అక్రమ అరెస్ట్ అప్రజాస్వామికం..

అక్రమ అరెస్ట్ అప్రజాస్వామికం

 

మందమర్రి నేటి ధాత్రి

 

బడ్జెట్లో విద్యా రంగానికి తీవ్రమైన అన్యాయం చేసిన రేవంత్ రెడ్డి సర్కార్

 

బి ఆర్ ఎస్ వి మందమర్రి పట్టణ అధ్యక్షులు MD.ముస్తఫా ..

కాంగ్రెస్ ప్రభుత్వం కచ్చితంగా విద్యా రంగానికి 15% బడ్జెట్ ను కేటాయించాలి.

అసెంబ్లీ ముట్టడి నిరసన గా ఈ రోజు ఉదయం 6 గంటలకు బి అర్ ఎస్ వి పట్టణ అధ్యక్షులు MD ,ముస్తఫా తో పాటు టౌన్ వైస్ ప్రెసిడెంట్ దాసరి నవీన్ మరియు md,తాజ్ గారిని అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కు తరలించిన పోలీసులు.

అక్రమ అరెస్ట్ అప్రజాస్వామికం…

విద్యను పాతాళానికి తొక్కుతున్న రేవంత్ రెడ్డి సర్కార్

ఈ సందర్భంగా ముస్తఫా మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేవలం 7.53 శాతమే అనగా 23108 కోట్ల బడ్జెట్ ను విద్యా రంగానికి కేటాయించడం వల్ల విద్య పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మన ముందు కనబడుతుంది అని అన్నారు.

ఇప్పటికే ఈ రాష్ట్రంలో దాదాపు 8,000 కోట్లు విద్యార్థులకు రావాల్సిన బకాయిలు అనగా స్కాలర్షిప్లు గాని ఫీజు రియంబర్స్మెంట్ గాని పెండింగ్లో ఉన్నాయి కానీ మొన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి కేవలం 23,108 కోట్లు మాత్రమే కేటాయించారు.ఈ బడ్జెట్ ఫీజు రీయింబర్స్మెంట్ కూడా సరిపోని పరిస్థితి ఉన్నదని అని తెలిపారు.
హామీలు మాత్రం గంపేడిచ్చి బడ్జెట్ మాత్రం అరకొర కేటాయించి విద్యా వ్యవస్థను అందా:పాతాళానికి తొక్కడం దుర్మార్గం అని కోరారు.

ప్రతి విద్యార్థికీ 5 లక్షల విద్య భరోసా కార్డుకు బడ్జెట్ కేటాయింపు లో సున్నా అని కోరారు.ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ ఊసే లేదు..

ప్రతి మండలానికి ఒకటి అని చెప్పి నేడు నియోజకవర్గానికి ఒకటి ఇంటర్నేషనల్ స్కూల్ ఇస్తామని అనడం దానికి బడ్జెట్ కేటాయించకపోవడం దుర్మార్గం.

ప్రతి మండలంలో నవోదయ విద్యాలయంతో పాటు సమానంగా బీసీలకు ఒక కొత్త గురుకులం అని చెప్పి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కు సిగ్గు చేటు అని పేర్కొన్నారు.

ప్రతి మండల కేంద్రంలో హైస్కూల్ ఇంటర్ కాలేజీ మరియు ప్రతి నియోజకవర్గంలో ఒక డిగ్రీ కాలేజీ అదేవిధంగా జిల్లా కేంద్రంలో పీజీ కాలేజీ లను నిర్మిస్తామని చెప్పినారు కానీ బడ్జెట్ మాత్రం సున్నా కేటాయించారు ఎలా సాధ్యమవుతుందన్నారు.

3 లక్షల వార్షికో ఆదాయం లోపు ఉన్నవారికి బీసీలకు మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పి మోసం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని మండిపడ్డారు.
ఉన్నత చదువులు చదివే వారికి పది లక్షల వరకు రుణాలు ఇస్తామని చెప్పి మోసం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు.

ఉద్యమంలో చనిపోయిన విద్యార్థి అమరులకు 25వేల పింఛన్ హామీ పచ్చి మోసని తెలిపారు.

18 ఏళ్ల పైబడి చదువుకునే విద్యార్థినిలకు ఎలక్ట్రిక్ స్కూటీస్ ఇస్తామని చెప్పి మోసం చేసిందన్నారు.

అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులకు 10 పాస్ అయితే 10000, ఇంటర్ పాస్ అయితే 15000, డిగ్రీ పాసైతే 25000, పీజీ పాస్ అయితే ఒక లక్ష, పిహెచ్డి ఎంఫిల్ పాస్ అయితే ఐదు లక్షలు ఇస్తా అని చెప్పడం పచ్చి మోసం. అని పేర్కొన్నారు.

ప్రశాంతంగా మొదటి రోజు పదవ తరగతి పరీక్షలు.

ప్రశాంతంగా మొదటి రోజు పదవ తరగతి పరీక్షలు

ముత్తారం :- నేటి ధాత్రి:

 

ముత్తారం మండలం ధర్యపూర్ మోడల్ స్కూల్ లో పదవ తరగతి పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా జరిగాయి పదో తరగతి పరీక్ష కేంద్రం వద్ద ముత్తారం ఎస్ ఐ నరేష్ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు పోలీస్ సిబ్బంది పరీక్ష కేంద్రం లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని ఎస్ ఐ నరేష్ తెలిపారు

ఎస్ ఎస్ సి పరీక్ష మొదటి రోజు ప్రశాంతం.

ఎస్ ఎస్ సి పరీక్ష మొదటి రోజు ప్రశాంతం

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో ఆదర్శ మోడల్ స్కూల్ సెంటర్లో పదో తరగతి పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా ముగిశాయి శుక్రవారం ఉదయం 9 .30 గంటలకు ప్రారంభమైన పరీక్షలు మధ్యాహ్నం 12:30 వరకు జరిగాయి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ లో జిల్లా విద్య శాఖ అధికారి రాజేందర్ పరీక్ష నిర్వహణను పర్యవేక్షించారు మండలంలో రెండు సెంటర్లు 360 మంది విద్యార్థులకు గాను 359 మంది హాజరు కాగా ఒకరు ఆఫ్ సెంట్ అయినట్లు ఎంఈఓ ఊరుకొండ ఉప్పలయ్య తెలిపారు మొదటి రోజు ఎలాంటి మాస్ షాపింగ్ జరగకుండా స్థానిక ఎస్సై రేఖ అశోక్ పటిష్ట భద్రత ను ఏర్పాటు చేశారు

పదో తరగతి పరీక్షల తొలిరోజే అధికారుల నిర్లక్ష్యం.

పదో తరగతి పరీక్షల తొలిరోజే అధికారుల నిర్లక్ష్యం.. మారిన పేపర్

జెడ్పీ బాయ్స్ హై స్కూల్ లో రెండు గంటలు ఆలస్యంగా పదో తరగతి పరీక్షలు

మంచిర్యాల,నేటి ధాత్రి:

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు శుక్రవారం మొదలయ్యాయి.పరీక్షలు ప్రారంభమైన తొలిరోజే అధికారుల నిర్లక్ష్యం బయటపడింది.తెలుగు ప్రశ్న పత్రానికి బదులు హిందీ ప్రశ్నా పత్రం ఇవ్వడంతో పరీక్ష రెండు గంటలు ఆలస్యంగా మొదలైంది.ఒక సబ్జెక్ట్‌కు ప్రిపేర్ అయితే మరో సబ్జెక్ట్ పేపర్ రావడంతో విద్యార్థులు ఒకింత ఆందోళనకు గురయ్యారు.ఈ విషయాన్ని అక్కడి అధికారులకు తెలియజేయడంతో జరిగిన తప్పిదాన్ని గుర్తించారు. వెంటనే మరో పేపర్ తెప్పించి పరీక్ష రాయించారు.అయితే అప్పటికే రెండు గంటలు గడిచిపోయింది.మంచిర్యాల జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాయ్స్ హైస్కూల్ పరీక్ష కేంద్రంలో దాదాపు రెండు గంటలు ఆలస్యంగా పదో తరగతి పరీక్షలు మొదలయ్యాయి.ఉదయం విద్యార్థులంతా పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు.పరీక్ష హాల్లో తమకు కేటాయించిన సీట్లలో కూర్చుకున్నారు. పరీక్షలు రాసేందుకు సిద్ధమయ్యారు.అక్కడి ఇన్విజిలేటర్లు ప్రశ్నాపత్రాన్ని విద్యార్థులకు ఇచ్చారు.అయితే ఆ ప్రశ్నాపత్రాన్ని చూసి విద్యార్థులంతా అవాక్కయ్యారు.ఏంటిది అంటూ ఒకింత భయాందోళనకు గురయ్యారు. ఒక ప్రశ్నాపత్రానికి బదులుగా మరో పేపర్‌ను అధికారులు పంపిణీ చేశారు. విద్యార్థులు దాన్ని గుర్తించి చెప్పడంతో అధికారులు హైరానా పడ్డారు. హడావుడిగా మరో పేపర్ తెప్పించడంతో దాదాపు రెండు గంటలు ఆలస్యంగా విద్యార్థులు పరీక్ష రాశారు.

డీఈవో పై కలెక్టర్ సీరియస్

అయితే ప్రశ్నాపత్రం తారుమారైన విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లింది. దీంతో ప్రశ్నాపత్రాల విషయంలో సిబ్బంది నిర్లక్ష్యం, పరీక్ష ఆలస్యంపై కలెక్టర్ సీరియస్ అయ్యారు.ఒక ప్రశ్నాపత్రం బదులు మరో పేపర్ రావడంతో వెంటనే విచారణ జరిపి నివేదిక అందించాల్సిందిగా డీఈవోకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.పదో తరగతి పరీక్షల ప్రశ్నాపత్రాల విషయంలో అధికారుల నిర్లక్ష్యం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సిఎస్ఐ హై స్కూల్ పరీక్ష సామాగ్రి వితరణ.

సి. ఎస్. ఐ. హై స్కూల్ పరీక్ష సామాగ్రి వితరణ

గణపురం నేటి ధాత్రి:

 

గణపురం మండలం గాంధీనగర్ గ్రామంలో ని సి ఎస్ ఐ హై స్కూల్ చదువుతున్న పదోతరగతి పిల్లలకు పరీక్ష సామాగ్రీ అందజేసిన, మొగుళ్ళపల్లి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ మారపెళ్లి ప్రభాకర్ ఈ కార్యక్రమం లో స్కూల్ ప్రిన్సిపల్ హన్నా జాన్, స్కూల్ సిబ్బంది శివాజీ, రత్న బాబు పాల్గొన్నారు, హెడ్ కానిస్టేబుల్ ప్రభాకర్ ను మొగుళ్ళపల్లి ఎస్ ఐ.బి. అశోక్  అభినందించారు

పదవ తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం..

పదవ తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

The annual exams for class 10th have begun…

10వ తరగతి వార్షిక పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా జరిగాయి. రామకృష్ణాపూర్ పట్టణం లో పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థుల కోసం పట్టణంలో రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆల్ఫాన్సా పాఠశాల, తవక్కల్ పాఠశాల ల్లో 291 మంది విద్యార్థులు 10 పరీక్షలు రాస్తున్నారు. పదోతరగతి పరీక్ష కేంద్రాల వద్ద రామకృష్ణాపూర్ పట్టణ ఎస్ఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.

 

The annual exams for class 10th have begun…

పరీక్ష కేంద్రాల వద్ద ఆకతాయిలు అలజడి చేయకుండా పోలీస్ సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. పరీక్ష కేంద్రాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా, బెల్లంపల్లి ఏసిపి రవికుమార్, మందమర్రి సిఐ శశిధర్ రెడ్డి ల ఆదేశాల మేరకు పరీక్ష కేంద్రాల సమీపంలో 144 సెక్షన్ విదించడం జరిగిందని ఎస్ఐ పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాలలో విద్యార్థులు ప్రశాంతంగా పరీక్ష రాసేందుకు అన్ని చర్యలు చేపట్టడం జరిగిందని మండల విద్యాధికారి తెలిపారు. వేసవి కాలం కావడం తో పరీక్షా కేంద్రాల వద్ద మంచినీటి సౌకర్యం తో పాటు, వైద్య సిబ్బందిని సైతం నియమించడం జరిగిందన్నారు. ఏఎస్ఐ రజిత, పోలీస్ సిబ్బంది పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు చేశారు.

పాఠశాలలో ట్వినింగ్ ఆఫ్ ద స్కూల్ కార్యక్రమం.

పాఠశాలలో ట్వినింగ్ ఆఫ్ ద స్కూల్ కార్యక్రమం

నడికూడ,నేటిధాత్రి:

మండల కేంద్రంలోని జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలో ట్వినింగ్ ఆఫ్ ద స్కూల్స్ కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖ ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగింది‌.ఈ కార్యక్రమానికి నడికూడ మండలంలో గల ప్రాథమికోన్నత పాఠశాలలు, యుపిఎస్ చౌటపర్తి, యుపిఎస్ ముస్త్యాలపల్లి, యుపిఎస్ పులిగిల్ల, యుపిఎస్ నర్సక్కపల్లి నుండి విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు హాజరై జడ్పీహెచ్ఎస్ నడికూడ పాఠశాలలో ఉన్న మౌలిక సదుపాయాలు వసతులు, విద్యార్థులు పరిశీలించడం జరిగింది.ఇందులో భాగంగా గ్రంథాలయం,సైన్స్ ల్యాబ్, కిచెన్ గార్డెన్,డిజిటల్ క్లాస్ రూమ్ పరిశీలించి ఉన్నత పాఠశాల పట్ల అవగాహన పొందినారు.ఈ కార్యక్రమం విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నదని ఉపాధ్యాయులు వారి అభిప్రాయాన్ని తెలియజేశారు.విద్యార్థిని విద్యార్థులు ఈ కార్యక్రమం ద్వారా ఎంతో విజ్ఞానాన్ని, ఆనందాన్ని,సంతోషాన్ని పొందారు.ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులు వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ప్రశాంతంగా ముగిసిన పదవ తరగతి తెలుగు పరీక్ష.

ప్రశాంతంగా ముగిసిన పదవ తరగతి తెలుగు పరీక్ష

నిజాంపేట, నేటి ధాత్రి

మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి తెలుగు పరీక్ష ప్రశాంతంగా కొనసాగింది. మొత్తం 144 విద్యార్థిని విద్యార్థులు ఉండగా 143 మంది విద్యార్థులు హాజరయ్యారు

ఏబిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్యాడ్స్.!

ఏ బి ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్యాడ్స్
పెన్నులుపంపిణీ.

చిట్యాల, నేటిధాత్రి :

చిట్యాల మండల కేంద్రంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్ష పాడ్స్ పెన్నులు పంపిణి చేయడం జరిగింది, 10వ తరగతి పరీక్ష అనేది విద్యార్ధి ఉన్నత చదువులకి మొదటి మెట్టు లాంటిది కాబట్టి విద్యార్థులు బాగా చదివి అందరు ఉత్తిర్ణత సాదించాలి, మనం ఏదైనా సాదించాలి అనుకుంటే అది కేవలం విద్య తోనే సాధ్యం అవ్వుద్ది కనుక ఎగ్జామ్స్ బాగా రాయాలని జిల్లాలో వంద శాతం ఉత్తిర్ణత రావాలని గురువారం పరిక్ష పాడ్స్, పెన్నులు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రంలో వంశీకృష్ణ , సందీప్, రాకేష్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

పది పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి.

పది పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి.

మండల విద్యాశాఖ అధికారి రఘపతి.

చిట్యాల, నేటిధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో బుధవారం రోజున ఎంఈఓ రఘుపతి మాట్లాడుతూ ఈనెల 21 నుంచి ఏప్రిల్ 4 వరకు నిర్వహించనున్న పదవ తరగతి వార్షిక పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయినట్లు మండల విద్యాశాఖ అధికారి కోడెపాక రఘుపతి తెలిపారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చాం.
మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరీక్ష
కేంద్రంలో 160 మంది విద్యార్థులు, బాలికల గురుకుల పాఠశాల కేంద్రంలో 190 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు తాగునీరు, విద్యుత్తు సౌకర్యం, వైద్య శిబిరాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామన్నారు. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలన్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు 1గంట ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.

ప్రతి విద్యార్థి కి పదవ తరగతి అత్యంత కీలకం.

ప్రతి విద్యార్థి కి పదవ తరగతి అత్యంత కీలకం

టీఎన్జీవో స్ భద్రాచలం

నేటిధాత్రి భద్రాచలం

10వ తరగతి పరీక్షలు జరగబోతున్న సందర్భంగా తెలంగాణ నాన్ గెజిటెడ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (టీ యన్ జి ఓ స్) భద్రాచలం ప్రెసిడెంట్, సెక్రటరీ ట్రెజరర్ డెక్కా నరసింహారావు, గగ్గూరి బాలకృష్ణ, పడిగ నరసింహారావు విద్యార్థులకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థి దశలో ప్రతి విద్యార్థికి అత్యంత కీలకమని.. అందుకే ప్రతి విద్యార్థి ఎంతో మేలుకువతో పరీక్షలు వ్రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలని,. అదేవిధంగా వడ దెబ్బ తగలకుండా తల్లిదండ్రులు మరియు విద్యార్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేస్తూ.. ప్రభుత్వం కూడా దానికి అనుకూలంగా విద్యాశాఖ వారు ఆయా పరీక్ష హాల్ నందు అన్ని రకాల వసతులు సమకూర్చనీ ఒక ప్రకటనలో తెలియజేశారు.

10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు వేడుక.

10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు వేడుక.

నేటి ధాత్రి భద్రాద్రి జిల్లా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో బుధవారం 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు వేడుక ప్రధానోపాధ్యాయులు రవిలాదేవి అధ్యక్షతన ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు రవిలాదేవి మాట్లాడుతూ విద్యార్థులు ముందుగా ఉపాధ్యాయులు నిర్దేశించినటువంటి మార్గదర్శకాలను చక్కగా పాటించాలని, చెడు అలవాట్లు కలిగి ఉండకూడదు అని, లక్ష్యాలు సాధించే విదంగా శ్రమించాలని, తరగతి గదుల్లో భోదించిన విషయాలు విద్యార్థుల జీవితాలపై చాలా ప్రభావం చూపుతాయి అని, వారి ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తాయని చెప్పారు. అనంతరం విద్యార్దులను ఉద్దేశించి గణిత ఉపాధ్యాయుడు నాగేశ్వరావు మాట్లాడుతూ విద్యార్థుల “భవిష్యత్తు” బాటకు తొలిమెట్టు పదవతరగతి అని, అత్యుత్తమ మార్కులను సాధించి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టాలని కోరారు. ఉత్తమ ఫలితం అన్ని సబ్జెక్టులలో 80 శాతం మార్కులు సాధించిన ప్రతి విద్యార్థికి ఉన్నత చదువుల నిమిత్తం ఐదువేల రూపాయల నగదును బహుమానంగా అందిస్తానని ఆయన వీడ్కోలు సభలో తెలిపారు. అనంతరం పలువురు ఉపాధ్యాయులు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించన తర్వాత విద్యార్థులకు హల్ టికెట్లతో పాటు పరీక్షా ఫ్యాడ్లు, పెన్నులు అందించారు. వీడ్కోలు సభలో విద్యార్థులు ఆట, పాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రవిలాదేవి, పిడి విద్యాసాగర్, ఉపాధ్యాయులు ఉమామహేశ్వరరావు, శంకర్, రామకృష్ణ, నాగేశ్వరావు, రత్నకుమారి పలువురు ఉపాధ్యాయుల బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ వార్షిక పరీక్షలు.

ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ వార్షిక పరీక్షలు

బాలానగర్ /నేటి ధాత్రి.

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈనెల 5వ తేదీ నుండి గురువారం వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. గురువారం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు రసాయన శాస్త్రం, వాణిజ్యశాస్త్రం పరీక్షలు జరిగాయి. మొత్తం 443 మంది విద్యార్థులకు గాను.. 4 గైర్హాజరు కాగా.. 439 మంది విద్యార్థులు హాజరయ్యారు. ప్రశాంతంగా పరీక్షలు జరగడంతో విద్యార్థులు కేరింతలు కొడుతూ.. ఆనంద వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సింగరేణి ఉన్నత పాఠశాలలో ఫేర్వెల్ డే పార్టీ వేడుకలు.

సింగరేణి ఉన్నత పాఠశాలలో ఫేర్వెల్ డే పార్టీ వేడుకలు

మందమర్రి నేటి ధాత్రి

Farewell Day Party

సింగరేణి ఉన్నత పాఠశాలలో 2024 /25 సంవత్సరానికి 10వ తరగతి పూర్తి చేసి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు 9వ తరగతి విద్యార్థులు వీడ్కోలు పలుకుతూ ఏర్పాటు చేసిన ఫేర్వెల్ డే పార్టీ వేడుకలు ఆనందోత్సవాల నడుమ ఘనంగా నిర్వహించారు.

మందమర్రి ఏరియాలోని సింగరేణి ఉన్నత పాఠశాల ఆవరణలో సీనియర్ విద్యార్థులకు 9వ తరగతి విద్యార్థులు బుధవారం ఏర్పాటు చేసిన వీడ్కోలు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన పాఠశాల కరస్పాండెంట్, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్ కు విద్యార్థులు పుష్పగుచ్చం అందించి ఘనంగా స్వాగతం పలికారు. ఇందులో భాగంగా పబ్లిక్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లు పెన్నులు హాల్ టికెట్లు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీనియర్ విద్యార్థులకు గౌరవాన్ని అందిస్తూ చదువు పూర్తి చేసుకుని పాఠశాలను వదిలి వెళుతున్న వారి కోసం ఏర్పాట్లు అభినందనీయమని కొనియాడారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల శిక్షణలో విద్యను అభ్యసించిన అందరూ పదవ తరగతి పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని ఆశాభవం వ్యక్తం చేశారు. పరీక్షల సమయంలో ఎలాంటి ఒత్తిడులకు లోను కాకుండా చదువు పైనే దృష్టి పెట్టి ఏకాగ్రతతో పరీక్షలు రాయాలని సూచించారు. సింగరేణి పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థుల కోసం సింగరేణి యాజమాన్యం కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా సౌకర్యాలతో పాటు ఉచితంగా పుస్తకాలు యూనిఫాం పంపిణీ చేస్తూ మధ్యాహ్న భోజనం కూడా కల్పిస్తుందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు పురుషోత్తం ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

అంగన్వాడి కేంద్రంలో ప్రీ స్కూల్ మేళా.

అంగన్వాడి కేంద్రంలో ప్రీ స్కూల్ మేళా

వీణవంక, (కరీంనగర్ జిల్లా ):నేటి ధాత్రి :

వీణవంక మండల పరిధిలోని కొండపాక గ్రామంలో అంగన్వాడి కేంద్రం- 2 ఫ్రీ స్కూల్ మేళ కార్యక్రమం నిర్వహించడం జరిగింది పిల్లలకు పౌష్టికాహారం అందించి ఆహాల్లదకరమైన వాతావరణంలో చిన్నారులకు ఆటలు పాటలతో డ్రాయింగ్, రంగు రంగుల బొమ్మలతో విద్యాబోధన చేపట్టారు తల్లిదండ్రులకు పిల్లలకు నేర్పించే అంశాల పై అవగాహన కల్పించడం జరిగింది 3 సంవత్సరాల వయస్సు నుండి నుండి 6 ఏళ్లలోపు పిల్లలకు నర్సరీ, ఎల్కేజీ,యూకేజీ,అంగన్వాడి స్కూల్ లో అయిపోగా ప్రేరణాత్మక బోధన అభ్యసించి అవగాహన కల్పిస్తున్నామని అంగన్వాడీ టీచర్ మా దేవి అన్నారు అంతేకాకుండా గర్భిణులకు బాలింతలకు పాలు గుడ్లు బాలామృతం మంచి పౌష్టిక ఆహారం అందజేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సెక్రటరీ రేణుక పాఠశాల, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ఏఎన్ఎం లు ఆశ వర్కర్లు, ఆయా స్వరూప తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు,పెన్నుల పంపిణీ..

నాగారం జడ్పీహెచ్ఎస్ విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు,పెన్నుల పంపిణీ

మెరిట్ మార్కులు సాధించి పాఠశాలకు,తల్లిదండ్రులకు మంచి పేరును తీసుకురావాలి

పరకాల నేటిధాత్రి

మండలంలోని నాగారం గ్రామంలో జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదివే విద్యార్థులకుటిఆర్ఎస్వి పరకాల మండల అధ్యక్షులు గొట్టే అజయ్ ఎగ్జామ్ ప్యాడ్స్ మరియు పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు రాయబోయే పరీక్షలలో మెరిట్ మార్క్స్ సాధించి పాఠశాలకు మరియు తల్లిదండ్రులకు గొప్ప పేరు తీసుకురావాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో పోతరాజు మనోజ్,అల్లే రాజ్ కుమార్ (మైఖేల్),బండారి రవికుమార్ మరియు పాఠశాల ఉపాధ్యాయురాళ్లు,ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.

విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ.

విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ

 

నడికూడ,నేటిధాత్రి:

మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ ఆధ్వర్యంలో నిర్వహించగా విద్యార్థులు ఉపాధ్యాయులు గా మారి తరగతి గదులలో విద్యాబోధన చేశారు. అనంతరం ఉపాధ్యాయులుగా ఉన్న విద్యార్థులు సమావేశంలో మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి అనేది సమాజంలో విలువలతో కూడుకొని ఉన్నదని,ఉన్నత మైనదని అన్నారు.గురువు లేని విద్య గుడ్డి విద్య అని కూడా అన్నారు.ఒక డాక్టర్, లాయరు,పోలీస్,కలెక్టర్, రాజకీయ నాయకులు, తయారు కావాలంటే గురువు దగ్గర చదువు తీసుకోవాల్సిందే అని అన్నారు.మేము ఒకరోజు ఉపాధ్యాయులుగా పని చేయడం ఎంతో గర్వంగా ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో స్వయం పరిపాలన దినోత్సవం లో ప్రధానోపాధ్యాయులుగా ముష్కే గగన్ వాల్మీకి, ఉపాధ్యాయులుగా సురుగుల నవ్య శ్రీ, శనిగరం చరణ్,కట్ల హిమాన్షు రెడ్డి,మామిడాల విశ్వతేజ రెడ్డి,దుబ్బాకుల వశిష్ట భార్గవ,తోకల నవనీత్ రెడ్డి,గోగుల జస్వంత్ రెడ్డి, కందికట్ల హర్షిత్,సోలంకి జస్మిత,గరిడే శ్రీనిత,తాళ్లపల్లి శ్రీనిధి,పూసాల అభిజ్ఞ, తాళ్లపల్లి శరణ్య, వ్యవహరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు లకావత్ దేవా,మేకల సత్యపాల్ రెడ్డి, అంగన్వాడీ టీచర్స్ బీముడి లక్ష్మీ,నందిపాటి సంధ్య ఐఆర్పి రమేష్ పాల్గొన్నారు.

ప్రైవేటు పాఠశాలలలో మౌలిక వసతుల జాడేది.?

ప్రైవేటు పాఠశాలలలో మౌలిక వసతుల జాడేది..?

తీరని విద్యార్థుల దాహం..!

నిబంధనలను బేకాతర్ చేస్తున్న ప్రైవేటు యాజమాన్యాలు

మౌలిక వసతులను పకడ్బందీగా అమలు చేయాలి

జిల్లా,మండల విద్యాశాఖ అధికారికి
సామాజిక కార్యకర్త కర్నె రవి వినతి

 

నేటి ధాత్రి! భద్రాద్రి జిల్లా

విద్యార్థుల నుంచి వేలకు వేల రూపాయలను ఫీజులుగా తీసుకుంటున్న ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులకు కనీస మౌలిక వసతుల కల్పన విషయంలో మాత్రం ఏం పట్టనట్లు వ్యవహ
రిస్తున్నారని, ప్రభుత్వ నిబంధనలు పాటించని ఆయా ప్రైవేట్ విద్యాసంస్థలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, విద్యార్థు
లకు కనీస సౌకర్యాలు కల్పించా
లని, సామాజిక కార్యకర్త కర్నె రవి
జిల్లా విద్యాశాఖ అధికారి కి వినతి పత్రం అందజేశారు. ఈ సంద
ర్భంగా ఆయన మాట్లాడుతూ..
విద్యార్థుల తల్లిదండ్రులను ఆకర్షించేందుకు రకరకాల పేర్లతో పినపాక నియోజకవర్గం లో ప్రైవేట్ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నా యాజమాన్యాలు
ఒలంపియాడ్, టెక్నో, డిజిటల్‌, ఇంటర్‌నేషనల్‌, ఫౌండేషన్‌ వంటి తోక పేర్లతో పాఠశాలలను ఏర్పా
టు చేస్తున్నారని, ఆరోపించారు. ఇలాంటి స్కూల్ లను నిర్వహించ
వద్దని ప్రభుత్వం పలుమార్లు ఆదేశాలు కూడా ఇచ్చింది. కానీ తమను ఆపేది ఎవరన్నట్టు… పలు ప్రైవేటు బడుల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా ముందుకెళ్తున్నా
యన్నారు.ఓవైపు యథేచ్చగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలు…. విద్యార్థులకు కనీస వసతలు కల్పించడంలో విఫలమ
వుతున్నాయని, అగ్రహం వ్యక్తం చేశారు.ప్రైవేటు బడుల నిర్వహణ విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ ఆశించిన మేర అమలు కావటం లేదన్నారు.ఇంగ్లీషు మీడియంపై మోజు, కార్పొరేటు స్కూళ్లపై వ్యామోహంతో తమ బిడ్డల భవిష్యత్ బాగుండాలని ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పిస్తున్న తల్లిదండ్రు
లకు కన్నీరే మిగులుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పీజుల పేరుతో లక్షలు కుమ్మరిస్తున్నా సౌకర్యాలు మాత్రం కరువయ్య
యన్నారు. కోన్ని ప్రైవేట్ పాఠశాల
ల్లో విద్యార్థుల దాహం తీరడం లేదని, పాఠశాలల్లో సౌకర్యాలు మేడిపండు చందంగా ఉన్నాయని పేర్కొన్నారు.రోజంతా బడిలో గడిపే ఆడిపాడే విద్యార్థులకు ఇంటి నుంచి తెచ్చుకునే లీటరు మంచినీరు ఏ మాత్రం చాలడం లేదని,దీంతో పాఠశాలల్లో ఉన్న చేతిపంపులు, కుళాయిలు, వాటర్‌ ట్యాంకుల్లో రక్షితం కాని నీటినే తాగుతున్నారని,దీంతో విద్యార్థు
లు పలు మార్లు జబ్బుల బారిన ఘటనలు ఉన్నాయన్నారు. ఒకవైపు వేసవితో మండే ఎండలు
ఇరుకైన గదులలో విద్యార్థులకు
వేడినీరే ఆధారమవుతుందని, సౌకర్యాలు కల్పించాల్సిన ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు కనీసం స్పందించకుండా కూల్ వాటర్ ను కూడా అందుబాటులో ఉంచకుండా విద్యార్థుల జీవితాల
తో చెలగాటమాడుతున్నాయన్నా
రు.ప్రైవేటు పాఠశాలలలో మౌలిక వసతుల జాడే మచ్చుకైనా కనిపించడం లేదని ధ్వజమెత్తారు.
చాలా ప్రైవేటు పాఠశాలలకు సరైన భవనాలు ఉండటం లేదని,
అద్దెకు భవనాలతో గాలి, వెలుతు
రు కూడా సరిగా లేని బడులు చాలాచోట్ల దర్శనమిస్తున్నాయని,
కొన్ని బడులకు ఫైర్ సెఫ్టీ కూడా లేదని, ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరని ఆయన ప్రశ్నించారు. ప్రతి ప్రవేట్ పాఠశాలలో బిల్డింగ్ నిర్వహణ నుంచి టీచర్ల జీతాల వరకు ఏ విషయం తీసుకున్నా…. లోపాల పుట్ట బయటపడే పరిస్థితులు ఉన్నాయన్నారు. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి ప్రైవేట్ పాఠశాలలలో తనిఖీలు చేపట్టాలని, విద్యార్థులకు కనీస మౌలిక వసతులను కలిపించాలని కర్నెరవి డిమాండ్ చేశారు.

ఉన్నత ఉద్యోగానికి ఎంపిక..!

‘దూర విద్యలో చదివి.. ఉన్నత ఉద్యోగానికి ఎంపిక’

కల్వకుర్తి /నేటి ధాత్రి

కల్వకుర్తి మండలం తర్నికల్ గ్రామానికి చెందిన తాళ్ల శివలీల గృహిణిగా ఉంటూ.. బీఆర్ అంబేద్కర్ ఓపెన్ దూరవిద్యలో డిగ్రీ పూర్తి చదివింది. అనంతరం కల్వకుర్తిలో బీఈడీ పూర్తి చేసింది. భర్త తాళ్ల రాజేందర్ ప్రోత్సాహంతో హైదరాబాదులో ఉంటూ.. శిక్షణ తీసుకొని ప్రిపేర్ అయింది. మూడు రోజుల క్రితం వెలుబడిన హాస్టల్ వెల్ఫేర్ ఫలితాలలో ఉద్యోగం సాధించింది. ఆమెకు ఇద్దరు పిల్లలు. అబ్బాయి వరుణ్ గౌడ్ అమెరికాలో ఏం.ఎస్ చదువుతుండగా.. కూతురు పూజిత హైదరాబాదులో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. గృహిణిగా ఉంటూ.. ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపిక కావడంతో.. పలువురు అభినందనలు తెలిపారు.

సునీత విలియమ్స్ కు ప్లైకార్డులతో స్వాగతం.!

సునీత విలియమ్స్ కు ప్లైకార్డులతో స్వాగతం పలికిన విద్యార్థులు

వరంగల్/నర్సంపేట,నేటిధాత్రి:

Students

భారతీయ సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్ సురక్షితంగా భూమిమీదకు చేరిన సందర్భంగా వరంగల్ జిల్లా గీసుగొండ మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ విద్యార్ధులు ప్లైకార్డ్స్ తో స్వాగతం పలికారు.ఈకార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులతో పాటు పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఎం.పట్టాభి, ఉపాద్యాయలు విటోభా,పద్మ, అరుణశ్రీ, వెంకట్రావు, శ్రీనివాస్, జ్యోత్స్నప్రభ,రవిచందర్, సబిత, ప్రవళిక , బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. ఈసందర్భంగా పాఠశాల హెడ్మాస్టర్ పట్టాభి మాట్లాడుతూ 9 నెలల 288 రోజుల సుధీర్ఘ కాలం వివిధ పరిశోధనల నిమిత్తం అంతరిక్షంలో ఉండి, దిగ్విజయవంతంగా తిరిగి భూమిపైకి చేరుకున్న సునీత విలియమ్స్ మన భారత సంతతికి చెందినవారు కావడం మనందరి గర్వకారణం అని పేర్కొన్నారు. ఆమె స్ఫూర్తితో తమ పాఠశాల విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకొని ప్రపంచ స్థాయి గుర్తింపు పొందాలని పిలుపునిచ్చారు.

Students
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version