*ఏపీఎంఎఫ్ ప్రధాన కార్యదర్శి ఢిల్లీ బాబు రెడ్డి పోరాటం ఫలితం..
*త్వరలోనే రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టులకు కొత్త అక్రిడేషన్ కార్డులు..
*జర్నలిస్టుల అక్రిడేషన్ మంజూరుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం..
*సీఎం నారా చంద్రబాబు నాయుడు కు ధన్యవాదాలు తెలిపిన ఢిల్లీ బాబు రెడ్డి..
తిరుపతి(నేటి ధాత్రి) ఆగస్టు 05:
రాష్ట్రంలో ఉన్న వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ త్వరలోనే కొత్త అక్రిడేషన్ కార్డులు ఇస్తామని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి హామీ ఇచ్చారు. దీనికి సంబంధించిన ప్రక్రియ అంతా పూర్తయిందని త్వరలోనే కొత్త అక్రిడేషన్ కార్డులు మంజూరు చేస్తామని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఢిల్లీ బాబు రెడ్డి జర్నలిస్టుల అక్రిడేషన్ సమస్యను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి పలు సందర్భాల్లో చర్చించారు. రాష్ట్రంలోని జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని అక్రిడేషన్ త్వరగా మంజూరు చేయాలని పలుమార్లు ముఖ్యమంత్రికి వినతి పత్రాలు సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల డిమాండ్స్ డే జరిగింది. ఈ సందర్భంగా విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి పార్థసారధిని ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఢిల్లీ బాబు రెడ్డి పలువురు జర్నలిస్టులు మంత్రిని కలిసి వినతి పత్రం అందజేశారు, ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ తమ ప్రభుత్వం జర్నలిస్టుల విషయంలో పూర్తి సానుకూలతతో ఉందని, జర్నలిస్టుల సమస్యల పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సానుకూల దృక్పథంతో ఉన్నారని అన్నారు. జర్నలిస్టుల జర్నలిస్టుల సమస్యలన్నిటిని పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల విషయ క్యాబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.గత ప్రభుత్వం ఇచ్చిన అక్రిడేషన్లను ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం పొడిగిస్తూ వచ్చిందన్నారుఅర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని, విశ్రాంతి జర్నలిస్టులకు పెన్షన్ పథకాన్ని అమలు చేయాలని ,ప్రమాద బీమా పథకాన్ని పునరుద్ధరించాలని, ఇతర పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని మంత్రికి వినతి పత్రం వినతి సమర్పించారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించి సమస్యలన్నిటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ పోరాట ఫలితంతో రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ మంజూరుకు క్యాబినెట్ ఆమోదం తెలపడంతో ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఢిల్లీ బాబు రెడ్డి హర్షం వ్యక్తం చేశారు..