రానా నాయుడు సీజన్2 రివ్యూ ఎలా ఉందంటే…
రెండేండ్ల క్రితం వచ్చి సంచలనం సృష్టించడంతో పాటు తీవ్ర విమర్శల పాలైన వెబ్ సిరీస్ రానా నాయుడు (Rana Naidu). తాజాగా ఈ సిరీస్ సీక్వెల్ డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. విక్టరీ వెంకటేశ్ (Venkatesh Daggubati), రానా (Rana Daggubati), అర్జున్ రామ్‌పాల్ (Arjun Rampal) , సుర్వీన్ చావ్లా (Surveen Chawla), కృతి కర్భంద (Kriti Kharbanda), అభిషేక్ బెనర్జీ (Abhishek Banerjee), సుశాంత్ సింగ్, రజత్ కపూర్ (Rajat Kapoor) కీలక పాత్రల్లో నటించారు. కరణ్ అన్షుమన్ (Karan Anshuman) దర్శకత్వం వహించాడు. అయితే.. ఎన్నో అంచనాల మధ్య నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీకి వచ్చిన ఈ సిరీస్ గత సీజన్‌ను మరిపించిందా లేక నిరాశ పర్చిందా అనేది ఇక్కడ చూద్దాం.
కథ విషయానికి వస్తే బిజినెస్ టైక్యూన్లకు, రాజకీయ నాయకులకు, ఇంకా అచాలా మంది సెలబ్రిటీలకు రానా నాయుడు మిడియేటర్గా ఉంటూ వ్యవహారాలు చక్కబెట్టి కమీషన్ తీసుకుంటాడు. ఇకపై ఫ్యామిలీ అంతా కలిసి ఉండేందుకే ప్రయారిటీ ఇస్తానని, ఎలాంటి మధ్యస్త వ్యవహారాలకు, వివాదాలకు దూరంగా ఉంటానని భార్యకు హామీ ఇస్తాడు. అయితే రానాని తమ గ్రిప్‌లో ఉంచుకోవాలని ఓరోజు ఓ గ్యాంగ్ అతని కుమారుడిని కిడ్నాప్ చేస్తారు. దాంతో రానా ఓ బిజినెస్ టైకూన్ విరాజ్ ఒబెరాయ్, తన తండ్రి నాగ నాయుడు సాయంతో ఆ గ్యాంగ్‌ను అంతమొందించి తిరిగి ముంబయ్ వచ్చేస్తాడు. అయితే రానా చంపిన వారిలో ముంబై గ్యాంగ్‌స్టర్ రవూఫ్ సోదరుడు కూడా ఉండడంతో రానాపై ఎలాగైనా పగ తీర్చుకోవాలని రవూఫ్ అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటాడు. ఇక.. తన కుమారుడిని కాపాడేందుకు సాయం చేసిన విరాజ్ ఒబెరాయ్ వద్ద రానా పని చేస్తూ అన్ని రకాల వ్యవహారాలు చక్కబెడుతుంటాడు. తండ్రిని కాదని సొంతంగా ఎదగాలని చూస్తున్న అలియా ఒబెరాయ్‌కు కూడా రహాస్యంగా హెల్ప్ చేస్తాడు.
అయితే మరోవైపు రానాకు దగ్గరైన ఓ పొలిటీషియన్ రానాకు వ్యతిరేఖంగా రవూఫ్‌కు సాయం చేసి జైలు నుంచి బయటకు తీసుకువచ్చి అతని సాయంతో రాజకీయంగా ఎదగాలని చూస్తుంటాడు. కానీ రవూఫ్ ఆ పొలిటీషియన్‌ను కాదని తానే పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వాలని ఫ్లాన్లు చేస్తుంటాడు. ఇక నాగా నాయుడు సైతం ఓ గ్యాంగ్ లేడీకి డబ్బులు బాకీ పడడం, రానా అన్న, తమ్ముళ్లు ప్రేమలో పడడం వారు డబ్బు సంపాదించి ఈ వ్యవహారాలకు దూరంగా ఉండాలని ప్రయత్నాలు చేసి ఇబ్బందుల్లో పడతారు. మరోవైపు విరాజ్ ఒబెరాయ్ ఓ తప్పు చేసి ఓ పోలీస్ సాయంతో రానాను అందులో ఇరికిస్తాడు. వెరసి మూడు, నాలుగు గ్రూపులు, అందులో వారి సొంత వ్యవహారాలు, వారు పన్నే కుట్రల నేపథ్యంలో రానా అడ్ ఫ్యామిలీ ఎలా చిక్కుకుంది, అందులో నుంచి ఏవిధంగా బయట పడ్డారనే ఈ రానా నాయుడు సిరీస్ సీజన్2 కథ. కథగా చెప్పుకోవడానికి ఇది రెగ్యులర్ రివేంజ్, యాక్షన్ డ్రామానే అయినా గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ తరహా గ్రూపులు, ఒకరిని మించి మరొకరు, ఒకరిపై ఒకరు కుట్రల నేపథ్యంలో ఈ సీజన్‌ను తెరకెక్కించినటలు అర్థమవుతుంది.
అయితే మొదటి భాగంలో ఉన్నట్లు హింస, అశ్లీల సన్నివేశాలు, అసభ్య పదాల వాడకం 80 శాతం తగ్గించి పూర్తిగా రానా అయన ప్యామిలీ, వారి సొంత వ్యవహారాల చుట్టూనే నడిపించారు. కాగా వెంకటేశ్ పాత్ర మాత్రం తీసికట్టుగా ఉందనడంలో అతిశయోక్తి లేదు. ఈ క్యారెక్టర్‌కు వెంకటేశ్ అవసరమే లేదు వేరే ఎవరితోనైనా చేయించొచ్చు అనే అంతగా ఆయన పాత్ర చిత్రణ ఉంది. ఓ కమెడియన్ తరహాలో, అప్పుడప్పుడు రావడం, రస్టిక్‌గా డైలాగులు చెప్పడం ఆపై మాయం కావడం, చివరలో రానాకు చివరి నిమిషంలో హైల్ప్ చేసే క్యారెక్టర్‌కే ఆయన పాత్ర పరిమితమైంది. పూర్తిగా రానా నేపథ్యంలో ఉండడం కాస్త ఊరట కలిగించే విషయం. మొత్తంగా గత సీజన్ అన్ని వర్గాల ప్రజలకు చేరువ కాకపోవడంతో ఈ సీజన్ విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. అన్ని వెబ్ సీరిస్‌ల లాగానే ఇందులోనూ అక్రమ సంబంధ సీన్లు నడిపించారు. గత సీజన్ ఇష్టపడిన వాళ్లకు ఈ సీజన్ అంతగా నచ్చక పోయిన ఒకమారు చూసేయవచ్చు. ఫ్యామిలీస్ అక్కడక్కడ అప్రమత్తంగా ఉండాలి.