సైబర్ నేరాల గురించి అప్రమత్తంగా ఉండండి
జహీరాబాద్ నేటి ధాత్రి:
గారెడ్డి , సైబర్ జాగ్రుకత దివాస్ సందర్భంగా –జిల్లా వ్యాప్తంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు..
•:- సైబర్ నేరాల గురించి అవగాహన కలిగి, అప్రమత్తంగా ఉందండండి..
•:- సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీ ఎన్.వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జహీరాబాద్ ఆచార్య డిగ్రీ కళాశాల విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం..
సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శికాగోయల్ ఐపిఎస్ ఆదేశాలనుసారం, జిల్లా ఎస్పీ శ్రీ పరితోష్ పంకజ్ ఐపిఎస్. సూచనల మేరకు ఈ రోజు తేది: 06.08.2025 ఆగస్టు నెల మొదటి బుధవారాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా సైబర్ జాగ్రుకత దివాస్ పేరుతో అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది అన్నారు. సైబర్ సెల్ డీఎస్పీ ఎన్.వేణుగోపాల్ రెడ్డి, జహీరాబాద్ పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో జహీరాబాద్ పట్టణంలోని ఆచార్య డిగ్రీ కళాశాల విద్యార్థులకు
•:- వ్యాపారాలలో, పెట్టుబడి మోసాలు – పార్ట్ టైం జాబ్ స్కామ్స్..
•:- ఐడెంటిటీ థెఫ్ట్ – అక్రమ క్రెడిట్ కార్డ్ వాడకం..
•:- లోన్ మోసాలు – నకిలీ లోన్ యాప్స్ & ఆర్థిక ఉచ్చులు..
•:- ప్రకటన మోసాలు – ఆన్‌లైన్‌లో వస్తువులు / సేవలు అందకపోవడం..
•:- ఆన్‌లైన్ భద్రత చిట్కాలు – డిజిటల్ ప్రపంచంలో మీరే మీ రక్షకులు.. అనే అంశాల పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా డిఎస్పీ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. సైబర్ నేరాలు అనేవి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఎదురుకుంటున్న సమస్య అని, సైబర్ నేరాల నుండి బయటపడాలంటే అవగాహన ముఖ్యం అన్నారు. అత్యాశకు పోయి సైబర్ నేరగాళ్లు పన్నిన వలలో పడవద్దన్నారు. సైబర్ నేరాలకు గురిఅవుతున్న వారిలో విధ్యావంతులే అధికం అని, మల్టీ లెవెల్ మార్కెటింగ్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, వంటి ఆన్లైన్ మోసాల పట్ల అవగాహ కలిగి ఉండాలని, మొదట డబ్బులు వస్తున్నట్లు ఆశ చూపించి, ఆతర్వాత ఆన్లైన్ మోసాలకు పాల్పడతారని గుర్తించాలన్నారు. ఏ పోలీసు అధికారి ఎంక్వైరీ పేరుతో నేరుగా వాట్స్ ఆప్ వీడియో కాల్స్ చేయరాని, డిజిటల్ అరెస్ట్ అని కాల్స్ వస్తే నమ్మరాదని అన్నారు. అనుమానిత ఫోన్ నెంబర్ల నుండి కాల్స్ వస్తే సంబంధిత పోలీసు స్టేషన్ లో సమాచారం అందించాలని లేదా సైబర్ క్రైమ్ పోర్టల్ నందు రిపోర్ట్ చేయాలని సూచించారు. అమాయక ప్రజల బాలహీనతే, సైబర్ నేరాగాళ్ల బలంగా.. వివిధ రకాల సైబర్ మోసాలకు పాల్పడుతున్నారన్నారు. ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్సీ అందుబాటులోకి వచ్చిన ఈ రోజుల్లో టెక్నాలజీని వాడుకొని మరిన్ని సైబర్ మోసాలు చేయడానికి అవకాశం ఉందని, సైబర్ నేరాల గురించి ప్రతి ఒక్కరు అవగాహన కలిగి, అప్రమత్తంగా ఉన్నప్పుడే సైబర్ నేరాల నుండి బయటపడవచ్చని అన్నారు. ఎవరైనా సైబర్ నేరాలకు గురి అయినట్లైతే వెంటనే (గోల్డెన్ అవర్)/48 గంటలలోపు 1930 కు యన్.సి.ఆర్.బి. (https://www.cybercrime.gov.in) పోర్టల్ నందు కాంప్లయింట్ నమోదు చేయాలని సూచించారు.
సైబర్ జాగ్రుకత దివాస్ కార్యక్రమంలో ఆచార్య డిగ్రీ కళాశాల నుండి సుమారు 600 మంది విద్యార్థులు పాల్గొనగా, విద్యార్థిని, విద్యార్థులకు క్విజ్ మరియు రాత పరీక్ష నిర్వహించి, విజేతలుగా నిలిచిన కె. వెంకటేశ్, ఎం. నాగేశ్వరి నవ్యశ్రీ లకు ప్రశంసా పత్రాలు శీల్డులు అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జహీరాబాద్ టౌన్ ఎస్ఐ వినయ్ కుమార్, చిరాగపల్లి ఎస్ఐ రాజేందర్ రెడ్డి, ఆచార్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ హరికుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి D4C, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.