కాంగ్రెస్ పార్టీ చెన్నూరు నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం.
మందమర్రి నేటి ధాత్రి
మందమర్రి మండలం రామకృష్ణ పూర్ గద్దె రాగడి లోని భీమా గార్డెన్స్ లో కాంగ్రెస్ పార్టీ చెన్నూరు నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం…
పాల్గొన్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి,టీపీసీసీ పరిశీలకులు జంగ రాఘవ రెడ్డి, రాం భూపాల్,డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ వివేక్ వెంకటస్వామి ఇలా మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 900 కోట్ల రూపాయల సియం రిలీఫ్ ఫండ్ నిధులను ప్రజలకు అందించింది
చెన్నూరు నియోజక వర్గం లో అవినీతి రహిత పాలన అందిచడమే నాలక్ష్యం.
సింగరేణి సంస్థలో లక్ష ఉద్యోగులు ఉంటే కేసీఆర్ ప్రభుత్వ హయంలో 60 వేల ఉద్యోగాలు తీసేసింది
ఇప్పుడు సింగరేణి సంస్థలో 42 వేల ఉద్యోగులు ఉన్నారు.
ఇందిరమ్మ ఇళ్లు అర్హులైన .ప్రతి పేదవాడి కి అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.
చెన్నూరు నియోజక వర్గ అభివృద్ధి కి ఏడాదిన్నర కాలంలో 200 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.
చెన్నూరు నియోజక వర్గం.ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలో నే ఆదర్శవంతమైన నియోజక వర్గంగా తీర్చిదిద్దుతాను.
సన్న బియ్యం పథకం.తో ప్రతి పేదవాడు మూడు పూటలు కడుపు నిండా భోజనం చేస్తున్నారు.
కేసీఆర్ అవినీతి పాలనకు నిదర్శనమే కాళేశ్వరం ప్రాజెక్ట్ ,మిషన్ భగీరథ స్కీములు.
బిఆర్ఎస్ హయంలో.దొడ్డు బియ్యం దందా విచ్చలవిడిగా కొనసాగింది.
కేసీఆర్ అధికారం ఉంది కదా అనుకోని విచ్చలవిడిగా ప్రజా ధనాన్ని.దుర్వినియోగం చేసిండు.
రాష్ట్రంలో నాణ్యమైన విద్య,వైద్యం అందడమే కాంగ్రెస్ లక్ష్యం.
ఆరోగ్య శ్రీ పథకం ను బిఆర్ఎస్ హాయంలో పట్టించుకోలే
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక 10 లక్షలకు పెంచి పేద ప్రజలకు అండగా నిలిచింది.
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టే పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లలి
ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు దీటుగా ఖండించాలి
ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిలా పని చేయాలి
గ్రూప్ రాజకీయాలు వదిలేయాలి అప్పుడే పార్టీ బాగుంటుంది.