కాట్రియాలలో శివాజీ విగ్రహ భూమి పూజ చిచ్చు.
మూడు రోజులుగా ముదిరిన వివాదం.
పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు.
రామాయంపేట నేటి ధాత్రి (మెదక్ )
శివాజీ విగ్రహ స్థాపన స్థల వివాదం ఆ ఊర్లో వివాదాన్ని తెచ్చిపెట్టింది.ఇరు వర్గాల్లో గొడవ పెరిగి పోలీస్ స్టేషన్ దాకా వచ్చింది.వివరాల్లోకెళ్తే.. రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో మూడు రోజుల క్రితం శివాజీ విగ్రహ భూమి పూజకు యువత ఏర్పాట్లు చేసింది.అది ప్రభుత్వ స్థలం అంటూ ఒకరు వాదించగా..పనులు ఆగాయి.దీంతో కోపోద్రిక్తులైన యువకులు,మరొకరి మధ్య మాటల యుద్ధం పెరిగి గ్రామంలో గొడవ రాసుకుంటున్నది.
