సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
◆:- ఎస్సై ఎం. కాశీనాథ్
◆:- విద్యార్థులకు అవగాహన సదస్సు
జహీరాబాద్ నేటి ధాత్రి:
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని జహీరాబాద్ గ్రామీణ ఎస్సై ఏం కాశీనాథ్ యాదవ్ అన్నారు. బుధవారం జహీరాబాద్ మండల పరిధిలోని హోతి-కే లో గల తెలంగాణ గురుకుల బాలికల పాఠశాల,కళాశాలలో ప్రిన్సిపల్ ఎ. సురేఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై విద్యార్థుల ఉద్దేశించి మాట్లాడుతూ… సైబర్ నేరాలపై ప్రతీ ఒక్కరు అవగాహన కల్గి ఉండాలని, అపరిచితుల నుంచి ఎస్ఎంఎస్,ఈమెయిల్,వాట్సప్ ద్వారా వచ్చే బ్లూ కలర్ లింక్ను క్లిక్ చేస్తే,మీ మొబైల్లోని డేటా మొత్తం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి పోతుందని,
గుడ్ టచ్,”బ్యాడ్ టచ్, స్వీయ రక్షణ, బాల్య వివాహాలు, తెలియని వయసులో ప్రేమ, ఆకర్షణ, సోషల్ మీడియాలో పరిచయాలు, ఆన్లైన్ వేధింపులు, ప్రేమ పేరుతో వలవేసి చేసే ఆర్థిక, శారీరక, మానసికంగా ఇబ్బందులు, మహిళలపై జరుగుతున్న నేరాలు, ఈవ్ టీజింగ్, మరియు చట్టాలపై కూడా విద్యార్థినులకు అవగాహన కల్పించారు.డిజిటల్ అరెస్టులంటూ ఎవరైనా ఫోన్ ద్వారా బెదిరిస్తే ఎలాంటి ప్రలోభాలకు, భయాలకు గురికాకుండా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.
సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 కు కాల్ చేయాలన్నారు.
అవగాహన తోనే సైబర్ నేరాల బారిన పడకుండా ఉండగలమని, కావున ప్రతి ఒక్కరూ సైబర్ నేరాల పట్ల అవగాహన ఏర్పరచుకొని సైబర్ నేరాల బారిన పడకుండా జాగ్రత్త వహించాలని విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఏటిపి జి. రాజ్యలక్ష్మి, పాఠశాల కళాశాల,ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొని విజయవంతం చేశారని ప్రిన్సిపల్ తెలిపారు.