర్పంచ్ పుట్ట భాను చేతుల మీదుగా ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. అలాగే రాష్ట్రంలోని ప్రజలకు వైద్యం చేయించుకోలోని పరిస్థితిలో ఉన్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో అండగా ఉండి అత్యవసరసమయంలో అత్యవసర చికిత్సకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ. గ్రామంలోని .బల్లెపు .సత్తయ్య కు 11.వేల రూపాయలు. పడిగనరసవ్వకు 35. వేల రూపాయల చెక్కులనుఅందజేయడం జరిగిందని. తెలియజేస్తూ ఇట్టి ముఖ్యమంత్రి సహాయ నిధి రావడానికి సహకరించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. సిరిసిల్ల నియోజకవర్గ కేకే మహేందర్ రెడ్డి కి. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జలగం ప్రవీణ్ కి. లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇట్టి పంపిణీ కార్యక్రమంలో. ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షులు బొండ్ల శ్రీశైలం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. గ్రామ ప్రజలు. తదితరులు పాల్గొన్నారు

నిరుపేదలకు వరం ముఖ్యమంత్రి సహాయ నిధి..

నిరుపేదలకు వరం ముఖ్యమంత్రి సహాయ నిధి

◆”-: మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డా౹౹ఏ.చంద్రశేఖర్ గారి ఆదేశాలతో

◆”-: లబ్దిదారులకు ₹ 18,35,500 /- సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత

జహీరాబాద్ నేటి ధాత్రి:

నిరుపేదలకు వరం ముఖ్యమంత్రి సహాయనిది అని, నిరుపేదలు అనారోగ్యానికి గురై తన సొంత ఖర్చులతో ఆసుపత్రిలో చికిత్స చేసుకున్న అనంతరం ఖర్చు అయిన బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి అందజేస్తుందని మాజీ మంత్రి, నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ డా:చంద్రశేఖర్ తెలిపారు.నియోజకవర్గంలోని జహీరాబాద్,న్యాలకల్, కోహిర్, ఝారసంఘం, మొగుడంపల్లి,మండలాల లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఇంచార్జ్ డా చంద్రశేఖర్ సూచన మేరకు సిఎంఆర్ఎఫ్ చెక్కులను ఆత్మ కమిటీ చైర్మన్ రామలింగారెడ్డి, మండల అద్యక్షులు హన్మంతరావు పాటిల్, శ్రీనివాస్ రెడ్డి,సర్పంచులు వీరా రెడ్డి, రాజ్ కుమార్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి ,సత్వర్ పిఎసిఎస్ ఛైర్మెన్ చంద్రశేఖర్ రెడ్డి గారు, ఇప్పేపల్లి మాజీ పిఎసిఎస్ ఛైర్మెన్ వెంకట్ రెడ్డి , కాంగ్రెస్ నాయకులు హుగ్గేల్లి రాములు,శేఖర్ ,విష్ణు , ఫైజ్, తదితరులు అందజేశారు..సిఎంఆర్ఎఫ్ చెక్కులను అందుకున్న లబ్ధిదారులు మాజీ మంత్రి డా:చంద్రశేఖర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version