బీసీలకు దగ్గరౌతున్న కాంగ్రెస్‌

`దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌లో సరికొత్త మార్పు

`బలమైన బీసీ నాయకులు లేకనే పదేళ్లుగా తిప్పలు

`బీసీ రిజర్వేషన్ల అంశంతో మరింత దూకుడు

`అన్ని రాష్ట్రాలలో వస్తున్న కదలికలు

`తెలంగాణలో బీసీ కుల గణనతో పడిన అడుగులు

`ఒకప్పుడు బీసీలు కాంగ్రెస్‌ వెంటే!

`బీసీలను తన వైపు తిప్పుకున్న బీజేపీ

`నరేంద్ర మోడీ ప్రదాని కావడంతో మరింత బీసీ.పోలరైజేషన్‌

`ఇప్పుడిప్పుడే బిజేపి నుంచి దూరమౌతున్న బీసీలు

`కాంగ్రెస్‌ నిర్ణయాలతో మళ్ళీ కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారు

`బీసీలంతా ఏకమైతే కాంగ్రెస్‌ కు మళ్లీ పూర్వపు రోజులు

`ఆ దిశగా అడుగులు వేస్తున్న రాహుల్‌ గాంధీ

`తెలంగాణ నుంచి బలంగా మొదలైన బీసీ గళం

`సీఎం. రేవంత్‌ రెడ్డి వల్ల బిసిల రిజర్వేషన్‌ అంశం

`అన్ని పార్టీలలో మొదలైన చలనం

`బీసీ జెండాలు మోయడానికి అన్ని పార్టీలు సిద్ధం

`రేవంత్‌ రెడ్డి రాజకీయ వ్యూహం

`ప్రతిపక్షాలకు దిక్కు తోచని పద్మ వ్యూహం                                             హైదరాబాద్‌,నేటిధాత్రి:   

 ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కొవాలి. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ అధికారానికి దూరం కావడానికి ప్రధాన కారణం బిసిలు. ఈ విషయం కాంగ్రెస్‌ పార్టీ ఇంత కాలానికి గుర్తించింది. అందుకే మళ్లీ దేశంలో పూర్వ వైభవం కోసం గట్టిగా ప్రయత్నం చేస్తోంది. బిసిలను మరింత దగ్గర చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించింది. దేశ వ్యాప్తంగా వస్తున్న రాజకీయ మార్పుల్లో భాగంగా రాను రాను కాంగ్రెస్‌ బిసిలకు కొంత దూరమౌతూ వచ్చింది. ఒకప్పుడు పేదలు, బడుగుల పార్టీ అంటే కాంగ్రెస్‌ అనే పేరు వుంది. ముఖ్యంగా దళితులు, గిరిజనులు ఇప్పటికీ కాంగ్రెస్‌ పార్టీనే నమ్ముతున్నారు. బలమైన ఓటు బ్యాంకుగా కాంగ్రెస్‌ పార్టీకి వున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పటికీ దళిత, గిరిజన ప్రజలకు ఇందిరమ్మ నామమే జపిస్తారు. అంటే కాంగ్రెస్‌కు మాత్రమే ఓట్లు వేస్తారు. ఆ ఓటు బ్యాంకును ఇప్పటి వరకు ఎవరూ ఒక్క శాతం కూడా కదిలించలేకపోయారు. ఇది దేశంలోని చాలా రాష్ట్రాల్లోనూ ఇప్పటికీ ఆ రెండు వర్గాలు కాంగ్రెస్‌కు అండగా వుంటూ వస్తున్నారు. అంతే కాకుండా ముస్లిం, మైనార్టీలు కూడా కాంగ్రెస్‌కు బలమైన ఓటు బ్యాంకుగా వుంది. అయితే ఎప్పుడైతే దేశంలో బిజేపి బలపడుతూ వచ్చిందో అప్పటి నుంచి మెల్లిగా బిసిలు కాంగ్రెస్‌కు దూరమౌతూ వచ్చారు. అందుకు అనేక కారణాలున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్‌ ఎస్పీ, ఎస్టీ, ముస్లిం, మైనార్టీల ఓట్లకే అధిక ప్రాదాన్యతనిస్తుందన్న ప్రచారం బిజేపి బాగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగింది. అంతే కాకుండా మెజార్టీ ప్రజల ఓట్లను కాదని, కేవలం అధికారం కోసం కాంగ్రెస్‌ మైనార్టీల ఓట్లకోసమే తపిస్తుందంటూ విపరీతమైన ప్రచారం సాగిస్తూ వచ్చారు. దానిని ప్రజలు కూడా క్రమంగా నమ్ముతూ వచ్చారు. బిసిలకు, మధ్యతరగతి ప్రజలకు అండగా బిజేపివుంటుందన్న నమ్మకాన్ని కల్పిస్తూ వచ్చారు. అంతే కాకుండా బిసిలలో వుండే దైవం మీద నమ్మకాన్ని మరింత పురిగొల్పుతూ వచ్చారు. సనాతన ధర్మం వైపు బిసిలను అడుగులు వేయించారు. 2014లో అధికారంలోకి వచ్చే వరకు బిజేపి బలంగా బిసి జపం చేసింది. దానితోపాటు మెజార్టీ ప్రజల మీద మైనార్టీ ప్రజల దాడుల గురించి పదే పదే ప్రస్తావిస్తూ వచ్చేవారు. క్రమంగా సనాతన ధర్మాన్ని బలంగా విశ్వసించే బిసిలను కాంగ్రెస్‌కు దూరం చేస్తూ వచ్చారు. దేశ వ్యాప్తంగా బిజేపి అనేక రాష్ట్రాలలో పాగా వేసే దాకా వచ్చారు. దేశంలో వరుసగా బిజేపి మూడు సార్లు కేంద్రంలో అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం బిసిలు. ఉత్తరప్రదేశ్‌ లాంటి రాష్ట్రాలలో ఏడు సార్లు వరసగా బిజేపి అధికారంలోకి వచ్చింది. మహారాష్ట్రలో వరసగా మూడుసార్లు, ఆఖరుకు హర్యానా లాంటి రాష్ట్రంలో కూడా మూడుసార్లు, మధ్య ప్రదేశ్‌లో ఐదుసార్లు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రికార్డులు సృషిస్తూ వచ్చింది. ఇదంతా బిసి ప్రజల పుణ్యమే అన్నది ఇప్పుడు కాంగ్రెస్‌కు అర్దమౌతోంది. కేవలం బిజేపి మత రాజకీయమే అనుకుంటున్నారు కాని, బిసిల బలం విపరీతంగా తోడు కావడంతో బిజేపి ఎక్కడిక్కడ పెరుగుతూ వచ్చింది. అయితే ఎప్పుడైతే రాహుల్‌ గాంధీ బిసి గణన జరిపించాలని డిమాండ్‌ చేశారో బిజేపి అసలు రూపం బైట పడిరది. బిసి ముసుగు రాజకీయాన్ని బిజేపి ఎంత చాకచక్యంగా సాగిస్తోందన్నది దేశ ప్రజలకు కూడా అర్ధమైపోయింది. బిజేపి కన్నా బిసిలకు మేలు చేసింది కాంగ్రెస్‌ పార్టీయే అన్న నిజం ఇప్పుడిప్పుడే ప్రజలు తెలుసుకుంటున్నారు. కాంగ్రెస్‌ దేశంలో, రాష్ట్రాలలో అధికారంలో వున్నప్పుడు ఎస్సీ, ఎస్టీ రుణాలతోపాటు, బిసి యువతకు కూడా పెద్దఎత్తున రుణాలు ఇస్తూ వచ్చేవారు. వాటి స్ధానంలో బిజేపి ముద్రా రుణాలు అంటూ రకరకాల పేర్లతో తెచ్చిన రుణాలు ఎవరికి అందుతున్నాయో? అర్ధం కాని పరిస్దితి ఎదురౌతోంది. కొన్ని లెక్కల ప్రకారం బిజేపి కేంద్ర ప్రభుత్వం తరుపున ఇస్తున్న రుణాలన్నీ ఓసిలకే చెందుతున్నాయన్న నిజాలు కూడా బైటపడుతున్నాయి. . అంటే బిజేపి ఓట్ల కోసం బిసిలను, లాభపడేందుకు ఓసిలను ఎంచుకుంటుందన్న సత్యం వెలుగులోకి వస్తుంది. అంతేకాకుండా బిజేపిలో పెత్తనమంతా ఓసిలది, రాజకీయంగా ఓట్లు మాత్రం బిసిలవి అనే విషయం కూడా తేటతెల్లమౌతూ వస్తోంది. అందుకే ప్రజలు ప్రత్యామ్నాయం వైపు చూసే క్రమంలో కాంగ్రెస్‌ మళ్లీ అందుకున్నది. బిసిలను దగ్గర చేసుకోవాలన్న ఆలోచన చేసింది. ముఖ్యంగా రాహుల్‌ గాంధీ దేశ మంతటా బిసి గణన జరగాలి. బిసిలకు ఈ దేశంలో జరగాల్సినంత న్యాయం జరగలేదని ప్రకటించారు. అన్ని వర్గాలకు ఎంతో కొంత న్యాయం జరిగినా, బిసిలకు జనాభా ప్రాతిపదికన అందాల్సిన న్యాయం అందలేదన్నది బలంగా రాహుల్‌ గాందీ ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇదే సమయంలో తెలంగాణ ఎన్నికల మందు ఒక ప్రయోగం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే, బిసి డిక్లరేషన్‌ అమలు చేస్తామని ప్రకటించారు. సిఎం. రేవంత్‌ రెడ్డి ఈ విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ప్రజల బలంగా నమ్మేలా చేశారు. ఎక్కడికెళ్లినా ముందు బిసి డిక్లరేషన్‌ గురించి గట్టిగాచెప్పుతూ వచ్చారు. ఉద్యోగ, రాజకీయ రంగాలలో బిసిలకు తగిన ప్రాధాన్యత దక్కాలని సూచిస్తూ వచ్చారు. అది కాంగ్రెస్‌ వల్లనే సాద్యమౌతుందని అంటూ వచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ప్రేభుత్వం వచ్చిన వెంటనే 42శాతం రిజర్వేషన్‌ ఉద్యోగ, రాజకీయ రంగాలలో వెంటనే అమలు చేస్తామన్నారు. కాకపోతే ఇంత తిరకాసు వుంటుందని ఏ రాజకీయ పార్టీ చెప్పదు. కాని ఒక ప్రయత్నం చేయడం ఎంతోముఖ్యం. కాంగ్రెస్‌పార్టీ ఇచ్చిన 42శాతం హమీని ప్రతిపక్షాలు కూడా కాదని చెప్పలేని పరిస్ధితుల్లోకి వెళ్లిపోయాయి. దాంతో కాంగ్రెస్‌కు బిసిల మద్దతు విపరీతంగా పెరిగింది. రాష్ట్రంలో రేవంత్‌ సర్కారు ఏర్పాటుకు మార్గం సుగమమైంది. అయితే కాంగ్రెస్‌ ఈ పదేళ్ల కాలంలో బలహీన పడుతూ రావడానికి బలమైన బిసి నాయకులు కూడా లేకపోవడం ఒక కారణమనే చెప్పాలి. అది దేశ వ్యాప్తంగా ఆ లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఎంత ఓసి నాయకులు వున్నా, ముందు వరసులో వుండాల్సిన బిసి నాయకులు కూడా చాలా మంది అవసరం. గత రెండు దశాబ్దాలుగా కాంగ్రెస్‌కు బిసిలు దూరమౌతూ వస్తుండడడంతో పాత తరం కనుమరుగైపోయింది. కొత్త తరం కాంగ్రెస్‌లో లేకుండాపోయింది. మొత్తంగా బిసి నాయకత్వం బలంగా లేకుండాపోయింది. ఇప్పుడు ఆ లోటును పూడ్చితే కాంగ్రెస్‌కు వచ్చే మరో ముపై ఏళ్లు దేశంలో తిరుగులేని శక్తిగా మారుతుందని చెప్పడంలో సందేహం లేదు. తెలంగాణలో ఒక అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తే దేశమంతా తెలంగాణ వైపు చూడడమే కాకుండా, కాంగ్రెస్‌ వైపు చూస్తారు. కాంగ్రెస్‌ను బిసిలంతా బలపర్చుతారు. అందుకే ఆ అడుగు తెలంగాణ నుంచి కాంగ్రెస్‌పార్టీ వేస్తోంది. ముందుగా తెలంగాణలో ఆ ప్రచారం సక్సెస్‌ అయ్యింది. అందులో భాగంగా బిసి గణన కూడా విజయవంతంగా పూర్తయ్యింది. దేశానికే ఆదర్శమైంది. ఆఖరుకు మొన్నటిదాక బిసి గణనకు ససేమిరా? అన్న బిజేపి కూడా కాంగ్రెస్‌ డిమాండ్‌కు తలొగ్గింది. ఇండియా కూటమి నుంచే కాకుండా ఎన్డీయే కూటమిలో వున్న బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ కూడా బసి గణన చేయాలని పట్టుపట్టారు. ఆ రాష్ట్రంలో పూర్తి చేశారు. దాంతో ఎన్టీయే కూడా కదలక తప్పలేదు. బిజేపి ఒప్పుకోక తప్పలేదు. ఇది ఒక రకంగా కాంగ్రెస్‌ విజయమే అయినా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చొరవ ఎంతో వుందని చెప్పడంలో సందేహం లేదు. ఒక వేళ రేవంత్‌ రెడ్డికి చిత్తశుద్ది లేకపోతే బిసి గణన ఏదో తూతూ మంత్రంగా చేపట్టేవారు. కాని ఆయన అనేక విమర్శలను కూడా ఎదుర్కొన్నారు. అన్ని విమర్శలు ఆయన ఎదుర్కొవాల్సిన అవసరం లేదు. కాని ప్రజలకిచ్చిన మాట మేరుకు అడుగులు వేస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే రేవంత్‌ రెడ్డి లేకుంటే తెలంగాణలో బిసి మాటే లేదు. బిసిలకు 42శాతం రిజర్వేషన్‌ అనే ఆలోచనే లేదు. అలాంటి చైతన్యమే ఇప్పుడు వచ్చేది కాదు. బిసిల కోసం మిగతా ఏ పార్టీలు అనసరించేవి కాదు. అన్ని పార్టీలు బిసి మంత్రాన్ని జపించేవే కాదు. ఇప్పుడు కాంగ్రెస్‌పార్టీయే కాదు, అన్ని పార్టీలు బిసి ఎజెండా ఎత్తుకోకుండా మనుగడ సాధించే పరిస్దితి లేదు. ఇంతా సిఎం. రేవంత్‌ రెడ్డి పుణ్యమే అని చెప్పాలి.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version