‘వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం’.
దేవరకద్ర /నేటి ధాత్రి.
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మార్కెట్ యార్డ్ లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందన్నారు. రైతులు పండించిన ప్రతీ గింజను మద్దతు ధరతో కొనుగోలు చేసి, వారి అకౌంట్లలో డబ్బులు వేస్తామన్నారు. సన్నాలు పండించిన రైతులకు మద్దతు ధరతో పాటు.. రూ.500 బోనస్ వస్తుందని అన్నారు.
అనంతరం చిన్న రాజమూర్ గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన చిన్న రాజమూర్ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు ఎర్ర గొల్ల ప్రేమ్ కుమార్ యాదవ్ తల్లి భౌతిక దేహానికి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.