ఎస్సై ని సన్మానించిన బిజెపి నాయకులు.

ఎస్సై ని సన్మానించిన బిజెపి నాయకులు

నిజాంపేట, నేటిధాత్రి

 

 

మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో స్థానిక పోలీస్ స్టేషన్లో బాధ్యతలు చేపట్టిన ఎస్సై రాజేష్ ను బిజెపి నాయకులు మంగళవారం రోజున మర్యాదపూర్వకంగా కలిసి ఆయనను శాలువాతో సన్మానించారు ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ మండలంలో ప్రతి ఒక్కరు శాంతి భద్రతలకు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు తీగల శ్రీనివాస్ గౌడ్ , టెలికం బోర్డు మెంబర్ ఆకుల రమేష్, అభిషేక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

పేదల ఆరోగ్యం కోసమే ఉచిత వైద్య శిబిరం.

— పేదల ఆరోగ్యం కోసమే ఉచిత వైద్య శిబిరం,

నిజాంపేట, నేటిధాత్రి

 

 

గ్రామీణ ప్రాంత నిరుపేదల ఆరోగ్యం కోసమే ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు ఐఆర్ సిఎస్ లయన్ డా,, ఏలేటి రాజశేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం రోజున మండల కేంద్రంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మెదక్ శాఖ, వీఎస్టి పరిశ్రమ తూప్రాన్ సహకారంతో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీపీ, షుగర్ పరీక్షలు, కంటి, చెవి ముక్కు, గొంతు, వరిబీజము, బీజకుట్టు గడ్డలు, థైరాయిడ్ గడ్డలు, గర్భసంచికి సంబంధించిన సమస్యలు, అలాగే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, చర్మ సమస్యలు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, ఊపిరితిత్తుల సమస్యలపై మల్లారెడ్డి హాస్పిటల్ (సూరారం) వైద్యులచే ఉదయం 9:30 నుండి చికిత్సలు నిర్వహించి ఉచిత మందులు పంపిణీ జరుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సభ్యులు, కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

ప్రయాణానికి కుదరని ముహూర్తం..!

ప్రయాణానికి కుదరని.

ముహూర్తం..!

• బ్రిడ్జి పనులు పూర్తి.. ప్రారంభం ఎప్పుడో..?

• ముస్తాబైన ఆర్ ఓబీ, తొలగని అడ్డంకులు

• ఏడేండ్లుగా ప్రజలకు తప్పని నిరీక్షణ

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

 

జహీరాబాద్ పట్టణ పరిధిలో రహదారిపై నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జి ప్రారంభానికి ముహూర్తం కుదరడం లేదు. అన్ని పనులు పూర్తి చేసుకుని ప్రయాణికులకు అందుబాటులోకి తేవడానికి సిద్ధంగా ఉన్నా, నిర్లక్ష్య వైఖరితో అందుబాటులోకి తేవడం లేదు. పనులు పూర్తై నెలలు గడుస్తున్నా, రాకపోకలకు అడ్డంకులు తొలగడం లేదు. సరైన ముహూర్తం కుదరకనా, లేక కాంట్రాక్టర్ కు ఉన్న ఆర్థిక ఇబ్బందులో కానీ, ఏడేండ్లుగా ప్రయాణికుల నిరీక్షణకు మాత్రం తెర పడడం లేదు. ప్రజా ప్రతినిధులు, అధికారుల తీరుపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి ప్రయాణికులు ఇంకా ఊరిస్తూనే ఉంది. అన్ని పనులు పూర్తి చేసుకుని ముస్తాబైనా ప్రారంభానికి మాత్రం నోచుకోవడం లేదు. పనులు పూర్తై నెలలు గడుస్తున్నా రాక పోకలకున్న అడంకులు మాత్రం తొలగడం లేదు. సరైన ముహూర్తం కుదర కానా, లేక కాంట్రాక్టర్ కు ఉన్న ఆర్థిక ఇబ్బందులో కానీ ఏడేండ్లుగా ప్రయాణికుల నిరీక్షణకు మాత్రం తెర పడడం లేదు. దీంతో రాకపోకల సందర్భంగా రైల్వే గేటు వల్ల ఇబ్బందులు ఎదురైన ప్రతిసారి ప్రయాణికులు పరస్పరం ప్రభుత్వ ప్రతినిధులు, అధికార గణాల తీరుపై తమ అసహనం వ్యక్తం చేయడం కనిపిస్తోంది.

ఏడేండ్ల క్రితం శంకుస్థాపన..

రైల్వే గేటు వల్ల ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బం దుల పరిష్కారానికి అప్పటి ప్రభుత్వం రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్వోబీ)ను మంజూరు చేశారు. 2018 ఆగస్టు 30న రూ.90 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. వెంటనే రహదారులు, భవనాల శాఖ ఆధ్వర్యంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టారు. అప్పటి నుంచి అగుతూ సాగుతూ నేటివరకు పసులు కొనసాగుతూనే ఉన్నాయి. జహీరాబాద్ నుంచి మొగుడంపల్లి క్రాస్ రోడ్డులో గల రైల్వేలెవల్ క్రాసింగ్ వద్ద ప్రయాణికుల రాకపోకల కోసం ఏడేళ్ల క్రితం డబుల్ లైన్ ఆర్వోబీ పనులు చేపట్టారు. నిధుల కొరత తదితర కారణాలతో ఎప్పటికప్పుడు పనులు తరచూ వాయిదా పడుతూ, కొనసాగుతున్నాయి.

ముస్తాబైన ముహూర్తం మెప్పుడో..?

జహీరాబాద్ పట్టణ పరిధిలో రహదారిపై నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ఎట్టకేలకు పూర్తయ్యాయి. అన్ని విధాలుగా ముస్తాబై నెలలు గడుస్తున్నా ముహూర్తం మాత్రం కుదరడం లేదు. అందుకే రాక పోకలకు ముహూర్తం అడ్డంకులు తొలగడం లేదని బహటంగానే ప్రయాణికులు చర్చించుకుంటున్నారు. స్థానిక లెవల్ క్రాసింగ్ మీదుగా హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి నాందేడ్, పూర్ణ, షిరిడీకి, బెంగళూరు. తిరుపతి, కాకినాడ పట్టణాలకు ఎక్స్ ప్రెస్, ప్యాసింజర్, రైళ్ల రాకపోకలు సాగిస్తుంటాయి. అంతే కాకుండా గూడ్స్ రైళ్ల కూడా ఎక్కువ సంఖ్యలోనే వచ్చిపోతుంటాయి. నిత్యం ఎంతో రద్దీగా ఉండే ఈ మార్గంలో రైలు వచ్చిన ప్రతీసారి గేట్లు మూసేయడంతో ప్రయాణికులు అష్టకష్టాలు పడుతున్నారు. స్థానికులతో పాటు అంతర్రాష్ట్ర రాకపోకలు సాగించే ప్రయాణికులు రైలొచ్చిన ప్రతిసారి అత్యధికంగా అరగంట పాటు గేటు వద్ద ఆగాల్సి వస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు.

స్థానికులకు.. ప్రయోజనమే.

Bridge work completed

 

ఈ రహదారి గుండా రాకపోకలు సాగించే మొగు డంపల్లి, జహీరాబాద్ మండలంలోని పలు గ్రామాల ప్రయాణికులతో పాటు కర్ణాటకలోని చించోళీ, గుల్బర్గా, బసవకల్యాణ్, బీదర్ ప్రయాణికులతో సహా పట్టణ శివారులోని డ్రీమ్ ఇండియా, బందే అలీ, బాబూమోహన్ కాలనీ, మహీంద్రా, ఎంజీ, ముంగి, బూచినెల్లి పారిశ్రామిక వాడలకు రాకపోకలు సాగించే వారికి ఎంతో మేలు జరుగునుంది. బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టిన కాంట్రాక్టర్ కు ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లుల్లో జాప్యంతోనే పనులు సకాలంలో పూర్తి లేదనేది వాస్తవ సత్యం. ఫైనాన్షియల్ అడ్డంకులు తొలిగి బ్రిడ్జి పనులతో పాటు రోడ్ వైడ్నింగ్, డివైడర్,సర్వీస్ రోడ్లు. వాటికి రంగులు వేయడం తదితర పనులన్నీ పూర్తిచేశారు. వెంటనే ప్రారంభానికి అవస రమైన చర్యలు తీసుకోవాలని ఇందుకు అధికారులు, ప్రజా ప్రతినిధులు చొరవ చూపాలని స్థానిక, ప్రయాణికులు కోరుతున్నారు.

కళ్యాణమస్తు రేపటి నుంచి మ్రోగనున్న పెళ్లి భాజాలు.

శ్రీరస్తు శుభమస్తు కళ్యాణమస్తు రేపటి నుంచి మ్రోగనున్న పెళ్లి భాజాలు…

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

“శ్రీరస్తు శుభమస్తు కళ్యాణమస్తు” అనే శుభాశయాలతో ఈ ఏడాది పెళ్లిళ్ల హంగామా ప్రారంభం కానుంది. జీవన పయనంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతూ, వధూవరుల కలలు నెరవేరే కాలం వస్తోంది.

Wedding

రాష్ట్ర వ్యాప్తంగా ఈ వేసవి తిండి తినిపించే వేళ పెళ్లిళ్ల సందడి మొదలుకానుంది. హిందూ సంప్రదాయాల్లో పెళ్లి అనేది కేవలం వ్యక్తిగత వ్యవహారమే కాకుండా, రెండు కుటుంబాలను కలిపే పవిత్ర బంధంగా భావిస్తారు. అందుకే వివాహానికి సంబంధించి మంచి ముహూర్తాల కోసం పెద్దలు, కుటుంబ సభ్యులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు.

గ్రహ నక్షత్ర అనుకూలతతో పెళ్లిళ్ల పండుగ: పురోహితులు చెబుతున్న వివరాల ప్రకారం, రేపటి నుంచి జూన్ 8 వరకు వివాహ ముహూర్తాలు శుభంగా ఉండబోతున్నాయి. ఈ సమయంలో అనేక కుటుంబాలు తమ పిల్లల వివాహాలను జరిపేందుకు ముందుకెళ్తున్నారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహాల స్థితి అనుకూలంగా ఉండటం వల్ల ఈ కాలం అత్యంత శుభఫలితాలను ఇస్తుందనే నమ్మకంతో వివాహాలకు శ్రీకారం చుడుతున్నారు.

ముఖ్యమైన ముహూర్తాలు ఇవే:

ఏప్రిల్: 16, 18, 20, 21, 23, 30

మే: 1, 3, 4, 8, 9, 10, 11, 14, 16, 18, 19, 21, 23, 24, 30

జూన్: 2, 4, 5, 6, 7, 8

ఈ తేదీల్లో వివాహాలకు అనుకూలమైన ముహూర్తాలు లభ్యమవుతున్నాయి. వీటిలో ముఖ్యంగా ఏప్రిల్ 30వ తేదీ ‘అక్షయ తృతీయ’ కావడంతో వేల వివాహాలు జరగనున్నాయి. ఇది హిందూ సంప్రదాయంలో అత్యంత శుభదినంగా భావించబడుతుంది.

ఆషాఢ మాసంలో విరామం… శ్రావణంలో మళ్లీ ప్రారంభం జూన్ 11 నుంచి జూలై 12 వరకు ఆషాఢ మాసం వస్తుందట. ఈ కాలంలో శుభకార్యాలు నిర్వహించరాదని శాస్త్రం చెబుతుంది. అందువల్ల ఈ నెలలలో ముహూర్తాలు లేవు. కానీ జూలై 25 నుంచి ప్రారంభమయ్యే శ్రావణ మాసంలో మళ్లీ మంచి ముహూర్తాలు లభ్యం కానున్నాయి.

తెలుగింట పెళ్లి పంట సిద్ధం: పెళ్లికి అనుకూలమైన రోజులు అధికంగా ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల పంట పండబోతోంది. మండుటెండల మధ్య కుటుంబాల్లో కొత్త ఉత్సాహం నిండి ఉంది. పెళ్లిళ్ల కోసం హాలులు, పెండ్లి కాన్వాయ్‌లు, తాళిబొట్టు కొట్టు, సంగీతం, సప్తపదుల సమయాలు అన్నీ సిద్ధమవుతున్నాయి. పిండి వంటలు, వేదికలు, అలంకరణలు—ఇవన్నీ ప్రస్తుతం వివాహబంధానికి తెరతీయబోతున్న సన్నాహక దృశ్యాలే!

ప్రమాదమని తెలిసినా పట్టింపేది?

ప్రమాదమని తెలిసినా పట్టింపేది?

– అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

ఝరాసంగం: మండల కేంద్రమైన ఝరాసంగంలోని
తహసీల్దార్, శ్రీ శక్తి (ఐకెపి) కార్యాలయాల మధ్య పెరుగుతున్న చెట్టు గత వారం రోజులు క్రితం విచిన ఈదురు గాలుల కు కూలింది. ఈ చెట్టు శ్రీ శక్తి (ఐకెపి) కార్యాలయం మీద కూలడంతో ఎప్పుడూ ప్రమాదం జరు గుతుందో తేలియాని దుస్థితి ఉంది. ప్రతి రోజు ఐకెపి కార్యాలయంలోకి వివిధ గ్రామాల నుంచి మహిళ సంఘాల సభ్యులు వస్తుంటారు. ప్రమాద వశాత్తు చెట్టు పడుతే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. చెట్టు వంగి కూలేందుకు సిద్ధంగా ఉన్న అధికారులు పట్టించుకోకపోవడంపై పలు వురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మహబాద్ రోడ్డుకు వనజీవి రామయ్య పేరు పెట్టాలి.

ఖమ్మం – మహబాద్ రోడ్డుకు వనజీవి రామయ్య పేరు పెట్టాలి: వద్దిరాజు

రామయ్య కుటుంబ సభ్యులను ఓదార్చిన ఎంపీ “వద్దిరాజు”.

“నేటిధాత్రి”,ఖమ్మం రూరల్, ఏప్రిల్, 15:

 

 

తన జీవితం మొత్తం మొక్కలు నాటాడానికే అంకితం చేసిన పద్మశ్రీ దరిపల్లి రామయ్య ధరిత్రి ఉన్నంతకాలం చిరస్థాయిగా నిలిచి ఉంటారని రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఇటీవలే మృతి చెందిన వనజీవి రామయ్య కు మంగళవారం రవిచంద్ర నివాళులు అర్పించారు. రెడ్డిపల్లి లోని ఆయన నివాసానికి వెళ్లి చిత్ర పటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించిన, అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా వద్దిరాజు మాట్లాడుతూ.. రామయ్య పేరు ఎప్పటికీ గుర్తుండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఖమ్మం – మహబూబాబాద్ రోడ్డుకు వనజీవి రామయ్య మార్గ్ పేరుతో నామకరణం చేయాలని ఎంపీ రవిచంద్ర కోరారు.

Vanajeevi Ramaiah

 

ఖమ్మం నుంచి రెడ్డిపల్లి వరకు 8 కిమీ మేర వనజీవి రామయ్య మొక్కలు నాటారని గుర్తు చేశారు. రోడ్డు విస్తరణలో భాగంగా ఆ చెట్లన్నీ కూల్చేసినందున, మళ్ళీ అదే వరసలో మొక్కలు నాటి.. సంరక్షించి రామయ్య కు నివాళులు అర్పించాలని కోరారు. ఈ విషయం లో రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా మంత్రులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. రామయ్య చరిత్ర భావి తరాలకు తెలిసేలా కర్ణాటక తరహాలో తెలంగాణ ప్రభుత్వం కూడా పాఠ్య పుస్తకాల్లో ఆయన చరిత్ర ను ప్రవేశ పెట్టాలని ఎంపీ రవిచంద్ర కోరారు. జిల్లాలో కూడా ఆయన స్మారకం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

అంబెడ్కర్ జయంతి వేడుకలు. 

సిరిసిల్ల జిల్లా సాహితీ సమితి ఆధ్వర్యంలో అంబెడ్కర్ జయంతి వేడుకలు. 

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)

 

రాజన్న సిరిసిల్ల జిల్లా సాహితి సమితి అధ్యక్షులు డాక్టర్ జనపాల శంకరయ్య అధ్యక్షతన ప్రధాన కార్యదర్శి వెంగళ లక్ష్మణ్ కార్య నిర్వహణలో లక్ష్మణ్ ప్రింటర్స్ లో 11 గంటలకు అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి .అధ్యక్షులు డాక్టర్ జనపాల శంకరయ్య మాట్లాడుతూ భారతరత్న బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రాజ్యాంగ రచనల్లో ప్రధాన పాత్ర వహించిన డాక్టర్ అంబేద్కర్ సేవలు ఎనలేనివి. దేశ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి అందరికీ ఆమోదయోగ్యమైన రాజ్యాంగ రచన చేసిన భారతరత్న బాటలో అందరం కలసి నడుద్దాం అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి వెంగళ లక్ష్మణ్, సహధ్యక్షులు కోడం నారాయణ, ఉపాధ్యక్షులు బూర దేవానందం, ముడారి సాయి మహేష్, గుండెల్ని వంశీ, దొంత దేవదాసు ,సిరిసిల్ల తిరుపతి, అంకారపు రవి కవులు, రచయితలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అంబేద్కర్ జయంతి వేడుకలు. 

దీక్షకుంటలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు. 
నెక్కొండ,నేటిధాత్రి:*

నెక్కొండ మండలం దీక్షకుంట గ్రామంలో మాల మహానాడు ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించుకున్నారు.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన సందర్భంగా నెక్కొండ మండల మాల మహానాడు కన్వీనర్, కో కన్వీనర్ కారు కరుణాకర్, పోనగంటి స్వామిరావు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారతదేశానికి చేసిన సేవలు మర్చిపోకుండా ఆయన ప్రజలు ఆయనను దేవుడని కొలవాలని భారత రాజ్యాంగం నిర్మాణం కోసం ఆయన ఎన్నో త్యాగాలను చేసి బడుగు బలహీన వర్గాలకు కొరకు అహర్నిశలు కృషి చేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని కొనియాడారు.ఆయన జయంతిని ప్రపంచవ్యాప్తంగా పండుగలాగా బడుగు బలహీన వర్గాల ప్రజలు మేధావులు అంగరంగ వైభవంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను జరుపుకోవాలని వారు కొనియాడారు ఈ కార్యక్రమంలో జామండ్ల రంజిత్, కారు అనిల్, బొల్లెపల్లి విష్ణు, చీర కుమారస్వామి, సర్కిల్ రవి, చీపురు భాస్కర్, పోనకంటి ప్రశాంత్, పులి సుధాకర్, దునకన రఘుపతి, చీపురు స్వామి, తదితరులు పాల్గొన్నారు.

సామాజిక ఉద్యమ కెరటం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్

సామాజిక ఉద్యమ కెరటం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్

ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్

ఎంసిపిఐ(యు) ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సామాజిక ఉద్యమ కెరటం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ అని ఆయన స్ఫూర్తితో భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకొని దేశాన్ని కాపాడుకోవాలని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ అన్నారు.భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ 134వ జయంతి సందర్భంగా ఎంసిపిఐ(యు) ఆధ్వర్యంలో స్థానిక ఓంకార్ భవన్ లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళిలర్పించారు.ఈ సందర్భంగా పెద్దారపు రమేష్ మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారతదేశాన్ని మతం భాషా ప్రాంతం పేరుతో విచ్ఛిన్నం చేసి అధికారాన్ని కాపాడుకునేందుకు దోపిడి పాలకులు నిరంతరం ప్రయత్నిస్తున్నారని ఈ క్రమంలో అన్ని వర్గాలకు సమన్యాయం కోసం ఏర్పాటుచేసిన భారత రాజ్యాంగాన్ని సైతం మార్చేందుకు బిజెపి మతోన్మాద పాలకులు ప్రయత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఎన్నో కలలుకని దేశాన్ని సామాజికంగా ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాజ్యాంగాన్ని రచిస్తే అందు విరుద్ధంగా పాలకులు వివరిస్తూ అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారని అలాంటి వారే మళ్లీ అంబేద్కర్ పేరు జపం చేయడం సిగ్గుచేటు అన్నారు. అంబేద్కర్ ఆశయాలను భారత రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు గోనె కుమారస్వామి హన్మకొండ జిల్లా కార్యదర్శి ఎన్ రెడ్డి హంసారెడ్డి రాష్ట్ర నాయకులు మందరవి జిల్లా సహాయ కార్యదర్శి నర్ర ప్రతాప్ రాష్ట్ర జిల్లా నాయకులు సుంచు జగదీశ్వర్ చంద్రయ్య రాజిరెడ్డి కొమురయ్య సావిత్రి నాగేష్ ఉదయ రవి మల్లికార్జున్ నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళులు.

రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళులు.

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామంలో గల గ్రామ పంచాయితీ కార్యదర్శి శ్రావణకుమారి ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళులు అర్పించారు.అంబేద్కర్ 135 వ జయంతికి పురస్కరించుకొని గ్రామ పంచాయితీ కార్యాలయం వద్ద వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పెద్ది శ్రీనివాస్ రెడ్డి,అంగన్వాడి టీచర్ జహీరబేగం,మాజీ ఉప సర్పంచ్ బరిగెల భక్కయ్య,గ్రామస్తులు ఎల్లారెడ్డి, ఉప్పుల ఐలయ్య,రాజు,తదితరులు పాల్గొన్నారు. 

అంబేద్కర్ ఆలోచనలే దేశానికి ఆదర్శం.

అంబేద్కర్ ఆలోచనలే దేశానికి ఆదర్శం

కాంగ్రెస్ పార్టీ నాయకులు మంతెన సమ్మయ్య

జైపూర్,నేటి ధాత్రి:

 

భీమారం మండల కేంద్రంలోని ఆవడం ఎక్స్ రోడ్ చౌరస్తాలో సోమవారం ఘనంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మంతెన సంపత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా మంతెన సమ్మయ్య మాట్లాడుతూ మూడు సంవత్సరాల నుంచి అంబేద్కర్ విగ్రహం స్థాపన కొరకు ఆరట పడుతున్నామని చెన్నూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి విన్నవించారు.అంబేద్కర్ ఆలోచనలే దేశానికి ఆదర్శమని,సమాజంలోని అసమానతలు దురహంకారం పై అలుపెరుగని పోరాట యోధుడు,సమ సమాజ స్వప్నికుడు.దళిత బహుజన వర్గాల ఆశాజ్యోతి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నారు.భారత రాజ్యాంగ రూపకర్త జాతీయవాది అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు అన్ని గ్రామాలలో ఘనంగా జరుపుకోవడం జరిగింది.అంబేద్కర్ ఏ ఒకరికి, ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాదని సమాజంలోని ప్రజలందరీ వాడని ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగం రాసిన వ్యక్తి ప్రజల హక్కులను కాపాడిన మహోన్నత వ్యక్తి అని అన్నారు.తన జీవితమంతా అణగారిన వర్గాల అభివృద్ధి కొరకు నిరంతరం కృషి చేసిన మహోన్నత వ్యక్తి జాతీయ ఉద్యమంలో అంబేద్కర్ తన జీవితంలో చిన్నప్పటి నుంచి సమాజం ఎన్నో అవమానాలు ఎదురైన వేను తిరగక వాటిని ధైర్యంగా ఎదుర్కొని తన కృషితో కేంద్ర మంత్రి పదవి పొందారు.అంబేద్కర్ జీవిత కాలంలో అనేక సబ్జెక్టులలో 32 డిగ్రీలు పొంది గౌరవ డాక్టరేట్ పట్టాలు పొందిన భారతీయుడుగా నిలిచారన్నారు.విద్యాభ్యాసం తర్వాత ఆర్థికవేత్తగా,ప్రొఫెసర్ గా,న్యాయవాదిగా కొనసాగారు.స్వతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగం రాసి పేద వర్గాలకు అండగా నిలబడిన వ్యక్తి అంబేద్కర్ తన జీవిత చివరన బుద్ధుని బోధనలు నచ్చి బౌధమతం స్వీకరించారు.మహిళా హక్కులు,కార్మికుల హక్కులు ఇతర అన్ని వర్గాల పేద ప్రజల కోసం తన జీవితకాలం పోరాటం చేసిన మహోన్నత వ్యక్తిగా ఈ సమాజం చూడాలని ఎవరు తక్కువ చేసి చూడకూడదని సూచించారు.చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో భీమారం మండల నాయకులు,గ్రామ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

సిఎస్ఐ చర్చిలో ఘనంగా మట్టల ఈస్టర్.

సిఎస్ఐ చర్చిలో ఘనంగా మట్టల ( ఈస్టర్) పండుగ

నేటి ధాత్రి/ భద్రాచలం

 

 

స్థానిక సీఎస్ఐ చర్చిలో మట్టల పండుగను ఆదివారంఘనంగా నిర్వహించినారు ఈ సందర్భంగా ఉదయం నుంచే భక్తులు రావడంతో చర్చి పరిసర ప్రాంతాలు ఈత మట్టలతో ప్రత్యేకంగా ఆకర్షణంగా కనిపించాయి భక్తులు ఈత మట్టలతో భక్తి గీతాలు ఆలపిస్తూ చర్చి చుట్టూ తిరిగారు అనంతరం చర్చిలో జరిగే ప్రత్యేక ప్రార్థనలు పాల్గొన్నారు ఏసుప్రభు జెరుసలెం పట్టణంలో ప్రధమంగా ప్రవేశించినప్పుడు అక్కడి ప్రజలు ఏసు ప్రభువును గాడిద పై తీసుకొని వస్తూ పెద్ద ఎత్తున వివిధ రకాల ఈత మట్టలతో ఘన స్వాగతం పలుకుతారు దీనినే క్రైస్తవులు మట్టల ( ఈస్టర్) పండుగగా ఆచరిస్తారు ఈ సందర్భంగా పాస్ట్రేట్ ,& గ్రూప్ చైర్మన్ రేవ , కె . టీ .విజయ్ కుమార్ భక్తులను ఉద్దేశించి దైవ సందేశం చేశారు.
ఈ కార్యక్రమంలో పాస్టర్ గడిదేసి సాల్మన్ , పస్ట్రేట్ & గ్రూప్ సెక్రెటరీ, రితీష్ రెడ్డి, ట్రెజర్ , వై .ప్రసాద్ రావు, మరియు కమిటీ సభ్యులు జోసెఫ్ కుమార్ ,రాజు రవికిషోర్ ,మధు సంతాయ్య. పాల్గొన్నారు

డా.బి.ఆర్.అంబేద్కర్ గారి జయంతి.!

భారత రాజ్యాంగ పితామహుడు డా.బి.ఆర్.అంబేద్కర్ గారి జయంతి

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ శాసనసభ్యులు కోనింటి మాణిక్ రావు పట్టణం లోని *రహదారి,మున్సిపల్,బాబు మోహన్ కాలనీ,లో గల విగ్రహాలకి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాణిక్ రావు మాట్లాడుతూ భారత రాజ్యాంగ శిల్పిగా,ప్రజాస్వామ్య పరిరక్షకునిగా,సంఘసంస్కర్తగా,విఖ్యాతుడైన అంబేద్కర్ గారికి భారత ప్రభుత్వం భారతరత్న అవార్డు ఇవ్వడం అభినందనీయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజి మార్కెట్ చైర్మన్ గుండప్ప,మాజి ఆత్మ చైర్మన్ లు విజయ్ కుమార్ , పెంట రెడ్డి,జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి ,పాక్స్ చైర్మన్ చైర్మన్ మచెందర్, సీనియర్ నాయకులు నామ రవికిరణ్,మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్,మొహి ఉద్దీన్,ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్,యువ నాయకులు మిథున్ రాజ్,మహిళ పట్టణ అధ్యక్షురాలు మంజుల, జాగృతి అధ్యక్షురాలు అనుషమ్మ, బి ఆర్ ఎస్వీ అధ్యక్షులు రాకేష్ ,ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు శివప్ప,బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

భారత రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళులు.

భారత రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళులు.

#డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్ఫూర్తి తో యువత ముందుకు సాగాలి.

#మండలంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

 

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో బస్టాండ్ ఆవరణలో అంబేద్కర్ విగ్రహానికి .
బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, సిపిఎం, పార్టీలతోపాటు దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు . అలాగే వివిధ ప్రభుత్వ కార్యాలయంలో అధికారులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి జయంతి వేడుకలను పురస్కరించుకుని దేశానికి అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు కార్యక్రమంలో మండల తాసిల్దార్ ముప్పు కృష్ణ, బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు భానోత్ సారంగపాణి, ఫ్యాక్స్ చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్ రావు, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఉడుగుల ప్రవీణ్ గౌడ్,కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి, చార్ల శివారెడ్డి, మాలోతు రమేష్, వైనాల అశోక్, బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్, పెరుమాండ్ల కోటి, బచ్చు వెంకన్న, బోట్ల ప్రతాప్,సిపిఎం నాయకులు కడియాల వీరాచారి,, మనోహర్, బొడిగ సమ్మయ్య, దళిత సంఘాల నాయకులు బట్టు సాంబయ్య, బోట్ల నరేష్, పవన్, పరికి కోర్నెల్, రత్నం, జన్ను జయరాజ్, గౌడ సంఘ నాయకులు సట్ల శ్రీనివాస్ గౌడ్, పెరుమాండ్ల రాజ్ కుమార్ గౌడ్, ముత్యాల కుమార్ గౌడ్, గాధ గాని రమేష్ గౌడ్, తదితరులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల చేసి ఘన నివాళులర్పించారు.

అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న.!

అంబేద్కర్ గారి జయంతి వేడుకల్లో పాల్గొన్న టిఎస్ఎస్ సిసిడిసి (ఎస్సి కార్పొరేషన్) మాజీ చెర్మెన్ వై.నరోత్తం..

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

బారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా టిఎస్ఎస్ సిసిడిసి ఎస్సి కార్పొరేషన్ మాజి చెర్మెన్ వై.నరోత్తం పార్టీ నాయకులతో కలిసి పట్టణంలో గల అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు,ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వై.నరోత్తం మాట్లాడుతూ దేశానికి అంబేద్కర్ గారు అందించిన సేవలు ఆమోగమని భారత దేశ స్వపరిపాలన ఆదర్శంగా నిలవాలనే లక్ష్యంగా అంబేద్కర్ గారు దేశ రాజ్యంగాన్నీ తీర్చిదిద్దారని అన్నారు,వారు ఆశయాలను కొనసాగిస్తూ వారు చూపిన మార్గంలో మనమందరం నడుచుకోవాలని అన్నారు,ఈ కార్యక్రమంలో నాయకులు డి.మాణిక్ ప్రభుగౌడ్ రైతు హక్కుల సాధన సమితి అధ్యక్షులు సి.బాల్ రాజ్,శివ కుమార్,పి.జి.ఈశ్వర్,యస్, గోపాల్,చెంగల్ జైపాల్,బి. వేణుగోపాల్,యస్.శ్రీనివాస్, రాజేందర్,దిలీప్,ప్రేమ్ కుమార్, ప్రకాష్,సునీల్, తదితరులు పాల్గొన్నారు.

నాగారం లో రాజ్యాంగ నిర్మాత జయంతి వేడుకలు.

నాగారం గ్రామంలో రాజ్యాంగ నిర్మాత జయంతి వేడుకలు

అంబెడ్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన డాక్టర్ సిరంగి సంతోష్,రాజభద్రయ్య

పరకాల నేటిధాత్రి

 

మండలం లోని నాగారం గ్రామంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్,మున్సిపల్ మాజీ చైర్మన్ మార్తా రాజ భద్రయ్య అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ పరకాల మండల అధ్యక్షులు కాసగాని రాజ్ కుమార్ గౌడ్,జిల్లా కౌన్సిల్ మెంబెర్ బాబు యాదవ్,కన్వీనర్ కొమ్మిడి మహేందర్ రెడ్డి,కార్యక్రమ కో కన్వీనర్ లు దుమల నగేష్,కునూరు విరస్వామి,జనరల్ సెక్రటరీ జంగిలి రాజేందర్ రావు,కోశాదికారి ఎదునూరి లింగయ్య,సీనియర్ నాయకులు గుండబోయిన నర్సయ్య,పుచ్చకాయల మల్లారెడ్డి,బీజేవైఎం నాయకులు కాసగాని సాయి కుమార్,బూత్ అధ్యక్షులు మహేందర్ రెడ్డి,బిక్షపతి,గొట్టే మొగిలి,పైడిపెల్లి మాజీ సర్పంచ్ సురేష్,పోచారం బూత్ అధ్యక్షులు గంపలపెళ్ళి రాజు,లక్ష్మిపురం బూత్ అధ్యక్షులు సంపత్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

డాక్టర్ బి.ఆర్అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగించాలి.

డాక్టర్ బి.ఆర్అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగించాలి.

చిట్యాల,నేటిధాత్రి

 

 

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్ని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చిట్యాల మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని బిజెపి చిట్యాల మండలాధ్యక్షులు బుర్ర వెంకటేష్ గౌడ్ అన్నారు.
అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం ఇప్పుడు వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ భారతదేశ ప్రజాస్వామ్య దేశంగా రూపుదిద్దుకున్నదంటే అదికేవలం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే సాధ్యమైందనిఅన్నారూ ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా మన భారత దేశంలో రాజ్యాంగం ప్రజాస్వామ్యబద్ధంగా కొనసాగుతుంది అంటే ఆ మహనీయుని కారణంగ భారత రాజ్యాంగంవ్యవహరిస్తున్నదని కుల మత విభేదం లేకుండా ఓటు అనే ఆయుధం ద్వారా బానిస సంకెళ్లను తొలగించడంజరిగిందని*
భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ గ కాశయాలను కొనసాగిచలనిఅన్నారు,
ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు చెక్క నరసయ్య ఓబిసి జిల్లా అధ్యక్షులు తీగల జగ్గయ్య గుండ సురేష్ గజనాల రవీందర్ సదానందం శ్రీహరి గుర్రపు రవీందర్ మైదం శ్రీకాంత్ కింసారపు ప్రభాకర్ వల్లాల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

‘ఘనంగా అంబేద్కర్ జయంతి’.

‘ఘనంగా అంబేద్కర్ జయంతి’

బాలానగర్ /నేటి ధాత్రి.

 

బాలానగర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో సోమవారం భారత రాజ్యాంగ నిర్మాత బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతిని ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు మాట్లాడుతూ.. అంబేద్కర్ ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించాడని, అంటరానితనం అస్పృశ్యత నివారణకు కృషి చేశారన్నారు. బహుజనులకు ఆరాధ్యుడన్నారు. అనంతరం అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి, వెంకటాచారి, యాదయ్య, శ్రీశైలం, నుప్ప ప్రకాష్, కొంగళ్ళ శ్రీను, శంకర్ నాయక్, లక్ష్మయ్య, వెంకటయ్య, జంగయ్య, మాసయ్య తదితరులు పాల్గొన్నారు.

వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన.!

వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రేవూరి

 

నడికూడ,నేటిధాత్రి:

 

 

మండల కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర గ్రామైక్య ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం పరకాల శాసన సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఐకేపీ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రా లకు ధాన్యాన్ని తరలించి,ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు.దీనివల్ల 500 రూపాయల బోనస్ కూడా రైతులకు చేకూరుతుందన్నారు.రైతుల ఆర్థిక అభివృద్దే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.మద్దతు ధర క్వింటాలుకు ‘ఎ ‘ గ్రేడ్ రకం రూ. 2320.సాధారణ రకానికి ధర 2300‌. ఉందన్నారు.ఈ కార్యక్రమం లో మండల తహాసిల్దార్ గుండాల నాగరాజు, ఎంపీడీవో విమల,ఏఎం సీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి, ఏవో జైసింగ్, పి డి‌. శ్రీనివాస్, డిపిఎం ప్రకాష్,ఏపీఎం రమాదేవి,మహిళా సమైక్య సభ్యులు వివోఏ గోనె‌ల కవిత,జంగిలి శిరీష, చెన్నబోయిన పవిత్ర,దుండి స్రవంతి,రావుల కావ్య.కాంగ్రెస్ పార్టీ నడికూడ మండల అధ్యక్షులు బుర్ర దేవేందర్ గౌడ్,ప్రధాన కార్యదర్శి కుడ్ల మలహల్ రావు,గ్రామ కమిటీ అధ్యక్షుడు తాళ్ల నవీన్, సమన్వయ కమిటీ సభ్యులు పర్నెం మల్లారెడ్డి,పెద్ద బోయిన రవీందర్ యాదవ్, పాడి ప్రతాప్ రెడ్డి,కోడెపాక కరుణాకర్,హమాలీలు, రైతులు,తదితరులు పాల్గొన్నారు.

రాజ్య స్థాపకుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్…

ప్రజాస్వామ్య గణతంత్ర లౌకిక రాజ్య స్థాపకుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్…
ఆత్మగౌరవ అస్తిత్వ ఉద్యమాలకు దశాదిశాలు చూపిన స్ఫూర్తిదాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్…
-జక్కి శ్రీకాంత్
(జాతీయ యువజన అవార్డు గ్రహీత)

వర్దన్నపేట (నేటిదాత్రి):

 

 

వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రంలో మహానీయుల జయంతి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. మహనీయుల జయంతి ఉత్సవాల కమిటీ కన్వీనర్ జాతీయ యువజన అవార్డు గ్రహీత జక్కి శ్రీకాంత్ ఆధ్వర్యంలో జరుగుతున్న “మహానీయుల స్ఫూర్తి యాత్ర” నేడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జన్ను నరసయ్య, మాస్ రాష్ట్ర అధ్యక్షులు జన్ను రాములు,బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మచ్చ రాజు, ముగింపు యాత్రలో పాల్గొని మహానీయుల చిత్రపటాలతో స్వామి వివేకానంద విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది.

Dr. B.R. Ambedkar

 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంటరానితనం వివక్షల పై అలుపెరుగని పోరాటం చేసి అస్తిత్వ ఉద్యమాలకు దిశా దశలు చూపిన స్ఫూర్తిదాత ఆర్థికవేత్త రాజనీతిజ్ఞుడు భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నేటి తరానికి స్ఫూర్తి అని అన్నారు. పొలిటికల్ పవర్ ఇస్ మాస్టర్ కి అని ఈ దేశానికి పాలకులు కావడమే మన లక్ష్యమని ఇంతకాలం బాధితులుగా ఉన్నాం ఇక మనం పాలకులుగా మారుదామని బహుజనులను చైతన్యపరిచిన మహా పురుషుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అన్నారు. 1931లో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని దళితులకు హక్కులు కల్పించిన దళిత అభ్యుదయ వారి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని కొనియాడారు ప్రపంచానికి జ్ఞానాన్ని పంచి నేడు ప్రపంచం మొత్తం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని జ్ఞాన దినోత్సవంగా జరుపుకోవడం ఈ దేశానికి ఎంతో గర్వకారణమని అన్నారు.

Dr. B.R. Ambedkar

 

ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ పొలిటి బ్యూరో సభ్యులు ఈరెల్లి శ్రీనివాస్, తెలంగాణ అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు కంచర్ల మహేష్, వరంగల్ జిల్లా కో కన్వీనర్ జంగిలి భాస్కర్, జాతీయ బిసి సంక్షేమ సంఘం వర్ధన్నపేట నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మామిండ్ల చెన్నయ్య, తెలంగాణ అంబేద్కర్ సంఘం వర్ధన్నపేట పట్టణ అధ్యక్షులు నందిపాక భాస్కర్, కొండేటి మహేందర్, ఎమ్మార్పీఎస్ నాయకులు చాడ కరుణాకర్, దళిత శక్తి నాయకులు ఆరోగ్యం, విజయలక్ష్మి, శ్రీనివాస్, రాజు రమేష్, తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version