ఏసిబి వలలో అవినీతి అధికారి..

ఏసిబి వలలో అవినీతి అధికారి.
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ శేరిలింగంపల్లి జోనల్ అర్బన్ బయోడైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్

ఏసీబీ రైడ్స్ తో మిగతా విభాగాల అధికారులు పరారు…

శేరిలింగంపల్లి, నేటి,ధాత్రి :-

 

ఏసీబీ వలలో మరో అవినీతి తిమింగలం పట్టుబడింది. శేరిలింగంపల్లి జోనల్ జీహెచ్ఎంసీ అర్బన్ బయోడైవర్సిటి డిప్యూటీ డైరెక్టర్ రూ. 70 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు మంగళవారం మధ్యాహ్నం శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో ఏసీబీ డి.ఎస్.పి శ్రీధర్ ఆధ్వర్యంలో సోదాలు చేపట్టింది. అర్బన్ బయోడైవర్సిటి డిప్యూటీ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ గత కొంతకాలంగా చాంద్రాయణ గుట్ట సర్కిల్ లో అర్బన్ బయోడైవర్సిటి విభాగం ఇంచార్జ్ గా వ్యవహరిస్తున్నారు.

https://youtu.be/_tzxsiCQ0C0?si=eQjpA5cVA-A1Qq30

చాంద్రాయణ గుట్ట సర్కిల్ పనికి సంబంధించి ఓ కాంట్రాక్టర్ వద్ద రూ. 2 లక్షల 20 వేలు లంచం డిమాండ్ చేశాడు. కాగా ఇదివరకే రూ. 1 లక్ష 50 వేలు పలు దఫాలుగా తీసుకున్నాడు. ఒప్పందం ప్రకారం మిగతా రూ. 50 వేలు ఇచ్చేందుకు శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయానికి రావాలని సూచించాడు. దీంతో కాంట్రాక్టర్ శ్రీనివాస్ తెలిపిన విధంగా శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలోని ఛాంబార్ కు వచ్చాడు. కాంట్రాక్టర్ నుంచి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు శ్రీనివాసుని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ డి.ఎస్.పి శ్రీధర్ తెలిపారు.

https://youtu.be/_tzxsiCQ0C0?si=eQjpA5cVA-A1Qq30

 

ఏసీబీ రైడ్స్ తో మిగతా విభాగాల అధికారులు పరారు…
శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలోని అర్బన్ బయోడైవర్సిటీ విభాగం అధికారి పై ఏసీబీ రైట్స్ జరగడంతో, జోనల్ కార్యాలయంలోని మిగతా విభాగాల అధికారులు పరారయ్యారు. ఉదయం 12 గంటల నుంచి అన్ని విభాగాల అధికారులు కార్యాలయంలో లేకపోవడంతో కుర్చీలు కాలిగా దర్శనమిచ్చాయి. అధికారులు అందుబాటులో లేకపోవడంతో పనుల పైన విచ్చేసిన ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఏదో ఒక అధికారిపై ఏసీబీ దాడులు జరిగితే మిగతా అందరూ వీధిల నుంచి తప్పించుకుని వెళ్లడంపై సర్వత్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ఏసీబీ దాడులకు భయపడే అధికారులు పారిపోయారంటూ పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి.

 

https://youtu.be/_tzxsiCQ0C0?si=eQjpA5cVA-A1Qq30

‘రాబోయేది బీజేపీ.. ప్రభుత్వం’.

‘రాబోయేది బీజేపీ.. ప్రభుత్వం’. 

తల్లోజు ఆచారి.

కల్వకుర్తి/నేటి ధాత్రి:

 

 

కల్వకుర్తి పట్టణంలోని బిజెపి కార్యాలయంలో మంగళవారం బీజేపీ క్రియాశీలక సభ్యుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ జాతీయ బీసీ కమిషన్ నెంబర్ తల్లోజు ఆచారి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో జరగబోయే ప్రతి ఎన్నికలలో బిజెపి విజయ దుందుభి మోగిస్తుందని ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని రాష్ట్రంలో దాదాపు సగం బీజేపీ ఎంపీల పాలనలో ఉందని వచ్చే ఎన్నికల్లో పూర్తిగా తెలంగాణ రాష్ట్రం బీజేపీ వశం అవుతుందని భవిష్యత్తు బీజేపీ దేనని.. దానికి అనుగుణంగా కృషి చేయాలని కార్యకర్తలకు, నాయకులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

‘వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం’. 

‘వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం’. 

దేవరకద్ర /నేటి ధాత్రి.

 

 

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మార్కెట్ యార్డ్ లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందన్నారు. రైతులు పండించిన ప్రతీ గింజను మద్దతు ధరతో కొనుగోలు చేసి, వారి అకౌంట్లలో డబ్బులు వేస్తామన్నారు. సన్నాలు పండించిన రైతులకు మద్దతు ధరతో పాటు.. రూ.500 బోనస్‌ వస్తుందని అన్నారు.
అనంతరం చిన్న రాజమూర్ గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన చిన్న రాజమూర్ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు ఎర్ర గొల్ల ప్రేమ్ కుమార్ యాదవ్ తల్లి భౌతిక దేహానికి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

విద్వేషకర పోస్టులు పెడితే చర్యలు తప్పవు..

విద్వేషకర పోస్టులు పెడితే చర్యలు తప్పవు..

సోషల్ మీడియాను చెడుకు ఉపయోగించొద్దు..

వాట్సాప్, ఇన్ స్టాలో వచ్చే పుకార్లను నమ్మొద్దు..

నిబంధనలకు అతిక్రమిస్తే కఠినమైన చర్యలు…

యువత భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని నడుచుకోవాలి..

రామాయంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట రాజా గౌడ్..

రామాయంపేట ఏప్రిల్ 15 నేటి ధాత్రి (మెదక్)

 

 

 

ప్రజలు, యువకులు, ప్రజా ప్రతినిధులు రాజకీయ పార్టీల కార్యకర్తలు సోషల్ మీడియాలో ఫోటోలు మార్పించేస్తూ ప్రజల మనోభా వాలు దెబ్బతీసే విధంగా సోషల్ మీడియా వాట్సప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్, పోస్టులు పెట్టవద్దని, అలా పెట్టిన వ్యక్తులపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి తగు చర్య లు తీసుకోవడం జరుగుతుందని సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట రాజా గౌడ్ హెచ్చరించారు.
ఇందుకోసం ప్రత్యేక సోషల్ మీడియా సెల్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు తప్పుడు వార్తలు పెట్టే వారిపై ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయడం జరుగు తుందన్నారు. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు, ప్రజలు ఎవ్వరు నమ్మవద్దని సూచించారు. సామాజిక మాద్యమాలను వేదికగా చేసుకోని తప్పుడు, విద్వేషకర పోస్టులు చేసిన, షేర్ చేసినా వారి సమాచా రాన్ని రామాయంపేట సర్కిల్ కార్యాలయం కంట్రోల్

రూమ్ వాట్సప్ నెంబర్కు 8712667100 తెలియజేయాలని అట్టి సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. ఈ టెక్నాలజీ యుగంలో వాట్సప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ద్వారా సమాచారము క్షణాల్లో కొన్నిలక్షల మందికి చేరుతుందని పంపించే సమాచారాన్ని ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని సూచించారు. సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ను మంచి మంచి కార్యక్రమాలకు ప్రజలను యువతను చైతన్యపరిచే విధమైన పోస్టులు చేస్తూ మంచితనానికి ఉపయోగిం చుకోవాలని సూచించారు. ముఖ్యంగా యువత వారి భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని నడుచుకోవాలని, సోషల్ మీడియాలో అనవసరమైన పోస్టులు పెట్టి ఇబ్బంది పడవద్దని భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.

జర్నలిస్టులకు న్యాయం చేయండి.

జర్నలిస్టులకు న్యాయం చేయండి.

డబుల్ బెడ్ రూములు కేటాయించే వరకు పోరాడుతాం…

రెండో రోజు రిలే నిరహార దీక్షలు. వివిధ పార్టీల నాయకులు, సంఘాల మద్దతు.

జర్నలిస్టుల డబల్ బెడ్ రూమ్ లు కేటాయించండి మంత్రి కొండా సురేఖకు విజ్ఞప్తి

వరంగల్ తూర్పు, నేటిధాత్రి

 

 

వరంగల్ తూర్పు జర్నలిస్టుల కోసం గత ప్రభుత్వం నిర్మించిన డబల్ బెడ్ రూమ్ లను త్వరగా కేటాయించాలని వరంగల్ తూర్పు వర్కింగ్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో రిలే నిరహార దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. సోమవారం మొదలైన దీక్ష, పాలకులు స్పందించే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.. యూనియన్ సంఘాలకు అతీతంగా కూడు గూడు జర్నలిస్టుల హక్కుల కోసం చేస్తున్న నిరాహార దీక్షకు సీపీఐ సిపిఎం నాయకుల మద్దతుతో పాటు, విద్యార్థి సంఘాల సంఘీభావం ప్రకటించారు. ఎవరు కలిసొచ్చినా స్వాగత్తిస్తామని తూర్పు వర్కింగ్ జర్నలిస్టులు ముక్త కంఠంతో తెలిపారు. మంగళవారం నిర్వహించిన జర్నలిస్టుల నిరాహార దీక్షలో బీజేపీ, సీపీఐ, సీపీఎం, విద్యార్థి సంఘం నేతలు, కార్మిక యూనియన్ నాయకులు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్బంగా వక్తలు మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్స్ సాధించే వరకు న్యాయ పోరాటం, నిరసన దీక్షలు చేస్తామని అందులో భాగంగా మూడు రోజుల దీక్షలు ఉంటాయని తెలిపారు. ఈ న్యాయ పోరాటం జర్నలిస్టుల దీక్షలో తప్పుడు ప్రచారం చేయడం హేయమైన చర్యగా పరిగణలోకి తీసుకుంటామని కనీస హక్కుల సాధన పోరాటంలో రాజకీయ రంగు కావాలని అంటిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. జర్నలిస్టుల హక్కుల కోసం కలిసోచ్చే పార్టీలకు యూనియన్లకు అతీతంగా స్వాగతిస్తున్నామని అసత్య ప్రచారాలు బురదజల్లే ఆలోచనలు మానుకోవాలని కొందరి నాయకులకు దీక్ష శిభిరం నుండి సూచించారు. మా ప్రయత్నం ఫ్లాట్లు, డబుల్ బెడ్రూమ్స్, కనీస హక్కులు సాధన కోసమేనని అందులో ఎక్కడ పదవులు అధికారం లేదని తేల్చి చెప్పారు.

సీఎం సహాయక నిధి..పేదలకు వరం.

సీఎం సహాయక నిధి..పేదలకు వరం’

కల్వకుర్తి/నేటి ధాత్రి:

 

 

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి సహకారంతో కల్వకుర్తి పట్టణానికి చెందిన 27 మంది లబ్దిదారులకు రూ. 9లక్షల విలువ గల సీఎం సహాయ నిధి చెక్కులను మంగళవారం కల్వకుర్తి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కల్వకుర్తి మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చీమ్ముల శ్రీకాంత్ రెడ్డి లు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మిర్యాల శ్రీనివాస్ రెడ్డి,మాజీ కౌన్సిలర్ లు గోరటి శ్రీనివాసులు, చిన్న, హన్మనాయక్, రవి,చిత్తరి శ్రీను, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రమాకాంత్ రెడ్డి,రేష్మ, నాయకులు పుస్తకాల రాహుల్, మిరియాల దామోదర్ రెడ్డి,పాండు రంగా రెడ్డి, శంకర్ నాయక్,కేశవులు, ప్రవీణ్,విక్కీ భాయ్, పడకంటి వెంకటేష్, దున్న సురేష్, శ్రీశైలం,పరశురాం శివ,లబ్ది దారులు తదితరులు పాల్గొన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో రెడ్ క్రాస్ సేవలు ప్రశంసనీయం..

గ్రామీణ ప్రాంతాల్లో రెడ్ క్రాస్ సేవలు ప్రశంసనీయం..

నిజాంపేట గ్రామంలో మెగా వైద్య క్యాంపు విజయవంతం..

హాజరైన తాసిల్దార్, ఎస్సై.. ఇతర అధికారులు…

రామాయంపేట ఏప్రిల్ 15 నేటిధాత్రి (మెదక్)

 

 

 

గ్రామీణ ప్రాంతాల్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని నిజాంపేట సబ్ ఇన్స్పెక్టర్ బండి రాజేష్ కొనియాడారు.
మంగళవారం నాడు నిజాంపేట మండల కేంద్రంలో తుప్రాన్ వి ఎస్ టి ఇండస్ట్రీస్ సహకారంతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మెదక్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా వైద్య శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు..

SI

 

నిజాంపేట గ్రామంలో మెగా వైద్య క్యాంపును నిర్వహించడం శుభ పరిణామం అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలను మళ్లీ నిజాంపేట మండలంలో కొనసాగిస్తే తమ వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఆయన తెలిపారు.
అనంతరం రెడ్ క్రాస్ సోసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సింగం శ్రీనివాసరావు, జిల్లా చైర్మన్ ఏలేటి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలు, మెగా వైద్య క్యాంపులు, ఇతర సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. కాగా నిజాంపేట గ్రామంలో నిర్వహించిన ఉచిత వైద్య మెగా క్యాంపుకు అక్కడి ప్రజల నుండి మంచి స్పందన లభించింది.

SI
SI

 

మల్లారెడ్డి ఆసుపత్రికి చెందిన డాక్టర్లు ఉమేష్ రఘు ప్రసాద్, సాయి సురమి, అభినవ్, చంద్రశేఖర్, అరుణ్ కాంత్ రెడ్డి, ప్రణీత, శ్రీ చరిత్ర
శిబిరములో పాల్గొని పేషెంట్లకు వైద్య సేవలు అందించారు. ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ రమ్యశ్రీ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రీతి, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కోశాధికారి డి. జి . శ్రీనివాస శర్మ, మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు దేమే యాదగిరి, మద్దెల సత్యం, దామోదర్ రావు, లక్ష్మణ్ యాదవ్ , వంగరీ కైలాస్ ,తోట శ్రీనివాస్, N. మాధవరెడ్డి, G తిరుపతి, G స్వామి, కాంగ్రెస్ పార్టీ నాయకులు రావిపల్లి అమర సేవా రెడ్డి, పంజ మహేందర్, సుధాకర్ తో పాటుగా నరేందర్ , వినయ్ గౌడు, S. తిరుపతి, మహేష్, తమ్ములి రమేష్
తదితరులు పాల్గొన్నారు.

విజన్ ఉన్న నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి.

విజన్ ఉన్న నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి

ధరణి చేతిలో చిక్కుకున్న భూములకు విముక్తి

రైతులను హరిగోశపెట్టిన ధరణి నీ బంగాళాఖాతంలో పాతర

భూభారతి పోర్టల్ ను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో అమీనాపురంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి జిల్లాకాంగ్రెస్ ఉపాధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను ఒక్కటి ఒక్కటిగా అమలుపరుస్తూ బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడుతుంది. నిన్న ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళి ఇచ్చే సందర్భంలో మూడు దశాబ్దాల పాటు ఎస్సీ కుల వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్న వర్గాలకు ఆనాడు ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన మేరకు కాంగ్రెస్ సర్కారు 15% రిజర్వేషన్లను మూడు భాగాలుగా విభజించి అమలు చేయడానికి జీవోను కూడా జారీ చేయడం జరిగింది. గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2008లో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎస్సీ వర్గీకరణ అమలు కోసం ఉషా మేహరా కమిషన్ వేసి ప్రయత్నం చేయడం జరిగింది న్యాయ చిక్కుల వలన చేయలేదు. కానీ ఈనాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ కోసం ఉత్తంకుమార్ రెడ్డి చైర్మన్, దామోదర రాజ నరసింహ వైస్ చైర్మన్ సభ్యులుగా పొన్నం ప్రభాకర్, సీతక్క, శ్రీధర్ బాబు, మల్లు రవి లను ఉప సంఘం ఏర్పాటు చేసి వారి స్థితిగతులపై అధ్యయనం చేసి వారి సిఫారసు మేరకు ఏకసభ్య కమిషన్ విశ్రాంత జస్టిస్. షమీం అక్తర్ ను నియమించి వారి సలహా సూచనలను తీసుకొని మంత్రి వర్గం ఆమోదించి, తర్వాత అసెంబ్లీలో కూడా ఆమోదించి చట్టాన్ని చేయడం జరిగింది. ఈ చట్టం నిన్నటి నుండే అమలులోకి వస్తు ఎస్సీలను మూడు వర్గాలుగా విభజించి ఉద్యోగ రాజకీయ అన్ని రంగాలలో కూడా అమలు చేసే విధంగా జీవో జారీ చేయడం జరిగింది. అదేవిధంగా అంబేద్కర్ జయంతి సందర్భంగా భూభారతి పోర్టల్ ను ప్రారంభించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ధరణి పోర్టల్ వలన ఎన్నో ఇబ్బందులకు గురైన రైతుల ఆవేదనను చూసి ఆనాడు మేము అధికారంలోకొస్తే ధరణి పోర్టల్ బంగాళాఖాతంలో వేసి భూమాత పోర్టల్ ను తెస్తానని మాట ఇచ్చిన ప్రకారం భూమాత పోర్టల్ ను తెచ్చి రైతులందరికీ,ప్రజలకు సులువుగా భూమి యొక్క సమస్యలను పరిష్కార దిశగా నాలుగు మండలాల్లో పైలెట్ ప్రాజెక్టుగా మొదలుపెట్టి ప్రజల నుండి వస్తున్నటువంటి వినతులను స్వీకరించి ఆ సమస్యలను పరిష్కార దిశగా కొత్త మాడ్యూలను ఏర్పాటు చేస్తూ పూర్తిస్థాయిలో రాష్ట్రంలో జూన్ 2 నుండి అమలు చేసే దిశగా ప్రభుత్వం కృతనిచ్చయంతో ఉండడం అభినందనీయం కాంగ్రెస్ పార్టీ అంటేనే పేద బడుగు బలహీన వర్గాల అండగా ఉండే పార్టీ వారి అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అదేవిధంగా గత బిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలలో దొడ్డు బియ్యాన్ని పేద ప్రజలకు ఇస్తా ఉంటే వాటిని పేద ప్రజలు తినకుండా విక్రయిస్తా ఉంటే వ్యాపారం చేసిన వారు లక్షల రూపాయలుదండుకున్నారు తప్ప పేదవాని ఆకలి తీరనటువంటి పరిస్థితిని చూసి కాంగ్రెస్ పార్టీ ప్రతి పేదవానికి సన్న బియ్యం అందే విధంగా దేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాన్ని తీసుకువచ్చి పేదవాడు సన్న బియ్యంతో బుక్కెడు అన్నము కడుపునిండా తిని నిత్యం పండగ వాతావరణం ప్రతి పేదల ఇండ్లలో ఉండాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులకు ఎమ్మెల్యేలకు ప్రజలందరూ దన్నుగా ఉండి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూ ఉంటే పేద బడుగు బలహీన వర్గాల కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుందని మరొక్కసారి విన్నవించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి అంబటి. లక్ష్మి,అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మందుల కృష్ణమూర్తి, అంబేద్కర్ యువజన సంఘం మండల వర్కింగ్ ప్రెసిడెంట్ వేల్పుగొండ ఏలియా, మండల ఉపాధ్యక్షులు కళ్లెం శ్రీనివాస్ రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షులు సామ సుధాకర్ రెడ్డి, జన్ను కట్టయ్య, లింగాల నేతాజీ, లాకావత్ బాలు నాయక్, ఇనుముల కర్ణాకర్, వెంకట్రాం నరసయ్య, సామ శ్రీనివాస్, కొడారి. నాగేంద్రబాబు, భోగం రమ, కొనకటి మధు, సింగిరెడ్డి కృష్ణ, కొనకటి వెంకటరెడ్డి, కుసుమ సాంబమూర్తి, వంతడుపుల సమ్మయ్య పాల్గొన్నారు.

ప్రమాదం ఉందన్నా పట్టించుకోవడం లేదు.!

ప్రమాదం ఉందన్నా పట్టించుకోవడం లేదు ….
కమ్మరి,హనుమంతు, ఝరాసంగం

“నేటిధాత్రి”

 

 

విద్యుత్ వైర్ల వల్ల చేతికి వచ్చిన పంటను తీసుకోవడం లేదు. వైర్ల కిందదున్నలాంటిఎప్పుడూప్రమా దం జరుగుతుందో తెలియని పరిస్థితి. అధికారు లకు ఫిర్యాదు చేసినా పట్టించు కోవడం లేదు. స్తంభం వేయడానికి డబ్బులు ఖర్చవు తాయని చెప్పుతున్నారు.

ప్రజాసేవకే కాకా కుటుంబం… ప్రజల కొరకే కాకా కుటుంబం.

ప్రజాసేవకే కాకా కుటుంబం… ప్రజల కొరకే కాకా కుటుంబం..

పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

రైల్వే బ్రిడ్జికి పునాది వేశాం… ప్రారంభించాం..!

ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

సన్నబియ్యం అక్రమ దందా చేస్తే కేసులు నమోదు చేస్తాం.

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి

క్యాతనపల్లి వద్ద రైల్వేగేటుపై నిర్మించిన ఫ్లైఓవర్‌ బ్రిడ్జికి పునాది వేసింది మేమే ప్రారంభించింది మేమేనని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మంగళవారం రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రజాసేవకే కాకా కుటుంబం అని ప్రజల కొరకే కాక కుటుంబం అని అన్నారు.

 

MP

రామకృష్ణాపూర్ పట్టణ ప్రజల చిరకాల కోరిక రైల్వే బ్రిడ్జి ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని, గతంలో కాంగ్రెస్ హయాంలో పెద్దపల్లి ఎంపీగా ఉన్న సమయంలో బ్రిడ్జి పునాది వేశామని, తిరిగి కాంగ్రెస్ పార్టీ హయాంలోనే పెద్దపల్లి ఎంపీ, చెన్నూరు ఎమ్మెల్యేలుగా ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో బ్రిడ్జి నిర్మాణ పనులు ఆలస్యం అయ్యాయని ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం త్వరితగతిన పూర్తిచేసి బ్రిడ్జి ప్రారంభించామని తెలిపారు.ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని, ప్రజాసేవకే కాక కుటుంబం ఉందని అన్నారు. గత ప్రభుత్వం దాచుకోవడం దోచుకోవడం తోనే సరిపోయిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పరిపాలనలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని, ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ..

 

MP

రైల్వే గేటు పడిన సమయంలో అనేక ప్రాణాలు పోయాయని, ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణంతో ప్రాంత ప్రజల కష్టాలు తీరుతున్నాయని అన్నారు. పేద ప్రజలకు ఉచితంగా సన్నబియ్యం కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిందని అందరూ సద్వినియోగం చేసుకోవాలని, సన్న బియ్యపు అక్రమ దందా చేస్తే కేసును నమోదు చేస్తామని హెచ్చరించారు. మున్సిపాలిటీలోని అన్ని ఏరియాలకు త్వరలోనే మంచినీరు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కమిషనర్ గద్దె రాజు, మాజీ చైర్ పర్సన్ జంగం కళ,మాజీ వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, టిపిసిసి నాయకులు రఘునాథ్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి వొడ్నాల శ్రీనివాస్, సీనియర్ నాయకులు గాండ్ల సమ్మయ్య, అబ్దుల్ అజీజ్, యాకుబ్ ఆలీ, గోపతి భానేష్, పాల రాజు,మహంకాళి శ్రీనివాస్,కుర్మ సురేందర్, సిపిఐ నాయకులు మిట్టపల్లి శ్రీనివాస్, రామడుగు లక్ష్మణ్, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, పట్టణ ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు.

పంట పొలాల్లో మృత్యు పాశాలు.

పంట పొలాల్లో మృత్యు పాశాలు…

పట్టించుకోని విద్యుత్ అధికారులు..

డబ్బులు చెల్లిస్తేనే మరమ్మత్తులు చేస్తామంటున్న అధికారులు..

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

 

రైతులు పోలాల్లో సాగు చేసిన పంటలను కోత చేసి ఇంటికి తరిలించా లంటే విద్యుత్ వైర్ల కింది కి వేలాడడం వల్ల పంటను వదిలేయాల్సిన పరి స్థితి ఏర్పడింది. మండల కేంద్రమైన ఝరాసంగంలో ఓ రైతు పోలంలో
విద్యుత్ వైర్లు పోలాల్లో వేలాడడం కారణంగా చేతికి వచ్చిన పంటను కోయకుండా వదిలేయడంతో పాటు వైర్ల కింద దున్నకుండా వదిలేస్తు న్నారు. విద్యుత్ తీగలను సరిచేయాలని సంబంధిత విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. వేలా డుతున్న విద్యుత్ వైర్ల మధ్య లో విద్యుత్ స్తంభం ఏర్పాటు చేస్తే సమస్య పరిష్కారం అయిదానికి అధికారులు డబ్బులు చేల్లిస్తేనే మరమ్మతులు చేసా _మని చెప్పుతున్నారని వారు ఆరోపించారు. ప్రాణాలు పోతే తప్ప పట్టించు కోరా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. గత కొన్ని నెలల క్రితం ఝరాసంగం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మేకల మేత కోసం వెళ్ళి వేలాడుతున్న విద్యుత్ వైర్లు తాకడంతో మృతి చెందారు. ఇంత జరిగినా అధికారులు
పట్టించుకోకపోవడం దారుణంగా ఉందన్నారు.

వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను.!

వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్.

 

నడికూడ,నేటిధాత్రి:

మండలంలోని వెంకటేశ్వర్ల పల్లి చైతన్య గ్రామైక్య సంఘం,చౌటుపర్తి శ్రీ ఆంజనేయ గ్రామైక్య సంఘం ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి ప్రారంభించారు.అనంతరం మాట్లాడుతూ ఐకేపీ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రా లకు ధాన్యాన్ని తరలించి,ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు.దీనివల్ల 500 రూపాయల బోనస్ కూడా రైతులకు చేకూరుతుందన్నారు.రైతుల ఆర్థిక అభివృద్దే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.మద్దతు ధర క్వింటాలుకు ‘ఎ ‘ గ్రేడ్ రకం రూ. 2320.సాధారణ రకానికి ధర 2300‌. ఉందన్నారు.ఈ కార్యక్రమం లో ఏవో జైసింగ్,ఏపిఎం రమాదేవి,కాంగ్రెస్ పార్టీ నడికూడ మండల అధ్యక్షు డు బుర్ర దేవేందర్ గౌడ్, సమన్వయ కమిటీ సభ్యులు పెద్దబోయిన రవీందర్ యాదవ్,ఈర్ల చిన్ని, బొల్లె బిక్షపతి,పిఏసిఎస్ సెంటర్ ఇంచార్జ్ పెండ్యాల మహేందర్ రెడ్డి,సీఈవో చోటా మియా, టాప్ ఆపరేటర్ పెగడ ఓం ప్రకాష్,సిసి కుమారస్వామి, మహిళా సంఘం సభ్యులు హరిత,స్వరూప,నవ్య శ్రీ, లక్ష్మి,మాధవి,ప్రసన్న,హైమ, రమ్య,తిరుమల,రైతులు తదితరులు పాల్గొన్నారు.

పాతికేళ్ల పార్టీ పేరంటానికి రండి..!

పాతికేళ్ల పార్టీ పేరంటానికి రండి..!

ఇల్లెందులో వినూత్నంగా ఆహ్వానాలు

ఆడపడుచులకు బొట్టి పెట్టి పిలుపులు.

ఎంపీ “వద్దిరాజు”, మాజీ ఎమ్మెల్యే హరిప్రియ తదితరుల హాజరు.

“నేటిధాత్రి”ఇల్లెందు, ఏప్రిల్, 15:

 

 

సన్నాయి మేళం సప్పుడు.. బాజా భజంత్రీల మోతలు.. వెంట నడిచిన మహిళా నేతలు.. కుంకుమ పూలు, కుంకుమ, గంధం, వాయినాలు.. ఇవన్నీ ఏ పెండ్లి కార్యానివో అనుకుంటే.. పప్పులో కాలేసినట్లే..! ఈ హడావిడి ఎక్కడో తెలుసుకోవాలంటే.. ఈ వార్త పూర్తిగా చదవాల్సిందే..!!

 

 

MLA

ఏప్రిల్ 27న వరంగల్ లో జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ కు సన్నాహకంగా ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించారు. మేళ, తాళాల నడుమ పార్టీ ముఖ్య నాయకుల ఇళ్లకు వెళ్లి బొట్టు పెట్టి వరంగల్ సభకు ఆహ్వానించారు. రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, తెలంగాణ ఉద్యమకారుడు దిండిగాల రాజేందర్ అతిథులుగా హాజరైన ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, మహిళా నేతలు, కౌన్సిలర్లు వెంట నడిచారు. ఇల్లెందు మున్సిపాలిటీ 7 వార్డులో గల 2 నెంబర్ బస్తీలో ఈ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. బీఆర్ఎస్ క్రియాశీల కార్యకర్తల కుటుంబాల్లో ముఖ్యులైన బజారు సత్యనారాయణ, ఎంఏ రవూఫ్, చాగర్ల సరళ, సామల రవితేజ ఇళ్లకు వెళ్లి బొట్టు పెట్టి, కుటుంబ సభ్యులందరినీ వరంగల్ లో జరిగే రజతోత్సవ సభకు హాజరు కావాలని ఎంపీ వద్దిరాజు కోరారు. ఒక ప్రాంతీయ పార్టీ పాతికేళ్లుగా క్రియాశీలకంగా ప్రజల కోసం అంకితమై పని చేయడం చాలా అరుదు అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ తర్వాత అంతటి ఘనత బీఆర్ఎస్ కే దక్కిందన్నారు. అందుకే.. బీఆర్ఎస్ పాతికేళ్ల సంబురం పండుగలా నిర్వహిస్తున్నామని వద్దిరాజు తెలిపారు. ఈ సభకు తాము ఊహించిన దానికంటే ఎక్కువ మంది కార్యకర్తలు తరలివస్తున్నారని చెప్పారు. ఈ సభ విజయవంతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని రవిచంద్ర కోరారు.

గులాబీ దండు కదం తొక్కాలి..!

గులాబీ దండు కదం తొక్కాలి..!
కాంగ్రెసోళ్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తాలి..!!ఎంపీ “వద్దిరాజు”

“నేటిధాత్రి”,ఇల్లెందు, ఏప్రిల్, 15:

 

 

వరంగల్ లో జరిగే సభకు ఇల్లెందు నియోజకవర్గం నుంచి గులాబీ దండు వేలాదిగా కదం తొక్కాలని రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. ఈ సభకు హాజరయ్యే పార్టీ శ్రేణులను చూసి కాంగ్రెసోళ్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తాలని అన్నారు. మాజీ శాసనసభ్యురాలు బాణోత్ హరిప్రియా నాయక్ అధ్యక్షతన మంగళవారం ఇల్లెందు నియోజకవర్గ పార్టీ విస్తృత సమావేశం జరిగింది. ఎంపీ రవిచంద్ర ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వరంగల్ లో పది లక్షల మందితో జరిగే సభలో.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏం మాట్లాడుతరోనని తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో ఏడాదిన్నరకే ప్రజలు విసిగి, వేసారి పోయారని అన్నారు. ఆచరణలో సాధ్యం కాని హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చి వాటిని అమలు చేయలేక చేతులెత్తేశారని విమర్శించారు. కేసీఆర్ ను దూరం చేసుకుని తప్పు చేశామని ప్రజలంతా పశ్చాత్తాప పడుతున్నారని అన్నారు.

BRS

 

కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేద్దామని భ్రమ పడుతున్న ముఖ్యమంత్రి.. తాను కూర్చున్న కుర్చీ కూడా కేసీఆర్ పెట్టిన బిక్షే అని గురైరగాలని అన్నారు. కేసీఆర్ పోరాటం చేయకపోతే ఇవాళ రాష్ట్రమే వచ్చేది కాదని ఎంపీ రవిచంద్ర గుర్తు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ అద్యక్షుడు రేగా కాంతారావు మాట్లాడుతూ.. వరంగల్ సభ విజయవంతానికి దిశా నిర్ధేశం చేశారు.

BRS

 

బహిరంగ సభకు హాజరయ్యే ముందు పార్టీ కార్యకర్తలంతా తమ తమ గ్రామాల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించుకుని బయలుదేరాలని పిలుపునిచ్చారు.

BRS

 

 

సమావేశంలో గ్రంధాలయ సంస్థ మాజీ అద్యక్షుడు దిండిగాల రాజేందర్, మహబూబాబాద్ జెడ్పీ మాజీ చైర్మన్ ఆంగోత్ బిందు, డిసీసీబీ మాజీ డైరెక్టర్ లక్కినేని సురేందర్, సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షులు సంజీవ్ నాయక్, వివిధ మండలాల పార్టీ బాధ్యులు శీలం రమేష్, బొమ్మెర ప్రసాద్, తాతా గణేష్, లక్ష్మణ్ నాయక్, పరుచూరి వెంకటేశ్వరరావు, టీబీజీకేఎస్ నాయకులు రంగనాధ్, జాఫర్ హుస్సేన్, జెకే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

హోతి బి అంబేద్కర్ నూతన విగ్రహ ఆవిష్కరణ

హోతి బి గ్రామంలో డాక్టర్ బి.ఆర్ బాబా సాహెబ్ అంబేద్కర్ నూతన విగ్రహ ఆవిష్కరణ

జహీరాబాద్ . నేటి ధాత్రి:

 

 

అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఆయన రాసిన రాజ్యాంగం పల్లె తెలంగాణ రాష్ట్ర ఏర్పడినందుకు తెలంగాణ ఫాదర్ ఆఫ్ ది గార్డ్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిలిచిపోతారని చరిత్రలో నిలిచిపోయే పేరు రాజ్యాంగ గ్రహీత డాక్టర్ భారతరత్న బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అన్ని వర్గాలకు సమానత్వం చేస్తూ ఆయన చూపిన బాటలో నడుస్తూ మనమంతా ఒకటేనని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ కార్యక్రమంలో జహీరాబాద్ శాసనసభ్యులు మాణిక్ రావు మాజీ కౌన్సిలర్లు మాజీ జెడ్పిటిసిలు మండల అధ్యక్షులు అంబేద్కర్ అభిమానులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జై భీమ్ నినాదంతో ఆయన చేసిన సేవలు గుర్తు చేసుకున్నారు

 

Ambedkar

తట్టు నారాయణ, నామ రవి కిరణ్, మహమ్మద్ ఇమ్రాన్ బి ఆర్ఎస్ సీనియర్ లీడర్ జహీరాబాద్, డ్రైవర్ కాలనీ జాకీర్, అహమద్ నగర్, ఆలీ, సీఎం అశోక్ రెడ్డి, బండి మోహన్, మోయోద్దీన్ సాబ్, పాల్గొనడం జరిగింది.

వీరభద్రేశ్వర స్వామి నిదర్శించుకున్న మాణిక్ రావు.

వీరభద్రేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మల్యే మాణిక్ రావు

జహీరాబాద్ . నేటి ధాత్రి:

 

న్యాల్కల్ మండలం మరియంపూర్ గ్రామంలోని వీరభద్రేశ్వర స్వామి వారి జాతర ఉత్సవాల్లో శాసనసభ్యులు కొన్నింటి మానిక్ రావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి దర్శిస్తున్నారు.ఆలయ కమిటీ అధ్యక్షుడు ,సభ్యులు ఎమ్మెల్యే మాణిక్ రావు గారినీ,నాయకులను సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Temple

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు రవీందర్,మాజి మండల పార్టీ అధ్యక్షులు నర్సింహ రెడ్డి,యువ నాయకులు మిథున్ రాజ్ ,మాజి సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షులు రవి కుమార్,శ్రీకాంత్ రెడ్డి రాజు పటేల్,లోకేష్ పటేల్,మల్ రెడ్డి,అశోక్ పాటిల్ ,సంగమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి. 

ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి. 

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

సిరిసిల్ల టౌన్ : (నేటిధాత్రి)

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని యాసంగి పంట ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి అని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ , అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ తో కలిసి ధాన్యం కొనుగోలు పురోగతి పై సంబంధిత అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ,యాసంగి మార్కెటింగ్ సీజన్ లో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రతిపాదించిన 240 కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటి వరకు 119 ఐకేపి, 21 పాక్స్, 7 మెప్మా, 1 డి .సి.ఎం.ఎస్. మొత్తం 148 కేంద్రాలను ఓపెన్ చేశామని, మరో రెండు రోజుల వ్యవధిలో మిగిలిన 92 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకుని వచ్చే ధాన్యం తేమ శాతం , ఇతర ప్రమాణాలను చెక్ చేసి ఎఫ్.ఏ.క్యు ఉన్న ధాన్యం మద్దతు ధర పై కొనుగోలు చేసీ ఓ.పి.ఎం.ఎస్.లో ఎంట్రీ చేయాలని అన్నారు.

Cooperation Officer.

కొనుగోలు చేసిన ధాన్యాన్ని ట్రక్ షీట్స్ ప్రకారం సంబంధిత రైస్ మిల్లులకు తరలించాలని, ఎక్కడైనా రైస్ మిల్లర్లు ధాన్యం దించుకొని పక్షంలో ఇంటర్మీడియట్ గోదాము లకు తరలించాలని కలెక్టర్ సూచించారు.
జిల్లాలో ఉన్న ఖాళీ గోదాము లను సమీపంలో గల కోనుగోలు కేంద్రాలకు ట్యాగ్ చేయాలని కలెక్టర్ తెలిపారు.ప్రతి మండలం సమీపంలో గల గోదాములను ధాన్యం భద్ర పరిచేందుకు హైర్ పద్దతిలో తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
ఈ సమీక్షా సమావేశంలో డి.ఆర్డి.ఓ శేషాద్రి, డి.ఏ.ఓ అఫ్జలి బేగం, జిల్లా సహకార అధికారి రామకృష్ణ, పౌర సరఫరాల శాఖ అధికారులు రజిత, వసంత లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

పేకాటరాయుళ్లపై పోలీస్ పంజా పదిమంది అరెస్ట్.

పేకాటరాయుళ్లపై పోలీస్ పంజా,.. పదిమంది అరెస్ట్

నగదు, బైకులు, సెల్ ఫోన్లు స్వాధీనం

శాయంపేట నేటిధాత్రి:

 

 

శాయంపేట మండలం వసం తాపూర్ గ్రామంలో పేకాట స్థావరంపై పోలీసుల దాడులు నిర్వహించగా పదిమంది పేకాట రాయులను అరెస్టు చేసినట్లు ఎస్సై జక్కుల పర మేష్ తెలిపారు.

 

Arrested

ఈ మేరకు పోలీస్ సిబ్బంది శిబిరంపై దాడులు చేసి పదిమంది పెట్టుకున్నట్లు తెలిపారు.వారి నుండి 22 వేల రూపాయల నగదు ,7 బైకులు, 10 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

రజతోత్సవ సభను విజయవంతం చేద్దాం.

ప్రజలారా కథం కథం తొక్కి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేద్దాం

-మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండలంలోని పలు గ్రామాల్లో ఛలో వరంగల్ సభను విజయవంతం కొరకు పలు గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పర్య టిస్తున్నారు.ఈ నెల 27న జరగనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలను జయ ప్రదం చేసే దిశగా ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ 2001 ఏప్రిల్ 27 నాడు కెసిఆర్ ఆ రోజు తన పదవికి రాజీనామా చేసి సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాలను చూసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కలిసి ఉంటే లాభం లేదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే ఈ ప్రాంతానికి న్యాయం జరుగుతున్నటు వంటి ఒక లక్ష్యం తోటి కేసిఆర్ పార్టీ పెట్టడం జరిగింది. పార్టీ పెట్టి 24 సంవత్సరాలు పూర్త యి 25వ సంవత్సరాల్లో అడు గుపెడుతున్న సందర్భంగా పార్టీ రజతోత్సవ సభను నిర్వ హించాలని చెప్పి నిర్ణయం చేసి, అది కూడా మనం నా భూతో నా భవిష్యత్ అనేలా పెద్ద సభను నిర్వహిస్తున్నాం.

BRS party’s

 

భవిష్యత్ లో ఇంత పెద్ద మొత్తంలో ఎవరూ నిర్వహించ లేరు. మరి ప్రజలు కూడా ఆవిర్బవాసభకు రావడానికి ఉత్సాహంగా ఉన్నారు. ఇంత తక్కువ సమయంలో ఇంత వ్యతిరేకతను చవిచూసినటు వంటి ప్రభుత్వాలు ఉండవు, దానికి కారణమేంటంటే అమ లు కానీ హామీలు ఇచ్చి, హామీలను తుంగలో తొక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తున్నటు వంటి తీరు ప్రజలలో అసహనానికి గురిచేస్తుంది.కేసిఆర్ అధికా రంలో ఉన్నప్పుడు ఏ స్కీమ్స్ అయితే అమలు అయినవో వాటినే అమలు చేస్తున్నారు. ఎట్లా ఉన్నది పరిపాలన అంటే మరి అనుభవం లేని పరిపా లన, అసమర్ధ పరిపాలన, చేత గాని వ్యవహారం ఇవన్నీ చేసు కుంటుప్రజల దగ్గరికి వస్తే అర్థం చేసుకున్నారు.ప్రజలు కేసీఆర్ ఉన్నప్పుడు ఏ రకంగా మా యొక్క జీవితాలు అద్భుతంగా ఉన్నాయి.

ఏ రకమైనటువంటి అభివృద్ధి జరిగింది అని నేడు పునరాలోచించుకుంటున్నారు. ఎప్పుడైనా సామెత ఉంటాది పాలు ఇచ్చే గేదెను కాదని దున్నపోతును తెచ్చుకున్నట్టు ఉంది అన్న చందనంగా ప్రజలు చర్చించుకుంటున్నారు.రేపు ఎన్నిక ఏదైనా ఎగిరేది బిఆర్ ఎస్ జెండానే గెలిచేది బిఆర్ ఎస్ అభ్యర్దులే.

ఈ ఏప్రిల్ 27న జరగబోయే మన సభా తెలం గాణ రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు వస్తాయి. కాబట్టి మిత్రులారా కథం కథం తొక్కి బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయ వంతం చేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల బీఆర్ఎస్ కార్యకర్తలు అభిమానులు ప్రజలు పాల్గొన్నారు.

2వ రోజు వారోస్తావాలు.

2వ రోజు వారోస్తావాలు

బస్టాండ్ లో ప్రజలకు అవగాహన కోసం ఫైర్ డెమో ప్రదర్శన

ప్రజలు,వ్యాపారస్థులు అప్రమత్తంగా ఉండాలి

ఫైర్ అధికారి వక్కల భద్రయ్య

పరకాల నేటిధాత్రి

 

పరకాల బస్టాండ్ లో మంగళవారం ఫైర్ అధికారి వక్కల భద్రయ్య అధ్వర్యంలో 2వరోజు వారోత్సవాలు నిర్వహించారు.పట్టణ కేంద్రంలోని బస్టాండ్ లో ప్రయానికులకు,స్థానికులకు అవగాహన కల్పించేందుకు ఫైర్ డెమో ప్రదర్మించారు.ఈ సందర్బంగా భద్రయ్య మాట్లాడుతూ పట్టణ కేంద్రంలోని వ్యాపారస్తులు అగ్నిప్రమాదం సంభవించినపుడు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై కరపత్రాలు పంపణీ చేశారు.బస్టాండ్ ఆవరణలోని పలుచోట్ల వారోత్సవాల పోస్టర్ ఏర్పాటు చేశారు.అగ్నిపమాదం నివారించేందుకు పాటించాల్సిన జాగత్త చర్యలపై అవగాహగా లేక నిర్లక్ష కారణాల వల్లే అగ్నిప్రమాదాలు సంభవిస్తాయన్నారు.అగ్ని ప్రమాదం జరిగితే అపుడు మనదేశ సంపదను కోల్పోయిన వారిగా మిగిలిపోతామున్నారు.ఇప్పటికైనా వ్యాపారాస్తులు అగ్నిమాపక సిబ్బండి సూచనలు పాటిస్తూ,తమ అస్తులను పరిరక్షించుకోవాలన్నారు.వ్యాపారస్థులు ఫైర్ సేఫ్టీ ఏర్పాటు చేసుకోవాల్సన అవసరం ఉందని గుర్తుచేశారు.వారి వెంట పరకాల అగ్నిమాపకశాఖ కార్యాలయం సిబ్బంది ఎల్ఎఫ్ కృష్ణకుమార్, డ్రైవర్ సత్తయ్య, అన్నిమాపకులు సత్యం,దిలీప్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version