అమ్మ పాలు అమృతంతో సమానం
బిడ్డకు తల్లిపాలే మొదటి టీకా
*తల్లిపాల వారోత్సవంలో..తహసిల్దార్ జాలీ సునీతా
మొగులపల్లి నేటి ధాత్రి
బిడ్డకు తల్లిపాలే మొదటి టీకా అని, జీవితాంతం బిడ్డను పలు వ్యాధుల నుంచి తల్లిపాలు రక్షిస్తాయని మొగుళ్ళపల్లి తహసిల్దార్ జాలీ సునీతా రెడ్డి చెప్పారు. బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా..మండల కేంద్రంలో అంగన్వాడీ టీచర్ల ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు రజిత, వెన్నెల, శ్రీమత, సప్న , ఆశా వర్కర్లు సుమలత, స్వప్న మరియు తల్లులతో కలిసి తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి మండల తహసీల్దార్ జాలీ సునీతా రెడ్డి వారిని ఉద్దేశించి మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాలు మనదేశంలో పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు తాగుతున్న పసికందులు కేవలం 4 శాతం మాత్రమేనని ఇదే పొరుగున్న బంగ్లాదేశ్లో 92 శాతం అని గుర్తు చేశారు. ప్రపంచంలో తల్లిపాలకు ప్రత్యామ్నాయం లేదని, తల్లిపాలు అత్యంత విశిష్టమైనవన్నారు. బిడ్డకు తల్లిపాలు పడితే అటు బిడ్డ, ఇటు తల్లి, అనేక వ్యాధుల నుంచి విముక్తులవుతారని చెప్పారు. బిడ్డ పుట్టిన మొదటి గంటలో తల్లి నుంచి వచ్చే మురుపాల అమృతంతో సమానమని, బిడ్డను భవిష్యత్తులో షుగర్, అధిక బరువు, ఆస్తమా, వంటి రోగాల నుంచి కాపాడుతాయన్నారు. తల్లిపాలు బిడ్డ ఎంత ఎక్కువ కాలం తాగితే అంత బాగా తెలివితేటలు వృద్ధి చెందుతాయని వివరించారు, తల్లిపాలు ముద్దు..డబ్బా పాలు వద్దు అని చెప్పారు.