నరకయాతన… కంకర రోడ్లపై ప్రయాణం..!

నరకయాతన… కంకర రోడ్లపై ప్రయాణం..!

#అన్నదాతలకు, ప్రజలకు తప్పని తిప్పలు.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

మండల ప్రజలకు, అన్నదాతలకు కంకర రోడ్లతో కష్టాలు తప్పడం లేదు. గ్రామీణ ప్రాంతాలను అనుసంధానం చేస్తూ మండల వ్యాప్తంగా పలు లింకు రోడ్లకు గత ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరు చేయగా కాంట్రాక్టర్లు టెండర్లు దక్కించుకొని కొంత మేరకు పనులు చేపట్టారు. అనంతరం సాధారణ ఎన్నికలు రావడంతో ప్రభుత్వం మారి పనులు నిలిచిపోయాయి. దీంతో కంకర తేలిన రోడ్లపై అన్నదాతలు, ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. నడక సైతం నరకప్రాయంగా మారిన దుస్థితి నెలకొంది. మండలంలోని గుండ్ల పహాడ్ నుండి మేడేపల్లి వరకు, నారక్క పేట నుండి నర్సంపేట మండలం రామ్ నగర్ వరకు, ముచింపుల నుండి నందిగామ వరకు, నల్లబెల్లి ఆర్ అండ్ బి రోడ్డు నుండి అనుములోని పల్లె వరకు, కొండాలపల్లి నుండి గుంటూరు పల్లె వరకు అక్కడి నుండి పెద్ద చెరువు కట్ట చివరి వరకు. తారు రోడ్ల నిర్మాణం కోసం 2023 జనవరిలో ఎం ఆర్ ఆర్ గ్రాంటు కింద నిధులు మంజూరు అయ్యాయి. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఫార్మేషన్ పూర్తి చేసి కంకర వేసి తొక్కించారు. ఆ సమయంలోనే సాధారణ ఎన్నికలు రాగా పనులు ఆపివేశారు. అనంతరం కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో అప్పటి నుండి రెండేళ్లగా కంకర తేలిన రోడ్లపైనే రైతులు, ప్రజలు ప్రయాణం సాగించలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. కంకరపై నడవవలసి వస్తుండడంతో దుక్కి టేద్దులు కాళ్లు పగిలిపోయి అనారోగ్యం పాలవుతున్నాయి. పలుమార్లు కాళ్లకు రక్త గాయాలైన కొన్ని దుక్కి టేద్దులు కంకర రోడ్లపైకి తీసుకువస్తే బెంబేలెత్తి పారిపోతున్న దుస్థితి చోటుచేసుకుంది. రోడ్ల పనులు పూర్తి చేయడంలో కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం, సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడం లేదన్న అపవాదు ఉంది. ఏది ఏమైనాప్పటికీ కంకర రోడ్లపై తక్షణమే తారు రోడ్డు నిర్మాణం చేపట్టే విధంగా ఎంపీ, ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ లు ప్రత్యేక చొరవ తీసుకొని పనులు కొనసాగేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

#సకాలంలో బిల్లులు చెల్లిస్తే పనులు పూర్తి చేస్తాం.
కాంట్రాక్టర్లు ఫార్మేషన్, కంకర పనులు పూర్తి చేయగా బీటీ పనులు మాత్రమే మిగిలాయి. బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతోనే పనులు నిలిపివేశామని కాంట్రాక్టర్లు ప్రశ్నిస్తున్నారు. సమస్యను పై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి తదుపరి ఆదేశాల మేరకు పనులను పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.

రజనీకాంత్, స్పెషల్ ఏఈ, పిఆర్ శాఖ.

ఆసియా ఖండంలోనే అరుదైన రోడ్డుకు….!

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-27-2.wav?_=1

ఆసియా ఖండంలోనే అరుదైన రోడ్డుకు….!

ఇదేమి దుస్థితి!

◆:- అత్యంత పెను ప్రమాదకరంగా గంగ్వార్ ప్రధాన కూడలి

◆:- తరచూ ప్రమాదాల బారిన ప్రయాణికులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

న్యాల్కల్,స్వాతంత్రానికి ముందు, నిజాం నవాబుల పాలనలో నిర్మించిన రోడ్డది. ఎలాంటి ప్రమాదకర మూల మలుపులు లేకుండా ఏకంగా దాదాపు 39 కిలో మీటర్ల మేర రోడ్డును నిర్మించారు. అది ఆసియా ఖండంలోనే అరుదైన రోడ్డుగా నేటికీ గుర్తింపున్న రోడ్డది.

ఆర్అండ్జి విశ్రాంతి భవనం, అల్లాదుర్గం ప్రధాన కూడలి నుండి న్యాల్ కల్ మండలం, గంగువార్ ప్రధాన కూడలి మార్గం ద్వారా మెటల్ కుంట రైల్వే స్టేషన్ వరకు రోడ్డును నిర్మించారు. రోడ్డు మధ్య నుండి కుడి, ఎడమ 75 అడుగుల మేరకు రోడ్డును నిర్మించారు. ఐతే ఎంతో చారిత్రక నేపథ్యం గల రోడ్డు ప్రస్తుతం ప్రయాణికులు, వాహన చోదకులకు అత్యంత పెను ప్రమాదకరంగా మారింది. మోస్తారు వర్షం కురిసిందంటే చాలు జహీరాబాద్ బీదర్ రోడ్డు, గంగువార్ ప్రధాన కూడలి వద్ద అధిక మొత్తంలో వరద నీరు చేరి చిన్నపాటి చెరువును తలపిస్తోంది.

ఆ రోడ్డు మార్గాన అనునిత్యం వందల సంఖ్యలో ప్రయాణికులు, వాహన చోదకులు జహీరాబాద్, న్యాల్ కల్, నారాయణఖేడ్, తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గంగువార్ ప్రధాని కూడలి వద్ద భారీగా వరద నీరు చేరడంతో పెను ప్రమాదకరంగా మారింది.

ముఖ్యంగా ద్విచక్ర ఆటో వాహన చోదకులు తరచుగా ప్రమాదాల బారిన పడాల్సిన పరిస్థితి నెలకొంది. పాలకులు, జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించి వరద నీటిని తరలించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు, వాహన చోదకులు, చిరు వ్యాపారులు కోరుతున్నారు.

ఝరాసంఘంలో భారీ వర్షం

ఝరాసంఘంలో భారీ వర్షం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంఘం మండలం బిడే కన్నె గ్రామంలో సోమవారం సాయంత్రం కురిసిన భారీ వర్షం జనజీవనాన్ని స్తంభింపజేసింది. గ్రామ సమీపంలో వాగులో చిక్కుకున్న బొలెరో వాహనాన్ని గ్రామస్తులు చాకచక్యంగా బయటకు తీశారు. గ్రామానికి వెళ్లే రోడ్డుపై మోకాలిలోతు నీరు ప్రవహించింది. ఏడాకులపల్లి గ్రామంలో వరద నీటిలో చిక్కుకున్న విద్యార్థులను గ్రామస్తులు సురక్షితంగా దాటించారు. ఈ ప్రాంతంలో 2.0 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

ప్రజలకు అండగా నిలిచిన వరంగల్ పోలీసులు

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-26-2.wav?_=2

ప్రజలకు అండగా నిలిచిన వరంగల్ పోలీసులు

వరద నీటిలో ప్రభుత్వ అధికారుల సేవలు..

సహాయక చర్యల్లో నిమగ్నమైన మిల్స్ కాలనీ సీఐ రమేష్, సిబ్బంది..

సహాయక చర్యల్లో పాల్గొన్న వరంగల్ తహసిల్దార్ ఇక్బాల్.

నీట మునిగిన వరంగల్ అండర్ బ్రిడ్జి ప్రాంతాన్ని పరిశీలించిన ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, ఇంతేజార్ గంజ్ సీఐ షుకూర్

వరంగల్ తూర్పు, నేటిధాత్రి.

వరంగల్లో కుండపోత వర్షం కురిసిన కారణంగా స్తంభించిన జనజీవనం. వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా వాన దంచికొట్టింది. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది.

ఎడతెరిపి లేకుండా కురిసిన కుండపోత వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలైనా వివేకానంద కాలనీ, ఎస్సార్ నగర్, సాయిగణేష్ కాలనీ, మధురానగర్ శివనగర్, ఎన్టీఆర్ నగర్, కరీమాబాద్, మిల్స్ కాలనీ, గరీబ్ నగర్, శాకరాశికుంట, డి కే కొమురయ్య నగర్ లు జలమయమయ్యాయి.

దీంతో రంగంలోకి దిగిన ప్రభుత్వ అధికారులు, పోలీసులు వరద నీటిలో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన వరంగల్ తహసిల్దార్ ఇక్బాల్, అలాగే నీట మునిగిన మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో సహాయక చర్యల్లో పాల్గొని ప్రజలను పునరావాస కేంద్రాలకు తీసుకెళ్లిన మిల్స్ కాలని సిఐ రమేష్, పోలీసు సిబ్బంది. ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదంటున్న పోలీసులు. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు.

టోల్ ఫ్రీ కి కాల్ చేయండి..

నగరంలో తెల్లవారు జామున కురిసిన భారీ వర్షం కారణంగా ప్రధాన రహదారులు వాగులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. అత్యవసర సహాయం కోసం అధికారులు కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్లను సూచించారు. వరంగల్ జిల్లాకు 1800 425 3434, 9154225936, జిడబ్ల్యూఎంసి 1800 425 1115, హనుమకొండ 1800 425 1980, 9701999676 లకు కాల్ చేయాలని అధికారులు ప్రజలకు సూచించారు.

జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మాణిక్ రావు

 

జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు , కోహిర్ మాజి సర్పంచ్ కళీమ్ గారి జన్మదిన సందర్భంగా క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు కోహిర్ మండలం అధ్యక్షులు నర్సింలు, ఝరసంఘం మండలం అధ్యక్షులు వెంకటేశం ,మాజి పట్టణ అధ్యక్షులు మొహియుద్దీన్ ,యువ నాయకులు ముర్తుజా ,దీపక్ , మల్లేష్ తదితరులు..

వర్షం నీటితో ముంచెత్తిన వరంగల్ నగరం..

ఓరుగల్లులో హోరెత్తిన వాన..

వర్షం నీటితో ముంచెత్తిన వరంగల్ నగరం..

వరంగల్ జిల్లాలో భారీ వర్షం.. రాత్రి కురిసిన భారీ వర్షానికి నీట మునిగిన పలు కాలనీలు..

వరద ముంపుకు గురి కావడంతో అప్రమత్తమైన వరంగల్ జిల్లా అధికారులు

ముంపు ప్రాంతాల నుండి సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తరలించిన అధికారులు

భారీ వర్షం నేపథ్యంలో వరంగల్ మహానగర పాలక సంస్థ టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు

వరంగల్, నేటిధాత్రి

వరంగల్లో కుండపోత వర్షం కురిసిన కారణంగా స్తంభించిన జనజీవనం. వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా వాన దంచికొట్టింది. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది.

Warangal city flooded

ఎడతెరిపి లేకుండా కురిసిన కుండపోత వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలైనా వివేకానంద కాలనీ, ఎస్సార్ నగర్, సాయిగణేష్ కాలనీ, మధురానగర్ శివనగర్, ఎన్టీఆర్ నగర్, కరీమాబాద్, మిల్స్ కాలనీ, గరీబ్ నగర్, శాకరాశికుంట, డి కే కొమురయ్య నగర్ లు జలమయమయ్యాయి. నగరంలోని చెరువులు, కుంటలు పొంగిపొర్లడంతో వరద నీరు ఇళ్లను ముంచెత్తింది. పలు మండలాల్లో వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది. అత్యధికంగా సంగెం మండలంలో 178.4 మి.మీ. వర్షపాతం నమోదైంది.

Warangal city flooded

అలాగే ఖిలావరంగల్‌లో 155.0 మి.మీ., వరంగల్‌లో 148.8 మి.మీ., వర్ధన్నపేటలో 125.4 మి.మీ., ఖానాపూర్‌లో 108.8 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. అలాగే గీసుగొండలో 90.4 మి.మీ, దుగ్గొండిలో 84.2 మి.మీ, నల్లబెల్లిలో 66.4 మి.మీ, నర్సంపేటలో 86.4 మి.మీ, చెన్నారావుపేటలో 85.4 మి.మీ, రాయపర్తిలో 90.8 మి.మీ, పర్వతగిరిలో 88.6 మి.మీ, నెక్కొండలో 82.4 మి.మీ భారీ వర్షం నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. జిల్లా మొత్తం సగటు వర్షపాతం 107.0 మి.మీగా నమోదైంది.

రాత్రి నుండి తెల్లారే వరకు భారీ వర్షం

Warangal city flooded

వరంగల్ నగరంలో భారీ వర్షం కురుస్తోంది. పలు కాలనీలు జలమయమయ్యాయి. సాకరాశికుంట, హనుమాన్ నగర్, పెరుకవాడ, ఏకశిలానగర్ ప్రాంతంలో ఇండ్లలోకి వర్షపు నీరు చేరింది. వర్షం నీటికి ఇంట్లో ఉన్న సామగ్రి తడిసిపోయాయి. రాత్రి నుండి తెల్లవారు జామున వరకు వాన పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్ష ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్థంభించింది. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది.

రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద నుంచి రాకపోకలు బంద్

Warangal city flooded

వరంగల్ రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద భారీగా వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. తెల్లవారుజామున ఎవరు లేకపోవడంతో ఒక కారు నీటిలో మునిగిపోయింది. అదృష్టవశాత్తూ, స్థానికులు వెంటనే స్పందించి జేసీబీ సహాయంతో కారును బయటకు తీశారు. అధికారుల నుంచి సకాలంలో ఎలాంటి సహాయక చర్యలు అందలేదని స్థానికులు వాపోతున్నారు. రాత్రి పూట కురిసిన వర్షం కారణంగా, అండర్ బ్రిడ్జితో పాటు, హంటర్ రోడ్డులోని చిన్న బ్రిడ్జి కూడా వరద నీటితో నిండిపోయి రాకపోకలు బంధు అయ్యాయి.

ప్రధాన రహదారులపైనా వరద ప్రభావం..

Warangal city flooded

వరంగల్ నుంచి ఖమ్మం వైపు వెళ్లే ప్రధాన రహదారిపై అక్కడక్కడ నీటి ప్రవాహం పెరగడంతో రాకపోకలు స్తంభించాయి. దీంతో భారీ వాహనాలు మినహా బైకులు, ఆటోలు, కార్లు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయించాల్సి వచ్చింది. కార్యాలయాలు, పాఠశాలలకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అలాగే బొల్లికుంట చెరువు అలుగు పోస్తుండడంతో గుంటూరు పల్లి, బొల్లికుంట మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వందల ఎకరాల్లో పంట పొలాలు వరద నీటిలో మునిగిపోయి చెరువులను తలపింప చేశాయి.

ప్రమాదకర స్థాయిలో ఖిలా వరంగల్ చెరువు

Warangal city flooded

ఖిలావరంగల్ అగర్తల చెరువు ప్రమాదకర స్థాయిలో నిండిపోయింది. రిటర్నింగ్ వాల్ పైవరకు నీరు చేరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ వరద ధాటికి చెరువు వెనకాల ఉన్న సుమారు 100 ఎకరాల పంటలు నీటమునిగాయి. ఈ పరిణామంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఖిలా వరంగల్ చెరువు పొంగిపొర్లుతుండడంతో ఆ నీరంతా శివనగర్, మైసయ్య నగర్‌లో లోతట్టు ప్రాంతాలను నీట ముంచాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు బయటకు రాలేక ఇబ్బందులు పడుతున్నారు.

నీటితో నిండిన వరంగల్ రైల్వే స్టేషన్ పట్టాలు…

గతంలో ఎన్నడూ లేని విధంగా వరంగల్ రైల్వే స్టేషన్ కు భారీగా వరద పోటెత్తింది. ఒకటి, రెండవ ప్లాట్ ఫామ్ ల మధ్య పట్టాలు కనిపించనంత వరద నీరు చేరింది. దీనితో రైల్వే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

టోల్ ఫ్రీ నంబర్ల ఏర్పాటు…

భారీ వర్షాల నేపథ్యంలో వరంగల్‌లో మహానగర పాలక సంస్థ అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సహాయక చర్యల కోసం టోల్‌ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేశారు. వరంగల్‌ కలెక్టరేట్‌- 1800 425 3434, 91542 25936, హనుమకొండ కలెక్టరేట్‌- 1800 425 1115, వరంగల్‌ మున్సిపాలిటీ కార్యాలయం- 1800 425 1980, 97019 99676
వరంగల్‌ విద్యుత్‌శాఖ- 1800 425 0028.

13,14 తేదీల్లో భారీ వర్షాలు?

రానున్న మూడురోజులు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురుస్తున్నాయని.. 13న మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో 13,14 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై అప్రమత్తంగా ఉండండి..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-12T163644.758.wav?_=3

_ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై అప్రమత్తంగా ఉండండి – బొరేగౌ నాగేందర్ పటేల్ మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

భారీ వర్షాల కారణంగా జహీరాబాద్ నియోజకవర్గంలోని పలు మండలంలోని వాగులు, వంకలు, చెరువులు పొంగి ప్రవహించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.రహదారులు నీటితో నిండిపోవచ్చని ముందస్తు హెచ్చరిక ఇవ్వుతూ, ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని బిఆర్ఎస్ పార్టీ నాయకులు బొరేగౌ నాగేందర్ పటేల్ సూచించారు.సెల్ఫీల కోసం ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లి ప్రాణాలతో చెలగాటం ఆడకూడదని, ఉధృత ప్రవాహం ఉన్న చోట్లకు చేరరాదని సూచించారు.వాగులు, వంకల వద్దకు చేపల వేటకు జాలర్లు వెళ్లకూడదు. పశువులను కాయడానికి నదులు, వాగులు, చెరువుల దగ్గరకు తీసుకెళ్లకుండా జాగ్రత్త వహించాలని కోరారు.అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లకూడదని, సాధ్యమైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని ప్రజలకు సూచించారు.వర్షాల వల్ల ప్రమాదకరంగా మారే ప్రాంతాల్లో ఎలాంటి విపత్తులు జరుగకుండా మండల పోలీసులు మరియు ఇతర శాఖల అధికారులు సమన్వయంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు.ప్రజలందరూ జాగ్రత్తగా ఉండి, అవసరమైతే మాత్రమే బయటకు వెళ్లి, వారి ప్రాణాలు రక్షించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మహాదేవపూర్ సీఐ బాధ్యతలు స్వీకరించిన వెంకటేశ్వర్లు

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-24-1.wav?_=4

*మహాదేవపూర్ సీఐ బాధ్యతలు స్వీకరించిన వెంకటేశ్వర్లు *
* మహాదేవపూర్ఆగస్టు12(నేటి ధాత్రి)*

మహాదేవపూర్ సీఐగా వెంకటేశ్వర్లు బాధ్యతలు ఇక్కడ పనిచేసిన సిఐ రామచంద్రరావు కరీంనగర్ బదిలీపై వెళ్లడంతో ఆస్థానంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సిసిఎస్ గా సిఐగా విధులు నిర్వహిస్తూ బదిలీపై మహాదేవపూర్ కు వచ్చారు సోమవారం మహాదేవపూర్ పోలీస్ స్టేషన్లో సీఐ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు

మెడికల్ ల్యాబ్ యూనియన్‌కు ఐఎంఏ సంపూర్ణ మద్దతు.

మెడికల్ ల్యాబ్ యూనియన్‌కు ఐఎంఏ సంపూర్ణ మద్దతు

మంచిర్యాల,నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ రి.నెం.374/2020 యూనియన్ వారు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్న సందర్భంగా మంచిర్యాల జిల్లా నాయకులు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) జిల్లా అధ్యక్షులు డాక్టర్ రమణ ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించడం జరిగింది.ఈ సందర్భంగా వారు ఇటీవల ఎన్నుకున్నటువంటి తమ నూతన యూనియన్ గురించి ఆయనకు వివరించారు.డాక్టర్ రమణ స్పందిస్తూ ల్యాబ్ టెక్నీషియన్ల సమస్యలు మరియు వారి యూనియన్ అవశ్యకతను పూర్తిగా అర్థం చేసుకుని,వారికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.వైద్య రంగానికి ల్యాబ్ టెక్నీషియన్లు అందిస్తున్న సేవలు ఎంతో విలువైనవి అని ఆయన ప్రశంసించారు.కొత్తగా ఏర్పడిన ఈ యూనియన్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ,నూతన యూనియన్ కార్యవర్గాన్ని శాలువాలతో సత్కరించి,తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని భరోసా ఇచ్చారు.అనంతరం మంచిర్యాల జిల్లా డ్రగ్గిస్ట్ కెమిస్ట్ జనరల్ సెక్రెటరీ టి.సుధాకర్ నీ కలిసి మాట్లాడటం జరిగింది.సానుకూలంగా స్పందించిన సెక్రటరీ సుధాకర్ ల్యాబ్ టెక్నీషియన్ల సంక్షేమం కోసం చేపట్టిన ప్రతి కార్యక్రమానికి తమ పూర్తి మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.యూనియన్ అంతా కలిసికట్టుగా నడుస్తూ సమస్యలను పరిష్కరించుకునే విధంగా ముందుకు సాగాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మెడికల్ ల్యాబ్ అసోసియేషన్ అధ్యక్షుడు కందునూరి ప్రశాంత్,ఉపాధ్యక్షులు చంద్రమౌళి,ఇర్షాద్,ప్రధాన కార్యదర్శి కాజా పాషా,ట్రెజరర్ కామని శ్రీనివాస్,సంయుక్త కార్యదర్శి శైబజ్,పలువురు ల్యాబ్ టెక్నషియన్లు పాల్గొన్నారు.

ప్రతిభ పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-22-3.wav?_=5

ప్రతిభ పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం.

 

రాయికల్ నేటి ధాత్రి:

అభిలాష్ హెల్పింగ్ హ్యాండ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వివిధ రంగాలలో కృషి చేస్తున్న వారిని మదర్ థెరిస్సా జయంతి సందర్భంగా ప్రతిభ పురస్కారాలతో సత్యరించడం జరుగుతుందని, ఆసక్తి గల అభ్యర్థులు ఇంటర్నేషనల్ ప్రతిభ అవార్డులకు దరఖాస్తులు చేసుకోవాలని అభిలాష హెల్పింగ్ హ్యాండ్ ఆర్గనైజేషన్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ గంగాధరి సురేష్ మంగళవారం ప్రకటనలో తెలిపారు. ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వివిధ రంగాలలో కృషి చేసిన వారికి విశ్వమాత మదర్ థెరిస్సా ఇంటర్నేషనల్ ప్రతిభ పురస్కారం, తెలంగాణ ఉద్యమకారుడు ప్రొఫెసర్ జయశంకర్ నేషనల్ ప్రతిభ పురస్కారం, స్వాతంత్ర్య ఉత్తమ ప్రతిభ పురస్కారం, స్వాతంత్ర్య సమర యోధుడు కొమురం భీమ్ ఉత్తమ ప్రతిభ పురస్కారం , సమరయోధురాలు చాకలి ఐలమ్మ ఉత్తమ ప్రతిభ పురస్కారం తదతర మహనీయులు పేరిట పురస్కారాలతో సత్యరించి , వారి సేవలను అభినందిస్తూ వారిని ప్రోత్సహించడం జరుగుతుందని చైర్మన్ తెలిపారు.సామాజిక సేవా, పర్యావరణ సంరక్షణ, చెట్ల పెంపకం, కాలుష్య నివారణ, ఆధ్యాత్మికం,జానపద, శాస్త్రీయకళలు, సాహిత్యం,సంగీ,గానం, నాట్యం,చిత్రకళ, ఫోటో గ్రఫీ,నీటిని, దర్శకత్వం,విద్య, వైద్యం,క్రీౠ, వృత్తి కళ, సినిమా రంగం షార్ట్ ఫిలిం, యూట్యూబర్స్,గ్రామ సేవా సర్పంచ్లు, ఉపసర్పంచ్లు, ఎంపీటీసీలు,నాటన రంగం తదితర రంగాలకు చెందిన వారు ఈ పురస్కారాలకు దరఖాస్తులు చేసుకోవచ్చునన్నారు.ఆసక్తి గల అభ్యర్థులు ఆగఘ్ట 20 తేదీ 2025 వరకు తమ దరఖాస్తులను అందజేయాలని సూచించారు. అవార్సను ప్రధానం అందించే వేదిక రవీంద్ర భారతి 28-8-2025 తేదీన మధ్యాహ్నం 12 గంటల నుండి 5 గంటలకు కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు.మరికొన్ని వివరాలకు 6302908528 ఫోన్ నెంబర్ ను సంప్రదించాలని కోరారు.షరతులు వర్తిస్తాయని తెలిపారు.

డబ్బా ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కు ఐడెంటి కార్డు ల పంపిణీ

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-21-4.wav?_=6

డబ్బా ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కు ఐడెంటి కార్డు ల పంపిణీ

గ్రామీణ వైద్యుడు నేమూరి శ్రీధర్

ఇబ్రహీంపట్నం. నేటిధాత్రి

ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామం లో ప్రభుత్వం పాఠశాల విద్యార్థుల కు సొంత డబ్బులతో ఐడెంటి కార్డులు లను గ్రామానికి చెందిన గ్రామీణ వైద్యుడు నేమూరి శ్రీధర్ అందజేశారు.ప్రభుత్వం పాఠశాల చదువుతున్న 70 మంది విద్యార్థిని విద్యార్థుల కోసం ఉదార భావం తో,గొప్ప సేవా భావం తో స హృదయము తో ముందుకు వచ్చి తమ వంతు పాఠశాల కు సహాయం అందిచడం జరిగిందని, ఇదే విధంగా ఇంకా పాఠశాల కు అవసరాలు ఏమి ఉన్న డబ్బా గ్రామ పెద్దలు అంద జెస్తామని తెలిపారు ఈ కార్యక్రమం లో డబ్బా ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు తనుగుల రమేష్. డబ్బా మాజీ సర్పంచ్ పుప్పాల నర్సయ్య , తాజా మాజీ ఉప సర్పంచ్ కోటి దేవ రెడ్డి, సాదాల మహేష్, రాపెల్లి మహేష్, వడ్డేపల్లి ప్రవీణ్ . సాదాల చిన్న రెడ్డి., నేరెళ్ల సత్తన్న. ఉపాధ్యాయులు మండలోజు అశోక్ గారు, అల్లకట్టు సత్యనారాయణ, చిలుముల రాజేష్ గారు, ఆడెపు నరేష్ గారు అల్లాడి హరి ప్రసాద్ గారు, బొల్లు శంకర్ గారు విద్యార్థులు తల్లి తండ్రులు పాల్గొన్నారు

A tribute to the late former MLA.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-12T161247.170.wav?_=7

దివంగత మాజీ ఎమ్మెల్యే కు ఘన నివాళి.

ఎర్ర సత్యం సేవలు మరువలేనివి.

మహబూబ్ నగర్/ నేటి ధాత్రి

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో దివంగత జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర సత్యం విగ్రహానికి పలువురు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించి, అనంతరం జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ ను టీపీసీసీ కో ఆర్డినేటర్ దారా భాస్కర్ శాలువాతో మంగళవారం సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రేస్ పార్టీ సీనియర్ నాయకులు పోమాల్ గ్రామా మాజీ సర్పంచ్ కొండనోళ్ల కృష్ణయ్య, మాజీ సర్పంచ్ కొందుటి రామచంద్రయ్య, పోమాల్ గ్రామా మాజీ కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు మాజీ వార్డ్ సభ్యులు పిడుగు సుధాకర్, సంజీవ రెడ్డి, కావలి ఎల్లప్ప ముదిరాజ్, వెంకటయ్య ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

రాహుల్ గాంధీ అరెస్ట్ ప్రజాస్వామ్య కూనికి నిదర్శనం

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-20-4.wav?_=8

రాహుల్ గాంధీ అరెస్ట్ ప్రజాస్వామ్య కూనికి నిదర్శనం

వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి

పరకాల నేటిధాత్రి

 

ఇండియా కూటమి,రాహుల్ గాంధీని,మల్లిఖార్జున ఖర్గే, ప్రియాంక గాందిలను ఇండియా కూటమి నాయకులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య కూనికి నిదర్శనమని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి అన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత పార్లమెంట్ ఎన్నికలలో అదేవిధంగా ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో నరేంద్ర మోడీ బిజెపి ప్రభుత్వం మరియు ఈసీ కుమ్మక్కై దొంగ ఓట్లు సృష్టించి కేంద్రంలోని ఆయా రాష్ట్రాలలో అధికారంలోకి రావడానికి దొంగ ఓట్లే కారణమని రాహుల్ గాంధీ ఆరు నెలల నుండి దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో తిరిగి ప్రజావాదానికి ఎగ్జిట్ పోల్స్ కు ఏమాత్రం పొంతన లేకుండా వచ్చిన ఎలక్షన్ రిజల్ట్ ను చూసి ఈసీ దగ్గర ఓటర్ లిస్టు తీసుకుని దేశంలో కొన్ని ప్రాంతాల సెలక్ట్ చేసుకుని ఎంక్వయిరీ చేయగా నలుగురు ఉన్న ఇంట్లో 40,50 ఓట్లు దొంగ ఓట్లు సృష్టించి ఆ యొక్క ఇంటి నెంబర్లకు సైతం ఇంటి నెంబర్ సున్నాగా చూపించి దొంగ ఓట్లతో బీజేపీ పాలిత రాష్ట్రాలు అదేవిధంగా కేంద్రంలో అధికారం చేజిక్కించుకోవడం జరిగిందన్నారు.ఇదేంటని బీజేపీని మరియు ఈసీని ప్రశ్నించగా తమ తమ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వెబ్సైట్లను బందు చేసి,ప్రజలకు ఎలాంటి సమాచారం తెలియకుండా కేంద్రం బిజెపి ఈసప్రజాస్వామ్య ఉల్లంఘన నిదర్శనమని దీన్ని ప్రశ్నించిన రాహుల్ గాంధీని తన తోటి నాయకులను అరెస్ట్ చేస్తారా అని మోడీ బిజెపి ప్రభుత్వాని ప్రశ్నించారు.రాహుల్ గాంధీ తీసుకున్నటువంటి మంచి కార్యక్రమం ప్రజాస్వామ్యాన్ని బతికించడానికి అని, ప్రజలంతా విశ్వసిస్తూ ప్రజలంతా రాహుల్ గాంధీ వెంటే ఉన్నారని తెలిపారు.

పల్లెరాములుకు స్టార్ ఆప్ తెలంగాణ జాతీయస్థాయి పురస్కారం

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-19-3.wav?_=9

పల్లెరాములుకు స్టార్ ఆప్ తెలంగాణ జాతీయస్థాయి పురస్కారం

3 వేల పైన షార్ట్ ఫిల్మ్స్ నిర్మించి నటన

తెలంగాణ యాస బాషలతో ప్రజలను చైతన్య పరుస్తూ షార్ట్ ఫిల్మ్స్

నర్సంపేట,నేటిధాత్రి:

వరంగల్ జిల్లా నర్సంపేట మండలానికి చెందిన పల్లెరాములును స్టార్ ఆప్ తెలంగాణ జాతీయస్థాయి పురస్కారం వరించింది.సోషల్ మీడియా వేదికగ మూడు వేలకు పైగ షార్ట్ ఫిల్మ్స్ నిర్మించి తెలంగాణలోని పల్లేల జీవిత విదానాలు, యాస బాషలతో ప్రజలను చైతన్య పరుస్తున్నారు.

వీటిని గుర్తించిన జాతీయ స్థాయి హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్విస్ వారు ఆదివారం హైదారాబాద్ రవింద్రభారతిలో పల్లె రాములుకు స్టార్ ఆప్ తెలంగాణ జాతీయస్థాయి పురస్కారాన్ని అందచేశారు.ఇందులో బాగంగ పల్లె రాములుకు జాతీయ పురస్కారాన్ని హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ జాతీయ అద్యక్షుడు కొంపెల్లి సత్యనారాయణతో పాటు స్వర్ణగిరి దేవాలయ అదినేత మనేపల్లి రామారావు చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు.

సామాజిక స్ప్రుహను కల్పించే విదంగ లఘుచిత్రాలను చేస్తున్నందుకు గాను ఈ అవార్డును అందచేస్తున్నట్టు అద్యక్షులు కొంపెల్లి సత్యనారాణ తెలియజేశారు.తనకు జాతీయ స్థాయి స్టార్ ఆప్ తెలంగాణ పురస్కారాన్ని అందచేసినందుకుగాను పల్లే రాములు హ్యూమన్ రైట్స్ నిర్వాహకులకు దన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా పల్లెరాములు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో గ్రామీణ హితివృత్తాలు,జీవన విధానం,రైతులు,ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సినిమాలు తీసే ఆలోచనలు ఉన్నట్లు ప్రకటించారు.

సమస్యల వలయంలో పరకాల ప్రభుత్వ పాఠశాలలు

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-12T153341.126.wav?_=10

సమస్యల వలయంలో పరకాల ప్రభుత్వ పాఠశాలలు

స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకొని సమస్యలు తీర్చాలని ఎస్ఎఫ్ఐ డిమాడ్

పరకాల నేటిధాత్రి

ఎస్ఎఫ్ఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలమరియు పాఠశాలను ఎస్ఎఫ్ఐ నాయకులు సందర్శించారు.ఈ సందర్బంగా హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్ మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు టాయిలెట్స్ లేక మరియు వర్షం వస్తే కనీసం నడవలేని పరిస్థితి ఉందన్నారు.

అదేవిధంగా బాయ్స్ హై స్కూల్ నూతన బిల్డింగ్ నిర్మించాలని,మల్లారెడ్డి ప్రైమరీ స్కూల్లో కనీసం విద్యార్థులకు సౌకర్యాలు లేక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.వర్షం వస్తే కనీసం కూర్చొని చదువుకుందాం అంటే పై రేకులకు హోల్స్పడి వర్షం నీరు క్లాస్ రూములో నీరు నిలిచిపోవడం వల్ల విద్యార్థులు చదువుకుందాం అంటే ఇబ్బంది పడుతున్నారని స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకొని పట్టణంలో ఉన్న విద్యారంగా సమస్యలు పరిష్కరించాలని లేదంటే పెద్దఎత్తున పట్టణంలో మరియు జిల్లా పరంగా ఉద్యమం చెప్పడతామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యుడు మడికొండ ప్రశాంత్,బొజ్జ హేమంత్,పట్టణ అధ్యక్షుడు బొచ్చు ఈశ్వర్,కార్యదర్శి కోగీల సాయి తేజ ల్,ప్రభుత్వ కాలేజ్ ప్రెసిడెంట్ ప్రభాస్,ప్రధాన కార్యదర్శి అజయ్,ఉపాధ్యక్షుడు రోహిత్,సహాయ కార్యదర్శి అవినాష్,బన్నీ,రాహుల్,విజయ్ సూర్య,అరవింద్ పాల్గొన్నారు.

ఎలక్షన్ కమిషన్ మోడీ షా కనుసన్నాలో పనిచేస్తుంది

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-18-4.wav?_=11

ఎలక్షన్ కమిషన్ మోడీ షా కనుసన్నాలో పనిచేస్తుంది

భూపాలపల్లి నేటిధాత్రి

జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పిసిసి మెంబర్ చల్లూరి మధు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ 2024 లో జరిగిన పార్లమెంటు ఎలక్షన్ పై అనేక అనుమానాలు ఉన్నాయని మీడియా సమావేశం పెట్టి విషయాలను చెప్పారు కర్ణాటక రాష్ట్రంలోని మహాదేవ్ అనే నియోజకవర్గం లో 40 మందితో 6 నెలలు రాహుల్ గాంధీ యొక్క టీం వర్క్ చేసింది అక్కడ ఎన్ని దొంగ ఓట్లు ఉన్నాయి ఎంతమంది ఓటర్లు ఉన్నారు అని తెలుసుకున్నారు లక్ష దొంగ ఓట్లను వారు గుర్తించారు ఓకే ఇంటి నెంబర్లు కనీసం ఒకే ఒక బీజేపీ కార్యకర్త ఉండగా పదివేల ఓట్లను అక్కడ సృష్టించారు అని బిజెపి పార్టీ మోడీని అమిత్ షా ను విమర్శించారు ఇలాంటి ఘటనలు జరుగుతున్న భారత ఎలక్షన్ కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు మోడీ అమిత్ షా కనుషన్నాలో ఎలక్షన్ కమిషన్ నడుస్తుందని వారు అన్నారు 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరునికి ఓటు హక్కు కల్పించాలి ఎలక్షన్ కమిషన్ కానీ 74 సంవత్సరాల వయసు వారికి ఫామ్ 6 కొత్త ఓటు హక్కు ఎలక్షన్ కమిషన్ కల్పించాలి 74 సంవత్సరాల వయసు వారికి ఫామ్ 6 ద్వారా కొత్త ఓటు హక్కు కల్పించడం ఏంటి అని రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషనర్ ను నిలదీశారు కర్ణాటక రాష్ట్రంలో ఒక్క మహాదేవ్ అనే నియోజకవర్గంలో 36000 వేల ఫేక్ ఓట్లు సృష్టించారు భారతదేశం మొత్తంలో అన్ని రాష్ట్రాల్లో ఎన్ని దొంగ ఓట్లను బిజెపి పార్టీ సృష్టించిందో విషయం స్పష్టంగా అర్థమవుతుంది అని వారు అన్నారు రాహుల్ గాంధీ కుటుంబం భారతదేశానికి సేవ చేయడానికి ఉంది వారి కుటుంబంలో ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేశారు అయినా దేశం కోసం సేవ చేయడానికి వారు ఏ రోజు కూడా వెనుక ఆడలేదు అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పిప్పాల రాజేందర్ దాట్ల శ్రీనివాస్ అప్పం కిషన్ అంబాల శ్రీనివాస్ ముంజల రవీందర్ గౌడ్ జెంబోజ్ పద్మ ఉడుత మహేందర్ బౌత్ విజయ్ కుమార్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు

బోర్డు పెట్టి, కంచె మరిచారు

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-17-2.wav?_=12

బోర్డు పెట్టి, కంచె మరిచారు

చేవెళ్ల, నేటిధాత్రి:

 

కోటి విలువైన ప్రభుత్వ స్థలానికి బోర్డు పెట్టి, కంచే వేయడం మరిచారు.
శంకర్పల్లి మున్సిపల్ పట్టణ కేంద్రంలో సర్వే నెంబర్ 220 లో సుమారు 300 గజాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందన్న ఫిర్యాదుతో వారం రోజుల క్రితం శంకర్పల్లి రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించి ఆ స్థలంలో ప్రభుత్వ స్థలం సూచిక బోర్డుపెట్టారు. కాని యధావిధిగా ఆ కాలానివాసులు పదుల సంఖ్యలో కార్లు పార్క్ చేసి ప్రయివేట్ గా ఉపయోగిస్తున్నారని, ఆక్రమణకూ గురయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. కోటి విలువైన ఈ భూమి లో సూచికబోర్డు పెట్టారు. అదేవిదంగా సర్వేనెంబర్ 220లో పక్కనే ఉన్న నాలా స్థలంలో కొన్ని నెలల క్రింద ఇరిగేషన్ అధికారులు నాలా స్థలానికి మార్క్ చేశారు. కాని కొంతమంది మార్క్ దాటి ముందుకు జరిగి నిర్మాణాలు చేపట్టారు. ఇక్కడ కొంత ప్రభుత్వ స్థలం
ఆక్రమణకు గురైందని స్థానికులు అరుపిస్తున్నారు. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు స్పందించి ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని ఈ విలువైన భూమికి కంచె వేసి ప్రభుత్వ స్థలానికి రక్షణ కల్పించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

కోతుల నివారణకు చర్యలు తీసుకోవాలి…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-16-3.wav?_=13

కోతుల నివారణకు చర్యలు తీసుకోవాలి…

కోతుల బెడద వల్ల వ్యవసాయ రంగానికి రక్షణ లేకుండా పోయింది…

రోడ్లపైకి వెళ్ళుటకు జంకుతున్న ప్రజలు…

పాఠశాలకు వెళ్లడానికి భయపడుతున్న విద్యార్థులు…

నేటి ధాత్రి మొగుళ్ళపల్లి.

మండల వ్యాప్తంగా కోతులు జనవాసాలలోకి గుంపులు, గుంపులుగా ఇండ్లలోకి ప్రవేశించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.కోతుల బెడద రోజురోజుకు పెరిగిపోతుంది.ఆకలితో అలమటిస్తూ,అడవులను వదిలేసి గ్రామాల్లో ప్రజలపై దాడులు చేస్తున్నాయి.కోతుల దాడులలో గాయపడిన వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి.గ్రామాల్లో ఇంటి తలుపులు వేయడం మర్చిపోతే ఇక అంతే సంగతులు కోతులు ఇంట్లోకి ప్రవేశించి వంట సామాగ్రి, దుస్తులు,ఆహార పదార్థాలు చిందర-వందర చేస్తూ బీభత్సం సృష్టిస్తున్నాయి. తమ అవసరాల కోసం ప్రజలు రోడ్లపైకి వెళ్లడానికి జంకుతున్నారు. విద్యార్థులు పాఠశాలకు వెళ్లడానికి భయపడుతున్నారు.వసతి గృహాలలో ఉన్న విద్యార్థినీ, విద్యార్థులు కోతుల బారినపడి గాయాలైన సందర్భాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోతుల బెడద వల్ల మండల వ్యాప్తంగా రైతాంగానికి, వ్యవసాయ రంగానికి రక్షణ లేకుండా పోయింది. కోతులు ఆగం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి కోతుల బెడద నుంచి ప్రజలను రక్షించాలని కోరుతున్నారు.

ఎమర్జెన్సీ ప్లాన్లో భాగంగా ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలింపు..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-12T141549.362.wav?_=14


ఎమర్జెన్సీ ప్లాన్లో భాగంగా ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలింపు

ఆపత్కాలంలో బల్దియా టోల్ ఫ్రీ నెంబర్ నెంబర్కు సమాచారం ఇవ్వాలన్న మున్సిపల్ కమిషనర్.

బల్దియా కమిషనర్తో కలిసి వరంగల్ పరిధిలోని లోతట్టు ప్రాంతాలను సందర్శించిన వరంగల్ కలెక్టర్.

వరంగల్, నేటిధాత్రి

భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డా.సత్య శారద అన్నారు. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు జలమయమైన వరంగల్ నగరంలోని పలు ప్రాంతాలలో బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ తో కలిసి క్షేత్ర స్థాయిలో సందర్శించి సమర్థవంతంగా చర్యలు చేపట్టుటకు అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా పరిధి లోని నాలుగు మండలాలలైనా వరంగల్, సంగెం, ఖిలా వరంగల్, వర్ధన్నపేటలలో అత్యధిక వర్షపాతం నమోదు కావడం జరిగిందని అత్యధికంగా సంగెం మండలంలో 24 సెంటీమీటర్ల వర్షపాతం,

ఖిలా వరంగల్ మండలం లో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం జరిగిందని, జలమయమైన లోతట్టు ప్రాంతాలైన సాయి గణేష్ కాలనీ, గాంధీ నగర్, డి కే నగర్, లెనిన్ నగర్, అగర్తల చెరువు ప్రాంతం, మైసయ్య నగర్, గిరి ప్రసాద్ కాలనీ, పద్మ నగర్, శాకారాశికుంట తదితర ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో సందర్శించడం జరిగిందని, వర్షపు నీరు బయటకు వెళ్లే స్ట్రాం వాటర్ డ్రైన్ లు ఇరుకుగా ఉండడం వల్ల నీటి ప్రవాహంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, ఖిలావరంగల్ నుండి వరంగల్ వరకు జీడబ్ల్యూఎంసి తరపున అట్టి నాలాను విస్తరించడానికి పనులు కొనసాగుతున్నాయని, లోతట్టు ప్రాంతాలలో ఎమర్జెన్సీ ప్లాన్ కింద చర్యలు చేపట్టడం జరుగుతుందని మంగళవారం రాత్రి కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని, వాతావరణ శాఖ ఆదేశాల మేరకు లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని, లోతట్టు ప్రాంతాలలో ఉండే ప్రజల కోసం ఆహారంతో పాటు, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మందులు అందుబాటులో ఉంచడం జరిగిందని, ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో పిల్లలను పాఠశాలకు పంపించవద్దని, ముఖ్యంగా భారీ వర్షాలు కురిసే క్రమంలో ప్రాణహాని ఉంటుందని, కావున పిల్లలను చెరువుల్లో చేపల వేటకు వెళ్లకుండా తల్లిదండ్రులు నియంత్రించాలని, విద్యుత్ సంబంధ వస్తువులను తాకకుండా ఉండాలని, వర్షాలు కురిసే క్రమంలో ఎర్తింగ్ వచ్చే అవకాశం ఉంటుందని, భారీగా నీరు నిలిచి ఉండే లోతట్టు ప్రాంతాలకు విద్యుత్తు నిలిపివేయడం జరిగిందని, ఒకరోజు పునరవస కేంద్రాలలో ఆవాసం పొందడం వల్ల కలిగే నష్టం ఏమీ లేదని రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ వారు అందజేసిన సాటిలైట్ ఇమేజ్ లో మరో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని సమాచారం అందిందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అన్నారు.

బల్దియా కమిషనర్ మాట్లాడుతూ….

జీడబ్ల్యూఎంసి తరపున డిఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉన్నాయని ప్రతి వార్డులో జవాన్తో పాటు ప్రత్యేక మాన్ సూన్ బృందాలు అందుబాటులో ఉన్నాయని అంతే కాకుండా ఇంజనీరింగ్ బృందాలు కూడా క్షేత్ర స్థాయిలో సంసిద్ధంగా ఉన్నారని వర్షపు నీటిని వేగవంతంగా బయటకు పంపించడానికి కచ్చా కాలువల ద్వారా పంపించడం జరుగుతుందని, శాశ్వత పరిష్కారం కోసం నాలాను

విస్తరించడంతో పాటు డ్రైన్ ఆక్రమణలను తొలగించడం జరుగుతుందని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సమీప ప్రాంతాల్లో ఉన్న పునరావాస కేంద్రాల్లోకి వెళ్లాలని ప్రస్తుతం 6 పునరావాస కేంద్రాలు ఎస్ ఆర్ నగర్ లో శుభం గార్డెన్, గాంధీ నగర్, మైసయ్యనగర్ కమ్యూనిటీ హాల్లో, డి కే నగర్లో బీరన్నకుంట హై స్కూల్ , గిరి ప్రసాద్ నగర్లోని కమ్యూనిటీ హాల్, ఏం ఎన్ నగర్ లోని మార్వాడీ హాల్లలోను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రస్తుతం ఆయా కేంద్రాలలో ప్రజలు ఆవాసం పొందుతున్నారని ఉదయం సుమారు 1300 మందికి అల్పాహారం అందజేయడం జరిగిందని లంచ్ తో పాటు డిన్నర్ కూడా అందజేస్తామని ప్రజల అవసరాల కోసం వరంగల్, హన్మకొండ కలెక్టరేట్ లతో పాటు బల్దియా ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నెంబర్ : 18004251980, మొబైల్ నంబర్:

9701999676 అందుబాటు లోకి తెచ్చామని, ప్రజలు ఈ నంబర్లలో సంప్రదించాలని జీడబ్ల్యుఎంసి తరఫున 2 డిఆర్ఎఫ్ బృందాలు 24×7 మూడు షిఫ్టులలో పనిచేస్తున్నాయని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డిఏంహెచ్ఓ సాంబశివరావు ఆర్డిఓ సత్యపాల్ రెడ్డి, సిఏంహెచ్ఓ డా.రాజారెడ్డి, డి ఎఫ్ ఓ శ్రీధర్ రెడ్డి, ఏం హెచ్ ఓ డా.రాజేష్ ఇంచార్జి ఈ ఈ సంతోష్ బాబు, వరంగల్, ఖిలా వరంగల్ తహసీల్దార్ లు మహమ్మద్ ఇక్బాల్, నాగేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.

చిన్నారుల ఆరోగ్యం నులిపురుగుల నివారణ తప్పనిసరి

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-15-4.wav?_=15

చిన్నారుల ఆరోగ్యం నులిపురుగుల నివారణ తప్పనిసరి

డాక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో జాతీయ నులిపురుగుల దినోత్సవం

నేటిధాత్రి చర్ల

చర్ల మండలంలోని కొయ్యూరుప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో సోమవారం జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా చర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని 56 అంగన్వాడి సెంటర్లు 40 గవర్నమెంట్ స్కూల్స్ కేజీబీవీ స్కూల్ ఏకలవ్యస్కూల్ ప్రైవేట్ స్కూళ్లలో ఒక సంవత్సరం మొదలుకొని 19 సంవతసరాల లోపు పిల్లలు అందరికీ నులిపురుగుల నివారణ కొరకు కొరకు ఆల్బెండజోల్ టాబ్లెట్ ఇవ్వడం జరిగినది

National Deworming Day

డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ చర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని మొత్తం ఒక సంవత్సరం మొదలు కొని 19 సంవత్సరాల విద్యార్థులు 5535 మంది ఉండగా అందులో 98 శాతం మందికి ఆల్బెండజోల్ టాబ్లెట్ మింగించటం జరిగినది
వివిధ కారణాలతో స్కూలుకి రాలేకపోయిన విద్యార్థుల కొరకు 18 వ తారీఖున మాప్ అప్ డే ఉంటుంది ఆరోజు మిగిలిన విద్యార్థులు కూడా ఆల్బెండజోల్ టాబ్లెట్లు మిగించడం జరుగుతుందని తెలిపారు విద్యార్థుల చురుకుదనానికి రక్తహీనత నివారణకు ఈ కార్యక్రమం చాలా ఉపయోగపడుతుందని కనుక ఏ ఒక్క విద్యార్థి ఈ టాబ్లెట్ వేసుకోకుండా ఉండకూడదు అని తెలియజేశారు
ఈ కార్యక్రమం విజయవంతం అవ్వటానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక  ధన్యవాదములు తెలియజేశారు

National Deworming Day

ఈ కార్యక్రమంలో మొబైల్ డాక్టర్ సచిన్ ఆర్ బి ఎస్ కే డాక్టర్ సందీప్ డాక్టర్ స్ఫూర్తి మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version