నల్ల బ్యాడ్జిలతో నిరసన వ్యక్తం చేసిన కాంగ్రెస్ శ్రేణులు…

నల్ల బ్యాడ్జిలతో నిరసన వ్యక్తం చేసిన కాంగ్రెస్ శ్రేణులు…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లను నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడి ఏ వన్, ఏ టూ గా కేసులు నమోదు చేయడం పూర్తిగా రాజకీయ కక్ష సాధింపుతో కూడిన పిరికిపంద చర్యగా భావిస్తూ ఖండిస్తున్నామని టిపిసిసి ప్రధాన కార్యదర్శి పిన్నింటి రఘునాథ్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి వోడ్నాల శ్రీనివాస్ అన్నారు. ఏఐసీసీ ఆదేశానుసారం, టీపీసీసీ పిలుపు మేరకు క్యాతనపల్లి మునిసిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గాంధీ కుటుంబం చరిష్మా ను కోల్పోయే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. గత పదేళ్లుగా ఇదే కేసు విచారణలో ఉన్నప్పటికీ ఇందులో ఎటువంటి అవినీతి, అక్రమంగా సంపాదించిన సంపత్తి ఉందన్న నిబంధనలపై నిర్థారణ లేదని ఇప్పటికే పలు న్యాయస్థానాలు స్పష్టం చేశాయని తెలిపారు.కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ విధానాన్ని బహిరంగంగా ప్రజల దృష్టికి తీసుకువస్తామనీ చట్టపరంగా, రాజకీయంగా దీనికి గట్టి ఎదురుదెబ్బ ఇస్తామనీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు, మాజీ ఎంపీటీసీ పుల్లూరి కళ్యాణ్, మాజీ వార్డు సభ్యులు ఉప్పులపు సురేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు నీలం శ్రీనివాస్ గౌడ్ , గాండ్ల సమ్మయ్య, బుడిగె శ్రీనివాస్, పలిగిరి కనకరాజు, బంగారు ప్రసాద్, ఎర్రబెల్లి రాజేష్, బింగి శివకిరణ్, రాజేశం, గండి కుమార్ మహిళా నాయకురాలు రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

కరీంనగర్ మండలానికి చామనపల్లి.!

కరీంనగర్ మండలానికి చామనపల్లి చోక్కారావు పేరును నామకరణం చేయాలి
సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి

కరీంనగర్, నేటిధాత్రి:

 

కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఎంతోమంది నిరుపేదల ఆరాధ్య దైవం చామనపల్లి గ్రామానికి చెందిన చోక్కరావు పేరును కరీంనగర్ మండలానికి నామకరణం చేసి ఆయన చరిత్రను ప్రజలకు తెలియజేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి కోరారు. బుధవారం రోజున సిపిఐ కరీంనగర్ మండల ఎనిమిదవ మహాసభ మండల కార్యదర్శి సాయవేని రాయమల్లు అధ్యక్షతన జరిగింది. మహాసభ సందర్భంగా ఏర్పాటుచేసిన పార్టీ పతాకాన్ని మర్రి వెంకటస్వామి ఆవిష్కరించారు. ఈసందర్భంగా మర్రి వెంకటస్వామి మాట్లాడుతూ కరీంనగర్ మండలమే కాకుండా జిల్లాలోని ఎంతోమంది పేద బడుగు బలహీన వర్గాల కోసం భూమి లేని నిరుపేదల కోసం అనేక ఉద్యమాలు చేసి తన ప్రాణాన్ని పార్టీకి అంకితం చేసిన మహోన్నత వ్యక్తి చామనపల్లి చోక్కారావు ఈగ్రామంలో పుట్టడం ప్రజల అదృష్టమని ఆయన కొనియాడారు. చోక్కారావు నేటి యువతకు, విద్యార్థులకు ఆదర్శనీయవంతుడని ఆయన లాంటి నేత ఈప్రాంతంలో ప్రాంత ప్రజలను నిజాం రజాకార్ల చెర నుండి రక్షించాడని అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ పేద ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుందని పేదవారికి కూడు, గుడ్డ, నీడ అనే నినాదంతో ఉద్యమిస్తుందని తెలిపారు. పేద ప్రజల కోసం అనునిత్యం పోరాడే పార్టీ సిపిఐ అని తిండి లేని వారికి అండదండగా ఉంటూ ఇంటి స్థలాల కోసం, రేషన్ కార్డుల కోసం, నీటి సౌకర్యం, భూమికోసం అనేక పోరాటాలు చేసి వందల మంది కార్యకర్తలను జైలు పాలయ్యారని అలాంటి త్యాగం చేసిన పార్టీ దేశంలో ఒక కమ్యూనిస్టు పార్టీయేనని పేర్కొన్నారు. ఇప్పటికీ దేశంలో పేదవాడు పేదవాడి గానే ఉన్నవాడు ఉన్నవాడిగానే మిగిలిపోయారని కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్పోరేట్ శక్తులకే ఊడిగం చేస్తుందని, మతం పేరా మారణ హోమం సృష్టించడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకు పెరిగిపోతున్న నిమ్మకు నీరెత్తినట్లుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడం సిగ్గుచేటు అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించకుండా తెలంగాణ పట్ల వివక్షత చూపుతుందని కేంద్ర మంత్రులు ఇద్దరు ఉన్న తెలంగాణకు ఒరిగింది ఏమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వo పేద ప్రజలకు ఇచ్చిన హామీలను త్వరితగతిన అమలు పరచాలని ఆయన డిమాండ్ చేశారు. ఈమండల మహాసభలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కసిరెడ్డి సురేందర్ రెడ్డి, కౌన్సిల్ సభ్యులు నలవాల సదానందం, మాజీ సర్పంచ్ ఐలయ్య, మండల కౌన్సిల్ సభ్యులు మెరుగు కొమరయ్య, ఇరుకుల్ల బాబు, తోట ఆంజనేయులు, బుర్ర రాజయ్య, కాశ వేణి సతీష్, నెల్లి రవీందర్, బుర్ర కుమారస్వామి, రాములు, నాంపల్లి, సత్తయ్య, సాంబరాజు తదితరులు పాల్గొన్నారు.

రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన.!

రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత దేశంలోని ప్రతి పౌరునికి ఉంది

కొత్తగూడ, నేటిధాత్రి:

 

ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని అన్నారు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ అనసూయ సీతక్క ఆదేశాల మేరకు…
ములుగు అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ పటేల్ సూచనల మేరకు
వజ్జ సారయ్య కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వారి నేతృత్వంలో కొత్తగూడ మండలంలోని బుధవారం రోజు తాటి వారి వేంపల్లి.
మాసంపల్లి తండా.
గోపాలపురం కార్లయి గ్రామాల్లో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని చేపట్టారు
అహింస శాంతి సిద్ధాంతాలను కాపాడుకోవాల్సిందుకే ఏఐసీసీ ఉద్యమ కార్యచరణ రూపొందించిందని బిజెపి తప్పుడు విధానాలను తిప్పికొట్టాలని కాంగ్రెస్ పార్టీ కొత్తగూడ మండల ఇన్చార్జి బానోత్ రూఫ్ సింగ్ గ్రామ గ్రామాన పాదయాత్ర చేపట్టారు
ప్రతి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా మండలాల నాయకులు అనుబంధ సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ అన్ని విభాగాల పార్టీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రతి ఒక్కరు కంకణ బద్ధులై
జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఇంటింటికి భారత రాజ్యాంగం గొప్పతనాన్ని వివరించాలని అన్నారు
ఈ కార్యక్రమంలో
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య.
చల్ల నారాయణరెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు.
లావణ్య వెంకన్న జిల్లా నాయకులు.
బిట్ల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి.
ఇర్ప రాజేశ్వర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. కాడబోయిన జంపయ్య వైస్ఎంపీపీ.
బొల్లు రమేష్ మార్కెట్ కమిటీ డైరెక్టర్.
కాయితోజు ఉపేంద్ర చారి బ్లాక్ కమిటీ నాయకులు. నోముల ప్రశాంత్ జిల్లా యూత్ నాయకులు. కే దాసు ప్రసాద్ క్లస్టర్. తాటి వారి వేంపల్లి గ్రామ కమిటీ అధ్యక్షురాలు తాటి వసంత.
కార్లయి గ్రామ కమిటీ అధ్యక్షులు ఇర్ఫ వెంకన్న.మాసంపల్లి తండా గూగుల్ భీమా. గోపాలపురం అధ్యక్షులు సుధాకర్ శ్రీను. తాటి వారి వేంపల్లి సోలం వెంకన్న కాంగ్రెస్ పార్టీ వివిధ విభాగాల పార్టీ అధ్యక్షులు నాయకులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు

బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేద్దాం…

బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేద్దాం…

బిఆర్ఎస్ నియోజక వర్గ ఇన్చార్జి రాజా రమేష్

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

ఈనెల 27న ఎల్కతుర్తి లో జరిగే బిఆర్ఎస్ రజతోత్సవ మహాసభను విజయవంతం చేయాలని చెన్నూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ రాజా రమేష్ అన్నారు.బుదవారం రామకృష్ణాపూర్ పట్టణంలో సభకు సంబంధించి కేసీఆర్ వాల్ రైటింగ్ తో ప్రజలను, బిఆర్ఎస్ పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచారు.అనంతరం రాజా రమేష్ మాట్లాడుతూ..

BRS Silver Jubilee Celebration

మున్సిపాలిటీలోని 14,15,17,18,20 వార్డు లలో వాల్ పోస్టర్లను అంటించడం అంటించారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కంభగోని సుదర్శన్ గౌడ్,బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రామిడి కుమార్, బడికల సంపత్,ఆలుగుల సత్తయ్య,మాజీ కౌన్సిలర్లు పోగుల మల్లయ్య,బోయినపల్లి అనిల్ రావు,రేవెల్లి ఓదెలు, జిలకర మహేష్,పారుపల్లి తిరుపతి,గడ్డం రాజు, చంద్రమౌళి, లక్ష్మారెడ్డి,రంగరాజు,పైతారి ఓదెలు,మేకల రమేష్,వేనంక శ్రీనివాస్, బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు రామిడి లక్ష్మీకాంత్,ఆశనవేణి సత్యనారాయణ,టైలర్ రాజు,చంద్ర కిరణ్,కుర్మ దినేష్,దేవి సాయి కృష్ణ, శివ,మణి, గోనె రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజలు ఆర్డీఓ కార్యాలయంలో వాల్ పోస్టర్లు అతికించారు.

సీనియర్ సిటిజన్ పోస్టర్ ను ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ
సిరిసిల్ల టౌన్ : (నేటిధాత్రి)

తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ అధ్యక్షులు చేపూరి బుచ్చయ్య అధ్యక్షతన రాష్ట్ర కార్యదర్శి, జిల్లా ప్రధాన కార్యదర్శి, డాక్టర్ జనపాల శంకరయ్య కార్యనిర్వహణలో 2007 తల్లిదండ్రుల మరియు వయోధికుల పోషణ మరియు సంక్షేమ చట్టం 2011 లోని ముఖ్య అంశములను సెక్షన్ల వారిగా తెలుగు భాషలో సామాన్యులకు అర్థమయ్యే రీతిలో అనువదించిన వాల్ పోస్టర్లను జిల్లా ఎస్పీ, మహేష్.బి.గితే ఐ.పి.ఎస్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ చట్టం ప్రకారం సామాన్యులకు కూడా చట్టంలోని అంశములు తెలిసి ఫిర్యాదు చేయుటకు తల్లిదండ్రులకు అనుకూలంగా ఉంటుంది అని తెలిపారు. మరియు ఎస్పీ అనుమతితో ఆఫీసు ముందర పోస్టర్ను అతికించడం జరిగినది. అత్యధికంగా ప్రజలు తిరిగే ఆర్డిఓ. కార్యాలయంలో వాల్ పోస్టర్లు అతికించడం జరిగినది. సాంఘిక సంక్షేమ జిల్లా అధికారి అనుమతితో అక్కడ కూడా వాల్ పోస్టర్లు అతికించడం జరిగినది తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ సంఘ సభ్యులు, దొంత దేవదాసు, సహాయ కార్యదర్శులు , అంకారపు జ్ఞానోబా, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

స్థానిక సమస్యలపై పర్యటించిన కార్పొరేటర్.

స్థానిక సమస్యలపై పర్యటించిన కార్పొరేటర్.

వాటర్ సరఫరా విషయంలో సమస్యలు తెలియచేయాలి.

స్థానిక కార్పొరేటర్ సుంకరి మనిషా శివకుమార్

నేటిధాత్రి, కాశిబుగ్గ

 

 

వరంగల్ మహానగర పాలక సంస్థ 16వ డివిజన్ పరిధిలోని కీర్తినగర్ కాలనీకు సంబంధించిన శానిటేషన్ మరియు వాటర్ సరఫరా సమస్యలపై స్థానిక కార్పొరేటర్ సుంకరి మనిషా శివకుమార్ కీర్తి నగర్ లో పర్యటించడం జరిగింది.మున్సిపల్ వాటర్ మెన్ మరియు మున్సిపల్ శానిటరీ జవాన్ లకు పలు సూచనలు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ వేసవి కాలం దృష్టిలో పెట్టుకుని వాటర్ సప్లయ్ విషయంలో ఎలాంటి సమస్యలు ఉన్నా ముందస్తుగా తెలియజేయాలని కోరారు. ముందస్తు సమాచారం ఇవ్వడం వల్ల సమస్య తొందరగా పరిష్కరించడానికి అవకాశం ఉంటుందని అన్నారు.అనంతరం కాలనీ లో ఏపుగా పెరిగిన తుమ్మ చెట్లు మరియు పిచ్చి చెట్లను జెసిబి సహాయంతో తొలగించే పనులను పరిశీలించడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

DR.BR Ambedkar

మల్లాపూర్ ఏప్రిల్ 16 నేటి ధాత్రి.

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు ఎస్సీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చిన వాటిని బేకాతరు చేస్తూ మండల మరియు గ్రామాలలో పంచాయతీ కార్యదర్శులు అధికారికంగా చేయవలసిన అప్పటి కూడా కనీసం గ్రామాలలో కూడా రాలేదు జయంతి ఉత్సవాలను చేయలేదు.

 

Jayanti Celebrations

దాదాపు 14 గ్రామాలలో కార్యదర్శులు కార్యక్రమాలు నిర్వహించలేదు అని ఉన్న సమాచారం. మరియు మండల అధికారులకు పంచాయతీ కార్యదర్శులకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై ఎందుకు వివక్షత, దళితులు అంటే ఎందుకు చిన్న చూపు ఈ ఆదేశాలలో దళిత ఆర్గనైజేషన్లను కలుపుకొని కార్యక్రమాలు చేయాలని కలెక్టర్ మెన్షన్ చేసి ఉన్నప్పటి కూడా ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి 14 గ్రామాలలో అధికారికంగా కార్యక్రమాలు నిర్వహించని కార్యదర్శిలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.

 

Jayanti Celebrations

లేనిచో మండల కేంద్రంలో నిరసనలు చేపడుతాం రాష్ట్ర ఎస్సీ కమిషన్ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదులు చేస్తాం. మన మండలంలో 23 గ్రామాలు ఉంటే దాదాపు 14 గ్రామాలలో పంచాయతీ కార్యదర్శులు జయంతి రోజు కనీసం గ్రామాలకు కూడా రాలేదు. మండల ఆఫీసులో చేసిన కార్యక్రమంలో ఎంపీడీవో కూడా పాల్గొనలేదు. ఎప్పుడో ఈ విషయంపై కంప్లైంట్ చేయడానికి వెళితే అక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని చెత్తబుట్టల పక్కన పెట్టడం జరిగింది. దీనిపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఈ విషయం కలెక్టర్ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.

22న పరకాల క్రికెట్ టోర్నమెంట్ 2025 ప్రారంభం

22న పరకాల క్రికెట్ టోర్నమెంట్ 2025 ప్రారంభం

 

పరకాల నేటిధాత్రి

పట్టణంలో ఏప్రిల్ 22 న పరకాల క్రికెట్ టోర్నమెంట్ 2025 ను ప్రారంభిస్తున్నట్టు టోర్నమెంట్ ఆర్గనైజర్ లు చిన్ను,లడ్డు,సిద్దు లు తెలిపారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ మొదటి బహుమతి 20116,రెండవ బహుమతి 10,116లు అందిస్తున్నట్లు ఆటలో టీం పేర్లను నమోదు చేసుకోవడానికి ఎంట్రీ ఫీజ్ 1200 చెల్లించి నమోదు చేసుకోవాలని ఎంపెయిర్లదే తుదినిర్ణయమని మ్యాచ్ కి 10 ఓవర్లు నిర్ణయించామని,స్థానికంగా ఉన్న ప్రేయర్ లు మాత్రమే జట్టులో ఆదించడానికి అవకాశం ఉన్నదని తెలిపారు.

‘భారత రాజ్యాంగాన్ని.. ప్రతి ఒక్కరు పరిరక్షించాలి’

‘భారత రాజ్యాంగాన్ని.. ప్రతి ఒక్కరు పరిరక్షించాలి’

వెల్దండ /నేటి ధాత్రి.

 

నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని చెదురుపల్లి, ఉబ్బలగట్టు తాండ, పోచమ్మ తాండలలో బుధవారం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్ అభియాన్ పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గాంధీజీ సత్య, అహింస సిద్ధాంతాలతో భారతదేశానికి స్వాతంత్రం సంపాదించారని, అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని గౌరవించి ప్రతి ఒక్కరు పరిరక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోతిలాల్ నాయక్, వెంకటయ్య గౌడ్ పుల్లయ్య, రషీద్, మీసాల అంజయ్య, రామచంద్రయ్య, కె. అంజయ్య, పర్వత్ రెడ్డి, అంజన్ యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, రమా, వెంకటయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.

‘భారత రాజ్యాంగాన్ని.. ప్రతి ఒక్కరు పరిరక్షించాలి’

‘భారత రాజ్యాంగాన్ని.. ప్రతి ఒక్కరు పరిరక్షించాలి’

వెల్దండ /నేటి ధాత్రి.

నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని చెదురుపల్లి, ఉబ్బలగట్టు తాండ, పోచమ్మ తాండలలో బుధవారం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్ అభియాన్ పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గాంధీజీ సత్య, అహింస సిద్ధాంతాలతో భారతదేశానికి స్వాతంత్రం సంపాదించారని, అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని గౌరవించి ప్రతి ఒక్కరు పరిరక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోతిలాల్ నాయక్, వెంకటయ్య గౌడ్ పుల్లయ్య, రషీద్, మీసాల అంజయ్య, రామచంద్రయ్య, కె. అంజయ్య, పర్వత్ రెడ్డి, అంజన్ యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, రమా, వెంకటయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదం లో ఇద్దరు మృతి.

రోడ్డు ప్రమాదం లో ఇద్దరు మృతి.

కల్వకుర్తి /నేటి దాత్రి :

 

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటన జడ్చర్ల- కోదాడ రహదారిపై మంగళవారం రాత్రి చోటు చేసుకుంది.పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణానికి చెందిన కాసుల అరవింద్ చారీ (31)చీపుర కార్తీక్ చారీ (32)ద్విచక్ర వాహనంపై దేవరకొండ వెళ్లి స్వగ్రామానికి తిరిగి ప్రాణమయ్యారు. మార్గమధ్యంలో ఎర్రగుంటపల్లి గేట్ సమీపంలో జడ్చర్ల- కోదాడ ప్రధాన రహదారిపై ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడింది.

 

accident

 

ఈ ప్రమాదంలో అరవింద్ చారి, కార్తీక్ చారి లకు తలకు బలమైన గాయం తగలడం వల్ల అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ రాజు తెలిపారు.

సిఎంఆర్ఎఫ్ చెక్కుని అందజేసిన బి అర్ ఎస్ నాయకులు

సిఎంఆర్ఎఫ్ చెక్కుని అందజేసిన బి అర్ ఎస్ నాయకులు

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

శాసనసభ్యులు కోనింటి మాణిక్ రావు గారి ఆదేశాల మేరకు ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఎమ్మెల్యే గారి కృషి తో మంజూరైన ₹54,000/- విలువ గల చెక్కును రంజోల్ గ్రామానికి చెందిన రాము గారికి అందజేసిన సీనియర్ నాయకులు నామ రవికిరణ్,సత్యం ముదిరాజ్ గార్లు .ఈ సంధర్బంగా ఎమ్మెల్యే గారికి,నాయకులకు లబ్ధిదారుడు కృతజ్ఞతలు తెలియజేశారు.

అధ్యక్షులు న్యాయవాది కిరణ్ కుమార్ కు సన్మానం

బార్ కౌన్సిల్ అధ్యక్షులు న్యాయవాది కిరణ్ కుమార్ కు ఘనoగా సన్మానం
వనపర్తి నేటిదాత్రి :

 

 పట్టవనపర్తిణంలో బార్ కౌన్సిల్ అధ్యక్షులు న్యాయవాది డి కిరణ్ కుమార్ నివాసంలో శాలువతో ఘనంగా సన్మానం చేశారు .ఈ కార్యక్రమంలో కలకొండ శ్రీనివాసులు గోకారం కృష్ణమూర్తి చిదేర వెంకటేశ్వర్లు గంధం రాజు వెంకటేష్ పరమేష్ సురేష్ బాబు బాస్కర్ సంబు వెంకట్ రమణ విజయ సన్మానము చేసిన వారిలో ఉన్నారు

అకాల వర్షం రైతన్నలు ఆగం

అకాల వర్షాలు రైతులను అతలాకుతలం చేశాయి

మల్లకపేట గ్రామాల్లో ఇళ్లపై భారీ చెట్లు కూలిపోయాయి

పరకాల నేటిధాత్రి

 

అకాల వర్షాల కారణంగా రైతులకు తీవ్ర నష్టం వాటిళ్లింది.చేతికి వచ్చిన పంట అకాల వర్షాల కారణంగా నేల రాలడంతో తమకు తీవ్ర నష్టం వాటిళ్లిందని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.హనుమకొండ జిల్లా పరకాల పట్టణ మరియు మండల పరిధిలో రాత్రికాల సమయంలో ఊహించని విధంగా తుఫాన్ ను తలపించేలాగా విపరీతమైన ఈదురుగాలులతో వర్షం బీభత్సం సృష్టించింది.

 

Farmers

 

దాదాపు ఒక గంటపాటు తీవ్రమైన ఉరుములు మెరుపులతో ఎడతెగని వడగండ్ల వాన కురిసింది.మండలంలోని మల్లక్కపేట గ్రామంలో ఈదురుగాలుల కారణంగా కొన్ని ఇండ్లపైన భారీ వృక్షాలు కూలి రాత్రంతా బిక్కు బిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది కల్లాలలో ఉన్న మిర్చి,మొక్కజొన్న పంటలు తడిచి ముద్దైన పరిస్థితి ఏర్పడింది.ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను కల్లాల్లో చూసుకుని ఇక తమ కష్టాలు తప్పుతాయని భావించిన కొద్దిసేపట్లోనే అకాల వర్షం రైతన్నల ఆశలను అడియాశలు చేసింది.ఏదైఏమైనా ఈ అకాలవర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించిందని చెప్పమల్లక్కపేటలో ఇళ్లపై భారీ చెట్లు కూలిపోయాయి.

అకాల వర్షం రైతన్నలు ఆగం

అకాల వర్షం రైతన్నలు ఆగం

మల్లక్కపేట గ్రామాల్లో ఇండ్లపైన కూలిన భారీ వృక్షాలు

పరకాల నేటిధాత

 

అకాల వర్షాల కారణంగా రైతులకు తీవ్ర నష్టం వాటిళ్లింది.చేతికి వచ్చిన పంట అకాల వర్షాల కారణంగా నేల రాలడంతో తమకు తీవ్ర నష్టం వాటిళ్లిందని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.హనుమకొండ జిల్లా పరకాల పట్టణ మరియు మండల పరిధిలో రాత్రికాల సమయంలో ఊహించని విధంగా తుఫాన్ ను తలపించేలాగా విపరీతమైన ఈదురుగాలులతో వర్షం బీభత్సం సృష్టించింది.దాదాపు ఒక గంటపాటు తీవ్రమైన ఉరుములు మెరుపులతో ఎడతెగని వడగండ్ల వాన కురిసింది

 

 

 

Farmers

మండలంలోని మల్లక్కపేట గ్రామంలో ఈదురుగాలుల కారణంగా కొన్ని ఇండ్లపైన భారీ వృక్షాలు కూలి రాత్రంతా బిక్కు బిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది కల్లాలలో ఉన్న మిర్చి,మొక్కజొన్న పంటలు తడిచి ముద్దైన పరిస్థితి ఏర్పడింది.ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను కల్లాల్లో చూసుకుని ఇక తమ కష్టాలు తప్పుతాయని భావించిన కొద్దిసేపట్లోనే అకాల వర్షం రైతన్నల ఆశలను అడియాశలు చేసింది.ఏదైఏమైనా ఈ అకాలవర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించిందని చెప్పవచ్చు

వేణుగోపాల్ రావుకు జర్నలిస్టుల శుభాకాంక్షలు.

వేణుగోపాల్ రావుకు జర్నలిస్టుల శుభాకాంక్షలు

షాద్ నగర్ /నేటి ధాత్రి.

 

 

షాద్ నగర్ బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా ఇటీవలే ఎన్నికైన వేణుగోపాలరావును షాద్ నగర్ స్థానిక జర్నలిస్టులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక దేవి గ్రాండ్ హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో వేణుగోపాల్ రావును కలుసుకున్న జర్నలిస్టులు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు ఖాదర్ పాషా, కస్తూరి రంగనాథ్, రాఘవేందర్ గౌడ్, శేఖర్ రెడ్డి, నరేష్, నరసింహారెడ్డి, ఎ.అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం.!

‘వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం’

 

అలంపూర్ / నేటి ధాత్రి.

 

గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని ఎర్రవల్లి మండలం కొండేరు స్టేజి దగ్గర వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు పండించే వరి ధాన్యం మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లపై ఎమ్మెల్యే ఆరా తీశారు. రైతులకు ఉపయోగకరంగా ఈ కొనుగోలు కేంద్రం ఉపయోగపడాలని కొనుగోలు కేంద్రం అధికారులను ఆదేశించారు. రైతులకు నష్టం వచ్చేలా కాకుండా,లాభాలు వచ్చేలా దానికి అనుగుణంగా అధికారులు రైతులను సమన్వయం చేసుకోవాలన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని తెలిపారు.

గల్లంతయిన రెండో వ్యక్తి.. మృతదేహం లభ్యం

బాలానగర్ : గల్లంతయిన రెండో వ్యక్తి.. మృతదేహం లభ్యం

బాలానగర్ : నేటి ధాత్రి

 

 

బాలానగర్ మండలంలోని గంగాధర్ పల్లి గ్రామంలో సోమవారం మధ్యాహ్నం చేపలు పట్టేందుకు వెళ్లి గ్రామానికి చెందిన రాములు, యాదయ్య గల్లంతైన సంఘటన తెలిసిందే. సోమవారం గాలింపు చేపట్టిన మృతదేహాలు లభించలేదు. మంగళవారం సాయంత్రం శివరాములు మృతదేహం లభ్యం అయింది. బుధవారం ఎస్ఐ లెనిన్ ఆధ్వర్యంలో మరోసారి గాలింపు చేపట్టగా.. యాదయ్య (25) మృతదేహం లభ్యమయ్యింది. పోస్టుమార్టం నిమిత్తం యాదయ్య మృతదేహాన్ని జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒకే ఊరికి చెందిన ఇద్దరు వ్యక్తులు మరణించడంతో.. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

ప్రజలు దైవచింతన అలవర్చుకోవాలి.

న్యాల్కల్: ప్రజలు దైవచింతన అలవర్చుకోవాలి.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

ప్రజలు దైవచింతన అలవర్చుకోవాలని మల్లయ్య గుట్ట పీఠాధిపతి డాక్టర్ బసవలింగ అవధూత గిరి మహారాజ్ చెప్పారు. న్యాల్కల్ మండలం మరియం పూర్ గ్రామంలో వీరభద్రేశ్వర స్వామి జాతర ఉత్సవాల్లో మంగళవారం ఆయన పాల్గొని మాట్లాడారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మనసుకు ప్రశాంతత కలుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

అగ్ని ప్రమాదాల నివారణ పై అవగాహన కార్యక్రమం.

అగ్ని ప్రమాదాల నివారణ పై అవగాహన కార్యక్రమం.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

సంగారెడ్డి జిల్లాలో శాసనసభ నియోజకవర్గ కేంద్రమైన జహీరాబాద్ పట్టణంలో గల రైల్వేస్టేషన్, బస్సు స్టేషన్ లో మంగళ వారం మధ్యాహ్నం అగ్ని మాపక శాఖ అధికారులు సిబ్బంది ప్రయాణీకులకు అగ్ని ప్రమాదాల నివారణ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version